Saturday, 12 June 2021

59. అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము (ayyO pOya brAyamu gAlamu)

 ANNAMACHARYA

59. అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము 

Introduction:   In this simple Verse, Annamacharya describes how a person is influenced by his family and eventually gets lost in chores. The challenge that a person actually faces on the path to liberation is the resistance he faces from his family. How a person should behave in such situations is really challenging. There is possibility for slippage every moment. 

ఉపోద్ఘాతము: ఈ సరళమైన కీర్తనలో, ఒక వ్యక్తి తన కుటుంబం ద్వారా ఎలా ప్రభావితమవుతాడో మరియు చివరికి పనులలో చిక్కుకొని దారి తప్పుతాడో అన్నమాచార్యులు వివరించాడు. విముక్తి మార్గంలో ఒక వ్యక్తి వాస్తవానికి ఎదుర్కోవలసిన సవాలు అతని కుటుంబం నుంచి ఎదురయ్యె  ప్రతిఘటన. అటువంటి పరిస్థితులలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి అనేది నిజంగా ఎన్నో సవాళ్ళతో కూడినది. ప్రతి క్షణం తను యెంచుకొన్న మార్గమునుంచి జారిపోయే అవకాశం ఉంటుంది.  

కీర్తన

అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము

ముయ్యంచు మనసున నే మోహమతినైతి  ॥పల్లవి॥ 

చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు

వట్టి యాసలఁ బెట్టువారే కాక
నెట్టుకొని వీరు గడు నిజమనుచు హరి నాత్మఁ
బెట్టనేరక వృధా పిరివీకులైతి          ॥అయ్యో॥

 

తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును

వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక
మిగుల వీరలపొందు మేలనుచు హరినాత్మఁ
దగిలించ లేక చింతాపరుఁడనైతి    ॥అయ్యో॥

 

అంత హితులా తనకు నన్నలునుఁ దమ్ములును

వంతువాసికిఁ బెనఁగువారే కాక
అంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటు
సంత కూటముల యలజడికి లోనైతి         ॥అయ్యో॥ 

Details and Explanations: 

అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము

ముయ్యంచు మనసున నే మోహమతినైతి           ॥పల్లవి॥

ayyO pOya brAyamu gAlamu

muyyaMchu manasuna nE mOhamatinaiti  ॥pallavi॥  

Word to Word Meaning: అయ్యో (ayyO) = alas! పోయఁ(pOya) = lost;  బ్రాయముఁ (brAyamu) = youth; గాలము (gAlamu) = time;  ముయ్యంచు (muyyaMchu) = three edged త్రిగుణాత్మకమైన మనస్సు అనే అర్ధములో చెప్పి ఉండవచ్చు మనసున (manasuna) = in the mind; నే (nE) = myself;  మోహమతినైతి (mOhamatinaiti) = got lured by passion;  

Literal Meaning and Explanation: Alas!!  All my youth and time have been lost in pursuing illusionary passions of the mind. 

భావము & వివరణము :  అయ్యో! వయస్సు, కాలము వ్యర్థముగా కరిగిపోయాయే.  నా మనస్సు మాయలో తగులుట వలన మొహములో మునిగిపోయాను. 

చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు

వట్టి యాసలఁ బెట్టువారే కాక
నెట్టుకొని వీరు గడు నిజమనుచు హరి నాత్మఁ
బెట్టనేరక వృధా పిరివీకులైతి         ॥అయ్యో॥ 

chuTTaMbulA tanaku sutulu gAMtalu jelulu

vaTTi yAsala beTTuvArE kAka
neTTukoni vIru gaDu nijamanuchu hari nAtma
beTTanEraka vRdhA pirivIkulaiti  ayyO 

