ANNAMACHARYA
68. నాఁటికి నాఁడే నా చదువు
Introduction: In this rather hard
hitting verse on Annamacharya makes more things crystal clear on what
meditation is. The ultimate sense of the word చదువు (education)
is action in learning. He is asserting that action is meditation.
Through the ages, Meditation
remains the only way to know the life for living beings (whether they are human
beings, gods, or delivered sages). All other actions of living beings lead to
ignorance.
ఉపోద్ఘాతము: ఈ కీర్తనలో అన్నమాచార్యులు ధ్యానం అంటే ఏమిటో మరింత స్పష్టంగా నొక్కి చెప్పారు. చదువు అనే పదానికి అంతిమ ఆంతర్యము క్రియారూపముగా నేర్వడం. ఆ క్రియారూపమే ధ్యానం అని ఆయన అంటున్నారు.
యుగాలు మారినప్పటికీ జీవులు (మానవులు కానివ్వండి, దేవతలు, సిద్ధ పురుషులైనా కానివ్వండి) జీవితాన్ని తెలియుటకు ధ్యానమొక్కటి మాత్రమే మార్గమన్నారు. జీవుల ఇతర చర్యలన్నీ అజ్ఞానమునకు దారితీస్తాయి.
కీర్తన
నాఁటికి నాఁడే నా చదువు
ఎనయ నీతని నెఱుఁగుటకే పో
తెలిసి యితనినే తెలియుటకే పో
పరమని వేంకటపతిఁ గనుటకే పో
Details and Explanations:
నాఁటికి నాఁడే నా చదువు
nATiki nADE nA chaduvu
Word to Word meaning: నాఁటికి (nATiki) = for that day; నాఁడే (nADE) = same day; నా (nA) = my; చదువు (chaduvu) = study/learning; మాటలాడుచును = mATalADuchunu) = by keep on exchanging words ( not agreeing on any point) మఱచేటి (ma~rachETi) = forgetting; చదువు (chaduvu) = study/learning.
Literal meaning and Explanation: my study/learning happens for that day on every day. Not a one to forget in (wanton) exchange of words
First let us consider the words nATiki nADE (నాఁటికి నాఁడే). Annamacharya talks about active and fresh practice/learning every day. In that, what was learnt yesterday is useless for today. He is talking about a practice / study that cannot be imitated or followed. Indirectly mentioning bit by bit accumulation is not possible in the said learning.
By word చదువు (chaduvu) he meant is not just study, but also understanding, as I shall explain later. When you have this, there are no doubts generated. Therefore there is no need for discussions.
మాటలాడు is used in the sense "నన్నెందుకు ఊరికె మాటలాడుతావు" why reproach me for nothing? Thus the word మాటలాడుచును is used to indicate wanton exchange of words taking away the attention from learning. When attention gone, we forget what we hear, therefore where is the learning?
Please note that though the teaching is same for both the wise and ignorant, wise spend in learning, while ignorant wastes his time.
Thus Annamacharya power packed this chorus with just 7 words making a world of difference between learning and ignorance.
Now what he meant by learning Fresh is something to ponder. Of course it is not the freshness brought by new morning. This morning freshness, by the progress of the day vanishes. Annamacharya is talking of the freshness that does not fade.
Please consider these words పొంచి శరీరపుభోగము లుడిగిన / చుంచుఁబావములు సుకృతములే (from “తప్పదు తప్పదు దైవము కృప యిది” ).When body enjoyment ceases only then nascent (or fresh) feelings actually will have chance to flower. They are the truly virtuous things.
Therefore, he is actually indicating a learning, in which the body, mind and soul are aligned to receive the learning. Thus Annamachrya is indicating Meditation.
Now the true meaning of this chorus is: I engage in meditation. Many are interested in choosing words (symbols for god) to lose attention. Therefore they digress.
భావము మరియు వివరణము: నా చదువు నాఁటికి నాఁడే జరుగును. (అనవసరపు) మాటలాడుచును మఱచేటి చదువు కాదు.
