ANNAMACHARYA
91. ఏఁటిబ్రదుకు యేఁటిబ్రదుకు
(ETibraduku
yETibraduku)
Introduction: In this extraordinary
verse, Annamacharya appears to have witnessed our present life and wrote this poem
foretelling life in times ahead. Every word of this sonnet is so utterly true leaving
us in astonishment of how this sage of 15th century knew our current
life.
The wording in chorus
vokka-mATalOnE yaTamaTamaina braduku (వొక్క-మాటలోనే యటమటమైన బ్రదుకు) states how life in our times is hinged upon a
single word. There is no doubt our lives can be ruined with one single word. Every
day, we are witnessing this disaster for someone or the other.
Then he states saMtakUTamulE chavulayina bratuku (సంతకూటములే చవులయిన బ్రతుకు) indicating that market forces will control the
life of men. Obviously, any news about market makes or breaks our fortunes.
The ominous words pagavAripaMchalapAlaina braduku (పగవారిపంచలపాలైన బ్రదుకు) signify that we live under the
surveillance of enemy. Stark reality is that we are under the scanner of electronic
cameras, scanner of neighbours and neighbouring countries. I hope you will contemplete when Annamacharya says ETibraduku yETibraduku
(ఏఁటిబ్రదుకు యేఁటిబ్రదుకు) What life is this? What life is this!
All this in few syllables. He is master of brevity. There are few equals to
him.
ఉపోద్ఘాతము: ఈ అసాధారణమైన కీర్తనలో అన్నమాచార్యులు రాబోయే కాలాలలో జీవితం ఎలాంటిదో తెలియజేస్తూ వ్రాశాడు
అనిపిస్తుంది. ఈ కవితలో యొక్క ప్రతి పదం సత్యమే, 15 వ శతాబ్దానికి చెందిన ఈ మహర్షికి మన
ప్రస్తుత జీవితంలోని కష్టాలు, రహస్యాలు ఎలా తెలుసు? అని ఆశ్చర్య పోతాం!
పల్లవిలోని 'వొక్కమాటలోనే
యటమటమైన బ్రదుకు'తో ఈనాటి మన దైనందిన జీవితం ఒక్క మాటపై ఆధారపడి ఉంటుందన్నది ప్రకటించారు.
ఒకేవొక్క మాటతో మన జీవితాలు నాశనం అవుతాయనడంలో సందేహం లేదు. ప్రతిరోజూ, ఎవరో ఒక్కరికి కాకుండా పలువురికి ఈ విపత్తు సంభవించడం చూస్తున్నాము.
అప్పుడే (500 సంవత్సరాల
క్రితమే) అతను మార్కెట్ శక్తులు మనుషుల జీవితాన్ని నియంత్రిస్తున్నాయని
సూచిస్తూ ‘సంతకూటములే చవులయిన బ్రతుకు’ అని
పేర్కొన్నాడు. సహజంగానే, మార్కెట్ గురించి ఏదైనా వార్త మనకు అదృష్టాన్ని తెస్తుంది లేదా విచ్ఛిన్నం
చేస్తుంది. ఎప్పుడేం వార్త వస్తుందో అన్న ఆపేక్ష, ఆకాంక్ష మరియు ఆదుర్దాల నేపథ్యములో మనిషి బితుకు బితుకు
మంటూ జీవిస్తాడు.
రాబోయే దుర్దశను సుచిస్తూ ‘పగవారిపంచలపాలైన బ్రదుకు’ మనం శత్రువుల
పర్యవేక్షణలో జీవిస్తామని తెలుపుతుంది. మనము ఎలక్ట్రానిక్ కెమెరాల స్కానర్, పొరుగు వారి మరియు పొరుగు దేశాల స్కానర్‌లో ఉన్నామన్నది
పచ్చి నిజం. ఏఁటిబ్రదుకు
యేఁటిబ్రదుకు అని అన్నమాచార్యులు చెప్పినప్పుడు
మీరు పునరాలోచిస్తారని ఆశిస్తాను.
భగవంతుడా ఇది ఎలాంటి జీవితం!
అన్నమాచార్యులు క్లుప్తతలో చతురుడు.
ఆయన అద్వితీయుడు. అన్నమాచార్యులు కత్తులు లేకుండా హృదయాలను తూట్లుపొడవగల
వైద్యుడు.
