Saturday, 23 October 2021

92. మోహము విడుచుటే మోక్షమది (mOhamu viDuchuTE mOkshamadi)

 ANNAMACHARYA

92. మోహము విడుచుటే మోక్షమది

(mOhamu viDuchuTE mOkshamadi) 

Introduction: This verse is probably the deepest poem I came across till date. Creating unimaginable depths out of simple words is the speciality of Annamacharya. With beautiful words you can win minds of others. One may unravel a mystery. One may take a travel to utopian worlds with soothing poetry. However, painting unbreakable truth with simple, yet pleasing words is celestial and divine art. I doubt, how these innocent and tiny words can shoulder such heavy loads of expression. The master knows how to employ the words.

In this verse he addresses some of the vexing questions which exercised man for long. His explanation of duties of man appear quite consistent and logical. Yet explaining such deep thoughts is daunting.

First man must pursue what is he expected to do? Who can answer this except the man himself? Then he needs to recognise the tools and support given to him. A calf can find its way to its mother even in a large herd. Where did that education present in childhood vanished or gone when we become adults?  Know the glory of the ignorance we are learning!!. 

Ultimately, he should remain the tool/help/servant to the fellow meditators. Life is about moving forward, discovering a whole new path. Not a memory to chew the cud. 

ఉపోద్ఘాతము: మాయకంగా కనపడే ఈ పదాలతో మోయలేని ఈ బరువైన అర్థాలను అన్నమయ్య ఎలా నిలబెట్టారో దేవునికే ఎరుక. మాటలతో మనసు గెలవవచ్చు. మర్మము ఎఱుక పరచవచ్చు ‌ అందమైన పదములతో హాయి పుట్టించవచ్చు. పలుకుల పొందుతో ఊహాతీతమైన లోకాలకు పయనించవచ్చు. కానీ ఛేదించరాని సత్యమును వెల్లడించుట అన్నమయ్యకే చెల్లింది. పదములతో అర్ధమెలా పలికించాలో పద కవితా పితామహునికి వెన్నతో పెట్టిన విద్య​. 

చిరకాలం నుండి మనిషిని వేధిస్తున్న సమస్యలను ప్రస్తావించారు. మానవుని  విధుల గురించి వారి వివరణ చాలా స్థిరంగాను మరియు తార్కికంగాను కనిపిస్తుంది. ఇటువంటి లోతైన వ్యక్తీకరణను వివరించడం కొంత సాహసమే.  

మొదటి వ్యక్తి తన విధులను తెలియవలె! దీనికి తానే తప్ప వేరేవరు సమాధానం ఇవ్వగలరు? అప్పుడు ఆతడు తనకు ఇవ్వబడిన సాధనాలను మరియు ఉపాధులను గుర్తించవలె. లేగ దూడ తల్లిని పెద్ద మందలోనూ ఇట్టే గుర్తించగలదు. బాల్యమున కల ఆ విద్య పెద్దైన మనలో ఎక్కడకు పోయిందో? ఆయ్యలూ! అమ్మలూ! మనము నేర్చుచున్న అవిద్యల మహిమ తెలియండి​!!. 

ఆ మీదట తానే భక్తులకు సాధనమై మెలగవలె. వేంకటనిలయుని దాసుల సొమ్ముయి నిలుచుట సుకృత మది”. క్రొంగొత్త పథమును ఆవిష్కరించుచూ ముందుకు పోయేదే జీవితం. మరల మరల  జ్ఞాపకము తెచ్చుకొని, నెమరువేయు మేత కాదు. 

కీర్తన:

మోహము విడుచుటే మోక్షమది

దేహ మెఱుఁగుటే తెలివీ నదే        ॥పల్లవి॥ 

ననిచిన తనజన్మముఁ గర్మముఁ దన-

పనియు నెఱుగుటే పరమ మది
తనకు విధినిషేధములుఁ బుణ్యముల-
ఘనత యెఱుగుటే కలిమి యది   ॥మోహము॥ 

తఱిఁదఱిఁ బ్రేమపుతల్లిదండ్రులను

యెఱఁ గనిదే కులహీన తది
చఱులఁ బొరలి యాచారధర్మములు
మఱచినదే తనమలిన మది        ॥మోహము॥ 

కమ్మరఁ గమ్మరఁ గామభోగములు

నమ్మి తిరుగుటే నరక మది
నెమ్మది వేంకటనిలయునిదాసుల-
సొమ్ముయి నిలుచుట సుకృత మది॥మోహము॥

