Saturday 24 July 2021

71. రెప్పలమరఁ గదె రేపును మాపును (reppalamara gade rEpunu mApunu)

 

ANNAMACHARYA

71. రెప్పలమరఁ గదె రేపును మాపును 

Introduction: In this outstanding verse, Annamacharya described body as వూహల దేహము  (vUhala dEhamu = body made up of imagination) meaning that the body is connected to your mind thru the thought. Hence, it is the action of thought  that is giving trouble to man, not the body.

He also indirectly said that the mind is preventing you from looking fresh at things as one should. He is challenging people to resolve the riddle behind your eye lids.

ఉపోద్ఘాతము:  అసాధారణమైన, ఉత్కష్టమైన ఈ కీర్తనలోని అక్షర రమ్యత బహు సుందరము. వూహల దేహము అని వర్ణించి ఆలోచన ద్వారా శరీరం మీ మనస్సుతో కలుపబడిందని అన్నమాచార్యులు పేర్కొన్నారు. అందువల్ల, మీకు ప్రపచంలో ఇబ్బంది కలిగించేవన్నీ శరీరం నుంచి కాకుండా, ఆలోచనల ద్వారానే సంభవిస్తున్నాయని తెలియండి అన్నారు.

ఆయన​ పరోక్షంగా మనస్సు మనల్ని క్రొంగొత్త దృష్టితో చూడకుండా నిరోధిస్తుందన్నారు. మీ కంటి రెప్పల  వెనుక దాగి ఉన్న చిక్కు ప్రశ్నను పరిష్కరించమని అన్నమయ్య ప్రజలకు సవాలు విసిరారు.

 

కీర్తన

రెప్పలమరఁ గదె రేపును మాపును

యిప్పుడే తోఁచీ నిదివో కీలు     ॥పల్లవి॥ 

మనసున నున్నవి మాయలన్నియును

మనసు మరచితే మాయలు మరచును
పనివడి మనసునుఁ బారఁగవిడిచిన
కనుఁగొన మాయలు కడలే వివిగో        ॥రెప్ప॥ 

దేహమున నున్నది తెగని లంపటము

దేహ మణఁచితేఁ దెగును లంపటము
వూహల దేహమే వోమగఁ దొడఁగిన
మోహపు మాయలు మోపుల కొలఁది    ॥రెప్ప॥ 

ఆతుమ నున్నాఁడు అంతరాత్మకుఁడు

ఆతుమ మరచిన నాతఁడు మరచును
యీతఁడె శ్రీవేంకటేశ్వరుఁ గొలిచిన
చేచేతనే సుఖములు సేనాసేన         ॥రెప్ప॥ 

Details and Explanations: 

రెప్పలమరఁ గదె రేపును మాపును

యిప్పుడే తోఁచీ నిదివో కీలు ॥పల్లవి॥ 

reppalamara gade rEpunu mApunu

yippuDE tOchI nidivO kIlu   ॥pallavi॥

 

Word to Word meaning:  రెప్పలు (reppalu) = కనురెప్పలు, Eye lids, curtain; మరఁ గదె (amara gade) = that is prepared, that is fitted;  రేపును (rEpunu) = tomorrow; మాపును (mApunu) = సాయంకాలము, పోగొట్టు, మలినముచేయు, మురికి చేయు evening, to lose (more in the sense of disillusion), to get dirty;  యిప్పుడే (yippuDE) = just now; తోఁచీ (tOchI) = flashed; నిదివో (nidivO) = (see) this one ; కీలు (kIlu) = సూత్రము, మర్మము, the point of a riddle.

Literal meaning and Explanation: Evening and tomorrow are behind the eyelids (created shields). The key to this riddle has just flashed in my mind.

రెప్పలమరఁ గదె రేపును మాపును is a riddle in itself. The curtain behind our eyes is the mind. 

Hence the meaning of the chorus is Our Mind acts like a curtain. 

The other meanings of word మాపును” = dirtying (మలినముచేయు), thus meaning transforms “Because of our mind (ignorance), we are dirtying our tomorrow.” Actually he meant that there is no freshness in our approach and tomorrow is not going to be different from today. 

Therefore the true meaning of this chorus is: Our mind acts like a curtain to rob the freshness of tomorrow.  

