Wednesday 14 July 2021

69. తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము (timmireDDi mAkunichche dishTamainapolamu)

ANNAMACHARYA

69. తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము

 

Introduction: Annamayya makes use of words like reddy to provide a sense of folk song in this verse. Reddys could be the dominant community in those days. He also made songs on Nayudu’s as well. On the first impression, it appears to be funny, but actually it conveys serious philosophical message.

These kind of songs known as తత్వములు (tatvamulu OR symbolic descriptions) are liable for interpretation.  Some have seen shades of Dashavatara (10 incarnations of SRI VISHNU) in this verse. To me it is crystal clear philosophical message. You may decide for yourself after the detailed explanation.

Chief message is consciousness is common to humanity. He makes many notable observations on what man makes with his life (out of ignorance).

ఉపోద్ఘాతము: ఈ కీర్తనలో జానపదం యొక్క భావాన్ని అందించడానికి అన్నమయ్య రెడ్డి వంటి పదాలను ఉపయోగించుకుంటాడు. ఈ రోజుల్లో లాగే, అన్నమయ్య  కాలంలో కూడా రెడ్లు  సమాజంలో  ఆధిపత్యం చెలాయించి ఉండివుంవచ్చు.  మొదట చూసినప్పుడు ఈ కీర్తన కొంత హాస్యాన్ని వెదజల్లినా, వాస్తవానికి ఇది ముఖ్యమైన తాత్విక సందేశాన్ని తెలియజేస్తుంది.

ఈ రకమైన తత్వములు లేదా సంజ్ఞలతో కూడి యున్న కీర్తనలను అనుకున్న భావానికి అనుగుణంగా మలచుకునే అవకాశం లేకపోలేదు. కొందరు ఈ కీర్తనలో దశావతార వర్ణనలు చూశారు. నాకైతే తాత్విక సందెశమే కనబడుతోంది. వివరణ చూసి మీరే నిర్ణయించ గలరు.

ముఖ్య సందేశం చైతన్యం మానవాళి కంతటికీ ఒకటేనని ప్రకటించారు. మనిషి తన జీవితంతో (అజ్ఞానం కొద్ది) ఏమి చేస్తాడనే దానిపై అతను చాలా ముఖ్యమైన పరిశీలనలు చేస్తాడు.

అన్నమయ్య భావుకతకు కీర్తన మరో నిదర్శనం. ఆయన గొడ్డలి, గడ్డపార​, కుంచము, రోకలి, తేలు, పాము, గుఱ్ఱము, కుక్క, వంటి పదాలు విరివిగా కీర్తనలలో వాడారు.

కళ్లంటూ ఉంటే చూసి,
వాక్కుంటే వ్రాసి!
ప్రపంచమొక పద్మవ్యూహం!
కవిత్వమొక తీరని దాహం!

అన్న మహాకవి శ్రీశ్రీ  పలుకులను ఆయన పుట్టకముందే ఋజువు చేశారు.

 

కీర్తన

తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము
బొమ్మిరెడ్డి కప్పగించి పోది సేసెఁ బొలము       ॥పల్లవి॥

 

నిండినట్టి మడుగుల నీరువంక పొలము
కొండలు మోఁచినపెద్ద గొబ్బరపుఁబొలము

అండనే పొలము రాజులుండేటి పొలము

చెండివేసి మాకులెల్లా సెలగినపొలము          ॥తిమ్మి॥

 

అసపడి వరదానమడిగిన పొలము

బాసలతోఁ గడు నెత్రుపట్టమైనపొలము

రాసికెక్కేమునులకు రచ్చైన పొలము

వేసరక నాఁగేట వేగిలైన పొలము        ॥తిమ్మి॥

 

మంచి గురుతైన రావిమానిచేని పొలము
వంచిన గుఱ్ఱముఁ దోలే వయ్యాళి పొలము
యెంచఁగ శ్రీవేంకటేశు నిరవైన పొలము
పంచుకొని లోకులెల్లా బ్రదికేటి పొలము         ॥తిమ్మి॥

 

Details and Explanations:

 

తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము
బొమ్మిరెడ్డి కప్పగించి పోది సేసెఁ బొలము              ॥పల్లవి॥
 
timmireDDi mAkunichche dishTamainapolamu
bommireDDi kappagiMchi pOdi sEse bolamu  ॥pallavi॥

