Friday 19 March 2021

31. చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి (chAla novvi sEyunaTTi janmamEmi maraNamEmi)

 

ANNAMACHARYA

31. చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి 

In this deep philosophical verse, Annamacharya put forward the essence of living. He deplores the present way of our living is not much different from death. He goes on to say that our bonds with fellow men and environment, however weak they may be, are still the cause of sorrow. He explains that a blow from a golden staff will be as painful as the one from an iron staff. Therefore the practitioner should be circumspective all time. 

ఈ లొతైన ఆధ్యాత్మిక​ కీర్తనలో చాలా యెత్నముతో చేయు జీవనమూ  జీవనమేనా  అని ప్రశ్నించారు. మన ప్రస్తుత జీవితానికి మరణానికి పెద్ద భేదము లేదన్నారు. ఎంత బలహీనమైన బంధాలైనా దుఃఖమునకు కారణము లౌతాయన్నారు. బంగారు కర్రతో కొట్టినా, ఇనుప కర్రతో కొట్టినా దెబ్బ తగిలే తీరుతుంది. అందుకే సాధకునికి ఎల్లవేళలా అప్రమత్తత అవసరం అన్నారు.

 

చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి

మాలుగలపి దొరతనంబు మాన్పు టింత చాలదా  ॥పల్లవి॥ 

chAla novvi sEyunaTTi janmamEmi maraNamEmi

mAlugalapi doratanaMbu mAnpu TiMta chAladA pallavi 

Word to Word meaning: చాల (chAla) = too much; నొవ్వి (novvi) = pain; సేయునట్టి (sEyunaTTi) = performed; జన్మమేమి (janmamEmi) = what life?  మరణమేమి (maraNamEmi) = What death? మాలుగలిపి = by merging, by dissolving; దొరతనంబు (doratanaMbu) = ego/pride (of high birth, of caste, of position, of achievement); మాంపు టింత (mAnpu TiMta) =reduce a bit; చాలదా (chAladA) = not sufficient? 

Literal meaning: What is the use of living a life with great effort; how is it different from death. Is it not better to dissolve/reduce one’s own ego? 

భావము: ఎంతో శ్రమించి చేయు ప్రస్తుత జీవితానికి, మరణానికి వ్యత్యాసమేమి? అంతకంటే, కొంత అహంభావం తగ్గించుకోవడం మేలు కాదా?  

పుడమిఁ బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు

కడపరానిబంధములకుఁ గారణంబులైనవి
యెడపకున్న పసిఁడిఁసంకెలేమి యినుపసంకెలేమి
మెడకుఁ దగిలియుండి యెపుడు మీఁదుచూడరానివి  ॥చాల॥ 

puDami bApakarmamEmi puNyakarmamEmi tanaku

kaDaparAni baMdhamulaku gAraNaMbulainavi
yeDapakunna pasiDi saMkelEmi yinupasaMkelEmi
meDaku dagiliyuMDi yepuDu mIduchUDarAnivi  chAla 

Word to Word meaning: పుడమి (puDami) = on this earth;  పాపకర్మమేమి (bApakarmamEmi) = what is a sinful act; పుణ్యకర్మమేమి puNyakarmamEmi  = What is a virtuous act? తనకు (tanaku) = for the self; కడపరాని (kaDaparAni) = with no end; బంధములకు (baMdhamulaku) = relations; కారణంబులైనవి (gAraNaMbulainavi) = became causes;  యెడపకున్న (yeDapakunna) = without breaking; పసిడి సంకెలేమి (pasiDi saMkelEmi) = what gold chains? యినుపసంకెలేమి (yinupasaMkelEmi) = what iron chains?; మెడకు (meDaku) = to neck;  దగిలి యుండి dagiliyuMDi) = attached;  యెపుడు (yepuDu) = all the time;  మీదు చూడరానివి (mIduchUDarAnivi) = not allowing to see upward.

 

Literal meaning: What is a sinful act? What is virtuous act? Aren’t  both these causing myriad bonds? It doesn't matter, whether the chains are made of gold or iron. Anyway they are pulling you from seeing upwards. 

