Sunday, 26 June 2022

129 కలది గలట్టే కర్మఫలంబులు (kaladi galaTTE karmaphalaMbulu)

 

ANNAMACHARYA

129 కలది గలట్టే కర్మఫలంబులు

(kaladi galaTTE karmaphalaMbulu) 

Annihilate Actions

Introduction: In this verse Annamacharya questions if at all we are in our natural state? Central idea of this poem is when man is not the cause of so many natural things and occurrences, why man takes the reins of action into his hands? When the nature is self-sufficient to act, man takes unwanted freedom to intervene, obstructing natural process to take its own course.

The implied message of this poem is that man should accept as things happen to him, as if he has no choice, without resistance.  This original earthly expression on philosophy on first look is amusing. On understanding the intent, it appears the only way to put forward to make it easier for the folks.

ఉపోద్ఘాతము:  ఈ కీర్తనలో  అన్నమాచార్యుడు మనం నిజంగా మన సహజ స్థితిలో ఉన్నామా అని ఆశ్చర్యపోతాడు.  దీని మూల ప్రతిపాదన​ ఏమిటంటే, మానవుడు అనేకానేక​ సహజ విషయాలకు మరియు సంఘటనలకు కారణం కాడు.  తనలోని ప్రకృతి పనిచేయడానికి స్వయంగా సమర్ధత కలిగి ఉన్నప్పటికీ, అవాంఛితముగా మనిషి ప్రకృతిని దానంతట అదే పనిచెయ్యనివ్వకుండా, అనవసరముగా జోక్యము చెసుకుంటాడు అన్నారు.

ఎటువంటి ప్రతిఘటన లేకుండా, తనకు గత్యంతరమే లేనట్లు, తనలోనూ, తనచుట్టూ జరుగుతున్న కార్యములను మానవుడు అంగీకరించాలన్నదే ఈ కవితలోని అంతర్లీన సందేశం.  వింతగా కనపడు ఈ అసలు సిసలు గ్రామీణ​ పదాల  ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ప్రజలకు తత్వశాస్త్రం సులభతరం చేయడానికి  ఇది ఏకైక మార్గంగా కనిపిస్తుంది.

 

కీర్తన:

POEM

కలది గలట్టే కర్మఫలంబులు

నిలిపితిమా నేము నిమ్మకుఁ బులుసు॥పల్లవి॥ 

యెంత సేసినా యిహమున జీవికి

చెంత నజుఁడు వ్రాసిన కొలఁదే
వంతల ముంటికి వాఁడి వెట్టితిమా
కొంతతీపు చెఱకుకుఁ జల్లితిమా   ॥కలది॥ 

ఘనముగ బుద్ధులు గఱపిన దేహికి

మును నోఁచిన నోముఫలంబే
నినుపుఁ [1]దెంకాయకు నీరు నించితిమా
వొనర వేమునఁ జేఁదు నించితిమా ॥కలది॥ 

యిరవుగ శ్రీవేంకటేశుఁ డేప్రాణికి

కెరలి భాగ్య మొసఁగిన యంతే
మరువమునకు బరిమళము సేసితిమా
పెరిగేటి యడవులు పెంచితిమా   ॥కలది॥

kaladi galaTTE karmaphalaMbulu

nilipitimA nEmu nimmaku bulusu ॥pallavi॥ 

yeMta sEsinA yihamuna jIviki

cheMta najuDu vrAsina koladE
vaMtala muMTiki vADi veTTitimA
koMtatIpu che~rakuku jallitimA   kaladi 

ghanamuga buddhulu ga~rapina dEhiki

munu nOchina nOmuphalaMbE
ninupu [1]deMkAyaku nIru niMchitimA
vonara vEmuna jEdu niMchitimA kaladi 

yiravuga SrIvEMkaTESu DEprANiki

kerali bhAgya mosagina yaMtE
maruvamunaku barimaLamu sEsitimA
perigETi yaDavulu peMchitimA   kaladi

[1]  ‘టెంకాయ’ పూ.ము.పా. ‘తెన్ +కాయ’ అను సహజవ్యుత్పత్తికి రేకు అనుకూలము.

