Monday 14 June 2021

60. పరము వేరొకచోటఁ బాఁతి యున్నదా (paramu vErokachOTa bAti yunnadA)

ANNAMACHARYA

60. పరము వేరొకచోటఁ బాఁతి యున్నదా 

Introduction:   In this emphatic philosophical verse, Annamacharya asserts that the unknown (the other) is not hidden elsewhere but inside you. The songs of Annamacharya echo the problems of the common people. This verse is a good example of giving them emotional clarity and inspiring them to become devotees. 

ఉపోద్ఘాతము: తాత్విక కీర్తనలో అన్నమాచార్యులు, పరము (తెలియనిది/మరొకటి) మరెక్కడో దాచబడిలేదని అది మీ లోపలే నిక్షిప్తమై ఉందని నొక్కిచెప్పారు. అన్నమాచార్యుల పాటలు సామాన్య ప్రజల సమస్యలను ప్రతిధ్వనిస్తాయి. వారికి భావ స్పష్టతనిచ్చి వారు తమవంతు కృషి చేయడానికి ఊతమిస్తాయి అనడానికి మంచి ఉదాహరణ యీ కీర్తన​. 

కీర్తన

పరము వేరొకచోటఁ బాఁతి యున్నదా

తిరమైన యీమాయ తెలియరు గాని           ॥పల్లవి॥

యెప్పుడు దేహాత్మ లెరవులుగాఁ జూచు

యెప్పు డహంకార మిటు మానును
అప్పుడు దైవము అఱచేతిలోనివాఁడు
కప్పినది కీలు గానరు గాని     ॥పరము॥ 

యెన్నఁడు సమబుద్ధి నెందఱఁ దాఁ జూచు

నెన్నఁ డాసల మీఁదనిటు రోయును
అన్ని పుణ్యములు అండనే సమకూడు
యిన్నిటా నిది విచారించరు గాని    ॥పరము॥ 

యెచ్చోట హరి భక్తి యిరవుగా మతి కబ్బు

యెచ్చోట సంశయ మిటు మానును
అచ్చోట శ్రీ వేంకటాద్రీశు కృప యుండు
మచ్చికె నిది గంటి మానరు గాని      ॥పరము॥

 

Details and Explanations: 

పరము వేరొకచోటఁ బాఁతి యున్నదా

తిరమైన యీమాయ తెలియరు గాని         ॥పల్లవి॥ 

paramu vErokachOTa bAti yunnadA

tiramaina yImAya teliyaru gAni        pallavi  

Word to Word Meaning: పరము (paramu) = the Other, (unknown); వేరొకచోటఁ (vErokachOTa) = at some other place;  బాఁతి యున్నదా  (bAti yunnadA)  has it been buried, hidden or concealed;  తిరమైన (tiramaina)  = steady, constant, unshakeable; యీ (yI) = this;  మాయ (mAya) = illusion; తెలియరు (teliyaru) = not try to understand; గాని (gAni) = but. 

Literal Meaning and Explanation: The thing called liberation is not buried elsewhere, (but  inside man). Men not aware of this unshakeable illusion (get bewildered). 

It has been imbibed by us (for centuries) that god grants liberation to people; Annamayya  dispelling this notion  by declaring as above.   It’s not GOD’s pocket money to be granted to anyone.  Neither it is kept anywhere, but placed in the mind of man.  If you see in this angle, Annamacharya appears like a revolutionary. 

Another notable inference is that this unknown is not a thing of the past. Neither it is a thing of the future. It’s available in the living present. 

భావము & వివరణము : విముక్తి అని పిలువబడే విషయం మరెక్కడా పాతిపెట్టీ లేదు (అది మనిషిలోనే నిక్షిప్తమై ఉంది). కానీ మానవులు స్ఠిరమైన భ్రమను గ్రహించక​ (దుఖమునకు లోనగుచున్నారు). 

దేవుడు ప్రజలకు విముక్తిని ఇస్తాడని (శతాబ్దాలుగా) మనకు ఊది పోశారు; అన్నమయ్య భావనను తప్పని చెప్పారు. ఇది ఎవరికైనా మంజూరు చేయడానికి దేవుని జేబులోని విత్తము కాదు. ఇది ఎక్కడా ఉంచబడి లేదు, కానీ మనిషి మనస్సులో ఉంది. కోణంలో చూస్తే అన్నామాచార్యులు విప్లవకారుడిలా కనిపిస్తాడు. 

