Saturday 8 January 2022

103. ఇంతగాలమాయను యేడనున్నారో వీరు (iMtagAlamAyanu yEDanunnArO vIru)

 ANNAMACHARYA

103. ఇంతగాలమాయను యేడనున్నారో వీరు

(iMtagAlamAyanu yEDanunnArO vIru)

 We are not given a Good life or a Bad life.

We are given a life.
Its up to us to make Good or Bad.
-Gautam Buddha 

Introduction: In this really beautiful, highly inward looking and philosophical poem Annamacharya is talking about common tendency of humans to blame it on someone or the other. This unbelievable philosopher does not stop at criticism but showing the way forward.

All the relationships we make are invariably in anticipation of something. Unfortunately, very often, these hopes get belied at one point or the other in life, leading to disillusion. 

The main thing said in this poem is “do not waste time in finding faults in self and others. Rather look for answers within. When man submits to God with the ultimate understanding that there is no one else to save, there is no doubt his prayers will be answered.”

The purpose of these commentaries is not only to provide the literal meaning, but also substantiate common words used by Annamacharya which we take for granted that we understand. I am trying to make the explanation as short as possible, but some chorus and poems require bit more elucidation to bring out the essence of the poem.

ఉపోద్ఘాతము:  నిజంగా అందమైన, అంతర్వీక్షణ ప్రధానమైన ఈ తాత్విక కీర్తనలో అన్నమాచార్యులు, మానవులు తమ వైఫల్యాలకు ఎవరోవొకరిపై నిందలు మోపు  ధోరణిని విమర్శంచారు. అలవోక పదములతో అలవికాని అర్ధములను పొదుగు ఈ తత్వవేత్త విమర్శలతో ఆగిపోడు, ముందుకు వెళ్ళే మార్గాన్ని చూపాడు. 

మానవ సంబంధాలన్నీ ఏదో ఒకటి ఆశించియో, ఒకటి అపేక్షించియో ఉంటాయి. తరచుగా, దురదృష్టవశాత్తు,  ఆ బంధాలు ఏదోవొక  సమయంలో నిరాశలకు నిస్పృహలకు దారి  తీస్తాయి. 

ఈ కీర్తనలో చెప్పబడిన ప్రధాన విషయం ఏమిటంటే “తనలోను మరియు ఇతరులలోను తప్పులు కనుగొనడంలో సమయాన్ని వృథా చేయవద్దు. బదులుగా సమాధానాల కోసం నీలోనే అన్వేషించు. రక్షించడానికి దేవుడొక్కడే అనే అంతిమ అవగాహనతో మనిషి దేవునికి సమర్పించుకునప్పుడు, అతని ప్రార్థనలు సఫలీకృతమగునని చెప్పడంలో సందేహం లేదు.  

ఈ వ్యాఖ్యానాల ఉద్దేశ్యం సాహిత్యపరమైన అర్థాన్ని అందించడమే కాదు, అర్ధమైనట్లుగా అగపడి అర్థం కాని పదాలను విశ్లేషించడనికి కొంత భాగము కేటాయిస్తునాను.  కొన్ని 'పల్లవి'లు కొరకరాని కొయ్యలే. వాటితో కొంచెం కుస్తీపట్టవలసి వస్తోంది. వివరణను వీలైనంత చిన్నదిగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ కొన్ని కీర్తనలకు భావాన్ని వెలికి తీసుకురావడానికి కొంచెం (ఎక్కువ) నిడివి అవసరమౌతోంది.

కీర్తన:

ఇంతగాలమాయను యేడనున్నారో వీరు

వింతలై యడవిఁ గా సే వెన్నెలాయ బ్రదుకు ॥పల్లవి॥ 

యేలేవారి దూరితి యెడరు వుట్టినవేళ

కాలమును దూరితిని కలఁగేవేళ
తాలిమిలేని వేళ తగుఁగర్మము దూరితి
యేలాగని కాచేవారి నెవ్వరిఁ గానము   ॥ఇంత॥ 

దైవమును దూరితి తమకించినట్టివేళ

కావించి నన్నే దూరితిఁ గాఁగినవేళ
సోవగాఁ గోపపు వేళ చుట్టాల దూరితిమి
యీవలఁ దోడైనవారి నెవ్వరిఁ గానము ॥ఇంత॥ 

పుట్టుగు దూరితిమి పోరానియట్టివేళ

కట్టఁగడ నెందువంకఁ గానమైతిమి
జట్టి శ్రీవేంకటేశుఁడు శరణంటేనే కాచె
యిట్టె యింతటివారు యెవ్వరును లేరు ॥ఇంత॥ ॥

