Wednesday 24 March 2021

33. గుఱ్ఱాలఁ గట్టని (gu~r~rAla gaTTani)

 

ANNAMACHARYA

33. గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ

 

Introduction, Annamacharya In this cleverly worded verse, says man in his arrogance, without pausing for a moment, assumes the position of the rider for the horseless vehicle called body. 

He is critical of this unwanted liberty taken by man. Annamacharya wants all of us to introspect who should be the true rider? Which is the vehicle? Without freedom of mind, the rider is less likely to explore this beautiful inner world. 

ఉపోద్ఘాతము: చమత్కారమైన కీర్తనలో మనిషి అహంభావం కొలది, క్షణం కూడా ఆలోచించకుండా, తానే రౌతునని గుఱ్ఱాలు లేని దేహమనే వాహనాన్ని  అధిరోహిస్తాడు అంటారు అన్నమాచార్యులు. 

మనిషి  గర్వంతో చేతిలో తీసుకున్న స్వేచ్ఛను అన్నమాచార్యులు విమర్శించారు. ప్రతీ ఒక్కరూ, అసలైన రౌతు (సారథి) ఎవరు, నిజమైన రథమేది  అని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. భగవంతుని కృప లేకుండా అత్యద్భుతమైన ఆత్మావలోకనం పైపైనే మిగిలి అసంపూర్ణమగునని సూచించారు. 

గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ

విఱ్ఱవీఁగుచుఁ దీసీని వేడుకతో జీవుఁడు            ॥పల్లవి॥

 

gu~r~rAla gaTTani tEru koMka keMdainA bArI
vi~r~ravIguchu dIsIni vEDukatO jIvuDu         pallavi 

Word to word meaning: గుఱ్ఱాలఁ (gu~r~rAla) = horses;  గట్టని (gaTTani) = not tied; తేరు = car, vehicle;  కొంకక = without hesitation;  ఎందైనాఁ  = any where; బారీ = to run; having it moved;  విఱ్ఱవీఁగుచుఁ  (vi~r~ravIguchu) = wanton pride; దీసీని (dIsIni) = take out; వేడుకతో (vEDukatO) = జీవుఁడు (jIvuDu) = living being. 

Literal meaning: On this horseless vehicle, without any hesitation, with pride (that he knows or  he can tackle), man takes up the journey.  

Implied meaning: man's very assumption that he is the rider is lopsided. Man's life goes astray due to this wrong assumption 

భావము: గుఱ్ఱాలు లేని దేహమనే వాహనాన్ని కొంచెమైనా జంకు కొంకు లేకుండా, ఎక్కడికైనా విఱ్ఱవీఁగుచూ జీవుడు నడిపిస్తాడు. 

విశేష  భావము: నర రథానికి నేనే వాహకుడననే అపోహతో మానవుడు సవారీ చేస్తూ దారితప్పుతాడు. 

సరి పిఱుఁదే రెండు జంటబండికండ్లు

సరవితోఁ బాదాలు చాఁపునొగలు
గరిమఁజూపులు రెండు గట్టిన పగ్గములు
దొరయై దేహరథము దోలీఁబో జీవుఁడు   ॥గుఱ్ఱాల॥ 

sari pi~rudE reMDu jaMTa baMDi kaMDlu

saravitO bAdAlu chApu nogalu
garima jUpulu reMDu gaTTina paggamulu
dorayai dEharathamu dOlIbO jIvuDu       gu~r~rA

Word to word meaning: సరి (sari) = even;  పిఱుఁదే (pi~rudE) = buttocks; రెండు (reMDu) = two; జంట (jaMTa) = pair; బండికండ్లు (baMDi kaMDlu) = head lights of the vehicle; సరవితోఁ (saravitO) =  regularly; బాదాలు (bAdAlu) =  legs;  చాఁపు (chApu) = to stretch; నొగలు (nogalu) = రథాల ముందు భాగాలు; front part of a horse pulled cart/chariot;  గరిమఁ జూపులు =  momentous looks; రెండు (reMDu) = two; గట్టిన = tied; పగ్గములు = reins;  దొరయై = being governor, master, owner;  దేహరథము = this vehicle called body; దోలీఁబో = drive; జీవుఁడు = the living being; 

Literal meaning: The man assumes he is owner and rides the  vehicle called body   taking buttocks as the head lights, the legs as the front,  the eyes as the reins for this vehicle. 

Comments: By comparing the buttokcks with the headlights, Annamacharya indicated the man’s mind is occupied by passion for sex. 

భావము: పిరుదులే బండి  దీపాలు ( హెడ్ లైట్),  కాళ్లు ముందు భాగాలు, గరిమ చూపులు పగ్గాలుగా చేసుకుని తానే దొరననుకుంటూ జీవుడు దేహమనే రథంపై స్వారీ చేస్తాడు. 

వ్యాఖ్యలు : పిరుదులను బండికండ్లు అని చెప్పి మనిషి జీవితాన్ని కామము ఎంత ప్రభావితము చేస్తున్న సంగతి  ప్రస్తావించారు. 