భావము: పాప కర్మమేది; పుణ్య కర్మమేది? రెండూ కూడా బంధాలకు కారణమౌతున్నాయి.  తెంపకుండా ఉంటే బంగారు సంకెళ్ళైనా, ఇనుప సంకెళ్ళైనా, నిన్ను పైకి వెళ్ళనివ్వవు. (ఇక్కడే బంధించి ఉంచేస్తాయి). 

చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడుఁ దనకు

అలమిపట్టి దు:ఖములకు నప్పగించినట్టిది
యెలమిఁ బసిఁడిగుదియయేమి యినుపగుదియయేమి తనకు
ములుగ ములుగఁ దొలితొలి మోఁదు టింత చాలదా    ॥చాల॥ 

chalamukonna ApadEmi saMpadEmi yepuDu danaku

alamipaTTi du:khamulaku nappagiMchinaTTidi
yelami basiDigudiyayEmi yinupagudiyayEmi tanaku
muluga muluga dolitoli mOduTiMta chAladA         chAla

 

Word to Word meaning: చలముకొన్న (chalamukonna)  = పగపట్టిన, spiteful; ఆపదేమి (ApadEmi) = what adversity;  సంపదేమి (saMpadEmi) = what riches?;  యెపుడు (yepuDu) = all the time; తనకు (danaku) = to self;  అలమిపట్టిది (alamipaTTi) = క్రమ్మిపట్టుకొను దుఃఖములకు (du:khamulaku ) = నప్పగించినట్టి (nappagiMchinaTTidi) = handing over to;  యెలమి (yelami) = happiness, satisfaction; బసిడిగుదియయేమి basiDigudiyayEmi యినుపగుదియయేమి (yinupagudiyayEmi) = తనకు (tanaku) = ములుగ ములుగ (muluga muluga) = groaning; తొలితొలి (tolitoli) = first; మోదుటింత (mOduTiMta) = receiving a blow/hit;  చాలదా (chAladA) =  not sufficient? 

Literal meaning: Both the adversities and the riches, as if in a spiteful act, will actually hand you over to sorrow. Will you derive satisfaction because of receiving a blow/hit from a gold staff or an iron staff, while you continue to groan in pain? 

భావము: పగపట్టీనట్లు సంపదలు, ఆపదలు చివరకు నిన్ను దుఃఖములకే అప్పగిస్తాయి. దెబ్బతిని బాధపడుతున్నవాడు, పోనీలే దెబ్బ బంగారు కర్రతో తిన్నానని సర్ది చెప్పుకోడు కదా! 

కర్మియైనయేమి వికృతకర్మియైననేమి దనకు

కర్మఫలముమీఁదకాంక్ష గలుగు టింత చాలదా
మర్మ మెరిఁగి వేంకటేశుమహిమలనుచుఁ దెలిసినట్టి
నిర్మలాత్ము కిహముఁ బరము నేఁడు గలిగెఁ జాలదా  ॥చాల॥ 

karmiyainayEmi vikRtakarmiyainanEmi danaku

karmaphalamumIda kAMksha galuguTiMta chAladA
marmamerigi vEMkaTESu mahimalanuchu delisinaTTi
nirmalAtmu kihamu baramu nEDu galige jAladA  chAla

 

Word to Word meaning: కర్మియైనయేమి (karmiyainayEmi) = person doing conventionally accepted work;  వికృతకర్మియైనయేమి (vikRtakarmiyainanEmi) = person doing proscribed work;  తనకు (danaku) = for the self;  కర్మఫలముమీద karmaphalamumIda  = on the fruits of action; కాంక్ష(kAMksha) = desire;  గలుగు టింత (galuguTiMta) =  a tiny fraction; చాలదా (chAladA ) = is it not sufficient? మర్మమెరిగి (marmamerigi) = knowing this vital issue; వేంకటేశు (vEMkaTESu) = మహిమలనుచు (mahimalanuchu) = being GOD’s designs;   దెలిసినట్టి (delisinaTTi) = knowing;  నిర్మలాత్ము (nirmalAtmu) = clear minded person;   కిహము (kihamu)  = this world; పరము (baramu= paramu) = the other world;  నేడు (nEDu) = today, now; గలిగె galige = happened; చాలదా jAladA = is it not sufficient? 

Literal meaning: Whether a man is performing rightful duty, wrong duty; eying a tiny fraction of the fruits of action is sufficient to chain him. Having understood the secret, that person being aware of God, will experience both that  (other) side and this side (present life) on this very earth, immediately. 

