ANNAMACHARYA
56. తెలియరాదు నీమాయ తెరమరఁగు
Introduction: in this deep philosophical verse, Annamacharya is describing the attributes of the god. Though god is there everywhere, he hides his presence behind a veil. He says entire universe is following the god. You cannot win the heart of God by mere words, but by action of transformation of heart.
ఉపోద్ఘాతము: ఈ లోతైన తాత్విక కీర్తనలో, అన్నమాచార్య దేవుని లక్షణాలను వివరిస్తున్నాడు. దేవుడు ప్రతిచోటా ఉన్నప్పటికీ, తన ఉనికిని తెర వెనుక దాచిపెడతాడు. విశ్వం మొత్తం దేవుణ్ణి అనుసరిస్తోందని ఆయన అన్నారు. మీరు ”దేవుని హృదయాన్ని కేవలం మాటల ద్వారా గెలవలేరు, కానీ హృదయ పరివర్తన ద్వారా గెలువవచ్చు” అన్నారు.
కీర్తన
తెలియరాదు నీమాయ తెరమరఁగు పెక్కు-
చూడఁగ నీజగత్తుకు సూత్రధారివి నీవు
మఱపించాఁ దలఁపించా మర్మజ్ఞుఁడవు నీవు
అందరిమొర లాలించి అట్టె రక్షింతువు నీవు
Details and Explanations:
తెలియరాదు నీమాయ తెరమరఁగు పెక్కు-
teliyarAdu nImAya teramaragu
pekku-
Word to Word Meaning: తెలియరాదు (teliyarAdu) = impossible to know; నీమాయ (nImAya) = illusion created by you; తెరమరఁగు (teramaragu) = hidden behind a veil; పెక్కు(pekku) = multiple, many; వలలఁ (valala) = a trap, a snare; జిక్కక (jikkaka) = not get cought; నిన్నే (nine) = You only; కొలువఁగవలయు (koluvagavalayu) = should pray ( or meditate upon).
Literal
Meaning and Explanation: It’s impossible to get out of the illusion created by
you as it is tucked behind a veil. Man instead of getting snared by these
mountain of traps, must steadfastly pray to you.
The only avail man has is meditation. Here Annamacharya meant by prayer is not recitation of name of god, but transformation of heart, a paradigm shift in his thinking and outlook. As noted many times earlier, all other actions man resorts are born out of ignorance. Therefore they lead to bondage.
This chorus has roots in the following Bhagavad-Gita shloka.
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया |
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते || 7-14||
daivī hyeṣhā guṇa-mayī mama māyā duratyayā
mām eva ye prapadyante māyām etāṁ taranti te
Purport: My divine energy Maya, consisting of the three modes of
nature, is very difficult to overcome. But those who surrender unto me cross
over it easily.
భావము & వివరణము : ఓ దేవా నీవు సృష్టించిన యీ ముసుగుల తెరల వెనుకన పడియున్న మేము నిన్ను తెలియలేము. యీ జిత్తుల నుంచి తప్పించుటకు (తిరిగి) నిన్నే శరణనవలెను.
మనిషికి ఉన్న ఏకైక సాధనము ధ్యానము. ఇక్కడ అన్నమాచార్యులు ప్రార్థన ద్వారా ప్రస్తావించినది దేవుని పారాయణం కాదు, హృదయ పరివర్తన. మనిషి ఆలోచన మరియు దృక్పథంలో ఒక మౌలికమైన మార్పు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్లుగా, మనిషి చేసే అన్ని ఇతర చర్యలన్ని అజ్ఞానం నుండి పుట్టాయనుకోవచ్చు. అందువల్ల అవి బంధాలకు దారి తీసి మనిషిని మరిపింపచేస్తాయి.
ఈ పల్లవి క్రింది భగవద్గీత శ్లోకము మీద అల్లినదనుకోవచ్చు.
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ।। 14 ।।
భావము : ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి, 'మాయ', అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ, నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు.
