ANNAMACHARYA
93. ఊరికిఁ బోయెడి వోతఁడ
(Uriki bOyeDi
vOtaDa)
Quo Vadis?
Introduction: Let me present a sweet
little poem. Annamacharya is cautioning the traveller, not to go here and
there. To me this song looks like that of Little Red Riding Hood and the Big
Bad Wolf. Little Red Riding Hood’s mother cautions her not to deviate from the foot
path already there. But she does deviate only to be found by the Big Bad Wolf. Do we
pay heed to the parental advise of God?
In this verse Annamacharya
appears more like western philosophers. As usual, he uses very typical native
words to bring that earthly feeling of oneness with the nature.
The Original question Quō vādis? is addressed to all of us.
ఉపోద్ఘాతము: ఒక మధురమైన కీర్తన ఇది. అక్కడకు మరియు ఇక్కడకు వెళ్లవద్దని అన్నమాచార్యులు ప్రయాణికుడికి సూచిస్తున్నారు. నాకు ఈ పాట లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ మరియు బిగ్ బ్యాడ్ వోల్ఫ్ లాగా అనిపిస్తుంది. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ తల్లి అప్పటికే అక్కడ అందరూ నడిచిన బాటనే నడవమని, దాని నుండి తప్పుకోవద్దని హెచ్చరిస్తుంది. కానీ ఆ అమ్మాయి, రంగు రంగుల పూలను చూసి వాటిని కోద్దామనుకుని అటూ ఇటూ వెళ్ళి బిగ్ బ్యాడ్ వోల్ఫ్‌కి కనబడి పోతుంది. మనమూ ఆ అమ్మాయి లాగే దైవమిచ్చు సంజ్ఞలను గాలికి వదలివేయమా?
ఈ కీర్తనలో అన్నమాచార్య పాశ్చాత్య తత్వవేత్తల వలె కనిపిస్తాడు. ఎప్పటిలాగే, కవిత్వాన్ని ప్రకృతితో మమేకమైన అనుభూతిని తీసుకురావడానికి చాలా సాధారణంగా వాడే చిన్న చిన్న పదాలను అతి సమర్ధవంతంగా ఉపయోగిస్తాడు.
ఎప్పటికీ నిలచివుండే 'పయనమెచటికోయి?'కి సమాధానము మనమందరమూ వెతకవలసినదే!
కీర్తన:
ఊరికిఁ బోయెడి వోతఁడ కడు- చేరువ తెరు వేఁగి చెలఁగుమీ ॥పల్లవి॥
ఎడమతెరువువంక కేఁగిన దొంగలు తొడిఁబడ గోకలు దోఁచేరు
కుడితెరువున కేఁగి కొట్టువడక
మంచి-
నడిమితెరువుననే నడవుమీ ॥ఊరి॥
అడ్డపుఁ దెరువుల నటునిటుఁ జుట్టాలు వెడ్డువెట్టుచు నిన్ను వేఁచేరు
గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక
దొడ్డతెరువువంక తొలఁగుమీ ॥ఊరి॥
కొండతెరువు కేఁగి కొంచపుసుఖముల బండై తిరుగుచు బడలేవు
అండనుండెడిపరమాత్ముని తిరుమల-
కొండతెరువు తేఁకువ నేఁగుమీ ॥ఊరి॥
|
Uriki bOyeDi vOtaDa kaDu- chEruva teru vEgi chelagumI ॥pallavi॥
eDamateruvuvaMka kEgina doMgalu toDibaDa gOkalu dOchEru
kuDiteruvuna kEgi koTTuvaDaka maMchi-
naDimiteruvunanE naDavumI ॥Uriki॥
aDDapu deruvula naTuniTu juTTAlu veDDuveTTuchu ninnu vEchEru
goDDErEchinnadiDDiteruvu vOka
doDDateruvuvaMka tolagumI ॥Uriki॥
koMDateruvu kEgi koMchapusukhamula baMDai tiruguchu baDalEvu
aMDanuMDeDiparamAtmuni tirumala-
koMDateruvu tEkuva nEgumI ॥Uriki॥
|
Details and Explanations:
ఊరికిఁ బోయెడి వోతఁడ కడు-
Uriki bOyeDi vOtaDa kaDu-
Word to Word meaning: ఊరికిఁ (Uriki) = to town, to village; బోయెడి (bOyeDi) = going; వోతఁడ (vOtaDa) = O Man; కడు-చేరువ (kaDu-chEruva) = much closer; తెరువు (teruvu) = Way, path, manner, style, fashion; ఏఁగి చెలఁగుమీ (Egi chelagumI) = come here and rejoice;
Literal meaning: O Traveller! The path is close by.
