Wednesday 5 May 2021

46 మొదలుండఁ గొనలకు - మోచి నీళ్ళు వోయవేల (modaluMDa gonalaku mOchi nILLuvOyanEla)

ANNAMACHARYA

46 మొదలుండఁ గొనలకు - మోచి నీళ్ళు వోయవేల 

Introduction: In this deep contemplative verse, Annamacharya appears more like philosopher than a religious saint.  He does not mince words to affirm the vanity of pursuing known religious texts, religious conglomerations and public. He is absolutely clear that one needs to take shelter of god not the outfits. 

Lastly he talks of various paths (religions). He lambasts that that each of them professes their own path and vying for their slice pie to attract the commoners similar to a market place. No one is certain of true path due to conflicting claims. Therefore, he says, ignore all these (professed paths) and bow to god. 

Message of Annamacharya written five centuries ago is relevant even now in our society.  

ఉపోద్ఘాతము. హృదయాంతరాళాల నుంచి వ్యక్తమైన యీ కీర్తనలో అన్న్నమయ్య తపసి కంటే సత్యాన్వేష నిపిస్తాడు.  ముఖ్యంగా  మత గ్రంథాలు, మత సంబంధమైన సమ్మేళనాలను సరంజామా లాంటివి అన్నారు. దైవమును మాత్రమే శరణనాలి కాని వస్తుసామగ్రిని అనుష్ఠించుట నిష్ప్రయోజన మమచున్నాడు.

అనేక మతముల వారు అనేకనేక త్రోవలు చూపుతూ ఒకరితోనొకరు (మా మతము మంచిదంటే మాది అంటూ) పోటీ పడుతు, కోలాహలముతో గట్టి అఱుపులతో సంతని తలపింప చేస్తునారన్నారు. పరస్పర విరుద్ధమైన  వాదాలతో, వ్యాజ్యాలతో సామాన్యుడు అయోమయములో పడిపోతున్నాడు. వీని నన్నింటినీ విస్మరించి, అనుమానము లేకుండా దైవమును స్మరించమని చెప్పారు.

ఐదు శతాబ్దాల క్రితము వ్రాసిన అన్నమయ్య మాటలు యీనాటికి యదార్ఢమే. 

Literal Meaning and Explanation

మొదలుండఁ గొనలకు మోచి నీళ్ళువోయనేల

యెదలో నీవుండఁగా నితరములేలా            ॥పల్లవి॥

 

modaluMDa gonalaku mOchi nILLuvOyanEla

yedalO nIvuMDagA nitaramulElA    pallavi

           

Word to Word Meaningమొదలుండఁ (modaluMDa) when root (trunk) is directly seen;  గొనలకు (gonalaku) = ends of the branches ( of a tree); మోచి (mOchi) = carrying;  నీళ్ళువోయనేల (nILLuvOyanEla) = why should you water?   యెదలో (yedalO)   = in heart; నీవుండఁగా (nIvuMDagA) = you (GOD) are there; నితరములేలా (nitaramulElA) = Why search elsewhere.

Literal Meaning and Explanation: When trunk/root of the tree is directly approachable, it is foolish to water the ends of the braches. Similarly, when God is directly in your heart, why do you search elsewhere?

Here Annamacharya is hinting that the braches, leaves get their existence from the roots. And further by giving water to braches it does not ensure survival of the tree.  Therefore, it is better approach the root which feeds all (branches, trunk and leaves) i.e God, not the branch offices like Temples etc.

భావము & వివరణము : చెట్టును పెంచి ఫలము ననుభవింపగోరువాడు దాని మొదలుండగా కొసకొమ్మలకు మోసికొనిపోయి నీళ్ళు పోయుట వ్యర్థము. అట్లే దేవా! హృదయములోనీవుండగా నిన్ను వదలి ఇతరోపాయములతో ముక్తికై ప్రయత్నించుట నిష్ఫలము.

వేళ్ళు అహారము, నీరు ఇచ్చి కాండము, కొమ్మలు మరియు ఆకులను పోషించును. అనగా వేర్లు లేకపోతే  కాండము, కొమ్మలు మరియు ఆకులకు ఆస్థీత్వముండదు. అలాగే దేవుడు లేక మత గ్రంథాలకు, మత సంబంధమైన సమ్మేళనాలకు, గుళ్ళకు  ఆస్థీత్వముండదు. అన్న్నమయ్య  నేరుగా దైవమునే  శరణననాలని అన్నారు.

 

నిగమమార్గముననే నడచేనంటే

నిగమములెల్లను నీమహిమే
జగములోకులఁ జూచి జరగెదనంటే
జగములు నీమాయజనకములు        ॥మొద॥ 

nigamamArgamunanE naDachEnaMTE

nigamamulellanu nImahimE
jagamulOkula jUchi jaragedanaMTE
jagamulu nImAyajanakamulu           moda  

Word to Word Meaningనిగమమార్గముననే (nigamamArgamunanE) = the path shown by Vedas నడచేనంటే (naDachEnaMTE)  = take footsteps along ( follow);  నిగమములెల్లను (nigamamulellanu ) = All the Vedas; నీమహిమే (nImahimE) = మాహాత్మ్యము, Your engery, Your greatness; జగములోకులఁ (jagamulOkula)= people of the world;  జూచి (jUchi) = observing;   జరగెదనంటే (jaragedanaMTE) = If I conduct; జగములు (jagamulu) = this world; నీమాయజనకములు (nImAyajanakamulu) = born out of illusion created by you.   

