Sunday 10 October 2021

89. తలఁపులోననే దైవము వీఁడిగో (talapulOnanE daivamu vIDigO)

 

ANNAMACHARYA

89. తలఁపులోననే దైవము వీఁడిగో (talapulOnanE daivamu vIDigO)

Introduction: The deep character of this verse will resonate in your heart for long.  Annamacharya says man instead of running after trivial things like virtues (punyamu), should concentrate on achieving skill and dexterity.      

Man often do not consider the body and the soul as one and the same. Man due to his wavering nature keeps diverting his attention to other things. In this verse, Annamacharya reminded us thrice to remain on the path of devotion. It is almost like dragging an unwilling child to school.

He declared existence of vaikuMThamu (वैकुण्ठ) only to highlight its not a mere conjecture, but a reality. But man must dissociate with his present pursuits. That is the toughest job.

ఉపోద్ఘాతము:   కీర్తన యొక్క లోతైన పోకడ దీర్ఘకాలం మీ హృదయంలో ఱింగు మంటూ ఉంటుంది.  వెడపుణ్యములు (తుచ్ఛము, అల్పము) వెదకుట బదులు సదరము (చాతుర్యము)  సాధించమని అన్నమాచార్యులు  హితబోధ చేశారు.

తరచుగా మనిషి  శరీరం మరియు ఆత్మ ఏకమని పరిగణించడు. తన అలసత్వం కారణంగా మనిషి  దృష్టి ఇతర విషయాల వైపు మళ్ళుతూ వుంటుంది. ఈ కీర్తనలో,  ఇష్టపడని పిల్లవాడిని స్కూలుకు లాక్కెళ్ళుతున్నట్టుగా, అన్నమాచార్యులు భక్తి మార్గంలో ఉండాలని మనలను మూడుసార్లు హెచ్చరించారు.  

అన్నమాచార్యులు వైకుంఠము ఉనికిని పలుమార్లు ప్రకటించాడు. అవి కేవలం ఉత్తిమాటలు కావని, వాస్తవికతను హృదయంలో నాటుకునేలా చేయడానికి మాత్రమే పునరుద్ఘాటించారు. కానీ మనిషి తన ప్రస్తుత ప్రయత్నాలను విడనాడాలి. అదే బహు కష్టమైన పని.    

కీర్తన:

 

తలఁపులోననే దైవము వీఁడిగో

సులభము సులభము సోధించరో ॥పల్లవి॥ 

యిదే హరినామము యిదే కొననాలికె

వదలక తలఁచితే వైకుంఠము
వెదకఁగ నేఁటికి వెడపుణ్యము లింక
సదరము సదరము సాధించరో    ॥తలఁపు॥ 

కలదు దేహమిదె కలవివె ముద్రలు

వలెనని చేకొన్న వైకుంఠము
వొలసి కర్మములఁ బొరలఁగ నేఁటికి
కలిగెను కలిగెను కైకొనరో  ॥తలఁపు॥ 

శ్రీ వేంకట మదె శ్రీపతి వీఁడిగో

వావిరిఁ గొలిచిన వైకుంఠము
భావించి చూచిన బ్రహ్మాదులకును
త్రోవయిదె త్రోవయిదె తొలఁగకురో॥తలఁపు॥ 

 

 

talapulOnanE daivamu vIDigO

sulabhamu sulabhamu sOdhiMcharO pallavi 

yidE harinAmamu yidE konanAlike

vadalaka talachitE vaikuMThamu
vedakaga nETiki veDapuNyamu liMka
sadaramu sadaramu sAdhiMcharOtala@Mpu 

kaladu dEhamide kalavive mudralu

valenani chEkonna vaikuMThamu
volasi karmamula boralaga nETiki
kaligenu kaligenu kaikonarO      tala@Mpu

 

SrI vEMkaTa made SrIpati vIDigO

vAviri golichina vaikuMThamu
bhAviMchi chUchina brahmAdulakunu
trOvayide trOvayide tolagakurO tala@Mpu

 

Details and Explanations:

 

తలఁపులోననే దైవము వీఁడిగో

సులభము సులభము సోధించరో          ॥పల్లవి॥

talapulOnanE daivamu vIDigO

sulabhamu sulabhamu sOdhiMcharO    pallavi 

Word to Word meaning:

తలఁపులోననే (talapulOnanE) = Within the thoughts;  దైవము (daivamu) = god;  వీఁడిగో (vIDigO) ~ వీడు+ఇదిగో = this one only; సులభము (sulabhamu) = easy; సులభము (sulabhamu) = easy; సోధించరో (sOdhiMcharO)         = O Man keep purifying, keep searching, Keep refining. 