Word to Word Meaning: చుట్టంబులా (chuTTaMbulA) = are they true relations? తనకు (tanaku) = for you; సుతులుఁ (sutulu) = children; గాంతలుఁ (gAMtalu) = ladies;  జెలులు (jelulu) =  వట్టి (vaTTi) =  empty, vain, useless; యాసలఁ (yAsala) = desires;  బెట్టువారే (beTTuvArE) = causing; కాక (kAka) = except; నెట్టుకొని (neTTukoni) = pushing, shoving, thrusting; వీరు (vIru) = these very people; గడు (gaDu) = absolute; నిజమనుచు (nijamanuchu) = truth, felt they are my own; హరిని (harini) = God Hari;  ఆత్మఁ (Atma)  = in the mind; బెట్టనేరక  (beTTanEraka) = unable to keep; వృధా (vRdhA)  wasteful, useless;  పిరివీకులైతి (pirivIkulaiti) = పీకులాడితిని, to squabble, to wrangle.  

Literal Meaning and Explanation: Although wife, children, and friends give us hope, are they real? Supposing them to be real and spent my youth and time in tussles of life in vain; Alas! Without meditating on Srihari in the soul.

Observe carefully. Annamacharya is saying that it is not that these people are the cause of the bondage; it is man’s on his own understanding or assumption that moved him away from the path of god.   

భావము & వివరణము :  భార్యా, పిల్లలు, స్నేహితులు మనకు ఆశలను కల్పించువారేగానీ, వారు నిజమైన చుట్టములా?   అయ్యో! వారే నిజమనుకుని, శ్రీహరిని ఆత్మయందు ధ్యానించక వ్యర్ధమైన పీకులాటలలో కాలము వయస్సు  గడిపితిని, 

జాగ్రత్తగా గమనించండి. అన్నమాచార్యులు భార్యాబిడ్డలు బంధములకు కారణము కాదని  చెబుతున్నారు; మనిషి సొంత అవగాహనా రాహిత్యం తోనే తనను తానే దేవుని మార్గం నుండి దూరం చేసుకున్నాడంటున్నాడు. 

తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును

వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక
మిగుల వీరలపొందు మేలనుచు హరినాత్మఁ
దగిలించ లేక చింతాపరుఁడనైతి   ॥అయ్యో॥ 

tagubaMdhulA tanaku dallulunu daMDrulunu

vagala beTTuchu diruguvArE kAka
migula vIralapoMdu mElanuchu harinAtma
dagiliMcha lEka chiMtAparuDanaiti       ॥ayyO॥ 

Word to Word Meaning: తగుబంధులా (tagubaMdhulA) = are they suitable relations; తనకుఁ (tanaku) = to me?; దల్లులునుఁ (dallulunu) = mother; దండ్రులును (daMDrulunu) = father; వగలఁ బెట్టుచుఁ (vagala beTTuchu) = creating fresh passions, fresh regrets, fresh pretences every moment;   దిరుగువారే (diruguvArE) = move about; కాక (kAka) = except;  మిగుల (migula) = exceedingly; వీరలపొందు (vIralapoMdu) = their association; మేలనుచు (mElanuchu) = taking it as righteous deed, taking it as kindness;  హరినాత్మఁ (harinAtma)  = God Hari; దగిలించ లేక (dagiliMcha lEka) = not got hooked to; చింతాపరుఁడనైతి     (chiMtAparuDanaiti)= ( fallen to) lamentation. 

Literal Meaning and Explanation: I had got into the trap of keeping parents happy is the ultimate goal of life. While I am engaged in satisfying their needs, I had neglected SriHari and finally and lamenting my fallacy.           