Come. Appear here and rejoice.
Explanation: Why Annamacharya is calling man traveller. Where from this innate feeling that ‘I must go somewhere’ has generated in man? As you might have noted, this feeling to move and to act is universal.
Have you ever thought, what is actually moving? This is not a trivial question posed to fill space and waste your time. Please contemplate on this! Try to understand meaning of eternal changeless existence called God. Can you identify what is moving?
Now you see the connect with wording kaDu-chEruva teruvu (కడు-చేరువ తెరువు). This means, if you do not go anywhere, you stay with God.
The word chelagu actually means to shine, to flourish, to rejoice. Here Annamacharya meant that when a person found the path to God, in that joy he will shine / flourish / rejoice Sir, I assure you that the philosophical verses of Annamacharya are deeper than many assume.
Implied meaning: O Traveller! Quo Vadis? (Where are you going?). Path
to liberation is within you.
భావము: ఓ బాటసారి! తెరువు
కడు-చేరువనే ఉన్నది. వచ్చి ప్రకాశించు! (ఆ పారవశ్యంలో చెలరేగిపో)
వివరణము: అన్నమయ్య
మనిషిని బాటసారి అని ఎందుకు సంబోధిస్తున్నాడు? ‘నేను ఎక్కడికో వెళ్లాలి’ అనే ఈ సహజ భావన మనిషిలో
ఎక్కడ నుండి పుట్టింది? మీరు గమనించినట్లుగా, ఈ కదలాలి; ఏదో చెయ్యాలి అనుకోవడం లాంటి అనుభూతులు
మానవులందరికీ సార్వత్రికం.
మీరు ఎప్పుడైనా
ఆలోచించారా, నిజంగా కదిలేది
ఏమిటి? ఇది కేవలం
స్థలాన్ని పూరించడానికి మరియు మీ సమయాన్ని వృధా చేయడానికి వేసిన ప్రశ్న కాదు. దయచేసి దీని గురించి
ఆలోచించండి! శాశ్వతమైన మార్పులేని ఉనికిని
అర్థం చేసుకోవడానికి వీలుగా మనం దేవుడు అని పిలుస్తున్నాం. ఇప్పుడు, కదిలేది యేదో మీరు గుర్తించగలరా?
ఇప్పుడు 'కడు-చేరువ
తెరువు' అన్న పదములతో 'ఊరికిఁ బోయెడి
వోతఁడ'కు కల సంబంధం
పరిశీలించండి. ఏక్కడికీ పోని వాడికి 'శాశ్వతమైన మార్పులేని ఉనికి'
దగ్గరగా
ఉండటానికి అస్కారం ఎక్కువ. అంటే వాడికి 'కడు-చేరువ
తెరువు' అని అర్ధం.
అన్నమాచార్యుల
తాత్విక కీర్తనలు చాలామంది అనుకున్నదానికంటే లోతుగా ఉంటాయని నేను మీకు ఖచ్చితంగా
చెప్పగలను.
అన్వయార్ధము: ఓ యాత్రికుడా! ఎక్కడికి
పోతావు?
ముక్తికి మార్గం నీలోనే ఉంది.