 

mOhamu viDuchuTE mOkshamadi

dEha me~ruguTE telivI nadE       pallavi 

nanichina tanajanmamu garmamu dana-

paniyu ne~ruguTE parama madi
tanaku vidhinishEdhamulu buNyamula-
ghanata ye~ruguTE kalimi yadi   mOhamu 

ta~rida~ri brEmaputallidaMDrulanu

ye~ra ganidE kulahIna tadi
cha~rula borali yAchAradharmamulu
ma~rachinadE tanamalina madi  mOhamu 

kammara gammara gAmabhOgamulu

nammi tiruguTE naraka madi
nemmadi vEMkaTanilayunidAsula-
sommuyi niluchuTa sukRta madi mOhamu

 

Details and Explanations: 

మోహము విడుచుటే మోక్షమది

దేహ మెఱుఁగుటే తెలివీ నదే     ॥పల్లవి॥

 

mOhamu viDuchuTE mOkshamadi

dEha me~ruguTE telivI nadE    pallavi 

Word to Word meaning: మోహము (mOhamu) = passion, fascination, infatuation, distraction, ignorance; విడుచుటే (viDuchuTE) = leaving, eschewing; మోక్షమది (mOkshamadi) = that is liberation; దేహ మెఱుఁగుటే (dEha me~ruguTE) = knowing the body; తెలివీ నదే (telivI nadE) = the same is intelligence as well.           

Literal meaning: Leaving the passion, fascination is liberation. Knowing the body is intelligence as well. 

Explanation: Most notable thing is that Annamacharya says that the liberation and intelligence is same.  As I mentioned many times before, Annamacharya always simply stated what he perceived, never made any postulation. 

Is this a statement of Jiddu Krishnamurti? It appears Jiddu Krishnamurti and Annamacharya have stated the same thing on the matters related to intelligence and freedom.  Possibly they have actually witnessed the same thing, infinite, eternal changeless existence. 

What is intelligence?   Though there is no single definition, it is generally understood as one’s ability to comprehend and adapt to external environment. This, all-life forms can perform easily. Even earthworm is adept at this. Then why is this hermit talking of Intelligence? What he has to do with intelligence if already renounced the world? 

The intelligence we appreciate deals with abstraction, logic, understanding, self-awareness, learning, emotional knowledge, reasoning, planning, creativity, critical thinking, and problem solving. These can be acquired with fair amount of effort. Therefore, there are many inspiring examples in this category. 

What intelligence Annamacharya is talking about, is to shed ignorance. No man can ever willingly forget something. Obviously cannot be achieved by effort. This is directly in contrast to the intelligence mentioned in above para, which is part of conscious effort. In this category, very few examples to mention. 

And being unprovable, unsuspecting public are taken for ride all over the world, especially in India. Plethora of godmen send wrong signals, orate any junk in the name of God and loot public. When some godman declares he knows God, be clear that he does not know. They cash on our naivety. 

The intelligence mentioned here is not easy. Lot more tougher, bordering impossibility. As we have seen in earlier Annamacharya verses, this intelligence cannot be felt consciously. 

Implied meaning: The intelligence is liberation.

 

 భావము: మోహము (అజ్ఞానము) విడుచుటేయే మోక్షము. దేహము ఎఱుగుటను జ్ఞానము (తెలివి) కూడా అదే.

వివరణము: విముక్తి మరియు తెలివితేటలు (మేధస్సు) ఒకటే అని ప్రకటించారు అన్నమాచార్యులు.  నేను ఇంతకు ముందు చాలాసార్లు చెప్పినట్లుగా, అన్నమాచార్యులు తాను అనుభవించిన వాటిని వ్యక్తపరిచారే కాని ఎప్పుడూ ఎలాంటి  సైద్ధాంతిక ప్రతిపాదనలూ చేయలేదు.

ఈ పల్లవి భావము మనకు పరిచయమున్న జిడ్డు కృష్ణమూర్తి ప్రకటన లాగ అనిపిస్తుంది. తెలివితేటలు మరియు స్వేచ్ఛకు సంబంధించిన విషయాలపై జిడ్డు కృష్ణమూర్తి మరియు అన్నమాచార్యులు ఒకే రకముగా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. బహుశా వారు నిజానికి ఒకే, మార్పులేని, అనంతమైన, శాశ్వతమైన  దానిని (సత్యమును) తాదాత్మ్యత పొందిన స్థితిలో కనుగొన్నట్లు భావించవచ్చు.

తెలివితేటలు అంటే ఏమిటి? ఒకే నిర్వచనం లేనప్పటికీ, ఇది సాధారణంగా బాహ్య పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందలి సవాళ్ళను స్వీకరించే సామర్థ్యం అనుకోవచ్చు. సకల జీవ రూపాలు సులభంగా ఆ పని చేయగలవు. వానపాము కూడా ఇందులో ప్రావీణ్యం కలిగి ఉంటుంది. అలాంటప్పుడు ఈ తపసి మేధస్సు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రపంచాన్ని త్యజించినవారికి తెలివితేటలతో పని ఏమి?