మరో విషయం ఏమిటంటే ఇది గతానికి సంబంధించిన విషయం కాదు. అట్లని భవిష్యద్విషయమూ కాదు. ఇది ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచానికి సంబంధించినది అని గ్రహించతగును. 

యెప్పుడు దేహాత్మ లెరవులుగాఁ జూచు

యెప్పు డహంకార మిటు మానును
అప్పుడు దైవము అఱచేతిలోనివాఁడు
కప్పినది కీలు గానరు గాని   ॥పరము॥ 

yeppuDu dEhAtma leravulugA jUchu

yeppu DahaMkAra miTu mAnunu
appuDu daivamu a~rachEtilOnivADu
kappinadi kIlu gAnaru gAni            paramu 

Word to Word Meaning: యెప్పుడు (yeppuDu) = when; దేహాత్మల (dEhAtmala) = body and mind; ఇరవులుగాఁ (eravulugA) = as places of action; జూచు (jUchu) =find;  యెప్పుడు (yeppuDu) = when; అహంకారము (ahaMkAramu) = pride, arrogance, conceit; ఇటు (iTu) = this way; మానును (mAnunu) = stops, leaves;   అప్పుడు (appuDu) = then;  దైవము (daivamu) = God; అఱచేతిలోనివాఁడు (a~rachEtilOnivADu) = (is) a thing in his hand (with in his grip); కప్పినది (kappinadi) = the  thing hidden behind the curtain; కీలు (kIlu) =  The important point of a riddle; గానరు గాని (gAnaru gAni)=not seen, not looking for. 

Literal Meaning and Explanation: If a person, can find that the body and the mind are the places of the action (by the God) and who assiduously sets aside the arrogance and pride, for such person the god is within his grip. However, all of us unable to unravel the thing hidden behind this riddle. 

For most of us body is different from the mind. Is it really so? Apart from scientific proof, consider these shlokas from Bhagavad-Gita. They also confirm mind is part of the body should not be differentiated. You will appreciate that Annamcacharya & Gita are very modern; both are philosophical works belonging to the whole humanity.  

इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते |
एतद्यो वेत्ति तं प्राहु: क्षेत्रज्ञ इति तद्विद: || 2||

idaṁ śharīraṁ kaunteya kṣhetram ity abhidhīyate
etad yo vetti taṁ prāhuḥ kṣhetra-jña iti tad-vidaḥ
 

Purport: O Arjun, this body is termed as kṣhetra (the field of activities), and the one who knows this body is called kṣhetrajña (the knower of the field) by the sages who discern the truth about both. 

महाभूतान्यङ्ककारो बुद्धिरव्यक्त मेव |
इन्द्रियाणि दशैकं पञ्च चेन्द्रियगोचरा: || 13-6||

mahā-bhūtāny ahankāro buddhir avyaktam eva cha
indriyāṇi daśhaikaṁ cha pañcha chendriya-gocharāḥ

Purport: The field of activities is composed of the five great elements, the ego, the intellect, the unmanifest primordial matter, the eleven senses (five knowledge senses, five working senses, and mind), and the five objects of the senses. 

भूमिरापोऽनलो वायु: खं मनो बुद्धिरेव |
अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा || 4||

bhūmir-āpo ’nalo vāyuḥ khaṁ mano buddhir eva cha
ahankāra itīyaṁ me bhinnā prakṛitir aṣhṭadhā

PurportO Arjun, Earth, water, fire, air, space, mind, intellect, and ego—these are eight components of my material energy. 

What is the riddle, this stanza is talking of. It is simply asking to keep your body and mind open for action of God. Live a simple life without arrogance, pride and conceit. But we failed to abide by so. Is it a riddle intellectually? No. But practically we get into the trap. 

భావము & వివరణము : వ్యక్తి శరీరం మరియు మనస్సు దేవుని చర్యలకు అనువైన ప్రదేశాలు అని గ్రహించి; మరియు పొగరు, అహంకారము, అత్మాభిమానము పక్కన పెట్టి జీవనము సాగించునో, అలాంటి వ్యక్తికి దేవుడు అర చేతిలోని వాడే. అయితే, వచ్చిన చిక్కంతా మనమందరం యీ విషయము వెనుక దాగి ఉన్న గుట్టు విప్పలేకపోతున్నాము. 