ఎడమతెరువువంక
కేఁగిన దొంగలు
eDamateruvuvaMka kEgina doMgalu
Word to Word meaning: ఎడమ తెరువువంక (eDama teruvuvaMka) = left side path; కేఁగిన (kEgina) = move along; దొంగలు (doMgalu) తొడిఁబడ (toDibaDa) = perplex (you); గోకలు (gOkalu) = clothes; దోఁచేరు (dOchEru) = take away; కుడితెరువున (kuDiter = thieves; uvuna) కేఁగి (kEgi) = go along; కొట్టువడక (koTTuvaDaka) = పాకులాడు, మిక్కిలి ఆశపడు, to scramble, to hanker after things; మంచి- (maMchi) = good; నడిమితెరువుననే (naDimiteruvunanE) = middle path; నడవుమీ (naDavumI) = walk along.
Literal meaning: O Traveller! If you go to the left side, there thieves will perplex you and run away with your clothes. Do not go to the right side for you will only hanker after things. Walk along the middle path.
Explanation: Annamacharya is asking the traveller to stay equidistant from left and right-side paths despite their attraction. However, it is not the middle path Annamacharya is asking the traveller to tread. He is not for any compromise solutions. We shall get better idea on this after seeing the explanation of the next stanza.
Implied meaning: O Traveller! Do not take sides. Stay
where you are.
భావము: ఎడమకు ఏగిన దొంగలు
తొట్రుపడునట్లు చేసి కోకలు దోఁచుకుందురు. కుడివైపు కెళ్ళి మిక్కిలి ఆశలతో పాకులాడుతూ ఉండొద్దు. నడిమి తెరువుననే నెమ్మది నడవుమీ.
వివరణము: అన్నమాచార్యులు ప్రయాణికుడిని, అవి యెంతగా ఆకర్షిస్తున్నప్పటికీ, ఎడమ మరియు కుడి త్రోవలలో వెళ్ళవద్దని, వాటికి సమాన దూరంలో ఉండమని అడుగుతున్నారు. అయితే, అన్నమాచార్య ప్రయాణికుడిని మధ్య మార్గంలో నడవమని కోరడం సర్దుబాటు మార్గం కాదు. నిజానికి అన్నమయ్య మానవుణ్ణి ఉన్నచోటనే ఉండమంటున్నాడు. అతదుపరి చరణం యొక్క వివరణను చూసిన తర్వాత మనం దీని గురించి ఆలోచింతము.
అన్వయార్ధము: ఓ యాత్రికుడా! అటునిటు
ఊగిసలాడకు. ఉన్నచోటనే ఉండము.
అడ్డపుఁ దెరువుల నటునిటుఁ
జుట్టాలు
aDDapu deruvula naTuniTu juTTAlu
Word to Word meaning: అడ్డపుఁ దెరువుల (aDDapu deruvula) = cross ways, short cuts; నటునిటుఁ (naTuniTu) = that side and this side; జుట్టాలు (juTTAlu) = relations; వెడ్డువెట్టుచు (veDDuveTTuchu) = to cheat, delude, beguile; నిన్ను (ninnu) = you; వేఁచేరు (vEchEru) = subject to intense heat; గొడ్డేరే (goDDErE) = a dry stream; చిన్న (chinna) = small; దిడ్డి (diDDi) = a small door or gate, a wicket, a postern or back door, a sally-port. తెరువు (teruvu) = Way, path, manner, style, fashion; వోక (vOka) = one; దొడ్డతెరువువంక (doDDateruvuvaMka) = move to the big way; తొలఁగుమీ (tolagumI) = to move or step aside, get out of the way, go off, to transgress;
Literal meaning: Your relations will put intense pressure to
dissuade you by showing you many cross cuts (to remove you from your chosen
path). Go along that dry stream thru that small wicket gate only to transgress
into big way.
