Thursday, 10 June 2021

58. ఆతఁడే సకలము అని భావింపుచు (AtaDE sakalamu ani bhAviMpuchu)

                                                                ANNAMACHARYA

58. ఆతఁడే సకలము అని భావింపుచు 

Introduction:   In this extraordinary verse, Annamcharya says “God is here for you to see. Why are you looking here and there? Why do you seek favours? Why do you have doubts?” The wording of Ananamacharya on the first look may appear easy and common place. He infuses that extraordinary sense in them as explained below. It's a bit of an adventure to understand what he is whispering in them!

ఉపోద్ఘాతము: ఈ అసాధారణమైన కీర్తనలో, అన్నమాచార్యు​లు “దేవుడు ఇక్కడే ఉన్నాడు.  మీరు ఎక్కడెక్కడో ఎందుకు చూస్తున్నారు? మీరు ఎందుకు సహాయాన్ని అర్ధిస్తారు? మీలో సందేహాలు ఎందుకు ఉన్నాయి?” అంటారు.  పైపైన చూడటానికి అన్నమాచార్యు​ల మాటలు తేలికగా మరియు పరిపాటిగా కనిపిస్తాయి. కానీ ఆయన సాధారణ పదాలలో అసాధారణ భావాన్ని ప్రేరేపిస్తాడు. ఆయన  యేమేమి వాటిల్లో గుప్పిస్తాడో ఊహించడమూ కొంత సాహసమే! 

కీర్తన

ఆతఁడే సకలము అని భావింపుచు

నీతితో నడవక నిలుకడ యేది          ॥పల్లవి॥ 

యెందునుఁ జూచిన యీశ్వరుఁ డుండఁగ

విందుల మనసుకు వెలితేది
సందడించే హరిచైతన్య మిదివో
కందువలిఁక వెదకఁగ నేది    ॥అతఁ॥ 

అంతరాత్ముఁడై హరి పొడచూపఁగ

పంతపు కర్మపు భయమేది
సంతత మాతఁడే స్వతంత్రుఁ డిదివో
కొంతగొంత మరి కోరెడి దేది ॥అతఁ॥ 

శ్రీవేంకటపతి జీవుని నేలఁగ

యీవల సందేహ మిఁక నేది
భావం బీతఁడు ప్రపంచ మీతఁడు
వేవేలుగ మరి వెదకెడి దేది  ॥అతఁ॥

 

Details and Explanations: 

ఆతఁడే సకలము అని భావింపుచు

నీతితో నడవక నిలుకడ యేది         ॥పల్లవి॥ 

AtaDE sakalamu ani bhAviMpuchu

nItitO naDavaka nilukaDa yEdi        pallavi 

Word to Word Meaning: ఆతఁడే (AtaDE) = that one (god); సకలము (sakalamu) = every conceivable thing; అని (ani) = take it as; భావింపుచు (bhAviMpuchu) = imagining, considering, contemplating; నీతితో (nItitO) = righteously, as per the Dharma; నడవక (naDavaka)  = walk, tread; నిలుకడ (nilukaDa) = stable, constancy, stillness; యేది? (yEdi) = where? 

Literal Meaning and Explanation: How can your mind be stable unless you treat that god constitutes everything and tread on this path righteously? 

Word stable (నిలుకడ) mind is indicating clear, constant and not wavering mind.  The word righteous (నీతి) implies that the devotee evaluates the right action matching the stimulus, rather than in the sense of following a rule or a law etc. 

Annamayya laid a larger emphasis on having a stable mind. Further he twisted it by declaring that without believing that God is the only way there is no possibility for stability.

భావము & వివరణము : భగవంతుడే సమస్తమని మరియు ఈ మార్గంలో ధర్మబద్ధంగా నడవాలని మీరు భావించకపోతే మీ మనస్సు  స్థిరంగా ఎలా ఉంటుందో? 

నిలకడ గల​ మనస్సు స్పష్టమైన, స్థిరమైన మరియు అటునిటు ఊగిసలాడని మనస్సును సూచిస్తుంది. నీతితో అనే పదాన్ని ఒక నియమం, చట్టం మొదలైనవాటిని అనుసరించే అర్థంలో కాకుండా, భక్తుడు తన మనస్సును ప్రేరేపిస్తున్న దానికి  సరైన చర్యను అంచనా వేస్తాడని సూచిస్తుంది.  

స్థిరమైన మనస్సు లేక భగవంతుని చూడలేమంటూ నిలుకడకు పెద్ద పీట వేశారు అన్నమయ్య. భగవంతుడే ఏకైక మార్గమని నమ్మకుండా, స్థిరమైన మనస్సు ఉండటానికి అవకాశం లేదంటూ ఇంకో లంకెపెట్టారు.  

