Saturday, 15 January 2022

104. పసలేని యీబ్రదుకు (pasalEni yIbraduku)

 ANNAMACHARYA

104. పసలేని యీబ్రదుకు

(pasalEni yIbraduku) 

 

Introduction: In this hard hitting, yet beautifully rhyming verse Annamacharya criticised nature and actions of man. He used many ironies to make us clear on what we are losing in life.  

The central idea of this poem is that man by his inadvertent actions is simply wasting this beautiful opportunity. In this he is talking about the energy of the soul (jiva shakti). We enter the quagmire of presumed comforts and spend rest of the life in extricating ourselves.    

Annamacharya is saying that you have achieved this human form. Treasue it. With the wording mulludIsi ko~r~ru mottinaTTAya (ముల్లుదీసి కొఱ్ఱు మొత్తినట్టాయ = literal meaning: removing a tiny thorn and instead pierce the body with a spear). The needling troubles you face are like the negligible thorns but not preventing your forward movement. Whereas driving a spear into the body makes you stay where you are.   Thus, the present chosen activities totally jeopardise and prevent progress. 

You may be feeling that I routinely apply word beautiful/great to these poems. Of course not. I have a difficulty to choose. Before starting each commentary I will be wondering if that keertana is worth presenting. By the time, I finish, most often, I felt, I should have covered it earlier. Even after writing notes for 103 verses, it is remarkably daunting to choose.

ఉపోద్ఘాతము: అందంమైన ప్రాసతో కూడిన ఈ కీర్తనలో అన్నమాచార్యులు మనిషి యొక్క స్వభావము మరియు చర్యలను కటువుగానే విమర్శించారు. జీవితంలో మనం ఏమి కోల్పోతున్నామో స్పష్టంగా చెప్పడానికి చాలా వ్యంగ్యాలను ఉపయోగించారు. 

మానవుడు తన అనాలోచిత చర్యలతో ఈ అద్భుతమైన జీవితమనే అవకాశాన్ని వృధా చేసుకుంటున్నాడనేది ఇక్కడ ప్రధానాంశం. అన్నమాచార్యులు ఆత్మ శక్తి (లేదా జీవ శక్తి) గురించి ప్రస్తావించారు. మనము కల్లసుఖముల (ఊహించిన సుఖాల) ఊబిలోకి అడుగిడతాము. ఆ అనవసరపు విషయముల నుండి వెలికి రావడానికి మిగిలిన జీవితాన్ని గడుపుతాము. 

మనవుడా మానవరూపాన్ని సాధించావు! విలువకట్టరానిది.  ముల్లుదీసి కొఱ్ఱు మొత్తినట్టాయ (= ఒక చిన్న ముల్లును తీసివేసి, బదులుగా ఈటెను దింపినట్లు) అంటూ మీరు ఎదుర్కొనే ఆటుపోట్లు విస్మరింప తగ్గ ముళ్లలాంటివి.  అవి ముందుకు వెళ్లకుండా నిరోధించ లేవు. అయితే ఈటెను గుచ్చడం వంటి అవివేకపు పనుల వల్ల మీరు ఉన్న చోటనే ఉండిపోతారుఅన్నారు అన్నమాచార్యులు. 

ప్రతీ కీర్తనకు అందమైన/గొప్ప/రమణీయమైన  అనే పదాలను వతనుగా  వ్రాసేస్తాను అనిపించవచ్చు. అస్సలు కానే కాదు. కీర్తనను ఎంచుకోవడమే పెద్ద ఇబ్బంది. ప్రతి వ్యాఖ్యానాన్ని ప్రారంభించే ముందు, ఆ కీర్తన సమర్పించ తగినదేనా అని బేరీజు వేసుకుంటాను. వివరణము పూర్తి అయ్యే సమయానికితరచుగా, అయ్యో! ఇది ముందుగానే పెట్టి ఉండాల్సిందే అనుకుంటాను. 103 కీర్తనలకు అర్థవివరణము వ్రాసిన తర్వాత కూడా ఎంపిక కష్టంగానే ఉంది. 