 

Word to Word meaningతిమ్మిరెడ్డి (timmireDDi) = పరమాత్మ, God; మాకునిచ్చె (mAkunichche) దిష్టమైన (dishTamaina) = భాగ్యమైన, resourceful;  పొలము (polamu)  = field, బొమ్మిరెడ్డికి (bommireDDi ki)  = Annamayya indicated Brahma by the word  బొమ్మిరెడ్డి , however, for the purpose of our understanding, we take it as nature; ప్పగించి (appagiMchi) = to entrust, consign. commit  పోది (pOdi)  = {this word is a short version of word పోదికాఁడు = పోటుకాఁడు = meaning a capable person for combat; here and in some other verses also Annamacharya had used word పోది}, = వీరుడు,  our hero; సేసెఁ (sEse) = performed; బొలము (bolamu) = action, farming;

Literal meaning and Explanation: God gave a resourceful field for the person to act. Our hero, consigns it to nature (rather submits to nature) and thus performs action.

Kindly treat field mentioned above is body, mind and soul together. Obviously, your farm being cultivated by someone else is the point. Man has allowed the nature to take charge. Though our hero imagines himself to be the real farmer (in the sense of independent actor), factually it is the nature doing the farming

With the present attitude exhibited,  Annamacharya indicated that the individual has little control on the happenings of his life.

Ultimate sense of this chorus is, man instead of performing action, consigned it to nature. Thus by introducing third party “the Nature”, man becomes indirect actor. This Annamacharya do not approve. He wanted man to make direct relation with the god, not thru third party contract. 

Please refer to verse modaluMDa gonalaku mOchinILLuvOyanEla (మొదలుండఁ గొనలకు - మోచి నీళ్ళు వోయవేల) wherein, he does not mince words to affirm the vanity of pursuing known religious texts, religious conglomerations and public. He is absolutely clear that one needs to take shelter of god not the outfits. 

భావము మరియు వివరణము: దేవుడు వనరులన్నీ ఉన్న పొలాన్ని (లేదా క్షేత్రాన్ని మనకు) ఇచ్చాడుమనిషి, దానిని "ప్రకృతి"కి అప్పగించి (యధార్థానికి ప్రకృతికి లొంగిపోతాడనుకోండిచేతులు దులిపేసుకుంటాడు.

పైన పేర్కొన్న పొలము శరీరం, మనస్సు మరియు ఆత్మ కలిసి యున్న క్షేత్రం  అని గ్రహించండి. సహజంగానే, మీ పొలం వేరొకరిచే సాగు చేయబడుతోంది. ప్రకృతి బాధ్యతలు స్వీకరించడానికి మనిషే అనుమతించాడు. మన వీరుడు తనను తానే నిజమైన రైతు అని ఊహించుకున్నప్పటికీ, వాస్తవానికి అది  ప్రకృతి చేసే వ్యవసాయం.

ప్రస్తుతం ప్రదర్శిస్తున్న వైఖరితో, అన్నమాచార్యులు వ్యక్తికి తన జీవితంలో జరిగే సంఘటనలపై నియంత్రణ ఉండదని సూచించాడు.

ఈ పల్లవి యొక్క అంతర్లీన భావం మనిషి ప్రత్యక్ష చర్య చేయడానికి బదులుగా, దానిని ప్రకృతికి కౌలుకు అప్పగించాడు. ఈ విధంగా ప్రకృతిని మధ్యలో ఇరికించడం  ద్వారా మనిషి పరోక్ష నటుడు అవుతాడు. దీనికి అన్నమాచార్య అంగీకరించడు. అతను మధ్యవర్తుల  ద్వారా కాకుండా, ప్రతీ మనిషి దేవుడితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండాలని అతను కోరుకున్నాడు.

మొదలుండఁ గొనలకు - మోచి నీళ్ళు వోయవేల అన్న కీర్తనలో కూడా మత గ్రంథాలు, మత సంబంధమైన సమ్మేళనాలను సరంజామా లాంటివి అన్నారు. దైవమును మాత్రమే శరణనాలి కాని వస్తుసామగ్రిని అనుష్ఠించుట నిష్ప్రయోజన మన్నాడు.

