ANNAMACHARYA
88. తనదీఁ గాక యిందరిదీఁ గాక
Introduction: In this verse, Annamacharya
says that man does not accept God as the only alternative to his present miserable
condition. You may notice, slight shades of melancholy behind the harmonious
and beautiful wording.
In this deeply
sequenced verse, he talked about satiating the never ending hunger in the first
stanza. Then he spoke on our continuous engagement with senses. In the third
stanza, Annamacharya takes on the attitude of man.
Man out of ignorance, fails to recognise God next to him. Instead, creates innumerable activities to find God. He struggles to find way out of his own engagements. Time runs fast. Somehow, man gives importance to making efforts than to recognize his own stupidity . Time for the return journey arrives without invitation.
ఉపోద్ఘాతము: ఈ కీర్తనలో రమణీయ
పదముల రమ్యతను ఛేదించుతూ కొంత విచారపు
ఛాయలు కనబడతాయి. అన్నమాచార్యులు మనిషి తన దౌర్భాగ్య స్థితికి ఏకైక
ప్రత్యామ్నాయంగా దేవుడిని అంగీకరించడన్నారు.
ఈ కీర్తనలో లోతైన క్రమం అగపడును.
మొదటి చరణంలో ఎన్నటికీ తీరని ఆకలి గురించి మాట్లాడారు. తరవాత ఇంద్రియాలతో మన
నిరంతర ఘర్షణ గురించి వెల్లడించారు. మూడవ
చరణంలో, అన్నమాచార్యులు మనిషి యొక్క వైఖరిని విమర్శించారు.
మనిషి తన అవివేకంతో చేరువనే వున్న దైవమును గుర్తించక, అనేక కార్యక్రమములు సృష్టించుకుని సతమత మౌతు కాలం
గడిపేస్తాడు. వేగంగా కాలచక్రం తిరిగిపోతుంది. ఈ విషయాలలో మనిషికి ప్రయత్నము కంటే
తనలోని అజ్ఞానము గుర్తించుట ముఖ్యమని ఆలోచించడు. చెప్పా పెట్టకుండా తిరుగు ప్రయాణానికి సమయం వచ్చేస్తుంది.
కీర్తన:
తనదీఁ గాక యిందరిదీఁ గాక తనువెల్ల బయలై దరి చేరదు ॥పల్లవి॥
కడుపూ నిండదు కన్నూఁ దనియదు కడఁగి లోనియాఁకలియుఁ బోదు
సడిఁబడి కుడిచినకుడుపెల్ల నినుము
గుడిచిన నీరై కొల్లఁబోయె ॥తన॥
చవియూఁ దీరదు చలమూఁ బాయదు లవలేశమైన నొల్లకపోదు
చివచివ నోటికడవలోనినీరై
కవకవ నవియుచుఁ గారీని ॥తన॥
అలపూఁ దోఁపదు అడవీ నెండదు యెలయించు భంగమయునఁ బోదు
తెలసి వేంకటగిరిదేవునిఁ దలఁపించు
తలఁపైనఁ దనకు ముందర నబ్బదు ॥తన॥
|
tanadI gAka yiMdaridI gAka tanuvella bayalai dari chEradu ॥pallavi॥
kaDupU niMDadu kannU daniyadu kaDagi lOniyAkaliyu bOdu
saDibaDi kuDichinakuDupella
ninumu
guDichina nIrai kollabOye ॥tana॥
chaviyU dIradu chalamU bAyadu lavalESamaina nollakapOdu
chivachiva nOTikaDavalOninIrai
kavakava naviyuchu gArIni ॥tana॥
alapU dOpadu aDavI neMDadu yelayiMchu bhaMgamayuna bOdu
telasi vEMkaTagiridEvuni
dalapiMchu
talapaina danaku muMdara
nabbadu॥tana॥
|
Details and Explanations:
తనదీఁ గాక
యిందరిదీఁ గాక
tanadI gAka yiMdaridI gAka
Word to Word meaning: తనదీఁ గాక (tanadI gAka) = not belonging to the self; యిందరిదీఁ గాక (yiMdaridI gAka) = not belonging to the society; తనువెల్ల (tanuvella) = complete body; బయలై (bayalai) = outside; దరి (dari) = near, close; చేరదు( chEradu) = does not come, does not get near;
Literal meaning: It neither belong to the self nor to the
society. It encompasses inside and outside. Yet does not become close to
anyone.
