Thursday, 19 May 2022

122. కడుఁ జంచలములు కడు నధ్రువములు (kaDu jaMchalamulu kaDu nadhruvamulu)

 

ANNAMACHARYA

122. కడుఁ జంచలములు కడు నధ్రువములు

(kaDu jaMchalamulu kaDu nadhruvamulu)

Introduction: In this short, sweetly lingering poem Annamacharya says the intelligent do not get engaged with the transitory life.

It’s not that we don’t understand appropriate thing to do. However, for inexplicable reasons, we invariably act exactly the opposite of what is required. We spend energy in regretting, time in thinking on how we should have acted.

ఉపోద్ఘాతము:  సంక్షిప్తము, బహు కాలము మదిలో మెదలాడు కీర్తనలో అన్నమాచార్యులు తాత్కాలిక విషయాలలో తెలివైనవారు నిమగ్నం కారని చెప్పారు. 

 మనము చేయవలసిన సరైన పనిని అర్థం చేసుకోలేమని కాదు. అయితే,  అనూహ్యమైన, వివరి౦చలేని కారణాల వల్ల, మన౦ అవసరమైన దానికి ఖచ్చిత౦గా వ్యతిరేక౦గా ప్రవర్తిస్తా౦. పశ్చాత్తాపం చెందడంలో మనం శక్తిని, మనము ఇంకెలా ప్రవర్తి౦చి ఉండాలో అని ఆలోచి౦చడ౦లో సమయాన్ని వృథా చేసుకుంటాం.

 కీర్తన:

కడుఁ జంచలములు కడు [1]నధ్రువములు
కడు నల్పములని కాదందురు॥పల్లవి॥

కర్మబోధ వికారంబులు
ధర్మతంత్ర సంధానములు
దుర్మదైక సందోహములు
కర్మదూరు లివి గాదందురు॥కడు॥

పరమభాగవత భవ్య[2]మతులు
పరమబోధ సంభావకులు
తిరువేంకటగిరిదేవు సేవకులు
కరుణాధికు లివి గాదందురు॥కడు॥

kaDu jaMchalamulu kaDu nadhruvamulu

kaDu nalpamulani kAdaMduru pallavi 

karmabOdha vikAraMbulu

dharmataMtra saMdhAnamulu
durmadaika saMdOhamulu
karmadUru livi gAdaMduru kaDu 

paramabhAgavata bhavya matulu

paramabOdha saMbhAvakulu
tiruvEMkaTagiridEvu sEvakulu
karuNAdhiku livi gAdaMduru kaDu

[1] ‘నద్రువ’ రేకు.
[2] ‘మమతలు’ పూ.ము.పా.

 

 

Details and Explanations:

కడుఁ జంచలములు కడు నధ్రువములు
కడు నల్పములని కాదందురు
పల్లవి॥

kaDu jaMchalamulu kaDu nadhruvamulu

kaDu nalpamulani kAdaMduru Pallavi 

Word to Word meaning: కడుఁ (kaDu) = much, greatly, completely; జంచలములు (jaMchalamulu) = vacillating; కడు (kaDu) = much, significantly, completely; నధ్రువములు (nadhruvamulu)= not permanent, transient; కడు (kaDu) = = much, greatly, completely; నల్పములని (nalpamulani) = too small, to meagre; కాదందురు (kAdaMduru) = reject, not accepted. 

Literal meaning: Great men, reject vacillating, transient, and trivial things.

 

Explanation: What are the transient things Annamacharya is talking about? The pleasures we derive from these transient things naturally follow Law of Diminishing returns. We get bored from these things quickly. For example, a great feature in a car about 5-10 years back is common for today’s cars. We will not purchase a car without those features. In this process we keep mounting the demands and markets keep responding with even complex products. 

While this game of anticipation is going on, we dream of owning cars with new features, looks matching our social status. We spend lots of time in discussions, in reading reviews in magazines, even if we donot drive or own a car. Thus, we get caught up in many such alluring activities. Time flies, do we ever remember that there is one who created us and testing us?   

