ANNAMACHARYA
70. వాసివంతు విడిచినవాఁడే యోగి
Introduction: In this beautiful
verse, Annamacharya describes the fundamental problems of man as
competitiveness and discrimination. As early as fifteenth century, Annamacharya made tremendous efforts
in composing poems on the plight of human dilemma, in commoners language. Though
a chaste Hindu yogi, I believe, he wrote these poems as he could feel the world
in himself, in that indescribable act of meditation.
ఉపోద్ఘాతము: ఈ అందమైన కీర్తనలో, అన్నమాచార్యులు
మనిషి యొక్క ప్రాథమిక సమస్యలను పోటీతత్వం మరియు వివక్షతగా వర్ణించారు. ఒక సాంప్రదాయక హిందూ యోగి అయినప్పటికీ, ఐదు వందల
సంవత్సరాల క్రితమే, మానవ సందిగ్ధత యొక్క దుస్థితిపై కవిత్వము సామాన్యుల భాషలో అల్లి సమాజ సేవ చేశారు.
వర్ణించలేని ధ్యాన సమాధిలో మునిగి యుండగా ప్రపంచమంతటినీ తనలోనే అనుభవించి ఈ కీర్తనలను
వ్రాసివుంటా రనుకోవచ్చు.
కీర్తన
వాసివంతు
విడిచినవాఁడే యోగి; యీ-
గద్దించి పారెడుతురగమువంటి మనసు
వద్దని మరలించినవాఁడే యోగి
వొద్దనే కొండలవంటి వున్నత దేహగుణాలు
దిద్ది మట్టుపెట్టువాఁడే ధీరుఁడైన యోగి ॥వాసి॥
ముంచుకొన్న యింద్రియపు మోహజలధిలోన
వంచన మునుఁగనట్టివాఁడే యోగి
పొంచి పుణ్యపాపములు పొట్టువంటి కర్మములు
దంచి పారఁజల్లువాఁడే తత్త్వమైన యోగి ॥వాసి॥
వెగటుకామాదుల వెళ్ళఁగొట్టి శాంతుఁడై
Details and Explanations:
వాసివంతు విడిచినవాఁడే
యోగి; యీ-
ఆసలెల్లా విడిచిన అతఁడే
యోగి ॥పల్లవి॥
vAsivaMtu viDichinavADE yOgi; yI-
AsalellA viDichina ataDE yOgi ॥pallavi॥
Word to Word meaning: వాసి (vAsi) = తారతమ్యము, భేదము, difference; వంతు (vaMtu)
= పోటీ మనస్తత్వము, competitive; విడిచిన ((viDichina) = leaving, renouncing; వాఁడే
(vADE) = that one
only; యోగి (yOgi) = true yogi; యీ (yI) = these;
ఆసలెల్లా (AsalellA) = all desires,
all wants; విడిచిన ((viDichina) = leaving, renouncing; అతఁడే
(ataDE) = that one
alone; యోగి (yOgi) = true yogi.
Literal meaning and
Explanation: A yogi is one who abandons
discrimination and a competitive mind-set. He is the true yogi who has given up
all these desires.
Have a careful observation of all our
actions. Wherefrom they emanate? We teach our children to secure top rank in
the class. In our work life, we are given increments in comparison to our
peers. Whether we do it intentionally or unintentionally or without peer
pressure, just because of peer presence, makes a normal person assume a goal that
he must achieve?
If one is does not meet the assumed
target, the individual will be subjected to stress. In case one is able to meet
the expectation, it’s going to increase the stress on the individual to perform
even better. Thus comparison is one of the root causes of stress in our life
(because of our foolish assumptions).
"Is it possible for a person to live free
from all these comparisons and discriminations?" is the question raised by
Annamacharya.
This verse is a good example of
Annamayya making a cosmic effort to take man to explore till the limit of his thoughts.
Annamayya did not sit in a corner reciting prayers of peace. He explored
various aspects of human life and suggested the root causes of human suffering,
similar to Buddha.
భావము మరియు వివరణము: తారతమ్యాలు, పోటీ మనస్తత్వము
విడిచిన వాడే యోగి. ఈ కోరికలన్నీ విడిచిన అతడే నిజమైన యోగి.
