Saturday 19 June 2021

61. ఎప్పు డేబుద్ధి వుట్టునో యెరఁగరాదు (eppu DEbuddhi vuTTunO yeragarAdu)

 ANNAMACHARYA

61. ఎప్పు డేబుద్ధి వుట్టునో యెరఁగరాదు 

Introduction:   In this beautiful philosophical verse, Annamacharya asking you to find the actual (not conceptual, not what has been preached) relationship a person has to, his origins, his family and his environment.  Annamacharya verses challenge you to introspect and find the truth unto yourself. 

Underlying need for freedom cannot be achieved by reactions or by hoarding the desires and passions in the heart; but by contemplation is the message of this verse. 

ఉపోద్ఘాతము: ఈ అందమైన తాత్విక కీర్తనలో, ఒక వ్యక్తికి అతని మూలాలతోను, అతని కుటుంబంతోను మరియు ప్రపంచంతోను అసలైన సంబంధం (ఊహించినది కాదు, విన్నది కాదు,  నేర్పించినది కాదు) యేమిటని ప్రశ్నిస్తున్నారు? మిమ్మల్ని అన్నమాచార్యులు ఆత్మపరిశీలన ద్వారా  సత్యాన్ని కనుగొనమని  సవాలు చేస్తున్నారు. 

మనిషికి అత్యావశ్యకమైన అంతర్లీన  స్వేచ్ఛను ప్రతిచర్యల ద్వారా సాధించలేము; మూగ కోరికలను గుండెల్లో దాచుకున్నా అణిగిపోవు.  ధ్యానమొకటే మార్గమని కీర్తన సందేశం. 

కీర్తన

ఎప్పు డేబుద్ధి వుట్టునో యెరఁగరాదు

దెప్పరపు మా బ్రదుకు దేవునికే సెలవు       ॥పల్లవి॥ 

యేడనుండి పుట్టితిమో యింతక తొల్లి యింక -

నేడకు బోయెదమో యిటమీఁదను
వీడని మాయంతరాత్మ విష్ణుఁడు మా -
జాడ జన్మమతనికే సమర్పణము    ॥ఎప్పు॥ 

గతచన్న పితరు లక్కడ నెవ్వరో

హితవై యిప్పటి పుత్రు లిదియెవ్వరో
మతి మాజీవనమెల్ల మాధవుఁడు
అతనికే మాభోగాలన్నియు సమర్పణము  ॥ఎప్పు॥ 

తొడికి స్వర్గాదులు తొల్లియాడవో యీ -

నడచే ప్రపంచము నాకేడదో
కడఁగి శ్రీ వేంకటేశు గతియే మాది
అడఁగు మా పుణ్యపాపా లతని కర్పణము   ॥ఎప్పు॥ 

Details and Explanations: 

ఎప్పు డేబుద్ధి వుట్టునో యెరఁగరాదు

దెప్పరపు మా బ్రదుకు దేవునికే సెలవు    ॥పల్లవి॥

eppu DEbuddhi vuTTunO yeragarAdu

depparapu mA braduku dEvunikE selavu pallavi  

Word to Word Meaning: ఎప్పు డేబుద్ధి (eppu DEbuddhi) = when and where you may get what kind of thoughts; వుట్టునో (vuTTunO = puTTunO)= emerge, generate:   యెరఁగరాదు (yeragarAdu) = cannot know;  దెప్పరపు (depparapu) = intolerable, unbearable; మా (mA) = our; బ్రదుకు (braduku) = life; దేవునికే (dEvunikE) = to god only; సెలవు (selavu)          = submitted. 

Literal Meaning and Explanation: It’s impossible to know when and where our mind will slip into false thoughts. We leave our lives to the command of God lest this life be unbearable. 

We run the risk of this intolerable life because we know not what will be fall the next moment. A misconception can come and may get acted upon. Do we have the wisdom to separate good deeds from sins? 

You might have noted in the last few years many celebrities got into trouble because of one single wrong act in the past. This chorus is indicating that we normal people would commit much more (sins); we therefore must be careful. Hence it imperative that we submit will to the god. 

He wants us to go deep so that this problem gets resolved once and for all. He sets the tone for the rest of the verse, indicating that we do not have the means to distinguish virtue from sin. 

భావము & వివరణము: మనస్సు ఎప్పుడు, ఎక్కడ తప్పుడు ఆలోచనలలోకి  జారిపోతుందో  తెలియుట అసాధ్యం. వాటిని సహించలేని మా  జీవితాన్ని దైవము యొక్క ఆదేశమునకే వదిలితిమి. 