నాఁటికి నాఁడే అని అన్నమాచార్యులు ప్రతిరోజూ చురుకైన మరియు తాజా అభ్యాసం గురించి చెబుతున్నారు. ఈ రోజు కోసం నిన్న నేర్చుకున్నది నిరుపయోగం. అతను అనుకరించలేని, అనుసరించలేని ఒక అభ్యాసం /చదువుల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా కొంచెం కొంచెంగా కూడగట్టుకుని పోగుచేయలేని చదువును పేర్కొంటున్నాడు.
“మాటలాడు”ను "నన్నెందుకు ఊరికె మాటలాడుతావు" ఊరకే నన్ను నిందించడం ఎందుకు? అన్న అర్ధంలో వాడారు. మాటలాడుచును అంటూ ఉబుసుపోని నిందించు పనిలో ఉండి, అసలైన విషయము మీద ధ్యాస తగ్గి చదివిన చదువు వ్యర్ధమగునని సూచించారు. శ్రద్ధ పోయినప్పుడు, మనం విన్నదాన్ని మరచిపోతాము కాబట్టి నేర్చుకోవడం ఎక్కడ ఉంటుంది?
ఈ పల్లవి యొక్క అర్థం ఇలా అనుకోవచ్చు. “నా అభ్యాసం ప్రతిరోజూ (ప్రతీ క్షణము) తాజాగా ఉంటుంది. సందేహాలున్నవారు గొలుసుల వంటి ఆలోచనలలో తమ సమయాన్ని వెచ్చిస్తారు; శ్రద్ధను కోల్పోతారు. అందువల్ల వారు నేర్చుకోరు”
బోధన అందరికీ ఒకటే ఐన్నప్పటికీ, తెలివైనవారు నేర్చుకోవడంలో నిమగ్నమౌతారు, అజ్ఞానులు తమ సమయాన్ని వృథా చేసుకుంటారు.
ఈ విధంగా పల్లవికి అన్నమాచార్యులు కేవలం ఏడు పదాలతో జీవము పోసి, జ్ఞానం మరియు అజ్ఞానం మధ్య అంతరాన్ని విడమర్చి చూపారు.
ఎప్పటికప్పుడు తాజా చదువు నేర్వడం ద్వారా ఏమి సుచించారో పరిశీలిద్దాం. ఇది కొత్త
ఉదయం తీసుకువచ్చిన తాజాదనం కాదు. పొద్దెక్కేకొద్దీ ఈ ఉదయపు తాజాదనం అదృశ్యమవుతుంది.
వాస్తవానికి అన్నామాచార్యులు వాడిపోని నవనవలాడు తాజాదనం గురించి ప్రస్తావించారు.
నవనవలాడు తాజాదనం యొక్క అర్ధాన్ని “తప్పదు తప్పదు దైవము కృప యిది” అనే కీర్తనలోని ఈ భాగాన్నుంచి గ్రహించండి. “పొంచి శరీరపుభోగము లుడిగిన / చుంచుఁబావములు సుకృతములే. (శరీర భోగములు కోసము ఎదురు చూపులు ఆగిపోయినప్పుడు మాత్రమే కొత్త (లేదా తాజా) భావాలు పుష్పించే అవకాశం ఉంటుంది. అవే నిజంగా సద్గుణమైన విషయాలు.)
వాస్తవానికి శరీరం, మనస్సు మరియు ఆత్మ ఒకే దీక్షతో స్వీకరించడానికి సమాయుత్తమగు ఒక అభ్యాసాన్ని అన్నమయ్య సూచిస్తున్నాడు . అదియే ధ్యానము.
“నేను
ధ్యానంలో నిమగ్నమయ్యాను; అనేకులు, తగు పదముల (దైవము యొక్క చిహ్నాల) ఎంపికలో ఆసక్తి
కలిగి తమకు తామే దృష్టిని మరల్చుకుంటారు.” అని ఈ పల్లవి నిజమైన అర్ధాన్ని గూఢంగా చెప్పారు.
ఎనయ నీతని నెఱుఁగుటకే
పో
enaya nItani
ne~ruguTakE pO
Word to Word meaning: ఎనయ (enaya) = పొందు, unite; నీతని (nItani) = this one; నెఱుఁగుటకే పో (ne~ruguTakE pO) = తెలిసికొనుటకే, గ్రహించుటకే only To know, be aware of, to understand; వెనకవారు (venakavAru) = previous generations; చదివిన (chadivina) = practiced/ trained చదువు (chaduvu) = study/learning; మనసున (manasuna) = in the mind; నీతని (nItani) = this one; మఱచుటకే పో (ma~rachuTakE pO) = only to forget; పనివడి (panivaDi) = intentionally; యిప్పటి (yippaTi) = nowadays; ప్రౌఢల (prauDhala) = mature/skilful; చదువు (chaduvu) = study/learning.