మనము ప్రస్తుతం అభిలషిస్తున్న మేధస్సు 'గ్రహణము, తర్కము, అవగాహన, స్వీయ-అవగాహన, అభ్యాసం, భావోద్వేగ జ్ఞానం, తార్కికము, ప్రణాళిక, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన మరియు సమస్యల పరిష్కారము'లకు సంబంధించినది. తగిన ప్రయత్నంతో వీటిని పొందవచ్చు. అందువల్ల, ఈ వర్గంలో అనేక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు లభిస్తాయి.

అన్నమాచార్యులు ఎటువంటి తెలివితేటల గురించి మాట్లాడుతున్నారో? అజ్ఞానాన్ని పారద్రోలడం/ విడిచిపెట్టేయడం అంతే!! ఏ మనిషీ ఇష్టంగా (లేదా అనుకుని)  ఏదైనా మర్చిపోలేడు. ఇది పై పేరాలో పేర్కొన్న తెలివితేటలకు నేరుగా విరుద్ధంగా ఉంది, ఎందుకనగా అవి సచేతన ప్రయత్నంలో భాగం. ఇక్కడ చెప్పిన తెలివి ప్రయత్నం ద్వారా సాధించలేనిది. ఈ వర్గంలో, చాలా తక్కువ ఉదాహరణలు అగపడతాయి.

ఇక్కడ పేర్కొన్న మేధస్సు సులభం కాదు. అసాధ్యత అంచుల్ని తచ్చాడుతుంది. ఐనా ఇది చాలా సులభం అని ఈ గొప్ప వ్యక్తులు చెప్తారు. మనము ఇంతకు ముందే అన్నమాచార్యుల కీర్తనలలో అనుకున్నట్లుగా, ఈ మేధస్సును చేతనావస్థలో అనుభవించలేము.   

ఇది నిరూపించలేనిది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో అమాయక ప్రజలను  మోసం చేయడానికి తరచుగా ఉపయోగించడం గమనించవచ్చు. అనేక మంది బాబాలు, సాధువులు ప్రజల ఈ దౌర్బల్యాన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. దైవము పేరిట అన్యాయముగా ప్రజలను దోచుకుంటున్నారు. కొంతమంది దేవుళ్లు తనకు దేవుడు తెలుసు అని ప్రకటించు కుంటారు కూడా. విచిత్రమేమంటే, దాన్ని నమ్మేవాళ్ళూ ఉన్నారు.

అన్వయార్ధము: జ్ఞానమే మోక్షము.

ననిచిన తనజన్మముఁ గర్మముఁ దన-

పనియు నెఱుగుటే పరమ మది
తనకు విధినిషేధములుఁ బుణ్యముల-
ఘనత యెఱుగుటే కలిమి యది            ॥మోహము॥

nanichina tanajanmamu garmamu dana-

paniyu ne~ruguTE parama madi
tanaku vidhinishEdhamulu buNyamula-
ghanata ye~ruguTE kalimi yadi    mOhamu

 

Word to Word meaning:  ననిచిన (nanichina) = అంకురించు, జనించు, Flowering, taking birth; తనజన్మముఁ (tanajanmamu) = ones this life; గర్మముఁ (garmamu) = work; దన-పనియు (dana-paniyu) = duties to be performed;  నెఱుగుటే (ne~ruguTE) = knowing, understanding;  పరమ మది (parama madi) = is ultimate; తనకు (tanaku) = for the man;  విధినిషేధములుఁ (vidhinishEdhamulu) = dos and don’ts;  బుణ్యముల-ఘనత (buNyamula-ghanata)  = nobility of virtues;  యెఱుగుటే( ye~ruguTE) knowing, understanding;  కలిమి యది (kalimi yadi) = is becoming rich.

 

Literal meaning: Knowing one’s own prescribed duties and work to be discharged is understanding the other state. Realising what should be performed, what should be avoided, what is righteous act is true wealth.

 

Explanation: This stanza needs elaborate explanation. To make things simpler, let me refer to few shlokas from Bhagavad-Gita. 3-35 states you must perform your prescribed duties though tinged with faults. (श्रेयान्स्वधर्मो विगुण: 3-35 śhreyān swa-dharmo viguṇaḥ). Yet You shall not vacillate when it comes to discharging your prescribed duties. (स्वधर्ममपि चावेक्ष्य विकम्पितुमर्हसि 2-31 swa-dharmam api chāvekṣhya na vikampitum arhasi) By being in ones natural state is performing meditation. Such a person can easily attain perfection. ( स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: 18-46, sva-karmaṇā tam abhyarchya siddhiṁ vindati mānavaḥ).  By doing one’s innate duties, a person does not incur sin. (स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्  18-47 svabhāva-niyataṁ karma kurvan nāpnoti kilbiṣham). 

