Sunday, 2 January 2022

102. తమ వుద్యోగము లేల తమకము లేల (tama vudyOgamu lEla tamakamu lEla)

 PEDA TIRUMALACHARYA

102. తమ వుద్యోగము లేల తమకము లేల

(tama vudyOgamu lEla tamakamu lEla)

What is pursuit? 

Introduction: Peda Tirumalacharya is wondering why we need some or the other occupation? Is it must? Why we are so eager to achieve? Why so impatience?

I felt ashamed of myself on listening to this poem. I say it has probed my heart.  I am sharing my limited understanding on this extraordinary clan of philosophers. Of course, they crossed borders of generally accepted norms to criticise human nature. The poetry of Annamacharya clan are very deep and questions many of our fundamental assumptions. This verse is a perfect example such path braking statement.

Each one of us may say I am perfect to certain extent. What does this part perfection, in each of us translate to as a social unit? There are so many disparities. So much discrimination. So much vengeance. So much apathy. Where has this perfection gone?  Sir/ Madam! trying to be perfect is not an answer to our problems. That is what is explained in this poem.

ఉపోద్ఘాతము:  పెద తిరుమలాచార్యులు మనము ఏదో వొక  వృత్తి లేదా వ్యవసాయము లేదా ఉద్యోగము లేదా వ్యాసంగములలో  ఎందుకు చిక్కుకుంటున్నామని ప్రశ్నిస్తున్నారు. మనం ఎందుకు ఏదో సాధించాలనే తపనతో ఉన్నాము? మనలో ఎందుకంత అసహనం? ఈ కీర్తన వినగానే నన్ను చూసి నాకే సిగ్గనిపించింది. మనందరి హృదయ స్పందనలూ కలిపితే కూడా ఇదే భావము వెలువడవచ్చు. 

ముందే అనుకున్నట్లు అన్నమాచార్యుల వంశస్తుల రచనలు చాలా లోతైనవి మరియు మనం ఏర్పరుచుకున్న  ప్రాథమిక ఆధారాలను పునస్సమీక్షించేలా చేస్తాయి. ఈ అసాధారణ ప్రజ్ఞావంతుల రచనలపై నా పరిమిత అవగాహనను పంచుకోవడానికి మాత్రమే ఇది వ్రాస్తున్నాను. వాస్తవానికి, వారు నిద్రాణమైయున్న మానవజాతిని తట్టి లేపడానికి అనేక ప్రక్రియలు చేపట్టారనడనికి ఈ కీర్తన మంచి ఉదాహరణ​.

మనలో ప్రతి ఒక్కరూ నేను చాలా మట్టుకు పరిపూర్ణుడనని తమకు తాము నచ్చ చెప్పుకోవచ్చు. మనలో, ఒక్కొక్కరిలోని కొంత అసంపూర్ణతలు సమాజంపై ఏ రకంగా ప్రతిఫలిస్తున్నాయో గమనించారా? ఈనాటి అసమానతలకు, వివక్షలకు కారణం ఏవరో? మానవ జాతిని వేధిస్తున్న సమస్యలపై నిర్లిప్తతకు, ఉదాసీనతకు బాధ్యులెవరో? అయ్యలారా! / ఆమ్మలారా!  ఆదర్శవంతంగా ఉండటానికి ప్రయత్నించడం మానవ సమస్యలకు సమాధానం కాదు. అదే ఈ కవితలో చెప్పబడింది.

 

కీర్తన:

తమ వుద్యోగము లేల తమకము లేల

సముఁడై పుణ్యపాపాలు సాధించనేరఁడా ॥పల్లవి॥ 

పుట్టిఁచ నేర్చిన హరి పూఁచి రక్షింప నేరఁడా

వట్టి చింతతో జీవులు వగవ నేల
జట్టిగొని పదునాల్గు జగము లేలెడి వాఁడు
గట్టిగా నందరిఁ దానె కావ నేరఁడా       ॥తమ॥ 

అంతరాత్మైనవాఁడు అన్నియుఁదా నేరఁడా

వింతలుగా వేరె విన్నవించ నేల
సంతతమై గుణములు జవకట్టినట్టివాఁడు
కొంతనేర్పు నేరాలు కోరి తిద్ద నేరఁడా ॥తమ॥ 

యేలికై దాసులనెల్ల యేల నేర్చినవాఁడు

యీలీల సంపదలెల్ల యియ్య నేరఁడా
వాలించి శ్రీవేంకటాద్రి ప్రత్యక్షమయినవాఁడు
సోలిఁ దన మహిమలు చూప నేరఁడా  ॥తమ॥