Literal meaning and Explanation: The practice/training previous generations were only to know/understand/be aware of HIM/GOD. Nowadays the objective of study is to only to intentionally forget HIM.
Kindly understand his is not criticising education system. He is criticising the attitude of the learners.
It’s fashionable to question existence of god, particularly amongst the well-educated. This attitude is still displayed by many youngsters. Unfortunately their parents also hold similar views.
If education cannot make man realise that there are limits to one’s knowledge and what one does not know is not
necessarily wrong, is it education? Annamayya, who realized this, should be
considered as genius. (Fortunately he received little formal education)
భావము మరియు వివరణము: మునుపటి తరాల అభ్యాసము (శిక్షణ) యొక్క ఏకైక ధ్యేయము అతణ్ణి (దేవుణ్ణి) తెలుసుకోవడమే / అర్థం చేసుకోవడమే. ఐతే, ఈ రోజుల్లో అధ్యయనం యొక్క లక్ష్యం అతనిని ఉద్దేశపూర్వకంగా మరచిపోవడమే.
ఆయన విద్యావ్యవస్థను విమర్శించడం లేదని దయచేసి అర్థం చేసుకోండి. అతను అభ్యాసకుల వైఖరిని విమర్శిస్తున్నాడు.
బాగా చదువుకున్న వారు భగవంతుని ఉనికిని ప్రశ్నించడం నాగరీకత అనుకుంటారే? ఈ వైఖరిని ఇప్పటికీ చాలా మంది యువకులు అనుసరిస్తున్నారు. దురదృష్టవశాత్తు వారి తల్లిదండ్రులు కూడా ఇలాంటి అభిప్రాయాలనే కలిగి ఉన్నారు.
తన జ్ఞానానికి పరిమితులు ఉన్నాయని, తనకు తెలియనిది తప్పనిసరిగా తప్పు అవ్వాలనీ నీయమంలేదనీ మనిషి గ్రహించలేకపోతే, అది విద్యేనా? ఈ విషయాన్ని అనాడే గ్రహించిన అన్నమయ్యను మేధావీ అనే అనుకోవాలి. (అదృష్టవశాత్తు ఆయన అప్పటి విద్యను పెద్దగా అభ్యసించలేదు.)
తెలిసి యితనినే తెలియుటకే
పో
telisi yitaninE
teliyuTakE pO
Word to Word meaning: తెలిసి (telisi) = knowingly; యితనినే (yitaninE) = this one only; తెలియుటకే పో (teliyuTakE pO) = to understand; తొలుతఁ (toluta) = in the beginning; గృతయుగాదుల (gRtayugAdula) = previous eras, starting from the very first epoch; చదువు (chaduvu) = study/learning; కలిగిన (kaligina) = existing; యీతనిఁ (yItani) = this one; గాదననే పో (gAdananE pO) = denying his existence; కలియుగంబులోఁ (kaliyugaMbulO) = in this ear called Kaliyugam; గలిగిన (galigina) = available; చదువు (chaduvu) = study / learning;
Literal meaning and Explanation: Starting from the very first epoch Satya Yug, great men engaged in learning to know HIM further. The objective of study/learning in Kaliyuga appears to deny his presence.
This is a universal problem of denying existence of GOD for many long years. There were people who refused to consider Krishna as god. So was the case of Jesus Christ during his life time.
For such people, there is a beautiful poem in Bhagavatam (see the Telugu version for the poem).
Few people approached Emperor Prudhu and vented their frustration with
life due to its in-born difficulties and wondered whether there is any one
called GOD?
Prudhu replied: If this world is thought to be born, grow, and perish due to cyclical nature (of inertial matter) behold.
When observed carefully karma and the mind (thinking) are also inert and passive things. But the dynamic creation does not take place from inertia.