 

iMtagAlamAyanu yEDanunnArO vIru

viMtalai yaDavi gA sE vennelAya braduku pallavi 

yElEvAri dUriti yeDaru vuTTinavELa

kAlamunu dUritini kalagEvELa
tAlimilEni vELa tagugarmamu dUriti
yElAgani kAchEvAri nevvari gAnamu   iMta 

daivamunu dUriti tamakiMchinaTTivELa

kAviMchi nannE dUriti gAginavELa
sOvagA gOpapu vELa chuTTAla dUritimi
yIvala dODainavAri nevvari gAnamu    iMta 

puTTugu dUritimi pOrAniyaTTivELa

kaTTagaDa neMduvaMka gAnamaitimi
jaTTi SrIvEMkaTESuDu SaraNaMTEnE kAche
yiTTe yiMtaTivAru yevvarunu lEru    iMta

Details and Explanations: 

ఇంతగాలమాయను యేడనున్నారో వీరు

వింతలై యడవిఁ గా సే వెన్నెలాయ బ్రదుకు ॥పల్లవి॥ 

iMtagAlamAyanu yEDanunnArO vIru

viMtalai yaDavi gA sE vennelAya braduku pallavi 

Word to Word meaning: ఇంతగాలమాయను (iMtagAlamAyanu) = so much time elapsed;  యేడనున్నారో (yEDanunnArO) = where are; వీరు (vIru) = these people; వింతలై (viMtalai) = విశేషముగా, విచిత్రముగా, oddly, peculiarly;  యడవిఁ (yaDavi) = the forest;  గా సే (gA sE) = shower; వెన్నెలాయ (vennelAya) = like the moonlight;  బ్రదుకు (braduku) = this life. 

Literal meaning: So much time elapsed, where are these people? Peculiarly life has got wasted like the moon light on desolate forest (thus got wasted). 

Explanation: What is this elapsed time? Time to internally get convinced that the God is the only saviour. If we do not realise in due time, the life becomes futile. 

Who are these people Annnamacharya referring? They could be parents, wife, children, relatives, friends. These people kindle hope(s) in you. We run after these and only to know in the end that it’s like chasing a mirage. 

The wording aDavi gA sE vennela (అడవిఁ గా సే వెన్నెల), here in this context, means available (beautiful) time spent on worthless thing. Thus implying “priceless life spent in vanity”. 

Therefore, Annamacharya is saying as many days as you are engaged with these near and dear people, engaged in your favourite activities, still man continues in misery, and will miss what is life. 

Now let us try to understand what he meant by life? There is no direct answer. Most philosophers said what life is not. Therefore, it is little difficult to understand. When we get close to this foggy subject, knowledge (Gyan), action (= perceiving, observation), sound (music), Art, Love (compassion), beauty, time, life and the self becomes indistinguishable. Philosophers play with these (words) only to create further confusion in the mind. Therefore, as rational people, let us accept it as unclear subject, but appreciate that is vital to make life more meaningful. 

Its like a new driver who just learnt driving, but has not experienced the real traffic. He remains careful and follow the rules strictly. Most often such drivers actually drive well.  Those who know driving tends to make mistakes. Unfortunately, this life, like driving has, does not have ‘rules’ to follow. we take the available freedom for granted to make mess of life is the essence of this chorus.

Without getting into controversial issues, we take it as something that is signifying life’s critical pointers like birth and death. Since we are already born and are here, we know the next pointer to any one of us, on life is death. After the next pointer, we go into oblivion. If at all, the only chance is to know/experience life is before that next pointer. (refer to wording  puTTuTa saMSayamupOvuTa niSchayamu / voTTi vij~nAnulaku nupamidi okaTE "పుట్టుట సంశయము పోవుట నిశ్చయము / వొట్టి విజ్ఞానులకు వుప మిది వొకటే"in Annamacharya verse inni chaduvanEla)

Let us examine the Bhagavdgita verse below. 

त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन |
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्
|| 2-45||

trai-guya-vihayā vedā nistrai-guyo bhavārjuna
nirdvandvo nitya-sattva-stho niryoga-k
hema ātmavān

Purport: The Vedas deal with the three modes of material nature, O Arjun. Rise above the three modes to a state of pure spiritual consciousness. Freeing yourself from dualities, eternally fixed in Truth, and without concern for material gain and safety, be situated in the self.

This roughly translates that man should pursue truth as the only assignment, setting aside his material nature and without consideration of his safety.  

Interestingly see the similar statement from bible. Matthew 16:24–26 (NKJV) “Then Jesus said to His disciples, ‘If anyone desires to come after Me, let him deny himself, and take up his cross, and follow Me. For whoever desires to save his life will lose it, but whoever loses his life for My sake will find it. For what profit is it to a man if he gains the whole world, and loses his own soul? Or what will a man give in exchange for his soul?’”