 

tama vudyOgamu lEla tamakamu lEla

samuDai puNyapApAlu sAdhiMchanEraDApallavi 

puTTiMcha nErchina hari pUchi rakshiMpa nEraDA

vaTTi chiMtatO jIvulu vagava nEla
jaTTigoni padunAlgu jagamu lEleDi vADu
gaTTigA naMdari dAne kAva nEraDA tama 

aMtarAtmainavADu anniyudA nEraDA

viMtalugA vEre vinnaviMcha nEla
saMtatamai guNamulu javakaTTinaTTivADu
koMtanErpu nErAlu kOri tidda nEraDAtama 

yElikai dAsulanella yEla nErchinavADu

yIlIla saMpadalella yiyya nEraDA
vAliMchi SrIvEMkaTAdri pratyakshamayinavADu
sOli dana mahimalu chUpa nEraDA tama

 

 

Details and Explanations: 

తమ వుద్యోగము లేల తమకము లేల

సముఁడై పుణ్యపాపాలు సాధించనేరఁడా            ॥పల్లవి॥ 

tama vudyOgamu lEla tamakamu lEla

samuDai puNyapApAlu sAdhiMchanEraDA      pallavi 

Word to Word meaning: తమ (tama) = your; వుద్యోగము (vudyOgamu) =పని, యత్నము, పదవి, ప్రయాసము, పాటుపడుట, office, employment, business, occupation, profession, trade;  లేల (lEla) = Why (do you need)? తమకము లేల (tamakamu lEla) = త్వరపడుట ఏలా, మోహము లేల, విరహము లేల, Why Eagerness, Why ardour? Why Love? సముఁడై (samuDai) = being equanimous;  పుణ్యపాపాలు (puNyapApAlu) = both sinful and virtuous activities; సాధించనేరఁడా (sAdhiMchanEraDA)  = overcome, conquer. 

Literal meaning: Why engage in various avocations? Why this ardour? Being equanimous can you not overcome (the malice of) both sinful and virtuous activities? 

Explanationlet us remember the words of Frederick Douglass “A man is worked upon by what he works on. He may carve out his circumstances, but his circumstances will carve him out as well.” 

We take for granted that we must engage in one activity or the other.  From the above para we learn that we get influenced by this very activity. Let us try to understand what happens if we do not get engaged thus.

One may say idle brain is devil’s workshop. What has the world achieved by engaging in various occupations, from the time immemorial? We made world bereft of consideration. World of indifference. We feel compassionate by throwing a trifling at the deprived. What a generosity!

If you carefully observe, the man, from the time of bible to now, gets exercised by the very questions. With the advancement of technology, we may have achieved material comforts, but they are too trivial in comparison to the challenges of life.  

You might have noted the scriptures of Eastern Origin or Western Origin are being sought after more than ever before, because more youth and people are dissatisfied with material achievement alone. Is reading the scriptures take us anywhere?  (it is another activity! Man derives comfort from mental satisfaction instead action to eliminate the issues plaguing him)

Further to enunciate how our engagements colour our vision is well explained in the story below: 

After Prahlada ruled for a long time, Lord Vishnu said, "Come to my world." Then Prahlad replied “not only to me, but to all the people of my kingdom will”. Vishnu said, "They may not be as interested as you are. Since you like it, let everybody be ready for the Journey day after tomorrow."

Prahlada first goes to a young man asks him to come along with him to the world of Vishnu. The young man said, "Sir! my mother found a suitable girl for me. Tomorrow is my wedding. I can think about the union with Vishnu later."

Prahlada moved further. He asked a old woman to join him for the journey day after. Old woman said “O dear Lord Prahlada! Why so much hurry!! One can consider union with Vishnu after death. Right to night, my son is coming home after long time. I am busy in preparation of his favourite food”

Disillusioned Prahlada went further and found a pig lying in a muddy ditch with its eyes closed while its cubs were sucking milk. Prahlada asked the pig, "Will you join the journey to Vishnu day after tomorrow?" The pig replied, "You are our Maharaja, If you are offering, it must be a better place. I will come. However .."

Prahlada asked "But what?..."

Pig: Is there such a muddy hole in the Vishnu loka? 

(Alas! Prahlada went to Vishnu loka alone!)

Thus, one of the chief adversaries of our troubles is our avocation. You need strong mind to take up the decision. By the wording of the first line tamakamu lEla (తమకము లేల = why so much impatience, so much ardour?) Tirumalacharya is talking about the impromptu action man tends to take similar to the one mentioned in Bhagavad-Gita verse  3-37. This tamakamu is described as unquenchable in the referred Bhagavad-Gita verse.

The Bhagavad-Gita verse नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभु: (5-15) nādatte kasyachit pāpaṁ na chaiva sukṛitaṁ vibhuḥ clearly states that God does not take so called virtuous and sinful activities (పుణ్యపాపాలు) into consideration. These are the illusions human mind gets caught in.

