ANNAMACHARYA
45 భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
Introduction: Annamacharya is makes use of uncanny expressions to attract attention. Just imagine he uses NEEM tree, DOG TAIL, AXE & SCORPION in natural flowing poetic language to make the point to reach the hearts of the reader/listeners. There is a good possibility of retaining the same in the mind because of their oddity. Please understand that this is a 500 year old verse with such modern approach.
He said that the natural tendency of the body and mind may not be altered by practice and conformity by rote. Though many of us appreciate importance of meditation, Annamacharya declared it as వేరులేని మహిమల వేంకటవిభుని కృప. Single minded devotion (not deflected by anything) is all that one need to have. Again in this verse, many similes have been used to explain the concept.
You shall witness in this verse, that Annamacharya is very receptive to the problems faced by man and he is painfully aware of the futility of religious propaganda. I shall say he is not a yogi, but a reformer in more than one sense. The amount of time he would have spent in bringing out defects (of man) in thousands of poems says it all.
ఉపోద్ఘాతము: . అసాధారణ, విచిత్రమైన వేపమాను, తేలు, కుక్క తోక, గొడ్డలి వంటి ఉపమానములను ఉపయోగించి చదువరుల, వినికిరుల మనస్సును ఆకర్షించడానికి ప్రయత్నము చేసారు. ఈ వింత శబ్దాలు కవిత్వములో సహజముగా వొదిగేటట్టు చేసి కీర్తన యొక్క పరిమళాన్ని మధురతరము చేసారు. ఇటువంటి పదాలతో ఙ్ఞప్తికి యెక్కువ అవకాశం ఉంటుదని కాబోలు, కవిత్వానికి ప్రయోగాలతో క్రొంగొత్త నిర్వచనమిచ్చారు. 500 వందల యేళ్ళకు పూర్వమే ఇటువంటీ పద్ధతులు అవలంభిచడము అన్నమాచార్యుల అధునాతనమైన దృక్పధాన్ని సూచిస్తుంది.
ఎంత ప్రయత్నించిననూ సహజ వక్రములైన శరీరము, చిత్తము చెప్పినట్లు వినవనుచున్నాడు శరీరము వికృతపు త్రోవలో నడచుట, చిత్తము పాపకృత్యముల వైపు పరుగులిడుట జీవులకు స్వభావమైయున్నది. ఈ దుఃస్థితి తొలగుటకు సంపూర్ణమైన శరణాగతము, మిశ్రమునకు వీలులేని భక్తి తప్ప వేరు మార్గము లేదు. కాన దానికొఱకై మనుజుడు ప్రయత్నింపవలె. ఈ కీర్తనలో అనేక భావనలను ఊహలను ఉపమానాలతో వ్యక్తపరిచారు.
అన్నమాచార్యులు మానవుల కష్టాల పట్ల అత్యంత సున్నితత్వముతో కూడిన గ్రహింపు కలిగిన వారని, శిష్టాచార ప్రచారముల ప్రయోజనము శష్కమని తెలిసిన మేధావి అని తెలుస్తోంది. ఈ కీర్తనలో ఆయనను యోగిలా కంటే సమాజ ఉద్దారకుడులా కనబడతారు. వేలాది కీర్తనలలో మనుషులలోని ఎన్నొ లోపాలు యెత్తిచూపి, వారికి ఉప్యుక్తమయ్యేలా పాటలుగా కట్టి, తన సమయాన్ని ప్రజలకు అంకితము చేసారు.
భారమైన వేపమాను పాలువోసి పెంచినాను -
bhAramaina
vEpamAnu pAluvOsi peMchinAnu
tIrani chEdE kAka tiyyanuMDInA॥pallavi॥
Word to Word Meaning: భారమైన (bhAramaina) = A large; వేఁపమాను (bhAramaina) = neem tree; పాలువోసి = feed with milk; (pAluvOsi) పెంచినాను (peMchinAnu) = Grown; తీరని (tIrani) = continues (to be); చేఁదే (chEdE) = bitter; కాక (kAka) = but; తియ్యనుండీనా (tiyyanuMDInA) = Will it be Sweet?
Literal Meaning and Explanation: Even if you feed sweet milk to a Neem Tree for long time, will it turn out to be sweet? (Obviously it remains to be bitter). The same way, our mind and body, even after long practice ( of good habits) and conformity (by rote) continue their wavering nature. (Refer to popular keertana ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది)
భావము & వివరణము : పెద్ద వేపచెట్టుకు కమ్మని పాలువోసి పెంచినను అందు తరగని చేదే పొడసూపునుగాని అది తియ్యగా నుండదు గదా! సహజ వక్రములైన శరీరము, చిత్తములు శాస్త్రములు, యోగులు చెప్పినట్లు వినక, (చాలా కాలము అభ్యాసము చేసిన తరువాత కూడా) తిరిగి తమ పాత పద్ధతినే పాటించడాన్ని సూచిస్తున్నారు. ఒక సారి ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది అనే కీర్తన చూడండి .