మనలో చాలా మంది మనసును శరీరం కంటే భిన్నంగా భావిస్తారు. ఇది నిజమేనా? విజ్ఞాన శాస్త్రమే కాదు, మనస్సు శరీరంలోని  భాగమేనని ధృవీకరిస్తున్న భగవద్గీత నుండి క్రింది శ్లోకాలనూ పరిగణించండి. అన్నమాచార్యుల అధ్యాత్మ కీర్తనలు & భగవద్గీత​ చాలా ఆధునికమైనవని మీరు ఇట్టే పట్టేస్తారు; రెండూ మొత్తం మానవాళికి చెందిన మతాతీతమైన తాత్విక సంపత్తి. 

ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ।।13-2 ।।

భావము : అర్జునా! దేహము క్షేత్రము అని, మరియు దేహమును గూర్చి తెలిసిన దానిని క్షేత్రజ్ఞుడు అని - రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది. 

మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ
ఇంద్రియాణి దశైకం పంచ చేంద్రియగోచరాః ।।13-6 ।।

భావము: అర్జునా! పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, పదకొండు ఇంద్రియములు (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు), మరియు ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో యొక్క క్షేత్రము ఉన్నది. 

భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ।। 7-4 ।।

భావము: అర్జునా! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము - ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు. 

చరణంలో పేర్కొన్న గుట్టు ఏమిటిదైవము యొక్క కృప కొరకు మీ శరీరాన్ని మరియు మనస్సును ఎల్లవేళలా తెరిచి ఉంచమని చెప్పారుపొగరు, అహంకారము లేకుండా సరళమైన జీవితాన్ని గడపండి అన్నారు. కానీ మనము దానికి కట్టుబడి ఉండలేక పోయాము. ఇందులో మేధోపరమైన గుట్టు ఉందా? లేదే, కానీ ఆచరణలో  మనమంతా ఉచ్చులో పడతాము.

యెన్నఁడు సమబుద్ధి నెందఱఁ దాఁ జూచు

నెన్నఁ డాసల మీఁదనిటు రోయును
అన్ని పుణ్యములు అండనే సమకూడు
యిన్నిటా నిది విచారించరు గాని  ॥పరము॥ 

yennaDu samabuddhi neMda~ra dA jUchu

nenna DAsala mIdaniTu rOyunu
anni puNyamulu aMDanE samakUDu
yinniTA nidi vichAriMcharu gAni  paramu 

Word to Word Meaning: యెన్నఁడు (yennaDu)  Always; సమబుద్ధిని (samabuddhi) = equanimity; అందఱఁ  (aMda~ra) = all; దాఁ (dA) = that person;  జూచును (jUchunu) = sees (treats); ఎన్నఁడు (ennaDu) = anytime; ఆసల (Asala) = deisres; మీఁదను (mIdanu) =on;  టు ( itu) = this way; రోయును (rOyunu)  = to abhor, to get disgusted; అన్ని పుణ్యములు (anni puNyamulu) = all the virtuous things;  అండనే (aMDanE) = immediately beside; సమకూడు (samakUDu) = gets assembled; యిన్నిటాను (yinniTAnu)  = in everything; ది (idi) = this; విచారించరు గాని (vichAriMcharu gAni) = not debated internally to find correct/ appropriate action. 

Literal Meaning and Explanation: When a person is treating all the people with equanimity, abhors getting engaged by desires has performed all the virtuous deeds However, not many debate within themselves and act as described above. (Therefore they remain ignorant). 

What Annamacharya is saying that most people act according to their conditioning   (reaction), not a thoughtful action. This is a very significant observation. Through education man is expected to behave more rationally, actually modern education has failed to inculcate rationality in behaviour of man. This is not a failure of one system, but whole system of education all over the world. 

Education failed to bring that fundamental change in action of man. What is that which can transform man from inside? How can he thoughtfully act, every moment?  This is the fundamental question Annamacharya is posing to all of us. Please refer to this verse మొదలుండఁ గొనలకు - మోచి నీళ్ళు వోయవేల as well for more clarity. 

Sir, please understand that this 500 year old verse posing a serious question to the the intellectuals. 