Now see the statement of Jalaluddin Rumi: "Would you become a pilgrim on the road of love? The first condition is that you make yourself humble as dust and ashes."

Combining the above statements, we understand that life is not we know, what we enjoy, what we consider, what we value.  One thing clear from these statements is one cannot be something (saint, king, officer, soldier, musician, artist, knowledgeable, widely read) etc.  What use is of moulding a life to what it is not. “O man, you are just deceiving yourself. Open your eyes before it is too late" is the message of this chorus. 

Implied meaning: O man! You ran after these people for long. Enough. Now open your eyes. Live the life. 

I know there are many advertisements saying Live the life King Size etc.  Sir/Madam, life is not a treasure to keep in your purse and feel great about. 

Before we conclude on the chorus, have a good look at the picture below by renowned artist the M C Escher



 
Douglas Hofstadter says each of two hands draws the other: a two-step Strange paradoxical Loop. Life is similar to the above picture, but contains many more paradoxes. 

భావము: ఎంతో కాలము గడిచిపోయింది. వీరు ఎక్కడ ఉన్నారో? అయ్యో! విచిత్రంగా జీవితమంతా అడవి గాచిన వెన్నెలాయనే.

వివరణము: ఈ గడిచిపోయిన సమయం ఏమిటి? భగవంతుడు మాత్రమే రక్షకుడని మానవుడు తనలో తాను ఒప్పుకునే వరకు పట్టు సమయం. సరియైన సమయంలో గ్రహించకపోతే, జీవితమంతా వ్యర్థమే. చేతులు కాలాక ఆకులు పట్టుకుని యేమి లాభము?

అన్నమాచార్యులు ప్రస్తావిస్తున్న ఈ వ్యక్తులు ఎవరు? వారు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులో ఎవరైనా కావచ్చు. వారు ఏమి చేస్తారు? మనలో ఆశ(ల)ని రేకెత్తిస్తారు. మనము వాటి వెంట పరుగెత్తుదుము.  ఈ యాతన ఎండమావిని వెంబడించడం లాంటిదని ఎప్పటికో తెలుసుకుంటాము. అప్పటికే సమయాతీతమై పోతుంది.

'అడవిఁ గా సే వెన్నెల' అంటూ అమూల్యమైన జీవితం వ్యర్థంగా గడపకు అని హెచ్చరించారు.

అందువల్ల, మనము ఈ సన్నిహితులు మరియు ప్రియమైన వ్యక్తులతో నిమగ్నమై ఉన్నన్ని రోజులు, మీకు ఇష్టమైన కార్యకలాపాలలో పూర్తిగా మునిగిపోయి ఉన్నంత కాలమూ  జీవితము కాని దానిలోనే కొనసాగుతున్నామని గ్రహించమని అన్నమాచార్యులు చెబుతున్నాడు.

ఇప్పుడు అన్నమాచార్యులు చెబుతున్న జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనికి సూటిగా సమాధానం లేదు. చాలా మంది తత్వవేత్తలు జీవితం కానిదేమిటో చెప్పారు. అంతే! అందువల్ల, అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఈ అస్పష్టమగు విషయానికి దగ్గరగా వచ్చినప్పుడు, జ్ఞానము, చర్య (= గ్రహించడం, పరిశీలన), ధ్వని (సంగీతం), కళ, ప్రేమ (కరుణ), అందము, సమయము, జీవితము మరియు నేను అనే వాటికి బేధము లేకుండా పోతుందన్నది తెలియుచున్నది. తత్వవేత్తలు వీటిని రకరకాలుగా చెప్పి మన మనస్సులలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తారంతే! కాబట్టి, హేతుబద్ధమైన వ్యక్తులుగా, దానిని జిగిబిగి  అంశంగా అంగీకరించడమే ముఖ్యము. 'నాకు తెలుసు' అనుకోవడమే వదలతగినది.

వివాదాస్పద అంశాల్లోకి పోకుండా, జననము మరియు మరణములే  జీవితానికి  'సూచిక'లుగా  తీసుకుందాము. మేము ఇప్పటికే పుట్టాము కాబట్టి, మనలో ఎవరికైనా తదుపరి 'సూచిక' మరణమేనని తెలుసు. తదుపరి 'సూచిక' తర్వాత ఏమగునో యెవ్వరూ చెప్పలేరు. తదుపరి 'సూచిక'కు మునుపే జీవితమును తెలియుటకు వీలు గలదని గ్రహించడమే ఒకేవొక తిరుగులేని సత్యము. (అన్నమాచార్యుల కీర్తన ఇన్ని చదవనేల లోని "పుట్టుటసంశయము పోవుట నిశ్చయము / వొట్టి విజ్ఞానులకు వుప మిది వొకటే" అధారముగా)

