Thursday, 14 October 2021

90. అభయ మభయమో హరి నీకు (abhaya mabhayamO hari nIku)

 

ANNAMACHARYA

90. అభయ మభయమో హరి నీకు

(abhaya mabhayamO hari nIku) 

Introduction: In this melodious and beautifully worded verse, Annamacharya  touches upon the primordial fear. The underlying message is that it is important to take up the path of God actually than appreciating it intellectually.

He goes on to state that there are only two states. There is world of difference in being tranquil and try to be in tranquillity.   One is state of being. The other is effort. The effort is internal friction. It ultimately generates discomfort.

All our theoretical and intellectual knowledge of God is useless in the face of daily grind and our own wavering nature.  Only way out available for man is to be in meditation, with no anticipation.

ఉపోద్ఘాతము: సుమధురమైన, శ్రవణానందమైన కీర్తనలో అన్నమాచార్యులు భయం గురించి  ప్రస్తావించారు. అంతర్లీన సందేశం ఏమిటంటే, మేధోపరంగా మెచ్చుకోవడం కంటే వాస్తవముగా దైవము యొక్క మార్గాన్ని ఆచరించుట, అనుసరించుట ముఖ్యమన్నారు. ​

అతను రెండు స్థితులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నాడు. ప్రశాంతంగా ఉండటానికి మరియు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడంలో తేడా ఉంది. ఒకటి సహజంగా ఉన్న స్థితి. మరొకటి ఉండుటకు ప్రయత్నం. ప్రయత్నం ఎంత చిన్నాదైనా అంతర్గత ఘర్షణకు సంకేతం. ఇది చివరికి అసౌకర్యాన్ని సృష్టిస్తుంది.

దైవము గురించిన సైద్ధాంతిక  జ్ఞానం అంతులేని కార్యకలాపాలు మరియు మన స్వంత చంచల స్వభావం యొక్క నేపథ్యంలో అరిగిపోయి కరిగిపోతుంది.  మనిషికి అందుబాటులో ఉన్న ఏకైక మార్గం ఎలాంటి ఆపేక్ష  లేకుండా దైవ ధ్యానంలో ఉండుట.

కీర్తన:

అభయ మభయమో హరి నీకు

విభుఁడ వింతటికి వెర విఁక నేది   ॥పల్లవి॥ 

జడిగొని మదిలో శాంతము నిలువదు

కడుఁగడు దుస్సంగతి వలన
యిడుమలేని సుఖ మించుక గానము
అడియాసల నా యలమటవలన ॥అభయ॥

తలఁపులోన నీతత్వము నిలువదు

పలు లంపటముల భ్రమవలన
కలిగిన విజ్ఞాన గతియును దాఁగెను
వెలి విషయపు పిరివీకుల వలన   ॥అభయ॥

పక్కనఁ బాపపు బంధము లూడెను

చిక్కక నినుఁ దలఁచిన వలన
చిక్కులు వాసెను శ్రీవేంకటపతి
నిక్కము నా కిదె నీకృప వలన      ॥అభయ॥

 

abhaya mabhayamO hari nIku
vibhuDa viMtaTiki vera vika nEdi
pallavi

jaDigoni madilO SAMtamu niluvadu
kaDugaDu dussaMgati valana
yiDumalEni sukha miMchuka gAnamu
aDiyAsala nA yalamaTavalana
abhaya

talapulOna nItatvamu niluvadu
palu laMpaTamula bhramavalana
kaligina vij~nAna gatiyunu dAgenu
veli vishayapu pirivIkula valana
abhaya

pakkana bApapu baMdhamu lUDenu
chikkaka ninu dalachina valana
chikkulu vAsenu SrIvEMkaTapati
nikkamu nA kide nIkRpa valana
abhaya

 

Details and Explanations:

అభయ మభయమో హరి నీకు

విభుఁడ వింతటికి వెర విఁక నేది            ॥పల్లవి॥
 

abhaya mabhayamO hari nIku
vibhuDa viMtaTiki vera vika nEdi
pallavi 

Word to Word meaning:

అభయ మభయమో (abhaya mabhayamO) = Assurance, Reassurance; హరి (hari) = God Hari;  నీకు (nIku) = for you; విభుఁడవు (vibhuDavu) = Lord for; ఇంతటికి (iMtaTiki) = entire universe; వెర విఁక నేది (vera vika nEdi) = Where is the question of fear (for us)

Literal meaning: Assurance, Reassurance of God Hari is there for us. He is the Lord of this universe. Where is the question of fear?   