Literal meaning: O Man, the god within your thoughts is this one.  Very Easy. keep purifying, keep searching, Keep refining (yourself). 

 భావము: తలఁపులోననే ఉండు దైవము వీఁడే.  సులభము సులభము పునీతుని చేసుకుంటూ దర్శించు.

యిదే హరినామము యిదే కొననాలికె

వదలక తలఁచితే వైకుంఠము
వెదకఁగ నేఁటికి వెడపుణ్యము లింక
సదరము సదరము సాధించరో  ॥తలఁపు॥ 

yidE harinAmamu yidE konanAlike

vadalaka talachitE vaikuMThamu
vedakaga nETiki veDapuNyamu liMka
sadaramu sadaramu sAdhiMcharO        talapu 

Word to Word meaning: యిదే (yidE) = this is; హరినామము (harinAmamu) = name of god Hari;  యిదే (yidE) = this is; కొననాలికె (konanAlike) = tip of (your) tongue;  వదలక (vadalaka) = holding steadfastly; తలఁచితే (talachitE) = keep remembering;  వైకుంఠము (vaikuMThamu) = the ultimate place for all the beings, Vaikunth; వెదకఁగను (vedakaganu) = search; ఏఁటికి (ETiki) = Why; వెడపుణ్యములు (veDapuNyamulu) = trivial things like virtue;   ఇంక (iMka) = here after; సదరము (sadaramu) = skill, cleverness, dexterity; సదరము (sadaramu) = నైపుణ్యం, కౌశలము skill, cleverness, dexterity; సాధించరో (sAdhiMcharO) =  O Man Achieve, O Man Fulfil. 

Literal meaning: O Man! Keep the name of God Hari on the tip of your tongue. Pray to God with all your heart and for sure you will find the ultimate resting place, Vaikunth (वैकुण्ठ).  No need to engage in trivial searches for the elusive virtue, instead achieve skill, dexterity. 

Explanation: We must ponder why Annamacharya is dissuading us from pursuing virtuous acts? Most difficult thing is to find the ground which do you base your decisions. Look at history, Scriptures, saints, temples have failed to resolve man’s problems. Even thousands of years after emergence of the religions, Man remains perplexed and doubtful.  Therefore, they are not references. 

Whoever, be it Gautam Buddha, Socrates, Mahatma Gandhi, Thoreau, Ramana Maharshi, Nelson Mandela based their actions on their own understanding. They found the ground by themselves. They are true revolutionaries. Even Bhagavadgita says उद्धरेदात्मनात्मानं uddhared ātmanātmāna ( 6-5) emphasising that you must improve all by yourself ( not outside power, including God). 

Unless  we resolve this basis/plane for action, the direction of life remains foundation less. Thus any amount of virtuous work according to memory, scriptures, religious guides obviously goes in wrong direction.  

When you donot know the meaningful thing to do, what is the point in undertaking long drawn exercises. Therefore, it is important find the basis for your action than to perform action. 

What is the skill and dexterity Annamacharya is mentioning? Of course, they are not the skills like we learn in colleges and schools. Skill to dissociate from wrong action. Dexterity or mastery in finding one’s own mistakes.   

Implied Meaning: O man! Spend time in meditation. Instead of wasting time in running after virtuous acts, know your wrong actions.

భావము: ఓ మానవుడా! హరినామము నీ నాలుక కొనపై ఉంచు. పూర్ణహృదయంతో, వదలక దైవమును  తలఁచితే  వైకుంఠాన్ని కనుగొంటావు. అంతుచిక్కని పుణ్యముల కోసం అల్పమైన శోధనలలో కాలాయాపన చేయకు, బదులుగా నైపుణ్యమును కౌశలమును పెంచుకో.

వివరణము: అన్నమాచార్యులు వెడపుణ్యములు అని ఎందుకన్నరో  ఆలోచించాలి.? చాలా కష్టమైన విషయం ఏమిటంటే, మీరు మీ నిర్ణయాలకు ఆధారమైన తలమును కనుగొనడం. సాధువులు, దేవాలయాలు, మత గ్రంధాలు మనిషి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని చరిత్ర చెబుతోంది. అందుకే మతములు వచ్చి వేల యేండ్లు గతించిననూ, మనిషికి అదే ఆందోళన​. ఆదే అయోమయం. అందువల్ల, అవి దారి చూపలేవు. 

