Sunday, 26 September 2021

87. తల లేదు తోఁక లేదు దైవమా నీ మాయలకు (tala lEdu tOka lEdu daivamA nI mAyalaku)

 ANNAMACHARYA

87. తల లేదు తోఁక లేదు దైవమా నీ మాయలకు 

Introduction: In this seemingly simple verse Annamacharya reproached ignorant actions of man.  

He lays bare many fundamental questions for us to ponder. As stated many times before, these questions are meant for introspection and contemplation. They are not for providing black and white answers, but to bring clarity on this very confusing subject by eliminating wrong notions. 

Annamacharya wrote these apparently simple words to convey profound meanings, these words by themselves cannot connote. I repeat that the assemblage of these words is not a conscious act, but performed in a state of meditation. Like these simple words, Annamayya wanted each one of us to get into meditative state  to feel the ultimate beyond the limitations imposed by language, religion and ignorance. In this thought provoking verse, you will find elemental Annamacharya at his best.

ఉపోద్ఘాతము:  పైకి సరళంగా కనిపించే ఈ  కీర్తనలో అన్నమాచార్యులు మనిషి యొక్క అజ్ఞానపు చర్యలను గర్హించాడు.

దేహమేమిటో, తలపులేమిటో, సుఖలేమిటో, వివేకమేమిటో, పుట్టుకేమిటో, పోయెడిదేమిటో, వెనకముందులేమిటో, నేరుపులేమిటో, నేరములేమిటో అంటూ  అన్నమాచార్యులు అనేక ప్రశ్నల పరంపరతో మనల్ని ఆలోచింపచేస్తాడు. వీటికి ఇదమిద్ధమైన సమాధానాలు లేకున్నప్పటికీ, పెక్కు సందేహాలతో కూడిన ఈ విషయంలో సత్యము కాని దానిని  తొలగించుట / తీసివేయుట ద్వారా కొంత​ స్పష్టతను తీసుకురావచ్చు.  

ఎంతో లోతైన అర్థాలను తెలియజేయడానికి అన్నమయ్య ఈ సరళమైన పదాలను ఎన్నుకుని  వ్రాసినట్లు మీరు గమనించి ఉంటారు. ఈ పదముల తమంత తాముగా సూచించలేని భావములు ఈ పదముల కూర్పులో వ్యక్తమైనట్లు తెలియండి. ఈ పదముల సమ్మేళనం సచేతన చర్య కాదని, ధ్యాన స్థితిలో వ్రాయబడినదని అనేక మార్లు విన్నవించాను. ఈ సరళమైన పదముల మాదిరిగానే అన్నమాచార్యులు మనలో ప్రతి ఒక్కరూ భాష, మతం మరియు అజ్ఞానం మనపై విధించిన పరిమితులను అధిగమించినట్లైతే, మాటలకందని అత్యంత మధురమైన అనుభూతిని తెలియగలమని,  అందుకు ఈ పదముల లాగే సరళమైన నిర్మలమైన హృదయం మాత్రమే అవసరమనీ అన్నారు.

కీర్తన:

 

తల లేదు తోఁక లేదు దైవమా నీ మాయలకు

తెలిసియుఁ దెలియక తిరిగేము నేము పల్లవి॥ 

తను వేఁటిదో యీ తలపోఁత లేఁటివో

యెనయు సంసార సుఖ మిది యేఁటిదో
వెనక ముం దేఁటిదో వివేక మెరఁగక
దినదినమును నేమో తిరిగేము నేము        ॥తల॥

పుట్టు గిది యెక్కడో పోయేటి దెక్కడో

ఇట్టె యీ సిరులెల్లా నెక్కడెక్కడో
మట్టులేని హరి నిర్మాణ చక్రములోన
దిట్టలమై యేమేమో తిరిగేము నేము          ॥తల॥

నేరు పేదో నేర మేదో నిలిచిన దొకటేదో

వూరకే నీ దాసులమై వున్నారము
చేరి నన్నేలినయిట్టె శ్రీవేంకటేశ్వర
గారవించి కరుణించి కావఁగదవే    ॥తల॥
 

 

tala lEdu tOka lEdu daivamA nI mAyalaku

telisiyu deliyaka tirigEmu nEmu   pallavi 

tanu vETidO yI talapOta lETivO

yenayu saMsAra sukha midi yETidO
venaka muM dETidO vivEka meragaka
dinadinamunu nEmO tirigEmu nEmu tala

puTTu gidi yekkaDO pOyETi dekkaDO

iTTe yI sirulellA nekkaDekkaDO
maTTulEni hari nirmANa chakramulOna
diTTalamai yEmEmO tirigEmu nEmu tala

nEru pEdO nEra mEdO nilichina dokaTEdO

vUrakE nI dAsulamai vunnAramu
chEri nannElinayiTTe SrIvEMkaTESvara
gAraviMchi karuNiMchi kAvagadavE tala