 

నిండినట్టి మడుగుల నీరువంక పొలము
కొండలు మోఁచినపెద్ద గొబ్బరపుఁబొలము
అండనే పొలము రాజులుండేటి పొలము
చెండివేసి మాకులెల్లా సెలగినపొలము     ॥తిమ్మి॥
 
niMDinaTTi maDugula nIruvaMka polamu
koMDalu mOchinapedda gobbarapu bolamu
aMDanE polamu rAjuluMDETi polamu
cheMDivEsi mAkulellA selaginapolamu  timmi 

Word to Word meaning:  నిండినట్టి (niMDinaTTi) = filled to brim;  మడుగుల (maDugula) = water bodies; నీరువంక (nIruvaMka) = నీరుపారుటకు వీలైన​, suitably placed to receive water; పొలము (polamu) = Field;  కొండలు (koMDalu) = great mountains;  మోఁచిన (mOchina) = to bear, carry, support; పెద్ద (pedda) = big; గొబ్బరపుఁ (gobbarapu) = ఎరువు Manure; బొలము (bolamu) = field;  అండనే (aMDanE) = very close by, protection; పొలము రాజులు (polamu rAjulu) = owner of the filed; ఉండేటి (uMDETi) = existing;  పొలము (polamu) = field; చెండివేసి (cheMDivEsi) = ఖండించి, discarding; మాకులెల్లా (mAkulellA) =  మ్రాను,వృక్షము , trees; సెలగిన (selagina) = grown randomly;  పొలము (polamu) = field;

Literal meaning and Explanation: this filed has good water bodies nearby to supply water. It bears great mountains. It’s a big field blessed with suitable manures. The owners of the field stay next to it. Yet our hero, do not accept the owner and allowed trees to grow randomly making the travel in field difficult.

God gave great farm for the man to cultivate. It has manure (has capacity to discern). Owners of the field (God) stay next to it. Yet, man in his audacity, fails to recognize the true owner ( god). He rather rebels against him. In this context, would suggest reading detailed explanation  on the verse gu~r~rAla gaTTani tEru koMka keMdainA bArI (గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ).

Just imagine the chaos man created (and creating) in this world. You will acknowledge how accurate Annamayya is in using the wording cheMDivEsi mAkulellA selaginapolamu చెండివేసి మాకులెల్లా సెలగినపొలము (Denied the true owner and allowed trees to grow randomly making the journey of life tough.)

భావము మరియు వివరణము: పొలానికి నీటిని సరఫరా చేయడానికి సమీపంలో మంచి  వనరులను ఉన్నాయి. ఇది గొప్ప పర్వతాలను మోస్తోంది. ఇది తగిన ఎరువులతో విలసిల్లుతున్న పెద్ద క్షేత్రం. పొలం యజమానులు దాని పక్కనే ఉంటారు. ఇంకా మా వీరుడు, యజమానిని అంగీకరించక పోవడంతో పొలంలో చెట్లు యాదృచ్చికంగా పెరిగి  పోయాయి (దాంతో క్షేత్రంలో ప్రయాణం కష్టమవుతోంది).

దేవుడు మనిషికి పండించుకోడానికి గొప్ప పొలం ఇచ్చాడు. దీనికి ఎరువు (గుర్తించే సామర్థ్యం) ఉంది. పొలం యజమాని (దేవుడు) దాని పక్కనే ఉంటాడు. అయినప్పటికీ, మనిషి తన అవివేకంతో నిజమైన యజమానిని గుర్తించడంలో విఫలమవుతాడు.  పైగా భగవంతునిపై తిరుగుబాటు కూడా చేస్తాడు. ఈ సందర్భంలో, గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ అనే కీర్తనపై వివరణ చదవమని సూచన​.

ఈ ప్రపంచంలోని గందరగోళమంతా మనిషి సృష్టించినదే. (ఇప్పుడు ఊహించుకోండి "చెండివేసి మాకులెల్లా సెలగినపొలము"  = అసలు యజమానిని (దైవమును) ఖండించడంతో పొలంలో చెట్లు చెల్లా చెదురుగా పెరిగి  పోయాయి. దాంతో జీవన గమనము కష్టమైపోయింది).  అన్నమయ్య పదాలను ఎంత ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారో మీరు గమనించ గలరు.