 

కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాడిని ఊహించండి. అతను జాగ్రత్తగా ఉంటాడు మరియు నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాడు.  సామాన్యముగా ఇటువంటి డ్రైవర్లు వాస్తవానికి బాగా డ్రైవ్ చేస్తారు. డ్రైవింగ్ తెలిసిన వారు నియమాలను గాలికి వదలి తప్పులు చేస్తుంటారు. దురదృష్టవశాత్తూ, ఈ జీవితంలో, డ్రైవింగ్‌లో ఉన్నట్లుగా, అనుసరించాల్సిన 'నియమాలు' లేవు. అందుబాటులో ఉన్న 'స్వేచ్ఛ'పై మనం చిన్నచూపు చూసి జీవితాన్ని అస్తవ్యస్తము చేసుకుంటాం అనేది ఈ పల్లవి యొక్క అంతర్లీన​ సారాంశం. 

క్రింది భగవద్గీత శ్లోకాన్ని పరిశీలిద్దాం. 

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున
నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్
।। 2-45 ।। 

ఓ అర్జునా! వేదములు (అందలి పూర్వభాగమగు కర్మకాండము) త్రిగుణాత్మకములగు సంసార విషయములను తెలుపుననిగా నున్నవి. నీవు త్రిగుణములను వదలినవాడవును, ద్వంద్వములు లేనివాడవును, శుద్ధ సత్యము నాశ్రయించిన వాడవును, యోగక్షేమముల దృష్టి లేనివాడవును, ఆత్మజ్ఞానివియు కమ్ము. 

మనిషి తన భౌతిక/విషయ స్వభావాలను అధిగమిస్తూ మరియు భద్రతను లెక్క చేయక ఏకైక లక్ష్యముగా సత్యాన్వేషణ కొనసాగించాలని స్థూలంగా అర్ధము. 

ఇలాంటిదే, బైబిల్ నుండి ఈ ఆసక్తికరమైన అంశాన్నీ చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడలతన్నుతాను ఉపేక్షించుకొనితన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనునునా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించు కొనును.” ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టు కొనిన యెడల, లేక నష్టపరచుకొనిన యెడల వానికేమి ప్రయోజనము?” (ముత్తయి 16:24-26) 

ఇప్పుడు జలాలుద్దీన్ రూమీ ప్రకటన చూడండి: మీరు ప్రేమ మార్గంలో యాత్రికుల వుదామని అనుకుంటున్నారా? ఒకే షరతు ఏమిటంటే, మీరు ధూళిలాగా మరియు బూడిదలాగా అణకువగా ఉండుట నేర్వండి. 

పై ప్రకటనల్న్నింటినీ కలిపి చూస్తే, జీవితం అంటే మనం ఆనందించేది, పరిగణించేది, విలువైనది మొదలుగా గల ఊహల​ వంటిది కాదని అర్థం. జీవితం ఒక సాధువుగానో, రాజుగానో, అధికారిగానో, డాక్టరుగానో, సైనికుడుగానో, సంగీతకారుడుగానో, కళాకారుడుగానో, జ్ఞానవంతునిగానో, విస్తృతంగా చదివేవానిగానో మారడంకాదు. అట్టి జీవితాన్ని గడపడం వల్ల ప్రయోజనం ఏమి? “ఓ మానవుడా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆలస్యం కాకముందే కళ్లు తెరవు" అనేది ఈ పల్లవి సందేశం. 

అన్వయార్ధము: ఓ మానవుడా! వీరి వెంట చాలా కాలం పాటు పరుగెత్తావు. ఇక చాలు. కళ్ళు తెరవుము. జీవితాన్ని జీవించుము.

జీవించండి! రాజులా!! లాంటి అనేక ప్రకటనలు ఉన్నాయని నాకు తెలుసు. అయ్యలారా! / అమ్మలారా! గొప్పలు పోతూ మీ ఖజానాలో దాచి ఉంచుకోలేనిదే జీవితం!

పల్లవిపై వ్యాఖ్యానము ముగించే ముందు, ప్రఖ్యాత చిత్రకారులు యెస్చర్ గారు గీసిన క్రింది ఉన్న చిత్రాన్ని పరీక్షగా చూడండి.



డగ్లస్ హాఫ్‌స్టాడ్టర్ మాట్లాడుతూ రెండు చేతులలో ఒక్కొక్కటి మరొకదాన్ని గీస్తుంది: రెండు-దశల వింత అసంబద్ధమైన వలయము (ఉచ్చు) అన్నారు. జీవితం, ఈ చిత్రాన్ని పోలి అనేకానేక ఉచ్చులతోను మాయలతోను నిండి విభ్రాంతి కలిగించును.  