మన చర్యలన్నింటినీ
జాగ్రత్తగా పరిశీలించండి. అవి ఎక్కడ నుండి ఉత్పన్నమౌతాయో? తరగతిలో ఉన్నత ర్యాంకు సాధించమని పిల్లలకు బోధిస్తాము. ఉద్యోగ జీవితంలో, మనల్ని తోటివారితో
పోల్చి, వేతనములో పెంపు (ఇంక్రిమెంట్) ఇస్తారు. మనం అనుకోకపోయినా, కావాలని చేయకపోయినా,
తోటివారి ఒత్తిడి లేకపోయినా, వారు అక్కడ వుండటంతోనే, ఒక సాధరణ వ్యక్తిని అలా ఆలోచించేలా చేస్తుంది. ఈ విధంగా మనం తప్పక సాధించవలసిన
లక్ష్యము ఇవ్వబడుతోందా?
ఊహించిన లక్ష్యాన్ని
చేరుకోకపోతే, సదరు వ్యక్తి ఒత్తిడికి లోనవుతాడు. ఒకవేళ ఉద్దేశించిన ఫలము పొందినా కూడా,
అదే స్థాయిలో తిరిగి, లేదా అంతకంటే మెరుగ్గా పనిచేయడానికి వ్యక్తిపై చెప్పకయే, ఒత్తిడిని
పెంచుతుంది. ఈ విధంగా పోలిక అనేది మన జీవితంలో ఒరిపిడికి మూల కారణాలలో ఒకటి (మన మూర్ఖమైన
ఊహల వల్ల).
“ఈ పోలికలు
మరియు వివక్షల నుండి దూరంగా ఉండి, ఒక వ్యక్తి స్వేచ్ఛగా జీవించడం సాధ్యమేనా?” అన్న
ప్రశ్న లేవనెత్తారు అన్నమయ్య.
అన్నమయ్య మనిషిని ఆలోచనల అంచు దాకా తీసుకెళ్ళడానికి విశ్వప్రయత్నము చేశారనడానికి ఈ కీర్తన మంచి ఉదాహరణ. అన్నమయ్య ముక్కు మూసుకుని కృష్ణా, రామా అంటూ ఒక మూల కూర్చుని భజన చేయలేదు. మానవుని వేధిస్తున్న బాధలకు మూల కారణములను, బుద్ధుడి లాగానే, వెతికి తీసారనుకోవచ్చు.
గద్దించి పారెడుతురగమువంటి
మనసు
వద్దని మరలించినవాఁడే
యోగి
వొద్దనే కొండలవంటి వున్నత
దేహగుణాలు
దిద్ది మట్టుపెట్టువాఁడే
ధీరుఁడైన యోగి ॥వాసి॥
gaddiMchi pAreDuturagamuvaMTi manasu
vaddani maraliMchinavADE yOgi
voddanE koMDalavaMTi vunnata dEhaguNAlu
diddi maTTupeTTuvADE dhIruDaina yOgi ॥vAsi॥
Word to Word meaning: గద్దించి (gaddiMchi) = గదమాయించు, rebuke; పారెడు (pAreDu) = తెంచుకొని పరుగిడు,
way ward; తురగమువంటి
(turagamu
vaMTi) = horse
like; మనసు (manasu)
= mind; వద్దని (vaddani) = not
required; మరలించినవాఁడే (maraliMchinavADE)
= మళ్ళించిన వాడు మాత్రమే, Only the
one that causes to turn back; యోగి (yOgi) =
saint, yogi; వొద్దనే(voddanE)
= Within himself; కొండలవంటి (koMDalavaMTi) =
mountain like; వున్నత (vunnata)
= high; దేహగుణాలు (dEhaguNAlu) = body attributes; దిద్ది (diddi) =
correcting; మట్టుపెట్టువాఁడే (maTTupeTTuvADE) = అడఁచు
వాడు మాత్రమే, only the one annihilating; ధీరుఁడైన (dhIruDaina) =a
learned; యోగి (yOgi) = saint, yogi
Literal meaning and
Explanation: The one who could rebuke the
horse like mind from exhibiting wayward nature is true yogi. A person who is
annihilating the mountain like (heaps of) body generated (sore) attributes
within himself is the learned saint.