 

Details and Explanations:

 

తల లేదు తోఁక లేదు దైవమా నీ మాయలకు

తెలిసియుఁ దెలియక తిరిగేము నేము       ॥పల్లవి॥


tala lEdu tOka lEdu daivamA nI mAyalaku

telisiyu deliyaka tirigEmu nEmu    pallavi

 

Word to Word meaning: తల లేదు (tala lEdu) = No head; తోఁక లేదు (tOka lEdu) = No tail; దైవమా (daivamA) = O God! నీ ((nI) = Your; మాయలకు (mAyalaku) = illusions;  తెలిసియుఁ (telisiyu) = partly knowing; దెలియక (deliyaka) partly not knowing;  తిరిగేము (tirigEmu) = wander; నేము (nEmu)    = we.

 

Literal meaning: O God! No head, no tail to the illusions you create. We wander out without understanding.

Explanation: tala lEdu tOka lEdu (తల లేదు తోఁక లేదు) No head, no tail is an expression to signify no specific plan or method. In this context, it also may be taken we neither know its head nor its tail, meaning it’s too big to comprehend.

telisiyu deliyaka (తెలిసియుఁ దెలియక) is to point out that our understanding at the best is meagre.

tirigEmu nEmu (తిరిగేము నేము) is indicating we still take action.

Thus the implied meaning of this chorus is: O God! Under the spell of infinite illusions, we act ignorantly.

భావము: ఓ దైవమా నీ మాయలకు తల లేదు తోఁక లేదు. తెలిసియుఁ దెలియక తిరిగెదము మేము.

వివరణము: తల లేదు తోఁక లేదు తో ఒక పద్ధతి లేదా మార్గము లేని మాయను సూచించడమే కాకుండా, ఆ మాయ యొక్క​ తలను కాని, దాని తోకను కాని  తెలియనంత పెద్దదని అన్నమయ్య  చెప్పారు.

తెలిసియుఁ దెలియక లో తెలియనిదే ఎక్కువని భావార్ధము.

తిరిగేము నేము తో మానవుడు తన స్థితి ఏమైదీ తెలియనప్పటికీ, చర్య తీసుకోవడాన్ని తెలుపుతోంది.

పల్లవి అన్వయార్ధము: ఓ దైవమా! నీ అనంతమైన మాయలకు లోనై అజ్ఞానముతో చర్యలు చేపడుతున్నాము.

తను వేఁటిదో యీ తలపోఁత లేఁటివో

యెనయు సంసార సుఖ మిది యేఁటిదో
వెనక ముం దేఁటిదో వివేక మెరఁగక
దినదినమును నేమో తిరిగేము నేము       ॥తల॥ 

tanu vETidO yI talapOta lETivO

yenayu saMsAra sukha midi yETidO
venaka muM dETidO vivEka meragaka
dinadinamunu nEmO tirigEmu nEmu      tala 

Word to Word meaning: తను వేఁటిదో (tanu vETidO) = What kind of this this body is? యీ తలపోఁత లేఁటివో (yI talapOta lETivO) = what these thoughts are? యెనయు (yenayu)  = coalesce, unite; సంసార సుఖ మిది (saMsAra sukha midi) = these comforts  of this world; యేఁటిదో (yETidO) = what is it; వెనక (venaka) = the last one (last birth, last moment) ముం దేఁటిదో (muM dETidO) =( what could be)  the next birth, next moment? వివేక (vivEkamu) = wisdom;  ఎరఁగక (eragaka) = not knowing; దినదినమును (dinadinamunu)  = day after day; నేమో (nEmO) = move without appointment; తిరిగేము (tirigEmu) = wander; నేము (nEmu) = we. 

Literal meaning: We do not know what this body is (for)? We do not understand these thoughts either. We can either appreciate these precipitating desires. We do not know the last one (birth). Neither does the next. Still, day after day, we wander without appointment.

Explanation: Annamayya starts first with what is the purpose of body? If not for sensory enjoyment, then what does it serve? I hope you understand that it is the most sensitive device in the world. There is none like it.  And you can decide what use it can be put to!!