గౌతమ బుద్ధుడు, సోక్రటీస్, మహాత్మా గాంధీరమణ మహర్షి, నెల్సన్ మండేలా వంటి మహాత్ములు తమ చర్యలను స్వంత అవగాహనపై కొనసాగించిరి. వారు స్వయంగా చర్యలకు అనువైన ప్రమాణమును కనుగొన్నారు. వారే నిజమైన విప్లవకారులు. భగవద్గీత కూడా ఉద్ధరేదాత్మనాత్మానం ‘ (6-5) అంటూ నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని నొక్కి చెప్పింది. అనగా ఇది ఎవరికివారు స్వయంగా తెలుసుకొనవలసిన విషయం. 

దేనిమీద అధారపడి చర్యలు తీసుకోవాలో, అన్నింటికి అధారభూతమనదేదో దానిని తెలియకుండా  చర్యలు తీసుకోవడం అవివేకం. అంటే ఇప్పటి మన చర్యలు అసంగతములే. వెదకఁగ నేఁటికి వెడపుణ్యము లింకతో అనాధారమైన పుణ్యములను వెంబడిస్తూ పరిగెత్తడం అనాలోచిత చర్యయే అన్నారు. 

అన్నమాచార్య ప్రస్తావించిన సదరము అనగా ఏమిటి? వాస్తవానికి, కళాశాలలు మరియు విద్యాలయాల్లొ మనం సాన బెడుతున్నవి నిజమైన నైపుణ్యాలు కావు. అనవసరపు చర్యలను చేపట్టక మునుపే గ్రహించునది నైపుణ్యం. స్వంత తప్పులను కనుగొనడంలో కౌశలము ముఖ్యం.

అన్వయార్ధము: ఓ మానవుడా! భగవద్ధ్యానంలో సమయం గడపు. పుణ్యముల వెంట పరుగెత్తడంలో సమయం వృధా చేయకుండా, నీలో చేరుతున్న మలినాలను అనుక్షణం గమనిస్తూ ఉండు.

కలదు దేహమిదె కలవివె ముద్రలు

వలెనని చేకొన్న వైకుంఠము
వొలసి కర్మములఁ బొరలఁగ నేఁటికి
కలిగెను కలిగెను కైకొనరో ॥తలఁపు॥ 

kaladu dEhamide kalavive mudralu

valenani chEkonna vaikuMThamu
volasi karmamula boralaga nETiki
kaligenu kaligenu kaikonarO       talapu 

Word to Word meaning: కలదు (kaladu) = exists, being;  దేహమిదె (dEhamide) = this body; కలవివె (kalavive) = exists these; ముద్రలు (mudralu) = stamps, seals, signets;  వలెనని (valenani) = willingly; చేకొన్న (chEkonna) = take up; వైకుంఠము (vaikuMThamu) = the ultimate resting place for all the beings, Vaikuntha (वैकुण्ठ);  వొలసి (volasi) =వలచు, lovingly, interestingly; కర్మములఁ (karmamula) = activites; బొరలఁగన్ (boralagan)  = పొర్లు, పొరలియాడు, దొర్లు, to roll, to continue; ఏఁటికి (nETiki) = why? కలిగెను (kaligenu) = available; కలిగెను (kaligenu) = available;  కైకొనరో (kaikonarO) = పూను, గ్రహించు, to undertake, to receive.

Literal meaning: O Man! You are bestowed with (this great thing called) body. There are these innumerable signs of the Ultimate/Truth. Willingly take up and reach vaikuMThamu. Why roll all over with fruitless activities? vaikuMThamu (वैकुण्ठ) is Available, available.  Undertake (this journey). 

Explanation: The hard thing to appreciate for man is that the body and the soul are one and the same. Man exists as long as his body exists. Body gives the sensory perception. Therefore, the body and the soul are one integral unit. 

What do we use our body for? Do we recognise these innumerable signs of God? Now see the connect with the previous stanza. We need to use the sensory perception in finding the ground for action. Instead, we use them for quenching the thirst 9 of desires. As long as there is conduit for these perceptions, they flow unnoticed. Are we sensitive to find our reactions to external stimuli? 

Now by the wording volasi karmamula boralaga nETiki (వొలసి కర్మములఁ బొరలఁగ నేఁటికి) Annamacharya is asking us to use the body to find the internal reactions, not go along with the conditioned reaction. 

