Friday, 30 May 2025

225. vEsaritEnE lEdu vichAriMchitE gaddu (వేసరితేనే లేదు విచారించితేఁ గద్దు)

 ANNAMACHARYULU

225. వేసరితేనే లేదు విచారించితేఁ గద్దు 

vEsaritEnE lEdu vichAriMchitE gaddu 

తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. 

 

Introduction:

This composition of Annamacharya is not a poem —
It is a silent eruption.
A volcanic quake of the inner world.
An earthquake that trembles inward, not outward.
 

Annamacharya speaks of profound truths in simple language.
He tells us:
Truth is not attained through toil,
not by fasting, nor by rigid disciplines.
It does not lie hidden in faraway holy lands.

It cannot be measured by our scales of penance, meditation,
or moral purity.
This song does not call us to worship God
through ritual, reward, or rule —
It quietly suggests the opposite:
Let them all go. 

What Annamayya proposes is something else entirely —
When the mind forgets itself,
when the seeking settles into stillness,
the long-shut doors of the secret open of their own accord.
 

Vaikuntha is not a distant heavenly realm.
It is a rare moment —
when a soul recognises its original state.
It is a knowing that survives death,
a memory that cannot be forgotten,
not lodged in the brain,

but etched in the soul.
That is Vaikuntha —
not a place, but a mark of transcendence.

Not a memory of the mind,
but a truth the self remembers.

It outlasts the body. It cannot die.
We cannot win the Divine through acts and rituals —
But we can draw near
through presence of soul and inward surrender. 

This is the real secret:
Not effort, but inner seeing.

Not method, but the willingness to melt.
Annamacharya does not argue.
He simply lets go —
of all arguments. 

With his poetry,
he disarms the calculating mind.
He lightens the burden of ignorance we carry unknowingly —
and makes the heart ready

to receive all things in all directions.
It is in that naked clarity
that the hidden door opens.

 

 

అధ్యాత్మ కీర్తన​

రేకు: 291-5 సంపుటము: 3-528

Copper Leaf: 291-5 Volume: 3-528

వేసరితేనే లేదు విచారించితేఁ గద్దు
మూసినదిదే కీలు ముంచి వివేకులకు॥పల్లవి॥
 
యెవ్వరు మనసులోన నిందిరేశుఁ దలఁచిన
అవ్వలఁ బాయక వుండు నదియే వైకుంఠము
దవ్వులకు నేఁగవద్దు తపము జపము వద్దు
యివ్వలనిదే కీలు యెరిఁగినవారికి            ॥వేస॥
 
నాలుక నెవ్వరైనాను నారాయణుఁ బొగడిన
చాలి యాతఁ డాడనుండు జగములూ నుండును
కాలమూ నడుగవద్దు కర్మమూ నడుగవద్దు
పోలింపనిదే కీలు పుణ్యమానసులకు            ॥వేస॥
 
శ్రీవేంకటేశ్వరునిఁ జేరి యెవ్వరు నమ్మినా
కైవసమై యాతఁ డింటఁ గాచుకుండును
సావధానములు వద్దు శరణంటేనే చాలు
భావింపనిదే కీలు పరమయోగులకు            ॥వేస॥
vEsaritEnE lEdu vichAriMchitE gaddu
mUsinadidE kIlu muMchi vivEkulaku pallavi
 
yevvaru manasulOna niMdirESu dalachina
avvala bAyaka vuMDu nadiyE vaikuMThamu
davvulaku nEgavaddu tapamu japamu vaddu
yivvalanidE kIlu yeriginavAriki    vEsa
 
nAluka nevvarainAnu nArAyaNu bogaDina
chAli yAta DADanuMDu jagamulU nuMDunu
kAlamU naDugavaddu karmamU naDugavaddu
pOliMpanidE kIlu puNyamAnasulaku vEsa
 
SrIvEMkaTESvaruni jEri yevvaru namminA
kaivasamai yAta DiMTa gAchukuMDunu
sAvadhAnamulu vaddu SaraNaMTEnE chAlu
bhAviMpanidE kIlu paramayOgulaku vEsa 

 Details and Explanation:

వేసరితేనే లేదు విచారించితేఁ గద్దు
మూసినదిదే కీలు ముంచి వివేకులకు  ॥పల్లవి॥
 
vEsaritEnE lEdu vichAriMchitE gaddu
mUsinadidE kIlu muMchi vivEkulaku  pallavi

 

వేసరితేనే = శ్రమకలిగించితేను, విసుగుచెందితేను, not getting vexed; విచారించితేఁ గద్దు = by appropriate thinking it is plausible; మూసినదిదే కీలు = this is the hidden pivot; ముంచి వివేకులకు = one who is totally immersed. 