What use is of thoughts? Are they for scheming to pit man against man? Are they for manipulation for personal advantage? What for thought has been provided to man? Please consider these words of Galileo Galilei: “I don’t feel obliged to believe the same god who has endowed us with sense, reason and intellect has intended us to forgo their use”

When it has been said that simply submitting the will to god, what is the necessity to answer these uncomfortable questions? Dear Sirs, please note that submitting will is not a joke. If one does not know what will is, what will he submit?

Explanation of “venaka muM dETidO vivEka meragaka” is covered in the next stanza

What is this appointment? Definitely is not the position in religious hierarchy. Do we know why we continue our errands?  Please consider the meaning of Prescribed Duty in the Bhagavad-Gita shloka below.

श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: || 3-35||

śhreyān swa-dharmo viguṇaḥ para-dharmāt sv-anuṣhṭhitāt
swa-dharme nidhanaṁ śhreyaḥ para-dharmo bhayāvahaḥ
(3-35)

Purport: It is far better to perform one’s natural prescribed duty, though tinged with faults, than to perform another’s prescribed duty, though perfectly. In fact, it is preferable to die in the discharge of one’s duty, than to follow the path of another, which is fraught with danger.

 

భావము:  ఈ దేహము దేనికో?  ఈ ఆలోచనలు లేమిటో? ఈ బలంగా లాగివేసే సంసార వాంఛ మేమిటో? చివరి జన్మమేమిటో? తదుపరి దేమేమిటో? ఐప్పటికీ, దినదినము మేము స్వధర్మమెరుగక తిరుగుతూనే ఉన్నాము.

వివరణము: దేహం దేనికో? ఇంద్రియ భోగమునకు కాక దేనికి ఉపయోగపడుతుందో? దీన్నిగురించి మనకేమి తెలుసో? ప్రపంచంలోనే అతి సున్నితమైన పరికరమే ఇది. దీనికి సాటి వచ్చునది లేదనే చెప్పవచ్చు. ఇంక దానితో ఏమి చేయవచ్చో మీరే నిశ్చయించవచ్చు.

ఆలోచనల వల్ల ఉపయోగం ఏమిటి? మనిషికి మనిషికి మధ్య చిచ్చుపెట్టడానికా? అవి వ్యక్తిగత ప్రయోజనం కోసం అర్ధాలు తారుమారు చేయడమా? అసలు దీనికి అసాధ్యమైనదే లేదే? మరి, దేని కొరకు? దేని కొరకు? శ్రీశ్రీ గారి క్రింది కవిత చూడండి.

..

నడిరాతిరి కడలివద్ద

హోరుగాలి ఉపశ్రుతిగ,
నీలోనే నీవేదో
ఆలపించుతావ్‌?
ఆవ్యక్తపు టూహలతో
ఆలపించుతావ్‌?
జగమంతా నిదుర మునిగి
సద్దణగిన నడిరాతిరి
నీలోనే నీవేదో
ఆలకించుతావ్‌?
శ్రీనివాసరావ్‌!
శ్రీనివాసరావ్‌!
దేనికోసమోయ్‌? 

ఈ అసౌకర్యం కలిగించే ప్రశ్నలన్నింటికీ ఎందుకు సమాధానం ఇవ్వాలి? దేవునికి చిత్తాన్ని సమర్పించాలని చెప్పినప్పుడు, వీటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? దయచేసి గమనించండి దేవునికి చిత్తాన్ని సమర్పించడం ఒక జోక్ కాదని తెలియండి. ఏమి సమర్పించాలో తెలియకపోతే, ఏమిటండి ఇచ్చేది? 

ఈ చరణంలో నేమో తో, క్రింది భగవద్గీత లోని శ్లోకములో స్వధర్మమును సూచించారు. 

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 3-35 ।। 

భావం: చక్కగా పాటింపబడిన పరధర్మము కన్ననూ గుణము లేనిదైననూ స్వధర్మాచరణమే శ్రేయస్కరము. స్వధర్మాచరణమందు  మరణము సంభవించిననూ మేలే, ఏలయనగా పరధర్మము భయంకరమైనది. 

పుట్టు గిది యెక్కడో పోయేటి దెక్కడో

ఇట్టె యీ సిరులెల్లా నెక్కడెక్కడో
మట్టులేని హరి నిర్మాణ చక్రములోన
దిట్టలమై యేమేమో తిరిగేము నేము          ॥తల॥ 

puTTu gidi yekkaDO pOyETi dekkaDO

iTTe yI sirulellA nekkaDekkaDO
maTTulEni hari nirmANa chakramulOna
diTTalamai yEmEmO tirigEmu nEmu      tala 