అసపడి వరదానమడిగిన పొలము
బాసలతోఁ గడు నెత్రుపట్టమైనపొలము
రాసికెక్కేమునులకు రచ్చైన పొలము
వేసరక నాఁగేట వేగిలైన పొలము   ॥తిమ్మి॥
 
asapaDi varadAnamaDigina polamu
bAsalatO gaDu netrupaTTamainapolamu
rAsikekkEmunulaku rachchaina polamu
vEsaraka nAgETa vEgilaina polamu       ॥timmi॥

Word to Word meaning:  అసపడి (asapaDi) = desiring; వరదానమడిగిన (varadAnamaDigina) = sought after; పొలము (polamu) = field; బాసలతోఁ (bAsalatO) = many promises, many vows;  గడు (gaDu) = too much;  నెత్రుపట్టమైన (netrupaTTamaina) =  kingdom of blood = bloodshed;  పొలము (polamu)  = field; రాసికెక్కే (rAsikekkE) = గణనకెక్కు, ప్రసిద్ధిచెందు, to be counted as great;  మునులకు (munulaku) = sages;  రచ్చైన (rachchaina) = సభ, రాజమార్గము, assembling place; thoroughfare;  పొలము (polamu)  = field; వేసరక (vEsaraka) = without tiring; నాఁగేట (nAgETa) హలము, నాఁగలి, a plough;  వేగిలైన (vEgilaina)  = subjected to excessive trouble; పొలము (polamu)= field.

Literal meaning and Explanation: This field granted after seeking it. Many promises lead to bloodshed in the field. For all the great sages, this is the thoroughfare. Many untiring efforts to dig deep only troubled the field.

Annamacharya indicated that each and every life is precious in verse dibbalu veTTuchu dElina didivO (దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో). Yet man is so much gets engrossed by his affiliation to this body, lead to much mindless bloodshed. We all know that history is written with blood. 

rAsikekkEmunulaku rachchaina polamu (రాసికెక్కేమునులకు రచ్చైన పొలము) is symbolising that Meditation is the only tool available to man to reach God. The Great sages knew that their deliverance is inextricably linked to this field. 

vEsaraka nAgETa vEgilaina polamu (వేసరక నాఁగేట వేగిలైన పొలము) indicating that “Man realizing his present condition, constantly makes very bold attempts to wriggle out of it. All these only serve to injure the man himself. None of his innate ignorant actions can free him from bondage. However, man does not realise that the meditation is the only avail, but stupidly engages in other actions.”   

This observation is consistent with wording vEsarakumI jIvuDA vedakivedakidaivamunu  వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును in verse atisulabhaM bide "అతిసులభం బిదె"

 

భావము మరియు వివరణము: పొలము  మనిషి ఆశపడి ఎంచుకున్నదే. రణక్షేత్రంలో అనేకానేక వాగ్దానాల నేపథ్యంలో  రక్తపాతానికి దార్లు తెరుస్తాడు మానవుడు. గొప్ప  ఋషులందరూ ఎంచుకున్న రాజమార్గము కూడా క్షేత్రంలోని వ్యవసాయమే. పొలాన్ని లోతుగా త్రవ్వటానికి అనేక ప్రయత్నాలు క్షేత్రాన్ని ఇబ్బంది పెట్టాయే కాని ఫలితమివ్వలేదు

ప్రతి జీవి జీవితం ఎంతో విలువైనదని అన్నమాచార్యులు దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో అనే కీర్తనలో సూచించారు. ఐనప్పటికీ మనిషి ఈ శరీరం యొక్క అనుబంధంలో మునిగిపోతాడు. చాలా బుద్ధిహీనతో రక్తం చిందించడానికి వెనుదీయడు. మానవచరిత్ర నెత్తుటి చారలతో వ్రాయబడిందని మనందరికీ తెలుసు.

ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారి క్రింది పలుకులను గుర్తుకు తెచ్చుకుందాం.

నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం:
రణరక్త ప్రవాహసిక్తం
బీభత్సరస ప్రధానం. 