Literal Meaning and Explanation: Vedas are describing your energy and your greatness. (Therefore, I find it is better to follow you directly.) If I follow the people of the world, again they are only an illusion created by you. (Hence I find it is better to follow it’s the creator of illusion).

భావము & వివరణము : నిగమమార్గము, వేదమార్గము నీ గొప్పతనము మరియు మహిమలనే పొగడుతున్నాయి. (అందుకే నిన్నే అనుసరించుటకు వేడు కొంటిని). లోకులను అనుసరింతు ననుకొంటే యీ లోకము, అందలి వ్యవహారములు నీ మాయా కల్పితమని గ్రహించితిని. (కాన​, మాయ బదులు నిన్ను శరణనుట మేలని నిశ్చయించు కొంటిని) 

మనసెల్ల నడ్డపెట్టి మట్టున నుండేనంటే

మనసుకోరికలు నీమతకాలు
తనువు నింద్రియములు తగ గెలిచేనంటే
తనువు నింద్రియములు దైవమ నీమహిమ           ॥మొద॥ 

manasella naDDapeTTi maTTuna nuMDEnaMTE

manasukOrikalu nImatakAlu
tanuvu niMdriyamulu taga gelichEnaMTE
tanuvu niMdriyamulu daivama nImahima moda 

Word to Word Meaning:  మనసెల్లన్ (manasella) = my complete mind;  డ్డపెట్టి (naDDapeTTi ) = అడ్డగించు, put obstructions or exercise control; మట్టునన్ (maTTunan) = మితీయందు, keep within limits (control);  ఉండేనంటే (uMDEnaMTE) = hold it that way;  మనసుకోరికలు (manasukOrikalu) = the mind and its wants;   నీమతకాలు (nImatakAlu ) = నీ మాయలు, illusions created by you; తనువు (tanuvu ) = body; నింద్రియములు ; (niMdriyamulu ) = sensory organs; తగ (taga) = suitably; గెలిచేనంటే (gelichEnaMTE) =  win over, prevail upon;  తనువు (tanuvu ) = body; నింద్రియములు (niMdriyamulu)  = sensory organs; దైవమ (daivama) = god; నీమహిమ (nImahima) = Your engery, Your greatness. 

Literal Meaning and Explanation: When I determine to control my mind, then I find it is your creation (therefore not in my control); When I try to control my sensory organs, I cannot prevail on them because again they represent your energy. (Therefore I remain where I were).

Annamacharya says it’s impossible to control your mind and sensory organs (consciously) because they represent the energy of God. That’s a reality with which all of us struggle. The basis of his statement can be seen in the following shlokas of Bhagavad-Gita.

 

अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् |
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ||7-5||

apareyam itas tvanyā prakiti viddhi me parām
j
īva-bhūtā mahā-bāho yayeda dhāryate jagat

Purport: O Arjuna! There is a superior energy (of God) beyond the physical energy, which is jīva śhakti (the energy of soul) which encompasses all living entities is the basis for sustaining the universe.

सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि |
प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति || 3-33||

sadiśha chehate svasyā prakiter jñānavān api
prak
iti yānti bhūtāni nigraha ki karihyati

Purport: Even wise people act according to their natures, for all living beings are propelled by their natural tendencies. What will one gain by repression?

 

భావము & వివరణము : చంచలమైన మనస్సును నిరోధించి నియతికి లోబడి ఉండెదనన్నచో మనస్సున పొడము కోరికలుగూడ నీ మాయలే. దేవా! శరీరమును, ఇంద్రియములనుగెలిచి యోగమార్గమున నుందునన్నను శరీరేంద్రియములు నీ మహిమలోనివే. అనగా జీవుని చేతిలో నియంత్రించుటకు నిజానికేమీ లేదని తెలుస్తోంది.

చరణములో అన్న్నమయ్య జీవుడు నిమిత్తమాత్రుడని  చెప్పిన దానికి ఆధారము భగవద్గీతలోని క్రింది శ్లోకాలనుంచి అనుకోవచ్చు.

అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ।। 7-5 ।। 

భావము : అర్జునా!, (భగవంతునికి) భౌతికశక్తి కన్నా ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ-ఆత్మ శక్తి, ఇది ఈ జగత్తు యందు ఉన్న సమస్త జీవరాశులకు మూలాధారమై ఉంటుంది..

శ్రీ భగవానువాచ

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి  

ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ।। 3-33 ||

భావము : వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించ గలమా? 