Explanation: Apparently Annamacharya is hinting at
something which neither personal not public property. it is there in every part
of the body. It exists outside as well.
In all probability he is referring to this Bhagavadgita verse.
बहिरन्तश्च भूतानामचरं चरमेव च |
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् || 16||
bahir antaśh cha bhūtānām acharaṁ charam eva cha
sūkṣhmatvāt tad avijñeyaṁ dūra-sthaṁ chāntike cha tat
Purport: He exists outside and inside
all living beings, those that are moving and not moving. He is subtle, and
hence, He is incomprehensible. He is very far, but He is also very near.
Annamacharya is not repeating a Bhagavadgita
verse! He is just reminding us that, though God is everywhere, It is the man’s
estrangement from the truth causing the trouble, not the proximity to the truth.
But of course, this closeness or
intimacy is not spatial but relational. We all know what it’s like to be
sitting right next to a person with whom we feel distant and conversely
we can feel close to a person who is thousands of miles away.
Implied Meaning: The God / truth /
consciousness exists inside and outside. Though it appears to be close, proximity
does not ensure oneness with God.
Following the footsteps of God is not easy.
kindly consider this biblical saying.
Matthew 16:24–26 (NKJV) “Then Jesus said
to His disciples, ‘If anyone desires to come after Me, let him deny himself,
and take up his cross, and follow Me. For whoever desires to save his life will
lose it, but whoever loses his life for My sake will find it. For what profit
is it to a man if he gains the whole world, and loses his own soul? Or what
will a man give in exchange for his soul?’”
భావము: ఇది తనదీఁ కాదు లేదా ఇందరిదీఁ (సమాజానిదీ) కాదు. ఇది తనువు లోపలా మరియు వెలుపలా ఉంటుంది. అయినా
ఎవరికీ దగ్గరవ్వదు.
వివరణము: అన్నమాచార్యులు ప్రస్తావించిన స్వీయమునకు (అహమునకు) గానీ, సార్వత్రికమునకు గానీ చెందని విషయము గురించి భగవద్గీత ఇలా అంటోంది.
బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ ।
భావము: సర్వత్రా ఆయన
పాదములు, కన్నులు,
శిరస్సులు మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో
ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై
ఉన్నాడు.
అన్నమాచార్య
భగవద్గీత శ్లోకాన్ని పునరావృతం చేయడం లేదు! దేవుడు ప్రతిచోటా ఉన్నప్పటికీ, సత్యం నుండి మనిషి
దూరమవడమే సమస్యకు కారణమని, సత్యానికి సామీప్యతతో
సంబంధం లేదని ఆయన గుర్తు చేస్తున్నాడు.
అయితే ఈ
సాన్నిహిత్యం ప్రాదేశికమైనది కాదు, మనో సంబంధమైనది. మనం
దూరం అనుకునే వ్యక్తి పక్కన కూర్చొన్నా కూడా, ఎలా దూరంగానే ఉంటాడో మనందరికీ తెలుసు. దీనికి వ్యతిరేకంగా వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తులైనా దగ్గరగా
అనుభూతి చెందగలము. దైవము విషయమూ అంతే.
అన్వయార్ధము: దైవము / సత్యము /
చైతన్యం మనిషి లోపల మరియు వెలుపల ఉండి దగ్గరగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, సామీప్యత దేవునితో ఏకత్వాన్ని నిర్ధారించదు.