Explanation: It is obvious that relations shall try to prevent you from pursuing the path of God. However, most interesting thing he said is to ask man to enter thru the small wicket gate. What does this signify.
Just consider the biblical saying: (Matthew 7:13-14) 13“Enter through the narrow gate. For wide is the gate and broad is the road that leads to destruction, and many enter through it. 14Because strait is the gate, and narrow is the way, which leadeth unto life, and few there be that find it. What Jesus or Annamacharya are indicating by their expressions?
As we have seen in all previous verses, the intelligence or liberation cannot be achieved consciously. We can only prepare and offer ourselves for the divine intervention. Like the metamorphosis of the caterpillar into the butterfly happens thru pupa stage.
During the pupa stage, the caterpillar's old body dies and a new body forms inside a protective shell known as a chrysalis. However, man does not have such natural stage like these colourful insects.
Now you can understand what they
mean by narrow gate. The metamorphosis of man is not a physical change but
psychological transformation. In any metamorphosis there is complete change.
The new has no relationship with the old. Man should bravely submit himself to
that altar. O Man, this is the only meditation. This is the most dauting
task. No wonder that Jesus said few enter this gate.
What is this doDDateruvu (దొడ్డతెరువు) When a person is liberated, he no longer has the sense of self or selfish ideas. In fact for him there is no distinction between him and the world. That oneness with the world is infinite feeling. Therefore, Annamacharya called it as big way.
Thus Sirs, please note that meditation is an act of submission to God, whereas as prayer is only a petition. Meditation is doing. Meditation is dynamic. Meditation is the essence of life. Please mark the wording in Bible again: ..which leadeth unto life, and few there be that find it. (also see the additional notes below).
When we realise meditation is an
act of self-submission, how can any one teach you how to meditate? Sirs do not
believe Babas and other quacks. It must
be done by yourself.
Additional Notes on narrow
gate:
What is this travel thru the narrow gate: What Man
should submit by meditation? He must leave all his conscious and unconscious psychological
belongings or baggage. Just understand this is what Buddha did. So also, great
men like Jiddu Krishnamurti, Ramana Maharshi. After this submission, man is no
more in contact with his past. in that indescribable act of meditation, they
had experienced the truth. If one is
afraid, he cannot meditate. If one wants safety, he cannot meditate.
If caterpillar
is afraid of death, it cannot transform into
butterfly. Sirs, we are afraid, we want safety, we want our comforts. Where is
the question of transformation?
Just imagine the anthills growing around the great
sages of India. Now you can feel it is not a story. They are so immersed in the
meditation; they are not aware of the environment around them. I am not saying
that not being aware of the external world is meditation. We also do not know
the external and internal world. We are simply ignorant. Of course, anthills
are not essential. But act of meditation is.
Though
repetition, consider these below paras as well to understand the essence of the
narrow gate described by Annamayya and Jesus Christ. It is not a comforting
experience.
Matthew 16:24–26 (NKJV) “Then Jesus said to His
disciples, ‘If anyone desires to come after Me, let him deny himself, and take
up his cross, and follow Me. For whoever desires to save his life will lose it,
but whoever loses his life for My sake will find it. For what profit is it to a
man if he gains the whole world, and loses his own soul? Or what will a man
give in exchange for his soul?’”
Also this
wording in Bhagavad-Gita indicate that such practitioner, will either care for
his safety and health निर्योगक्षेम आत्मवान् ||2-
45|| niryoga-kṣhema ātmavān
Annamacharya said that అదిగాక నిజమతం బదిగాక
యాజకం-బదిగాక హృదయసుఖ మదిగాక పరము (adigAka nijamataM badigAka
yAjakaM- badigAka hRdayasukha madigAka paramu) The other
state is beyond the pretty imagination, beyond the methods of sacrifice, not a
comforting theory to your heart.