యింతలోనిపనికిఁగా యిందు నందుఁ జొరనేల

చెంత నిండుచెరువుండ చెలమలేలా
పంతాన శ్రీవేంకటేశ పట్టి నీకే శరణంటి
సంతకూటాలధర్మపుసంగతి నాకేలా          ॥మొద॥ 

yiMtalOnipanikigA yiMdu naMdu joranEla

cheMta niMDucheruvuMDa chelamalElA
paMtAna SrIvEMkaTESa paTTi nIkE SaraNaMTi
saMtakUTAladharmapusaMgati nAkElA   moda

 

Word to Word Meaningయింతలోనిపనికిఁగా (yiMtalOnipanikigA) = Don’t take it as small time work to be performed; యిందు నందుఁ (yiMdu naMdu) = here and there; జొరనేల (joranEla) = why enter? చెంత (cheMta) = very next;  నిండుచెరువుండ (niMDucheruvuMDa) = a lake full of water; చెలమలేలా (chelamalElA) = why to look for  a hole or pit dug for water in the dry bed of a river or rivulet;  పంతాన (paMtAna) =perseverance; శ్రీవేంకటేశ (SrIvEMkaTESa) = Lord Venkateswara; పట్టి (paTTi) = hold steadfast; నీకే (nIkE) = you and only you;  శరణంటి (SaraNaMTi) = submitted myself; సంతకూటాలధర్మపు (saMtakUTAladharmapu) = సంతలోని జనకూటముల వలె ప్రవర్తించు వివిధ ధర్మాల తోడి, religious leaders behaving as if they are in competition in a market place to attract people (to their religion); సంగతి నాకేలా (saMgati nAkElA) = సాంగత్యము నాకెందుకు? Why should I get associated or entangled? 

 

Literal Meaning and Explanation: (continuing the same logic as in previous stanzas), when I (realise) that have little to control, what use is it to go here and there? When great lake is available close by, why to search for small pits for water? I had submitted myself to you with all the might I have. I don’t want get associated with religious leaders behaving as if they are in competition in a market place to attract people (to their religion).

Basis of what Annamacharya said may derived from the (శ్రుతిశ్చ భిన్నా స్మృతయశ్చ భిన్నా /వైకో మునిర్యస్య వచ: ప్రమాణమ్ |)  Vedic texts, jurisprudence of Hindus, what the sages said appears to be differing. A common man often gets bewildered. This is with in Hinduism. Outside it there are many conflicting theories and religious intimidation for abject submission. Perceiving all these with in his mind, might  have prompted these words.

Of course this is not the first time he talks about other religions and sects. Refer to the verse ఎన్నడు తీరవు యీ పనులు where he said పెక్కు మతంబుల పెద్దలు నడచిరి / వొక్క సమ్మతై వోడబడరు (Each of these clergy men professes their (own) path, yet they don't perceive (agree) that there is truly one single path (of devotion) to god. Each one of them claims unique greatness to ascertain popularity. )

 

భావము & వివరణము : ఇట్లు అంతయు నీ మాయకు, మహిమకు లోబడి యుండగా,  నాచే నియంత్రించుటకు యేమీ లేదని యెఱిగీ యిటు నటు పరుగులిడి వ్యర్థ ప్రయాసము లొందనేల? నీరు వలయువాడు చేరువనే నిండుచెరువుండగా చెలమల చెంతకు పోవుటెందుకు? శ్రీవేంకటేశ్వరా! నిన్నే పనిబూని శరణుజొచ్చుచున్నాము. ఇక సంతలోని జనకూటముల వలె ప్రవర్తించు వివిధ ధర్మముల గొడవ నాకెందుకు?

ధర్మము లొకతీరున లేవు- భిన్నా స్మృతయశ్చ భిన్నా /వైకో మునిర్యస్య వచః ప్రమాణమ్ అన్నట్లు శ్రుతులు, స్మృతులు, మునివచనములు వివిధములుగా నున్నవి. ఒక్క హిందూ మతములోనే వెర్వేరు దృకపధము లుండగా, వేరు మతముల ప్రస్తావించుట అనవసరము. ఒక్కటి మాత్రము నిజము, మతము నమ్మకము పేరిట జరిగినంత హింస ధనమునకై కూడా జరిగుండదు.

ఈ విధమైన వ్యాఖ్యలు ఇంతకుముందు ఎన్నడు తీరవు యీ పనులు అనే కీర్తనలో ఇలా పెక్కు మతంబుల పెద్దలు నడచిరి / వొక్క సమ్మతై వోడబడరు అనడము చెప్పుకున్నాము. (అన్ని మార్గముల లక్ష్యము ఒకటేనని (దైవమే అని) గుర్తించని వారు మత పెద్దలెలా అగుదురని ప్రశ్నించారు.)

 

zadaz

Reference: copper leaf 47-2, volume: 1-287 

1 comment:

  1. **ఐదు శతాబ్దాల క్రితము వ్రాసిన అన్నమయ్య మాటలు యీనాటికి యదార్ఢమే. **

    beautiful song and excellent explanation

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...