 

Details and Explanations:

 

కలది గలట్టే కర్మఫలంబులు

నిలిపితిమా నేము నిమ్మకుఁ బులుసు   ॥పల్లవి॥

 

kaladi galaTTE karmaphalaMbulu

nilipitimA nEmu nimmaku bulusu         pallavi

 

Word to Word meaning: కలది గలట్టే (kaladi galaTTE) = As is where is; కర్మఫలంబులు (karmaphalaMbulu) = results of actions; నిలిపితిమా (nilipitimA) = did we stop; నేము (nEmu) = మేము, We; నిమ్మకుఁ బులుసు (nimmaku bulusu) = as sour or acidity natural to the lemons.    

Literal meaning: Like the lemons hold the acidity naturally, did we put hold on all the reactions (results of actions) that exercise us. 

Explanation: The word కర్మఫలంబులు (karmaphalaMbulu) = results of actions is used in the sense that man reacts to the results he is receiving continuously. 

To appreciate the depth of this pronouncement, let us start with a Bhagavad-Gita verse: काम एष क्रोध एष रजोगुणसमुद्भव: || महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् || 3-37|| kāma eṣha krodha eṣha rajo-guṇa-samudbhavaḥ / mahāśhano mahā-pāpmā viddhyenam iha vairiṇam The Supreme Lord said: O Arjuna! The cause of this lust (desires) springs from the quality of Rajo guna (Mode of passion).  This is what is evolving into anger. It is insatiable and is the cause of the activity-centred movement. Therefore, Know this as the sinful and enemy on this path of salvation. 

Rajo guna is the one that evokes authorship (action-oriented) that I am the doer type engagement. on careful Observation, often, the cause of our grief is unintentional actions. Rajo guna merely engages the beings in the pretention of action. 

For example, In Delhi, road rage incidents are common. Usually, the actual damage is minor scratches or damage to cars.   The ensuing dispute, on the other hand, quickly evolves into combat, frequently resulting in injuries or even death. The obsession for one’s own car spirals into such violent action (which is Rajo guna), to the extent of taking away the life of another person.  Had there been a gap in time, same people would have acted more humanely. Even those who are very kind will ruin their entire life due to the influence of Rajo guna in a jiffy. 

From the above example, from the standpoint of view of cold logic, it appears very easy to remain neutral. When we face any situation, particularly when we are gripped by the intent to act as if we are right and the other man is wrong, momentarily we lose the analytical power. Refer to the keertana అప్పుడు చూచేదివో అధికుల నధముల appuDu chUchEdivO adhikula nadhamula#1. Inwardly we are all same. At the time of action, we exhibit our stupidity and the liberated their equanimity.

"Cease the existing action, by all means, without any appraisal as it is" is the intended meaning of the sentence కలది గలట్టే కర్మఫలంబులు నిలిపితిమా kaladi galaTTE karmaphalaMbulu nilipitimA. Any other action, short of stopping, such as endorsing or criticising the aforementioned behaviour, counts to continuation of the current activity. It's comparable to how politicians continue to attract attention due to either their honourable actions or unsavoury history. 

Thus, the chorus implies that that can you watch your actions so impartially as if someone else is acting in your place. (Remember that we judge others by their actions and ourselves by the intent). Please note saint hood is not going to a remote corner of the world but annihilating the action naturally. 

{Additional notes: To watch actions impartially, one must deal with dynamically varying thing called life. Therefore, we cannot deal it with fixed ideas#2. The limitations imposed by the physical body is on one hand and the fixed ideas on the other hand clog the path to pose more difficulty.  This journey of life may be described something like Tarzan moving from one place to the other using the arial roots. He leaves one root to catch another. Never two roots at the same time. 

Like Tarzan, we must leave one thing to catch another. The arial roots are the substance (bodies, ideas). Here roots indicate the mean, not the target. God provides the next root as if you have planned (like मयैवैते निहता: पूर्वमेव mayaivaite nihatāḥ pūrvam eva Bhagavad-Gita 11-33). The movement from one root to another is life. Holding on to one idea is death. The beauty of life lies in the unknown next.} 

Implied meaning: O man! Carefully observe your actions to stay naturally neutral. 