భావము: చుట్టాలు వారి వారి
అడ్డమైన వాదనలతో నిన్ను దారి మళ్ళించ చూస్తారు. అదిగో అక్కడ కనబడుతున్న చిన్న
ద్వారం గుండా వెళ్ళు. అక్కడ నీకు దొడ్డ మార్గం కనబడుతుంది.
వివరణము: దైవమును
అనుసరించనీకుండా మిమ్మల్ని నిరోధించడానికి బంధువులు ప్రయత్నిస్తారని స్పష్టంగా
తెలియండి. అయితే,
అన్నమయ్య చెప్పిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనిషిని దిడ్డితెరువు (చిన్న ద్వారం) గుండా ప్రవేశించమని అడగడం! ఇది
దేనిని సూచిస్తుందో?
(బైబిలు,
మత్తయి సువార్త 7: 13) 13ఇరుకు
ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి
విశాలమునైయున్నది, దాని ద్వారా
ప్రవేశించువారు అనేకులు. 14జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. అన్నమయ్య కానీ, ఏసు క్రీస్తు
కానీ ఇరుకు ద్వారముతో దేనిని సుచించ దలచారు?
మునుపటి అన్ని కీర్తనలలో
చెప్పినట్లుగా, మేధస్సును లేదా
ముక్తిని సహజ చైతన్య స్థితిలో సాధించలేము. దైవికమైన జోక్యానికి మాత్రమే మనవంతు
సిద్ధపడగలము మరియు సమర్పించగలము. గొంగళి పురుగు ప్యూపా దశ ద్వారా సీతాకోకచిలుకగా
రూపాంతరం చెందుతుంది.
ప్యూపా దశలో, గొంగళి పురుగు
యొక్క పాత శరీరం చనిపోతుంది మరియు క్రిసాలిస్ అని పిలువబడే రక్షిత కవచం లోపల కొత్త
శరీరం ఏర్పడుతుంది. అయితే, మనిషికి ఈ
రంగురంగుల కీటకాల వంటి సహజ రూపాంతరం చెందు దశ లేదు.
ఇరుకైన ద్వారం
అంటే ఏమిటో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. మనిషి యొక్క రూపాంతరం శారీరకమైన
మార్పు కాదు, మానసికమైనది. ఏ
రూపాంతరంలోనైనా పూర్తి మార్పు ఉంటుంది. కొత్తది పాతదానితో సంబంధం కలిగి ఉండదు.
మనిషి ధైర్యంగా తనను తాను సమర్పించుకోవాలి. ఇది అత్యంత కష్టమైన పని. ఇదే తపస్సు
లేదా ధ్యానము. కొంతమందే ఈ ద్వారంలోకి ప్రవేశిస్తారని యేసు క్రీస్తు చెప్పడంలో
ఆశ్చర్యం లేదు.
దొడ్డతెరువు అని
అన్నమచార్యులు ఎందుకన్నారు? ఒక వ్యక్తి
విముక్తి పొందినప్పుడు, అతనికి స్వార్థం
లేదా స్వార్థపూరిత ఆలోచనలు ఉండవు. నిజానికి అతనికి ప్రపంచానికి మధ్య భేదం లేదు.
ప్రపంచంతో ఏకత్వం అనేది అనంతమైన అనుభూతి. కావున అన్నమాచార్యులు దీనిని దొడ్డతెరువు
(రాజ మార్గం) అని పిలిచారు.
అయ్యా! ధ్యానం
అనేది భగవంతునికి తనను తాను సమర్పించే చర్య అని, అయితే ప్రార్థన కేవలం ఒక విన్నపం మాత్రమేనని దయచేసి
గమనించండి. అది చైతన్యముతో కూడినది. ధ్యానమే జీవితం యొక్క లక్ష్యం.
ధ్యానం అనేది
స్వీయ-సమర్పణ చర్య అని మనము గ్రహించినప్పుడు, ధ్యానం ఎలా చేయాలో ఎవరైనా మనకు ఎలా నేర్పించగలరు? తమ్ముడూ బాబాలను, ఇతర
మోసగాళ్లను నమ్మవద్దు. ధ్యానం నీకు నీవే
చేపట్టు చర్య.