భావము & వివరణము :  తల్లిదండ్రులు మాయలో పడవేయువారే గానీ, వారు నిజమైన ఆత్మ బంధువులా? అయ్యో! వారిని సంతోషపెట్టడమే పరమావధిగా జీవించుచు, ఆత్మయందు శ్రీహరిని ప్రతిష్టించుకొనక, చింతాక్రాంతుడనైతిని, 

అంత హితులా తనకు నన్నలునుఁ దమ్ములును

వంతువాసికిఁ బెనఁగువారే కాక
అంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటు
సంత కూటముల యలజడికి లోనైతి       ॥అయ్యో॥ 

aMta hitulA tanaku nannalunu@M dammulunu

vaMtuvAsiki benaguvArE kAka
aMtarAtmuDu SrIvEMkaTAdrISu goluva kiTu
saMta kUTamula yalajaDiki lOnaiti           ॥ayyO॥ 

Word to Word Meaning: అంత (aMta) = that much; హితులా (hitulA) = meaning good? తనకు (tanaku) =  to me; నన్నలునుఁ (nannalunu) = elder brothers; దమ్ములును (dammulunu) = younger brothers; వంతువాసికిఁ (vaMtuvAsiki) = larger share ( of property); బెనఁగువారే (benaguvArE) = grapple:  కాక = except; (kAka) అంతరాత్ముఁడు (aMtarAtmuDu) = the one inside; శ్రీవేంకటాద్రీశుఁ (SrIvEMkaTAdrISu) = lord Venkateswara; గొలువ కిటు (goluva kiTu) = without contemplating this way; సంత (saMta) = market; కూటముల (kUTamula) = conglomarates;  యలజడికి (yalajaDiki) = perturbation; లోనైతి (lOnaiti)= got subjected to; 

Literal Meaning and Explanation: Brothers (elder ones and younger ones) are they going to act in your interest?  Ultimately, we will be grappling with each other for larger share in parental property. Instead of meditating on the Lord Venkateswara situated in my conscience, I subjected my inner world to the perturbation of business forces. 

He said Man gets bonded to wife, children, friends, parents and earning money. He underlines in each stanza that it is his own doing, not of the people he bonded with. Now consider the relationship this verse has with the following Bhagavad-Gita Shloka.

 

अनाश्रित: कर्मफलं कार्यं कर्म करोति य: |
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रिय: || 6-1||

śhrī bhagavān uvācha
anāśhritaḥ karma-phalaṁ kāryaṁ karma karoti yaḥ
sa sannyāsī cha yogī cha na niragnir na chākriyaḥ

Purport: The Supreme Lord said: Those who perform prescribed duties without desiring the results of their actions are actual sanyāsīs (renunciates) and yogis, not those who have merely ceased performing sacrifices such as agni-hotra, yajña or abandoned bodily activities. 

Thus Annamacharya was very clear that it the practitioner who has to transform himself, not the people of his association OR environmental conditions. 

Sir, please note how accurate is Annamacharya on what disturbs man. It’s a fact that in the globalised world, we are, more than ever before, are subjected to vagaries of market forces. In this Corona period, we are witnessing them more acutely. I am sure, there were no such markets in the period of Annamayya. Yet, you may note he had foreseen the condition of man 500 years from his time. 

For more detailed understanding of this verse please refer to my notes on కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు. 

భావము & వివరణము :  చివరగా తల్లిదండ్రుల ఆస్తిలో పెద్ద వాటా కోసం ఒకరి జుట్టు ఒకరు పట్టుకుంటామే కాని అన్నదమ్ములు  ఎప్పుడూ మీకు అనుగుణంగా వ్యవహరించబోతారా? అయ్యో!! నా మనస్సాక్షిలో ఉన్న వెంకటేశ్వరుడిని ధ్యానించడానికి బదులుగా, నా అంతర్గత ప్రపంచాన్ని కలవరపెట్టే వ్యాపార శక్తుల పాలుచేసానే!! 

అన్నమాచార్యులు మానవుని బంధాలకు అతడే కారణమని; భార్య, పిల్లలు, స్నేహితులు, తల్లిదండ్రులను నిందించి ప్రయోజనములేదని; తన అలోచనా సరళిలోనే సమూలమైన మర్పును చేసుకోవాలనీ  ఉద్బోధించారు. ఈ కీర్తనకు క్రింది భగవద్గీత శ్లోకంతో ఉన్న సంబంధాన్ని ఇప్పుడు పరిశీలించండి. 