చూడఁగ నీజగత్తుకు సూత్రధారివి నీవు
chUDaga nIjagattuku
sUtradhArivi nIvu
Word to Word Meaning: చూడఁగ (chUDaga) = on keen
observation; నీజగత్తుకు (nIjagattuku) =
this world, this universe; సూత్రధారివి (sUtradhArivi) = you are the
director; నీవు (nIvu) = you’ జోడై (jODai) =
accompanying it ( faithfully); నీసూత్రాన (nIsUtrAna) on
your footsteps; నాడుచును (nADuchunu) =
running/acting; సర్వంబునున్నది (sarvaMbununnadi) = everything else; యేడఁ జూచిన (yEDa jUchina) =
wherever; (anywhere); నీవుందు (nIvuMdu) you
are present; వెవ్వరికిఁ (vevvariki) =
to any one; గానరావు (gAnarAvu) = not seen; వోడక (vODaka) = but not giving in; స్వతంత్రము (svataMtramu) =
independence; ఒకరిపై (okaripai) = on
someone else; వేతువు (vEtuvu) = place (to
coy).
Literal Meaning and Explanation: On close observation I find you are the director of this universe. Rest everything is closely following on your footsteps. You are there everywhere. Yet not seen by anyone. In order conceal your presence; you make others appear as independent.
All the actions of god are routed in compassion. Yet we can feel his actions indirect fashion only, because he always makes someone else appear as true actor.
We all belong to the mass following the independent actor called
God. There is no way we can feel the god from this dependent position.
Therefore, to feel to communion the god we must lose the individuality is the
essence of this stanza.
భావము & వివరణము : పరిశీలించి చూడగా ఈ విశ్వాన్ని నడిపేది నీవే అని, మిగిలినదంతా నీ అడుగుజాడలను నిశితంగా అనుసరిస్తోంది అని తెలుస్తోంది. నువ్వు ప్రపంచమంతా వ్యాపించియున్నా, యెవరికీ కనబడవు. నీ ఉనికిని మరుగున ఉంచడానికి; నువ్వు ఇతరులను స్వతంత్రంగా కనిపించేలా చేస్తావు.
భగవంతుని చర్యలన్నీ కరుణతో నిండియుంటాయి. అయినప్పటికీ మనము ఆయన చర్యలను పరోక్షంగానే తెలియగలము, ఎందుకంటే ఆయన ఎప్పుడూ వేరొకరిని నిజమైన కర్తగా అగుపించేలా చేస్తాడు.
దేవుడు అనే స్వతంత్రుణ్ణి అనుసరిస్తున్న మనమందరం జడ పదార్ధానికి చెందినవాళ్లం. ఈ అస్వతంత్ర స్థానము నుండి స్వతంత్రుణ్ణి అనుభూతి చెందడానికి మార్గం లేదు. అందువల్ల, భగవంతునితో కలవడానికి మనం వ్యక్తిత్వాన్ని కరగించి వేయాలి అని ఈ చరణం యొక్క సారాంశం.
మఱపించాఁ దలఁపించా మర్మజ్ఞుఁడవు నీవు
ma~rapiMchA dalapiMchA
marmaj~nuDavu nIvu
Word to Word Meaning: మఱపించాఁ (ma~rapiMchA) = to make forget; దలఁపించా (dalapiMchA) = to make remember; మర్మజ్ఞుఁడవు (marmaj~nuDavu) = రహస్యమెఱిగినవాఁడు, you know the secret; నీవు (nIvu) = you; గుణియై (guNiyai) = Endowed or gifted with good qualities; నీసంకల్పము (nIsaMkalpamu) = design, plan; కొలఁదే (koladE) = as per; యీజీవులెల్లా (yIjIvulellA) = these beings; మఱి (ma~ri nI) = and then; నీ వీశ్వరుఁడవు (vISvaruDavu) = you are the God; మాఁటలకుఁ (mATalaku) = for words; జిక్కవు (jikkavu) = not possible catch/hold onto ; కఱకరి (ka~rakari) = చలము, కలత, revenge, outrage; నితరులఁ (nitarula) = others; గర్తలఁగాఁ (gartalagA) = as actors; జేతువు (jEtuvu) = make ( believe)
Literal
Meaning and Explanation: You
make us remember or forget you. (We know not the secret). Being bestowed with
great qualities, these beings (of this universe) are there by your design/plan.