దిడ్డితెరువు (ఇరుకైన ద్వారం) మీద ఇంకొన్ని వివరణలు
ఇరుకైన ద్వారం గుండా ఈ ప్రయాణం అంటే ఏమిటి? మనిషి ధ్యానం ద్వారా ఏమి సమర్పించాలి? అతను తన చైతన్య మరియు అపస్మారక స్థితులలోని మానసిక
సంబంధాలను బాదరబందీలను సంపూర్ణంగా వదిలివేయాలి. బుద్ధుడు చేసిన పని ఇదేనని అర్థం
చేసుకోండి. అలాగే జిడ్డు కృష్ణమూర్తి, రమణ
మహర్షి వంటి మహానుభావులు కూడా. ఈ సమర్పణ తర్వాత, మనిషి
తన గతంతో సంబంధం కలిగి ఉండడు. ఆ వర్ణించలేని ధ్యాన సమాధిలో, వారు సత్యాన్ని అనుభవించారు. భయపడితే, భద్రత కావాలనుకుంటే, అది
ధ్యానం కాదు.
గొంగళి పురుగు
మరణానికి భయపడితే, అది సీతాకోకచిలుకగా మారదు. అయ్యలారా! అమ్మలారా! మనకు భద్రత కావాలి, మనకు సుఖాలు కావాలి. ఇక పరివర్తన అనే ప్రశ్న ఎక్కడ
ఉంది?
ఇప్పుడు భారతదేశంలోని గొప్ప ఋషుల చుట్టూ (చీమల)
పుట్టలు పెరిగి ఉండడం కట్టు కథ కాదని మీకు అనిపిస్తుంది. వారు ధ్యానంలో
మునిగిపోయారు; వారి చుట్టూ ఉన్న వాతావరణం మీద వారికి స్పృహ ఉండదు.. బాహ్య ప్రపంచం గురించి
తెలియకపోవడం ధ్యానం అని నేను అనడం లేదు. బాహ్య మరియు అంతర్గత ప్రపంచం కూడా మనకు
తెలియదు. మనం కేవలం అజ్ఞానులం. వాస్తవానికి, పుట్టలు
అవసరం లేదు. కానీ ధ్యానమైతే తప్పనిసరి.
పునరావృతం
చేస్తున్నప్పటికీ, అన్నమయ్య మరియు
యేసుక్రీస్తు పేర్కొన్న ఇరుకైన ద్వారం యొక్క భావాన్ని అర్థం చేసుకోవడానికి దిగువ
పేరాలను కూడా పరిగణించండి. ఇది సుఖాన్నిచ్చే అనుభవమైతే మాత్రం కాదు.
అప్పుడు యేసు తన శిష్యులను
చూచి “ఎవడైనను
నన్ను వెంబడింప గోరిన యెడల, తన్నుతాను
ఉపేక్షించుకొని, తన
సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని
పోగొట్టుకొనును; నా
నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించు కొనును.”
(ముత్తయి 16:24-26).
సాధకుడు భగవద్గీతలో చేప్పినట్లు నిర్యోగక్షేమ ఆత్మవాన్ (2-45) అని
చెప్పినట్లు, తన సుఖమును, రక్షణను పరిగణించకయే భగవద్ధ్యానము నందు ఉంటాడని
చెప్పారు.
అన్నమాచార్యులు “అదిగాక నిజమతం బదిగాక యాజకం-బదిగాక హృదయసుఖ మదిగాక పరము” పరము (మనకు తెలియనిది, అన్యము; మీఁదిది) అనునది మన ఊహల కంటే వేరుగా, యజ్ఞము/త్యాగముల మీద ఆధారపడకుండా, మానవుని యే చేష్టల మీదా ఆశ్రయించక ఉండి, ఊరట కూడా కలిగించక పోవచ్చు అన్నారు.