భావము: నిమ్మకుఁ బులుసుపట్టడము ఎంత సహజమో, అలాగే మన కర్మఫలములను ఉన్నవి ఉన్నట్లుగా నిలిపివైచితిమా?

వివరణము: కర్మఫలంబులు’  అనే పదం మానవుడు నిరంతరం పొందుతున్న ఫలితాలకు ప్రతిస్పందిస్తాడనే అర్థంలో ఉపయోగించబడింది. 

అన్నమాచార్యుల అచ్చతెనుగు పలుకులు గణించుట కొరకు, ఒక భగవద్గీత శ్లోకంతో ప్రారంభిద్దాం: “కామ ఏష క్రోధ ఏష రజోగుణసముధ్భవః / మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్” ॥3-37॥. శ్రీ భగవానుడు ఇట్లుపలికెను; అర్జునా! నీ వడిగిన యీ కామమనే (కోరికలు,వాంఛలు) హేతువు రజోగుణమువలన పుట్టినదిఇదియే క్రోధముగా పరిణామము చెందుచున్నది. కామము ఎంత అనుభవించినప్పటికిని తృప్తిని బొందనిదై, కర్మకేంద్రిత చర్యల పద్మవ్యూహమునకు కారణభూతమై యున్నది. కావున దీనిని మోక్షమార్గమున శత్రువుగా నెఱుఁగుము.


రజో గుణము “చేయునది నేనే ననే వూహను” (యాక్షన్ ఓరియెంటెడ్) ప్రేరేపిస్తుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే, చాలావరకు, మన దుఃఖానికి కారణం అనాలోచిత చర్యలే.  అది జీవులను చర్య యొక్క భావనలో నిమగ్నం చేస్తుంది. రజోగుణము నందు కేవలం చర్యయే కేంద్రిత మగును.


ఉదాహరణకు ఢిల్లీలో రోడ్ రేజ్ సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. మామూలుగా ఒక కారుని ఇంకో వాహనం రాసుకుని పోవడమో, గీసుకుపోవడమో, చిన్న డొక్కలు పడడమో , చిన్నపాటి నష్టమో జరుగుతుంది.   ఆ వెనువెంటనే జరిగే వాగ్వివాదము ఘర్షణకు తలుపులు తెరచి, గాయాలవడమో చంపబడడమో జరుగుతుంది. తన కారుపై గల అభిమానము (అతి ప్రేమ) సుళ్ళుతిరిగుతూ హింసాత్మక చర్యగా మారి మరొక వ్యక్తి ప్రాణాలను తీసేంత వరకు దారితీస్తుంది. (ఇదియే రజోగుణము). అటువంటివారే, కొంచెం వ్యవధి తర్వాత మరింత మానవత్వంతో వ్యవహరించ గలిగేవారు. ఎంతో ఉదార స్వభావం కలిగిన వారు సైతం క్షణికావేశంలో రజోగుణ ప్రభావం వల్ల జీవితం అంతా పాడు చేసుకుంటారు.

ఆమధ్య వాట్స్ యాప్ ద్వారా సందేశంలో, ఒక తండ్రి  తన చిన్నారి కొడుకు, కొత్త కారు మీద ఏదో గీకేశాడని కోపంతో చేతిమీద కొడితే పిల్లవాడి వేళ్ళు విరిగిన సంగతి గుర్తు చేసుకో గలరు. ఇదీ రజోగుణ ప్రభావమే.

"ఇప్పటికే చేస్తున్న చర్యలను ఉన్నవి ఉన్నపాళంగా నిలిపివేయండి, అన్ని విధాలుగా, సందేహం లేకుండా," అనేది  కలది గలట్టే కర్మఫలంబులు నిలిపితిమా” యొక్క ఉద్దేశిత లక్ష్యము. ‘చర్యలను’ సమర్థించడమో లేదా విమర్శించడమో వంటి ఏదైనా ఇతర క్రియ ఐనా, ప్రస్తుత కార్యకలాపానిని కొనసాగింపుగా లెక్కించండి.  వారి గౌరవప్రదమైన చర్యల వలనో లేదా అవాంఛనీయమైన చరిత్ర కారణంగానో రాజకీయ నాయకులు ప్రజల నోళ్ళలో నానుతూనే ఉంటారో అలాగే కర్మఫలములను గూర్చి ఆలోచించడమూనూ.