పాయఁదీసి కుక్కతోఁక బద్దలువెట్టి బిగిసి
pAyadIsi
kukkatOka baddaluveTTi bigisi
chAya keMta gaTTigAnu chakkanuMDInA
kAyapu vikAramidi kalakAlamu jeppinA
pOyina pOkalEkAka buddi vinInA॥bhAra॥
Word to Word Meaning: పాయఁదీసి (pAyadIsi) = వంకరలేకుండ ఈడ్చిపట్టి, pull it out to make it straight; కుక్కతోఁక(kukkatOka) = a dogs
tail; బద్దలువెట్టి (baddaluveTTi) = using
bamboo sticks; బిగిసి (bigisi) = and tighten it ( to retain the
straight position); చాయకు (chAya)
= సరియైనదిశకు , right (appropriate)
direction; ఎంత గట్టిగాను (keMta
gaTTigAnu) = however fast it may be; చక్కనుండీనా (chakkanuMDInA) = will
it ever straighten? కాయపు వికారమిది (kAyapu vikAramidi)
= పెడత్రోవ; wrong path adapted by body and soul; కలకాలముఁ (kalakAlamu)
= long time, many years; జెప్పినా (jeppinA) = practice and rote; పోయిన (pOyina ) having gone; పోకలేకాక (pOkalEkAka) =
without traces of departure; బుద్ది వినీనా(buddi vinInA) =Will the mind listen?
Literal Meaning and
Explanation: However much one tries to straighten the
tail of a dog, it remains crooked. Same way man’s nature remains incorrigible,
despite listening to good words, association and practice.
భావము & వివరణము : కుక్క తోక వంకరగా నుండుట సహజము. దానిని వంకర తొలగునట్లు ఈడ్చిపట్టి వెదురు మున్నగు దబ్బలతో బిగించి క్రిందికి నేరుగా నుండునట్లు ఎంతగా కట్టినను అది చక్కగా నుండదు గదా! అట్లే ఈ శరీరమునకు పెడత్రోవ నడచుట స్వభావమై యున్నది. దీని కెంతకాలము బోధించినను అది పోయినదారినే పోవుచుండునుగాని మనము చెప్పిన బుద్ధి వినదు.
ముంచి ముంచి నీటిలోన మూల నానఁ బెట్టుకొన్నా
muMchi
muMchi nITilOna mUla nAna beTTukonnA
miMchina goDDali nEDu mettanayyInA
paMchamahApAtakAla bAribaDDa chittamidi
daMchidaMchi cheppinAnu tAki vaMgInA॥bhAra॥
Word to Word Meaning: ముంచి ముంచి (muMchi muMchi ) After soaking for quite some time; నీటిలోన (nITilOna) = in water; మూల నానఁ బెట్టుకొన్నా(mUla nAna beTTukonnA) = kept in a corner for soaking; మించిన (miMchina) = better than before; గొడ్డలి (goDDali) = axe; నేఁడు (nEDu) = toady; మెత్తనయ్యీనా (mettanayyInA) = will it soften; పంచమహాపాతకాల (paMchamahApAtakAla) = (పంచమహాపాతకాలు 1. మద్యపానము, 2. అపహరించడము, 3. కోరిక (భార్య కాక అన్యులపై), 4. చంపడము, మరియు 5. ఈ పనులను చేసేవారితో కలిసి తిరగడము). five wrong acts. (1. Intoxication, 2. stealing (money & gold), 3. murder, 4. wanting ladies (other than wife).and 5. Association of such persons). బారిఁబడ్డ (bAribaDDa) = trapped by; చిత్తమిది (chittamidi) = this mind; దంచిదంచి చెప్పినాను (daMchidaMchi cheppinAnu) = ఎన్నిసార్లు అరిచి గీ పెట్టినా, మొత్తుకున్నా కూడా, however much one may reiterate; తాఁకి (tAki) వంగీనా (vaMgInA) = మనిషి పద్ధతులు మార్చుకుంటాడా? Will he mend his ways?
Literal Meaning and
Explanation: If a person soaks axe in water for long
time, will it get softened? (Obviously not). Man’s mind somehow gets mingled with
five wrong acts. Despite stressing upon frequently, good words do not penetrate
into man’s heart.