యెందునుఁ జూచిన యీశ్వరుఁ డుండఁగ

విందుల మనసుకు వెలితేది
సందడించే హరిచైతన్య మిదివో
కందువలిఁక వెదకఁగ నేది    ॥అతఁ॥ 

yeMdunu jUchina yISvaru DuMDaga

viMdula manasuku velitEdi
saMdaDiMchE harichaitanya midivO
kaMduvalika vedakaga nEdi          ataDE 

Word to Word Meaning: యెందునుఁ (yeMdunu) = Whereever; జూచిన (jUchina) = (you) see; యీశ్వరుఁడు (yISvarudu) = god; ఉండఁగ (DuMDaga) = is present;  విందుల (viMdula) =  (the one  desiring) feast; మనసుకు (manasuku)   to the mind; వెలితేది (velitEdi) = what is lacking (none); సందడించే (saMdaDiMchE) =  spreading; extending; హరిచైతన్య ము (harichaitanya)  = Consciousness of hari;  ఇదివో (midivO)  = here it is;  కందువల (kaMduva) = in places; ఇక (lika)  = here after; వెదకఁగ (vedakaga) = search;  నేది (nEdi)  = why. 

Literal Meaning and Explanation: Wherever you see, there is god. You can witness consciousness (of Hari) is spreading like feast all over. For such a person is there any deficit? Why  do you search in places (to find God)? 

What Annamacharya meant by సందడించే హరిచైతన్య మిదివో is that he is able to witness the movement called life/consciousness while most of us are ignorant of it.  We are so occupied on a little island called self. There is a little judge on this island. He keeps passing judgements like  This is good;” “That is atrocious;” “That fellow is not god;” “I will find god tomorrow;” etc.  Our this little judge is very busy in passing judgements minute after minute, how can he find time to ponder what GOD is?  

In just 13 words, Annamacharya made a world of difference between being aware and being ignorant. Now try to see the tenor of the little judge by another great social reformer Vemana. 

ఆ. లోను చూడఁజూడ లోకాభిరామంబు

బయలు చూడఁజూడ బంధనంబు
తన్నుఁజూడఁజూడ తారక బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ. (1-344)

చూడఁజూడ = తరచి చూస్తే, పలుమార్లు చూడగా 

Purport : O Learned Vema! when you  clearly see  inside (your heart/ thoughts) you find nothing but worldly matter (or chatter). Similarly when you look outside, whatever thing you lay your sight, (would like to own it) therefore it only binding (you to this world). However a constant deeper probe inside whole of you is Absolute Realisation.

A constant deeper probe is not possible with a chattering mind. Now you can find relevance of this stanza with the chorus. 

భావము & వివరణము : అదుగో చూడండి హరి యొక్క చైతన్యం విందులా వ్యాపిస్తోంది. ఎక్కడ చూసినా దేవుడు కళ్ళ ఎదురుగా ఉండగా మీరు యెక్కడెక్కడో యెందుకు వెతుకుతారో? 

అన్నమాచార్యులు సందడించే హరిచైతన్య మిదివో  అని చెప్పి విశ్వమంతా వ్యాపించియున్న జీవ వాహినిని దర్శించానని చెప్పారు. మమం అలాంటిది ఒకటున్నదనే ఎరగము. 

మనమంతా నేను (లేదా అహం) అనే చిన్న ద్వీపంలో ఇరుక్కుని ఉన్నాము. ఈ ద్వీపంలో ఒక  బుల్లి న్యాయమూర్తి ఉన్నారు. అతను "ఇది మంచిది;" "అది దారుణం;" "వాడు దేవుడు కాదు;" "నేను రేపు దేవుణ్ణి కనుగొంటాను;" అంటూ పొద్దస్తమాను వదరుతూనే ఉంటాడు. న్యాయాన్యాయ విచారణలో తలములకలైయున్న  బుల్లి న్యాయమూర్తి గారికి (ఎదురుగాయున్న) దేవుణ్ణి చూసే సమయం ఎక్కడ ఉంటుంది? 

అన్నమయ్య పదమూడు పదాల్లొ చైతన్యవంతమగు జీవితానికి అంధకారమయమగు అజ్ఞానమునకు వ్యత్యాసమును వ్యక్త పరిచిరి. ఇప్పుడు క్రింది వేమన పద్యము యేమంటోందో చూడండి. 

