ANNAMACHARYA
39 అదిగాక నిజమతంబది గాక యాజకం
Introduction: In this deep philosophical verse, Annamacharya clearly brings out that the ultimate (the other, unknown) is beyond all personal opinions, not limited by sacrifices, not comforting theory, but actually can be felt by the individual. He goes to the extent of declaring man's will as మహాపశువు (big beast) indicating the greatest obstacle to this realisation.
The originality and beauty of this verse shall not be reduced though it is loosely based on certain Bhagavad-Gita verse. Annamacharya elevates the poetry by authentic descriptions of rare clarity and natural flow. He leaves the reader thirsty for more.
ఉపోద్ఘాతము: ఈ లోతైన ఆధ్యాత్మిక కీర్తనలో అన్నమయ్య పరము (మనకు తెలియనిది) అనునది మన అభిప్రాయాల (/ఊహల) కంటే వేరుగా, యజ్ఞము/త్యాగముల మీద ఆధారపడకుండా, మానవుని
యే చేష్టల మీదా ఆశ్రయించక ఉండి, ఊరట కలిగించక పోవచ్చని వర్ణించారు. నిర్మలమైన జ్ఞానమునకు మనిషి సంకల్పమే గుడ్డేద్దు లాగ అడ్డుపడుతోంది అన్నారు.
ఈ అందమైన కీర్తన కొంత భగవద్గీత శ్లోకము నుండీ తీసుకున్నప్పటికీ, అన్నమాచార్యులు తన మౌలికత, సహజత్వాలతో దానిని మరుగు పరిచారు. కళ్ళకు కట్టినట్లుండే వర్ణనలతో, స్పష్టమైన భావాలతో, పొందికైన పదాలతో చదువరిని అబ్బురపరచి యింకా యింకా కావాలనే భావనలో ఉంచుతారు.
అదిగాక నిజమతం బదిగాక
యాజకం-
adigAka nijamataM badigAka yAjakaM-
badigAka hRdayasukha madigAka paramu॥pallavi॥
Word to Word Meaning: అదిగాక (adigAka) = not that one; నిజమతంబది గాక (nijamataM badigAka) = Not personal opinion; యాజకం-బదిగాక (yAjakaM-badigAka) = యజ్ఞం కాక = not sacrifice, not yagna (a hindu religious method); హృదయసుఖ మదిగాక (hRdayasukha madigAka) = not comforting your heart; పరము (paramu) = the great beyond, the other state,
Literal meaning: The other state is beyond the pretty imagination, beyond the methods of sacrifice, not a comforting theory to your heart.
Comments: Man always
looks forward to moving from one comfortable situation to the next. Actually you might have noted that during
uncomfortable stage, man produces his best. Actually comfort is an illusion
that drives man to complacency.
భావము: పరము (మనకు తెలియనిది, అన్యము; మీఁదిది) అనునది మన అభిప్రాయాల (/ఊహల) కంటే వేరుగా, యజ్ఞము/త్యాగముల మీద ఆధారపడకుండా, మానవుని యే చేష్టల మీదా ఆశ్రయించక ఉండి, ఊరట కూడా కలిగించక పోవచ్చు.
వ్యాఖ్యలు : మనిషి తన జీవనయానము ఒక సుఖము నుంచి ఇంకో
సుఖమునకు సాగాలని కోరుకుంటాడు. జాగ్రత్తగా గమనిస్తే కష్టములోనే మనిషి తన నిజమైన ప్రతిభ
చూపుతాడు. తృప్తి ఉదాసీనతకు అవకాశమిచ్చి, సుఖము
కోరుకోవడము ఒక భ్రాంతి అనిపింపచేస్తుంది.
అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు-
amalamagu vij~nAnamanu mahAdhvaramunaku-
namarinadi saMkalpamanu mahapaSuvu
pramadamanu yUpagaMbamuna viSasiMpiMchi
vimalEMdu yAhutulu vElpaMgavaladA॥adi॥
Word to Word Meaning: అమలమగు (amalamagu) = clear, unadulterated; విజ్ఞానమను (vij~nAnamanu) = said knowledge; మహాధ్వరమునకు (mahAdhvaramunaku) = జ్ఞానయాజ్ఞమునకు, to the great psychological sacrifice; నమరినది = అమరినది (namarinadi) = properly fits; సంకల్పమను (saMkalpamanu) = the one called determination; మహాపశువు (mahapaSuvu) = big beast (meaning large obstacle); ప్రమదమను (pramadamanu) = happiness; యూపగంబమున (yUpagaMbamuna) = peg; విశసింపించి (viSasiMpiMchi) = kill; విమలేంద్రియాహుతులు (vimalEMdu yAhutulu) = make senses clear; వేల్పంగవలదా (vElpaMgavaladA) = pass through fire.
Literal Meaning: The principal (the beast of) obstruction to the clear knowledge is the man’s determination. In this sacrifice the senses must pass thru the fire so that they are no more pegged to comfort.
Comments:
1. 1. Jiddu Krishnamurti
said “Why is there such fear of death? Not only for the aged but for everyone
there is this fear. Why? And being afraid, we have invented all the lovely
comforting theories: reincarnation, karma, resurrection, and all the rest of
it. It is fear that has to be understood, but do not let us go back into fear.
We are trying to understand what it means to die.” See the similarity of
statements of Jiddu & Annamacharya.
2. 2. This verse also reminds us of the BhagavadGita verse as given below.
यस्य सर्वे समारम्भा: कामसङ्कल्पवर्जिता: |
ज्ञानाग्निदग्धकर्माणं तमाहु: पण्डितं बुधा: ||
4-19||
yasya
sarve samārambhāḥ kāma-saṅkalpa-varjitāḥ
jñānāgni-dagdha-karmāṇaṁ tam āhuḥ paṇḍitaṁ budhāḥ
Purport: The enlightened sages call those persons wise, who’s every action is free from the desire for material pleasures and who have burnt the reactions of work in the fire of divine knowledge.
భావము: నిర్మలమైన జ్ఞానమునకు మనిషి సంకల్పమే గుడ్డేద్దు లాగ అడ్డుపడుతోంది. ఈ మహాయజ్ఞము నందు యింద్రియములను జ్ఞానమనే అగ్నియందు కాల్చి సుఖము పైనే కట్టివేయు బుద్ధినుండి మరల్చవలెను.
వ్యాఖ్యలు :
1.1. జిడ్డు కృష్ణమూర్తి."మరణమంటే మనిషికి యెందుకంత భయము? వయస్సుతో సంబంధము లేకుండా మానవులను పట్టిపీడించుచున్న ఈ భయం నిజమైనదే. ఈ భయం తప్పిచుకోడానికి నుంచి సుఖానుభూతి కలిగించు పునరుథ్థానము, కర్మ, పునర్జన్మ వగైరా వగైరాలను సృష్టించుకొని తృప్తి పొందుతాడు. మరణమును సూటిగా యెదుర్కోమన్నాడు". అలాగే ఆన్నమచార్యులు కూడా మరణమును యెదుర్కోకుండా పరమును తెలియు విధములేదన్నారు.
2. 2. ఈ చరణము క్రింది భగవద్గీత శ్లోకమును సూచిస్తోంది.
యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః ।
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ।। 4-19 ।।
భావము: ఎవనియొక్క సమస్తకర్మలు కోరిక, సంకల్పము అనునవి లేకయుండునో,జ్ఞానమను అగ్నిచేత
దహింపబడినకర్మలు గల అట్టివానిని పండితుడని విజ్ఞులు పేర్కొందురు.