Now consider, is it possible to act with equanimity without driving out the arrogance, pride, desires? 

భావము & వివరణము : ఒక వ్యక్తి ప్రజలందరితో సమబుద్ధితో ప్రవర్తిస్తున్నప్పుడు, తనలో ఉదయిస్తున్న కోరికల పట్ల రోఁత/విముఖత కలిగి ఉంటే  అన్ని సత్కార్యాలను చేసినట్లే. అయినప్పటికీ, మనలో చాలా మంది పైవన్నీ గాలికి వదలితమ ఇచ్చవచ్చినట్లు వ్యవహరిస్తారు.(అందువల్ల వారు అజ్ఞానంలోనే ఉండిపోతారు). 

చాలా ముఖ్యమైన పరిశీలన  చేశారు అన్నమాచార్యులు. చాలా మంది ప్రజలు స్థితివ్యాజమునకు (స్థితి కలిగించు భ్రమకు) లోనై ప్రతిక్రియలలోనే వ్యవహరిస్తారు, ఆలోచనాత్మక చర్యలతో కాదు. విద్య మనిషిలో మరింత హేతుబద్ధత పెంపొందిస్తుందని  ఆశించినప్పటికీ, వాస్తవానికి ఆధునిక విద్య మనిషి ప్రవర్తనలో హేతుబద్ధతను పెంపొందించడంలో విఫలమైంది. ఇది  కేవలము ఒక దేశములోని వ్యవస్థ యొక్క వైఫల్యం కాదు, ప్రపంచవ్యాప్తంగా   కూడా దాదాపు  ఇదే స్థితి అని సులభంగా గమనించవచ్చు. 

విద్య మనిషిలో మర్పు తేలేక పోయింది కాబట్టి, మనిషిలో లోలోపలి నుంచీ మర్చగలిగినదేమిటోఇదే ప్రతీ క్షణము ఆలోచనాత్మక చర్యలతో మనుగడ సాగింప చేయునదేమిటో (భక్తి  అనగా నేమిటో) తెలియమంటున్నారు. ఇంకొంచెం వివరణకు కీర్తన మొదలుండఁ గొనలకు - మోచి నీళ్ళు వోయవేల కూడా చూడండి. 

మనిషిని తరతరాలుగా వేధిస్తున్న సమస్యలకు మనకు తెలిసిన విద్యలన్నీ కొరగానివని ఎఱిగి అడుగుతున్న హృదయమే కీర్తన​!! ఇది మేధావులు అనుకునే వారందరికీ పెను సవాలు!!

అహంకారము, గర్వము మరియు అత్మాభిమానములను తరిమికొట్టకుండా సమానత్వంతో వ్యవహరించడం సాధ్యమేనా? ఆలోచించండి!! 

యెచ్చోట హరి భక్తి యిరవుగా మతి కబ్బు

యెచ్చోట సంశయ మిటు మానును
అచ్చోట శ్రీ వేంకటాద్రీశు కృప యుండు
మచ్చికె నిది గంటి మానరు గాని     ॥పరము॥ 

yechchOTa hari bhakti yiravugA mati kabbu

yechchOTa saMSaya miTu mAnunu
achchOTa SrI vEMkaTAdrISu kRpa yuMDu
machchike nidi gaMTi mAnaru gAni        paramu 

Word to Word Meaning: యెచ్చోట (yechchOTa) హరి భక్తి (hari bhakti) = devotion to Hari;  యిరవుగా (yiravugA) = steadily;  మతి కబ్బు (mati kabbu) = get into mind;  యెచ్చోట (yechchOTa) సంశయ (saMSayamu) మిటు ( iTu) మానును (mAnunu) = gets dispelled; అచ్చోట (achchOTa) = that place;  శ్రీ వేంకటాద్రీశు (SrI vEMkaTAdrISu) = Lord venkateswara; కృప యుండు (kRpa yuMDu) = blessings are available; మచ్చికె (machchike) = due to long familiarity, habit; నిది (nidi) = this  గంటి ((gaMTi) = దుఃఖము,  sorrow; మానరు (mAnaru) = do not stop, do not put an end;  గాని (gAni) = but.  

Literal Meaning and Explanation: Where devotion to Hari constantly gets into mind; where mind is clear without doubts, there blessings of Lord Venkateswara are always available. However, Men, due to their habit do not put an end to sorrow.  