భావము మరియు వివరణము: మాపును రేపును కనురెప్పల (అమర్చిన తెరల​) వెనుక దాగెను.   దీని మర్మమేమిటో  ఇప్పుడే నా మనస్సులో మెరిసింది.

రెప్పలమరఁ గదె రేపును మాపును అంటూ  మర్మగర్బంగానే చెప్పారు. కను రెప్పల వెనుక దాగిది మనస్సు.  మన మనస్సు భవిష్యత్తుకు (అడ్డు) తెరలా పనిచేస్తుంది అన్నారు.

మాపును” = మలినముచేయు, అని తీసుకుంటే మన మనస్సు పరదాలా పనిచేసి  రేపటిలోని తాజాదనాన్ని  తీసివేసి నిన్నటి చప్పిడికూడులా  చేస్తుందని అన్నారు. 

వాస్తవానికి అన్నమయ్య “మన ఆలోచనా సరళిలో తాజాదనం లేదని; దానితో 'రేపటి రోజు’  నేటి నుండి భిన్నంగా ఉండేందుకు అవకాఅశం లేదనీ” అన్నారు. 

మనసున నున్నవి మాయలన్నియును

మనసు మరచితే మాయలు మరచును
పనివడి మనసునుఁ బారఁగవిడిచిన
కనుఁగొన మాయలు కడలే వివిగో     ॥రెప్ప॥ 

manasuna nunnavi mAyalanniyunu

manasu marachitE mAyalu marachunu
panivaDi manasunu bAragaviDichina
kanugona mAyalu kaDalE vivigO ॥reppa॥ 

Word to Word meaningమనసున (manasuna) = in the mind; నున్నవి (nunnavi) = exists; మాయలన్నియును (mAyalanniyunu) = all the illusions;  మనసు (manasu) = mind;  మరచితే (marachitE) = if forgotten, if not remembered; మాయలు (mAyalu) = illusions; మరచును (marachunu) = forget; పనివడి (panivaDi) = intentionally; మనసునుఁ (manasunu) = the mind; బారఁగవిడిచిన (bAragaviDichina) = allowed to act at as it wishes;  కనుఁగొన (kanugona) = to find;   మాయలు(mAyalu) = illusions;  కడలే వివిగో (kaDalE vivigO)  = there is no end to it;

Literal meaning and Explanation: All the illusions are in the mind. If the mind is forgotten, then illusions are obliterated. If mind is allowed to acts as it wishes, there is no end to illusions.

Since our mind works based on memory, following it is like searching for water in mirage. We use our discretion as our mind dictates.

Now Annamacharya is saying, “As long as we follow the mind working from memory, there is no end to the tricks. The only weapon in our hands is to put an end to known misconceptions and untruths.”

He suggests that every decision should be just as careful as the decision we make to avoid impending danger. 

భావము మరియు వివరణము: భ్రమలన్నీ మనసులోనే ఉంటాయి. మనస్సు మరచిపోతే, భ్రమలు తొలగిపోతాయి. మనస్సును ఇష్టానుసారం ఉండనిస్తే (పనిచేయడానికి అనుమతించినట్లయితే)  భ్రమలకు అంతమే లేదు.

మన మనస్సు జ్ఞాపకం మీద ఆధారపడి  పనిచేస్తుంది కాబట్టి, దానిని అనుసరించటం ఎండమావులలో నీరు వెతకడమే. ప్రస్తుతము మనస్సు నిర్దేశించినట్లు మన విచక్షణను ఉపయోగిస్తాము. 

మనం జ్ఞాపకశక్తి నుండి పనిచేసే మనస్సును అనుసరిస్తున్నంత కాలం, మాయలకు ముగింపు లేదు. తెలిసిన దురభిప్రాయాలను, అసత్యములను  వున్నపాళముగా తక్షణము వదలివేయడము ఒకటే మన చేతిలోనున్న  ఆయుధము అని అన్నమాచార్యులు అంటున్నారు.

పొంచిఉన్న ప్రమాదాన్ని నివారించడానికి ఎంత మెలుకువతో మనం నిర్ణయం చేస్తామో అంతే  జాగరూకతతో ప్రతి నిర్ణయం  ఉండాలని ఆయన సూచిస్తున్నారు. 