Thus, true prayer is to remain in one's natural state. Therefore, man instead of pursuing to acquire additional virtues, should spend time in going back to his natural state. Most of us remain in unnatural state. This may appear wrong to the reader. Sir, please understand that we are in our present state by certain effort. We must shed that effort. 

Our minds are conditioned to acquire, achieve, enjoy. This Shloka is stating that be in natural state. Are we in our natural state? Think again. We laugh and smile because we are expected to. We drive big cars because we want to be respected. We wear fashionable clothes because a beautiful model wears them. As we go along this list you will find we know we are far from natural state. 

In fact the world has nothing to offer beyond the known. Largely our ideas are shaped popular beliefs, fashion, and manoeuvred necessity. Given these circumstances, where is the scope to know your prescribed duties? 

Now consider this Jiddu Krishnamurti’s statement.  "Intelligence comes into being when the brain discovers its fallibility, when it discovers what it is capable of, and what it is not." You will find Annamayya, Jiddu said the same thing. While this is mentioned very indirectly in Bhagavad-Gita.  Thus, we may surmise, Annamacharya arrived at this complex understanding independently by his own observation. 

Therefore, the first and foremost work to be performed by man is first ask the creator to tell him his duties. Unfortunately, the creator does not respond directly. Man must take up this journey all by himself. Cessation of present activities is essential step. 

This is the age-old system practiced in India. Since there is no perfect method available to know God, all these organised practices are not necessarily correct steps to take up. Just consider this Annamacharya verse:తగు మునులు‌ ఋషులు తపములు సేయఁగ / గగనము మోచియుఁ గర్మము దెగదా (meaning: The saints have performed penance. They moved the mountains and the space. Yet they did not come out of bondage. What should we do?) 

Implied meaning: Instead of pursuing virtuous acts, man should find out his prescribed duties. 

భావము: మానవుడు తన నిర్దేశిత విధులు మరియు నిర్వర్తించాల్సిన పనిని తెలుసుకోవడం అనేది పరమును అర్థం చేసుకోవడం. ఏది ఆచరించాలి, ఏది మానుకోవాలి, ఏది ధర్మం అనేది గ్రహించడమే నిజమైన సంపద.

వివరణము: ఈ చరణానికి విస్తృతమైన వివరణ అవసరం.  సరళంగా, సూటిగా చేయడానికి, భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలను ఉటంకిస్తాను. లోపభూయిష్టమైననూ మనిషి తనకు నిర్దేశించిన విధులను తప్పక నిర్వహించాలని పేర్కొంది (3-35, శ్రేయాన్ స్వధర్మో విగుణః). ఇంకా మీ నిర్దేశిత విధులను నిర్వర్తించే విషయంలో వెనుకాడరాదు (2-31 స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి).  సహజ స్థితిలో ఉండటమే  ధ్యానము.   అలాంటి వ్యక్తి సులభంగా పరిపూర్ణతను పొందగలడు (18-46 యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్). తన సహజమైన విధులు చేయుటలో మనిషికి పాపం అంటదు (18-47 స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్). 

కాబట్టి నిజమైన ప్రార్థన అనేది మానవుడు తన సహజ స్థితిలో ఉండటమే.  మనిషి అదనపు పుణ్యాలను పొందడానికి బదులుగా, తన సహజ స్థితికి తిరిగి వెళ్లడానికి సమయాన్ని వెచ్చించాలి. అయితే, మనలో చాలా మంది అసహజ స్థితిలోనే ఉంటారు. ఇది పాఠకులకు తప్పుగా అనిపించవచ్చు. అయ్యలారా! దయచేసి కొంత ప్రయత్నం ద్వారా మనము ప్రస్తుతమున్న స్థితిలో ఉన్నామని అర్థం చేసుకోండి. మనం ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి. అంతే! 

సంపాదించడానికి, సాధించడానికి, ఆస్వాదించడానికి మన మనసులు అలవాటు చేయబడ్డాయి. సహజ స్థితిలో ఉండు అని పై చరణం తెలియజేస్తోంది. కానీ, మనం మన సహజ స్థితిలో ఉంటున్నామా? మళ్లీ ఆలోచించండి. మనము నవ్వాలి కాబట్టి నవ్వుతాము. మనము గౌరవించబడాలి కాబట్టి  పెద్ద కార్లు నడుపుతాము. ఒక అందమైన మోడల్ వాటిని ధరిస్తుంది కాబట్టి మనము ఫ్యాషన్ దుస్తులను కొంటాము. ఈ జాబితా మనము సహజ స్థితికి దూరంగా ఉన్నామని చెబుతోంది. 

మన ఆలోచనలు వ్యాప్తిలో ఉన్న అభిప్రాయాలతోటి, ఫ్యాషన్ బట్టి, అలవాటుపడిన అవసరాలతోటి రూపొందించ బడినవని గమనించండి. మనకు తెలిసిన దానికి మించి ఈ ప్రపంచం ఏమీ ఇవ్వలేదు.  అంత దానికి ఇంత పీకులాటలెందుకు? సహజ స్థితి పొందుటకు ఇప్పటి వరకు  తెచ్చి పెట్టుకున్న  అసహజమంతటినీ వదలి వేయవలె. అందుకు సిద్ధంగా ఉన్నామా? 