పంచమహాభూతములు పంచవన్నెకోకలు

పంచల చేతులు రెండు బలుటెక్కెలు
మించైన శిరసే మీదనున్న శిఖరము
పంచేంద్రియరథము పఱపీఁబో జీవుఁడు         ॥గుఱ్ఱాల॥ 

paMchamahAbhUtamulu paMchavannekOkalu

paMchala chEtulu reMDu baluTekkelu
miMchaina SirasE mIdanunna Sikharamu
paMchEMdriyarathamu pa~rapIbO jIvuDu          gu~r~rA 

Word to word meaning: పంచమహాభూతములు (paMchamahAbhUtamulu) పంచవన్నెకోకలు (paMchavannekOkalu) = పంచల చేతులు (paMchala chEtulu) = hands on either side;  రెండు( reMDu) = two;  బలుటెక్కెలు (baluTekkelu) = strong flags ( on either side);   మించైన (miMchaina) = beyond this;  శిరసే (SirasE) = the head; మీదనున్న శిఖరము (mIdanunna Sikharamu) = pinnacle; పంచేంద్రియరథము ( paMchEMdriyarathamu) = this car made up of five sensory organs;  పఱపీఁబో pa~rapIbO) = = cause to run/spread;  జీవుఁడు (jIvuDu) = the living being. 

Literal meaning: The man runs this vehicle called body taking the five elements as the ornamental robes, his hands as direction indicators, and his head as the crown pinnacle. 

భావము: పంచ భూతముల నుంచి తయారైన పంచవన్నెల కోకలు రథానికి అమర్చి, చేతులు జెండాలుగాను శిరస్సును శీర్షముగాను భావించి నడుపుతాడు. 

పాపపుణ్యములు రెండు పక్కనున్నచీలలు

తోపుల యన్నపానాలు దొబ్బుఁదెడ్లు
యేపున శ్రీవేంకటేశుఁ డెక్కి వీథుల నేఁగఁగ
కాపాడి నరరథము గడపీఁబో జీవుఁడు ॥గుఱ్ఱాల॥ 

pApapuNyamulu reMDu pakkanunnachIlalu

tOpula yannapAnAlu dobbudeDlu
yEpuna SrIvEMkaTESu Dekki vIthula nEgaga
kApADi nararathamu gaDapIbO jIvuDu gu~r~rA 

Word to word meaning: పాపపుణ్యములు (pApapuNyamulu) = Virtuous and sinful deeds; రెండు (reMDu) =  both these; పక్కనున్న చీలలు pakkanunnachIlalu =  Side Stopper pin (cotter pin) to prevent the wheels from coming out; తోపుల (tOpula) = plenty of యన్నపానాలు = అన్నపానాలు (yannapAnAlu = annapAnAlu) = food and drink; దొబ్బుఁదెడ్లు (dobbudeDlu) =  thick oars/paddles; యేపున (yEpuna) = great; శ్రీవేంకటేశుఁ డెక్కి (SrIvEMkaTESu Dekki) = Sri Venkateswara having mounted ( the man’s heart); వీథుల నేఁగఁగ(vIthula nEgaga)  = came on to the streets;  కాపాడి (kApADi) = saved, to preserve;  నరరథము (nararathamu) = the vehicle called human;  గడపీఁబో జీవుఁడు (gaDapIbO jIvuDu) = man gets through trouble.

 

Literal meaning: The rider (man) runs this vehicle with virtuous and sinful deeds as the limiters to the axle of life; the consumed food may be taken as the oars/paddles. Man gets through trouble as the great Sri Venkateswara having Come on the streets riding on the vehicle called man. 

Implied meaning:  man under the spell of conditioning, gets his view limited by virtuous and sinful deeds. When a man submits his will to the GOD, he gets saved from the rig morale of life and death. 

భావము: పాపపుణ్యాలు అనే రెండు చీలల మధ్య మనిషి రథాన్ని నడిపిస్తాడు;  ఎక్కువైన అన్నపానాలు తెడ్లు లాంటివి; శ్రీ వెంకటేశ్వరుడు నరరథము ఎక్కి  వీధులలొ తిరుగాడగా మానవుడు రక్షింపబడ్డాడు. 

విశేష  భావము: మానవుడు స్థితివ్యాజమునకు {స్థితి కలిగించు వ్యాజము =భ్రమ​, మోహము, కపటము} లోనై పాపపుణ్యాలు అనే మాయలలో ఊహాత్మక గాడీలలో పడీ త్రోవతప్పుతాడు. శ్రీ వెంకటేశ్వరుని రౌతుగా గుర్తించి తలకెత్తుకున్న  మానవుడు చావు బతుకులనే మొహాన్నుంచి రక్షింపబతాడు. 

zadaz

 

 

Reference: Copper Leaf: 136-5, Volume: 2-152

 

 

 

No comments:

Post a Comment

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...