In this stanza Annamacharya wants
us to note that soaking in water is not a suitable method to soften the axe. Similarly
repeated teaching, cajoling also are not solutions to change man’s behaviour. Thus
he is clear that solution to man’s problems are not in propaganda of appropriate
behaviour. Thus you can see Annamacharya is very receptive to the problems
faced by man and he is painfully aware of the futility of religious propaganda.
భావము & వివరణము : గొడ్డలికి కాఠిన్యము ఎంత నీటిలో నానబెట్టినను అది మెత్తబడదు గదా! సహజము. అట్లే మానవుని మనస్సు పంచమహాపాతకముల కలవడియున్నది. ఎంతగా నొక్కి నొక్కి చెప్పినను, మంచి మాటలు వాని హృదయములోకి సోకి సరైన త్రోవకు వచ్చుట లేదు.
ఆన్నమయ్య "గొడ్డలి కాఠిన్యము తగ్గడానికి నీటిలో నానబెట్టడం అవివేకము. అటులనే ఎంతగా నొక్కి నొక్కి చెప్పినను, శతవిధాల ప్రయత్నము చేసి మూర్ఖునికి చెప్పు మంచి మాటలు వాని చెవికెక్కవు. వాడు దారిలోకి రాడు" అని తేల్చి చెప్పారు. శిష్టాచార ప్రచార మార్గములు మనిషిని మార్చలేవని స్పష్టంగా చెప్పారు.
కూరిమితోఁ దేలుఁదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
kUrimitO
dEludechchi kOkalOna beTTukonnA
sAresAre guTTugAka chakkanuMDInA
vErulEni mahimala vEMkaTavibhuni kRpa
ghOramaina Asa mElukOra sOkInA॥bhAra॥
Word to Word Meaning: కూరిమితోఁ (kUrimitO) = with love
and affection; దేలుఁదెచ్చి (dEludechchi) = bring a scorpion; కోకలోన బెట్టుకొన్నా (kOkalOna beTTukonnA) = put inside your clothes ( put in your pockets);
సారెసారెఁ (sAresAre)
= time and again; గుట్టు (guTTugAka ) = stings; గాక (= కాక, gAka = kaka) = but; చక్కనుండీనా (chakkanuMDInA ) = will
it remain quiet? వేరులేని (vErulEni) = With no alternative; మహిమల వేంకటవిభుని (mahimala
vEMkaTavibhuni) = grandeur
of Lrd Venkateswara; కృప (kRpa ) = blessings; ఘోరమైన (ghOramaina)
=భయపఱచునది, intimidating; ఆస (Asa) = want,
hope; మేలు (mElu)
= benevolence; కోర సోఁకీనా (kOra
sOkInA) = కొరత సోకగలదా ?, will it
ever be wanting?
Literal Meaning and
Explanation: if you bring a scorpion with lot of love
and care, put on your clothes will it not repeatedly sting or will it remain quiet?
Take the blessings of Lord Venkateswara as if there is no alternative, then
that benediction will save you from your present state.
In this stanza, Annamacharya
is saying our wants and affairs are like the scorpion. Later we are stung by the
very deeds. He is asking us to take the shelter of the GOD with no alternative
thought in the mind. This is the most important statement. What do we do? We
want both the temporal pleasures and also assurance of better life next. This
is the duality which Annamacharya criticised time and again. He always said
single minded devotion to God as the only solution.
భానము :- తేలును ప్రేమతో దెచ్చుకొని ఒడిలో పెట్టుకొన్నను మాటిమాటికి కుట్టునే తేలును ప్రేమతో దెచ్చుకొని ఒడిలో పెట్టుకొన్నను మాటిమాటికి కుట్టునే గాని ఊరకుండదు. ఇతరములన్ని వదలి శ్రీ వేంకటేశ్వరుడొక్కడే గతియని నమ్మి మనసారా స్మరిచండి. ఆ దేవుని కృప వలన కోఱత ఉండదు.
మనము తేలు లాంటి అనేకఅనేక కోరికలను, వాంఛలను ప్రేమతో దెచ్చుకొని ఒళ్ళో పెట్టుకుంటాము. అవి కుట్టక ఊరకుంటాయా? ఆన్నమయ్య వేరే ఆలోచనలూ లేకుండా, తెలినినవన్నీ వదలి, భగవంతుని ధ్యానించమన్నారు. కానీ మనము చేసేదేమిటి? మనం అవ్వా కావాలో బువ్వా కావాలో నిర్ణయించుకోలేక తికమక పడి సమయము వృధా చేసుకుంటాము.
zadaz
Reference: copper leaf 47-2, volume: 1-287
Very nice explanation.Each and every word explained very clearly
ReplyDelete