తరువాతి క్షణంలో ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి  క్షణక్షణం విపత్తు నీడలో మెసలుచున్నట్లే. ఒక తప్పుడు ఆలోచన రావచ్చు మళ్ళి దాన్ని అమలుకూడా చెయ్యొచ్చు. సద్గుణమైన చర్యలను పాపాల నుండి వేరుచేసేంత తెలివి మనకు లేదంటున్నారేమో! 

గత కొన్ని సంవత్సరాలుగా,  గతంలో చేసిన ఒకే ఒక్క చిన్న తప్పు కారణంగా చాలా మంది ప్రముఖులు ఇబ్బందుల్లో పడ్డం మీరు గమనించి ఉండవచ్చు. సాధారణ ప్రజలైన మనము ఎక్కువ తప్పులు చేసే అవకాశముందని పల్లవి సూచిస్తోంది; అందుకే భగవంతునికి మనస్సు సమర్పించడం అత్యవసరమంటున్నారు అన్నమయ్య. 

సమస్య ఒక్కసారిగా పరిష్కరించటానికి మనం లోతుగా వెళ్లాలని ఆయన అంటున్నాడు. పాపాల నుండి పుణ్యాలను వేరుచేయడానికి మనకు తగిన సామగ్రి మన దగ్గర లేదని సూచిస్తూ, మిగిలిన  కీర్తనకి ఆయన స్వరం అమర్చుతున్నాడు. 

యేడనుండి పుట్టితిమో యింతక తొల్లి యింక -

నేడకు బోయెదమో యిటమీఁదను
వీడని మాయంతరాత్మ విష్ణుఁడు మా -
జాడ జన్మమతనికే సమర్పణము  ॥ఎప్పు॥ 

yEDanuMDi puTTitimO yiMtaka tolli yiMka -

nEDaku bOyedamO yiTamIdanu
vIDani mAyaMtarAtma vishNuDu mA -
jADa janmamatanikE samarpaNamu       eppu 

Word to Word Meaning: యేడనుండి (yEDanuMDi) = from where; పుట్టితిమో (puTTitimO) = came యింతక (yiMtaka) = this; తొల్లి (tolli)  = before; యింక (yiMka) = yet; నేడకు (nEDaku) = where; బోయెదమో (bOyedamO) = go, exit;  యిటమీఁదను = (yiTamIdanu) = after this;  వీడని (vIDani) = following steadfastly;   మాయంతరాత్మ (mAyaMtarAtma) = inner world, soul; విష్ణుఁడు (vishNuDu) = Lord Vishnu;  మా (mA) = our;  జాడ (jADa) = అయిపు, చిరునామ, address; జన్మమతనికే (janmamatanikE) = to him alone;  సమర్పణము (samarpaNamu) = submitted. 

Literal Meaning and Explanation: We know not where we came from. Know not where we go here after. We know only one thing, to hold on to Lord Vishnu steadfast by submitting our will. 

Now see the link he made with the chorus. First he says there is no point delving into where we came from and where do we go hereafter. But we are curious to know. Spend lot of time speculating our past and future. 

This stanza has reference to the following Bhagavad-Gita shloka.   

अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत |
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना || 28||

avyaktādīni bhūtāni vyakta-madhyāni bhārata
avyakta-nidhanānyeva tatra kā paridevanā
 

Purport: All living things are imperceptible before birth. They are imperceptible again after death. It is only in the midst of these births and deaths they are perceptible to sense organs. It is pointless to indulge and lament for them (in this life is ever a transient condition). 

Just imagine a digital picture. We all know that it is made up of very many dots. The assemblage of dots give the appearance of the picture. The dots themselves do not have any individual effect, but their position in the picture does create one.  In a sense, we are all aggregation of that primordial matter is probably the actual sense of this stanza. 

భావము & వివరణము: మనము ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలియదు. మనము ఇక్కడకు ఎక్కడికి వెళ్తామో తెలియదు. మాకు చిత్తాన్ని సమర్పించడం ద్వారా విష్ణువు చరణాలను గట్టిగా పట్టుకోవడం అనే ఒక్క విషయం మాత్రమే తెలుసు.   