ఇప్పుడు ఈ జిడ్డు కృష్ణమూర్తి ప్రకటనను పరిగణించండి. "మెదడు దాని తప్పిదాలను కనుగొన్నప్పుడు, దాని సామర్థ్యం ఏమిటో మరియు అది ఏది చేయలేదో కనుగొన్నప్పుడు మేధస్సు ఉనికిలోకి వస్తుంది." మీరు అన్నమయ్య మరియు జిడ్డు ఒకే విషయన్ని చెప్పిన సంగతి గ్రహించి ఉంటారు. భగవద్గీతలో ఈ విషయం మరీ పరోక్షంగాను, చూచాయగాను సెలవీయబడినది.  ఈ విధంగా అన్నమాచార్య  స్వతంత్ర పరిశీలన ద్వారా ఈ సంక్లిష్ట అవగాహనకు వచ్చారనుకోవచ్చు. 

అందువల్ల, మనిషి చేయవలసిన  ప్రధానమైన పని మొదట తన విధులను చెప్పమని సృష్టికర్తను అడగవలె. దురదృష్టవశాత్తు, సృష్టికర్త నేరుగా స్పందించడు. మార్గాంతరము లేక మనిషి ఈ ప్రయాణాన్ని స్వయంగా చేపట్టాలి. ప్రస్తుత కార్యకలాపాలను నిలిపివేయడం ఒక ముఖ్యమైన దశ.

ఇదే భారతదేశంలో ఆచరణలో ఉన్న పురాతన వ్యవస్థ. దేవుడిని తెలుసుకోవడానికి ఖచ్చితమైన పద్ధతి అందుబాటులో లేనందున, ఈ వ్యవస్థీకృత పద్ధతులన్నీ సరైనవని నిర్ధారించలేము. ఈ అన్నమాచార్యుల  కీర్తన చూడండి. తగు మునులు‌ ఋషులు తపములు సేయఁగ / గగనము మోచియుఁ గర్మము దెగదా?” (meaning: The saints have performed penance. They moved the mountains and the space. Yet they did not come out of bondage. What should I do?) 

అన్వయార్ధము: పుణ్యముల వెనుక పరుగెత్తే బదులు, మనిషి తన నిర్దేశించిన విధులను కనుగొన యత్నించాలి. 

తఱిఁదఱిఁ బ్రేమపుతల్లిదండ్రులను

యెఱఁ గనిదే కులహీన తది
చఱులఁ బొరలి యాచారధర్మములు
మఱచినదే తనమలిన మది      ॥మోహము॥

ta~rida~ri brEmaputallidaMDrulanu

ye~ra ganidE kulahIna tadi
cha~rula borali yAchAradharmamulu
ma~rachinadE tanamalina madi   mOhamu 

Word to Word meaning:  తఱిఁ (ta~ri) = ప్రవేశించు, దాటు, అతిక్రమించు, ఎదుర్కొను, ప్రతిఘటించు, విమర్శించు, Entering, crossing, overlapping, facing, opposing, criticizing; దఱిఁ(da~ri) = shore, bank, edge, side; vicinity, limit, bound, boundary, proximity support, shelter, refuge; బ్రేమపు (brEmapu) = loving; తల్లిదండ్రులను (tallidaMDrulanu) = parents;  యెఱఁ గనిదే (ye~ra ganidE)= not knowing, not understanding;  కులహీన తది (kulahIna tadi) = unsuitable to be in that caste (of people) = unbecoming of human;  చఱులఁ (cha~rula) = లోయ, valley, crevices,  బొరలి (borali) = moving around, roll over; యాచారధర్మములు (yAchAradharmamulu) = customs and duties;  మఱచినదే (ma~rachinadE) = forgetting; తనమలిన మది (tanamalina madi)       = is the dirt. 

Literal meaning: Not recognising your parents (support) is unbeing of your caste (you are not worth).  Getting slipped into wrong action (like moving around in abysmal depths) is dirt. 

Explanation: A calf can find its way to its mother even in a large herd. Where did that education in childhood vanished in we the adults? Know the glory of the ignorance we are learning !!.  

You are given support. It's for the man to know it is support. Yet support doesn't appear as support. This is crux of this journey of life. 

Just imagine, the eggs laid by birds. They are normally  in loosely knit nests. They are easy meals for snakes, animals, and humans. Apart from this wind and natural calamities are real and immediate dangers. Still, the eggs survive, and the life continues. 