Literal Meaning:

By growing weary or simply exerting effort,
the doors to truth will not open.

Only through deep, sincere inquiry
combined with focused devotion can one hope to perceive it.

This is the sealed mystery—
A profound revelation that opens its doors

only to those who forget themselves
and become fully absorbed in discernment. 

1st Stanza

యెవ్వరు మనసులోన నిందిరేశుఁ దలఁచిన
అవ్వలఁ బాయక వుండు నదియే వైకుంఠము
దవ్వులకు నేఁగవద్దు తపము జపము వద్దు
యివ్వలనిదే కీలు యెరిఁగినవారికి       ॥వేస॥

 

yevvaru manasulOna niMdirESu dalachina
avvala bAyaka vuMDu nadiyE vaikuMThamu
davvulaku nEgavaddu tapamu japamu vaddu
yivvalanidE kIlu yeriginavAriki  vEsa

 

Literal Meaning:

Anyone —
if he truly establishes Indiresha in his heart,
that foundation will not end with this life.
To sincerely plant Hari in one’s heart — that is Vaikuntha.
 

Let go of the illusion that Vaikuntha is some distant realm.
There is no need for chants or penances.
On this path, there are no steps like outward practices or sacred pilgrimages.
 

Only those who grasp this secret —
will see the doorway open, right here, on this very earth.
The mystery of both this world and the beyond points to one truth alone.

 

2nd Stanza

నాలుక నెవ్వరైనాను నారాయణుఁ బొగడిన
చాలి యాతఁ డాడనుండు జగములూ నుండును
కాలమూ నడుగవద్దు కర్మమూ నడుగవద్దు
పోలింపనిదే కీలు పుణ్యమానసులకు   ॥వేస॥
 
nAluka nevvarainAnu nArAyaNu bogaDina
chAli yAta DADanuMDu jagamulU nuMDunu
kAlamU naDugavaddu karmamU naDugavaddu
pOliMpanidE kIlu puNyamAnasulaku  vEsa

 

Literal Meaning:

Whoever —
chants the name of Narayana with wholehearted sincerity,
the Supreme reveals Himself then and there.
And where He is — all the worlds abide.
 

“How long does it take?” “How is it attained?”
These are the questions of those bound by time and action.
To that which lies beyond time,
what use is the measure of time?
To that which frees one from karma’s bondage,
what use is the path of karma?
 

This is a mystery beyond all worldly comparison —
known only to those whose minds are purified through virtue:
the truth of Vishnu.

Explanation: Our trust in Lord Venkateshwara is often partial. No matter how much effort we put in, that faith feels incomplete. But when our trust in the Divine becomes whole, we cease to be distracted by peripheral concerns. Doubt naturally dissolves. And in that clarity, how can the Lord remain hidden? To explore this, let us turn to René Magritte’s evocative painting, The Listening Room (1952).



A Thought-Provoking Work: The Listening Room (1952)

In an ordinary room stands an enormous green apple—so large it fills nearly the entire space, pressing against the walls and ceiling, even blocking the window, denying any view of the outside world. The image gently unsettles our sense of reality, inviting us to reexamine what we take for granted. 

Magritte avoided direct interpretations. Instead, he encouraged viewers to engage their own inner sensibilities. Through visual paradoxes, he explores the limits of perception and the subtle tension between the inner and outer worlds. Even the title, The Listening Room, invites introspection.


A Challenge to Perception

Magritte’s deeper aim is to disrupt our rigid, conceptual understanding of the material world. He urges the viewer to question deeply held assumptions about reality and the very nature of things.


The Room as a Metaphor for the Mind

Like the room in the painting, our mind too becomes crowded—with opinions, judgments, and inherited notions. We clutter it with what we think “should be,” rather than allowing what is to appear.