చరణాన్ని పల్లవితో  ఎలా ముడి పెట్టారో చూడండి. మొదట అతను మనం ఎక్కడి నుండి వచ్చామో, ఇకమీదట ఎక్కడికి వెళ్తామో అని ఆందోళన పడినా చేయగలిగినది యేమీలేదని చెప్పారు. కానీ మనకు తెలుసుకోవాలనే ఆసక్తి దండిగా ఉంటుంది. యీ సంగతిపై మనిషి ఊహాగానాలు చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తాడు. 

చరణం క్రింది భగవద్గీత  శ్లోకము అధారంగా వ్రాసినదను కోవచ్చు. 

శ్లో || అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ।। 2-28 ।। 

భావము: అర్జునా! ప్రాణులన్నియు పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు (అవ్యక్తములు). మరణానంతరం కూడా అవ్యక్తములే. జనన మరణాల మధ్య మాత్రమే అవి ప్రకటితములు (ఇంద్రియ గోచరములు) అగుచున్నవి. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. 

ఉదాహరణకు​ అంకాత్మక (డిజిటల్) చిత్రాన్ని ఊహించుకోండి. ఇది అనేక చిన్న చిన్న చుక్కలతో రూపొందించబడిందని మనందరికీ తెలుసు. చుక్కల సమాహారము చిత్రానికి  రూపాన్ని ఇస్తుంది. ఐతే చుక్కలు వాటికై అవి ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉండవు, కానీ చిత్రంలో వాటి స్థానమొక అనుభావాన్ని సృష్టిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, బహుశా జీవమంతా చిన్న చిన్న బిందువులైన ఆదిమ పదార్థం యొక్క సంకలనమే అని చరణం యొక్క భావం. 

గతచన్న పితరు లక్కడ నెవ్వరో

హితవై యిప్పటి పుత్రు లిదియెవ్వరో
మతి మాజీవనమెల్ల మాధవుఁడు
అతనికే మాభోగాలన్నియు సమర్పణము           ॥ఎప్పు॥ 

gatachanna pitaru lakkaDa nevvarO

hitavai yippaTi putru lidiyevvarO
mati mAjIvanamella mAdhavuDu
atanikE mAbhOgAlanniyu samarpaNamu          eppu 

Word to Word Meaning:  గతచన్న (gatachanna) = గతించినవారు, those died before; పితరులు   (pitarulu) = parents; అక్కడ (akkaDa) = in that unmanifest state; నెవ్వరో (nevvarO) = who? ( what is the relationship?) హితవై (hitavai) = being vey lovable; యిప్పటి (yippaTi) = now; పుత్రులు (putrulu) = children; ఇది (idi) = these;  యెవ్వరో (yevvarO) = who are they ( in unmanifest state?)  మతి (mati)  = by mind;  మా (mA) = our; జీవనమెల్ల (jIvanamella) = complete life; మాధవుఁడు (mAdhavuDu) = is Madhava; అతనికే (atanikE) = to him;  మా (mA)  we; భోగాలన్నియు (bhOgAlanniyu) = all the enjoyments and possessions; సమర్పణమ (samarpaNamu) = submitted. 

Literal Meaning and Explanation: What relationship the parents and  children we love dearly hold in that unmanifest state? (All these bonds are in a state of consciousness. It means that in the latent state all concepts merge together, become indistinguishable.) In our mind we are convinced that our life, our enjoyments and possessions are of  Lord Madhava. 

The bonds we have created with parents and children are not necessarily factual or rational. It does not mean we should not love parents or children. It actually means you should love them all the more without the intent of possessing (or owning) them. 

For example, we feel that a particular team should win a football match. We feel dejected if our national team does not do well. (Actually who should have got dejected? The players on the field). But observe, we the commoners, who have no direct relationship with the team, get dejected. 

Thus this association with Nation is a feeling or conditioning imbibed from the environment. Actually, if you look dispassionately, these feelings of nationalism etc are rooted in tribal origins of the man. Thus Annamacharya is asking us to introspect the relationships. 

In that implicit state, referred in the above stanza, what could  survive except love? Can we give anything but love to others in this life? 

భావము & వివరణము: మనం  అభిమానించే తల్లిదండ్రులు మరియు ప్రేమించే పిల్లలు అవ్యక్త స్థితిలో విధమైన సంబంధం కలిగి ఉంటారో? ( బంధాలన్నీ జాగృత స్థితిలోనే. అవ్యక్త స్థితిలో అన్ని భావనలూ కలిసిపోయి, గుర్తించు అవకాశముండదని అర్ధము.) మా మనస్సు, మా జీవితం, మా ఆనందాలు మరియు ఆస్తులు మాధవ మాధవునివే అని మా నమ్మకం. 