యేలేవారి దూరితి యెడరు వుట్టినవేళ

కాలమును దూరితిని కలఁగేవేళ
తాలిమిలేని వేళ తగుఁగర్మము దూరితి
యేలాగని కాచేవారి నెవ్వరిఁ గానము        ॥ఇంత॥

yElEvAri dUriti yeDaru vuTTinavELa

kAlamunu dUritini kalagEvELa
tAlimilEni vELa tagugarmamu dUriti
yElAgani kAchEvAri nevvari gAnamu    iMta 

Word to Word meaning: యేలేవారి (yElEvAri) = the rulers;  దూరితి (dUriti) = I blamed; I reproached; యెడరు (yeDaru) = ఆపద, భంగము, trouble,  adversity;  వుట్టినవేళ (vuTTinavELa) = at the time of; కాలమును (kAlamunu) = time; దూరితిని (dUritini) = I blamed; I reproached; కలఁగేవేళ (kalagEvELa) = in times of turbidity and disquiet;  తాలిమిలేని వేళ (tAlimilEni vELa) = when I lost patience; తగుఁ (tagu) = suitably;  గర్మము (garmamu) = my deeds;  దూరితి (dUriti) = I blamed; I reproached; యేలాగని (yElAgani) = any how; కాచేవారి( kAchEvAri) = saviours; నెవ్వరిఁ (nevvari) = none; గానము (gAnamu) = find; 

Literal meaning: In times of troubles and travails, I blamed it on the rulers (and the government). When I were agitated, when I were in turbidity, I wailed and found faults with my time. When I lost my patience, I picked faults with my fate.  At least, I am unable identify the saviours.   

Explanation: The man tends to blame because he is unable find solution to the situation, he is in. Let us go back to the story of Gajendra. He enters the lake along with thousands of wives. When he gets caught by crocodile, unfortunately none of his wives come to his rescue. He struggles with the crocodile for long. Sometimes he appears to be winning. sometimes he appears to be losing the battle. Situation is same for the man. one may have hundreds of friends but no avail. The only saviour is the Lord. We often miss him. This is what Annamacharya said. 

Its appropriate to remember what Confucius has said: the archer who misses does not blame the target, he stops, corrects himself and shoots again.” 

భావము: ఏదైనా కష్టం వచ్చినా నేను భంగపడినా (నావల్లనే అవన్నీ జరిగాయని గుర్తించలేక), తెలుసుకోకుండా యజమానులను, ప్రభుత్వాన్ని (ఇష్టానుసారం) నిందించాను.   సంక్షోభ సమయాల్లో  అయ్యో! నాకు కాలం కలిసి రావడంలేదే అని వాపోయాను.  ధైర్యం కోల్పోయిన వేళల్లో నా కర్మ ఇలా కాలిందని నన్ను నేనే నిందించుకున్నాను. ఏదో విధంగా నన్ను రక్షించే వారిని కనీసం గుర్తించనైతిని. 

వివరణము: తాను వున్న పరిస్థితికి పరిష్కారం కనుక్కోలేక మనిషి ఇతరులపై నిందలు వేస్తాడు.  మనం తిరిగి గజేంద్రుని కథలోకి వెళ్దాం. వేలమంది భార్యలతో కలిసి సరస్సులోకి ప్రవేశిస్తాడు. అతను మొసలి చేతిలో చిక్కుకున్నప్పుడు, దురదృష్టవశాత్తు అతని భార్యలు ఎవరూ అతనిని రక్షించడానికి రాలేదు. చాలా కాలం మొసలితో పోరాడుతున్నాడు. కొన్నిసార్లు అతను గెలిచినట్లు కనిపిస్తాడు. కొన్నిసార్లు అతను యుద్ధంలో ఓడిపోయినట్లు కనిపిస్తాడు. మనిషికి కూడా అదే పరిస్థితి. ఒకరికి వందలాది మంది స్నేహితులు ఉండవచ్చు కానీ ప్రయోజనం లేదు. రక్షకుడు  ప్రభువు ఒక్కడే. మనము తరచుగా అతనిని మరచిపోతాము. అన్నమాచార్యులు చెప్పినది ఇదే.  

చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ చెప్పినదానిని గుర్తుంచుకోవడం సముచితం అనుకుంటున్నాను: విలుకాడు తప్పిన లక్ష్యాన్ని నిందించడు; అతడు ఆగి, సరిదిద్దుకుని మళ్లీ సంధిస్తాడు.  