కొండతెరువు కేఁగి కొంచపుసుఖముల
koMDateruvu kEgi koMchapusukhamula
Word to Word meaning: కొండతెరువు (koMDateruvu) = path to the hills; కేఁగి (kEgi) = to go; కొంచపుసుఖముల (koMchapusukhamula) = minor comforts; బండై (baMDai) = అఱిగినది, worn out; తిరుగుచు (tiruguchu) = moving around; బడలేవు (baDalEvu) atigue, weariness, exhaustion; అండనుండెడి (aMDanuMDeDi) = the one next to you; పరమాత్ముని (paramAtmuni) = the paramatma, the God; తిరుమల-కొండతెరువు (tirumala-koMDateruvu) = on the path to Tirumala Hill; తేఁకువ (tEkuva)= ధైర్యము; fearless courage; నేఁగుమీ (nEgumI) = go that way.
Literal meaning: O passerby! Your incisive hunt for some
elusive thing wears and tires you out. DO not get satisfied with the little. Bravely embrace the path to Tirumala-Hills and
find the God within you.
Explanation: the word koMDateruvu (కొండతెరువు), is indicating Man, always wondered what is there behind the hills. His innate search for something solid like the mountain, something permanent like the rock makes him move all around. Most striking thing for man is hills. When Man could climb mount Everest, it was celebration for humanity. Just imagine how many number trekkers reach what corners of this world. Even before we could eliminate hunger, man wanted to reach moon.
The word తేఁకువ (tEkuva) is used to signify that this path of meditation is not for the cowards. Those who are not afraid of the narrow gate are truly brave.
I was reminded of the beautiful
song Hotel California by group eagles. I hope many of you have heard this song.
On a dark desert highway, cool wind in my hair
Warm smell of colitas, rising up through the air
Up ahead in the distance, I saw a shimmering light
My head grew heavy and my sight grew dim
I had to stop for the night
There she stood in the doorway;
I heard the mission bell
And I was thinking to myself,
"This could be Heaven or this could be Hell"
Then she lit up a candle and she showed me the way
There were voices down the corridor,
I thought I heard them say...
Welcome to the Hotel California
Such a lovely place (Such a lovely place)
Such a lovely face
Plenty of room at the Hotel California
Any time of year (Any time of year)
You can find it here
Her mind is Tiffany-twisted, she got the Mercedes
bends
She got a lot of pretty, pretty boys she calls friends
How they dance in the courtyard, sweet summer sweat.
Some dance to remember, some dance to forget
So I called up the Captain,
"Please bring me my wine"
He said, "We haven't had that spirit here since nineteen sixty nine"
And still those voices are calling from far away,
Wake you up in the middle of the night
Just to hear them say...
Welcome to the Hotel California
Such a lovely place (Such a lovely place)
Such a lovely face
They livin' it up at the Hotel California
What a nice surprise (what a nice surprise)
Bring your alibis
Mirrors on the ceiling,
The pink champagne on ice
And she said "We are all just prisoners here, of our own device"
And in the master's chambers,
They gathered for the feast
They stab it with their steely knives,
But they just can't kill the beast
Last thing I remember, I was
Running for the door
I had to find the passage back
To the place I was before
"Relax, " said the night man,
"We are programmed to receive.
You can check-out any time you like,
But you can never leave! "
భావము: ఓ బాటసారీ! కొండతెరువులలో
వెతుకుతూ కాళ్ళరిగేలా తిరిగి అలసిపోయి, దొరికిన కొద్దిపాటి
దానితో సంతృప్తి చెందకు. ధైర్యముగా అండనేవున్న పరమాత్ముని తిరుమల-కొండతెరువులో
సాగి చేరుకో.