1. No Airflow = Blocked Awareness

With the window blocked by the apple, no fresh air can enter. In the same way, when thought is choked by concepts, true awareness is stifled. The subtle eye within—the eye of inner perception—grows dim.


2. A Beautiful Obstruction

However attractive the apple may be, it is still an obstruction. Likewise, our most cherished views, philosophies, and the notion that “what I believe is the ultimate truth” can become seductive barriers—beautiful, but blinding. They close the door to deeper insight.


3. The Listening Room—What Are We Really Hearing?

Though we believe we are listening, more often than not we are hearing only the echo of our own thoughts. The noise of assumption drowns both the voice of the world and the whisper of the soul. We do not listen to reality—we listen to ourselves.


4. A Shared Vision – Magritte and Annamacharya

Both Magritte and Annamacharya gesture toward the same inner truth. Magritte reveals how inner contradictions can obscure the real. Annamacharya says the same in a different idiom: it is doubt that veils our vision of the Divine. 

3rd Stanza

శ్రీవేంకటేశ్వరునిఁ జేరి యెవ్వరు నమ్మినా
కైవసమై యాతఁ డింటఁ గాచుకుండును
సావధానములు వద్దు శరణంటేనే చాలు
భావింపనిదే కీలు పరమయోగులకు     ॥వేస॥
 
SrIvEMkaTESvaruni jEri yevvaru namminA
kaivasamai yAta DiMTa gAchukuMDunu
sAvadhAnamulu vaddu SaraNaMTEnE chAlu
bhAviMpanidE kIlu paramayOgulaku  vEsa

 

Literal Meaning:

Anyone —
who fully trusts Lord Sri Venkateswara,
He becomes theirs.
He Himself protects His own.
 

Waiting with cautious hopes
like “He will come from there” serves no purpose.
When we are truly united with our own path,
He may reveal Himself.
Sincere surrender alone is enough.
 

This secret —
cannot be grasped by logic.
It is revealed only
through the experience of the highest yogis.

Explanation: సావధానములు వద్దు శరణంటేనే చాలు ="No precautions are needed—just surrender is enough." This suggests that when we are fully immersed in what we are doing—completely unified with it—He may reveal Himself. Jiddu Krishnamurti experienced this profoundly. After the death of his brother, he was overwhelmed with immense grief. Yet, in the heart of that sorrow, a deep vision of truth unfolded. He later said: "Now I see more clearly than ever—that there is real beauty in life, that there is true joy." 

Sometimes, it is not by resisting pain or seeking control, but by surrendering completely—to work, to grief, to the present—that truth shows itself.

 

T-225. వేసరితేనే లేదు విచారించితేఁ గద్దు

 తాళ్లపాక అన్నమాచార్యులు

225. వేసరితేనే లేదు విచారించితేఁ గద్దు

For English version press here 

ఉపోద్ఘాతము

 

ఈ అన్నమాచార్యుల కృతి ఒక విస్ఫోటనం —
ఇది నిశ్శబ్దంగా పేలే ఒక అంతరంగ అగ్నిపర్వతం.
ఒక భూకంపం. 

అన్నమాచార్యులు తేలికైన భాషలో లోతైన విషయాన్ని చెబుతారు —
సత్యం శ్రమపడితేనో,
ఉపవాసాలతోనో, సాధనలతోనో లభించదని.
అది దూరంగా వున్న పుణ్యక్షేత్రాల్లోను దాగి ఉండదు,
తపస్సు, ధ్యానం, పవిత్రత అనే మన ప్రపంచపు లెక్కలతో దానిని ముడిపెట్టలేము.
దైవమును పూజలు పునస్కారాలు, నియమాల ద్వారా
కొలవమంటూ పిలుపునివ్వదు —
అందుకు విరుద్ధంగా వాటిని విడిచి చేయమన్న సాము.
 
అన్నమయ్య చెప్పేది వేరే —
తనను తానే మరచినప్పుడు,
అన్వేషణాపూర్వకమైన మనస్సు నిశ్చలమయినప్పుడు,
మూసివేయబడ్డ రహస్యపు తలుపులు తెరుచుకుంటాయి.
 