Thus, the first line is signifying unfounded action of man. The second line is suggesting to remain equal distance from sinful and virtuous acts. Note, there are no neutral acts! Therefore, the chorus is asking to practitioner to remain watchful, but only to remain an observer. Thus the central idea of this is same as sahajAna nUrakunna (సహజాన నూరకున్న) means to stay where you are and do nothing. 

Implied meaning: Stop unfounded action. Carefully observe what’s going on. 

భావము: తమకు  వ్యవసాయములేలఉద్యోగము లేల? వ్యాపకములేలఈ ఆవేశము లేల? తమకము లేల? అసహనము లేల? సమదృష్టితో చూచి పుణ్యపాపాలు కలిగించు  ప్రభావములను (దుష్ప్రభావములను) అధిగమించలేరా? 

వివరణము: ఫ్రెడరిక్ డగ్లస్ చెప్పిన మాటలు మననము చేసుకుందాం. "చేసే పనిని బట్టి వ్యక్తి ఆలోచనలు, చుట్టువారి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాక​ అతడున్న పరిస్థితులు కూడా  అతనిని మలుస్తాయి".

మనం ప్రతీ క్షణమూ ఏదో ఒక  వ్యాపకములోనో  / కార్యములోనో  నిమగ్నమవ్వాలని అనుకుంటాము. పై పేరా నుండి మనం ఈ చర్యల ద్వారా ప్రభావితమవుతామని తెలుసుకున్నాము. అటువంటి వ్యాపకములు  లేకపోతే ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

పనిలేని మంగలివాడు పిల్లి తల గొరిగాడాని సామెత​.  చిరకాలము నుంచీ రకరకాల వృత్తులలో నిమగ్నమైన మానవులు ఏం సాధించారు? ఈ ప్రపంచంలోని నిర్దాక్షీణ్యానికి మూలమెవ్వరు? ఉదాసీనతకు కారణమెవ్వరు? అణగారిన వారిపై అరిగి పోయిన పైసలు విసిరి  మనము చాలా  కరుణమయులమని పొంగిపోతామే? ఎంత ఉదారులమో!

సాంకేతికత అభివృద్ధితో కొంత మనం భౌతిక సౌకర్యాలను సాధించి ఉండవచ్చు, కానీ జీవితంలోని సవాళ్లతో పోల్చినప్పుడు వాటి ప్రాధాన్యత మరీ తక్కువ​.  మీరు జాగ్రత్తగా గమనిస్తే, రామాయణ కాలం నుండి ఇప్పటి వరకు మనిషిని అవే ప్రశ్నలు వేధిస్తున్నాయని సులభంగా గమనించవచ్చు.

జనులు ప్రాగ్ పశ్చిమాలలో మత  గ్రంధాలను మునుపెన్నడూ లేనంత ఎక్కువగా చదువుతున్నారని మీరు గమనించి ఉండవచ్చు. ఎందుకంటే ప్రజలు సాంకేతికత కల్పించు భౌతిక సుఖాలతో త్వరగా అసంతృప్తి చెందుతున్నారు. మత గ్రంధాలను చదవడం వల్ల లాభమేమెటి? (ఇదీ మరొక వ్యాసంగమే కదా?)

మన వ్యాపకములు మన దృష్టి కోణాన్ని ఎలా మారుస్తాయో వివరించడానికి దిగువ కథనంలో బాగా వివరించబడింది.

ప్రహ్లాదుడు చాలా కాలం పరిపాలించిన తరువాత విష్ణు మూర్తి ఇంక నువ్వు నా లోకానికి వచ్చెయ్యి అనెను. అప్పుడు ప్రహ్లాదుడు నేనొక్కడినే కాదు, మొత్తం నా రాజ్యం లోని ప్రజలంతా కూడా వస్తారుఅన్నాడు. విష్ణుమూర్తి "నీకున్న ఆసక్తి వారికి వుండకపోవచ్చు. ఐతే నీ యిష్టం. ఎల్లుండి మధ్యాహ్నం అందరూ తయారై వుండండి" అనెను.

ప్రహ్లాదుడు ముందుగా ఒక యువకుడి దగ్గరకు వెళ్లి ఫలానా రోజు మనమందరం విష్ణుసాయుజ్యం పొందవచ్చు. రమ్మని చెప్పెను. అందుకా యువకుడు "అయ్యా! మా అమ్మ నాకు సరిజోడైన అమ్మాయిని చూసింది. రేపే నా పెళ్ళి.  విష్ణుసాయుజ్యం సంగతి మరలా చూడవచ్చును" అనె.