 

దైవమును దూరితి తమకించినట్టివేళ

కావించి నన్నే దూరితిఁ గాఁగినవేళ
సోవగాఁ గోపపు వేళ చుట్టాల దూరితిమి
యీవలఁ దోడైనవారి నెవ్వరిఁ గానము      ॥ఇంత॥ 

daivamunu dUriti tamakiMchinaTTivELa

kAviMchi nannE dUriti gAginavELa
sOvagA gOpapu vELa chuTTAla dUritimi
yIvala dODainavAri nevvari gAnamu      iMta 

Word to Word meaning: దైవమును (daivamunu) = god; దూరితి (dUriti) = I blamed; I reproached; తమకించినట్టివేళ (tamakiMchinaTTivELa) = తత్తరపడు వేళ​, త్వరపడు వేళ, మోహపడు వేళ, state of being perplexed or agitated;  కావించి (kAviMchi) = to make, to perform; నన్నే (nannE) = myself;  దూరితిఁ (dUriti)  = I blamed; I reproached; గాఁగినవేళ (gAginavELa) = ఉద్రేకపడు వేళ, ఆవేశపడు వేళ, in time of fury, in time of rage;  సోవగాఁ (sOvagA) = దీర్ఘమైన, నిడుపైన, continually, long spells of;  గోపపు వేళ (gOpapu vELa) = time of anger; చుట్టాల (chuTTAla) = relations; దూరితిమి (dUritimi)  = we blamed; we reproached; యీవలఁ (yIvala) = this side; దోడైనవారి (dODainavAri) = the one to help, aid, assist;  నెవ్వరిఁ (nevvari) = none; గానము (gAnamu) = we find.           

Literal meaning: In times of haste and passion, I resorted to blaspheme. Sometimes, unable to comprehend action, started self-deprecating.  Many times, I could not control my anger and blamed whoever appeared in front of me (sons, grandsons and relations) I never could realise that someone could be on this side to support. 

Explanation: See the accuracy of the wording. sOvagA gOpapu vELa chuTTAla dUritimi సోవగాఁ గోపపు వేళ చుట్టాల దూరితిమి. I have continually blamed relatives. This is what usually happens for most of us. 

Passing the buck on God is the pastime activity for most atheists and rationalists. Let us try to examine all these movements lead us any where? by blaming does the situation chang? Interestingly we stays where we were. 

Now consider what Chinese wiseman Lao-Tzu said:  “He who blames others has long way to go on his journey.   He who blames himself is halfway there. He who blames none has arrived.” 

భావము: తత్తరపడు వేళ, మోహపడు వేళల్లో దైవదూషణకు పాలుపడ్డాను. ఒక్కోసారి ఏమి చేయుటయో తెలియక ఆత్మనింద కూడా చేసుకున్నాను. చాలాసార్లు కోపాన్ని అణుచుకోలేక ఎదురుగా ఎవరు కనిపిస్తే వారిని (కొడుకులు, మనుమలు, చుట్టాలు) ఇష్టం వచ్చినట్టు నిందించాను. ఇటువైపు నాకు తోడు నీడగా నిలబడే వాడొకొడుంటాడని కనీసం గుర్తించనైనా లేదు కదా! 

వివరణము: సోవగాఁ గోపపు వేళ చుట్టాల దూరితిమి = జీవన పర్యంతమూ మనమెవరో ఒకరిపై నింద వేయడానికి  చూస్తామని అన్నమాచార్యులు ఎంత ఖచ్చితంగా చెప్పరో చూడండి.

చాలా మంది నాస్తికులకు మరియు హేతువాదులకు భగవంతునిపై నీంద వేయడము ఒక కాలక్షేపం. ఈ ప్రయత్నాలన్నీ మనల్ని ఎక్కడికైనా తీసుకువెళతాయా? నిందించడం ద్వారా పరిస్థితి మారుతుందా? ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనం ఉన్న చోటునే ఉంటాం.

ఇప్పుడు చైనాకు చెందిన జ్ఞాని లావో-ట్జు ఏమి చెప్పాడో పరిశీలించండి: “ఇతరులను నిందించేవాడు తన ప్రయాణంలో చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. తనను తాను నిందించుకునేవాడు సగం దారిలో ఉన్నాడు. ఎవరినీ నిందించనివాడు గమ్యాన్ని చేరాడనుకోవచ్చు.”