Explanation: Fear is the key to most of the actions of man. There is no doubt that man wants to stand behind the security. This security is based on his experience of yesterday. However, today’s challenges will be different from yesterday’s and our preparations are rendered useless. Man spends all his time in assembling new ammunition to control this invincible “present running moment”.

I am reminded one scene I watch every day during the morning walk. A small pet dog, fearlessly facing the two ferocious big dogs. This small fellow knows the security of big fence between him and the big dogs. This small pet dog faces the two big ones ‘as if it does not know fear’ and keeps his fore legs wide open to take on the big ones. 

Our present preposterous fearlessness is akin to that of the small dog. We have built the security of bank deposits, security by aerial watch and security of gun.  Are we fearless? The very built up of security is direct indication of extent of fear. Higher the walls, lower the confidence to face the truth. What is God to such people? A super Security guard for their unbridled arrogance?

Can we be as fearless in the absence of the security? Probably most of us will be driven to madness. What do we learn about God if we have to discuss security? Why is this saint of 15th century raising the question of security? 

Please consider this statement of Sir Isaac Newton: “God is the same God, always and everywhere. He is omnipresent not virtually only, but also substantially, for virtue cannot subsist without substance.” 

“Atheism is so senseless. When I look at the solar system, I see the earth at the right distance from the sun to receive the proper amounts of heat and light. This did not happen by chance.”   

From the words of Newton, we can easily understand that God has already provided us the required security. If God is everywhere, why man feels insecurity? Because we do not believe god. We want God to help us in few aspects. Rest, we think we are capable enough. This partial belief is sources of all the troubles of man. 

భావము: అభయ మభయమో హరి నీకు.  అతడే విభుఁడింతటికి. వెరపు ఇక నేది? (విశ్వమంతటికీ ప్రభువైన హరి ఒసంగిన అభయము ఉండగా ఇంకా నీకు భయమేలా?)

వివరణము: భయమే మనిషి చేసే చాలా పనులకు కీలకం. అందుకే మనిషి భద్రతా వలయం వెనుక నిలబడాలనుకుంటాడు. కానీ అతడు కల్పించుకునే భద్రత నిన్నటి అనుభవంపై ఆధారపడింది. నేటి సవాళ్ళు నిన్నటి ఏర్పాట్ల​ కంటే భిన్నంగా ఉండి నిర్వీర్యమౌతాయి. జయింపరాని ఈ జరుగుతూ  ఉన్న క్షణంపై పట్టు సాదించేందుకు సమయాన్నంతా వ్యయంచేస్తూ కొత్త యుద్ధసామగ్రి సమకూర్చుకోవడంలో నిమగ్నమౌతాడు.

ప్రతిరోజు ఉదయం నడకలో నేను  చూసే ఒక దృశ్యం నాకు ఎప్పుడూ గుర్తుకు వచ్చి నవ్వొస్తుంది. ఒక చిన్న పెంపుడు కుక్క, రెండు భయంకరమైన పెద్ద కుక్కలను నిర్భయంగా ఎదుర్కొంటుంది. ఈ చిన్న కుక్కకి దానికి మరియు పెద్ద కుక్కలకు మధ్య పెద్ద కటకటాలు కల్పించే భద్రత తెలుసు. ఇంకేం! చిన్న పెంపుడు కుక్క భయమే తెలియనట్లు రెండు పెద్ద వాటిని ఎదుర్కొంటుంది.  పైగా ముందు కాళ్లను వెడల్పుగా తెరిచి నేను వెనక్కి తగ్గను అన్నట్లు మొహం పెడుతుంది. ​

మన ప్రస్తుత తలవంచని నిర్భయత్వం ఆ చిన్న కుక్క ధైర్యం లాంటిదే. మనము బ్యాంక్ డిపాజిట్ల భద్రత, ఆకాశ వీక్షణ ద్వారా భద్రత,  తుపాకీ భద్రత వెనకన ధైర్యంగా నిలబడి ఉంటాము. భద్రతను కట్టుదిట్టం చేయడం అనేది భయం యొక్క తీవ్రతకు ప్రత్యక్ష సూచన. ఎత్తైన గోడలు, సత్యాన్ని ఎదుర్కొనే విశ్వాసాన్ని తగ్గిస్తాయి. అలాంటి వారికి దేవుడు అంటే ఏమిటో? వారి విశృంఖలత్వాన్ని కాపాడే కాపలాదారే కాక మరేమిటి?