వివరణము: ఆ కొండల వెనక ఏముంది? అనే సందేహం మనిషిని దొలిచేస్తుంది. ఈ సహజ గుణంతో ఆ శిలల
లాంటి ఎత్తైన, శాశ్వతమైన, కరగనీ, నలగనీ, అలుపెరగనీ దాని
కోసం అన్వేషిస్తాడు. అందుకే హిమాలయాలు అధిరొహించినప్పుడు మానవాళి సంతోషంతో పండగ
చేసుకుంది. ప్రపంచం నలుమూలలా గమనిస్తే ఏ ఒక్క కొండనీ, లోయనీ, శిఖరాన్నీ కానీ
వదల కుండా వెతుకుతునే వున్నాడు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా, గ్రహమండలాలు
చేరాలని ఉవ్విళ్ళూరతాడు.
ఘంటసాల పాడిన 'బహుదూరపు
బాటసారీ' పాటలో మృతి
అంటే భయం లేనటువంటి వ్యక్తి పాడుతున్న పాట అని ఎందుకన్నారో? 'పయనమెచటికోయి?'తో ఏమి తెలుపదలచారో?
మృతి అంటే భయం
లేనటువంటి వ్యక్తి పాడుతున్న పాట ...
అర్దరాత్రి పయనమేలనోయి ... పెనుతుఫాను రేగనున్నదోయీ ...
పయనమెచటికోయి ... ఈ
పయనమెచటికోయి ... నీ దేశమేనటోయీ ...
Summary of this Keertana:
O
Traveller! The path is close by. Come. Appear here and rejoice. (Implied meaning: O Traveller! Quo Vadis?
(Where are you going?). Path to liberation is within you.)
Knowing one’s own prescribed
duties and work to be discharged is understanding the other state. Realising
what should be performed, what should be avoided, what is righteous act is true
wealth. (Implied meaning: Instead of pursuing
virtuous acts, man should find out his prescribed duties.)
Your
relations will put intense pressure to dissuade you by showing you many cross
cuts (to remove you from the chosen path). Go along that dry stream thru that
small wicket gate only to transgress into big way.
O Passer-by! Your incisive hunt for some elusive thing wears and tires you out. DO not get satisfied with the little. Bravely embrace the path to Tirumala-Hills and find the God within you.
కీర్తన సంగ్రహ భావము:
ఓ బాటసారి!
తెరువు కడు-చేరువనే ఉన్నది. వచ్చి ప్రకాశించు! (ఆ పారవశ్యంలో
చెలరేగిపో) (అన్వయార్ధము:: ఓ యాత్రికుడా! ఎక్కడికి పోతావు?
ముక్తికి మార్గం నీలోనే ఉంది.)
ఎడమకు ఏగిన దొంగలు
తొట్రుపడునట్లు చేసి కోకలు దోఁచుకుందురు. కుడివైపు కెళ్ళి మిక్కిలి ఆశలతో పాకులాడుతూ ఉండొద్దు. నడిమి తెరువుననే నెమ్మది నడవుమీ. (అన్వయార్ధము: ఓ యాత్రికుడా! అటునిటు
ఊగిసలాడకు. ఉన్నచోటనే ఉండము.
చుట్టాలు వారి వారి అడ్డమైన
వాదనలతో నిన్ను దారి మళ్ళించ చూస్తారు. అదిగో అక్కడ కనబడుతున్న చిన్న ద్వారం గుండా
వెళ్ళు. అక్కడ నీకు దొడ్డ మార్గం కనబడుతుంది.
ఓ బాటసారీ! కొండతెరువులలో
వెతుకుతూ కాళ్ళరిగేలా తిరిగి అలసిపోయి, దొరికిన కొద్దిపాటి
దానితో సంతృప్తి చెందకు. ధైర్యముగా అండనేవున్న పరమాత్ముని తిరుమల-కొండతెరువులో
సాగి చేరుకో.
Copper Leaf: 15-1 Volume
1-89