పుట్టుగు దూరితిమి పోరానియట్టివేళ

కట్టఁగడ నెందువంకఁ గానమైతిమి
జట్టి శ్రీవేంకటేశుఁడు శరణంటేనే కాచె
యిట్టె యింతటివారు యెవ్వరును లేరు   ॥ఇంత॥ ॥ 

puTTugu dUritimi pOrAniyaTTivELa

kaTTagaDa neMduvaMka gAnamaitimi
jaTTi SrIvEMkaTESuDu SaraNaMTEnE kAche
yiTTe yiMtaTivAru yevvarunu lEru  iMta 

Word to Word meaning: పుట్టుగు (puTTugu) = birth; దూరితిమి (dUritimi) = we blamed; we reproached; పోరానియట్టివేళ (pOrAniyaTTivELa) = అనివార్యమైన వేళ, immutable point in the journey of life;  కట్టఁగడ (kaTTagaDa) = at last, at the end; నెందువంకఁ (neMduvaMka) = వంకఁపెట్టుటకు ఏదీ లేక​, nothing left to blame; (implied meaning: I have tried all possible ways, I am unable justify a way to blame anyone else) గానమైతిమి (gAnamaitimi) = cannot find;  జట్టి (jaTTi)= best (జెట్టికి వికృత రూపము);  శ్రీవేంకటేశుఁడు (SrIvEMkaTESuDu) = Lord Venkateswara;  శరణంటేనే (SaraNaMTEnE) = on submission;  కాచె (kAche) = saved; యిట్టె (yiTTe) = instantly;  యింతటివారు (yiMtaTivAru) = any one comparable;  యెవ్వరును (yevvarunu) = none; లేరు (lEru) = exists; 

Literal meaning:  I swore on my birth many times. When the inevitable time appeared before me, suddenly I realised that there is none to blame. Great Lord Venkateswara is very compassionate. He sheltered me  with just one word శరణు (SaraNu). There is none to match him. 

Explanation: This word pOrAniyaTTivELa పోరానియట్టివేళ signifies immutable point in the journey of life. It may be taken as death. What Annamacharya is saying is every second in life is unalterable. We stand on that penultimate step every moment of life, unfortunately we turn our head elsewhere. That definitive step is when you decipher that there is none to blame is the true essence of this stanza. That is the transition point from this side ( world) to other side.   

Have you wondered why you are here? You may have hundred reasons. Now contemplate this line from Annamacharya వెన్న చేతఁబట్టి నేయి వెదకనేలా (venna chEtabaTTi nEyi vedakanElA) = you are just one step away. Is so easy to figure out God. Its within your reach. It’s as easy as getting the ghee from butter.  Why are you looking elsewhere? 

It’s time to chew over Galileo Galilei’s statement. I don't feel obliged to believe that the same God who has endowed us with sense, reason and intellect has intended us to forgo their use" 

భావము: నా పుట్టుక ఎందుకు అంటూ తిట్టుకున్నాను? పోరాని (అనివార్యమైన) కాలం సంప్రాప్తమయింది. చిట్టచివరికి వారిపైననో వీరిపైననో వంకఁపెట్టుటకు ఎవ్వరూ కనబడడంలేదు.  ఘనడు శ్రీవేంకటేశ్వరుడు ఎంత దయాళువు? శరణు అని ఒక్కమాట అనగానే నన్ను పూనికతో వెంటనే నిశ్చయించి రక్షించాడు. ఇంతటి  భగవంతుడు ఎక్కడా మనకు కనబడడు. 

వివరణము: పోరానియట్టివేళ అనే పదం జీవిత ప్రయాణంలో మార్చలేని క్షణమును సూచిస్తుంది. దానిని మరణంగా కూడా తీసుకోవచ్చు. నిజానికి జీవితంలో ప్రతి సెకను మార్చలేనిదే. జీవితంలోని ప్రతి క్షణమూ మనం ఆ చివరి మెట్టుపై నిలబడతాము, దురదృష్టవశాత్తూ మనం ఆ వైపు చూడ గోరము.  నిందించడానికి ఎవరూ లేరని మీరు అర్థంచేసుకున్నప్పుడు ఆ ఖచ్చితమైన మెట్టు ఎక్కే దశ అని ఈ అన్నమాచార్యుల కీర్తన నిజమైన సారాంశం. అది ఈ వైపు (ప్రపంచం) నుండి మరొక వైపుకు పరివర్తన స్థానము. 

మీరు అసలు ఈ పుట్టుక ఎందుకని ఆలోచిస్తున్నారా? మీకు వందలాది కారణాలు ఉండవచ్చు. అన్నమాచార్యులు  వెన్న చేతఁబట్టి నేయి వెదకనేలా ఏమన్నారో చూడండి.  వెన్న నుంచి నేయి ఎంత సునాయాసముగా  తీయవచ్చో అంతే సులభముగా దైవమును పొదవచ్చు. వేరేవేమేమో ఆలోచించి బుర్ర పాడుచెసుకోకు. అవకాశమును వదులకు.  అంటున్నారు అన్నమాచార్యులు. 

ఈ సందర్భంగా గెలీలియో గెలీలీ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుందాం. మనకు జ్ఞానాన్ని, హేతువును మరియు తెలివిని ప్రసాదించిన అదే భగవంతుడు మనం వాటి ఉపయోగాన్ని విడనాడాలని ఉద్దేశించాడని విశ్వసించాల్సిన అవసరం లేదు.