భద్రతావలయం లేనప్పుడు మనం నిజంగా అంత నిర్భయంగా ఉండగలమా? బహుశా మనం  పిచ్చివాళ్ళై పొతామేమో? మనం భద్రత గురించి చర్చించాల్సి వస్తే దేవుడి గురించి మనం ఏమి తెలుసుకుంటాం? 15వ శతాబ్దానికి చెందిన ఈ తపసి భద్రత ప్రశ్నను ఎందుకు లేవనెత్తుతున్నారు?

దయచేసి విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ యొక్క ఈ ప్రకటనను పరిగణించండి. ​ దేవుడంటే ఒకే దేవుడు, ఎల్లప్పుడూ మరియు ప్రతిచోటా ఉంటాడు. అతడు సర్వాంతర్యామి. వాస్తవంగా మాత్రమే కాదు, గణనీయంగా కూడా ఉంటాడు. నాస్తికత్వం చాలా అర్ధంలేనిది. నేను సౌర వ్యవస్థను చూసినప్పుడు, సూర్యుడి నుండి సరైన దూరంలో ఉన్న భూమిని సరైన, తగిన మొత్తంలో వేడి మరియు కాంతిని పొందడానికి ఎర్పాటు చూస్తాను. ఇది అనుకోకుండానో ప్రమాదవశత్తునో జరగలేదు.

న్యూటన్ గారి మాటల ద్వారా, దేవుడు మనకు అవసరమైన భద్రతను ఇప్పటికే అందించాడని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు ప్రతిచోటా ఉంటే, మనిషికి అభద్రత ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే, మనం దేవుడిని నమ్మము. దేవుడు కొన్ని అంశాలలో మాకు సహాయపడాలని మనము కోరుకుంటాము. తక్కిన వాటిలో మనము తగినంత సామర్థ్యం కలిగి ఉన్నామని  భావిస్తాము. దైవముపై ఈ పాక్షికమైన నమ్మకం మనిషి యొక్క అన్ని సమస్యలకు మూలం.

జడిగొని మదిలో శాంతము నిలువదు

కడుఁగడు దుస్సంగతి వలన
యిడుమలేని సుఖ మించుక గానము
అడియాసల నా యలమటవలన         ॥అభయ॥

jaDigoni madilO SAMtamu niluvadu
kaDugaDu dussaMgati valana
yiDumalEni sukha miMchuka gAnamu
aDiyAsala nA yalamaTavalana
abhaya

 

Word to Word meaning:  జడిగొని (jaDigoni) = నిరంతరము, continuously;  మదిలో (madilO)  = in the mind;  శాంతము (SAMtamu) = tranquillity, peace;   నిలువదు (niluvadu) = do not sustain;  కడుఁగడు (kaDugaDu) = multiple; దుస్సంగతి (dussaMgati) = చెడు సహవాసము, చెడు సాంగత్యము, చెడు సంపర్కము,  wrong friends, Wrong company, wrong contact; వలన (valana) = because of; యిడుమలేని (yiDumalEni) = కష్టంలేని, trouble-free; సుఖము (sukhamu) = comnfort; ఇంచుక (miMchuka) = not even iota;  గానము (gAnamu) = cannot find; అడియాసల నా  (aDiyAsala nA)  = because of vanity, vain desire; యలమటవలన (yalamaTavalana) = due to grief sorrow, affliction;

Literal meaning: Man cannot get continuous tranquillity or peace because of wrong friends, Wrong company, wrong connection. vanity and vain desire for trouble free comfort is lost in grief and affliction in its pursuit. 

Explanation: Our concept of tranquillity is finite, is like a temporary truce. when someone disturbs, our feeling is always that we are robbed of the tranquillity and for the learned, it is a temporary movement away from the tranquillity. 

This notion of "being robbed" may be considered similar to ‘someone is going to take away what is yours' or 'losing some unknown thing' is actually transformation of fear. 

That is the reason we get angry when disturbed while engaged in favourite activities. Whereas the learned don’t. For us it is estrangement.  For the learned this is a temporary journey out. Thus, it is a world of difference being in tranquillity and desire to be tranquillity.