This Bhagavad-Gita verse (5-22) has a similar significance. “ये हि संस्पर्शजा भोगा दु:खयोनय एव ते | आद्यन्तवन्त: कौन्तेय न तेषु रमते बुध:” ye hi sansparśha-jā bhogā duḥkha-yonaya eva te / ādyantavantaḥ kaunteya na teṣhu ramate budhaḥ. Purport: “Arjun: The pleasure derived from sense objects is fleeting and, in fact, a source of misery. The wise, do not delight in such pleasures that have a finite beginning and end.”

 

భావము: వివేకవంతులు విషయాలను కడుఁ చంచలములు, కడు నధ్రువములు కడు నల్పములని తిరస్కరించెదరు.  

వివరణము: అన్నమాచార్యులు మాట్లాడుతున్న తాత్కాలిక విషయాలు ఏమిటి?  ఈ విషయాల నుండి మనం పొందే ఆనందాలు సహజంగానే {క్షీణోపయుక్తిన్యాయము (తరుగుతూ వస్తున్న​ ప్రతిఫలాల నియమాన్ని) అనుసరిస్తాయి.  ఈ విషయాల నుండి మనం సులభంగా విసుగు చెందుతాము. ఉదాహరణకు, 5-10 సంవత్సరాల క్రితం ఒక కారులో ఒక గొప్ప ఫీచర్, నేటి కార్లకు సర్వసాధారణం. ఆ ఫీచర్లు లేకుండా మనము కారును కొనుగోలు చేయము. ఈ ప్రక్రియలో మనము డిమాండ్లను పెంచుతూనే ఉంటాము మరియు మార్కెట్లు కూడా సంక్లిష్టమైన ఉత్పత్తులతో  ప్రతిస్పందిస్తూనే ఉంటాయి.

ఇంకా గొప్ప​, ఇంకా మంచి, ఇంకా హోదాని తెలిపే కార్లకై ఎదురుచూపుల ఆట కొనసాగుతున్నప్పుడు, కొత్త కొత్త ఫీచర్లతో కార్లను స్వంతం చేసుకోవాలని కలలు కంటుంటాము. నలుగురితో చర్చిస్తాము. మేగజైన్'లలో వాటి గురించి చదువుతాము. మనము డ్రైవ్ చేయకపోయినా లేదా కారును స్వంతం చేసుకోకపోయినా, ఈ విధంగా ఇలా ఆసక్తి, కుతూహలము రేకెక్తించు అనేక విషయములలో తగులుకొని సమయం తెలియకుండానే ఖర్చుచేస్తాము. ఆ విధంగా, కాలం ఎగురుకుంటూపోతుంది, మనల్ని సృష్టించి మనల్ని పరీక్షి౦చే వాడొకడున్నాడని మనకు ఎప్పటికీ గుర్తుండదే? 

భగవద్గీతలోని 5-22వ శ్లోకము ఇదే సందేశమును అందిస్తుంది. “యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే / ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః” (భావము: అర్జునా! ఇంద్రియముల నుండి పొందిన ఆనందం క్షణికమైనది మరియు వాస్తవానికి, దుఃఖములకు మూలం. వివేకవంతులు, అటువంటి పరిమితమైన ఆది, అంతములున్న  ఆనందాలను ఆమోదించరు.)

కర్మబోధ వికారంబులు
ధర్మతంత్ర సంధానములు
దుర్మదైక సందోహములు
కర్మదూరు లివి గాదందురు
॥కడు॥

karmabOdha vikAraMbulu

dharmataMtra saMdhAnamulu

durmadaika saMdOhamulu

karmadUru livi gAdaMduru         kaDu

 

Word to Word meaning: కర్మబోధ (karmabOdha) = what is the right action; వికారంబులు (vikAraMbulu) = and its inversions; ధర్మతంత్ర (dharmataMtra) = appropriate practices; సంధానములు (saMdhAnamulu) = joining together; దుర్మదైక (durmadaika) = arrogant and proud; సందోహములు (saMdOhamulu) = assemblage; కర్మదూరు (karmadUru) = who curse or rebuke action;  లివి గాదందురు (livi gAdaMduru) = reject, disobey;

 

Literal meaning: The arrogant reject and disobey proper actions (and their inversions). 