కీర్తన:

పసలేని యీబ్రదుకు

అసలు చొచ్చిచొచ్చి అలసినట్టాయె   ॥పల్లవి॥ 

తొల్లిటిజన్మాదులఁ గానినరరూపు

పల్లించుకొన్న యీబ్రదుకు
కల్లసుఖములచే కనలి కమ్మర
ముల్లుదీసి కొఱ్ఱు మొత్తినట్టాయ           ॥పస॥ 

బూటకములనెల్లఁ బొరలి సంసారంపు-

పాటు దెచ్చినయీబ్రదుకు
నీటుగ నెద్దు దన్నీనని గుఱ్ఱము -
చాటు కేఁగినయట్టిచందమాయె           ॥పస॥ 

పగగొన్న పొగ కోపక మంటఁ బడిపడి

పగలు రేలైనయీబ్రదుకు
తగువేంకటేశ్వరుఁ దలఁచి నేల నుండి
యెగసి మేడమీఁది కేఁగినట్లాయె          ॥పస॥

 

pasalEni yIbraduku

asalu chochchichochchi alasinaTTAye pallavi 

tolliTijanmAdula gAninararUpu

palliMchukonna yIbraduku
kallasukhamulachE kanali kammara
mulludIsi ko~r~ru mottinaTTAya pasa 

bUTakamulanella borali saMsAraMpu-

pATu dechchinayIbraduku
nITuga neddu dannInani gu~r~ramu -
chATu kEginayaTTi chaMdamAye pasa 

pagagonna poga kOpaka maMTa baDipaDi

pagalu rElainayIbraduku
taguvEMkaTESvaru dalachi nEla nuMDi
yegasi mEDamIdi kEginaTlAye   pasa

 

 Details and Explanations: 

పసలేని యీబ్రదుకు

అసలు చొచ్చిచొచ్చి అలసినట్టాయె    ॥పల్లవి॥ 

pasalEni yIbraduku

asalu chochchichochchi alasinaTTAye pallavi 

Word to Word meaning: పసలేని (pasalEni) =  సారములేని, నిగ్గులేని, కాంతిలేని,  sap, essence, vigour; యీబ్రదుకు (yIbraduku) = this present life;  అసలు (asalu) = అడుసు, బురద​ mud, mire; చొచ్చిచొచ్చి (chochchichochchi) = entering repeatedly;  అలసినట్టాయె (alasinaTTAye) = feeling tired/fatigued.

Literal meaning:  This present vigourless/ essence-less life is like entering mud repeatedly only to get tired out. 

ExplanationLet us try to understand why Annamacharya is declaring our life as insipid. First consider this verse from Bhagavad-Gita. 

अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् |
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्
|| 7-5||

apareyam itas tvanyā prakiti viddhi me parām
jīva-bhūtā
mahā-bāho yayeda dhāryate jagat

Purport: God said: ‘Nature is my inferior (material) energy. But beyond it, O mighty-armed Arjun, I have a superior energy. This is the jīva śhakti (the soul energy), which comprises the embodied souls who are the basis of life in this world.’ 

We in our scamper for security cover and care less about this energy of the soul. We do this very often. Leading to near suppression of this energy. Our actions are like holding the chocolate wrap and allowing chocolate to slip. This energy is shrouded in secrecy as stated by the Bhagavad-Gita verse below. 

धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च |
यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम्
|| 3-38||

dhūmenāvriyate vahnir yathādarśho malena cha
yatholbenāv
ito garbhas tathā tenedam āvitam

Purport: Just as a fire is covered by smoke, a mirror is masked by dust, and an embryo is concealed by the womb, similarly one’s knowledge gets shrouded by desire. 

Most of us may never uncover this energy of the soul (jiva Shakti). With such repeated actions born of ignorance the internal energy get spent in wrong direction leading to erosion of interest on life. Thus, many people get tired out early. This is what this chorus states.  Some people remain energetic longer. But those opening up this energy of the soul understand what permanency is. Whatever we know is transient. 