సరే అని ప్రహ్లాదుడు ముందుకు వెళ్ళి ఒక ముసలావిడని "విష్ణుసాయుజ్యం పొందడానికి" రమ్మనెను. దానికి ముసలావిడ "విష్ణు సాయుజ్యం చనిపోయిన తర్వాత చూసుకోవచ్చు; నా కొడుకు చాలా రోజుల తర్వాత ఇంటికి వేస్తున్నాడు. వాడికి ఇష్టమైన  పదార్ధాలు చేస్తునాను. ఖాళీగా లేను" అంది.​

చేసేదిలేక ప్రహ్లాదుడు ఇంకా ముందుకెళ్లి అక్కడ ఒక పంది బురదగుంటలో పడుకుని దాని పిల్లలు పాలు తాగుతుంటే  కళ్ళు మూసుకొని తన్మయత్వంలో ఉంది. ప్రహ్లాదుడు పందిని అడిగాడు "విష్ణు సాయుజ్యం పొందడానికి రేపు రోజు వస్తావా?’ దానికి ఆ పంది "నువ్వు మాకు మహారాజువి కాబట్టి నువ్వు చెప్పేది మంచిదే ఐవుంటుంది. వస్తాను. అయితే…"

ప్రహ్లాదుడు "అయితే?.."

పంది: మీరు చెప్పిన విష్ణు సాయుజ్యంలో ఇలాంటి బురదగుంట వుందా?

పాపం విష్ణు సాయుజ్యానికి ప్రహ్లాదుడు ఒక్కడే వెళ్ళాడు!

కాబట్టి, మన కష్టాలకు ప్రధాన విరోధులలో వ్యాసంగమొకటి. నిర్ణయం తీసుకోవాలంటే దృఢమైన మనస్సు కావాలి. తమకము లేలతో (= ఎందుకు అంత అసహనం, అంత ఆవేశం?) తిరుమలాచార్యుడు భగవద్గీత 3-37వ శ్లోకంలో పేర్కొన్నటువంటి అనాలోచిత​/ యాదృచ్ఛికముగా చేపట్టు ​ఆకస్మిక చర్యల గురించి మాట్లాడుతున్నాడు. ఈ శ్లోకంలో ఈ తమకము అణచివేయలేనిదిగా వర్ణించబడింది. ​​

భగవద్గీత 5-15 శ్లోకంలో నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః అని చెప్పి, భగవంతుడు మనము చేయు పుణ్యపాపాలను పరిగణలోనికి తీసుకొనడని స్పష్టం చేశారు. ఇవి కేవలం మానవులు తగులుకొని విలవిల్లాడు భ్రమలు మాత్రమే.

మొదటి పంక్తి మనిషి యొక్క నిరాధారమైన చర్యలను సూచిస్తుంది. రెండవ పంక్తి పాపం మరియు పుణ్యకార్యాల నుండి సమాన దూరం ఉండాలంటోంది. తటస్థ చర్యలు లేవని గమనిక! కాబట్టి, ఈ పల్లవి అభ్యాసకుడిని అప్రమత్తంగా ఉంటూ పరిశీలకుడిగా మాత్రమే పరిమిత మవ్వమంటోంది.  అందువలన దీని యొక్క ప్రధాన వుద్దేశం "సహజాన నూరకున్న (నూరకుండుమని)" అంటే మీరు ఉన్న చోటే ఉండి ఏమీ చేయకుండా గమనించమని.

అన్వయార్ధము: భ్రమపెట్టు చర్యలలో ఇరుక్కోకండి. ఏమి జరుగుతుందో నిష్పాక్షికంగా గమనించండి.

పుట్టిఁచ నేర్చిన హరి పూఁచి రక్షింప నేరఁడా

వట్టి చింతతో జీవులు వగవ నేల
జట్టిగొని పదునాల్గు జగము లేలెడి వాఁడు
గట్టిగా నందరిఁ దానె కావ నేరఁడా ॥తమ॥ 

puTTiMcha nErchina hari pUchi rakshiMpa nEraDA

vaTTi chiMtatO jIvulu vagava nEla
jaTTigoni padunAlgu jagamu lEleDi vADu
gaTTigA naMdari dAne kAva nEraDA     tama

 

Word to Word meaning: పుట్టిఁచ నేర్చిన (puTTiMcha nErchina) = who could create; హరి (hari) = Lord Hari; పూఁచి (pUchi) = take responsibility; రక్షింప నేరఁడా (rakshiMpa nEraDA) = can he not save? వట్టి (vaTTi) = empty, vacant, blank (here implying unfounded); చింతతో జీవులు (chiMtatO jIvulu) = living beings chew over sorrow; వగవ నేల (vagava nEla) = శోకించనేల​, విచారించనేల, why lament; why bemoan; జట్టిగొని (jaTTigoni) = వశపఱచుకొను, పదునాల్గు జగము లేలెడి వాఁడు (padunAlgu jagamu lEleDi vADu) = the one ruling the 14  worlds; గట్టిగా (gaTTigA) = ( implied meaning) clearly, without doubt;  నందరిఁ (naMdari) = all people of the world; దానె (dAne) = himself;  కావ నేరఁడా (kAva nEraDA) = can he not protect?      