వైకుంఠం అంటే ఎక్కడో ఉన్న లోకం కాదు.
జీవుడు తన అసలైన స్థితిని గుర్తుపట్టిన అపురూప క్షణం.
అది మానవుడి జ్ఞాపకాల్ని దాటి నిలిచే – మరణాతీతమైన జ్ఞానం.
అదే వైకుంఠం.
ఇది సామాన్య జ్ఞాపకం కాదు. మరవగలిగేది కాదు.
ఆత్మకు తెలిసిన సత్యం. అది మరణాన్ని దాటి నిలిచే జ్ఞానం.
 
కర్మలతో భగవంతుని మెప్పించలేము —
ఆత్మసాన్నిధ్యంతో, అంతరంగ శరణాగతితో ఆయన్ను చేరవచ్చు. 
ఇది అసలుసిసలు మర్మం —
శ్రమ కాదు, లోని చూపు;
విధానం కాదు, వెనుతిరగకుండా కరిగిపోవడం.
 
అన్నమాచార్యులు వాదించడు —
విసర్జించేస్తాడు- అన్ని వాదాలను.
తన కవిత్వంతో మన ప్రయత్న యుక్తమైన చిత్తాన్ని
ఆయుధరహితంగా మారుస్తాడు —
మొద్దుబారిన చిత్తము అజ్ఞానమను మోపును వదలి తేలికపడి
సర్వదిశలలలోను సర్వమును గ్రహించుటకు సమాయుత్తమగును.
ఆ స్పృహలేమి లోనే ఆ రహస్యం తలుపు తీయబడతాయి. 

 

అధ్యాత్మ కీర్తన

రేకు: 291-5 సంపుటము: 3-528

వేసరితేనే లేదు విచారించితేఁ గద్దు
మూసినదిదే కీలు ముంచి వివేకులకు      ॥పల్లవి॥
 
యెవ్వరు మనసులోన నిందిరేశుఁ దలఁచిన
అవ్వలఁ బాయక వుండు నదియే వైకుంఠము
దవ్వులకు నేఁగవద్దు తపము జపము వద్దు
యివ్వలనిదే కీలు యెరిఁగినవారికి  ॥వేస॥ 

నాలుక నెవ్వరైనాను నారాయణుఁ బొగడిన
చాలి యాతఁ డాడనుండు జగములూ నుండును
కాలమూ నడుగవద్దు కర్మమూ నడుగవద్దు
పోలింపనిదే కీలు పుణ్యమానసులకు        ॥వేస॥
 
శ్రీవేంకటేశ్వరునిఁ జేరి యెవ్వరు నమ్మినా
కైవసమై యాతఁ డింటఁ గాచుకుండును
సావధానములు వద్దు శరణంటేనే చాలు
భావింపనిదే కీలు పరమయోగులకు         ॥వేస॥

 

Details and Explanations:

Chorus:

వేసరితేనే లేదు విచారించితేఁ గద్దు
మూసినదిదే కీలు ముంచి వివేకులకు  ॥పల్లవి॥ 

వేసరితేనే = శ్రమకలిగించితేను, విసుగుచెందితేను; విచారించితేఁ గద్దు = by appropriate thinking it is plausible; మూసినదిదే కీలు = this is the hidden pivotal point; ముంచి వివేకులకు = one who is totally immersed. 

Literal Meaning:

విసుగుచెందితేను, శ్రమపడితేను —
సత్యం తాలూకు తలుపులు తెరుచుకోవు.
గంభీరమైన శ్రద్ధాసక్తులతో కూడిన విచారణతో మాత్రమే
అది తెలిసే అవకాశం ఉంటుంది.
ఇదే మూసివుంచిన రహస్యం —
వివేకంలో తన్ను తానే మరచి లీనమయ్యే వారికి
మాత్రమే తలపు తలుపులు తెరుచుకునే మర్మదర్శనము.

 

1st stanza:’

యెవ్వరు మనసులోన నిందిరేశుఁ దలఁచిన
అవ్వలఁ బాయక వుండు నదియే వైకుంఠము
దవ్వులకు నేఁగవద్దు తపము జపము వద్దు
యివ్వలనిదే కీలు యెరిఁగినవారికి       ॥వేస॥ 

Literal Meaning:

ఎవరైనా —
ఇందిరేశుఁని తమ మనసులో నిజంగా స్థాపించుకుంటే,
ఆ అస్తిత్వం ఆజన్మాంతం.
అలా యథార్థంగా హరిని హృదయంలో నాటడమే — వైకుంఠం.
 