భావము: నిరంతరము మదిలో శాంతము నిలువదు అనేకానేక  చెడు సహవాసము, చెడు సాంగత్యము, చెడు సంపర్కముల వలన.  కష్టంలేని సుఖ మించుక గానము అడియాసల వలన,  మనోవిచారముల వలన.

వివరణము: మన ప్రశాంత భావన పరిమితమైనది. ఇది తాత్కాలిక సంధి లాంటిది. మనకిష్టమైన పనిలో ఉన్నప్పుడు ఎవరైనా భంగము చేసినప్పుడు, మన భావన ఎప్పుడూ మన ప్రశాంతతను ఎవరో దోచుకుంటున్నారని;  మరియు యోగులకు, అదే భంగము ప్రశాంతతకు దూరంగా ఉండే తాత్కాలిక ఎడబాటు లాగను తోచుట గమనింపదగ్గది.

"దోచుకుంటున్నారని"  అనగా 'ఎవరో తనదైన దానిని లాక్కుని వెళ్ళిపోతున్నారు' ‘ఏదో పోగొట్టుకుంటున్నాను అనే భావనల అనిపించడం వెనుక భయం దాగి ఉన్నదని గమనించండి.

ఇష్టమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పుడు మనల్ని చెదరగొట్టక్కర లేదు, పలకరించినా కోపం తెచ్చుకోవడానికి అదే కారణం. అయితే జ్ఞానులకు ఈ భంగము తాత్కాలికమని ఎఱుక ఉండి కోపం రాదు. శాంతంగా ఉండడానికి, ప్రశాంతత తెచ్చుకొనుటకు ప్రయత్నించుటకు ఎంత వ్యత్యాసం?

తలఁపులోన నీతత్వము నిలువదు

పలు లంపటముల భ్రమవలన

కలిగిన విజ్ఞాన గతియును దాఁగెను

వెలి విషయపు పిరివీకుల వలన           ॥అభయ॥

talapulOna nItatvamu niluvadu
palu laMpaTamula bhramavalana
kaligina vij~nAna gatiyunu dAgenu
veli vishayapu pirivIkula valana
abhaya 

Word to Word meaning: తలఁపులోన (talapulOna) = in mind; నీతత్వము (nItatvamu) =your real /essential nature; నిలువదు (niluvadu) = does not last;  పలు లంపటముల (palu laMpaTamula) = many impediments and obstructions; భ్రమవలన (bhramavalana) = due to obliquity of judgement, due to misconception;  కలిగిన (kaligina) = existing or available;  విజ్ఞాన గతియును (vij~nAna gatiyunu) = శాస్త్ర జ్ఞానము, bookish knowledge; దాఁగెను (dAgenu) = got hidden or disappear; వెలి విషయపు (veli vishayapu) = outside things; పిరివీకుల వలన (pirivIkula valana) = పీకులాటల వలన, తెగకుండా చిక్కులు పెట్టుట వలన, in squabbling and wrangling.

 

Literal meaning: We are unable to retain your essential nature in our minds due multiple impediments caused by misconceptions and obliquity in judgement. Whatever the bookish knowledge disappeared due to squabbling on external issues.  

Explanation: Man gets engaged in innumerable acts due to obliquity of judgement. that consciousness is an unstoppable movement. In many movies, the villain is careful not to reveal himself. The leader goes to great lengths to catch him. He will be shocked to finally find the villain to be from his house or neighbourhood. Hero regrets many years of hard work. Similarly, man due to his misconceptions gets trapped in multiple activities. Due to due to labour and suffering in attempts to free himself he forgets the essential, vital life. 

We are now aware of societies, offices, organisations making us do exercises in Emergency preparedness. They Impart simple rules to follow.  and still many lives are lost due to negligence or forgetting of these rules. Though everyone is aware of such knowledge is lifesaving, still there is lot of disregards for such knowledge. If this is the case for lifesaving instructions, what to speak of voluntary theoretical knowledge of the God. This knowledge largely wears out due to our daily grind and squabbles. 

Now you can appreciate why the knowledge we gain about GOD is rendered useless because it is transmitted verbally only. Neither the teacher nor the listeners have the intensity to learn, what use is of such learning? When the mind, body and soul are not aligned with same intensity, why to talk about God? 