పై ఉదాహరణ నుండి, తర్క పరంగా చూస్తే, తటస్థంగా ఉండటం చాలా సులభం అనిపిస్తుంది. మనం ఏదైనా పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, ప్రత్యేకించి మనం సరియై, ఖర్మకాలి అవతలి వ్యక్తి తప్పైతే, అవతలవాడికి సత్యము ఎరుక చేయాలనే క్షణికావేశంలో, విశ్లేషణాత్మక శక్తిని కోల్పోయి, ఎదుటి వాడు చేసిన​ తప్పు కంటే మనం ఎక్కువ ఘోరముగా ప్రవర్తించుదుము.

‘అప్పుడు చూచేదివో అధికుల నధముల’#1 అనే  కీర్తన చూడగలరు​. అంతర్గతంగా మనమందరం ఒకటే. చర్య తీసుకునే సమయంలో, మనం మన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తాము. వివేకులు సమానత్వాన్ని చూపుదురు.

ఈ పల్లవి అందువలన‍ మీ స్థానంలో వేరొకరిని ఊహించి, 'వారి చర్యలను నిష్పక్షపాతంగా చూడగలరా?" అని ప్రశ్నిస్తుంది. (ఇతరుల చర్యలను బట్టి, మనలను మనం ఉద్దేశాన్ని బట్టి బేరీజు చేస్తామనే విషయాన్ని గుర్తుంచుకోండి). దయచేసి గమనించండి: సన్యాసమంటే ప్రపంచంలోని మారుమూల మూలలకు వెళ్ళడం కాదు; చర్యలను సహజంగా భస్మీపటలం కావించడమే.

{అదనపు వివరణము: చర్యలను నిష్పక్షపాతంగా చూడటానికి, క్షణక్షణమునకు మారు (క్రియాశీలముగా నున్న) విషయాలతో వ్యవహరించాలి. అక్కడ​ ఇప్పటి స్థిరమైన ఆలోచనలు పనిచేయవు#2. భౌతిక శరీరం విధించిన పరిమితులు ఒక వైపు మరియు స్థిరమైన ఆలోచనలు మరొక వైపు అడ్డుకోని మార్గాన్ని  మరింత కష్టతరం చేస్తాయి.  ఈ (జీవన) ప్రయాణాన్ని టార్జాన్ ఊడలు ఉపయోగించి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలి వెళ్ళడంలా వర్ణించవచ్చు. అతను మరొకదాన్ని పట్టుకోవడానికి ఒక ఊడను వదిలివేస్తాడు. ఒకే సమయంలో ఎన్నడూ రెండు ఊడలు పట్టుకోడు.

టార్జాన్ లాగా, మనం మరొకదాన్ని పట్టుకోవటానికి ఇప్పటి దానిని విడిచితీరాలి. వేలాడే ఊడలు పదార్థ సమ్మేళనం (దేహములు, ఆలోచనలు). ఇక్కడ ఊడలు ఊతమేగానీ లక్ష్యము గాదు. మీ కోసమే అమర్చినట్లుగా దేవుడు తదుపరి ఊడని అందిస్తాడు (‘మయైవైతే నిహతాః పూర్వమేవ’ భగవద్గీత 11-33).  ఒక ఊడ నుండి మరొక ఊడకు జరిగే కదలికే జీవనం. ఒకే ఆలోచనకు కట్టుబడి ఉండటమే మరణం. జీవనం యొక్క అందమంతా తెలియని తరువాతి దానిలోనే దాగి ఉంది.}

అన్వయార్ధము: ఓ నరుడా! సహజంగా, నిష్పక్షపాతముగా ఉంటూ నీ చర్యలను నిపుణతతో గమనించ గలవా? 