Yet Annamayya confirms that this Vaikuntham (वैकुण्ठ) is not a mere postulation, it really exists. Annamacharya in verse paramuvErokachOTa bAti yunnadA (పరము వేరొకచోటఁ బాఁతి యున్నదా) asserts that the unknown (the other) is not hidden elsewhere but inside you. 

But our avarice to acquire this vaikuMThamu (वैकुण्ठ) like we amass money, fails all the attempts. Also it is worth noting that this vaikunthamu (वैकुण्ठ) is not in the past moment but in the moment of happening. So, one cannot try and get to Vaikuntham. But one can live in that vaikuntham. That is why Annamayya said to live this uncompromising life with integrity. Therefore, the reason for all the religions to talk of pure heart. 

Readers may get further explanation in the following verses.

1.    talachinavinniyu danakorakE (తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ)

2.    gAlinE pOya galakAlamu (గాలినే పోయఁ గలకాలము)

3.    Bhagavad-Gita verse इन्द्रियस्येन्द्रियस्यार्थे…… त्तौ ह्यस्य परिपन्थिनौ (3-34)

 

భావము: ఓ మానవుడా! నీకు (ఈ ఉత్క్రుష్టమైన) శరీరం ప్రసాదించబడింది. సత్యమునకు లెక్కలేనన్ని సంకేతాలు (కళ్ల ఎదురుగా) ఉన్నాయి. ఇష్టపూర్వకంగా వీటిని స్వీకరించి వైకుంఠము చేరవచ్చు. ఫలించని వ్యర్ధ కార్యకలాపాలలో ఎందుకు తగులుకుంటావు? వైకుంఠము అందుబాటులో ఉంది. (త్వరగా ఈ ప్రయాణం) చేపట్టు.

వివరణము: మనిషి శరీరం వేరు మరియు ఆత్మ వేరు అనుకోవడం సహజం. ఇవి రెండూ ఒకటే అని భావించడం కొంత  కష్టమైన విషయం. మనిషి తన శరీరం ఉన్నంత వరకే జీవించి ఉంటాడు. శరీరం ఇంద్రియ జ్ఞానాన్ని ఇస్తుంది. అందువల్ల, శరీరం మరియు ఆత్మ ఒకే విడదీయలేని ద్రవ్యము. 

మన శరీరాన్ని దేని కోసం ఉపయోగిస్తాము? దైవము యొక్క ఈ అసంఖ్యాక సంకేతాలను మనం గుర్తించగలమా? ఇప్పుడు మునుపటి చరణంతో అనుసంధానం చూడండి. తగిన చర్య కోసం పునాదిని కనుగొనడంలో మన ఇంద్రియ అవగాహనను ఉపయోగించాలి. కానీ దానికి బదులుగా, కోరికల దాహం తీర్చడానికి మనము వాటిని ఉపయోగిస్తాము. ఈ  ఇంద్రియ అవగాహనలకు మునుపే ఏర్పరచిన దారి (వాహిక) ఉన్నంత వరకు, అవి గుర్తించబడకుండా ప్రవహిస్తాయి. బాహ్య ఉద్దీపనలకు మన ప్రతిచర్యలను కనుగొనే  సున్నితత్వం  మనకుందా? 

ఇప్పుడు వొలసి కర్మములఁ బొరలగ నేఁటికి  అంటూ అన్నమాచార్యులు మనలను అంతర్గత ప్రతిచర్యలను కనుగొనడానికి శరీరాన్ని ఉపయోగించమని ప్రోత్సాహిస్తూ, స్థితి వ్యాజము (స్థితి కలిగించు కపటము, కండిషన్డ్ రియాక్షన్‌) తెలియమంటున్నారు. 

ఇంకా అన్నమయ్య ఈ వైకుంఠము అనునది కేవలం ఒక భావన, ఊహాత్మకమైనది​ కాదు, నిజంగా ఉందని కూడా ధృవీకరిస్తున్నాడు. అన్నమాచార్యులు పరము వేరొకచోటఁ బాఁతి యున్నదా అనే కీర్తనలో పరము (తెలియనిది/మరొకటి) మరెక్కడో దాచబడిలేదని అది మీ లోపలే నిక్షిప్తమై ఉందని నొక్కిచెప్పారు. 