కీర్తన:
ఏఁటిబ్రదుకు యేఁటిబ్రదుకు । వొక్క- మాటలోనే యటమటమైన బ్రదుకు ॥పల్లవి॥
సంతకూటములే చవులయిన బ్రతుకు దొంతిభయములతోడి బ్రదుకు
ముంతనీళ్ళనే మునిఁగేటి బ్రదుకు
వంతఁ బొరలి కడవరంలేని బ్రదుకు ॥ఏఁటి॥
మనసుచంచలమే మనువయిన బ్రదుకు దినదినగండాలఁ దీరు బ్రదుకు
తనియ కాసలనె తగిలేటి బ్రదుకు
వెనకముందర చూడ వెరపయిన బ్రదుకు॥ఏఁటి॥
తెగి చేఁదె తీపయి తినియేటి బ్రదుకు పగవారిపంచలపాలైన బ్రదుకు
తగువేంకటేశ్వరుఁ దలఁచని బ్రదుకు
పొగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు ॥ఏఁటి॥
|
ETibraduku yETibraduku । vokka- mATalOnE yaTamaTamaina braduku ॥pallavi॥
saMtakUTamulE chavulayina bratuku doMtibhayamulatODi braduku
muMtanILLanE munigETi braduku
vaMta borali kaDavaraMlEni braduku ॥ETi॥
manasuchaMchalamE manuvayina braduku dinadinagaMDAla dIru braduku
taniya kAsalane tagilETi braduku
venakamuMdara chUDa verapayina braduku ॥ETi॥
tegi chEde tIpayi tiniyETi braduku pagavAripaMchalapAlaina braduku
taguvEMkaTESvaru dalachani braduku
pogaku nOpaka maMTa bogilETi braduku॥ETi॥
|
Details and Explanations:
ఏఁటిబ్రదుకు యేఁటిబ్రదుకు వొక్క-
మాటలోనే యటమటమైన బ్రదుకు ॥పల్లవి॥
ETibraduku
yETibraduku । vokka-
mATalOnE
yaTamaTamaina braduku ॥pallavi॥
Word to Word meaning: ఏఁటిబ్రదుకు (ETibraduku) = What life is this? యేఁటిబ్రదుకు (yETibraduku) = What life is this? వొక్క మాటలోనే (vokka mATalOnE) = with one single word; యటమటమైన (yaTamaTamaina) = కలతజెందు, దుఃఖపడు, causing sorrow or grief; బ్రదుకు (braduku) = life.
Literal meaning: What life is this? What
life is this! with
one single word, this life turns to sorrow and grief.
Explanation: I really do not know what has motivated Annamayaa to write this poem. More than ever before, a single word can destroy a person’s fortune in today’s networked world. I was even surprised to note that there even training centres to conduct such cyber-attacks efficiently.
For the young people in love, one word from the lover can make or break the life. If you observe, your acceptance or rejection in this world is based on what you say rather than what others interpret it as.
At deeper level, Annamacharya is concerned, rather questions, is this life? A life based on approval outside yourself? Obviously Annamacharya is not happy with the attitude of man. Therefore he is asking us to find a life, not so fragile to depend on a single word, not so much influenced by external environment.
భావము: ఎలాంటి జీవితం? ఇది ఎలాంటి
జీవితం! ఒక్క మాటతో, ఈ జీవితం
అతలాకుతలము అవుతుందే?
వివరణము: అన్నమయ్యను
ఈ కవిత రాయడానికి ప్రేరేపించినదేమో మనకు నిజంగా తెలియదు. మునుపెన్నడూ లేనట్లుగా, నేటి నెట్‌వర్క్
చేయబడిన ప్రపంచంలో ఒకేవొక్క పదం ఒక వ్యక్తి యొక్క అదృష్టాన్ని అక్షరాలా నాశనం
చేయగలదు. అటువంటి సైబర్ దాడులను సమర్ధవంతంగా నిర్వహించడానికి శిక్షణ కేంద్రాలు
కూడా ఉన్నాయని తెలిసి నేను ఆశ్చర్యపోయాను.
ప్రేమలో ఉన్న
యువతరం, ప్రేమికుడి
నుండి ఒకే ఒక పదం జీవితాన్ని సృష్టించ గలదు లేదా విచ్ఛిన్నం చేయగలదు. గమనిస్తే, మిమ్మల్ని
ప్రపంచం అంగీకారిస్తుందా లేదా తిరస్కరిస్తుందా అన్నది ఇతరులు దానిని అర్థం
చేసుకునే దాని కంటే మీరు చెప్పేదానిపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది.