దేహమున నున్నది తెగని లంపటము

దేహ మణఁచితేఁ దెగును లంపటము
వూహల దేహమే వోమగఁ దొడఁగిన
మోహపు మాయలు మోపుల కొలఁది ॥రెప్ప॥ 

dEhamuna nunnadi tegani laMpaTamu

dEha maNachitE degunu laMpaTamu
vUhala dEhamE vOmaga doDagina
mOhapu mAyalu mOpula koladi   ॥reppa॥

Word to Word meaning: దేహమున (dEhamuna) = in the body; నున్నది (nunnadi) = exists; తెగని (tegani) = continuous;  లంపటము (laMpaTamu) = many objects of attachment; aggravations; దేహము (dEhamu) అణఁచితేఁ (aNachitE) = to supress, to abate, however, here the word is used more in the sense of disengaging; దెగును (degunu) = break or burst;  లంపటము (laMpaTamu) = many objects of attachment; aggravations; వూహల (vUhala) = imagination; దేహమే (dEhamE) = body ( only); వోమగఁ (vOmaga) = రక్షించుకొనక, do not attempt to secure; దొడఁగిన (doDagina) = ప్రేరేపించు, తొందరపెట్టు, inciting, kindling;  మోహపు (mOhapu) = fascination, infatuation, distraction (causing) మాయలు (mAyalu) = illusions; మోపుల కొలఁది (mOpula koladi) = heavy burden, many bundles.  

Literal meaning and Explanation: This body continuously wants some thing or the other due to attachments it creates. If we disengage from these wants, they will subside. Do not try to preserve the body made up of imagination. There are many bundles of inciting distractions.

By the word వూహల దేహము (=body made up of imagination) Annamacharya is stating the body is connected to your mind thru the thought. Hence, it is the action of thought that is giving man trouble, not the body. Sometimes, he comes across to me like psychologist.

Thus by doing any amount of rectifications penances thru body actions is not going to result in desired direction.

Thus the liberation for the man is not thru body. Just imagine, in the name of god, amount of wasteful efforts being put by populations thru penance. The religious leaders, most often, had put the public on the wrong scent.

You will find that Annamayya is not a mere devotee, but a truly liberated soul. He wrote these verses to make people understand the true sense of devotion, not a blind faith.

భావము మరియు వివరణము: శరీరం నిరంతరం ఏదో ఒకటి లేదా మరొకటి కోరుకుంటూనే వుంటుంది. మనము కోరికల నుంచి  విడిపోతే, అవి తగ్గుతాయి. ఊహలతో తయారైన శరీరాన్ని పదిలపరచుటకు ప్రయత్నించవద్దు. పరధ్యానాన్ని ప్రేరేపించే అనేక విషయాలు మోపులకొద్దీ ఉన్నాయి. 

వూహల దేహము అని వర్ణించి ఆలోచన ద్వారా శరీరం మీ మనస్సుతో కలుపబడిందని అన్నమాచార్యులు పేర్కొన్నారు. అందువల్ల, ఇది మీకు ప్రపచంలో ఇబ్బంది కలిగించేవన్నీ శరీరం నుంచి కాకుండా, ఆలోచనల ద్వారానే సంభవిస్తున్నాయని తెలియండి. ఒక్కోసారి అన్నమాచార్యులు మానసిక శాస్త్రవేత్తా? అనిపిస్తారు.

భగవంతుని పేరిట, ప్రాయశ్చిత్తము పేరిట, పాప పరిహారము  పేరిట శరీరాన్ని వృధాగా అవస్థలకు గురి చేస్తారేగాని ఒక్క క్షణం ఆలోచించరు. (కొందరు ఎంతో దూరం నడుస్తారు,  కొందరు ఆహారాన్ని మానుకుంటారు, కొందరు ముళ్ళ మీద నిలబడతారు, ఇంకా ఏమిటేమిటో చెస్తారు) మత పెద్దలు,  తరచుగా ప్రజలను తప్పు దోవలలో నడిపించారనడానికి ఇదొక్క చరణమే చాలు.

ఈ విధంగా మనం అన్నమయ్య కేవలం భక్తుడే కాదు, నిజంగా విముక్తి పొందిన మహానుభావుడు అని తెలియవచ్చు. గుడ్డి విశ్వాసం కాకుండా భక్తి యొక్క నిజమైన భావాన్ని ప్రజలకు అర్థమయ్యేలా ఆయన ఈ కీర్తనలు రాశారు. 