యెంత సేసినా యిహమున జీవికి

చెంత నజుఁడు వ్రాసిన కొలఁదే

వంతల ముంటికి వాఁడి వెట్టితిమా

కొంతతీపు చెఱకుకుఁ జల్లితిమా ॥కలది॥

 

yeMta sEsinA yihamuna jIviki

cheMta najuDu vrAsina koladE

vaMtala muMTiki vADi veTTitimA

koMtatIpu che~rakuku jallitimA  kaladi

Word to Word meaning:  యెంత సేసినా (yeMta sEsinA) = Whatever be your effort; యిహమున (yihamuna) = ఈ ప్రపంచంలో, in this world;  జీవికి (jIviki) = to the living being; చెంతన (cheMtana) = alongside; జుఁడు (ajuDu) = విధాత​, Brahma (here read it as fate); వ్రాసిన కొలఁదే (vrAsina koladE) = to the extent scripted;  వంతల (vaMtala) =  వీథినాటకమున  పాటలో వెనుక వుండి  'తందానతాన' మొదలగు మాటలు అని కలుపుట, (ఇక్కడ “నేనూ ఉన్నానని” తెలుపు అనే అర్ధములో), vying to show ones presence;  ముంటికి (muMTiki)  = ముల్లు, thorns; వాఁడి వెట్టితిమా (vADi veTTitimA) = వాడి పెట్టితిమా , Did we sharpen? కొంతతీపు (koMtatIpu) = A small faction of sweetness; చెఱకుకుఁ (che~rakuku) = to sugar cane; జల్లితిమా (jallitimA) = did we sprinkle? 

Literal meaning: Whatever be your efforts, you shall receive as fate dictates. Have you sharpened the protruding thorns vying to prick? Did you infuse sweetness in sugar cane? 

Explanation: The expression వంతల ముంటికి వాఁడి వెట్టితిమా (vaMtala muMTiki vADi veTTitimA) The expression is signifying man’s displayed character. Without compunction, he takes uninhibited pride, he joins the chorus, as if he has sharpened all the thorns (of the world). He does not understand he is the rock in the hand of the sculptor who carves him. Instead of melting like butter he freezes like stone, instead of becoming supple becomes rigid,  inviting unwanted blows of the hammer.

Implied meaning: Take things as they happen without resistance as if you have no choice.

భావము: మీ ప్రయత్నాలు ఎలా ఉనప్పటికీ, విధి నిర్దేశించిన విధంగానే మీరు  (జీవితాన్ని) అందుకుంటారు. “నేనూ ఉన్నానని” అంటూ గుచ్చుకోవడానికి పోటీ పడుతున్న ముళ్ళకు మీరు పదును పెడుతున్నారా? చెరకులో మాధుర్యాన్ని మీరే  నింపారా?

వివరణము: వంతల ముంటికి వాఁడి వెట్టితిమా’ మనిషి ప్రదర్శించు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఏమాత్రం సంకోచం లేకుండా, అహంకారంతో జీవన ప్రవాహములో చేరబోతాడు. వంత పాడబోతాడు. అవివేకంగా తానే (ప్రపంచంలోని) అన్ని ముళ్ళకు  పదును పెట్టినట్లు భావిస్తాడు.  తనను చెక్కే శిల్పి చేతిలోని శిలనని ఎఱగడు. వెన్నలా కరుగుటకు బదులు, రాయిలా ఘనీభవించి సమ్మెట పోట్లకు గురౌతాడు.

అన్వయార్ధము: ప్రత్యామ్నయమేలేనట్లుగా, అణుమాత్రం ప్రతిఘటన లేకుండా జీవితంలోని ఘటనలు జరుగుతున్నవి జరుగుతున్నట్లుగా తీసుకోండి.

ఘనముగ బుద్ధులు గఱపిన దేహికి

మును నోఁచిన నోముఫలంబే

నినుపుఁ దెంకాయకు నీరు నించితిమా

వొనర వేమునఁ జేఁదు నించితిమా          ॥కలది॥

 