ఆ. లోను చూడఁజూడ లోకాభిరామంబు / బయలు చూడఁజూడ బంధనంబు / తన్నుఁజూడఁజూడ తారక బ్రహ్మంబు / విశ్వదాభిరామ వినర వేమ.  భావము: ఓ మానవుడా! గమనిస్తే మన మనస్సంతా  ఉబుసుపోయేందుకు  లోకాభిరామముతో నింపి; అదిగాక, దేన్ని చూస్తే అదే కావాలనే కోరికలతో బంధాల్లొనూ ఇరుక్కు పోయి కాలము గడుపుతున్నావు. పరీక్షగా నిన్ను నువ్వు చూచుకున్ననాడు  తారక బ్రహ్మాన్ని పొందుతావు. 

పొద్దుపుచ్చు కబుర్లు చెప్పుకునే మనస్సుతో స్థిరమైన, లోతైన విచారణ సాధ్యం కాదు. ఇప్పుడు మీరు పల్లవితో ఈ చరణాన్ని అన్నమయ్య యెలా కలిపిందీ కనుగొనవచ్చు. 

అంతరాత్ముఁడై హరి పొడచూపఁగ

పంతపు కర్మపు భయమేది
సంతత మాతఁడే స్వతంత్రుఁ డిదివో
కొంతగొంత మరి కోరెడి దేది            ॥అతఁ॥ 

aMtarAtmuDai hari poDachUpaga

paMtapu karmapu bhayamEdi
saMtata mAtaDE svataMtru DidivO
koMtagoMta mari kOreDi dEdi       ataDE 

Word to Word Meaning: అంతరాత్ముఁడై (aMtarAtmuDai) = reigning the inner world; హరి (hari) = God Hari; పొడచూపఁగ (poDachUpaga) = has taken shape;  పంతపు (paMtapu) = revengeful;  కర్మపు (karmapu) = deeds;  భయమేది? (bhayamEdi) = where is the fear? సంతతము (saMtata) = forever; ఆతఁడే (mAtaDE) = He alone;  స్వతంత్రుఁడు (svataMtruDu) = is independent /  is free;  ఇదివో (midivO)  = here it is; కొంతగొంత (koMtagoMta) = in bits and pieces; మరి (mari) = still;  కోరెడి దేది? (kOreDi dEdi?)= who is the seeker?     

Literal Meaning and Explanation: While God Hari is reining the inner world and he can be seen in your heart, where is the question of fearing the revengeful deeds (of the past). See/find here he is.  He is independent. (He will make you are free of the past deeds). Why are you engaged in seeking trifling favours? 

Why seek favours? Is the quintessential question of Annamayya. Very often he declared that It’s easier to live the life of a bird than to reduce your self-prestige (by begging others for the alms) (వుడివోని పక్షియై వుండనైనా వచ్చుఁ గాక / విడువ కెవ్వరినైనా వెఁడవచ్చునా). 

Annamayya always advocated cleaning one’s own act, instead of seeking god. “God  is there forever. You don’t recognise him presently because you are engaged in fragmented existence of looking here and there” is the meaning of this stanza. (Now see the connection of this para with the previous stanza). 

Annamayya always said there is only step to liberation i.e, to correct yourself by becoming devotee. It may appear hackneyed expression. Is it so easy? Just see  what he meant actually by announcing  ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక / కమ్మి హరి దాసుఁడు గావచ్చునా? (Becoming a true devotee is harder than becoming a king. Here it is implying that no one can become a devotee by exercise of choice unless one finds it as the only path to tread). 

Another important thing said is that we are afraid of our past deeds. He said compassion of god will wash away those sins. Now you can see this stanza has roots in the Bhagavad-Gita verse below. 

अपि चेदसि पापेभ्य: सर्वेभ्य: पापकृत्तम: |
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि || 4-36||

api ched asi pāpebhya sarvebhya pāpa-kit-tama
sarva
āna-plavenaiva vijina santarihyasi

Purport: Even those who are considered the most immoral of all sinners can cross over this ocean of material existence by seating themselves in the boat of divine knowledge. 

భావము & వివరణము : దేవుడు హృదయాన్ని  ఏలుతుండగా ఆయన్ని మీమనసులో చూడవచ్చు.  అలాంటి వారికి గతానికి భయపడే ప్రశ్నే లేదు. దేవుడిక్కడే ఉన్నాడు చూడండి/ కనుగొనండి. అతను స్వతంత్రుడు. (ఆయన మిమ్మల్ని కర్మల బారి నుండి విడిపిస్తాడు). అల్పమైన విషయాలను కోరడంలో ప్రపంచము ఎందుకు నిమగ్నమై ఉందో? 