Central idea of this stanza is true yogi
is aware of the movement of his thought. Normal people realise after it moves
away. This may seem very trivial. But consider an incident like one vehicle
touching another in traffic. Both the drivers otherwise would be good citizens.
During the moment of heat, they may exchange blows OR use expletives. This we
would have observed umpteen times.
భావము మరియు వివరణము: అవిధేయ స్వభావాన్ని ప్రదర్శించకుండా గుర్రము వంటి మనస్సును మందలించగలవాడు నిజమైన యోగి. తనలోని పర్వతాల వంటి
(గుట్టలుగుట్టలుగా వున్న) శరీరము కలిగించు (అవ)లక్షణాలను తనయందే సర్వనాశనం చేస్తున్న
వ్యక్తి ధీరుఁడైన సాధువు.
ఈ చరణం యొక్క ముఖ్య సందేశము: నిజమైన యోగి తన
ఆలోచనలలో కదలిక గమనించగలడు. అది కదిలిన తర్వాత
సాధారణ ప్రజలు గ్రహిస్తారు. ఇది చాలా చిన్నవిషయం అనిపించవచ్చు. ఉదాహరణకు రద్దీ సమయములో
ఒక వాహనం మరొక వాహనాన్ని తాకడం వంటి సంఘటనను పరిగణించండి. డ్రైవర్లు ఇద్దరూ మంచి పౌరులై
కూడా, ఆ క్షణానికి వివేకము కోలుపోయి, వారు దెబ్బలాటకు దిగవచ్చు లేదా బూతులు తిట్టుకోవచ్చు.
ఇది మనము చాలాసార్లు గమనించే వుంటాము.
ముంచుకొన్న యింద్రియపు మోహజలధిలోన
muMchukonna yiMdriyapu mOhajaladhilOna
Word to Word meaning: ముంచుకొన్న (muMchukonna) = inundating; యింద్రియపు (yiMdriyapu) = sensory; మోహజలధిలోన (mOhajaladhilOna) =sea
of illusion; వంచన (vaMchana) = cheating, deceit; మునుఁగనట్టివాఁడే (munuganaTTivADE) = does not get drowned; యోగి (yOgi) = saint, yogi; పొంచి (poMchi) = వేటగాని వలె సమయముకై కాచుకుని ఉన్న, lurking like
hunter; పుణ్యపాపములు (puNyapApamulu) = both sinful and virtuous
deeds; పొట్టువంటి (poTTuvaMTi) = నూర్చగా మిగిలిన తుక్కు లాంటి,
like husk, bran (useless extraneous matter) కర్మములు (karmamulu) = deeds; దంచి (daMchi) = pounding; పారఁజల్లువాఁడే (pArajalluvADE) = పోఁద్రోలు; తత్త్వమైన (tattvamaina)
= సత్య స్వరూపమైన, truthful; యోగి (yOgi) = saint, yogi.
Literal meaning and
Explanation: the one who assiduously saves
himself from the inundating sea of illusions and deceit created by sensory
activity is saint. Both sinful and virtuous deeds are lurking to bite. A true
yogi meticulously discards them like we get rid of the husk and bran.
పుణ్యపాపములు పొట్టువంటి కర్మములు needs further discussion. A right
thinking person would ask why to relinquish virtuous deeds? Just understand
that both our conceptualised sinful and virtuous deeds are on the same scale,
one is on the positive and the other on negative side. But both are material activities.
Any amount of material activity shall
not liberate person. Same thing is also mentioned in Bhagavad-Gita as बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते buddhi-yukto
jahātīha ubhe sukṛita-duṣhkṛite (2-50)
భావము మరియు వివరణము: ఇంద్రియ కార్యకలాపాల ద్వారా సృష్టించబడిన సముద్రమంతటి
గంభీరము, లెక్కకుమించిన భ్రమలు మరియు ముంచుకొస్తున్న మోసాల నుండి తనను తాను రక్షించుకునేవాడు సాధువు. కాటువేయుటకు సమయముకై కాచుకుని ఉన్న పుణ్యపాపములను
ధాన్యము నూర్చగా మిగిలిన తుక్కులా భావించి
పోఁద్రోలు వాడే సత్య స్వరూపమైన యోగి.