For hardcore Harry potter fans, in book two, the chamber of secrets: Harry is about to face the deadly snake Basilisk. TOM RIDDLE ridicules support of mere sorting hat and songbird (phoenix). Harry as well is bewildered. In the end it is proven that these two were sufficient to thwart the challenge. Sir, please appreciate, recognising the support is very hard.   

That unseen hand which is protecting the life is not of interest to most of us. We want which gives us riches, which gives us the satisfaction we are looking forward to. Our idea of truth is literally selective. Even hundred half truths cannot substitute truth. What kind of God we look for? Just simply a bank or ATM which fulfils our desires? 

Implied meaning: O man, get out of the drudgery. open your eyes. Find the blessings of God. 

భావము: తల్లిదండ్రుల (భగవంతుని) ప్రేమను, వారిచ్చు సహాయమును గుర్తించనిదే కులహీనత​.  అధమమగు లోయలలో తచ్చాడుతూ ఆచారములు, ధర్మములు మఱచుటయే మలినము అంటగట్టుకొనుట​.

వివరణము: లేగ దూడ తల్లిని పెద్ద మందలోనూ ఇట్టే గుర్తించగలదు. బాల్యమున కల ఆ విద్య పెద్దైన మనలో ఎక్కడకు పోయిందో? ఆయ్యలూ! అమ్మలూ! మనము నేర్చుచున్న అవిద్యల మహిమ తెలియండి​!!. 

పక్షులు పెట్టిన గుడ్లను గురించి ఒక్కసారి ఊహించుకోండి. అవి సాధారణంగా వదులుగా అల్లిన గూళ్ళలో ఉంటాయి. అవి పాములు, జంతువులు మరియు మానవులకు సులభమైన ఆహారం. ఇది కాకుండా గాలి మరియు ప్రకృతి వైపరీత్యాలు అడుగడుగునా పొంచి ఉంటాయి. అవి నిజమైన మరియు తక్షణ ప్రమాదాలు. అయినప్పటికీ, విపత్తుల అంచుల్లోనే జీవితం సాగుతూనే ఉంటుంది. 

హ్యారీ పాటర్ అభిమానుల కోసం, పుస్తకం రెండు, ది ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్: హ్యారీ బసిలిస్క్ అనే ప్రాణాంతకమైన పామును ఎదుర్కోబోతున్నాడు.  'కేవలం ఈ సార్టింగ్ టోపీ మరియు పాటల పక్షి (ఫీనిక్స్) నీకేం సహాయం చేస్తాయో?' అంటూ టామ్ రిడిల్ హ్యారీని వెక్కిరిస్తాడు. హ్యారీకి కూడా అర్థంకాదు. అయోమయంగానే ఉంటుంది. చివరికి ఆ రెండూ పెను సవాలును అడ్డుకోవడానికి సరిపోతాయని నిరూపించబడుతుంది. అయ్యలారా! దైవమిచ్చు ఊతమును గుర్తించడం సులభం కాదని దయచేసి అర్ధం చేసుకోండి. 

మనకు ఆసరా ఇవ్వబడింది. కానీ అది ఆసరాలాగా కనిపించదు. ఇది ఆసరా అని మనిషి తెలుసుకోలేడు. ఇదే ఈ జీవనయానంలో కీలకాంశం. 

మన  జీవితాలను నిరంతరం కాపాడుతున్న ఆ కనిపించని చేయి మనకు ఆసక్తిని కలిగించదు. మనకు కోరికలను తీర్చే కల్ప వృక్షం కావాలి! ధనవంతులను చేసే లక్ష్మీదేవి కావాలి!  మనం ఎలాంటి దేవుడి కోసం చూస్తున్నాం? కేవలం మన కోరికలను తీర్చే నిధి కోసమా? క్రింది సినిమా పాట సందర్భోచితమని భావిస్తున్నాను. 

చిత్రం : తాశీల్దారు గారి అమ్మాయి (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :
నేపధ్య గానం : కె.బి.కె. మోహన్ రాజు 
 

పల్లవి :

కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం... కీలుబొమ్మలం

చరణం 1 :

నాది నావాళ్ళనే తాళ్ళతో కడుతుంది
నాది నావాళ్ళనే తాళ్ళతో కడుతుంది
ఆ తాళ్ళు లాగి నీ చేత తైతక్కలు ఆడిస్తుంది
 

కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం... కీలుబొమ్మలం

చరణం 2 :

కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం... కీలుబొమ్మలం

కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం

చరణం 3 :

తలచింది జరిగిందంటే...  నీ తెలివేనంటావు
బెడిసిందా తలరాతంటూ విధిపై నెడతావు
తలచింది జరిగిందంటే...  నీ తెలివేనంటావు
బెడిసిందా తలరాతంటూ విధిపై నెడతావు

మనము మనవాళ్ళనీ మాటల్లో అంటావు
నేనూ నేనన్న అహంతో తెంచుకుని పోతావు
 

కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం
 

చరణం 4 : 