లోతైన స్థాయిలో, అన్నమాచార్యులు ఇదే జీవితమా? బాహ్య ఆమోదంపై ఆధారపడిన జీవితమూ జీవితమే? అని ఆందోళన
వెలిబుచ్చాడు. సహజంగానే అతడు మనిషి వైఖరితో సంతోషంగా లేడు. అందువల్ల అతడు ఒకే పదం మీదనొ, ఒకే ఘటన మీదనొ, ఒకే సూత్రం మీదనొ ఆధారపడని ఆ జీవితాన్ని కనుగొనమని
అడుగుతున్నాడు.
సంతకూటములే
చవులయిన బ్రతుకు
saMtakUTamulE
chavulayina bratuku
doMtibhayamulatODi
braduku
muMtanILLanE munigETi
braduku
vaMta borali kaDavaraMlEni braduku ॥ETi॥
Word to Word meaning: సంతకూటములే (saMtakUTamulE) = market conglomerates; చవులయిన (chavulayina) = రుచిపుట్టించు, tasty; బ్రతుకు (bratuku) = life; దొంతిభయములతోడి (doMtibhayamulatODi) = ఒకదానిపై ఒకటి పేర్చిన భయములతో, fears arranged one above the other; బ్రదుకు (braduku) = life; ముంతనీళ్ళనే (muMtanILLanE) = water in a small pot; మునిఁగేటి (munigETi) = take bath; బ్రదుకు (braduku) = life; వంతఁ బొరలి (vaMta borali) = సంతాపము, బాధ, ఏడ్పులలో పొరలుతుండే, roll in sorrow; కడవరంలేని (kaDavaraMlEni) = with no end in sight; బ్రదుకు (braduku) = life.
Literal meaning: our life is enjoying (rather ruing) the ups and downs of market forces; day after day live by stack of fears arranged one above the other; A life taking small pot as the swimming pool; A life full of sorrow with no end in sight.
Explanation: Annamacharya is blasting us the way we live. First, we take markets as indicators of our future. This is utterly true. How could this sanyasi of 15th century see our present life so clearly? His deep-rooted understanding of the life is beyond comprehension.
I clearly remember markets and finance related information used to be in the penultimate page, having secondary importance 40 years ago. Now it occupies the primary spot, even the governments fall in their trap. Neutrality of the governments becomes questionable.
Once we are in the trap, fears arraigned one over the other can slide and fall any time. We will be praying God to save from this single trouble. We don’t realise it is array of troubles. What to speak of our ignorance?
Then he takes on our attitude. When we treat a small pot as swimming pool, it clearly demonstrates how we limit our thinking to live our life. Is life markets, cinemas, and food only? What is life? Who limited it?
By the by, a hermit with limited wants, who has ostracized the world, is telling us we are living limited life by the wording “muMtanILLanE munigETi braduku” (ముంతనీళ్ళనే మునిఁగేటి బ్రదుకు) This is a remarkable statement. Truly we must ponder over this. The life we live is according to a formula we conceptualised. This formula may be new one, but still a formula. Can we leave all those wrong concepts and live truly piercing the aura of invincibility of security circle is the question posed to us?
Do we understand sorrow mentioned by
Annamyya? It is not necessarily tears, it also includes the anxiety, the fear,
the anticipation, the doubt. These feelings are permanently plaguing us every
moment.
భావము: మన బ్రతుకు “మార్కెట్ శక్తులే
(సంతకూటములే) రుచించు బ్రతుకు. ఒకదానిపై
ఒకటి అమర్చిన భయాల ఆందోళనతో కూడిన (దొంతిభయములతోడి) బ్రదుకు. ముంతలోని నీళ్ళనే ఈత కొలనుగా సర్దుకునేటి
బ్రదుకు. అంతం లేని బాధతో పొర్లాడు
బ్రదుకు”
వివరణము: మనం జీవిస్తున్న విధానాన్ని అన్నమాచార్యులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ముందుగా, మనము మార్కెట్లను మన భవిష్యత్తుకు సూచికలుగా తీసుకుంటాము. ఇది
ముమ్మాటికీ నిజం. అప్పుడు అన్నమయ్య కాలంలో
ఇలాంటి పరిస్థితులు లేవే? 15 వ శతాబ్దానికి చెందిన ఈ ఫకీరు మన ప్రస్తుత జీవితాన్ని ఇంత స్పష్టంగా
ఎలాచూడగలిగాడు? జీవితంపై అతని లోతైన అవగాహన స్థాయి మనము
చేరుకోలేనిదే.