Word to Word meaning: పుట్టు గిది యెక్కడో (puTTu gidi yekkaDO) = Where are we born? ( or where do we come from?) పోయేటి దెక్కడో (pOyETi dekkaDO) = where do we go (hereafter); ఇట్టె( iTTe) = ephemeral, small aperture of time; యీ సిరులెల్లా (yI sirulellA) = these riches; నెక్కడెక్కడో (nekkaDekkaDO) = where? మట్టులేని (maTTulEni) = bottomless; హరి నిర్మాణ చక్రములోన (hari nirmANa chakramulOna) = great wheel of symmetry of God; దిట్టలమై (diTTalamai) = literal meaning is courageous, strong and brave man. But here the contextual meaning is thus. Assume Ownership out of  ignorance; యేమేమో (yEmEmO) = anywhere;  తిరిగేము (tirigEmu) = wander;  నేము (nEmu) = we.      

Literal meaning: We do not know where we come from. Neither know where do we go? Know not what these riches in the world are meant? In this bottomless (more appropriate is base less) great wheel of creation of God, we roam assuming ownership (out of ignorance).

Explanation: This stanza is very complex. We may say I know who my parents are. As proved earlier, there is only one cause to this world.  Rest are reflection or subsets of the Original cause.

Now by stating puTTu gidi yekkaDO  (పుట్టు గిది యెక్కడో), Annamayya meant that we may be aware thru second hand knowledge that God is the cause. But we are not interested in hearsay. The second hand knowledge, like the one imparted by religions has failed to bring peace between man and man. If you look carefully, religions, racism, ego, language has divided man.  Therefore, you need to know directly the cause of your birth.

Another interesting thing is  pOyETi dekkaDO (పోయేటి దెక్కడో) = where do we go hereafter. What does this imply? Annamayya declared that there is only one world, the one where we live. That means we do not go somewhere, like hell or heaven? Then what is death? Death is the end. But there are those who cannot digest. They keep coming up with rebirth etc.  If you donot go anywhere, where do you come from? In this context, let us remember the words of Alan Wilson Watts

“We do not "come into" this world; we come out of it, as leaves from a tree. As the ocean "waves," the universe "peoples." Every individual is an expression of the whole realm of nature, a unique action of the total universe.”

Suggested reading: dibbaluveTTuchu dElina didivO (దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో) for further understanding. 

Very important line is maTTulEni hari nirmANa chakramulOna (మట్టులేని హరి నిర్మాణ చక్రములోన) = bottomless great wheel of creation of God. If you think, you can get to bottom of this, think once more. Man tried to find out the edge of this universe. Do we know the edge, despite the efforts of millions of scientists over last 150 years? DO we know really the fundamental particle with which the universe is made. I am sure, if I say god particle boson, someone else will surely come up with even tinier one later. Thus either side of this creation is mystery despite great efforts and interest.

The most important word used in this stanza is diTTalamai (దిట్టలమై) = Assume Ownership out of ignorance. Man takes the ownership of his body for granted.  Just refer to the song gu~r~rAla gaTTani tEru (గుఱ్ఱాలఁ గట్టని తేరు).  This is the original mistake. Once, one is off the track, there is no way to correct. Thus we need to start this journey of understanding self and god with dismantling the assumptions. unlike the science, where we start with certain assumptions. Now see the relevance of these wording with Jiddu Krihnamurti’s statement below.

I learn about myself; in learning about myself I accumulate knowledge about myself and use that knowledge, which is of the past, to learn something more about myself. With the accumulated knowledge I have about myself I look at myself and I try to learn something new about myself. Can I do that? It is impossible. (You are The World, Talk at Brandeis University, 1968)

I hope, you can imagine the depth to which Annamayya wrote these apparently simple words to convey profound meanings, these words by themselves cannot connote. I repeat that the assemblage of these words is not a conscious act, but performed in a state of meditation. Like these simple words, Annamayya wanted each one of us to convey feelings beyond the limitations imposed by language, religion and whatever we might have imposed out of ignorance. For that you need pure heart, nothing else (like those simple words).

Now let us recapitulate the implied meaning of this stanza: We should not entangle ourselves into knowing where we come from or where do we go. Rather, assemble our energies to dissociate from the ignorance. 

భావము: మనం ఎక్కడి నుండి వచ్చామో? ఎక్కడికి పోతామో? ఈ ప్రపంచంలో  సంపద అంటే ఏమిటో? అడుగేలేని హరి యొక్క గొప్ప నిర్మాణ చక్రంలో, తెలియక మనమే రౌతులమని ఊహించుకొని గుడ్డిగా తిరుగుతాము.