కర్మను నమ్మిన వాళ్ళెవరు కలిమిని స్థిరమనుకోరు.. కళ్ళు మూసుకోరు
మనసు తెలిసినవాళ్ళెవరు మమత చంపుకోరు.. మనిషినొదులుకోరు
ఉన్నదాని విలువెరుగనివారు పోగొట్టుకుని విలపిస్తారు
 

కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం
 

చరణం 5 :

మనిషిలాగ జీవించేది నీ చేతల్లోనే ఉంది
మంచి చెడు ఏదైనా నీ చేతుల్లోనే ఉంది
మనిషిలాగ జీవించేది నీ చేతల్లోనే ఉంది
మంచి చెడు ఏదైనా నీ చేతుల్లోనే ఉంది

కావాలని నిప్పు తాకితే చెయ్యి కాలక మానదు
కాలినందుకు కర్మ అంటే గాయమేమో మానదు 
 

కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం
 

అన్వయార్ధము: ఓ మానవుడా, హీనవృత్తి, నీచపు పనుల నుండి బయటపడు. కళ్ళు తెరువు. తల్లిదండ్రుల (భగవంతుని) ప్రేమను, వారిచ్చు సహాయమును గుర్తించు.

 

కమ్మరఁ గమ్మరఁ గామభోగములు

నమ్మి తిరుగుటే నరక మది
నెమ్మది వేంకటనిలయునిదాసుల-
సొమ్ముయి నిలుచుట సుకృత మది     ॥మోహము॥

kammara gammara gAmabhOgamulu

nammi tiruguTE naraka madi
nemmadi vEMkaTanilayunidAsula-
sommuyi niluchuTa sukRta madi mOhamu 

Word to Word meaning:  కమ్మరఁ గమ్మరఁ (kammara gammara) = (క్రమ్మరఁకు వ్యావహారిక రూపం.) = వ్యాపించు,  కలుగు, ఉబుకు, spreading, generating, swelling;  గామభోగములు (gAmabhOgamulu) =  sensory enjoyments; నమ్మి (nammi) = taking them as true;  తిరుగుటే (tiruguTE) = moving around;  నరక మది (naraka madi) = is stay in the hell; నెమ్మది (nemmadi) = Proper, good, right, fine, quiet, tranquil, వేంకటనిలయుని (vEMkaTanilayuni) = The resident of the house called  Venkata Nilayam; దాసుల-సొమ్ముయి (dAsula-sommuyi) = pocket money of his servants; నిలుచుట (niluchuTa) = stay put; సుకృత మది (sukRta madi)    = is the virtuous deed. 

Literal meaning:  Know that getting engaged in to spreading desires is  akin to stay in hell. Remaining as an obedient tool/help/servant to the fellow meditators is virtue. 

Explanation: What is the duty for man in this world? Be the support to the servants of God. What kind of support. Not the one provided on seeking. Not the one provided eons after the need. Immediate and necessary support man derives from money in his pocket. 

Do we have the humility for such avocation? Just think of the life of great men.  This is the first lesson we can observe. 

Do we know what hell is? Probably, whatever is uncomfortable, we take as hell. Can we feel hell in doing the wrong acts? These wrong acts are not necessarily be on the wrong side of the law. They are simply the unnatural acts we indulge. 

భావము: కామభోగములనే  నమ్మి తిరుగుట నరక మని తెలియుము. వేంకటనిలయుని దాసుల సొమ్ముయి నెమ్మదిగా ఉండుట సుకృతము.

వివరణము: ఈ ప్రపంచంలో మనిషికి కర్తవ్యం ఏమిటి? వేంకటనిలయుని (దేవుని) సేవకులకు ఆసరాగా ఉండండి.  కోరితే అందించినది ఆసరా కాదు. దొంగలు పడ్డ ఆర్నేల్లకు కుక్కలు మొరిగినట్లు కాదు. అవసరమైన క్షణంలో అందేదే ఆసరా. మనిషి తన జేబులోని డబ్బు నుండి ఎలాంటి తక్షణ మరియు అవసరమైన పొందుతాడో అలాంటి మద్దతు  ఇవ్వవలె.

అలాంటి పనులు చేయగలిగే వినయం మనలో  ఉందా? గొప్పవారి చరిత్రల నుండి ప్రప్రధమముగా నేర్వగలిగి నదిదే.

నరకం అంటే ఏమిటో మనకు తెలుసా? బహుశా, అసౌకర్యమైన  ప్రదేశాన్ని నరకంలా తీసుకుంటాము. తప్పుడు పనులు చేస్తున్నప్పుడు మనం నరకం అనుభవించగలమా? ఈ తప్పుడు చర్యలు తప్పనిసరిగా చట్టానికి విరుద్ధంగా ఉండవలసిన అవసరం లేదు. అవి మనం చేసే అసహజ చర్యలు.   