ఆతుమ నున్నాఁడు అంతరాత్మకుఁడు

ఆతుమ మరచిన నాతఁడు మరచును
యీతఁడె శ్రీవేంకటేశ్వరుఁ గొలిచిన
చేచేతనే సుఖములు సేనాసేన     ॥రెప్ప॥ 

Atuma nunnADu aMtarAtmakuDu

Atuma marachina nAtaDu marachunu
yItaDe SrIvEMkaTESvaru golichina 
chEchEtanE sukhamulu sEnAsEna        ॥reppa॥ 

Word to Word meaning: ఆతుమ (Atuma) = soul; నున్నాఁడు (nunnADu) = exists; అంతరాత్మకుఁడు (aMtarAtmakuDu) = the inmost spirit, The Supreme Spirit; ఆతుమ (Atuma) = soul మరచిన (marachina) = forget;  నాతఁడు (nAtaDu) = మరచును (marachunu) యీతఁడె (yItaDe) = this one; శ్రీవేంకటేశ్వరుఁ (SrIvEMkaTESvaru)  = Lord Venkateswara; గొలిచిన (golichina) = by devotion;  చేచేతనే (chEchEtanE) = by your hands; సుఖములు  (sukhamulu) = comnforts; సేనాసేన (sEnAsEna) = చాలాచాలా, అధికము (జోహారు వంటి పదము).

Literal meaning and Explanation: The supreme spirit exists in your body. If you disregard your soul, he will also respond the same way. If you show devotion to Lord Venkateswara, the supreme Spirit, he will shower innumerable comforts.

By stating ఆతుమ నున్నాఁడు అంతరాత్మకుఁడు (Atuma nunnADu aMtarAtmakuDu), Annamayya is referring to the Bhagavad-Gita shloka उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वर: | परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुष: पर: || 13-23|| upadraṣhṭānumantā cha bhartā bhoktā maheśhvaraḥ  / paramātmeti chāpy ukto dehe ’smin puruṣhaḥ paraḥ  (Purport: God is within this body, he is said to be different from the body. He is the witness, the patron, the bearer, the experiencer, the Supreme, the Paramatman.)

Though, God is inside all of us, we are expected to make way for him to work through our body. But what do we do? Probably the quote below by George Saunders explains man’s abstruse position clearly.

Each of us is born with a series of built-in confusions that are probably somehow Darwinian. These are:

1.  We're central to the universe (that is, our personal story is the main and most interesting story, the only story, really);

2.    We're separate from the universe , and

3.    We’re permanent (death is real, o.k., sure - for you, but not for me).

George Saunders

Thus the ultimate sense of this verse is to remove the shield behind your eyes to see the god clearly. All the illusions are created (by man himself). .

భావము మరియు వివరణము: పరమాత్మ మీ ఆత్మలోనే ఉన్నాడు. మీరు మీ ఆత్మను విస్మరిస్తే, పరమాత్మ కూడా అదే విధంగా స్పందిస్తాడు. పరమాత్మ అయిన వెంకటేశ్వరుని మీరు భక్తితో ఆరాధిస్తే,  అసంఖ్యాక సుఖాలను అనుగ్రహిస్తాడు.

ఆతుమ నున్నాఁడు అంతరాత్మకుఁడు అని భగవద్గీతలోని యీ శ్లోకాన్ని ఉటంకించారు. శ్లో||   ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః । పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః ।।(13-23)।। (భావము: దేహములోనే సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. ఐనప్పటికీ, శరీరము  కంటే వేరైనవాడు, సాక్షీభూతుడు, పోషకుడు, భరించువాడు, అనుభవించువాడు, పరమేశ్వరుడు, పరమాత్మ  అని చెప్పబడుచున్నాడు.)

దేవుడు మనందరిలో ఉన్నప్పటికీ, మన శరీరం ద్వారా ఆయన పనిచేయడానికి మార్గం ఏర్పరచాలి.   కానీ మనం ఏమి చేస్తాం? జార్జ్ సాండర్స్ గారి క్రింది సందేశం మనిషి యొక్క అయోమయ స్థితిని స్పష్టంగా వివరిస్తుంది. 