It would not be out of place to contemplate on the statements below.

“The energy of the mind is the essence of life”. Aristotle.

“Death is not the greatest loss in life. The greatest loss is what dies while we live.” Norman Cousins

భావము: పసలేని యీ బ్రదుకు బురదలో ఇరుక్కుని ఇరుక్కుని అలసినట్లుగాదా!

వివరణము: అన్నమాచార్యులు మన జీవితాన్ని పసలేని దానిగా ఎందుకు వర్ణిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని పరిశీలించండి. 

 

అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్
।। 7-5 ।।


భావం : ప్రకృతి శక్తి నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దాని కన్నా ఉన్నతమైన శక్తి, జీవ-ఆత్మ శక్తి (చైతన్య శక్తి), ఇది ఈ జగత్తుయందు ఉన్న జీవరాశులకు మూలాధారమై  ఉంది.


మనము భద్రతా రక్షణను వెతుక్కోవడంలో మునిగి యుండి  ఆత్మ యొక్క ఈ జీవ-ఆత్మ శక్తి గురించి తక్కువ శ్రద్ధ వహిస్తాము. తరచు ఇటువంటి అశ్రద్ధతో, క్రమక్రమంగా ఈ శక్తిని జ్ఞాపకాల మూలల్లోకి నెట్టివేస్తాము. బయటకు రాకుండా అణచివేస్తాము. మన చర్యలు చాక్లెట్ పై కాగితాన్ని పట్టుకుని  చాక్లెట్ ను జారవిడిచినట్లుగా ఉంటాయి. దిగువ భగవద్గీత శ్లోకం ఈ శక్తి రహస్యంగా కప్పబడి మానవాళిని  భ్రమింప చేస్తోందని తెలుపుతోంది.


ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్
।। 3-38 ।।

 

భావం : పొగ” చేత నిప్పు, “ధూళి” చేత అద్దం, “మావి” చేత గర్భంలోని పిండం కప్పబడినట్లే, "కామం" చేత  జ్ఞానము కప్పబడి వుండును.

మనం ఈ శక్తిని ఎప్పటికీ వెలికితీయకపోవచ్చు. మన అవ్యవస్థిత చర్యలతో పునరావృత చర్యలతో అంతర్గత శక్తి అపసవ్య​ దిశలో ఖర్చు చేయబడి జీవితంపై ఆసక్తి సన్నగిల్లుతుంది. అందుకే చాలా మంది త్వరగా అలసిపోతారు. ఇదే పల్లవిలో అన్నమాచార్యులు పేర్కొన్నది. కొంతమంది ఎక్కువ కాలం ఉత్సాహంగా ఉంటారు. కానీ ఆత్మ యొక్క ఈ శక్తిని వీక్షించిన​ వారు శాశ్వతత్వం అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు. మనకు తెలిసినదంతా క్షణికమైనది.

ఈ విషయమై మహనీయుల ఆలోచనలను మననము చేయుట సందర్భోచితముగా ఉంటుంది.

మనస్సు యొక్క శక్తియే జీవితానికి మూలాధారము. అరిస్టాటిల్.

చావుతో కోల్పోయేదాని కంటే  జీవించి ఉండగానే చచ్చిపోవడమే తీరని నష్టం’. నార్మన్ కజిన్స్

తొల్లిటిజన్మాదులఁ గానినరరూపు

పల్లించుకొన్న యీబ్రదుకు
కల్లసుఖములచే కనలి కమ్మర
ముల్లుదీసి కొఱ్ఱు మొత్తినట్టాయ ॥పస॥ 

tolliTijanmAdula gAninararUpu

palliMchukonna yIbraduku
kallasukhamulachE kanali kammara
mulludIsi ko~r~ru mottinaTTAya pasa

 