కానీ డబ్బును కూడబెట్టినట్లుగానే ఈ వైకుంఠమునూ సంపాదిద్దాం అనే అత్యాశ ప్రయత్నములన్నింటినీ వ్యర్ధముచేయును. ఏల యనగా వైకుంఠము అనునది గడచిపోయిన క్షణంలో లేదు. జరుగుతూ ఉన్న కాలంలో ఉంది. కావున ప్రయత్నించి వైకుంఠము పొందలేము.  కానీ ఆ వైకుంఠమున జీవించవచ్చు. అందుకే చిత్తశుద్ధితో ఈ రాజీలేని జీవితాన్ని గడపాలని అన్నమయ్య చెప్పారు. అందుకే అన్ని మతాలు స్వచ్ఛమైన హృదయం గురించి మాట్లాడుతాయి. 

క్రింది కీర్తనల నుండి పాఠకులు మరింత వివరణ పొందవచ్చు.

1.    తలఁచినవిన్నియుఁదనకొరకేఁ వెలిఁ

2.    గాలినే పోయఁ గలకాలము

3.    భగవద్గీత శ్లోకము ఇంద్రియస్యేంద్రియస్యార్థేతౌ హ్యస్య పరిపన్థినౌ” (3-34) 

శ్రీ వేంకట మదె శ్రీపతి వీఁడిగో

వావిరిఁ గొలిచిన వైకుంఠము
భావించి చూచిన బ్రహ్మాదులకును
త్రోవయిదె త్రోవయిదె తొలఁగకురో        ॥తలఁపు॥ 

SrI vEMkaTa made SrIpati vIDigO

vAviri golichina vaikuMThamu
bhAviMchi chUchina brahmAdulakunu
trOvayide trOvayide tolagakurO  talapu

 

Word to Word meaning:  శ్రీ వేంకట మదె (SrI vEMkaTa made) = There you see the hill called SRIVENKATAMU the abode of God;  శ్రీపతి వీఁడిగో (SrIpati vIDigO) = Lord of all the riches of this world is this one; వావిరిఁ (vAviri) = క్రమము, అధికము, order, system, method;  గొలిచిన (golichina) = if you pray (here contextual meaning is realise the divine order); వైకుంఠము (vaikuMThamu) = the ultimate resting place for all the beings, Vaikuntha (वैकुण्ठ);   భావించి చూచిన (bhAviMchi chUchina) = When you look with deep insight;  బ్రహ్మాదులకును (brahmAdulakunu) = for the greatest of the beings; త్రోవయిదె (trOvayide) = this is the way;  త్రోవయిదె (trOvayide) = this is the way;  తొలఁగకురో (tolagakurO) = do not deviate from this path; 

Literal meaning: That great hill is SRIVENKATAMU, the abode of the presiding Lord SRIPATI (who is also the Lord of all the riches of this world). Understand the divine order of this world to find the Vaikuntha (वैकुण्ठ). Even for the greatest of the beings, this is the path. O Man! Do not deviate. 

Explanation: In this verse, Annamacharya is very clear that there are no short cuts. The rule is same for all. God do not differentiate by stating that the path is same even for Brahma (the greatest of the beings).

భావము: అదిగో శ్రీవేంకటము. శ్రీపతి వీఁడే. వైకుంఠాన్ని కనుగొనడానికి ఈ ప్రపంచం యొక్క అంతర్లీనమైన దైవికమైన క్రమాన్ని అర్థం చేసుకోండి. బ్రహ్మాదులకును కూడా ఇదే త్రోవ. ఓ మానవుడా! ఈ త్రోవనుండి తొలగవలదు.

వివరణము: ఈ చరణంలో అన్నమాచార్యులు చాలా స్పష్టంగా మోక్షానికి అడ్డదార్లు లెవన్నారు. నియమం అందరికీ ఒకటే. బ్రహ్మకైనా, సామాన్యునికైనా  కూడా  మార్గం ఒకటే అని పేర్కొనడం ద్వారా దేవుడు భేదం చూపడన్నారు. 

ఈ సందర్భంలో జయభేరిలోని పాట అధికులనీ.. అధములని... నరుని దృష్టిలోనే భేదాలు  శివుని దృష్టిలో... అంతా సమానురే”  తప్పక గుర్తుకు వస్తుంది.

 

Summary of this Keertana:

O Man, the god within your thoughts is this one.  Very Easy. keep purifying, keep searching, Keep refining (yourself). 