వైకుంఠం ఎక్కడో ఉన్న లోకమనే భ్రమను వదలాలి.
జపములు, తపస్సులు అవసరం కాదు.
ఈ మార్గంలో బాహ్య సాధనలూ, పుణ్య యాత్రలూ అనే మెట్లు లేవు.
 
ఈ మర్మాన్ని తెలిసినవారికే —
ఇక్కడే, భూమ్మీదే తలుపు కనువిప్పౌతుంది.
ఇహపరలోక రహస్యం బోధించేదొకటే.

 

2nd stanza:

నాలుక నెవ్వరైనాను నారాయణుఁ బొగడిన
చాలి యాతఁ డాడనుండు జగములూ నుండును
కాలమూ నడుగవద్దు కర్మమూ నడుగవద్దు
పోలింపనిదే కీలు పుణ్యమానసులకు   ॥వేస॥ 

Literal Meaning:

ఎవరైనను —
నాలుకతో మనసారా నారాయణుని స్మరిస్తే,
ఆ పరమాత్మ అక్కడే వెలుస్తాడు.
ఆతనితోటే జగములున్నీ.
 
“ఎంతకాలం పడుతుంది?”, “ఎలా సాధించాలి?”
ఇవి కాల-కర్మల బంధితుల ప్రశ్నలు.
కాలమను పరిమితిని దాటి వున్న దానికి కాలప్రమాణమేల​?
కర్మబంధమును వదిలించు దానికి — కర్మల దారి ఏల?.
 
మానవులుగా పోల్చుకోలేని ఒక రహస్యం —
పుణ్యమానసులకే తెలిసే విష్ణు-తత్యం. 

వివరణము:

మనకు శ్రీవెంకటేశ్వరునిపై నమ్మకము కేవలము పాక్షికము. అటువంటి స్థితిలో మనం ఎంత ప్రయత్నించినా శ్రీ వెంకటేశ్వరుని పై నమ్మకం ఎంతో కొంత లోటుగానే అనిపిస్తుంది. మనకు భగవంతునిపై పూర్తి నమ్మకం ఉన్నప్పుడు మిగిలిన విషయముల జోలికే పోము. సందేహాలు పక్కకు నెట్టివేయబడతాయి. అలాంటప్పుడు భగవంతుడు కనపడకుండా ఎలా ఉంటాడు? దీనిని రెనే మాగ్రిట్ గారి "ది లిజనింగ్ రూమ్" (1952) అను చిత్ర సహాయంతో వివరించుకుందాం. 



ఆలోచనలను ప్రేరేపించే ఒక కృతి: "Listening Room" (1952) సాధారణమైన గదిలో పెద్ద ఆకుపచ్చని ఆపిల్, ఎంత పెద్దదంటే, దాదాపు మొత్తం గదిని ఆక్రమించి, గోడలను, పైకప్పును అదిమి, కిటికీ నుండి బయటకు చూడ్డనికి కూడా అడ్డుకుంటునట్లుగా ఉంది."ఈ బొమ్మ, మనం వాస్తవమని నమ్మే విషయాలనే సవాలు చేస్తుంది."మాగ్రిట్ వివరణలు ఇవ్వడానికి ఇష్టపడడు, బదులుగా వీక్షకుని తన స్వంత ఆలోచనలను అన్వేషించమని ప్రోత్సహిస్తాడు. ఈ చిత్రంలో, అతను దృశ్యమాన విరుద్ధతలను సృష్టించడం ద్వారా అవగాహన యొక్క పరిమితులను అన్వేషిస్తాడు. అంతర్గత మరియు బాహ్య ప్రపంచాల మధ్య ఉన్న అస్పష్టతను ఇది సూచిస్తుంది. చివరికి, "Listening Room" అనే పేరుతో సహా ఆలోచనలను ప్రేరేపించే ఒక కృతి.


అవగాహనకు సవాలు: రెనే మాగ్రిట్ యొక్క లక్ష్యం మాగ్రిట్ లక్ష్యం భౌతిక ప్రపంచం గురించిన సిద్ధాంతపరమైన దృక్పథాలను భగ్నం చేయడమే. అతను వీక్షకులను వాస్తవికత మరియు వస్తువుల స్వభావం గురించిన వారి స్వయం ప్రేరిత అంచనాలను ప్రశ్నించేలా చేస్తాడు.