Word to Word meaning: తొల్లిటిజన్మాదులఁ (tolliTijanmAdula) = earlier (former) births; గాని (gAni) = not; నరరూపు (nararUpu) = this body with shape of human; పల్లించుకొన్న (palliMchukonna) = సాధించుకున్న​, accomplished, achieved;  యీబ్రదుకు (yIbraduku) = this present life; కల్లసుఖములచే (kallasukhamulachE) = with non-existing comforts; కనలి (kanali) = burnt; కమ్మర (kammara)  = (క్రమ్మరఁకు వ్యావహారిక రూపం.) = వ్యాపించు, కలుగు, ఉబుకు, spreading, generating, swelling; ముల్లుదీసి (mulludIsi) = take out a small thorn (embedded in leg); కొఱ్ఱు (ko~r~ru) = గూటం, శూలం, picket or spear; మొత్తినట్టాయ (mottinaTTAya) = similar to striking with, like beating with. 

Literal meaning: It’s an accomplishment that you are in human form here. Do not burn this opportunity by running after the non-existing comforts. its like removing a tiny thorn and instead pierce the body with a spear. 

Explanation: the word kallasukhamulachE (కల్లసుఖములచే) is indicating that the comforts we assume are there, but actually not available. On careful observation, it is not difficult find that we derive comfort from - relief from pain; relief from immediate next action. (Most of us derive great sense of relief on Friday evening that I do not have to go to office tomorrow). When the splitting headache starts to recede, you feel great comfort. This may appear strange, but a hard fact. 

Annamacharya is saying that you have achieved this human form. Value it. Do not waste this golden opportunity. The small troubles you are facing are like the thorns in the way of life. They are hurting but not preventing you from moving forward. Whereas running after comforts is like removing a thorn and driving a spear in its place. That is these activities totally destroy you and prevent your progress. 

భావము: ముందు జన్మల్లో లేని మానవ జన్మని సాధించుకున్నావు.  దీనిని కల్లసుఖముల వెంట పరుగెత్తి పాడుచేసుకోక. అలా చేయడం ఒక చిన్న ముల్లును తీసి, బదులుగా ఈటెతో శరీరాన్ని పొడుచుకున్నట్లే.  

 

వివరణము: కల్లసుఖములచే అనే పదం మనం కోరుకుంటున్న సుఖాలు అందుబాటులో లేనివనివాస్తవానికి ఊహలేనని సూచిస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే ఓదార్పు, ఉపశమనాలనే మనము ఆశించేది.  నొప్పి నుండి ఉపశమనం; తక్షణ తదుపరి చర్య నుండి విరామము. (నేను రేపు ఆఫీసుకు వెళ్లనవసరం లేదని మనలో చాలా మందికి శుక్రవారం సాయంత్రం గొప్ప ఊరట కలుగుతుంది). బుర్రపగిలే తలనొప్పి తగ్గుముఖం పట్టినప్పుడు, మీరు గొప్ప శాంతిని అనుభవిస్తారు. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ కఠినమైన వాస్తవం.

నువ్వు (కష్టపడి) ఈ మానవరూపాన్ని సాధించావు అని అన్నమాచార్యులు చెబుతున్నాడు. దానికి విలువ ఇవ్వు. ఈ సువర్ణావకాశాన్ని వృధా చేసుకోకండి. మీరు ఎదుర్కునే చిన్న చిన్న కష్టాలు జీవిత మార్గంలో ముళ్ల లాంటివి. అవి బాధపెడుతాయి కానీ ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని నిరోధించలేవు. అయితే లేని సుఖాల కోసం పరుగెత్తడం ముల్లును తీసి (అదే స్థానంలో) ఈటెతో మొత్తుకోవడం లాంటిది. అంటే ఈ కార్యకలాపాలు మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తాయి అని.