O Man! Keep the name of God Hari on the tip of your tongue. Pray to God with all your heart and for sure you will find the ultimate resting place, Vaikunth.  No need to engage in trivial searches for the elusive virtue, instead achieve skill, dexterity. (Implied Meaning: O man! Spend time in meditation. Instead of wasting time in running after virtuous acts, know your wrong actions.) 

O Man! You are bestowed with (this great thing called) body. There are these innumerable signs of the Ultimate/Truth. Willingly take up and reach vaikuMThamu. Why roll all over with fruitless activities? vaikuMThamu (वैकुण्ठ) is Available, available.  Undertake (this journey). 

That great hill is SRIVENKATAMU, the abode of the presiding Lord SRIPATI (who is also the Lord of all the riches of this world). Understand the divine order of this world to find the Vaikuntha (वैकुण्ठ). Even for the greatest of the beings, this is the path. O Man! Do not deviate.  

కీర్తన సంగ్రహ భావము:

తలఁపులోననే ఉండు దైవము వీఁడే.  సులభము సులభము పునీతుని చేసుకుంటూ దర్శించు.

ఓ మానవుడా! హరినామము నీ నాలుక కొనపై ఉంచు. పూర్ణహృదయంతో, వదలక దైవమును  తలఁచితే  వైకుంఠాన్ని కనుగొంటావు. అంతుచిక్కని పుణ్యముల కోసం అల్పమైన శోధనలలో కాలాయాపన చేయకు, బదులుగా నైపుణ్యమును కౌశలమును పెంచుకో. (అన్వయార్ధము: ఓ మానవుడా! భగవద్ధ్యానంలో సమయం గడపు. పుణ్యముల వెంట పరుగెత్తడంలో సమయం వృధా చేయకుండా, నీలో చేరుతున్న మలినాలను అనుక్షణం గమనిస్తూ ఉండు.)

ఓ మానవుడా నీకు (ఈ ఉత్క్రుష్టమైన) శరీరం ప్రసాదించబడింది. సత్యమునకు లెక్కలేనన్ని సంకేతాలు (కళ్ల ఎదురుగా) ఉన్నాయి. ఇష్టపూర్వకంగా వీటిని స్వీకరించి వైకుంఠము చేరవచ్చు. ఫలించని వ్యర్ధ కార్యకలాపాలలో ఎందుకు తగులుకుంటావు? వైకుంఠము అందుబాటులో ఉంది. (త్వరగా ఈ ప్రయాణం) చేపట్టు.

అదిగో శ్రీవేంకటము. శ్రీపతి వీఁడే. వైకుంఠాన్ని కనుగొనడానికి ఈ ప్రపంచం యొక్క అంతర్లీనమైన/ దైవికమైన క్రమాన్ని అర్థం చేసుకోండి. బ్రహ్మాదులకును కూడా ఇదే త్రోవ. ఓ మానవుడా! ఈ త్రోవనుండి తొలగవలదు. 

 

 

Copper Leaf: 36-6  Volume 15-206

2 comments:

  1. ఓంశ్రీసాయినాధాయనమః సత్యాసత్య విచక్షణా ఙ్ఞానము నకు మూలకారకుడు భగవంతుడు కల్పించిన మాయ యనియు గీత 4.22). ఒక్కభగవత్ సంకల్పమున మాత్రమే సద్గురు సాన్నిధ్యమున సత్వగుణమున సత్య మార్గమేర్పడునని నేర్పిన సద్గురువునకు ప్రణామములు.

    ReplyDelete
  2. అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనది.వ్యర్థమైన కార్యకలాపాలలో చిక్కుకొనక,నీలోనే యున్న హరిని చిత్తశుద్ధితో ధ్యానిస్తూ వైకుంఠ మార్గాన్ని అనుసరించు.శ్రీవేంకటపతి కొలువుండే వైకుంఠమును కనులారా
    దర్శించి, తరింపుమని అన్నమయ్య దానిని చేరే త్రోవను చూపిస్తూ, దాని సాధనకు వలయు నైపుణ్యమును, కౌశల్యమును వృద్కీధి చేసుకోమని ఉద్ర్బోధిస్తున్నాడు ఈ కీర్తనలో.
    భగవద్గీత(6-5)శ్లోకం "ఉద్ధరేదాత్మనాత్మానాం"తో చక్కటి వ్యాఖ్యనము నిచ్చిన శ్రీ చామర్తి శ్రీనివాస్ గారికి అభినందనలు.🌹🙏

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...