 

Recommendations for further reading:

49 ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు (itarula dUranEla yevvarU nEmi sEturu)

43 మదమత్సరము లేక మనసుపేదై పో (madamatsaramu lEka manasupEdai pO)

 

Summary of this Keertana:

So much time elapsed, where are these people? Peculiarly life has got wasted like the moon light on desolate forest (thus got wasted). (Implied meaning: O man! You ran after these people for long. Enough. Now open your eyes. Live the life.) 

In times of troubles and travails, I blamed it on the rulers (and the government). When I were agitated, when I were in turbidity, I wailed and found faults with my time. When I lost my patience, I picked faults with my fate.  At least, I am unable identify the saviours. 

In times of haste and passion, I resorted to blaspheme. Sometimes, unable to comprehend action, started self-deprecating.  Many times, I could not control my anger and blamed whoever appeared in front of me (sons, grandsons and relations) I never could realise that someone could be on this side to support. 

I swore on my birth many times. When the inevitable time appeared before me, suddenly I realised that there is none to blame. Great Lord Venkateswara is very compassionate. He sheltered me with just one word శరణు (SaraNu). There is none to match him.

 

కీర్తన సంగ్రహ భావము:

ఎంతో కాలము గడిచిపోయింది. వీరు ఎక్కడ ఉన్నారో? అయ్యో! విచిత్రంగా జీవితమంతా అడవి గాచిన వెన్నెలాయనే. (అన్వయార్ధము: ఓ మానవుడా! వీరి వెంట చాలా కాలం పాటు పరుగెత్తావు. ఇక చాలు. కళ్ళు తెరవుము. జీవితాన్ని జీవించుము.)

ఏదైనా కష్టం వచ్చినా నేను భంగపడినా (నావల్లనే అవన్నీ జరిగాయని గుర్తించలేక), తెలుసుకోకుండా యజమానులను, ప్రభుత్వాన్ని (ఇష్టానుసారం) నిందించాను.   సంక్షోభ సమయాల్లో  అయ్యో! నాకు కాలం కలిసి రావడంలేదే అని వాపోయాను.  ధైర్యం కోల్పోయిన వేళల్లో నా కర్మ ఇలా కాలిందని నన్ను నేనే నిందించుకున్నాను. ఏదో విధంగా నన్ను రక్షించే వారిని కనీసం గుర్తించనైతిని. 

తత్తరపడు వేళ, మోహపడు వేళల్లో దైవదూషణకు పాలుపడ్డాను. ఒక్కోసారి ఏమి చేయుటయో తెలియక ఆత్మనింద కూడా చేసుకున్నాను. చాలాసార్లు కోపాన్ని అణుచుకోలేక ఎదురుగా ఎవరు కనిపిస్తే వారిని (కొడుకులు, మనుమలు, చుట్టాలు) ఇష్టం వచ్చినట్టు నిందించాను. ఇటువైపు నాకు తోడు నీడగా నిలబడే వాడొకొడుంటాడని కనీసం గుర్తించనైనా లేదు కదా! 

నా పుట్టుక ఎందుకు అంటూ తిట్టుకున్నాను? పోరాని (అనివార్యమైన) కాలం సంప్రాప్తమయింది. చిట్టచివరికి వారిపైననో వీరిపైననో వంకఁపెట్టుటకు ఎవ్వరూ కనబడడంలేదు.  ఘనడు శ్రీవేంకటేశ్వరుడు ఎంత దయాళువు? శరణు అని ఒక్కమాట అనగానే నన్ను పూనికతో వెంటనే నిశ్చయించి రక్షించాడు. ఇంతటి  భగవంతుడు ఎక్కడా మనకు కనబడడు

 


Copper Leaf: 260-2  Volume 3-344










1 comment:

  1. మన కష్టనష్టాలకు మనమే కారకులమైనా పరులను నిందించటం, దైవాన్ని నిందించటంతోనే
    జీవితమంతా వ్యర్థంగా గడిపేస్తున్నాము.అంతేగాని అట్టి సమయాలలో
    రక్షించే దైవమున్నాడని గ్రహించలేకపోతిని. నీవే నన్ను బ్రోచేవాడివని
    శరణాగతి అయితే భగవంతుడు తప్పక రక్షిస్తాడని అన్నమయ్య
    కీర్తనలో స్పష్టం చేస్తున్నాడు.
    ఆత్మజ్ఞానివి కమ్మని పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన భగవద్గీతలోని శ్లోకం సందరూభోచితంగా ఉంది. ఎస్చర్ గీచిన చిత్రం జీవితం యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది.వ్యాఖ్యలు బాగున్నాయి.
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...