Annamacharya is very clear that humans for inexplicable reasons fail to pursue the lotus feet of the God, despite such exceeding clarity given by wisemen for long time. Greatness of Annamcahrya  is  not because of  the sermons, but he empathises with the audience on their problems. The songs of  Annamacharyas  resonate the problems of the common people; raise new hopes for better tomorrow and wrap their hearts like flowers and bring solace that no book could provide. 

భావము & వివరణము : ఎచ్చోట హరి భక్తి స్థిరముగా ఉండునో; మనస్సు సందేహాలు లేకుండా స్పష్టంగా ఉండునో, వెంకటేశ్వరుని ఆశీర్వాదం లభిస్తుంది. అయినప్పటికీ, పురుషులు, వారి అలవాటు కారణంగా దుఃఖాన్ని అంతం చేసుకోరు. 

వందలాది సంవత్సరాలుగా జ్ఞానులు ఇచ్చిన స్పష్టత ఉన్నప్పటికీ, మానవులు వివరించలేని కారణాల వల్ల  భగవంతుడి పాదాలను చేరి వేడుకోవడములో విఫలమవుతారు అన్నారు అన్నమాచార్యులువారి  గొప్పతనం ఉపన్యాసాల్లో లేదు. అన్నమాచార్యులు సామాన్యుల సమస్యలపై సహానుభూతి చెందుతూ చెప్పిన పాటలు రేపటి ఉదయం కోసం కొత్త ఆశలను రేపుతూ పూలతీగల్లాగ వారి హృదయాలను చుట్టుకొని పుస్తకమూ ఇవ్వలేని విధంగా  ఓదార్పుని కలిగిస్తాయి.

 

zadaz

 

 

Reference: Copper Leaf 7-5, volume: 15-42

  

3 comments:

  1. ముక్తి యెక్కడనో దాగియుండలేదు.అది మనిషి యొక్క అంతఃకరణమందే నిక్షిప్తమైయున్నది.ఈ స్థిరమైన మాయను ఎఱుగలేక మనిషి దుఃఖములకు గురి యగుచున్నాడు.
    మనోదేహములు దైవసృష్టి యని తెలిసిన వానికి, దేహాభిమానము, అహంకారదర్పములను త్యజించిన వానికి భగవంతుడు అరచేతిలోనే ఉంటాడు.కాని మనమంతా ఈ గుట్టును గ్రహించలేకున్నాము.
    జీవులన్నిటినీ సమ్యక్ దృష్టితో చూచి,కోరికల యందు నిరాసక్తుడైన వాడు సకల సద్గుణకర్మల నాచరించిన వానితో సమానం.కాని మనలో పెక్కుమంది దీనిని గ్రహీంపక తమ ఇష్టానుసారం ప్రవర్తించి అజ్ఞానతిమిరమందే కొట్టుమిట్టాడుతుంటారు.

    ఎక్కడైతే మనస్సులో యెట్టి సందేహాలకు తావు లేకుండా హరిభక్తి స్థిరముగా ఉంటుందో, అక్కడ శ్రీ వెంకటేశ్వరుని కరుణాకటాక్షము లుంటాయి.కాని మనిషి అజ్ఞానవశమున మోక్షదాయకమైన శ్రేయోమార్గమును అనుసరించక, దుఃఖభాజనమైన ప్రేయోమార్గమును అనుసరించుచున్నారని అన్నమయ్య ఈ కీర్తనలో ఉపదేశిస్తున్నాడు.

    భగవద్గీతయందు దేహాత్మల గురించిన జ్ఞానమును, దేహముయొక్క తత్త్వములను పరమాత్మ సవివరంగా బోధించియున్నాడు.వాటి యొక్క ప్రస్తావన ఇక్కడ చేయటం సముచితమైనది
    🙏

    ReplyDelete

  2. ఓంశ్రీసాయినాధాయనమః

    సద్గురుసాయి సత్చరిత్రలో 20వ అధ్యాయములో దాసగుణు అనే భక్తుడికి ఈశావ్యాసోపనిషత్తు కు అర్ధంనేర్పిస్తూ ఎవ్వరయుతే అన్ని జీవులను ఆత్మగా భావించునో అట్టివాడు మోహము ద్వేషభావము లోనుగాడని అట్టి స్థితిలో అంతయు భగవంతుని సృష్టిగా అగౌపించునని నేర్పించారు.