పుణ్యపాపములు పొట్టువంటి కర్మములు అన్నదానిపై మరింత చర్చ అవసరం.
పుణ్యములను ఎందుకు వదులుకోవాలో ఒక పట్టాన అర్ధం కాదు. జాగ్రత్తగా పరిశీలించిన పుణ్యపాపములు
రెండూ కూడా ఒకే కొలమానమున ఉన్నాయని తెలియండి.
ఒకటి సానుకూలమై, మరొకటి ప్రతికూలమై ఉంటాయి. ఐనప్పటికి రెండునూ జడ (ద్రవ్యమయమగు)
కార్యములే. ఎంత కృషి చేసినా భౌతిక కార్యకలాపాల ద్వారా వ్యక్తికి విముక్తి లభించదు. "బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే ( 2-50)" అని భగవద్గీతలో కూడా ఇదే విషయం ప్రస్తావించబడింది
వెగటు కామాదుల వెళ్ళఁగొట్టి
శాంతుఁడై
వగలుడిగినయట్టివాఁడే
యోగి
నిగిడి శ్రీవేంకటేపతి
నిజదాసుఁడై భక్తిఁ
దగిలి నిలుపువాఁడే ధన్యుఁడైన
యోగి ॥వాసి॥
vegaTukAmAdula veLLagoTTi SAMtuDai
vagaluDiginayaTTivADE yOgi
nigiDi SrIvEMkaTEpati nijadAsuDai bhakti
dagili nilupuvADE dhanyuDaina yOgi ॥vAsi॥
Word to Word meaning: వెగటు (vegaTu) = ఏవగింపు కలిగించు, unpleasant or repulsive taste; కామాదుల (kAmAdula) =
lustful activities; వెళ్ళఁగొట్టి (veLLagoTTi) = drive
out; శాంతుఁడై (SAMtuDai)
= being calm (in mind); వగలు (vagalu)
= మాయలు, నటన, pretentions, snobbery; ఉడిగినయట్టివాఁడే
(uDiginayaTTivADE)
= అడుగంటిన వాడే, who has completely eliminated; యోగి
(yOgi)
= saint, yogi; నిగిడి (nigiDi) = విజృంభించు, వ్యాపించు వేగిరపడు To rise or increase, to hasten; శ్రీవేంకటేపతి
(SrIvEMkaTEpati) = Lord
Venkateswara; నిజదాసుఁడై (nijadAsuDai) = true servant; భక్తిఁ (bhakti)
= devotion, meditation; దగిలి (dagili) = get
hooked to; నిలుపువాఁడే (nilupuvADE) = stay
in that state; ధన్యుఁడైన (dhanyuDaina) =
liberated; యోగి (yOgi)
= saint, yogi.
Literal meaning and
Explanation: The one who has
driven out the repulsive lustful activities, completely eliminated the
pretentions (and snobbery) and remain calm is a sage. The one who is a true
servant of God and hastens to remain in mediation of Lord Venkateswara is truly
liberated person.
The word కామాదుల వెళ్ళఁగొట్టి
శాంతుఁడై is used to indicate it is not the intermission/gap
between two lustful activities. Thus, the peace or calmness we feel is just the
intermission/gap (euphemistically called truce) said above. True Calmness is
the one felt by the liberated person.
The word నిగిడి (= to hasten) is indicating that the
yogi is willingly enter into it whenever he is presented an opportunity.
భావము మరియు వివరణము: ఏవగింపు కలిగించు కామాదుల వెడలగొట్టి, కపట నటనలు, టక్కులు అడుగంటించి మనసున శాంతముగా నుండు వాడే సిద్ధుడు. శ్రీవేంకటేపతికి నిజమైన దాసుఁడై, ఆయన ధ్యానమునందే ఉండుటకు వేగిరపడు వాడు ధన్యుఁడు.