బూటకములనెల్లఁ బొరలి సంసారంపు-

పాటు దెచ్చినయీబ్రదుకు
నీటుగ నెద్దు దన్నీనని గుఱ్ఱము -
చాటు కేఁగినయట్టిచందమాయె         ॥పస॥ 

bUTakamulanella borali saMsAraMpu-

pATu dechchinayIbraduku
nITuga neddu dannInani gu~r~ramu -
chATu kEginayaTTi chaMdamAye pasa 

Word to Word meaning: బూటకములనెల్లఁ (bUTakamulanella) = deceit, fraud, illusions; బొరలి (borali) = to roll over, to wallow;  సంసారంపు పాటు - (saMsAraMpupATu) = the drudgery of family life;  దెచ్చిన (dechchina) = bring; యీబ్రదుకు (yIbraduku) = this life; నీటుగ (nITuga) = సున్నితంగా, delicztely; నెద్దు (neddu) = ox; దన్నీనని (dannInani) = kicks thus;  గుఱ్ఱము (gu~r~ramu) = horse; చాటు (chATu) = behind; కేఁగినయట్టి (kEginayaTTi) =        to go for shelter; చందమాయె (chaMdamAye) = akin to; 

Literal meaning: The drudgery of family life brought us only to wallow in deceit, fraud, illusions. Its like preferring the stronger kicks of horse to delicate strokes of a cow. 

Explanation: Man’s present understanding of life is like the peasant in the story (‘The Good Bargain’ by Brothers Grimm) below.

A peasant took his cow to market where he sold her for seven gold coins. On his way home he passed a pond where the frogs sang out, "akt, akt, akt, akt", which to him sounded like "eight, eight, eight, eight". "What nonsense they speak", he said, "for I was paid seven and not eight". But still they called out, "akt, akt, akt, akt". Rushing to the water's edge the peasant shouted "You stupid animals! I was paid seven coins, not eight!" and he took the coins from his purse and counted them, but still the frogs persisted with their "akt, akt, akt, akt". 

"Well", he shouted, "if you think you know more about it than me you can count them for yourselves!" With that he threw the coins into the pond and waited for the frogs to count them and throw them back, but still the frogs cried out "akt, akt, akt, akt". The peasant waited and waited. He waited until late into the evening when finally he gave up and went home, cursing the frogs for their stupidity as he went. 

Read forgs = others and the world. Our hero, instead of going home, loses his path, gets engaged with frogs and lost whatever he had.  This is what is meant by avoiding the small troubles in dealing with cow, instead man goes behind the horse to lose everything.

భావము: దుర్భరమైన సంసారపు జీవితం మనల్ని మోసములలో, బూటకములలో, భ్రమల్లో కూరుకుపోయేలా చేసింది. ఇది సున్నితంగా తన్నే ఆవుని తప్పించుకుని అంత కంటే బలంగా తన్నే  గుర్రం చాటుకు పోయినట్లుంది.

వివరణము: మనకు  ప్రస్తుతం జీవితంపై కల అవగాహన యొక్క  క్రింద కథలోని రైతు వలె ఉందనుకోవచ్చు ( 'బలే మంచి బేరం' బ్రదర్స్ గ్రిమ్ సేకరించినది).

ఒక రైతు తన ఆవును బజారుకి తీసుకెళ్లి అక్కడ ఏడు బంగారు నాణేలకు విక్రయించాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు అతను ఒక చెరువును దాటేటప్పుడు, అక్కడ కప్పలు "అక్ట్, అక్ట్, అక్ట్, అక్ట్" అని అరిచాయి. అది అతనికి "ఎనిమిది, ఎనిమిది, ఎనిమిది, ఎనిమిది" అన్నట్లు వినిపించింది. "ఏం అర్ధంలేని మాటలు మాట్లాడుతున్నారు", "నాకు ఎనిమిది కాదు ఏడే ఇచ్చారు" అన్నాడు. అయినప్పటికీ, కప్పలు "అక్ట్, అక్ట్, అక్ట్, అక్ట్" అని అన్నాయి. రైతు నీటి (అంచు) వద్దకు పరుగెత్తి   "మూర్ఖులారా! నాకు ఏడు నాణేలే చెల్లించబడ్డాయి, ఎనిమిది కాదు!" అని అతను తన పర్సులో నుండి నాణేలను తిరిగి లెక్కించాడు, కానీ కప్పలు తమ "అక్ట్, అక్ట్, అక్ట్, అక్ట్" అని అంటూనే ఉన్నాయి.