40 సంవత్సరాల క్రితం, దినపత్రికలలో, విత్తము
మరియు ఆర్ధిక సమాచారం చివరి పేజీలో ద్వితీయ ప్రాముఖ్యతను కలిగి వుండేవని నాకు
స్పష్టంగా గుర్తు. ఇప్పుడు అవి ప్రాథమిక స్థానాన్ని ఆక్రమించాయి. ప్రభుత్వాలు కూడా అదే దారిలో పడ్డాయి.
ప్రభుత్వాల తటస్థత ప్రశ్నార్థకంగా మారింది.
నాలుగు పాదాల మీద నడవ వలసిన ధర్మము ఒక వైపు ఒరిగిపోతే భవిష్యత్తు ఏమిటో?
ఒకసారి
మనం ఈ ఉచ్చులో పడితే, ఒకదానిపై
ఒకటి పేర్చిన భయాలు ఎప్పుడైనా జరిగి, జారి
మీద పడవచ్చు. ఈ ఒక్క సమస్య నుంచి కాపాడమని దైవమును ప్రార్థిస్తాం. ఇది సమస్యల
శ్రేణి అని గుర్తించం. మన అజ్ఞానం గురించి ఏమని మాట్లాడాలి?
ప్రపంచాన్ని సన్యసించినవాడు, పరిమిత
అవసరాలు కలిగిన పరివ్రాజకుడు, ముంతనీళ్ళనే
మునిఁగేటి బ్రదుకు అంటూ మనం పరిమితమైన జీవితాన్ని గడుపుతున్నామని
ఎందుకు అంటున్నాడు? ఇది
ఆలోచించదగ్గ ప్రకటన. మనకి నచ్చిన సూత్రం ( ఫార్ములా) ప్రకారం మనం జీవిస్తున్న
జీవితం ఇది. మన ఫార్ములా కొత్తది కావచ్చు, ఐనప్పటికీ అది ఫార్ములానే. మనం ఆ తప్పుడు భావనలన్నింటినీ వదిలేసి, అజేయత
కలిగించు భద్రతా వలయాన్ని చించుకుంటూ
జీవనములోని సవాళ్ళను ఎదుర్కోగలమా అనేది
మనకు ఎదురయ్యే ప్రశ్న?
అన్నమయ్య
పేర్కొన్న దుఃఖాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నామా? ఇది కన్నీళ్లే కాదు, ఇందులో
ఆందోళన, ఆదుర్దా, (పని
అవుతుందో అవ్వదో అనే) భయం, నిరీక్షణ, సందేహం
కూడా కలిపి ఉంటాయి. ఈ భావాలు ప్రతి క్షణం మనల్ని శాశ్వతంగా వేధిస్తున్నాయి.
మనసుచంచలమే మనువయిన బ్రదుకు
manasuchaMchalamE manuvayina braduku
Word to Word meaning: మనసు (manasu) = mind; చంచలమే (chaMchalamE) = constant movement; మనువయిన (manuvayina) = వర్తనము, Conduct, బ్రదుకు (braduku) = life దినదినగండాలఁ (dinadinagaMDAla) = day after day faces dangers, insurmountable perils; దీరు (dIru) = like; బ్రదుకు (braduku) = life; తనియక (taniyaka) = without satisfaction, subsiding, ఆసలనె (Asalane) = desires, wants; తగిలేటి (tagilETi) = get trapped; బ్రదుకు (braduku) = life వెనకముందర (venakamuMdara) = ahead and back (here meaning the previous life and the next life) చూడ (chUDa) = observe; వెరపయిన (verapayina) = causing fear; బ్రదుకు (braduku) = life.
Literal meaning: This mind with inconstant conduct is our
present life. We live by facing dangers every day. Yet, without satisfaction we
again get hooked to wants and desires is our life. We are afraid of observe
(rather understanding) what we really is our past and what will be future.
Explanation: Most of us feel that we remain the same since our childhood. Then what this inconstant conduct Annamacharya is talking about? From morning to night, we want different foods every two hours. We want Coorg Coffee. We want fresh food. We want delicacies served on our platter. Hour to hour we change our requirements of food. O man, where is the constancy in your wants?