వివరణము: పుట్టు గిది యెక్కడో: అంటే మన పుట్టుకకు తల్లిదండులు నిమిత్త మాత్రులైతే దేవుడే అసలు  కారణమనే ద్వితీయ శ్రేణి  జ్ఞానం ద్వారా మనం తెలుసుకోని ఉండవచ్చు. కానీ మాకు వారు చెప్పినవి, వీరు చెప్పిన కబుర్లతో దారి తప్పకండి. మనుషుల మధ్య శాంతిని తీసుకురావడంలో విఫలమైన మతములు చెప్పే సిద్ధాంతాలలో పడి కొట్టుకు పోకండి. మీరు జాగ్రత్తగా చూస్తే, మతములు, జాత్యహంకారం, అహం, భాష మనిషిని విభజించాయి. అందువల్ల, మీ పుట్టుకకు గల కారణాన్ని మీరు నేరుగా తెలుసుకోవాలి అన్నారు అన్నమయ్య.

మరో ఆసక్తికరమైన విషయం పోయేటి దెక్కడో  = ఇకపై మనం ఎక్కడికి వెళ్తామో? ఇది దేనిని సూచిస్తుందో? విశ్వం అంతా నివసించేది ఒకే ప్రపంచమని అన్నమయ్య ప్రకటించాడు. అంటే నరకం లేదా స్వర్గం లాగా ఏమీ లేవనే! అప్పుడు మరణం అంటే ఏమిటి? మరణమనేది ఆఖరు. తరువాత ఏమీ లేదని జీర్ణించుకోలేని వారి మాటలను పట్టించుకోవద్దు. ఎక్కడికీ వెళ్లకపోతే, ఎక్కడ ఉంటారో? ఈ సందర్భంగా, అలాన్ విల్సన్ వాట్స్ మాటలను మనం గుర్తుంచుకుందాం.

మనమీ ప్రపంచం లోనికి కాదు; ఈ ప్రపంచం నుండి వస్తాము; చెట్టు నుండి ఆకులవలె; సముద్రం నుండి కెరటాల వలె; ప్రపంచం నుండి మానవులము. ప్రతి వ్యక్తి  మొత్తం ప్రకృతి యొక్క వ్యక్తీకరణ, మొత్తం విశ్వం యొక్క ప్రత్యేకమైన చర్య.

ఈ కీర్తన ఇంకా అర్ధంచేసుకోవడానికి: దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో (dibbalu veTTuchu dElina didivO) చదవవచ్చు.

మట్టులేని హరి నిర్మాణ చక్రము: మీరు సృష్టి రహస్యాన్ని చేధించగలమనుకుంటే మరోసారి ఆలోచించండి. ఈ విశ్వం అంచుని కనుగొనడానికి మనిషి ప్రయత్నించాడు. ఆదిమ కాలం నుండి తత్వవేత్తలు, గత 150 సంవత్సరాలుగా మిలియన్ల కొద్ది శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ అంచు మనకు తెలుసా?   ఏ ప్రాథమిక కణంతో  విశ్వం  సృష్టించబడినదో మనకు నిజంగా తెలుసా? అది నేను దైవ కణం బోసాన్ (god particle boson) అని చెబితే, మరొకరు  కొంత కాలం తరువాత ఖచ్చితంగా అంతకంటే కూడా చిన్నదానితో  ముందుకు వస్తారు. మానవుని ఈ ప్రయత్నాలు, ఆసక్తి ఉన్నప్పటికీ,  సృష్టికి ఇరువైపులా రహస్యంగానే ఉండిపోయాయి. కాబట్టి, ఈ అనంతమైన అన్వేషణకు, మానవునికి సంబంధంలేదనీ, అనవసరపు విషయాలలో చిక్కుకోరాదనీ సూచన​.

 

చివరి పంక్తిలో  దిట్టలమై యేమేమో తిరిగేములో ముఖ్యమైన సందేశం గుప్పించారు. దీనితో ఈ దేహం యొక్క యాజమాన్యాన్ని అజ్ఞానంతో తన చేతులలోకి మనిషి తెలియక తీసుకుంటాడు అన్నారు.  (గుఱ్ఱాలఁ గట్టని తేరు అన్న  కీర్తన కూడా చూడండి.) ఇదే మొదటి తప్పు. ఒకసారి, దారి తప్పితే బయటపడితే, సరిదిద్దడానికి మార్గం సులభం కాదు. అయితే విజ్ఞాన శాస్త్రం కూడా, సిద్ధాంతీకరణ కోసం కొన్ని అంచనాలతో ప్రారంభిస్తాము. అందుకు భిన్నంగా అహమును, దేవుడిని అర్థం చేసుకునే ఈ ప్రయాణాన్ని మనమే నిర్మించుకున్న అంచనాలను ఊహలను విసర్జించడం ద్వారా మాత్రమే సాధ్యము.  క్రింద జిడ్డు కృష్ణమూర్తి ప్రకటనతో ఈ పదాల ఔచిత్యాన్ని చూడండి.