ghanamuga buddhulu ga~rapina dEhiki

munu nOchina nOmuphalaMbE

ninupu [1]deMkAyaku nIru niMchitimA

vonara vEmuna jEdu niMchitimA          kaladi 

Word to Word meaning: ఘనముగ (ghanamuga) = with great; బుద్ధులు (buddhulu) = knowledge and education; గఱపిన (ga~rapina) = imparted, instructed;  దేహికి (dEhiki) = a person; మును (munu) = ముందరి, earlier;  నోఁచిన (nOchina) = ప్రాప్తము, అదృష్టము, bestowed, luck, chance, fate; నోముఫలంబే (nOmuphalaMbE) = results of past vows; నినుపుఁ (ninupu) = నింపుయొక్క రూపాంతరము, fill;  దెంకాయకు (deMkAyaku) = to coconut;  నీరు (nIru) = water; నించితిమా (niMchitimA) = నింపితిమా? Did we fill? వొనర (vonara) = కలుగు,  అంగీకరించు, by chance, by facilitating; వేమునఁ (vEmuna) = to the neem tree; జేఁదు (jEdu) = bitterness; నించితిమా (niMchitimA) = did we add?

Literal meaning: Even Those who received great education, knowledge, still have to endure results of the past actions. Did we fill the coconut with water? Did we inject bitterness into the neem? 

భావము: గొప్ప విద్య, జ్ఞానం పొందిన వారు కూడా గత కర్మల ఫలితాలను ఇంకా భరించవలసి ఉంటుంది.  కొబ్బరిని నీటితో నింపామా? వేపకు చేదును చల్లితిమా?

యిరవుగ శ్రీవేంకటేశుఁ డేప్రాణికి

కెరలి భాగ్య మొసఁగిన యంతే

మరువమునకు బరిమళము సేసితిమా

పెరిగేటి యడవులు పెంచితిమా ॥కలది॥

 

yiravuga SrIvEMkaTESu DEprANiki

kerali bhAgya mosagina yaMtE

maruvamunaku barimaLamu sEsitimA

perigETi yaDavulu peMchitimA  kaladi 

Word to Word meaning: యిరవుగ (yiravuga) = Suitably; శ్రీవేంకటేశుఁడు (SrIvEMkaTESuDu) = Lord Venkateswara; ప్రాణికి (E prANiki) = the concerned living being;  కెరలి (kerali) = నిన్ను కదిలించి నంత అనే అర్థంలో వాడారు; to the extent stirred; భాగ్య మొసఁగిన (bhAgya mosagina) = what Luck, fortune will provide;  యంతే (yaMtE)= as much;  మరువమునకు (maruvamunaku) = to maruva (in hindi), sweet marjoram; బరిమళము (barimaLamu) = fragrance; సేసితిమా (sEsitimA) = did we give, did we offer; పెరిగేటి (perigETi) = growing; యడవులు (yaDavulu) = forests; పెంచితిమా (peMchitimA) = Did we grow?

Literal meaning: Lord Venkateshwara provides to the extent living beings deserve. Did we add the pleasing aroma to sweet marjoram (‘maruva’ in Hindi)? Are we the cause for growth of forests? 

Explanation: When we understand that we are receiving as destined; accept it without any regret, without any resistance, we have fewer things to worry. However, we generally show resistance and energy is lost in many such transactions.  

The intent of this poem is not get bogged by what we receive, but continue your journey of life, like a boxer who despite falling tries to stand up. 

Implied meaning: Nature and Dharma take their own course. Be on their side. Resistance is the symbol of ignorance. #3

భావము: వేంకటేశ్వరుడు జీవులకు అర్హమైన మేరకు ప్రసాదిస్తాడు. 'మరువము'కు ఆహ్లాదకరమైన సువాసనను మనము జోడించామా? అడవుల పెరుగుదలకు మనమే కారణమా?

వివరణము: మరువమునకు పరిమళము అబ్బినట్లే అడవులు పెరిగినట్లే అత్యంత సహజంగా మనకు తగినవే లభించుచున్నవని ఎరిగి వాటిని ఎటువంటి విచారము లేకుండా అట్లే స్వీకరించిన మధనపడుటకు కొన్నియే మిగులును. అలాకాకుండా సాధారణంగా మనము, ‘అయ్యో భగవంతుడు నాకీ కష్టము ఇచ్చాడు. ప్రక్క వాడికి అర్హత లేకున్నా సుఖములను అనుభవించు చున్నాడు, దీనికి కారణమేమని, నా తప్పేమి’ అని కలవరపడి, దుఃఖించి శక్తిని వ్యర్థము చేసుకుందుము.