I also understand that you cannot be won by mere words. As if in revenge, you
make others appear as actors (though truly they are not).
Remembrance or forgetting are part of the inertial body. Actions
emanating from these are action steeped
in past. Thus the speech is also
function of the past. that is the reason when Annamacharya say god you cannot be won by mere wording. It is the
transformation heart which takes man closer to god.
భావము & వివరణము : నీవే మమ్ము (నిన్ను) గుర్తుంచుకునేలా లేదా మరచిపోయేలా చేస్తావు. (ఎందుకో మాకు తెలియదు). గొప్ప గుణాలతో, ఈ విశ్వంలోని జీవులన్ని నీ రచన మేరకే సంభవిస్తున్నాయి. నిన్ను కేవలం మాటల ద్వారా గెలవలేమని నేను అర్థం చేసుకున్నాను. కావాలని ఇతరుల నెవరినో (నిజంగా వారు కాకపోయినా) చేయువారిగా కనిపించేలా చేస్తావు.
జ్ఞాపకం లేదా మరచిపోవడం జడత్వ శరీరంలో భాగాలే. వీటి మీద అధారపడిన చర్యలన్ని గతంతో కూడిన చర్యలే.అదే ప్రకారంగా ప్రసంగం కూడా గతంలోని చర్యే. దేవుణ్ణి కేవలం మాటల ద్వారా గెలవలేరు అని చెప్పడానికి కారణమూ అదే. మనిషి హృదయ పరివర్తన మాత్రమే దేవునికి దగ్గర చేస్తుంది.
అందరిమొర లాలించి అట్టె రక్షింతువు నీవు
కందువ శ్రీవేంకటేశ కానవచ్చె నీమహిమ
చెంది వరము లిత్తువు చేతికి సులభుఁడవు
సందడి నెవ్వరినైనా సరిగా మన్నింతువు ॥తెలి॥
aMdarimora
lAliMchi aTTe rakshiMtuvu nIvu
kaMduva
SrIvEMkaTESa kAnavachche nImahima
cheMdi
varamu littuvu chEtiki sulabhuDavu
saMdaDi
nevvarinainA sarigA manniMtuvu ॥teli॥
Word to Word Meaning: అందరిమొరలు (aMdarimoralu) = petitions of all people; ఆలించి (AliMchi) = will consider; అట్టె (aTTe) = in no time; రక్షింతువు (rakshiMtuvu) = you save; నీవు (nIvu) = you; కందువ (kaMduva) = జాడ, trace; శ్రీవేంకటేశ (SrIvEMkaTESa) = Lord Venkateswara; కానవచ్చె (kAnavachche) = able to feel; నీమహిమ (nImahima) = your చెంది (cheMdi) వరములు (varamulu) = boon(s); ఇత్తువు (ittuvu) = grant; చేతికి (chEtiki) సులభుఁడవు (sulabhuDavu) సందడి (saMdaDi) = in the thick of crowd (implying he understands each and every one in billions of population) ; నెవ్వరినైనా (nevvarinainA) = anyone (how deep sinner he may be); సరిగా (sarigA) = appropriately; మన్నింతువు (manniMtuvu) = treat with respect.
Literal Meaning and Explanation: You are so careful and deal directly with all the beings though they are innumerable. You take petitions of all the beings and save them. I can see the trace of you Lord Venkateswara. It’s your majesty that you bestow boons to the people easily.
God acts in benevolence. He is directly addressable by each and every being in this world is the true essence of this stanza. . He cannot be seen different from action. His action is altruism.