రాసికెక్కేమునులకు రచ్చైన పొలము: భగవంతుడిని చేరుకోవటానికి ధ్యానము మాత్రమే మనిషి వద్ద గల ఏకైక సాధనము. గొప్ప ఋషులకు వారి విమోచన ఈ క్షేత్రంతో వివరించలేని విధంగా ముడిపడి ఉందని తెలుసు.

వేసరక నాఁగేట వేగిలైన పొలము: మానవుడు తన స్థితిని గ్రహించి అందులోంచి బయట పడడానికి చాలా సాహసోపేతమైన ప్రయత్నాలు నిరంతరంగా చేస్తాడు. ఇవన్నీ మనిషి తనను తాను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఉపకరిస్తాయి. తన అజ్ఞాన జనితమైన చర్యలేమీ అతనిని బంధాల నుంచి విముక్తుణ్ణి చేయలేవు.  పైన పేరాలో పెర్కొన్న ధ్యానము తప్ప తక్కినవేవి అనువుగావని గ్రహించడు అన్న విషయాన్ని చెప్పారు.

ఈ పరిశీలన అతిసులభం బిదె కీర్తనలోని వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును అన్న పదాలను  సమర్ధిస్తోంది.

మంచి గురుతైన రావిమానిచేని పొలము
వంచిన గుఱ్ఱముఁ దోలే వయ్యాళి పొలము
యెంచఁగ శ్రీవేంకటేశు నిరవైన పొలము
పంచుకొని లోకులెల్లా బ్రదికేటి పొలము    ॥తిమ్మి॥
 
maMchi gurutaina rAvimAnichEni polamu
vaMchina gu~r~ramu dOlE vayyALi polamu
yeMchaga SrIvEMkaTESu niravaina polamu
paMchukoni lOkulellA bradikETi polamu           timmi

 

Word to Word meaning:  మంచి (maMchi) = good;  గురుతైన (gurutaina) = easily recognisable;  రావిమానిచేని (rAvimAnichEni) అశ్వత్థ వృక్షము; పొలము (polamu) వంచిన (vaMchina) = bent;  గుఱ్ఱముఁ (gu~r~ramu) = horse;   దోలే (dOlE) = drive; వయ్యాళి పొలము (vayyALi polamu) = బాగుగా పండు పొలము, high yielding field;  యెంచఁగ (yeMchaga) = if observed carefully; శ్రీవేంకటేశు (SrIvEMkaTESu) = Lord Venkateswara’s నిరవైన (niravaina) స్థిరమైన, అనుకూలమైన, suitable;  పొలము (polamu) = field; పంచుకొని (paMchukoni) = sharing; లోకులెల్లా (lOkulellA) = all the people of the universe;  బ్రదికేటి (bradikETi) = living;  పొలము (polamu) = field.   

Literal meaning and Explanation: This field is very easy to recognise due to the landmark of great banyan tree. The horse reined to drive; resulting high yielding field. That is the suitable place for the Lord Venkateswara. That is the field all people share and live in this world. 

Great banyan tree (రావిమాను) is referred in Bhagavad-Gita (chapter 15, Puruṣōttama prāpti yōgamu) to indicate the field of action. (Indirectly indicated that recognising God is as easy as noticing a banyan tree)

By word గుఱ్ఱముఁ (gu~r~ramu) Annamayya indicated the ever drifting mind. By stating వంచిన గుఱ్ఱముఁ (vaMchina gu~r~ramu) he indicated the horse has been reined. The wording  vaMchina gu~r~ramu dOlE vayyALi polamu (వంచిన గుఱ్ఱముఁ దోలే వయ్యాళి పొలము) indicates that man acquires extraordinary wisdom (intelligence) by harnessing his mind.

By పంచుకొని లోకులెల్లా బ్రదికేటి పొలము he stated that consciousness is shared by the entire world. Many great men agreed with this statement. Consider the words Madame de Stael, French Writer “The world is the work of a single thought, Expressed in a thousand different ways.

భావము మరియు వివరణము: గొప్ప రావి చెట్టు కొండగుఱుతుగా పొలాన్ని గుర్తించడం చాలా సులభం. గుర్రం మెడ వంచివుంది (గుర్రానికి లొంగదీసుకున్నారు); ఫలితంగా పొలము అధిక దిగుబడినిచ్చేదైంది. ఇటువంటిది వెంకటేశ్వరుడికి  అనువైన ప్రదేశం. ప్రపంచంలో ప్రజలందరూ పంచుకుని మరియు నివసించే క్షేత్రం అది.