The same applies to our likings or wishes for good clothes, liquor, shoes, cars, tourist places, we find we have rather unenviable continuous changes. Therefore, our feeling that we remain the same is rather unfounded. The less we talk about our wavering behaviour, the better it is.
dinadinagaMDAla dIru braduku (దినదినగండాలఁ దీరు బ్రదుకు) is indicating that we take each want we may treat it as a welcome change, while actually it is an affront on our body. Each desire is causing us incalculable harm. With this in backdrop, do we have the courage to review what we have been doing? You will find Annamacharya is a doctor who could cut our hearts without knives.
భావము: మన ప్రస్తుత జీవితం
చంచలమైన ప్రవర్తన కలిగిన ఈ మనస్సుతో ముడిపడి వుంది. దినదినగండం నూరేళ్ళాయుష్షులా
ప్రతిరోజూ కోరికలనే ప్రమాదాలను ఎదుర్కొంటూ జీవిస్తున్నాము. అయినప్పటికీ, సంతృప్తి లేకుండా
మనం మళ్లీ కోరికలలో తగులుకుంటాము. ఈ నేపథ్యములో నిష్పాక్షికంగా మన గతం ఏమిటో మరియు
భవిష్యత్తు ఏమిటో గమనించడానికే (లేక అర్థం చేసుకోవడానికే) భయపడతాం.
వివరణము: మనలో చాలా మంది చిన్నప్పటి నుండి ఒకేలాగ ఉన్నామని భావిస్తారు. అప్పుడు
"మనసుచంచలమే మనువయిన బ్రదుకు" అని అన్నమాచార్యులు దేనికంటున్నారు? ఈ అస్థిరమైన ప్రవర్తన దేని
గురించి మాట్లాడుతున్నారు? ఉదయం నుండి రాత్రి వరకు, మనము ప్రతి రెండు గంటలకు వేర్వేరు ఆహారాలను కోరుకుంటున్నాము. మాకు కూర్గ్
కాఫీ కావాలి. మాకు తాజా ఆహారం కావాలి. మా పళ్లెంలో రుచికరమైన వంటకాలు
వడ్డించాలనుకుంటాము. గంటకు గంటకు మేము మా ఆహార అవసరాలను మారుస్తాము. ఓ మానవుడా,
నీలో స్థిరత్వం ఎక్కడ?
అలాగే
బట్టలు, బూట్లు, కార్లు, ఇళ్ళు, పర్యాటక
ప్రదేశాల కోసం మన అభిరుచులకు కూడా పై వివరణ వర్తిస్తుంది. అందువల్ల, మనం
అలాగే ఉంటామనే మా భావన నిరాధారమైనది. గంట గంటకు ఊగిసలాడే మన ప్రవర్తన గురించి ఎంత
తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
దినదినగండాలఁ దీరు బ్రదుకు ప్రతి కోరికను మనం స్వాగతించే మార్పుగా పరిగణిస్తాం, వాస్తవానికి అది మన శరీరంపై అత్యాచారమే. అవన్నీ మనను సత్యాన్నుంచి దూరం చేస్తున్నాయని గ్రహించం. ప్రతి కోరిక మనకు లెక్కలేనంత హాని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, మనం ఇప్పటి దాకా ఏమి చేశామో సమీక్షించే ధైర్యం ఉందా? అన్నమాచార్యులు కత్తులు లేకుండా హృదయాలను తూట్లుపొడవగల వైద్యుడని మీరు కనుగొంటారు.
తెగి చేఁదె తీపయి తినియేటి బ్రదుకు
పగవారిపంచలపాలైన బ్రదుకు
తగువేంకటేశ్వరుఁ దలఁచని బ్రదుకు
పొగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు ॥ఏఁటి॥
tegi
chEde tIpayi tiniyETi braduku
pagavAripaMchalapAlaina
braduku
taguvEMkaTESvaru
dalachani braduku
pogaku
nOpaka maMTa bogilETi braduku ॥ETi॥
Word to Word meaning: తెగి చేఁదె (tegi chEde) = continuous bitter taste; తీపయి (tIpayi) = taken as sweet; తినియేటి (tiniyETi) = eating, consuming; బ్రదుకు (braduku) = life; పగవారిపంచలపాలైన (pagavAripaMchalapAlaina) = shelter in enemy’s house; బ్రదుకు (braduku) = life; తగు (tagu) = suitable; వేంకటేశ్వరుఁ (vEMkaTESvaru) = Lord Venkateswara; దలఁచని (dalachani) = do not regard or do not meditate; బ్రదుకు (braduku) = life; పొగకు (pogaku) = for smoke; నోపక (nOpaka) = unbale bear; మంటఁ (maMTa) = into fire; బొగిలేటి (bogilETi) = to burn; బ్రదుకు (braduku) = life;
Literal meaning: Our present life is like consuming bitter items mistaking them as sweets. Out life is under the constant vigil of the enemy. We do not consider Lord Venkateswara (God) sufficiently. Our life is like choosing to enter the fire than to bear the smoke.