భావము & వివరణము : జీవులు అసంఖ్యాకంగా ఉన్నప్పటికీ ప్రతీ జీవితో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ప్రత్యక్షంగా రక్షిస్తావు. అందరి మొరలు ఆలించి మన్నింతువు. వెంకటేశ్వరుని జాడ కనబడుతోంది. ప్రజలకు సులభంగా వరాలు ఇవ్వడం నీ ఘనత.
భగవంతుడు దయామయుడు, కరుణామయుడు. ఈ ప్రపంచంలోని ప్రతి జీవి ఆయనతో ప్రత్యక్ష సంబంధము కలిగి ఉందనేది నిర్వివాదాంశము. భగవంతుడు తన చర్యల ద్వారానే ప్రస్పుటమౌతాడు. ఆయన ఆయా చర్యల కంటే భిన్నంగా వ్యక్తమవడు.
zadaz
Reference: Copper Leaf 169-3, volume: 2-335
Thank you for sharing and explaining the verses !
ReplyDeleteపరమాత్మ స్వరూప, స్వభావములను చక్కగా వివరిస్తున్నది అన్నమాచార్యుల వారి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కీర్తన.
ReplyDeleteఈ మయాసృష్టికి కర్తవు నీవు.అజ్ఞానమనే మాయాతెఱకు ఈవల మేముంటే తెఱకు ఆవల జ్ఞానస్వరూపమైన నీవున్నావు.తెఱ కు ఈవల మాయ యనే అజ్ఞానంలో చిక్కుకున్న మేము తెఱ కు నావల జ్ఞానస్వరూపమై యున్న నిన్ను కానరాకున్నాము.నిన్ను తెలియరాకున్నాము.బంధకారకమైన ఈ సంసారమనే వలలో చిక్కక మనిషి పరమాత్మనే ధ్యానించుచూ, శరణు వేడాలి.
భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగం-14 వ శ్లోకంలో భగవానుడు త్రిగుణస్వరూపమైన నా యీ దైవమాయను దాటడం సామాన్యులకు శక్యము గానిది.కాని నన్నే ఆశ్రయించిన వాళ్లు దానిని అతిక్రమిస్తారని బోధించాడు.
సమస్త విశ్వాన్ని సృష్టించి, నడిపించునది నీవే. నీవే జగన్నాటక సూత్రాధారివి!సర్వ స్వతంత్రుడవైన నిన్నే జగత్తంతా అనుసరిస్తున్నది.సర్వవ్యాపి వైననూ నీవు ఎవరికీ కానరావు.దేహమే నేనన్న అవివేకి, స్వతంత్రుడు అయిన వానికి నీవు మరుగైయుంటావు.అత్మానాత్మ విచక్షణ కలిగియున్న వివేకికి నీవు తెలియబడతావు.
జ్ఞప్తి,మఱపు లనేవాటి యొక్క మర్మమును యెరిగినవాడవు నీవే.త్రిగుణాలచే నీచే సృష్టింపబడిన సర్వభూతములు నీయొక్క ప్రణాళిక,సంకల్పం వల్లనే నడుచుకుంటున్నాయి.కేవలం మాటల ద్వారా నిన్ను తెలుకోవటం సాధ్యం కాదు.అంటే ఏకాగ్రచిత్తంతో నీయందు మనస్సును లగ్నం చేయువారికి మాత్రమే పరమాత్మవైన నిన్ను తెలుసుకొనగలము.చేయించునది నీవే అయినా చేసేది మేమే యన్న భ్రాంతిని కలుగజేస్తున్నావు. జగన్నాటకం లో మేము నటులమే కాని సూత్రదారివి నీవే.
సర్వప్రాణులను సృష్టించిన నీవే వాటి మొర లాలకించి, రక్షించే బంధువు నీవు.నీయొక్క జాడను నే కనుగొంటిని.భక్తవరదుడ వీవు.అదియే నీ ఘనత అని అన్నమయ్య ఈ కీర్తనలో శ్రీ వెంకటేశ్వరుని కీర్తిస్తున్నాడు.
🙏