"అలాగా" అని అరిచాడు, "మీకు దాని గురించి నా కంటే ఎక్కువ తెలుసని అనుకుంటే, మీరే లెక్కపెట్టండి!" అని అతను నాణేలను చెరువులోకి విసిరి, కప్పలు వాటిని లెక్కించి వెనక్కి విసిరే వరకు వేచి ఉన్నాడు, కాని కప్పలు "అక్ట్, అక్ట్, అక్ట్, అక్ట్" అని అరుస్తూనే ఉన్నాయి. రైతు నాణేలను వెనక్కు విసురుతాయని ఎదురుచూశాడు. అతను సాయంత్రం వరకు వేచి ఉండి, చివరికి అతను ఆశ  వదులుకుని, కప్పల మూర్ఖత్వాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు.

ఇక్కడ కప్పలు = ఇతరులు, ప్రపంచము అని చదవండి. ఇంటికి పోయేవాడు దారి తప్పి చెరువు దగ్గర కప్పలతో పెట్టుకుని ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు. ఆవు తన్నుతుందని గుర్రం వెనక్కి వెళ్ళడమంటే ఇదే.

పగగొన్న పొగ కోపక మంటఁ బడిపడి

పగలు రేలైనయీబ్రదుకు
తగువేంకటేశ్వరుఁ దలఁచి నేల నుండి
యెగసి మేడమీఁది కేఁగినట్లాయె        ॥పస॥ 

pagagonna poga kOpaka maMTa baDipaDi

pagalu rElainayIbraduku
taguvEMkaTESvaru dalachi nEla nuMDi
yegasi mEDamIdi kEginaTlAye       pasa

Word to Word meaning: పగగొన్న (pagagonna) = to entertain or conceive hatred or enmity, to take a dislike or spite (to), to be inimical; పొగ కోపక (poga kOpaka) = unable to bear smoke or fumes; మంటఁ (maMTa) = fire;  బడిపడి (baDipaDi) = emntering; పగలు (pagalu) = day(s) రేలైన (rElaina) = converted to night(s) యీబ్రదుకు (yIbraduku) = this life; తగు (tagu) = suitable;  వేంకటేశ్వరుఁ (vEMkaTESvaru) = Lord Venkteswara;  దలఁచి (dalachi) =  consider, regard, remember; నేల నుండి (nEla nuMDi) = from the ground; యెగసి (yegasi) = to jump; మేడమీఁది (mEDamIdi) = to the upper floors;  కేఁగినట్లాయె (kEginaTlAye) = feels like; 

Literal meaning: Man's actions are like preferring to enter fire to escape the unbearable suffocating smoke. Thus, we turn day(s) into night(s) by our blind actions. Thinking of Venkateswara's name appropriately, I felt like I had jumped from the ground to the higher worlds. 

Explanation: By the word pagalu (పగలు) Annamacharya is signifying clarity in mind. rElaina (రేలైన) is indicative of blind actions born out of ‘tamas or agyaan अज्ञान’. Thus by pagalu rElainayIbraduku (పగలు రేలైనయీబ్రదుకు) = man’s priorities for life continues to be grappling in dark. 

With the wording yegasi mEDamIdi kEginaTlAye (యెగసి మేడమీఁది కేఁగినట్లాయె) are indicating that Annamacharya actually does not know where he is. But aware it is in far higher plane. 

The word tagu (తగు) is illustrating that we need to align our the mind, the body and the soul to a unitary purpose of meditation. 

Implied meaning: Understanding and following the will of God is definitely not easy task. But is lot more comfortable than entering fire.  By actions of ignorance, man continues his journey in darkness. Pray God with trinitarian purity, you shall understand higher planes.