Now you can judge how accurate Annamacharya is when he says “the bookish knowledge disappeared due to squabbling on external issues”

భావము: పలు లంపటముల భ్రమవలన తలఁపులోన నీతత్వము నిలువదు;  బాహ్య విషయములలో తెగని పీకులాటల వలన చదువుకున్న (నేర్చుకున్న) జ్ఞానము జాడలు లేకుండా పోయింది.

వివరణము: మనిషి ఎడతెరిపిలేని కదలికనే చైతన్యమని భ్రమపడతాడు. సినిమాలలో ప్రతినాయకుడు తనెవరో తెలియనీయకుండా జాగ్రత్త పడతాడు. నాయకుడు అతడిని పట్టుకోవటం కోసం అనేక ప్రయాసలు పడతాడు. చివరకు తన ఇంట్లోని వాడనో, తన వూరిలోని వాడనో తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. అనేక సంవత్సరాల శ్రమకు చింతిస్తాడు. అలాగే మానవుడు బహు లంపటములలో చిక్కుకుని,  వాటి నుంచి విడిపించుకునే ప్రయత్నంలో శ్రమకు, బాధలకు లోనై ఆవశ్యకమైన, ప్రధానమైన జీవతత్వాన్ని మరుస్తాడు. 

సొసైటీలు, ఆఫీసులు, సంస్థలు అత్యవసర సంసిద్ధతతో మనల్ని కసరత్తులు చేసేలా చేయడం గురించి ఇప్పుడు మనందరకు  విదితమే. వారు అనుసరించాల్సిన సాధారణ, సులభమైన నియమాలను తెలియజేస్తారు. కానీ, ఈ నియమాలను నిర్లక్ష్యం చేయడం లేదా మరచిపోవడం వల్ల ఇంకా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.  చాలామందికి అలాంటి జ్ఞానం ప్రాణాలను కాపాడుతుందని తెలిసినప్పటికీ, దాని పట్ల చాలా నిర్లక్ష్యం ప్రస్పుటంగా కనబడుతుంది.  ప్రాణాలను కాపాడే సూచనల విషయంలో ఇదే జరిగితే, దేవుని గురించి స్వచ్ఛంద సిద్ధాంత పరిజ్ఞానం గురించి ఏమి మాట్లాడగలం?

కేవలం మాటల ద్వారా మాత్రమే ప్రసారం చేయబడిన జ్ఞానం పనికిరాకుండా పోతుంది. బోధకుడు లేదా శ్రోతలలో నేర్చుకోవడానికి తీవ్రమైన కాంక్ష లేకపోతే, అది వ్యర్ధమే.

ఇప్పుడు అన్నమయ్య గారి మాటలు "బాహ్య  విషయములలో తెగని పీకులాటల వలన చదువుకున్న (నేర్చుకున్న) జ్ఞానము జాడలు లేకుండా పోయింది" ఎంత నిజమో అలోచించండి.

పక్కనఁ బాపపు బంధము లూడెను

చిక్కక నినుఁ దలఁచిన వలన

చిక్కులు వాసెను శ్రీవేంకటపతి

నిక్కము నా కిదె నీకృప వలన   ॥అభయ॥


pakkana bApapu baMdhamu lUDenu
chikkaka ninu dalachina valana
chikkulu vAsenu SrIvEMkaTapati

nikkamu nA kide nIkRpa valanaabhaya

 

Word to Word meaning: పక్కనఁ (pakkana) = side; బాపపు (bApapu) = sin; బంధము లూడెను (baMdhamu lUDenu) = bondages loosened, చిక్కక (chikkaka) = without reducing intensity; నినుఁ (ninu) = you ( god);  దలఁచిన వలన (dalachina valana) = having remembered;  చిక్కులు (chikkulu) = all the entanglements; వాసెను (vAsenu) = got removed; శ్రీవేంకటపతి (SrIvEMkaTapati) = Lord Venkateswara; నిక్కము (nikkamu) = truly; నా కిదె (nA kide) = to me;  నీకృప వలన (nIkRpa valana) = due to your largesse. 

Literal meaning: O God! Because of my intense remembering of you, my bondages of sin got loosened. Lord Venkateswara all my entanglements vanished due to your largesse. 

Explanation: Annamacharya is very clear that his unwavering faith and devotion to god has given him liberation and freedom.  While our faith is partial in god as mentioned earlier in this explanation; where is the question of liberation? The prayer becomes an activity, therefore part of our struggle with life.