కామాదుల వెళ్ళఁగొట్టి శాంతుఁడై అని చెప్పి ప్రశాంత రెండు కామ్య కార్యకలాపాల మధ్య విడుపు లేదా విరామము కాదని సూచించడానికి
ఈ రకంగా చెప్పారు. ఈ విధంగా, మనకు అనిపించే శాంతి లేదా ప్రశాంతత పైన చెప్పిన విడుపు
లేదా విరామము మాత్రమే. విముక్తి పొందిన వ్యక్తి అనుభవించేది నిజమైన ప్రశాంతత.
నిగిడి (=వేగిరపడు) ద్వారా తనకు అవకాశం లభించినప్పుడల్లా యోగి ఇష్టపూర్వకంగా ధ్యానములోనికి ప్రవేశిస్తున్నాడని సూచిస్తున్నారు.
Copper Leaf: 27-6 Volume 1-167
Very nice keerthana.Your explanation is very good
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteIt is rightly analyzed by Sri Sreenivasa garu.. In this song, rightly explains that comparison always leads to ego, which ultimately leads to the downfall of an individual. Annamayya, a great Philisopher...
ReplyDeleteVery nice find.
ReplyDeleteThis is the most straight forward easy to comprehend Annamacharya padam.
Your explanations and discussions are also lucid.
ఓం శ్రీ సాయినాధాయ నమః
ReplyDeleteఅట్టి యోగిన లేదా సద్గురువును గుర్తించుట కూడా మనకు కావలసిన జ్ఞానమును భగవంతుడు ప్రసాదించిన గాని మనకు లభించదని మనము గుర్తించాలి అందుకే సద్గురు సాయి షిరిడిలో ఉన్నప్పటికీ అందరూ షిరిడీకి వెళ్ళు అనుమతి కలగలేదు.
అంటే ఇట్లా మన పూర్వ జన్మ సుకృతం వలన సత్సంగం చేసుకోవడం కూడా భగవంతుని కృపయే అనుకోవాలి.
Good Keerthana. Beautiful explanation by the author of Annamayya’s views in this rendition.
ReplyDeleteవివక్ష,స్ఫర్థలను త్యజించినవాడే యోగి. కోరికలకు అతీతుడే నిజమైన యోగి.మనస్సుతో సంకల్పము వలన కలిగే కోరికలను నిశ్శేషంగా త్యజించినవాడే యోగసాధనకు అర్హుడు.
ReplyDeleteపరిపరి విధములుగా విషయోన్ముఖమై, అదుపుతప్పిన గుఱ్ఱం వలె సంచరించే మనస్సును
స్వాధీనపరచుకొని,నియంత్రించ
గలిగినవాడే యోగి.ఇంద్రియమనములను నిగ్రహించి,వాటివల్ల ఉద్భవించే పర్వతముల వంటి కల్మషములను మట్టుబెట్టగలిగిననవాడే ధీరుడైన యోగి.
ఇంద్రియజనితమైన,అగణ్యమైన భ్రాంతి,మోహములనే జలధిలో మునిగి, కొట్టుకొని పోకుండా స్వీయరక్షణ చేసికొన్నవాడే యోగి.బంధకారకములైన పాపపుణ్య కర్మలను వివేకంతో, విచారణతో బియ్యపు పొట్టువలె పారద్రోలిన వాడే తత్త్వస్వరూపుడైన యోగి.
వెగటు కలిగించే కామమును, కపటమును సంపూర్ణంగా నిష్క్రమింపజేసి శాంతచిత్తుడైన వాడే యోగి.శ్రీవేంకటపతి యందే చిత్తమును నిలిపి, అయన సేవలో, భక్తిప్రపత్తులతో ధ్యాననిష్ఠలో తత్పరుఁడై యున్నవాడే నిజమైన యోగియని, ముక్తుడని అన్నమయ్య ఈ కీర్తన ద్వారా నిజమైన భక్తుడు,యోగి యొక్క లక్షణములను మానవాళికి బోధించుచున్నాడు.
🙏