భావము: మనిషి యొక్క చర్యలు భరించలేని ఉక్కిరిబిక్కిరి చేసే పొగ నుండి తప్పించుకోవడానికి మంటల్లోకి ప్రవేశించడం లాంటివి. మన గుడ్డి చర్యల వల్ల మనం పగళ్లను రాత్రులుగా మార్చుకుంటున్నాం. వెంకటేశ్వరుని పేరు తగినట్లు తలచుకుంటే, నేను నేల నుండి ఉన్నత లోకాలకు ​ఎగసినట్లు అనిపించింది. 

 

వివరణము: అన్నమాచార్యులు పగలు  అనే పదం ద్వారా  మనస్సులోని స్పష్టతను సూచించారు. రేలైన (= రాత్రిగామారు)  అనేది 'తామసికము లేదా అజ్ఞానం' నుండి పుట్టిన అవివేకపు చర్యలకు సూచన. 'పగలు రేలైనయీబ్రదుకు'తో మానవులు జీవిత ప్రాధాన్యతలను ఎంచుకొనడం  చిమ్మ చీకటిలో తడవడం వంటిదని స్పష్టం చేశారు.

యెగసి మేడమీఁది కేఁగినట్లాయెతో అన్నమాచార్యులకు తాను యెక్కడ చేరినదీ తెలియక పోయినా, నేల కంటే ఎంతో ఎత్తులో (ఊర్ధ్వ లోకాల్లో) విహరించినట్లు తెలియుచున్నది.

తగు అనే పదం మనస్సు, శరీరం మరియు ఆత్మను ధ్యానం అనే త్రాటిపై నిలిపి ఉంచు సమతుల్యతను తెలుపుతోంది.

అన్వయార్ధము: దైవమును  అనుసరించడం ఖచ్చితంగా అంత తేలికైన పని కాదు. కానీ అగ్నిలోకి ప్రవేశించడం కంటే చాలా సౌకర్యవంతమే. అజ్ఞానపు చర్యలతో మనిషి  తన ప్రయాణాన్ని చీకటిలో కొనసాగిస్తూనే ఉంటాడు. త్రికరణ శుద్ధితో భగవంతుని ప్రార్ధించండి, మీరు ఉన్నత స్థాయిని  చేరుకుంటారు.

 

Recommendations for further reading:

31. చాల నొవ్వి సేయునట్టి జన్మమేమిమరణమేమి (chAla novvi sEyunaTTi janmamEmi maraNamEmi)

36. ఏది జూచినఁ దమకు (Edi jUchina damaku)

15. కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచుమనసు (kaMchUM gAdu peMchU gAdu kaDubeluchu manasu)

 

 

Summary of this Keertana:

This present vigourless/ essence-less life is like entering mud repeatedly only to get tired out. 

It’s an accomplishment that you are in human form here. Do not burn this opportunity by running after the non-existing comforts. its like removing a tiny thorn and instead pierce the body with a spear. 

The drudgery of family life brought us only to wallow in deceit, fraud, illusions. Its like preferring the stronger kicks of horse to delicate strokes of a cow. 

Man's actions are like preferring to enter fire to escape the unbearable suffocating smoke. Thus, we turn day(s) into night(s) by our blind actions. Thinking of Venkateswara's name appropriately, I felt like I had jumped from the ground to the higher worlds. (Implied meaning: Understanding and following the will of God is definitely not easy task. But is lot more comfortable than entering fire.  By actions of ignorance, man continues his journey in darkness. Pray God with trinitarian purity, you shall understand higher planes.) 

 

కీర్తన సంగ్రహ భావము:  

పసలేని యీ బ్రదుకు బురదలో ఇరుక్కుని ఇరుక్కుని అలసినట్లుగాదా!

 

ముందు జన్మల్లో లేని మానవ జన్మని సాధించుకున్నావు.  దీనిని కల్లసుఖముల వెంట పరుగెత్తి పాడుచేసుకోక. అలా చేయడం ఒక చిన్న ముల్లును తీసి, బదులుగా ఈటెతో శరీరాన్ని పొడుచుకున్నట్లే.  