Literal meaning: The creator Hari who brought us to this world, will he not be able to save us? Why do beings chew over sorrow and lament? The ruler of the fourteen worlds, will he not be able to protect all of us? 

Explanation: We may accept God is there. For the creator, is it difficult to save us? Of course not! Then many of us may question why is he not coming and saving us? 

We do not believe in God completely. We pray god while continuing our other preparations. What does the chorus stating, and what do we do? Obviously we are not following the true meaning of chorus. Then where is the question of deliverance?

భావము: పుట్టిఁచ నేర్చిన హరి పూఁచి రక్షింప నేరఁడావట్టి చింతతో (భ్రమలతో) జీవులు వగవగా నేల? పదునాల్గు జగము లేలెడి వాఁడిని జట్టిగొనిన గట్టిగా నందరిఁనీ తానె కావ నేరఁడా?

వివరణము: దేవుడు ఉన్నాడని మనం అంగీకరించవచ్చు. సృష్టికర్తకు, మనల్ని రక్షించడం కష్టమా? అస్సలు కానే కాదు! అలాంటప్పుడు ఆయన వచ్చి మనల్ని ఎందుకు రక్షించడం లేదని మనలో చాలామంది ప్రశ్నించవచ్చు.

మనం దేవుడిని పూర్తిగా నమ్మము. మన ఇతర సన్నాహాలు కొనసాగిస్తూనే మనము దేవుణ్ణి ప్రార్థిస్తాము. పల్లవి ఏమి చెబుతోంది? మరియు మనం నిజంగా ఏమి చేస్తున్నాము? సహజంగానే మనము  పల్లవి యొక్క నిజమైన అర్థాన్ని అనుసరించడం లేదు. అప్పుడు  పై ప్రశ్నకు అర్ధమే లేదు.

అంతరాత్మైనవాఁడు అన్నియుఁదా నేరఁడా

వింతలుగా వేరె విన్నవించ నేల
సంతతమై గుణములు జవకట్టినట్టివాఁడు
కొంతనేర్పు నేరాలు కోరి తిద్ద నేరఁడా      ॥తమ॥ 

aMtarAtmainavADu anniyudA nEraDA

viMtalugA vEre vinnaviMcha nEla
saMtatamai guNamulu javakaTTinaTTivADu
koMtanErpu nErAlu kOri tidda nEraDA  tama 

Word to Word meaning: అంతరాత్మైనవాఁడు (aMtarAtmainavADu) = the one forming the inner soul; అన్నియుఁదా నేరఁడా (anniyudA nEraDA) = అతడికి నీ గురించి అన్నీ తెలియకుండా ఉంటుందా? will he not know everything about you? వింతలుగా (viMtalugA) = తెలియదని అనుకుంటూ, as if something new, as if something odd; వేరె (vEre) = separately; విన్నవించ నేల (vinnaviMcha nEla) = why submit? సంతతమై (saMtatamai) = continuously, perpetually; గుణములు (guNamulu) = material nature;  జవకట్టినట్టివాఁడు (javakaTTinaTTivADu) = కూర్చిన వాడు, who joined you, who assembled you; కొంతనేర్పు (koMtanErpu) = some talent, నేరాలు (nErAlu) = faults and misdeeds; కోరి తిద్ద నేరఁడా (kOri tidda nEraDA) = Willingly  not capable of correcting? 

Literal meaning: The one forming the inner soul (the Antaratama), will he not know everything about you? (foolishly) Imagining he does not now, where is the need to submit what you want? The perpetual one, who assembled us with material nature, is he not capable of correcting our faults and misdeeds? 

Explanation: The word javakaTTinaTTivADu (జవకట్టినట్టివాఁడు = కూర్చిన వాడు, who assembled you) is used like प्रोता जगत्साक्षिणी (ప్రోతా జగత్సాక్షిణి) word used by Adi Shnakaracharya in Manisha Panchakam. The Lord, the God is described by the great man as universal witness. Thus, Peda Tirumalacharya is absolutely clear that we are assembled together by the universal witness. We shall discuss this matter in detail in later verses. 

You may wonder, particularly when HE is in full knowledge of you in entirety, why does he not correct us instantly?  Yes. This has happened to many saints. Only when we submit the whole, the body, the mind and the soul together, God is too eager to help. It’s the inaction (or wrong action) from our side. (Again, refer to the explanation on chorus). 