భావము: పుణ్య కర్మలు చేసినా, చేయరానికర్మలు చేసినా లేశన్మాత్రమైనా (కూసింతైనా) ఫలాపేక్ష ఉంటే నిన్ను కట్టి వుంచుతుంది. మర్మమెరిగి, వేంకటేశ్వరుని మదిలో నిలిపిన నిర్మలునికి ఇహపరాలు ఇక్కడే, ఇప్పుడే సిద్ధిస్తాయి.

 

Comments: There are many who perform certain devotional service(s), with a view on annexation of virtuous acts, However, as explained in this verse, both virtuous and sinful deeds lead to bondage. Thus god has no connection with our conceptual virtuous and sinful deeds. This clearly indicates that these are the instruments created by man. 

Also the few roots of this verse are in the following shloka of Bhagavd-Gita. 

nādatte kasyachit pāpaṁ na chaiva sukṛitaṁ vibhuḥ
ajñānenāvṛitaṁ jñānaṁ tena muhyanti jantavaḥ (5-15)
 

Purport: The omnipresent God does not involve Himself in the sinful or virtuous deeds of anyone. The living entities are deluded because their inner knowledge is covered by ignorance.

వ్యాఖ్యలు: దైవసేవ చేసి పుణ్యం సంపాదించి మంచి మార్కులు కొట్టేయాలని చాలా మంది ఆలోచిస్తారు. కానీ, కీర్తన ద్వారా, పాపపుణ్యాలు రెండూ కూడా బంధాలకు కారణమౌతాయని;  మనం అనుకునే పాపపుణ్యాలను దైవం స్వీకరింపడని; అవి కేవలం ఆత్మతృప్తికై  మనుషులు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనము మాత్రమే అని తెలుస్తోంది. 

కీర్తన క్రింది భగవద్గీత  శ్లొకాన్ని కూడా సూచిస్తొంది. 

నాదత్తే కస్యచిత్పాపం చైవ సుకృతం విభుః
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ।। (5-15) ।।

భావము:సర్వాంతర్యామి అయిన భగవంతుడు, ఏ ఒక్కని పాపపు లేదా పుణ్య కర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు.

 

zadaz

Reference: Copper Leaf: 48-4, Volume: 1-297

 

 

 

 

2 comments:

  1. This is why i like the hindi song "wahan kaun hai tera musaafir ... jao ge kaha.."

    ReplyDelete
  2. ఈ దేహం ఇరవై నాలుగు తత్త్వములు అనగా దశేంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచభూతములు కాక మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తము లనబడే అంతఃకరణ చతుష్టయములతో యేర్పడింది.
    ఇంద్రియ నియంత్రణ లేక అహంకారం(ego)తో బ్రతికే ఈ జీవితం మరణంతో సమానమని అంటే ఆవిధంగా జీవించియున్నా మరణించినట్లే లెక్క యని, అట్టి జీవితానికి పరమార్థ మేమి యని అన్నమయ్య ప్రశ్నిస్తున్నాడు.నేను, నాది అనే కర్తృత్వభావన(ego) విడనాడవలెనని అన్నమయ్య ఈ పల్లవి యందు లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాడు.
    భోగభాగ్యములు, యజ్ఞయాగాది క్రతువుల వంటి పాపపుణ్య కర్మలన్నియును దుఃఖహేతువులని, పునర్జన్మకు కారణములని,ఇనుప దండమైనా, స్వర్ణ దండమైనా దానివల్ల కలిగే బాధ బాధ ఒకటేనని, నిషిధ్ధకర్మలు, పాపపుణ్య కర్మలు అన్నీ కూడా జన్మరాహిత్యానికి అడ్డంకులని, ఫలాపేక్షతో చేసిన పుణ్యకర్మలైనా మోక్షానికి అడ్డంకులని అన్నమయ్య
    బోధిస్తున్నాడు.
    ఫలాపేక్ష లేకుండా, నిర్మలచిత్తంతో, భగవదర్పణతో కర్మల నాచరించువాడు జీవన్ముక్తుడు కాగలడని అన్నమాచార్యులవారు మోక్షసిద్ధికి మార్గమును చూపిస్తున్నారు ఈ కీర్తన ద్వారా.
    ఓం తత్ సత్ 🙏
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...