తల్లిదండ్రులు మరియు పిల్లలతో మనము సృష్టించుకున్న బంధాలు యథార్థమేనా? వారిపై ప్రేమ వాస్తవమా? అని విచారణ జరుపవలె.  మనము నిజంగా వారిని స్వంత ఆస్తిలా భావించక (స్వలాభము ఆశించక)   మరింతగా ప్రేమించాలని అర్థమేమో!!.  

ఉదాహరణకు ఒక నిర్దిష్ట జట్టు ఫుట్బాల్ మ్యాచ్ గెలవాలని మనము భావిస్తాము. మన జాతీయ జట్టు బాగా రాణించకపోతే నిరాశకు గురవుతాం. వాస్తవానికిది మనకై మనము అలవరచుకున్న అనుభూతి. మీరు ఉద్రేకం పక్కనపెట్టి, జాగ్రత్తగా చూస్తే, జాతీయత  వగైరా, వగైరా భావాలు మనిషి యొక్క గిరిజన/అటవీక మూలాల్లో పాతుకునున్నాయి అని తెలుస్తుంది. ఇదే రకంగా, మనము సృష్టించుకున్న బంధాలను విశ్లేషించుకోవాలని అంటున్నారు అన్నమయ్య. 

పైన చరణములో చెప్పినట్లు ఆ అవ్యక్త స్థితిలో మాటలకందని ప్రేమ తప్ప వేరేమి మనగలదూ?  జన్మలో ఇతరులకు ప్రేమ తప్పించి వేరేమివ్వగలము? 

తొడికి స్వర్గాదులు తొల్లియాడవో యీ -

నడచే ప్రపంచము నాకేడదో
కడఁగి శ్రీ వేంకటేశు గతియే మాది
అడఁగు మా పుణ్యపాపా లతని కర్పణము           ॥ఎప్పు॥ 

toDiki svargAdulu tolliyADavO yI -

naDachE prapaMchamu nAkEDadO
kaDagi SrI vEMkaTESu gatiyE mAdi
aDagu mA puNyapApA latani karpaNamu         eppu 

Word to Word Meaning:  తొడికి (toDiki) = ఒడిసిపట్టు కోరికలు, the desires we hold much of value; స్వర్గాదులు (svargAdulu) = like heaven and other desirable objects; తొల్లియాడవో (tolliyADavO) = what relationship I had with them before; యీ (yI) = this; నడచే (naDachE) = running;  ప్రపంచము (prapaMchamu)  = worls; నాకేడదో (nAkEDadO) = what does it hold for me? కడఁగి (kaDagi) = to venture, to strive; శ్రీ వేంకటేశు (SrI vEMkaTESu) = Lord Venkateswara; గతియే (gatiyE)  = only way; మాది (mAdi) = to us; అడఁగు (aDagu) = get suppressed;  మా (mA) = our; పుణ్యపాపాలు (puNyapApAlu) = our virtuous and sinful acts;  అతని (atani)  = to him;  కర్పణము (karpaNamu)   = we submit. 

Literal Meaning and Explanation: the heaven and other desires which we hold dearly in our heart now; where were they while you are not born? What relationship do we hold with this world? We strive and submit to have Lord Venkateswara as the only way. He will wash away all our virtuous and sinful acts. (We are free now). 

Now Annamacharya raised the fundamental question of what relationship man has to this world? Is it by accident that man is born. How can there be billions of accidents? Is it with certain purpose? What is that purpose?  From the wording of this stanza, obviously, it is not for enjoying the heaven and other comforts 

Underlying message is that first you should be aware of your duties. Refer to the saying in Bhagavad-Gita श्रेयान्स्वधर्मो विगुण: śhreyān swa-dharmo vigua (3-35) follow  your prescribed duties though tinged with faults. Are we? Rather we start acting, and then try to know. He is asking you to know first and then act. That is the world of difference in our actions and of the learned yogi. for more detailed explanation see the verse gu~r~rAla gaTTani tEru koMka keMdainA bArI

The final conclusion he made is that unless you submit to god as the only avenue, Else, you shall continue to deal with chores (virtuous and sinful acts). 