You might have noted, all the saints said this is possible for each and everyone of us. That is the essence of Annamacharya poems as well. 

భావము: ఆంతరాత్మైనవానికి అన్నియుఁ తానే తెలియ నేరఁడా? వింతలుగా వేరె విన్నవించ వలెనా? సంతతముండెడివాడు త్రిగుణములు మనను జవకట్టినట్టివాఁడు (పదార్థ సమ్మిళితముతో మనలను కూర్చిన వాడు) మనలోని కొంతనేర్పు, నేరాలు కోరి దిద్ద లేడా?

వివరణము: జవకట్టినట్టివాఁడు (= కూర్చిన వాడు) శంకర భగవత్పాదులు మనీషా పంచకములోని ప్రోతా జగత్సాక్షిణి (దారమువలె కనబడని జగత్తంతటికీ సాక్షి)ని సూచించుచున్నది. పెద తిరుమలాచార్యులు సార్వత్రిక సాక్షి మనందరినీ కూర్చిన వాడు అని పూర్తిగా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తరువాత కీర్తనలలో వివరంగా చర్చిద్దాం.

ప్రత్యేకించి ఆయనకు మీ గురించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు, తక్షణమే ఎందుకు సరిదిద్దుట​ లేదని మీరు ఆశ్చర్యపోవచ్చు? చాలా మంది ఋషులు తమ సమస్తమును (శరీరం, మనస్సు మరియు ఆత్మను) సమర్పించి సిద్ధిని పొందిరి. దేవుడు సహాయం చేయడానికి చేయి చాస్తున్నాడు. కానీ నిష్క్రియాత్మకత (లేదా పొరపాటు) మన వైపు నుండే. (పల్లవిపై వివరణము తిరిగి  చూడండి).

ముక్తి లేదా స్వేచ్ఛ మనలో ప్రతి ఒక్కరికీ సాధ్యమేనని ఋషులందరూ చెప్పారని మీరు గమనించి ఉండవచ్చు. అన్నమాచార్య కీర్తనల సారాంశం కూడా అదే.

యేలికై దాసులనెల్ల యేల నేర్చినవాఁడు

యీలీల సంపదలెల్ల యియ్య నేరఁడా
వాలించి శ్రీవేంకటాద్రి ప్రత్యక్షమయినవాఁడు
సోలిఁ దన మహిమలు చూప నేరఁడా        ॥తమ॥ 

yElikai dAsulanella yEla nErchinavADu

yIlIla saMpadalella yiyya nEraDA
vAliMchi SrIvEMkaTAdri pratyakshamayinavADu
sOli dana mahimalu chUpa nEraDA        tama

Word to Word meaning: యేలికై (yElikai) = రాజై, ప్రభువై, being the King, being the ruler; దాసులనెల్ల (dAsulanella) = all the servants (implied meaning: all the blessed men) యేల (yEla) = to rule; నేర్చినవాఁడు (nErchinavADu) = knows efficiently; యీలీల (yIlIla) = this way; సంపదలెల్ల (saMpadalella) = షోడశ-సంపదలు, all the 16 types of wealth; యియ్య నేరఁడా (yiyya nEraDA) = can he not provide? వాలించి (vAliMchi) = (అనుమానములను) ఖండించి, cutting across (the doubts);  శ్రీవేంకటాద్రి ప్రత్యక్షమయినవాఁడు (SrIvEMkaTAdri pratyakshamayinavADu) The god who appeared on the hill called Ventadri;  సోలిఁ (sOli) = మైమఱపు, తన్మయత్వము, state of being wholly absorbed;  దన (dana) = HIS; మహిమలు (mahimalu) = greatness, majesty, miracles; చూప నేరఁడా (chUpa nEraDA) = can he not display or exhibit? 

Literal meaning: HE, the ruler of these blessed men, can’t he shower the 16 types of wealth on all the people? Removing all the doubts, the god that appeared on the Venkatadri is HE not exhibiting (or displaying) his miracles to those wholly absorbed in him? 

Explanation: Now consider what Jiddu Krishnamurti said before he became famous, (year could be 1924 or 1925) “‘The fountain of Truth had been revealed to me and the darkness has been dispersed. Love in all its glory has intoxicated my heart; my heart can never be closed. I have drunk at the fountain of Joy and eternal Beauty. I am God intoxicated.’ Just understand miracles do happen. 

It is for the man, to prepare himself for the coming miracle. God remains neutral. He is equidistant to all. Jiddu Krishnamurti is a glaring example. He was brought up in western thinking, still his experience as cited above is matching with descriptions of Peda Tirumalacharyulu. 