(ప్రఖ్యాత శస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ చెప్పిన జీవపరిణామ సిద్ధాంతం లాగానే) మనలో ప్రతి ఒక్కరూ అంతర్నిర్మిత గందరగోళాలతో జన్మించారు. అవి: (1.)  విశ్వానికి  నేనే కేంద్రము  (అనగా, నా వ్యక్తిగత కథ ప్రధాన మరియు ఆసక్తికరమైన కథ, ఒకే నిజమైన కథ). (2.)      నేను విశ్వం నుండి వేరుగా ఉన్నాను మరియు (3). నేను శాశ్వతంగా ఉంటాను (మరణం నిజమే, ఖచ్చితంగా - మీ విషయంలో, కానీ విషయంలో వేరు).

ఈ కీర్తన యొక్క అంతిమ భావన ఏమిటంటే, భగవంతుడిని చూడటానికి మీ కళ్ళ వెనుక ఉన్న తెరలను తొలగించడమే. భ్రమలన్నీ మనిషి స్వయం కృతములే.

 

క్రింది వేమన పద్యం కూడా కీర్తనని అర్ధం చేసుకోడానికి ఉపయోగపడుతుంది.


ఆ. లేఁడు లేఁడనినను లేఁడు లేనేలేఁడు
కాఁడు కాఁడటన్న కానెకాఁడు
తోడు తోడనినను తోడనే తోడౌను
విశ్వదాభిరామ వినర వేమ.(3-10)

(Purport: Oh! Learned Vema! Deny HIS existence, HE is not there. Deny relationship HE does not belong. You invite, HE is there besides you at the very instant).

 

 

Copper Leaf: 266-2  Volume 3-378

2 comments:

  1. కనురెప్పల వెనుక దాగియున్న మనస్సే బాహ్యాభ్యంతరముల మధ్యన తెరవలె అడ్డుగా ఉంటుంది. ఈ మనస్సు అనే తెర యొక్క మర్మం యిప్పుడే నా మదిలో మెరిసింది.

    మాయలు(భ్రమలు) అన్నీ కూడా మనోజనితములే.అంటే ఇంద్రియవిషయములు మనస్సు నుండి ఉద్భవించినవే.మనస్సును నియంత్రిస్తే మనస్సులో గూడు కట్టుకొన్న భ్రమల్లన్నీ తొలగిపోతాయి.అటుల గాక,మనస్సును అదుపులో ఉంచక, యధేచ్ఛగా అంటే దాని ఇష్టానుసారం వ్యవహరించ నివ్వనిస్తే మాయలకు అడ్డేముంటుందిక?

    దేహం ఇంద్రియములతో కలిసి,మనస్సులో జనించే కోరికలను నిరంతరం కోరుచునే యుంటుంది.ఇంద్రియములను, మనస్సును నియంత్రించినట్లయితే అనగా శమము,దమములనే సంపత్తులను అభ్యసించినచో,
    కట్టలు కట్టలుగా ఉదయించే కోరికలను త్యజించవచ్చును.
    అంతరేంద్రియ, బాహ్యేంద్రియ నిగ్రహము ద్వారా ఈ స్థితిని పొందవచ్చు.

    తనను ఆవరించిన మాయ(అజ్ఞానం)చేత, మనిషి బహిర్ముఖుడై, తనలోనే ప్రకాశించుచున్న చైతన్య
    స్వరూపమైన పరమాత్మను తెలియజాల కున్నాడు.
    మన హృదయం లోనే పరమాత్మ స్థితుడై యున్నాడు.
    ఆత్మ, పరమాత్మ ఒక్కటే యని(ఆయమాత్మా) గ్రహించలేక, దుఃఖభాజనమైన ఈ సంసారసాగర లంపటములో పడి కొట్టుమిట్టాడు
    చున్నాడు.
    అందుకే పరమాత్మ యైన శ్రీ వెంకటేశ్వరుడిని నిరంతరం భక్తితో ఆరాధిస్తే అసంఖ్యాకములైన పారమార్థిక సుఖములను, పరమానందమును పొందవచ్చునని అన్నమయ్య ఈ కీర్తనలో బోధించుచున్నాడు.
    🙏

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...