దేవుని అడుగుజాడలను
అనుసరించడం అంత సులభం కాదు. దయచేసి క్రింద
బైబిల్ వాక్యం పరిశీలించండి.
అప్పుడు యేసు తన
శిష్యులను చూచి “ఎవడైనను
నన్ను వెంబడింప గోరిన యెడల, తన్నుతాను
ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని
నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును; నా నిమిత్తమై తన
ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించు కొనును.” (ముత్తయి
16:24-26).
కడుపూ నిండదు
కన్నూఁ దనియదు
kaDupU niMDadu kannU daniyadu
Word to Word meaning: కడుపూ (kaDupU) = stomach; నిండదు (niMDadu) = does not get filled ( here it is used in the sense of does not get satiated); కన్నూఁ (kannU) = eye; దనియదు (daniyadu) = does not get satisfied; కడఁగి (kaDagi) = by encouraging; లోనియాఁకలియుఁ (lOniyAkaliyu) = the hunger inside; బోదు (bOdu) = does not go away; సడిఁబడి (saDibaDi) = కలుషితమగు, by becoming contaminated; కుడిచినకుడుపెల్లను (kuDichinakuDupellanu) = all the food that is consumed; ఇనుము (inumu) = Iron, (may be meaning that it become black thing); గుడిచిన (guDichina) = drank water ( here meaning consumed liquid); నీరై (nIrai) = become water; కొల్లఁబోయె (kollabOye) = lost.
Literal meaning: Stomach does not get filled. Eyes do not get
satisfied. By encouraging to take more food does not satiate hunger for ever.
All the food gets converted to waste. Consumed liquids converted to water and
gets lost.
Explanation: further contemplate on this Biblical
saying below (Matthew 15) which appears to be an extension of this stanza.
16 “Are you still so dull?” Jesus asked them. 17 “Don’t you see that whatever
enters the mouth goes into the stomach and then out of the body? 18 But the things that come out of
a person’s mouth come from the heart, and these defile them. 19 For out of the heart come evil
thoughts—murder, adultery, sexual immorality, theft, false testimony, slander. 20 These are what defile a
person; but eating with unwashed hands does not defile them.”
భావము: కడుపు ఎప్పటికీ నిండదు.ఎంత
చూసినా సంతృప్తి ఉండదు. ఎంతో ఇష్టపడి
తిన్నా తిరిగి ఆకలి వేస్తుందే? తిన్నదంతా కలుషితమై వ్యర్ధమైపోతుంది. త్రాగినదంతా నీరై కొల్లఁబోతుంది.
వివరణము: ఈ చరణానికి అనుబంధంగా వ్రాశారా అన్నట్లుండే బైబిల్
లోని క్రింది వాక్యం కూడా చూడండి. (ముత్తయి 15).
“మీరు
ఇంకా అవివేకంగా ఉన్నారా? 17నోటిలోకి పోయేదంతా
కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది. 18కాని
నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి.
ఇది కూడా మీకు తెలియలేదా? 19హృదయంలో నుండే చెడు
ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ
సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. 20మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు”
చవియూఁ దీరదు
చలమూఁ బాయదు
chaviyU dIradu chalamU bAyadu
Word to Word meaning: చవియూఁ (chaviyU) = longing for taste; దీరదు (dIradu) = does not get satisfied; చలమూఁ (chalamU) ఈర్ష్య, మాత్సర్యము, envy, malice, spite, ill-will, enmity, hostility బాయదు (bAyadu) = does not leave; లవలేశమైనను
(lavalESamainanu) = even very little; ఒల్లకపోదు (nollakapOdu))
= does not leave; చివచివన్ (chivachiva) వేగంగా
నడవడంలో ధ్వనికి, a sound indicating quick movement; ఓటికడవలోని (OTikaDavalOni) = a earthen
pot with a hole; నీరై (nIrai) = like the water; కవకవ (kavakava) నవ్వుటయందగు ధ్వన్యనుకరణము, a expression to indicate laugh; నవియుచుఁ (naviyuchu) = రోగాదులచేత కృశించు, శుష్కించు,
to languish, worn out; గారీని (gArIni) =
స్రవించు, రాలిపోవు, peters out, falls.