 

దుర్భరమైన సంసారపు జీవితం మనల్ని మోసములలో, బూటకములలో, భ్రమల్లో కూరుకుపోయేలా చేసింది. ఇది సున్నితంగా తన్నే ఆవుని తప్పించుకుని అంత కంటే బలంగా తన్నే  గుర్రం చాటుకు పోయినట్లుంది.

 

మనిషి యొక్క చర్యలు భరించలేని ఉక్కిరిబిక్కిరి చేసే పొగ నుండి తప్పించుకోవడానికి మంటల్లోకి ప్రవేశించడం లాంటివి. మన గుడ్డి చర్యల వల్ల మనం పగళ్లను రాత్రులుగా మార్చుకుంటున్నాం. వెంకటేశ్వరుని పేరు తగినట్లు తలచుకుంటే, నేను నేల నుండి ఉన్నత లోకాలకు ​ఎగసినట్లు అనిపించింది.  (అన్వయార్ధము: దైవమును  అనుసరించడం ఖచ్చితంగా అంత తేలికైన పని కాదు. కానీ అగ్నిలోకి ప్రవేశించడం కంటే చాలా సౌకర్యవంతమే. అజ్ఞానపు చర్యలతో మనిషి  తన ప్రయాణాన్ని చీకటిలో కొనసాగిస్తూనే ఉంటాడు. త్రికరణ శుద్ధితో భగవంతుని ప్రార్ధించండి, మీరు ఉన్నత స్థాయిని  చేరుకుంటారు.)

 

Copper Leaf: 33-2  Volume 1-203

2 comments:

  1. Congratulations for completing writing for 104,keerthanas.But,I am sorry to say that in some places,it went out of content,like the story of Frogs.At the begining also" kalla sukhamu" explanation is too prolonged and not appropriate to my Understanding.

    ReplyDelete
  2. *జంతూనాం నరజన్మ దుర్లభం*
    ముక్తి, మోక్షమును పొందే అవకాశం మానవజన్మ యందు మాత్రమే లభ్యం.కాని మనిషి ఆశాశ్వతము,అసత్యము అయిన సుఖాల కోసం వెంపర్లాడి, వాటినుండి బయటపడటానికి శేషజీవితం వ్యర్థం చేసు
    కొంటున్నాడు. సంసారమనే భ్రమలో చిక్కుకొని అలసి సొలసి పోవుచున్నాడు. ఇది చిన్న ముల్లును తీయడానికి పెద్ద ఈటెను ఉపయోగించినట్లున్నది.పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లుగా ఉన్నది.పొగను తప్పించుకొనుటకు మంటలోకి వెళ్లినట్లున్నది.ప్రేయమార్గంలో పడి శ్రేయమార్గాన్ని ఉపేక్షిస్తున్నాము.

    పృథివి,నీరు, అగ్ని,వాయువు, ఆకాశము, మనో
    బుద్ధ్యహంకారములనే ప్రాకృతిక శక్తులకంటె, వాటికి అతీతంగా అత్యున్నతమైనది భగవంతుడి జీవ-ఆత్మ శక్తి. అజ్ఞానంలో పడి మనయందే స్థితమై యున్న జీవాత్మ శక్తిని విస్మరించి, తమస్సు అనే అజ్ఞానంలో మునిగి తేలుచున్నాము.శ్రీనివాసుని త్రికరణ శుద్ధిగా ప్రార్ధించి, ధ్యానించిన ఉన్నతస్థాయిని చేరి, ఉత్తమ గతులను బడయుదామని అన్నమయ్య ఉపదేశిస్తున్నాడు.

    భగవద్గీత శ్లోకాలు, తదితర సందర్భోచిత వ్యాఖ్యలు శ్రీనివాస్ గారి విశేష ప్రతిభకు అద్దం పడుతున్నాయి.
    *తమసోమా జ్యోతిర్గమయ*
    🙏🙏🙏
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...