నేను నా గురించి నేర్చుకుంటాను; నా గురించి నేర్చుకోవడంలో నేను  నా గతానికి  గురించిన  జ్ఞానాన్ని కూడగట్టుకు ఒకచోట పెట్టుకుంటాను. తరవాత ఆ సేకరించిన జ్ఞానాన్ని ఉపయోగించుకుని, నా గురించి మరింత తెలుసుకోవడానికి, నా గురించి కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. గతం నుంచి కొత్తది రాదు. పాతదే మార్పు చెంది కోత్తలా కనబడుతుంది.  అలా చేయగలమా? కాబట్టి అది అసాధ్యం. (You are The World, Talk at Brandeis University, 1968)

ఎంతో లోతైన అర్థాలను తెలియజేయడానికి అన్నమయ్య ఈ సరళమైన పదాలను ఎన్నుకుని  వ్రాసినట్లు మీరు గమనించి ఉంటారు. ఈ పదముల తమంత తాముగా సూచించలేని భావములు ఈ పదముల కూర్పులో వ్యక్తమైనట్లు తెలియండి. ఈ పదముల సమ్మేళనం సచేతన చర్య కాదని, ధ్యాన స్థితిలో వ్రాయబడినదని నేను అనేక మార్లు విన్నవించాను. ఈ సరళమైన పదముల మాదిరిగానే అన్నమయ్య మనలో ప్రతి ఒక్కరూ భాష, మతం మరియు అజ్ఞానం మనపై విధించిన పరిమితులను అధిగమించినట్లైతే, మాటలకందని అత్యంత మధురమైన అనుభూతిని తెలియగలమని,  అందుకు ఈ పదముల లాగే సరళమైన నిర్మలమైన హృదయం మాత్రమే అవసరమనీ అన్నారు.  

చివరిగా చరణం అన్వయార్ధము: మనం ఎక్కడి నుండి వచ్చామో లేదా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకుందామనే  మీమాంసలో చిక్కుకోడానికి బదులు అజ్ఞానం గుర్తించడానికి శక్తులను సమీకరించండి.

నేరు పేదో నేర మేదో నిలిచిన దొకటేదో

వూరకే నీ దాసులమై వున్నారము
చేరి నన్నేలినయిట్టె శ్రీవేంకటేశ్వర
గారవించి కరుణించి కావఁగదవే     ॥తల॥ 

nEru pEdO nEra mEdO nilichina dokaTEdO

vUrakE nI dAsulamai vunnAramu
chEri nannElinayiTTe SrIvEMkaTESvara
gAraviMchi karuNiMchi kAvagadavE      tala

 

Word to Word meaning: నేరు పేదో (nEru pEdO) = What is skill? నేర మేదో (nEra mEdO) = what is fault? నిలిచిన దొకటేదో (nilichina dokaTEdO) = what is that stands? (Forever)  వూరకే (vUrakE) = without any reason;  నీ (nI) = your; దాసులమై (dAsulamai) = servants; వున్నారము (vunnAramu) = staying; చేరి నన్నేలినయిట్టె (chEri nannElinayiTTe) = having approached and ruling my heart;   శ్రీవేంకటేశ్వర (SrIvEMkaTESvara) = Lord Venkateswara; గారవించి (gAraviMchi) = by respecting; కరుణించి (karuNiMchi) = by compassion; కావఁగదవే (kAvagadavE) = save us all. 

Literal meaning: What is skill? What is a sin? What does stand ( the test of time)?. We are your servants without any expectation. O Lord Venkateswara, you are ruling my heart. Accept our prayers and show compassion and save all.


Explanation: nEru pEdO (నేరు పేదో= What is skill?) Is indicating that there are no special skills required to reach god. (Also refer to song ఎవ్వరినేర్పులు జెప్ప నిదు నేది (evvarinErpulu jeppa niMdu nEdi). That means everyone can.

 

nEra mEdO (నేర మేదో= what is fault?) is signifying that all the sins committed by man can be pardoned, provided he solicits  it with pure heart. However, it does not mean we can wash our sins by exchange of money, donations like we presently do in religious places.

nilichina dokaTEdO (నిలిచిన దొకటేదో = what is that stands Forever?) With this Annamayya is saying in the face of timeless entity we call as God, all sins will melt away, also our skills.