Therefore "karma" (action of inertial matter) cannot be the cause of the creation of universe. There is always a cause for action of inertia (it is a dependent action); inertial action is not the work of universe;
Therefore, there is God, (independent actor) who created and creating this universe. So God is the Lord, the doer, the cause of consciousness.
Hence, denying existence of God is
nothing but pure ignorance.
భావము మరియు వివరణము: కృత యుగంలో, (గొప్ప వ్యక్తులు ఆతడున్నాడని తెలిసి) అతనిని మరింత చదువుటలో నిమగ్నమయ్యారు. కలియుగంలో చదువుటలో లక్ష్యం అతని ఉనికిని తిరస్కరించినట్లు కనిపిస్తుంది.
దేవుని ఉనికిని తిరస్కరించడమనేది సార్వత్రిక సమస్య. కృష్ణుడిని దేవుడిగా పరిగణించడానికి నిరాకరించిన వ్యక్తులు ఉన్నారు. యేసుక్రీస్తును కూడా ఇలాగనే నిరాకరించిరి. ఇందుకు భాగవతములోని క్రింది చిన్న ఉదంతము చూడండి.
కొంతమంది ప్రజలు ప్రుధు చక్రవర్తిని దర్శించి, జీవితంలోనీ ఇబ్బందుల కారణంగా జీవనముపై వారి నిరాశను బయటపెడుతూ అసలు దేవుడు అంటూ ఎవరైనా ఉన్నారా? అని అడిగారు.
"అనయంబును వాసుదేవుఁ డనఁ గలఁడె మహిన్?"(4-571, భాగవతము)
ఉ|| కర్మవశంబునం జగము గల్గును హెచ్చు నడంగు నన్నచో
భావము : ఈ జగము "కర్మ" వశమున (కారణమున) పుట్టును, పెరుగును, నశించునని భావించిన, తరచి చూసిన కర్మము, బుద్ధి కూడా జడకార్యములే. చైతన్యములేనివి. కానీ జడము నుండి చైతన్యవంతమగు సృష్టి జరుగదు. కావున ప్రపంచ సృష్టి కార్యమునకు "కర్మ" కర్త కాజాలదు. ఈ జగమ్మునకు "కర్మ" కార్యము కాదు; కారణము కానేరదు. కావున భగవంతుడే -ప్రభువు, కర్త, చైతన్య కారణము.
అందువల్ల, దేవుని ఉనికిని తిరస్కరించడం స్వచ్ఛమైన అజ్ఞానం తప్ప మరొకటి కాదు.
పరమని వేంకటపతిఁ గనుటకే
పో
paramani
vEMkaTapati ganuTakE pO
Word to Word meaning: పరమని (paramani) = considering his to be on the other side; వేంకటపతిఁ (vEMkaTapati) = Lord Venkateswara; గనుటకే పో (ganuTakE pO) = only to find; దొరలగు (doralagu) = great men; బ్రహ్మాదుల (brahmAdula) = The Brahma and the other gods; చదువు (chaduvu) = study / learning; సిరుల (sirula) = splendours; నితని (nitani) = this one; మఱచెడికొరకే పో (ma~racheDikorakE pO) = only to disregard, only to brush aside; విరసపుజీవుల (virasapujIvula) = రసము లేనిది; అరుచికరమైనది, tasteless beings; baseless beings; విద్యల (vidyala) = skills, చదువు (chaduvu) = study / learning;
Literal meaning and Explanation: Considering Lord Venkateswara to be on the other
side, gods including Brahma learn skills to find him. We people engage in tasteless skills to disregard
existence of GOD.
Annamayya has said many times that we may never know God as we can differentiate day or night. With heavy heart Annamayya stated that man is ignoring God by engaging in tasteless deeds.
For a more detailed explanation, suggest you to refer the verse siri dolaMkeDipagalu chIkaTA yitaDEmi (సిరి దొలంకెడి పగలు చీకఁటా యితఁడేమి)
భావము మరియు వివరణము: భగవంతుడైన వెంకటేశ్వరుని మనసులో భావించి, బ్రహ్మతో సహా దేవతలందరూ అతన్ని కనుగొనే నైపుణ్యాలను (ఎప్పటికప్పుడు) నేర్చుకుంటూ వుంటారు. మనము దేవుని ఉనికిని విస్మరించడానికి రుచిలేని (వెగటుకొలుపు) నైపుణ్యాలలో నిమగ్నమై ఉన్నాము.