మానవులు సహాయం ఎందుకు ఆపేక్షిస్తారో? అని అన్నమయ్య తరచుగా అడిగేవారు. అంత కంటే వుడివోని పక్షియై వుండనైనా వచ్చుఁ గాక / విడువ కెవ్వరినైనా వెఁడవచ్చునా అనేవారు. 

అన్నమయ్య ఎల్లప్పుడూ భగవంతుడిని వెతకడానికి బదులు నీ అంతరంగాన్ని శుభ్రపరచు కోవాలని సూచించేవారు. “దేవుడు ఎప్పటికీ ఉంటాడు. మీరు ప్రస్తుతం అతన్ని గుర్తించలేరు ఎందుకంటే మీరు ఇక్కడ మరియు అక్కడ చూసేందుకు అలవాటుపడి ఆ అతుకుల బొంత నుండి దైవాన్ని చూసే సాహసము చేస్తున్నార”ని ఈ చరణం యొక్క అర్థం. (ఇప్పుడు మునుపటి చరణంతో ఈ చరణం యొక్క లంకెను గమనించండి). 

అన్నమయ్య ఎప్పుడూ విముక్తి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉందని, అంటే భక్తుడిగా మారడం ద్వారా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలని అన్నారు. ఇది అర్థంలేని పునరుక్తిగా అనిపించవచ్చు. ఆయన అసలేమంటున్నాడో ఒక్కసారైనా ఆలోచించారా? అదేమైనా సులభమైందా తీసి పారెయ్యడానికి? ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక / కమ్మి హరి దాసుఁడు గావచ్చునా? పెద్ద పెద్ద పుణ్యకార్యములు చేసి చక్రవర్తియై భూమిని పరిపాలించుటైన సులభమే కాని  యే విధముగా భక్తిని పెంచుకొని  హరిదాసుడు కాగలడు? (హరికి దాసుడౌట  సులభసాధ్యమేనా? ఎవరూ కోరి భక్తులుకాలేరని, భక్తి తప్ప వేరు మార్గము లేదని గ్రహించినవారు తప్పించి అని అర్ధము). 

ప్రస్తావించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరూ తమ గత కర్మలకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. భగవంతుని కరుణ పాపాలను కడిగివేస్తుందని ఆయన చెప్పారు. తద్వారా, చరణానికి క్రింద ఉన్న భగవద్గీత శ్లోకంలో మూలాలు ఉన్నాయని తెలియండి. ​ 

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ।। 4-36 ।। 

భావము పాపాత్ములందరి కంటే పరమ పాపిష్ఠి వారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు. 

శ్రీవేంకటపతి జీవుని నేలఁగ

యీవల సందేహ మిఁక నేది
భావం బీతఁడు ప్రపంచ మీతఁడు
వేవేలుగ మరి వెదకెడి దేది  ॥అతఁ॥ 

SrIvEMkaTapati jIvuni nElaga

yIvala saMdEha mika nEdi
bhAvaM bItaDu prapaMcha mItaDu
vEvEluga mari vedakeDi dEdi       ataDE 

Word to Word Meaning: శ్రీవేంకటపతి (SrIvEMkaTapati) = lord Venkateswara; జీవుని (jIvuni)  = the human; నేలఁగ (nElaga) =ruling;  యీవల (yIvala) = this side;  సందేహము (saMdEhamu) = Doubts; ఇఁక (ika) = here after;  నేది? (nEdi?) = Where?  భావంబు (bhAvaMbu) =   the essence; ఈతఁడు  (bItaDu) = HE is;  ప్రపంచము (prapaMchamu)  = this universe; ఈతఁడు  (ItaDu) = he is; వేవేలుగ (vEvEluga) = in multiple ways;  మరి (mari )= still; వెదకెడి దేది (vedakeDi dEdi) = who is searching? 

Literal Meaning and Explanation: When the God (lord Venkateswara) is ruling your heart, where is the question of having doubts? He is the essence. He is the universe. Still why do you search in multiple ways?           

Consider this below statement of Jiddu Krishanmurti as below. 

“Do you want to ask any questions? Isn't this silence better than questions? If you are inwardly quiet, isn't that better than any question and answer? If you are really quiet, then you have love and beauty - the beauty that is not in the building, in the face, in the cloud, in the wood, but in your heart. That beauty cannot be described, it is beyond expression. And when you have that, no question need ever be asked.” (You Are The World Chapter 7, 6th February 1969. 4th Public talk at University of California, Berkeley)

You can observe similarities between Annamcharya  and Jiddu Krishnamurti’s statements.  You may note that Annamacharya is clearly ahead of his times in this stanza.  