ఈ కీర్తన మనం అందుకున్న భాగ్యముతో వగచుతూ వుండిపోక, పడిపోయినప్పటికీ నిలబడటానికి ప్రయత్నించే పిల్లవానిలాగ లాగా జీవిత ప్రయాణాన్ని కొనసాగించ మంటోంది.

అన్వయార్ధము: మానవులారా! ప్రకృతి మరియు ధర్మము తమ స్వంత మార్గాన్ని అనుసరించుతాయి. వాటి పక్షాన ఉండండి. ప్రతిఘటన అజ్ఞానానికి చిహ్నం. #3

 

References and Recommendations for further reading:

#1 48 అప్పుడు చూచేదివో అధికుల నధముల (appuDu chUchEdivO adhikula nadhamula)

#2 108. గోనెలె కొత్తలు కోడెలెప్పటివి (gOnelekottalu kODeleppaTivi)

#3 102. తమ వుద్యోగము లేల తమకము లేల (tamavudyOgamu lEla tamakamu lEla)

 

Summary of this Keertana:

 

Chorus: Like the lemons hold the acidity naturally, did we put hold on all the reactions (results of actions) that exercise us.  Implied meaning: O man! Carefully observe your actions to stay naturally neutral. 

Stanza 1: Whatever be your efforts, you shall receive as fate dictates. Have you sharpened the protruding thorns vying to prick? Did you infuse sweetness in sugar cane? Implied meaning: Take things as they happen without resistance as if you have no choice. 

Stanza 2: Even Those who received great education, knowledge, still have to endure results of the past actions. Did we fill the coconut with water? Did we inject bitterness into the neem? 

Stanza 3: Lord Venkateshwara provides to the extent living beings deserve. Did we add the pleasing aroma to sweet marjoram (‘maruva’ in Hindi)? Are we the cause for growth of forests? Implied meaning: Nature and Dharma take their own course. Be on their side. Resistance is the symbol of ignorance.

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: నిమ్మకుఁ బులుసుపట్టడము ఎంత సహజమో, అలాగే మన కర్మఫలములను ఉన్నవి ఉన్నట్లుగా నిలిపివైచితిమా? అన్వయార్ధము: ఓ నరుడా! సహజంగా, నిష్పక్షపాతముగా ఉంటూ నీ చర్యలను నిపుణతతో గమనించ గలవా?

చరణం 1: మీ ప్రయత్నాలు ఎలా ఉనప్పటికీ, విధి నిర్దేశించిన విధంగానే మీరు  (జీవితాన్ని) అందుకుంటారు. “నేనూ ఉన్నానని” అంటూ గుచ్చుకోవడానికి పోటీ పడుతున్న ముళ్ళకు మీరు పదును పెడుతున్నారా? చెరకులో మాధుర్యాన్ని మీరే  నింపారా? అన్వయార్ధము: ప్రత్యామ్నయమేలేనట్లుగా, అణుమాత్రం ప్రతిఘటన లేకుండా జీవితంలోని ఘటనలు జరుగుతున్నవి జరుగుతున్నట్లుగా తీసుకోండి.

 

చరణం 2: గొప్ప విద్య, జ్ఞానం పొందిన వారు కూడా గత కర్మల ఫలితాలను ఇంకా భరించవలసి ఉంటుంది.  కొబ్బరిని నీటితో నింపామా? వేపకు చేదును చల్లితిమా?

చరణం 3: వేంకటేశ్వరుడు జీవులకు అర్హమైన మేరకు ప్రసాదిస్తాడు. 'మరువము'కు ఆహ్లాదకరమైన సువాసనను మనము జోడించామా? అడవుల పెరుగుదలకు మనమే కారణమా? అన్వయార్ధము: మానవులారా! ప్రకృతి మరియు ధర్మము తమ స్వంత మార్గాన్ని అనుసరించుతాయి. వాటి పక్షాన ఉండండి. ప్రతిఘటన అజ్ఞానానికి చిహ్నం.

 

 

 

Copper Leaf: 91-4;  Volume 1-450

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...