అన్నమయ్య దైవమును మనము పగలూ రేయీ తెలియునటుల ఎన్నటికీ తెలియమని అనేకమార్లు చెప్పారు. పెళుచు పనులలో మానవుడు చిత్తముంచి, దైవమును విస్మరిస్తున్నాడని
అన్నమయ్య అవేదనతో పేర్కొనిరి.
ఇంకా విపులమైన వివరణకు సిరి దొలంకెడి పగలు చీకఁటా యితఁడేమి అనే కీర్తన చూడగలరు.
zadaz
Reference:
Copper Leaf: 15-3, Volume: 1-91
Very nice selection
ReplyDeleteధ్యానపూర్వకముగా నేర్వడమే చదువు. అనుదినము/అనుక్షణము తాజాగా అభ్యసించుటయే చదువు.శరీరం, మనస్సు,ఆత్మ ఏకాగ్రచిత్తంతో అభ్యసించడమే ధ్యానం. అంటే విషయభోగముల నుండి విముఖమై అభ్యసించుట వివేకులు ఆచరించే ధ్యానపూర్వకమైన చదువు.ఆట్టివారికి నేర్చుకునే విషయాలపై ఎటువంటి సందేహములు ఉండవు. ఆట్టివారికి పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ఇది జ్ఞానులు అనుసరించే అభ్యాసం. అట్లు కాక,అనవసరమైన,వ్యర్థమైన ప్రసంగాలు,మాటల వలన నేర్వడంలో ధ్యానం కోల్పోయి, శ్రద్ధలేక విషయగ్రహణము జరుగదు.వారికి అనుక్షణం సందేహాలే మిగులుతాయి. అప్పుడిక చదువేది? ఇది అజ్ఞానులు అనుసరించే అభ్యాసక్రియ.
ReplyDelete*శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.*
మునుపటి తరాలలో అధ్యయనం/ అభ్యాసం/శిక్షణ యొక్క ఏకైక ధ్యేయం, పరమార్థం- భగవంతుడిని తెలిసికొనుటయే.
కాని, నేటితరంలో అధ్యయనం యొక్క లక్ష్యం - తెలిసే అంటే ఉద్దేశపూర్వకంగా భగవంతుణ్ణి మఱచిపోవటమే. యుగాలు/ తరాల మధ్య జ్ఞానం-అజ్ఞానం విషయంలో అంతరమిదియే.
కృతయుగంలో భగవంతుడున్నాడని గ్రహించి, అతని గురించి మరింతగా తెలిసికోవాలనే జిజ్ఞాసతో అభ్యసించేవారు. కాని నేటి కలియుగంలో అజ్ఞానవశమున, తద్భిన్నంగా దేవుని యునికిని ప్రశ్నించి, తిరస్కరించు వారున్నట్లు గొచరిస్తున్నది.
భగవంతుడైన శ్రీనివాసుని బ్రహ్మాది సమస్త దేవతలు అతనిని తెలిసికొని,కనుగొని,ప్రత్యక్షదర్శన భాగ్యమునకై సర్వవిధాల ప్రయత్నశీలురై యున్నారు.
అయితే మనము ఆ భగవంతుడి ఉనికిని విస్మరించుట కొఱకు చేసే క్రియలలో నిమగ్నులమై యుంటిమి.ఇది అజ్ఞానమే కదా!
🙏
ఓం శ్రీ సాయినాధాయ నమః
ReplyDeleteనిన్న ఏమిటో గుర్తుంటే అది నిద్ర అది ఏమిటో తెలియక పోతే అది మరణం అన్నారు ఎక్కిరాల భరద్వాజ గారు అంటే మనము నిన్న నేర్చుకున్న దాన్ని నేడు సదుపయోగం చేయకపోతే ఆ చదువుకు అర్థమే లేదని అద్భుతంగా ఈ పాటలో అన్నమాచార్యులవారు చెప్పారు అంటే భగవంతుడున్నాడని తెలుసుకోవడం ఒక మార్గం అయితే అది సరైన భావంలో అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవడాన్ని జ్ఞానము అంటారని ఈ పాటలో వివరించబడింది