భావము: యేలికై దాసులనెల్ల (హరిదాసులనెల్లా) యేల నేర్చినవాఁడు, యీలీల సంపదలెల్ల (షోడశ-సంపదలు) యియ్య నేరఁడా? అనుమానములను పటాపంచలు చేస్తూ శ్రీవేంకటాద్రిపై ప్రత్యక్షమయినవాఁడు తనయందే మైమఱచినవారికి, తనను పూర్తిగా గ్రహించిన వారికి మహిమలను ప్రదర్శించడం లేదా?

వివరణము: ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి ప్రసిద్ధి చెందడానికి ముందు ఏమి చెప్పాడో పరిశీలించండి, (సంవత్సరం 1924 లేదా 1925 కావచ్చు) “‘సత్యం యొక్క మూలస్థానం నాకు వెల్లడి చేయబడింది మరియు చీకటి చెదిరిపోయింది. దాని మహిమతో ప్రేమ నా హృదయాన్ని మత్తెక్కించింది; నా హృదయం ఎప్పటికీ మూసివేయబడదు. నేను శాశ్వతమైన సౌందర్యమును, చిన్మయానందమును ఆ నీటిధారలో తాగాను. నేను దేవుని మత్తులో ఉన్నాను.’ అద్భుతాలు ఈనాటికీ జరుగుతాయని అర్థం చేసుకోండి.

మనిషి, రాబోయే అద్భుతం కోసం తనను తాను సిద్ధం చేసుకోవాలి. దేవుడు తటస్థంగా ఉంటాడు. అతను అందరికీ సమాన దూరంలో ఉన్నాడు. జిడ్డు కృష్ణమూర్తి ఒక అద్భుతమైన ఉదాహరణ. అతను పాశ్చాత్యుల ఆలోచనలతో, ప్రభావముతోను పెరిగాడు, ఇప్పటికీ పైన పేర్కొన్న అతడి అనుభవం పెద తిరుమలాచార్యుల వర్ణనలతో సరిపోలుతోంది.

Suggested further Reading:  95. తహతహలిన్నిటికి తానే మూలము (tahatahalinniTiki tAnE mUlamu)

97. ఓడవిడిచి వదర వూరకేల పట్టేవు? (ODaviDichi vadara vUrakEla paTTEvu?)



Summary of this Keertana:

Why engage in various avocations? Why this ardour? Being equanimous can you not overcome (the malice of) both sinful and virtuous activities? (Implied meaning: Stop unfounded action. Carefully observe what’s going on) 

The creator Hari who brought us to this world, will he not be able to save us? Why do beings chew over sorrow and lament? The ruler of the fourteen worlds, will he not be able to protect all of us? 

The one forming the inner soul (the Antaratama), will he not know everything about you? (foolishly) Imagining he does not now, where is the need to submit what you want? The perpetual one, who assembled us with material nature, is he not capable of correcting our faults and misdeeds. 

HE, the ruler of these blessed men, can’t he shower the 16 types of wealth on all the people? Removing all the doubts, the god that appeared on the Venkatadri, is HE not exhibiting (or displaying) his miracles to those wholly absorbed in him?

 

కీర్తన సంగ్రహ భావము:

తమకు  వ్యవసాయములేలఉద్యోగము లేల? వ్యాపకములేలఈ ఆవేశము లేల? తమకము లేల? అసహనము లేల? సమదృష్టితో చూచి పుణ్యపాపాలు కలిగించు  ప్రభావములను (దుష్ప్రభావములను) అధిగమించలేరా? (అన్వయార్ధము: భ్రమపెట్టు చర్యలలో ఇరుక్కోకండి. ఏమి జరుగుతుందో నిష్పాక్షికంగా గమనించండి.)

పుట్టిఁచ నేర్చిన హరి పూఁచి రక్షింప నేరఁడావట్టి చింతతో ( భ్రమలతో) జీవులు వగవగా నేల? పదునాల్గు జగము లేలెడి వాఁడిని జట్టిగొనిన గట్టిగా నందరిఁనీ తానె కావ నేరఁడా?

ఆంతరాత్మైనవానికి అన్నియుఁ తానే తెలియ నేరఁడా? వింతలుగా వేరె విన్నవించ వలెనా? సంతతముండెడివాడు త్రిగుణములు మనను జవకట్టినట్టివాఁడు (పదార్థ సమ్మిళితముతో మనలను కూర్చిన వాడు) మనలోని కొంతనేర్పు, నేరాలు కోరి దిద్ద లేడా?

యేలికై దాసులనెల్ల ( హరిదాసులనెల్లా) యేల నేర్చినవాఁడు, యీలీల సంపదలెల్ల (షోడశ-సంపదలు) యియ్య నేరఁడా? అనుమానములను పటాపంచలు చేస్తూ శ్రీవేంకటాద్రిపై ప్రత్యక్షమయినవాఁడు తనయందే మైమఱచినవారికి, తనను పూర్తిగా గ్రహించిన వారికి మహిమలను ప్రదర్శించడం లేదా?