అరయ
నిర్మమకార మాచార్యుఁడై చెలఁగ
వరుసతో
ధర్మదేవత బ్రహ్మ గాఁగ
దొరకొన్న
శమదమాదులు దానధైర్యభా
స్వరగుణాదులు
విప్రసమితి గావలదా ॥అది॥
araya nirmamakAra
mAchAryuDai chelaga
varusatO dharmadEvata brahma gAga
dorakonna SamadamAdulu dAnadhairyabhA-
svaraguNAdulu viprasamiti gAvaladA॥adi॥
Word to Word Meaning: అరయ (araya) = observe closely; నిర్మమకారము (nirmamakAramu) = A state of being free from worldly passions that a person recognizes nothing as his own; ఆచార్యుఁడై (AchAryuDai) = become teacher; చెలఁగ (chelaga)= flourish; వరుసతో (varusatO) = in line with; ధర్మదేవత (dharmadEvata) = God of righteousness; బ్రహ్మ గాఁగ (brahma gAga) = become guide; దొరకొన్న (dorakonna) = సిద్ధించిన, successful endeavour; శమదమాదులు (SamadamAdulu) = {శమ =tranquillity, calm, peace, దమము (damamu)= self-controlled state of (feelings} state of being in tranquillity & control; దానధైర్యభాస్వరగుణాదులు(dAnadhairyabhA-svaraguNAdulu) = {దాన =alms/ donation, ధైర్య =courage, భాస్వర=Glory, splendour, ప్రకాశము ( on its own} Helping others, Courage & being light unto self; విప్రసమితి (viprasamiti) = a set of Brahmins, Here he meant the Brahman; గావలదా (gAvaladA) = should they? (meaning they should).
Literal
Meaning: One should
perform this sacrifice with state
of being free from worldly passions (that a person recognizes nothing as his
own) as guide; righteousness as the principle; state of being in tranquillity & control as the
medium, helping others, Courage as the tools. With all these in place, Will he
not become light unto self?
భావము: మమకారత్యాగము గురువుగాను, ధర్మాచరణము మార్గనిర్దేశకుడుగాను, శమము, దమము-మాధ్యమముగాను, దానము, ధైర్యము మొదలైన సుగుణాలు సాధనాలుగాను జ్ఞాన యజ్ఞము నిర్వహించు నరులు బ్రాహ్మణోత్తములు కారా? జ్ఞానము అతిశయించుచుండగా యుండగా ప్రకాశించరా?
తిరువేంకటాచలాధిపునిజధ్యానంబు
నరులకును
సోమపానంబు గావలదా
పరగ
నాతని కృపాపరిపూర్ణ జలదిలో
నరుహులై
యవబృథం బాడంగవలదా ॥అది॥
tiruvEMkaTAchalAdhipunijadhyAnaMbu
narulakunu sOmapAnaMbu gAvaladA
paraga nAtani kRpAparipUrNa jaladilO
naruhulai yavabRthaM bADaMgavaladA॥adi॥
Word
to Word Meaning: తిరువేంకటాచలాధిపు
(tiruvEMkaTAchalAdhipu)= the lord of seven hills (=God); నిజధ్యానంబు (nijadhyAnaMbu)
= true worship; నరులకును (narulakunu)
= to all men; సోమపానంబు (sOmapAnaMbu)
= intoxication; గావలదా (gAvaladA) = should it
not? (meaning it should); పరగ (paraga) = Agreeably, duly నాతని (=ఆతని nAtani = Atani)
= HIS; కృపా పరిపూర్ణజలధిలో (kRpAparipUrNa jaladilO) = in the sea of compassion, grace, kindness; నర్హులై= అర్హులై
(naruhulai =
aruhulai) = become
eligible; అవబృథంబు (avabRthaMbu) =
స్నానము, { అవబృథస్నానము (యజ్ఞము కడపట న్యూనాతిరిక్త దోష పరిహారార్థము చేయు స్నానము}, a procedural bath ( as a part
of the sacrifice) బాడంగవలదా= ఆడంగవలదా (ADaMgavaladA) =should they not perform? (They should).
Literal Meaning: (continuing from the last stanza) for such
men, reciting the name of the lord of
seven hills itself is intoxication. They become eligible and feel ecstasy in
immersing themselves in the sea of his compassion.
భావము: జ్ఞానయజ్ఞం చేసే నరులకు తిరువేంకటాచలాధీశుడైన వేంకటేశ్వరుని యొక్క నిజ ధ్యానమే “సోమపానము”. ఆ మహానుభావుని పరిపూర్ణమైన కృపాసముద్రమునకు అర్హులై ఆత్మానందము
పొందెదరు.
zadaz
Reference: copper leaf 6-5, volume: 1-40
No comments:
Post a Comment