Explanation: Though this stanza is very deep and not possible to explain in few words, let us examine few important words.
“tegi
chEde tIpayi tiniyETi” (తెగి చేఁదె తీపయి
తినియేటి) is similar to Boris Pasternak statement in Dr. Zhivago given below.
“The great majority of
us are required to live a constant, systematic duplicity. Your health is bound
to be affected by it if, day after day, you say the opposite of what you feel,
you grovel before what you dislike and rejoice at what bring brings you nothing
but misfortune.”
Our present reality is
we are under constant scanner of Cameras, robots, neighbours and neighbour countries.
Where is the question of freedom liberation in such circumstances? Dear Sir, please
consider, your freedom cannot be curtailed by prisons, cameras and borders.
Then why complain on these nasty things?
When you have the opportunity
to take shelter of Lord Venkateswara, do we do we consider him sufficiently? Any
number of half hearted attempts cannot equal one single complete submission.
Remember the story of Gajendra. He Prayed once with all his heart. All his sins
have been pardoned.
Last, but not least pogaku nOpaka maMTa bogilETi braduku (పొగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు) is
implying that we act foolishly all the time. Let me repeat the Original question
of Annamacharya: What life is this!
భావము: మన ప్రస్తుత జీవితం
చేదు పదార్ధాలను తీపిగా భావించి తినడం వంటిది. మన జీవితం శత్రువు యొక్క నిరంతర
నిఘా కిందే. మనము వేంకటేశ్వరుని
(దేవుడిని) తగినట్లు నుతించము. మన జీవితం పొగను తట్టుకోలేక మంటల్లోకి దూకడం
లాంటిది.
వివరణము: ఈ చరణం చాలా గంభీరమైనది మరియు కొన్ని పదాలలో వివరించడం సాధ్యం కానప్పటికీ, కొన్ని
ముఖ్యమైన పదాలను పరిశీలిద్దాం.
ఈ చరణం చదువుతుంటే బోరిస్ పాస్టర్నాక్ గారి క్రింది సూక్తి గుర్తుకొస్తుంది. “మనలో చాలా మంది కపటమే జీవితమని గడుపుతారు. రోజూ నువ్వనుకునే దానికి వ్యతిరేకమైనది పలుకుతూ, నీకు నచ్చని దానికి సాష్టాంగ పడుతూ, (మూర్ఖంగా) దురదృష్టాన్ని సంతోషంగా స్వీకరిస్తూంటే, నీ ఆరోగ్యం సడలిపోదా?”
ప్రస్తుత
వాస్తవం ఏమిటంటే మనమంతా కెమెరాలు, రోబోలు, పొరుగువారు
మరియు పొరుగు దేశాల నిరంతర నిఘా(స్కానర్)లో ఉన్నాము. అటువంటి పరిస్థితులలో
స్వేచ్ఛ విముక్తి ప్రశ్న ఎక్కడ ఉంది? అయ్యలారా, మీ స్వేచ్ఛను జైళ్లు, కెమెరాలు
మరియు సరిహద్దులు ఆపలేవు అని పరిగణించండి. అప్పుడు ఈ దుష్ట విషయాలపై ఫిర్యాదు ఎందుకు చేయాలి?
వేంకటేశ్వరుడిని
ఆశ్రయించే అవకాశం మీకు లభించినప్పుడు, అతడిని తగినంతగా తలచితిరా? సగం ప్రయత్నాలు ఏన్నయినా ఒక్క పూర్తి సమర్పణకు సమానం కాదు. గజేంద్రుని కథను గుర్తుంచుకోండి.