భావము & వివరణము: భగవంతుడు (వెంకటేశ్వరుడు) మీ హృదయంలో నివసిస్తున్నప్పుడు, సందేహాలకు తావు ఎక్కడ ఉంది? దైవమే భావము. దైవమే విశ్వము. ఐనప్పటికీ మీరు పలు మార్గాల్లో ఎందుకు వెతుకుతారో? 

జిడ్డు కృష్ణమూర్తి గారి క్రింద ఇచ్చిన ప్రసంగాన్ని చదవండి. 

“మీరు ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? నిశ్శబ్దం ప్రశ్నలకన్నా మించినది కాదా? మీరు వాస్తవంగా అంతర్గతంగా నిశ్శబ్దంగా ఉంటే, ఏవైనా ప్రశ్నలు ఉత్పన్నమౌతాయా? నిజమైన నిశ్శబ్దం మీరనుభవించి ఉంటే, మీరు కారుణ్యము మరియు సౌందర్యములను  స్పృశించినట్లే -  మీ హృదయంలో లేని అందం, భవనంలోకానీ, ముఖంలోకానీ,  ఆమేఘంలోకానీ, అడవిలోకానీ లేదు. అందాన్ని వర్ణించలేము, అది వ్యక్తీకరణకు అందనిది. మీకు అది ఉన్నప్పుడు, ఎప్పుడూ సందేహమే రాదు.” (You Are The World Chapter 7, 6th February 1969. 4th Public talk at University of California, Berkeley) 

ఇక్కడ అన్నమాచార్యుల మరియు జిడ్డు కృష్ణమూర్తి ప్రకటనల మధ్య సారూప్యతలను గమనించవచ్చు. చరణంలో అన్నమాచార్యుల  ఆధునిక దృక్పధము స్పష్టమౌతోంది

zadaz

 

 

Reference: Copper Leaf 205-1, volume: 3-25

3 comments:

  1. Nice commentary. Annamayya’s thinking and solutions to the problems by suggesting to abide by the feet of the Lord, are always applicable to the seekers of truth of any period.

    ReplyDelete
  2. Its true that Annamayya's solutions are relevant even today. Nowadays, many people suffer from overthinking and mind chatter. Different people have given different answers, some said shift your focus when intrusive thoughts come, some said observe them from a distance and Annamayya says focus on the god within you.

    ReplyDelete
  3. సమస్తము ఆ పరమేశ్వరుడే యని నమ్ముతూ,ధర్మబద్ధంగా,నియతితో, ధర్మమార్గంలో జీవిత పయనంలో సాగకపోతే నీ మనస్సు ఎలా స్థిరంగా ఉంటుంది? స్థిరచిత్తము లేనిచో మనిషి భగవంతుని చూచుట అసాధ్యం.
    పరమాత్మ చైతన్యం అంతటా కనువిందులా వ్యాపించి ఉండగా అయన కొరకై వెదుకులాట దేనికి? సర్వవ్యాపి భగవంతుడు ఉండగా నీకిక తక్కువేమి?

    "చంచలమైన నీ మనసులోన చూస్తే ఏముంది? అన్నీ లౌకిక విషయముల చర్చలు, ఆలోచనలే కదా!.దృశ్యప్రపంచం వైపు చూస్తే అన్నిటియందు బంధకారకములైన విషయవస్తువులే సుమా! స్థిరమైన చిత్తమందు లోతుగా అంతర్దృష్టితో చూచినచో బంధవిముక్తి నొసగు పరిపూర్ణమైన పరిజ్ఞానం నీకు గొచరమగును కదా!" అన్న వేమనగారి పలుకులు సందర్భోచితము.
    నీ హృదయం లోనే స్థితమైయున్న భగవంతుడిని అన్వేషించి,దర్శించితే ఇంక పాపకర్మలంటే నీకేల భయం?అయన దర్శనమాత్రంచే నీ పాపకర్మలన్నీ భస్మీపటలమై, బంధవిముక్తుడవగుదువు.
    అప్పుడు నీకింకే కోరికల అవసరమే యుండదు.
    శ్రీ వెంకటేశ్వరుడే నీ హృదయమందు కొలువై ఉండగా,సందేహములకింక తావేది?అతడే వేదసారం.అతడే చరాచర సృష్టికి మూలం.మరి నీవు పరిపరి విధాల భగవంతునికై అన్వేషించుట యేల?
    అని తాళ్లపాక అన్నమయ్య అద్భుతమైన ఈ కీర్తనలో ఉద్బోధిస్తున్నాడు.
    🙏

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...