భావము: నీపై సన్నగిల్లని భక్తితో ఈ పక్కనఁ పాప బంధము లూడెను. ఓ శ్రీవేంకటపతి నీకృప వలన సమస్యలన్ని  వాటంతట అవే తొలగిపోయాయి.

వివరణము: అన్నమాచార్యులు తన అచంచలమైన విశ్వాసం మరియు భగవంతుని పట్ల భక్తి అతనికి విముక్తి మరియు స్వేచ్ఛను కలిగించిందని చాలా స్పష్టంగా చెప్పాడు. ముందు పేరాలలో పేర్కొన్నట్లుగా మన విశ్వాసం దేవుడిపై అసంపూర్ణంగా ఉంటుంది; ప్రార్థన ఒక కార్యాచరణ అవుతుంది, కనుక జీవితంతో పోరాటంలో ఒక భాగం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు.  దేవుడి విషయంలో సగం ప్రయత్నముతో పూర్తి ఫలితం దక్కాలనుకోవటం ఎంత అవివేకం? ఇక విముక్తి కలిగే ప్రశ్న ఎక్కడ ఉంటుంది?  

Summary of this Keertana:

Assurance, Reassurance of God Hari is there for us. He is the Lord of this universe. Where is the question of fear?

Man cannot get continuous tranquillity or peace because of wrong friends, Wrong company, wrong connection. vanity and vain desire for trouble free comfort is lost in grief and affliction in its pursuit.

We are unable to retain your essential nature in our minds due multiple impediments caused by misconceptions and obliquity in judgement. Whatever the bookish knowledge disappeared due to squabbling on external issues.  

O God! Because of my intense remembering of you, my bondages of sin got loosened. Lord Venkateswara all my entanglements vanished due to your largesse.

 

కీర్తన సంగ్రహ భావము:

అభయ మభయమో హరి నీకు.  అతడే విభుఁడింతటికి. వెరపు ఇక నేది? (విశ్వమంతటికీ ప్రభువైన హరి ఒసంగిన అభయము ఉండగా ఇంకా నీకు భయమేలా?)

నిరంతరము మదిలో శాంతము నిలువదు అనేకానేక  చెడు సహవాసము, చెడు సాంగత్యము, చెడు సంపర్కముల వలన.  కష్టంలేని సుఖ మించుక గానము అడియాసల వలన,  మనోవిచారముల వలన.

పలు లంపటముల భ్రమవలన తలఁపులోన నీతత్వము నిలువదు;  బాహ్య విషయములలో తెగని పీకులాటల వలన చదువుకున్న (నేర్చుకున్న) జ్ఞానము జాడలు లేకుండా పోయింది.

నీపై సన్నగిల్లని భక్తితో ఈ పక్కనఁ పాప బంధము లూడెను. ఓ శ్రీవేంకటపతి నీకృప వలన సమస్యలన్ని  వాటంతట అవే తొలగిపోయాయి.

 

 

 

Copper Leaf: 80-2  Volume 1-383

4 comments:

  1. సంసార లంపటములో చిక్కుకొన్న మేము చిత్తశుద్ధి లేక
    నీ తత్త్వము నెఱుగకున్నాము.నిరంతరం నిన్ను ధ్యానించటం
    వలన సంసారబంధము నుంచి విముక్తుడనైతిని. నీ అభయహస్తముండగా ఇంక భయమేల? నీ కృపకు పాత్రుడనైన
    నాకిక చింతేల? అంటున్నాడు అన్నమయ్య భక్తిభావంతో.

    భగవత్తత్త్వం గురించి న్యూటన్ మహాశయుడి వ్యాఖ్యలతో శ్రీ చామర్తి శ్రీనివాస్ గారి చక్కటి వ్యాఖ్యానం సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంది.
    వారికి అభినందనలు. 🌹🌹

    ReplyDelete
  2. Srinivasa your explanation is excellent. If followed it will be beneficial.

    ReplyDelete
  3. Very,very clear and very deep explanation.It is very cristal clear that whatever religion we follow,the ultimate thing is,one has to surrender to Almighty.....Vardhani

    ReplyDelete
  4. 🙏🙏Gem of a kirtana, Thanks a lot for sharing. The commentary is extraordinary👌

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...