అతను తన హృదయంతో ఒకేసారి ప్రార్థించాడు. అతని పాపాలన్నీ క్షమించబడ్డాయి.
చివరగా, ప్రాధాన్యతలో
కాదు, ‘పొగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు'తో మనం సర్వ కాలములందు మూర్ఖంగా వ్యవహరిస్తున్నాం అని చెప్పారు. అన్నమాచార్య
యొక్క మొదటి ప్రశ్నను పునరావృతం చేద్దాం: ఏఁటిబ్రదుకు
యేఁటిబ్రదుకు?
Summary of this Keertana:
What life is this? What life is this! with one single word, this
life turns to sorrow and grief.
our life is enjoying (rather
ruing) the ups and downs of market forces; day after day live by stack of fears
arranged one above the other; A life taking small pot as the swimming pool; A
life full of sorrow with no end in sight.
This mind
with inconstant conduct is our present life. We live by facing dangers every
day. Yet, without satisfaction we again get hooked to wants and desires is our
life. We are afraid to meditate (rather understand) what really is our past and
what will be future.
Our present life is like consuming
bitter items mistaking them as sweets. Out life is under the constant vigil of
the enemy. We do not consider Lord Venkateswara (God) sufficiently. Our life is
like choosing to enter the fire than to bear the smoke.
కీర్తన సంగ్రహ భావము:
ఎలాంటి జీవితం? ఇది ఎలాంటి
జీవితం! ఒక్క మాటతో, ఈ జీవితం అతలాకుతలము అవుతుందే?
మన బ్రతుకు “మార్కెట్
శక్తులే (సంతకూటములే) రుచించు బ్రతుకు.
ఒకదానిపై ఒకటి అమర్చిన భయాల ఆందోళనతో కూడిన (దొంతిభయములతోడి)
బ్రదుకు. ముంతలోని నీళ్ళనే ఈత కొలనుగా
సర్దుకునేటి బ్రదుకు. అంతం లేని బాధతో
పొర్లాడు బ్రదుకు”
మన ప్రస్తుత జీవితం చంచలమైన
ప్రవర్తన కలిగిన ఈ మనస్సుతో ముడిపడి వుంది. దినదినగండం నూరేళ్ళాయుష్షులా ప్రతిరోజూ
కోరికలనే ప్రమాదాలను ఎదుర్కొంటూ జీవిస్తున్నాము. అయినప్పటికీ, సంతృప్తి
లేకుండా మనం మళ్లీ కోరికలలో తగులుకుంటాము. ఈ నేపథ్యములో నిష్పాక్షికంగా మన గతం
ఏమిటో మరియు భవిష్యత్తు ఏమిటో గమనించడానికే (లేక అర్థం చేసుకోవడానికే) భయపడతాం
మన ప్రస్తుత జీవితం చేదు
పదార్ధాలను తీపిగా భావించి తినడం వంటిది. మన జీవితం శత్రువు యొక్క నిరంతర నిఘా
కిందే. మనము వేంకటేశ్వరుని (దేవుడిని)
తగినట్లు నుతించము. మన జీవితం పొగను తట్టుకోలేక మంటల్లోకి దూకడం లాంటిది.
Copper Leaf: 67-3 Volume
1-348
భావి మానవ జీవన గమనాన్ని గురించి, క్లిష్టతను గురించి
ReplyDeleteపదిహేనవ శతాబ్దంలోనే predict చేయగలిగిన మహర్షి అన్నమయ్య. నేటి జీవిత సత్యాలను ఆనాడే కళ్ళకు కట్టినట్లు ఈ కీర్తనలో అన్నమయ్య తెలియజేశాడు అన్నమయ్య. మంచి వ్యాఖ్యానము
చేసిన శ్రీనివాస్ గారికి నమస్సులు.🌹🙏
అద్భుతంగా వ్యాఖ్యానించావు శ్రీనివాస్..... హృదయపూర్వక అభినందనలు....💐💐💐
ReplyDeleteVery nice explanation about human behavior in this keerthana...Vardhani
ReplyDeleteVery well explained, Srinivas, about how our lives have become so vulnerable with single incidents making or breaking it. Annamayya is amazing in putting a mirror in front of us centuries ago and asking us to ponder over the life we are leading 🧐
ReplyDeleteExcellent work, Srinivas, in bringing out these diamonds and polishing them 🙏
Kameswararao Darbhamulla
Delete- Kameswararao D
Delete