భగవద్గీతలో (పురుషోత్తమ ప్రాప్తి యోగము నందు) గొప్ప అశ్వత్థ వృక్షముతో  క్షేత్రాన్ని సూచించారు. (అశ్వత్థ వృక్షమును ఎంత సులభంగా గుర్తించవచ్చో అంత సులభంగా దైవము ఉనికిని కనుగొనవచ్చని అంతర్లీన భావము.)

గుఱ్ఱము అనే పదం ద్వారా అన్నమయ్య స్థిరములేని మనస్సును వ్యక్తం చేశారు. వంచిన గుఱ్ఱము పదం ద్వారా  మనస్సును  స్వాధీనమునకుఁ దెచ్చుకున్న విషయాన్ని చెప్పారు. వంచిన గుఱ్ఱముఁ దోలే వయ్యాళి పొలము అని చెప్పి మనస్సును  స్వాధీనమునకుఁ దెచ్చుకున్న మనిషి అసాధారణ వివేకము (ప్రజ్ఞ) పొందుతాడని సూచించారు.

ఈ విధంగా స్థిరమైన మనస్సు దేవుడు నివసించడానికి సరైన ప్రదేశ మని చెప్పారు.

పంచుకొని లోకులెల్లా బ్రదికేటి పొలము = ప్రపంచం మొత్తనికి  స్పృహ  ఒకటేనని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో చాలా మంది మహాత్ములు ఏకీభవించారు. ఉదాహరణకు ఋగ్వేద సూక్తము 1-164 ఇదే చెబుతొంది  ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఒకే తత్త్వము... అనేక విధాలుగా ప్రవచింపబడుతోంది

 

Copper Leaf: 309-4  Volume 4-52

 

  

3 comments:

  1. జంతూనామ్ నరజన్మ దుర్లభం. అంటే అన్ని జన్మలలో సర్వోత్కృష్టమైన మానవజన్మ సులభముగా లభ్యమగునది కాదు.
    పరమాత్మను చేరుకొనుటకు తగిన కర్మల నాచరించుటకు మానవజన్మ అవకాశము నిస్తున్నది.కర్మ చేయుటకు సాధనమైన స్థూల శరీరం కేవలం మానవజన్మ యందే లభిస్తుంది.
    జ్ఞానప్రాప్తికి, తద్వారా మోక్షసాధనకు అత్యుత్తమమైన జన్మ మనుష్యజన్మ.

    భగవంతుడు స్థూలశరీరంతో బాటుగా మానవుడికి మనోబుద్ధ్యహంకారములు కూడా ప్రసాదించాడు.ఇలా అన్ని వనరులూ ఉన్న ఈ శరీరమనే క్షేత్రమును భగవంతుడు మనిషికి అనుగ్రహించాడు.ఆత్మ తప్ప పైన చెప్పబడిన మిగిలిన అన్ని అంశములను కలిపి శరీర క్షేత్రము అనవచ్చు.అంటే శరీరము క్షేత్రము, దానిని తెలిసినవాడు క్షేత్రజ్ణుడు అంటే ఆత్మ ఆని అర్థం చేసికొనివచ్చును.ఈరెండిటి మధ్యన గల తేడాను జ్ఞానం ద్వారా మాత్రమే తెలియనగును.

    అన్నమయ్య ఈ కీర్తనలో భగవంతుడు మనకిచ్చిన ఈ దేహమనే క్షేత్రం అనే మాధ్యమం ద్వారా క్షేత్రజ్ణుడైన ఆత్మను తెలుసుకొని పరమార్థము సాధించవలెనని నియమించాడు. కాని,అజ్ఞానమోహముల వల్ల మానవుడు బహిర్ముఖుడై,
    తాత్కాలికమైన ఆనందం, సుఖం కోసం ఆశాశ్వతము,
    దుఃఖదాయకము అయిన ప్రాకృతిక విషయముల యందు మనస్సును లగ్నమొనరించి, సంసారపంకిలము లో చిక్కుకొని, అనేక కర్మలను చేసి, వాటి ఫలాలను అనుభవించు చున్నాడని ఆధ్యాత్మిక బోధ చెస్తున్నాడు.