    Following are the related slokas.




    5. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా

    ఆప్నువన్ పూర్వమర్షత్!

    తద్ధావతోఁ న్యానత్యేతి తిష్ఠ

    త్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి!!

    తత్ - ఆ ఆత్మ; ఏకం - ఒకటే; అనేజత్ - చలనములేనిది; మనస: - మస్సుకంటే; జవీయ: - వేగవంతమైనది; దేవా: - ఇంద్రియములు; ఏనత్ - దీనిని; నఆప్నువన్ - గ్రహించలేవు; పూర్వం అర్షత్ - మనస్సుకంటే ముందు వెళ్లింది; తత్ - అది; తిష్ఠత్ - స్థిరంగా వుంటూ; దావత: -పరుగెత్తుతూవున్న; అన్యాన్ - ఇతర విషయాలను; అత్యేతి - దాటిపోతుంది; తస్మిన్ - అది వుండడంచేత; మాతరిశ్వా - విశ్వాశక్తి అంటే ప్రాణశక్తి; ఆప: - ప్రాణులయొక్క కార్యకలాపమంతా; దధాతి - భరిస్తోంది.

    ఆత్మ ఒక్కటే చలించనిదైనా కనస్సుకంటే వేగవంతమైనది. మనస్సుకన్నా ముందే వెళ్లగలదు కనుక అది ఇంద్రియాలకు అందదు. నిత్యమూ స్థిరమైన దైనా పరుగెత్తే అన్నిటికన్నా వేగవంతమైనది. ఆత్మ సకలప్రాణికోటుల కార్యకలాపాలను భరించటానికి ప్రాణశక్తిని సమకూరుస్తోంది.



    6. త దేజతి తన్నైజతి త ద్దూరే తద్వంతికే!

    త దన్తరస్య సర్వస్య త దు సర్వ స్యాస్య బాహ్యత:!!

    తత్ - అది; ఏజతి - చలించుచున్నది; తత్ - అది, న ఏ జతి - చలించదు; తత్ - అది; దూరే - దూరంలో వుంది; తత్ - అది, ఉ అంతికే - దగ్గరకూడా వుంది; తత్ - అది; ఉ - ఇంకా; అంతరస్య - లోపల; సర్వస్య అస్య - సర్వత్ర వుంది; బాహ్యత: - బయట కూడా వుంది.

    ఆత్మ చలిస్తోంది, చలించదు. అది దూరంలో వుంది, దగ్గర కూడా వుంది. అది లోపలా బయటా అంతా వుంది.



    7. యస్తు సర్వాణి భూతాన్యాత్మ న్యేవాను పశ్యతి!

    సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే!!

    య: - ఎవరైతే; తు - మరి; సర్వాణి - సమస్త; భూతాని - జీవులన, ఆత్మని ఏవ - ఆత్మయందే; అనుపశ్యతి - దర్శించునో; చ - మరియు; సర్వభూతేషు - అన్ని జీవులయందు; ఆత్మానాం - ఆత్మను; తత: - అందుచేత; నవిజుగుప్సతే - ద్వేషింపడు

    అన్ని జీవులు తన ఆత్మకంటే వేరైనవి కావనీ, తన ఆత్మే అన్ని జీవులలోని ఆత్మగా దర్శించే వాడు దేనిని ద్వేషింపడు.



    8. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మై వాభూ ద్విజానత: !

    తత్రకో మోహ: క: శోక: ఏకత్వ మనుపశ్యత: !!

    యస్మిన్ - ఎప్పుడైతే; విజానత: - విజ్ఞానానికి; ఆత్మ ఏవ - ఆత్మయే; సర్వాణి - సమస్త; భూతాని - జీవులు; అభూత్ - అయినదో; తత్ర - అప్పుడు; ఏకత్వం - ఐక్యతను; అనుపశ్యత: - దర్శించే అతనికి; క: - ఏమిటి; మోహ: - మోహము; క: - ఏమిటి; శోక: - శోకము.

    అన్ని జీవులను తన ఆత్మగానూ, చరాచర జగత్తును ఆత్మయొక్క ఏకత్వంగాను దర్శించే ఆత్మజ్ఞానికి మోహమేమిటి? శోకమేమిటి?

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...