The word vUrakE (వూరకే= without any reason) is used to signify our interest in almighty should not be with ascribable reasons.

vunnAramu (వున్నారము= staying) is denoting that this submission is not one time act. But submission is forever.

Implied meaning of this stanza: I know not what skill is! I know not what my sins are! Without any further thinking, I just submitted to the timeless entity without any expectation. O Lord Venkateswara you are the true ruler of my heart. Show compassion and save us all.     

భావము:  నైపుణ్యం మేమిటో? నా పాపాలేమిటో? నాకు తెలియదు! నేను ఎలాంటి తదుపరి ఆలోచన, నిరీక్షణ లేకుండా ఆద్యనంతములులేని సృష్టికర్తకు సమర్పించుకున్నాను. ఓ వెంకటేశ్వరా, నువ్వే నా హృదయానికి నిజమైన కర్తవు. కరుణించి కావఁగదవే!

వివరణము: నేరు పేదో = నైపుణ్యం అంటే ఏమిటి? దేవుడిని చేరుకోవడానికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదని సూచిస్తోంది. (ఎవ్వరినేర్పులుజెప్ప నిదు నేది అనే పాటను కూడా చూడండి.) అంటే ప్రతి ఒక్కరూ దైవమును చేరుకోగలరు.

నేర మేదోతో నిర్మలమైన హృదయంతో విన్నవించుకుంటే మనిషి చేసిన పాపాలన్నిటినీ దైవము క్షమించవచ్చని సూచిస్తుంది. ఏదేమైనా,  ప్రస్తుతం మనం చేస్తున్నట్లుగా మతపరమైన ప్రదేశాలలో  విరాళాలు, డబ్బులు ఇచ్చి తద్వారా మన పాపాలను కడిగేసుకో వచ్చని దీని అర్థం కాదు.

నిలిచిన దొకటేదోతో  మనం దైవముగా సూచిస్తున్న కాలాతీత అస్తిత్వము ముందు అన్ని పాపాలు నైపుణ్యాలు కూడా  కరిగిపోతాయి అని  అన్నమయ్య చెబుతున్నాడు.

వూరకే: సర్వశక్తిమంతుడిపై ఆపాదించదగిన కారణాలు/కోరికలు లేని (ఏదీ ఆశించని) మన ఆసక్తిని సూచించడానికి ఉపయోగించారు. 

వున్నారముతో ఏదో ఇవ్వాల్టికి దణ్ణం పెట్టుకుని వచ్చేస్తే పనైపోతుంది లాంటి చర్య కాదని, జీవిత పర్యంతం ఒదిగివుండే సంపూర్ణ సమర్పణ అని సంకేతం.

చరణం అన్వయార్ధము: నైపుణ్యములెరుగను! పాపాలెరుగను! వూరకే ఆలోచనలు, అంచనాలు లేకుండాకాలాతీత అస్తిత్వమునకు దాసులమై వున్నారము  ఓ వెంకటేశ్వరా, నువ్వే నా హృదయానికే కాదు సర్వ చరాచర జగత్తుకు నిజమైన కర్తవు. కరుణించి కావఁగదవే!

 

Summary of this Keertana:

O God! No head, no tail to the illusions you create. We wander out without understanding. (Implied meaning: O God! Under the spell of infinite illusions, we act ignorantly.)

We do not know what this body is (for)? We do not understand these thoughts either. We can either appreciate these precipitating desires. We do not know the last one (birth). Neither does the next. Still, day after day, we wander without appointment.

We do not know where we come from. Neither know where do we go? Know not what these riches in the world are meant? In this bottomless (more appropriate is base less) great wheel of creation of God, we roam assuming ownership (out of ignorance). (Implied meaning: We should not entangle ourselves into knowing where we come from or where do we go. Rather, assemble our energies to dissociate from the ignorance.)  

What is skill? What is a sin? What does stand (the test of time)? We are your servants without any expectation. O Lord Venkateswara, you are ruling my heart. Accept our prayers and show compassion and save all. (Implied meaning: I know not what skill is! I know not what my sins are! Without any further thinking, I just submitted to the timeless entity without any expectation. O Lord Venkateswara you are the true ruler of my heart. Show compassion and save us all.)  


కీర్తన సంగ్రహ భావము:

ఓ దైవమా నీ మాయలకు తల లేదు తోఁక లేదు. తెలిసియుఁ దెలియక తిరిగెదము మేము.  (అన్వయార్ధము: ఓ దైవమా! నీ అనంతమైన మాయలకు లోనై అజ్ఞానముతో చర్యలు చేపడుతున్నాము.)