    మనిషికి సహజంగా విచక్షణాజ్ఞాన మున్ననూ,అవివేకం వలన ప్రాకృతికమైన విషయములకు లోలుడై, తనయందే, తనకు అతి సమీపంలో నున్న క్షేత్రయజమాని అయిన భగవంతుడిని గుర్తించకున్నాడు.అంతేకాదు. విషయవస్తువుల యందు మొహావేశితుడైన కారణంగా, మనస్సంతా కల్మషమై,జ్ఞానమునకు అవరోధంగా మారుతుంది.

    సుకృతఫలముగా దైవదత్తమైన మానవజన్మను సత్కర్మలతో, సజ్జన సాంగత్యంతో సార్థకం చేసుకోకుండా,మానవుడు
    దేహమనే ఉపాధిలో ఉంటూ అవివేకవశమున అనేకమైన దుష్కర్మలను చేస్తూ,క్షేత్రమందు రక్తపాతం అంటే అశాంతిని తనకు తానే సృష్టించుకొంటున్నాడు.
    వివేకవంతులైన ఋషులు, యోగులు మాత్రం ఇదే క్షేత్రమును సద్వినియోగం చేసుకొని ముక్తిమార్గమున పయనించి పరమాత్మను పండుచున్నారు.
    విషయోన్ముఖులయిన వారు ఈ వ్యవసాయ క్షేత్రమును బాగుగా లోతుగా దున్నిననూ,ఫలితమును పొందలేక విఫలమగు
    చున్నారు.కారణం వారిలో గూడు కట్టికున్న అజ్ఞానమనే తిమిరాంధకారం.

    ఇంద్రియనిగ్రహము మొదలైన సాధన సంపత్తి కలిగి, మనసేంద్రియములను వశపరచుకొన్న జ్ఞానులు అశ్వత్థవృక్షమును ఎంత సులభంగా గుర్తించవచ్చునో, అంత సులభంగా క్షేత్రజ్ణుడిని తెలిసికొనగలరు.అట్టి క్షేత్రం శ్రీవెంకటేశ్వరునికి అనువైనది, ప్రీతిపాత్రమైనది.

    ఇట్టి క్షేత్రం సర్వప్రాణులూ నివసించి పంచుకునేదే. కాని అట్టి ప్రకాశవంతమైన దైవాన్ని
    తిమిరాంధకారం లోనున్న అవివేకులు, అజ్ఞానులు పైన చెప్పిన కారణాల వలన ఎంత ప్రయత్నించినా ఎఱుగలేకున్నారు.

    *ఏకం సత్ విప్రా బహుధా వదంతి*
    (ఋగ్వేద సూక్తం 1-64)
    *సర్వం ఖల్విదం బ్రహ్మ*
    (ఛాందోగ్య ఉపనిషత్తులోని మహా వాక్యం)
    🙏

    ReplyDelete
  2. 👌👌 interesting allegorical folk song like poem with simple telugu words familiar with villagers.

    “ భగవద్గీతలో (పురుషోత్తమ ప్రాప్తి యోగము నందు) గొప్ప అశ్వత్థ వృక్షముతో క్షేత్రాన్ని సూచించారు. (అశ్వత్థ వృక్షమును ఎంత సులభంగా గుర్తించవచ్చో అంత సులభంగా దైవము ఉనికిని కనుగొనవచ్చని అంతర్లీన భావము.)

    గుఱ్ఱము అనే పదం ద్వారా అన్నమయ్య స్థిరములేని మనస్సును వ్యక్తం చేశారు. వంచిన గుఱ్ఱము పదం ద్వారా మనస్సును స్వాధీనమునకుఁ దెచ్చుకున్న విషయాన్ని చెప్పారు. వంచిన గుఱ్ఱముఁ దోలే వయ్యాళి పొలము అని చెప్పి మనస్సును స్వాధీనమునకుఁ దెచ్చుకున్న మనిషి అసాధారణ వివేకము (ప్రజ్ఞ) పొందుతాడని సూచించారు”

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...