Literal meaning: Man does not get satisfied with the taste; envy, malice and ego he will continue. Even very little, it does not part with. (life) while languishing in diseases, lost quickly like the water in a leaking pot.
Explanation: Now think of man’s life span and read
this Benjamin Franklin’s narrative describing the soliloquy of a bee who life
span is just 8 hours. Just understand the relevance of this text with the above
stanza
"My present friends are the
children and grandchildren of the friends of my youth, who are now, alas, no
more! And I must soon follow them; for, by the course of nature, though still
in health, I cannot expect to live above seven or eight minutes longer. What
now avails all my toil and labor in amassing honeydew on this leaf, which I
cannot live to enjoy!
“What the political struggles I have
been engaged in for the good of my compatriot inhabitants of this bush, or my
philosophical studies for the benefit of our race in general! for in politics
what can laws do without morals? Our present race of ephemeræ will in a course
of minutes become corrupt, like those of other and older bushes, and
consequently as wretched.”
“And in philosophy how small our
progress! Alas! art is long, and life is short! My friends would comfort me
with the idea of a name they say I shall leave behind me; and they tell me I
have lived long enough to nature and to glory. But what will fame be to an
ephemera who no longer exists? And what will become of all history in the
eighteenth hour, when the world itself, even the whole Moulin Joly, shall come
to its end and be buried in universal ruin?"
Therefore, Annamacharya is urging us to
take immediate action.
భావము: ఆస్వాదమునకు అంతు లేదు. ఎంత కాలమైనా ఈర్ష్య లెదా మాత్సర్యములు
తీరవు. వెఱ్ఱి నవ్వులు నవ్వుతూ, ఓటికడవలోని నీరు లాగా చివచివా (వేగంగా),
రోగాదులచేత కృశించి, శుష్కించి రాలిపోవును.
వివరణము: మనిషి జీవితకాలం గురించి ఆలోచించండి. దీనిని బెంజమిన్
ఫ్రాంక్లిన్ వ్రాసిన "ఎఫెమెరా” కథనంతో
పోల్చండి. ఇందులో రచయిత కేవలం 8 గంటలు మాత్రమే జీవించే తేనెటీగ స్వగతం గురించి వివరిస్తాడు. ఈ కథనంతో పై
చరణం యొక్క ఔచిత్యాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు.
"నా ప్రస్తుత స్నేహితులు నా చిన్నప్పటి స్నేహితుల పిల్లలు మరియు మనవలు.
అయ్యో, వాళ్ళు ఇక లేరే! మరియు నేను త్వరలో వారిని
అనుసరించాలి. ఇప్పటికి ఉన్న ఆరోగ్యంతో, నేను ఏడు లేదా
ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ కాలం జీవించాలని అనుకోలేను. నేను ఆస్వాదించలేని ఈ
తేనెను కూడగట్టడంలో ఇప్పుడు నా శ్రమ మరియు శ్రమ అంతా దేనికి
ఉపయోగపడుతుంది!"
"ఈ పొదలోని నా వారి మంచి కోసం లేదా, మా జాతి ప్రయోజనం కోసం నా తాత్విక అధ్యయనాల కోసం నేను ఎలాంటి రాజకీయ పోరాటాలు చేశాను! రాజకీయాలలో నీతులు లేకుండా చట్టాలు మాత్రం ఏమి చేయగలవు? ప్రస్తుతం మా జాతి వారు నిమిషాల వ్యవధిలో అవినీతిమయంగా మారిపోతున్నారు మరియు తత్ఫలితంగా ఈ పొదలన్నీ దౌర్భాగ్యంగా తయరయ్యాయి."