ఈ దేహము దేనికో?  ఈ ఆలోచనలు లేమిటో? ఈ బలంగా లాగివేసే సంసార వాంఛ మేమిటో? చివరి జన్మమేమిటో? తదుపరి దేమేమిటో? ఐప్పటికీ, దినదినము మేము స్వధర్మమెరుగక తిరుగుతూనే ఉన్నాము.

మనం ఎక్కడి నుండి వచ్చామో? ఎక్కడికి పోతామో? ఈ ప్రపంచంలో  సంపద అంటే ఏమిటో? అడుగేలేని హరి యొక్క గొప్ప నిర్మాణ చక్రంలో, తెలియక మనమే రౌతులమని ఊహించుకొని గుడ్డిగా తిరుగుతాము. (అన్వయార్ధము: మనం ఎక్కడి నుండి వచ్చామో లేదా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకుందామనే మీమాంసలో చిక్కుకోడానికి బదులు అజ్ఞానం గుర్తించడానికి శక్తులను సమీకరించండి.)

నైపుణ్యం మేమిటో? నా పాపాలేమిటో? నాకు తెలియదు! నేను ఎలాంటి తదుపరి ఆలోచన, నిరీక్షణ లేకుండా ఆద్యనంతములులేని సృష్టికర్తకు సమర్పించుకున్నాను. ఓ వెంకటేశ్వరా, నువ్వే నా హృదయానికి నిజమైన కర్తవు. కరుణించి కావఁగదవే! (అన్వయార్ధము: నైపుణ్యములెరుగను! పాపాలెరుగను! వూరకే ఆలోచనలు, అంచనాలు లేకుండా కాలాతీత అస్తిత్వమునకు దాసులమై వున్నారము ఓ వెంకటేశ్వరా, నువ్వే నా హృదయానికే కాదు సర్వ చరాచర జగత్తుకు నిజమైన కర్తవు. కరుణించి కావఁగదవే!)

 

 

 

Copper Leaf: 362-6  Volume 4-368

3 comments:

  1. కీర్తన మీద మీ వ్యాఖ్యానం అద్భుతంగాను, ఆలోచింపజేసేది గాను ఉంది. అజ్ఞానపు ప్రశ్నలతో, ఆలోచనలతో సమయాన్ని వృధా కానీయకుండా, ఆ అజ్ఞానాన్ని గుర్తించి, దాని నుంచి జ్ఞానమార్గం కొఱకు అన్వేషణ చేసి తరించండని అన్నమయ్య చెబుతున్నాడు.
    కీర్తన చివరి చరణం మీద దృష్టి సారించి, ఆద్యంతములు లేని శ్రీ హరి మహాత్తును గ్రహించి ఆయనకు ఆత్మ సమర్పణము గావించి, ప్రాపంచిక విషయాల నుండి ఆలోచనలను మల్లించి "నీవే తప్ప నన్ను రక్షించేవారెవరూ లేరని శరణాగతియై, నన్ను బ్రోవుము " అని శ్రీనివాసుని వేడుకోవాలి. ఆయన కరుణాకటాక్షములకు పాత్రులు కావాలి అని అన్నమయ్య ఈ కీర్తనలో ప్రభోదించుచున్నాడు.
    హరిః ఓం 🙏

    ReplyDelete
  2. కీర్తన మీద మీ వ్యాఖ్యానం అద్భుతంగాను, ఆలోచింపజేసేది గాను ఉంది. అజ్ఞానపు ప్రశ్నలతో, ఆలోచనలతో సమయాన్ని వృధా కానీయకుండా, ఆ అజ్ఞానాన్ని గుర్తించి, దాని నుంచి జ్ఞానమార్గం కొఱకు అన్వేషణ చేసి తరించండని అన్నమయ్య చెబుతున్నాడు.
    కీర్తన చివరి చరణం మీద దృష్టి సారించి, ఆద్యంతములు లేని శ్రీ హరి మహాత్తును గ్రహించి ఆయనకు ఆత్మ సమర్పణము గావించి, ప్రాపంచిక విషయాల నుండి ఆలోచనలను మల్లించి "నీవే తప్ప నన్ను రక్షించేవారెవరూ లేరని శరణాగతియై, నన్ను బ్రోవుము " అని శ్రీనివాసుని వేడుకోవాలి. ఆయన కరుణాకటాక్షములకు పాత్రులు కావాలి అని అన్నమయ్య ఈ కీర్తనలో ప్రభోదించుచున్నాడు.
    హరిః ఓం 🙏
    కృష్ణ మోహన్
    విశాఖపట్నం

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...