భావము & వివరణము: మనకు  ప్రియమైన స్వర్గం మరియు ఇతర కోరికలు, మనం పుట్టనప్పుడు అవి ఎక్కడ ఉండేవో? ప్రపంచంతో మనకే  సంబంధం ఉందో? వెంకటేశ్వరుడే ఏకైక మార్గం  మాది. అతనికి హృదయము సమర్పిస్తే  మన  చర్యలన్నింటినీ అణచివేస్తాడు. (మేము ఇప్పుడా పుణ్య మరియు పాపపు లంకెలు లేక స్వేచ్ఛగా ఉన్నాము). 

ప్పుడు అన్నమాచార్యులు ప్రపంచానికి మనిషికి సంబంధం ఏమనే ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తారు. యాదృచ్ఛికముగా మనిషి పుట్టాడా?  కోట్ల కొద్దీ ప్రమాదాలు ఎలా జరుగుతాయి? ప్రతీ జీవికి నిర్దిష్ట ఉద్దేశ్యం ఉందా? గమ్యం ఏమిటి? చరణం మొదటి పంక్తి నుండి స్వర్గం మరియు ఇతర సుఖాలను ఆస్వాదించడానికైతే కాదని స్పష్టం. 

దాఁగియున్న సందేశం ఏమిటంటే మొదట మీ ధర్మ మేమిటో  తెలియాలి. భగవద్గీతలోని ఆదేశము చూడండి, శ్రేయాన్ స్వధర్మో విగుణః (3-35) లోపాలతో కూడి ఉన్నా సరే, నీ సహజ ధర్మాన్ని నిర్వర్తించు. మనమలా చేస్తామా?   బదులుగా మనము చర్యలు ప్రారంభిస్తాము, ఆపై తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. మొదట తెలుసుకుని, ఆపై చర్య తీసుకోవాలని గీత చెబుతోంది. మనకు యోగులకు అదే వ్యత్యాసం. ఇంకా వివరణకు గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ  అనే కీర్తన చూడండి. 

వారి తుది పలుకు ఏమిటంటే, మీరు దైవమును ఏకైక మార్గముగా ఎఱిగి పరిపూర్ణముగా మనస్సును సమర్పించకపోతే, మరేమీ లేదు, ఇప్పటి మందకోడి (పుణ్యపాపాలతో కూడిన​) జీవితాన్ని  కొనసాగించడమే. 

zadaz 

Reference: Copper Leaf 365-3, volume: 4-383

 

3 comments:

  1. మరుక్షణంలో యేమి జరుగుతుందో,యేవిధమైన దురాలోచనలు మనస్సులో ప్రవేశిస్తాయో తెలియని దుస్సహమైన ఈ బ్రతుకును గడుపుచున్నాము. పాప, పుణ్యకర్మల విచక్షణాజ్ఞానం లేకున్నాము.అందుకే భగవంతుని ఆజ్ఞకు మన జీవితమును సమర్పణ చేయుదము.

    మనం ఎక్కడి నుంచి ఈ భూమి పైకి వచ్చామో,మరణించిన తరువాత ఎక్కడికి వెళ్తామో తెలియనివాళ్ళము.జన్మించక మునుపు మనం అగోచరం.మరణించిన తరువాత మనం అవ్యక్తం. నడుమ మాత్రం నశించే దృశ్యజగత్తును జ్ఞానేంద్రియములతో చూచుచున్నాము. వీడని మా అంతరాత్మ విష్ణువు.ఆయనకే మా చిత్తమును సమర్పించి, అయన చరణములను పట్టి వేడుకొందాము.

    ఆ అవ్యక్తస్థితిలో నున్నప్పుడు మనం అభిమానించే తల్లిదండ్రులు, ప్రేమించే సంతానంతో ఎటువంటి సంబంధం కలిగియుంటారో కదా!ఈ బంధాలన్నీ వ్యక్తస్థితిలో జాగ్రదావస్థ లో మాత్రమే అనుభవంలోకి వస్తాయి.మా జీవితం,ఈ భోగభాగ్యములెల్ల ఆ మాధవునికే సమర్పణము గావించెదము.

    ఇప్పుడు మనమనుకొంటున్న స్వర్గసుఖములు,కోరికలు మనం పుట్టక ముందు ఎక్కడ ఉన్నాయో?అప్పడు మనకీ ప్రపంచంతో ఏం సంబంధమున్నదో?శ్రీ వేంకటేశ్వరుడికి హృదయ సమర్పణము చేసిన స్వామి మన పాపపుణ్యములను కడిగివేసి బంధవిముక్తుల్ని గావిస్తాడని అన్నమయ్య ప్రభోదించు చున్నాడు
    🙏

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...