"మరియు తత్వశాస్త్రంలో మన పురోగతి ఎంత తక్కువ! అయ్యో! కళ అపరిమితం,
జీవితం పరిమితం! నా స్నేహితులు నేను నా వెనుక పేరు నిలుస్తుందని నన్ను ఓదార్చారు; నేను సహజంగాను మరియు కీర్తికి తగినట్లు చాలా కాలం జీవించానని వారు నాకు
చెప్పారు. కానీ ఇకపై (కొన్ని నిముషాల తరవాత) లేని అశాశ్వతానికి కీర్తి ఎలా
ఉంటుంది? మరియు పద్దెనిమిదవ గంటలో ప్రపంచం మొత్తం, మొత్తం మౌలిన్ జోలీ (ఆ జీవులుంటున్న పొద) కూడా దాని ముగింపుకు వచ్చి,
విశ్వవ్యాప్త విధ్వంసంలో ఖననం చేయబడుతుంటే, చరిత్రకు,
పేరుకు అర్ధం ఏమిటో?"
అన్నమాచార్యులు దైవ
సేవ చేయుటకు ఎందుకు తొందర పడమంటున్నది
సులభంగా తెలియవచ్చు.
అలపూఁ దోఁపదు
అడవీ నెండదు
alapU dOpadu aDavI neMDadu
Word to Word meaning: అలపూఁ (alapU) = weariness, tiredness; దోఁపదు (dOpadu) = do not feel; అడవీ (aDavI) =
in the forest; నెండదు (neMDadu) = do not get dried; యెలయించు (yelayiMchu) = తీసుకొనిపోవు, taking to; భంగమయునఁ
(bhaMgamayuna) =even insult or
dishonour; బోదు (bOdu)
= does not have effect; తెలసి
(telasi) = knowingly; వేంకటగిరిదేవునిఁ
(vEMkaTagiridEvuni) = Lord Venkateswara; దలఁపించు (dalapiMchu) = to put in mind,
to remind; తలఁపైనఁ (talapaina) = on the head; దనకు (danaku) = to the self; ముందర (muMdara) = in front (contextual meaning = in the first place) నబ్బదు (nabbadu) = not acquired, not gained.
Literal meaning: It does not tired in repeating the
experiences. Neither it get dried up in forest. Even insults/dishonour do not
have effect on it. Knowingly it does not accept to keep the lord Venkateswara ahead
of other things in the mind.
Explanation: What Annamayya wants to convey in this
poem? Unless man takes up god at the top of his priorities, it does not lead
him anywhere. What do we do? God, if at all, is just one of the things on our calendar.
If we assume that we get another chance,
think again? This life ends quicker than we imagine.
భావము: దీనికి అలపూఁ దోఁపదు. అడవిలోనూ ఎండిపోదు. ముసురుకుంటున్న అవమానాలు ప్రభావము లేనివే. వేంకటగిరిదేవునిఁ
తలపులు తలఁపైనఁ తెలసి అబ్బనివ్వదు.
వివరణము: ఈ కవితలో అన్నమయ్య ఏమి చెప్పాలనుకున్నారు? మనిషి దేవుడిని తన
ప్రాధాన్యతలలో అగ్రస్థానంలో ఉంచుకోకపోతే, జీవన గమనంలో
ముందుకెళ్ళడని చెప్పారు. కానీ మనము చేసేదేమిటి? అసలంటూ ఉంటే, దేవుడు, మన చేయదలచుకున్న విషయాలలో ఒకటి మాత్రమే.
ఇంకో అవకాశం
లభిస్తుందని ఆశపడుతున్నారా? అనుకోకమునుపే సమయం
తలుపు తడుతుంది.
Summary of this Keertana:
It neither belong to the self
nor to the society. It encompasses inside and outside. Yet does not become
close to anyone. (Implied
meaning: The God / truth /
consciousness exists inside and outside. Though it appears to be close, proximity
does not ensure oneness with God.)