 

Copper Leaf: 28-4  Volume 15-162

8 comments:

  1. Very nice explanation.... I heard another story similar to Prahlada's. Your way of connecting eastern and western thoughts is fascinating....

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. You are doing a great job. You may publish your work into a e-book once you complete all verses.

    ReplyDelete
  4. భ్రమలో పడి మనమనేక పాపపుణ్యకర్మల వ్యాపకాలలో నిమగ్నమై వాటియందు చిక్కుకొంటున్నాము. ప్రహ్లాదుని కథనం ద్వారా ఈ విషయాన్ని శ్రీనివాస్ గారు విడమరచి చెప్పారు. రజోగుణము వల్ల ఉద్భవించే కామక్రోధాదుల మూలంగా మనిషి వినాశనమునకు గురి అవుతున్నాడని కర్మయోగంలో భగవానుడు స్పష్టంగా ఉపదేశించియున్నాడు.తిరిగి కర్మసన్యాస యోగములో గీతాచార్యుడు వివేకం అజ్ఞానంచే కప్పబడినందువలన భ్రమకు లోబడి మానవుడు చేసే పాపపుణ్య కర్మలలో తాను పాలు పంచుకోనని సుస్పష్టం చేశాడు
    .స్థావరజంగమాలను సృష్టించి, అంతరాత్మయైన వానికి మనలను తరింపజేయలేడా? తనయందే మైమఱచి, ధ్యానించి, రమించేవానికి భగవంతుడు నావయై సంసారసాగరాన్ని దాటిస్తాడని పెద తిరుమలాచార్యులు ఈ కీర్తనలో చాలా స్పష్టంగా వివరించారు.
    శ్రీనివాస్ గారి వ్యాఖ్యానం కీర్తనసారాన్ని మనకు సులభంగా అర్ధమయ్యేలా చేసింది. 🙏
    కృష్ణ మోహన్ పసుమర్తి

    ReplyDelete
  5. సాక్షీ భూతంగా, ప్రశాంతంగా ఉండాలి. నిజమే! కానీ, కర్మ సన్యాసం చేస్తూ సాక్షీ భూతంగా ఉండటం సన్యాసాశ్రమం తీసుకున్న వారికి మాత్రమే సాధ్యం. గృహస్థ ఆశ్రమంలో కర్మ సన్యాసం కూడదని, అది తామసిక లక్షణమని భగవానుడే అర్జునునికి బోధించాడు. పాప పుణ్యాలకు సమదూరంలో ఉండటం అంటే, కౌరవుల దుర్మార్గాలను సహిస్తూ, యుద్ధం చెయ్యకుండా పాండవులు సహనంతో జీవితాంతం ఉండాలనే అర్థం వస్తుంది. కానీ, నీ క్షత్రియ ధర్మం ప్రకారం "యుద్ధం చెయ్యి" అనేది భగవానువాచ. దీనిని బట్టి, గృహస్థ ఆశ్రమంలో ఉండే మనిషి సమాజంలో జీవిస్తున్న కాలమంతా విహిత కర్మలు ఆచరిస్తూ, కర్మఫలం యెడల సాక్షీ భూతంగా ఉండాలి అనే అనిపిస్తుంది._ ఈదర విద్యా సాగర్ 9440185393

    ReplyDelete
    Replies
    1. బాగుంది విద్యాసాగర్ గారు. ధర్మవిహిత కర్మలను ఆచరిస్తూ కర్మఫలము నందు అనాసక్తుడై యుండాలనే పరమాత్మ అర్జునుడికి ఉపదేశించి
      యుద్ధోన్ముఖుడిని చేశాడు.
      కృష్ణ మోహన్

      Delete
  6. విష్ణువు మహిమలే విహిత కర్మములు
    విష్ణుని పొగడెడి వేదంబులు
    విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
    విష్ణువు విష్ణువని వెదకవో మనసా|| ||భావము||
    చ|| అచ్యుతు డితడే ఆదియు నంత్యము
    అచ్యుతుడే అసురాంతకుడు
    అచ్యుతుడు శ్రీ వేంకాలాద్రి మీద నిదె
    అచ్యుత అచ్యుత శరణనవో మనసా|| ||భావము|

    ReplyDelete
  7. తన తండ్రి ఆన్నమయ్య కు తగిన కొడుకుగా పెద్దతిరుమలయ్య అద్భుతమైన సంకీర్తన మనకందించాడు. శ్రీనివాస్ గారి వివరణ అనేక జీవన కోణాలని స్పృశిస్తూ చాలా అర్థవంతంగా, సులువుగా ఉంది. జ్ఞానాన్ని పంచుతున్నందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...