ఆ బొమ్మలో చూపిన గది మన మనస్సు లాంటిది. నిత్య జీవితంలో అనేకానేక ఊహలతో (కాన్సెప్ట్ తో), ఇది ఇలాగే ఉండాలి అన్న వాదములతో మనసంతా నింపుకుంటాం.


1. గదిలో గాలి చొర లేకపోవడం అంటే అవగాహన ముందరికాళ్ళ బంధం. (ఆపిల్ వల్ల కిటికీ మూసుకుపోతే, మన ఆలోచనలు మన ఊహలచేత మూసుకుపోతాయి) ఆ స్థితిలో మన అంతఃచక్షువు కూడా బంధించబడుతుంది.


2. ఆపిల్ ఎంత అందమైనదైనా — అది ఆటంకం: మనకు ఇష్టమైన అభిప్రాయాలు, తత్వాలు, “నేను పట్టుకున్నదే సత్యం” అన్న భ్రమ. కానీ అవే సత్యమునకు అడ్డుతగులు గదులు.


3ఆ చిత్రం పేరు – – "Listening Room" అంటే ఏమిటి? కానీ “బయటి శబ్దాలకి, లోపలి సత్యానికి మధ్య అడ్డుపడే మన ఊహల శబ్దమే వింటాం”.


4. పరస్పర దృష్టి – మాగ్రిట్ మరియు అన్నమాచార్యులు మాగ్రిట్ గారు మనలోని అంతర్గత విరోధము అసలు దృశ్యాన్ని నిరోధిస్తుందని చెబుతున్నారు. అన్నమాచార్యులు సందేహాలు సత్యాన్ని చూడకుండా అడ్డుకుంటాయంటున్నారు.


3rd Stanza:

శ్రీవేంకటేశ్వరునిఁ జేరి యెవ్వరు నమ్మినా
కైవసమై యాతఁ డింటఁ గాచుకుండును
సావధానములు వద్దు శరణంటేనే చాలు
భావింపనిదే కీలు పరమయోగులకు     ॥వేస॥ 

Literal Meaning:

ఎవ్వరైనా —
 శ్రీవేంకటేశ్వరుని పూర్తిగా నమ్ముకుంటే,
ఆయన వారి వాడవుతాడు.
తనవారిని తానే కాపాడుతాడు.
 
అదిగో అక్కడి నుంచి వస్తాడు”
అనే ఎదురుచూపుల సావధానములు పనికిరావు.
మనము మన పనిలో పూర్తిగా ఐక్యమై ఉన్నపుడు —
అతడు కనపడతాడేమో.
సత్యంగా శరణంటేనే చాలు.
 
ఈ మర్మం — తర్కాలతో చేరగలిగినది కాదు.
అది పరమయోగుల అనుభవంలోనే ఆవిష్కారమౌతుంది. 

వివరణము: సావధానములు వద్దు శరణంటేనే చాలు” = మనము మన పనిలో పూర్తిగా ఐక్యమై ఉన్నపుడు — అతడు కనపడతాడేమో. జిడ్డు కృష్ణమూర్తిగారు తన సోదరుడు చనిపోయి పట్టరాని దుఃఖంలో మునిగినప్పుడు, ఆయన ఆ శోకము అనుభవిస్తుండగానే సత్య దర్శనము జరిగినది. అంతటి దుఃఖంలోనూ ఆయన ఇలా అన్నారు ఇప్పుడు నాకు మరింత స్పష్టంగా తెలిసింది — జీవితంలో నిజమైన అందం ఉందనినిజమైన ఆనందం ఉన్నదని...” 

“బాధను తట్టుకోవాలన్న సంకల్పం లేక, దానిని జయించాలన్న తపన కూడా లేక — బాధ ఉందన్న స్పృహే మరిచిపోయేంతగా పనిలోనైనా, విషాదంలోనైనా మనం పూర్తిగా లీనమయ్యేప్పుడే — సత్యం నిశ్శబ్దంగా మన ముందుకు వస్తుంది.”


x-x – సమాప్తం -x-x

235 mollalEle nAku tanne muDuchukommanave (మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె)

  ANNAMACHARYULU 235 మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె mollalEle nAku tanne muDuchukommanave తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. I...