Stomach does not get filled. Eyes
do not get satisfied. By encouraging to take more food does not satiate hunger
for ever. All the food gets converted to waste. Consumed liquids converted to
water and gets lost.
Man does not get satisfied
with the taste; envy, malice and ego he will continue. Even very little, it
does not part with. (life) while languishing in diseases, lost quickly like the water in a leaking pot.
It does not tired in repeating
the experiences. Neither it get dried up in forest. Even insults/dishonour do
not have effect on it. Knowingly it does not accept to keep the lord
Venkateswara ahead of other things in the mind.
కీర్తన సంగ్రహ భావము:
ఇది తనదీఁ కాదు లేదా ఇందరిదీఁ (సమాజానిదీ) కాదు. ఇది తనువు లోపలా మరియు వెలుపలా ఉంటుంది. అయినా
ఎవరికీ దగ్గరవ్వదు. (అన్వయార్ధము: దైవము / సత్యము /
చైతన్యం మనిషి లోపల మరియు వెలుపల ఉండి దగ్గరగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, సామీప్యత దేవునితో ఏకత్వాన్ని నిర్ధారించదు.)
కడుపు ఎప్పటికీ నిండదు. ఎంత
చూసినా సంతృప్తి ఉండదు. ఎంతో ఇష్టపడి
తిన్నా తిరిగి ఆకలి వేస్తుందే? తిన్నదంతా కలుషితమై వ్యర్ధమైపోతుంది.
త్రాగినదంతా నీరై కొల్లఁబోతుంది.
ఆస్వాదమునకు అంతు లేదు. ఎంత కాలమైనా ఈర్ష్య లెదా మాత్సర్యములు
తీరవు. వెఱ్ఱి నవ్వులు నవ్వుతూ, ఓటికడవలోని
నీరు లాగా చివచివా (వేగంగా), రోగాదులచేత కృశించి, శుష్కించి రాలిపోవును.
దీనికి అలపూఁ దోఁపదు. అడవిలోనూ ఎండిపోదు. ముసురుకుంటున్న అవమానాలు ప్రభావము లేనివే. వేంకటగిరిదేవునిఁ తలపులు తలఁపైనఁ తెలసి అబ్బనివ్వదు.
Copper Leaf: 20-6 Volume
1-124
Chala chakkani visleshana.......vardhani
ReplyDeleteBeautiful verse by Annamayya and equally beautiful is the flowing commentary. The examples mentioned in Bible and the lovely story enunciated by Benjamin Franklin of the life and experiences of an old ephemera fly of Mollin Jolly society which live for just 18 hours; these examples urge us to place God or Lord Venkateswara on the highest pedestal in our life. God is not a second priority because all our wealth, glory and riches vanish as quickly as our body in space-time dimension; eternal is our effort to reach God means to imbibe his qualities. Nice and lucid commentary.
ReplyDeleteమనిషి చిత్తము బాహ్యోన్ముఖమై,తనయందే అతి సమీపంలో
ReplyDeleteయున్న దైవాన్ని విస్మరించి, పరమోత్కృష్టమైన పరమాత్మను కనుగొనలేక విషయవస్తువుయందు
దృష్టిని మరల్చి,అంతులేని,వ్యర్థములైన కోరికలనే అగ్నిలో దహించబడి, కృశించి నశించుచున్నాడని అన్నమయ్య ఈ అద్భుతమైన కీర్తనలో మానవాళికి హెచ్చరిక చేయుచున్నాడు.
భగవద్గీత శ్లోకమును, బైబిల్ లోని వాక్యాన్ని ప్రస్థావిస్తూ ఎంతో చక్కగా
వివరించారు శ్రీ చామర్తి శ్రీనివాస్ గారు.వారికి హృదయపూర్వక అభినందనలు. 🙏
Very nice
ReplyDeleteAmazing
ReplyDelete