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః
సన్న్యాసీ యోగీ నిరగ్నిర్నచాక్రియః ।। 6-1 ।। 

భావము: అర్జునా!! ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను (చేయవలసిన విధులను), చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని, కేవలం అగ్ని హోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరిక క్రియలు త్యజించిన వారు కాదు. 

కాబట్టి అన్నమాచార్యులు అభ్యాసకుడు తనను తాను మార్చుకోవాలి; తనను సంసారము లోని వ్యక్తులు, సంఘము లేదా పర్యావరణ పరిస్థితులు  యే రకముగా ప్రభావితము చేయుచున్నవో తెలియ మన్నారు. 

అయ్యలారా!  అన్నమాచార్యులు మనిషిని కలవరపరిచేదేమిటో ఎంత ఖచ్చితంగా చెప్పినదీ దయచేసి గమనించండి. ఈనాడు ప్రపంచీకరణతో భూగోళంపై, మనము మునుపెన్నడూ లేనంతగా, వ్యాపార శక్తుల ప్రభావానికి గురవుతున్నాం. ఈ కరోనా కాలంలో, మనము వాటిని మరింత దగ్గరగా చూడ గలుగుతున్నాము. నాకు తెలిసి, అన్నమయ్య కాలంలో అలాంటి వాణిజ్యములు లేవు. అయినప్పటికీ, ఆయన 500 సంవత్సరాల తర్వాత మనిషి పరిస్థితిని ఊహించాడని మీరు గమనించవచ్చు. 

ఈ కీర్తనపై మరింత అవగాహనకు కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు  అనే కీర్తన చూడవచ్చు.  

zadaz 

Reference: Copper Leaf 29-4, volume: 1-179

 

1 comment:

  1. సంసారమనే మాయలో చిక్కుకొని, మొహానికి లోనై సమయాన్ని వృధా చేశాను.భార్యాబిడ్డలు, స్నేహితులు అనేవారు మనలో ఆశలను పెంచువారే కాని వారు నిజమైన హితులా?వారంతా నిజమేయని తలచి, శ్రీహరిని ఆత్మయందు నిలిపి యందు ధ్యానించి తరించక, జీవితపు పెనుగులాటలో పడి యెంతో విలువైన కాలాన్ని,నా ప్రాయమును గడిపి వ్యర్థం చేశాను.
    బంధుజనులు బంధములకు కారణమని భావించరాదని,శ్రీహరిని పొందే మార్గం నుంచి దూరం చేసుకోవటం కేవలం మన అవగాహనాలోపమేనని గుర్తించాలని అన్నమయ్య అంటున్నాడిక్కడ.
    తల్లిదండ్రులను సుఖపెట్టటం, వారి అవసరములను తీర్చుటయే జీవిత పరామవధి యని, వారే ఆత్మబంధువులని భావించి,భగవంతుని ఆత్మయండు ప్రతిష్ఠించుకోలేక పోయినందుకు చింతాగ్రస్తుడనైతిని.
    చివరకు ఆస్తులు పంచుకొనువారే గాని,వారు నిజమైన ఆత్మ బంధువులా?నా అంతరంగాన కొలువై యున్న శ్రీ వెంకటేశ్వరుని ధ్యానింపక,బాహ్యమైన వ్యాపారశక్తులకు చిక్కుకొని మనస్సును ఎంతో కలవరపెట్టాను కదా!యని అన్నమయ్య వాపోతున్నాడు ఈ కీర్తనలో.

    కేవలం అగ్నిహోత్రాది కర్మలను, శారీరిక క్రియలను త్యజించినవారు సన్న్యాసులు కారని, ఫలాపేక్షరహితంగా కర్తవ్యకర్మల నాచారించువారే అసలైన సన్న్యాసులు అని భగవానుడు గీతలో బోధించిన శ్లోకం ఉటంకించటం సముచితము.
    🙏

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...