Summary of this Keertana:

Leaving the passion, fascination is liberation. Knowing the body is intelligence as well.  (Implied meaning: The intelligence is liberation.) 

Knowing one’s own prescribed duties and work to be discharged is understanding the other state. Realising what should be performed, what should be avoided, what is righteous act is true wealth. (Implied meaning: Instead of pursuing virtuous acts, man should find out his prescribed duties.) 

Not recognising your parents (support) is unbeing of your caste (you are not worth).  Getting slipped into wrong action (like moving around in abysmal depths) is dirt. (Implied meaning: O man, get out of the drudgery. open your eyes. Find the blessings of God.) 

Know that getting engaged into spreading desires is  akin to stay in hell. Remaining as an obedient tool/help/servant to the fellow meditators is virtue. 

కీర్తన సంగ్రహ భావము:

మోహము (అజ్ఞానము) విడుచుటేయే మోక్షము. దేహము ఎఱుగుటను జ్ఞానము (తెలివి) కూడా అదే. (అన్వయార్ధము:: జ్ఞానమే మోక్షము.)

మానవుడు తన నిర్దేశిత విధులు మరియు నిర్వర్తించాల్సిన పనిని తెలుసుకోవడం అనేది పరమును అర్థం చేసుకోవడం. ఏది ఆచరించాలి, ఏది మానుకోవాలి, ఏది ధర్మం అనేది గ్రహించడమే నిజమైన సంపద. (అన్వయార్ధము: పుణ్యముల వెనుక పరుగెత్తే బదులు, మనిషి తన నిర్దేశించిన విధులను కనుగొన యత్నించాలి.

మన తల్లిదండ్రుల (భగవంతుని) ప్రేమను, వారిచ్చు సహాయమును గుర్తించనిదే కులహీనత​.  అధమమగు లోయలలో తచ్చాడుతూ ఆచారములు, ధర్మములు మఱచుటయే మలినము అంటగట్టుకొనుట​. (అన్వయార్ధము: ఓ మానవుడా, హీనవృత్తి, నీచపు పనుల నుండి బయటపడు. కళ్ళు తెరువు. తల్లిదండ్రుల (భగవంతుని) ప్రేమను, వారిచ్చు సహాయమును గుర్తించు.)

కామభోగములనే  నమ్మి తిరుగుట నరక మని తెలియుము. వేంకటనిలయుని దాసుల సొమ్ముయి నెమ్మదిగా ఉండుట సుకృతము.

 

 

 

Copper Leaf: 43-3  Volume 1-263

4 comments:

  1. Excellent explanation. Must follow

    ReplyDelete
  2. Great kirtana and beautiful explanation.

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయినాధాయ నమః
    అందుకే సద్గురువు ఎప్పుడూ అల్లా మాలిక్ అనేవారు అంటే ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు ప్రతి కర్మ కూడా భగవంతుని ఉద్దేశంతో జరుగుతున్నది అని అర్థం. భగవంతుడు మన శరీరము ద్వారా మనకు జ్ఞానమును బోధించి అంటే మన శరీరంలో ఉండే భాగాల గురించి మనకు పూర్తిగా తెలియదు కానీ వాటిని వాడుకోవడం మాత్రం మనకు తెలుసు అంటే కర్మ అనేది మనకు కనిపించకుండా మనకు ఎప్పుడు భక్తి భావాన్ని ఇస్తూనే ఉంటుంది కానీ అది ఎంత వరకు ఉండాలి అనేది అంతా కూడా భగవంతుని కృప వలన జరుగుతుంది.
    సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

    ReplyDelete
  4. ఆత్మ,అనాత్మ(దేహం)లు వేరను యెఱుకయే జ్ఞానం.ఆత్మ నిత్యమని, సత్యమని,అనాత్మ ఆశాశ్వతము, అసత్యము అని తెలియుటయే జ్ఞానం.అదే మోక్షం.
    శ్రేయాన్ స్వధర్మో విగుణః- స్వధర్మాచరణయే అసలైన సంపద.
    నరకతుల్యమైన భోగేచ్ఛను విడిచిపెట్టి, హరిదాసుల సాంగత్యము చేపట్టిన నందు పరమ సుఖమును అనుభవించుము.

    గీతా శ్లోకాలను సందర్భోచితంగా వివరించి, బహు చక్కని వ్యాఖ్యానమును అందించిన శ్రీ చామర్తి శ్రీనివాస్ గారికి నెనరులు.
    వారెంతయో ప్రయాసపడి అన్నమయ్య కీర్తనల సారమును మనకు అందించుచున్నారు. వారు ధన్యులు. ధన్యోస్మి! 🙏
    కృష్ణ మోహన్
    విశాఖపట్నం

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...