Explanation: This is not easy to explain. Let me try this thru an example. We all heard of the famous joke:  A HR Manager while going to office meets an accident and arrives in other world. God asks her to spend a day each in heaven and hell and make choice. On the third day, HR manager after due diligence chosessHell. (detailed text given at the end of explanations). Our actions are very much similar to this HR manager. It's not that we don’t understand what is good to do. It's our inner conviction which tilts the balance, very often to the wrong side.

Now compare it with this Bhagavad-Gita verse: अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुष:अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजित: || 3-36|| “atha kena prayukto ’yaṁ pāpaṁ charati pūruṣhaḥ / anichchhann api vārṣhṇeya balād iva niyojitaḥ” Arjun asked Krishna: ‘Why is a person impelled to commit sins, even unwillingly, as if he had been thrust by a force?’

It’s not by accident that the HR manager chose Hell to Heaven. Now, understand that Annamacharya is deadly accurate in his observations. One may think 500 years before, people’s attitudes would have been better. Unfortunately, this very verse is a demonstration of negation. So were the times of Arjun. That committing wrong acts appears to be ingrained in man from the very beginning.

భావము: అహంకారులు అకారణముగా ధర్మతంత్ర సంధానములను తిరస్కరిస్తారు; కర్మబోధలను (మరియు వాటి అసంఖ్యాకమైన విలోమాలను) అవివేకముగా ధిక్కరిస్తారు.

వివరణము: దీనిని వివరించడం అంత సులభం కాదు. నేను దీనిని ఒక ఉదాహరణ ద్వారా ప్రయత్నిస్తాను. మనమందరం ప్రసిద్ధ జోక్ గురించి వినే ఉంటాము ఆఫీసుకు వెళుతున్నప్పుడు ఒక HR మేనేజర్ ఒక ప్రమాదానికి గురై పరలోకానికి చేరుకుంటుంది. స్వర్గంలోను నరక౦లోను ఒక్కోక్క రోజు గడపమని, అపై ఎక్కడ ఉండాలో అనే నిర్ణయం అమెకే వదలివేస్తానని దేవుడు అంటాడు. మూడవ రోజున, విషయాలన్నింటినీ సమీక్షించి​, అనేక బేరిజులు వేసుకున్న తరువాత HR మేనేజర్ నరకాన్ని ఎంచుకుంటుంది. (వివరణల యొక్క చివర్లో పూర్తి జోకు జతపరిచాను.). మన చర్యలు ఈ మేనేజరును పోలి ఉంటాయి. ఏది మంచిదో మనకు అర్థం కాదని కాదు. కానీ మనిషికి విన్నదానికన్నా, చదివినదానికన్నా, తనపరిశీలనా శక్తి మీద నమ్మకము సహజమైన సమతుల్యతను వంచించి అనూహ్యముగా సత్యము నుండి దూరము జరుగేటట్లు చేస్తుంది. 

ఆమె పరిస్థితులు అంచనా వెయ్యడంలో పప్పులో కాలు వేసినదనుకొంటే, ఈ భగవద్గీత శ్లోకం చూడండి.  అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః ।అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ॥ 3-36 ॥ అర్జునుడు శ్రీకృష్ణమూర్తి నిట్లు ప్రశ్నించెను “ఓ కృష్ణా! అయితే మనుజుడు పాపము చేయవలెనని కోరనప్పటికిని, బలవంతంగా ఏదోశక్తి ఆవేశించి చేయిస్తున్నట్లు, ప్రేరేపింపబడును?”

పైన పేర్కొన్న HR మానేజర్ పొరపాటుగా స్వర్గానికి బదులు నరకాన్ని ఎంచుకోలేదు. అన్నమాచార్యులు చెబుతున్నది పచ్చి నిజం.  5౦౦ సంవత్సరాల క్రితం ప్రజల దృక్పథం మరి౦త మెరుగ్గా ఉండేదని తడబడికండి.   దురదృష్టవశాత్తు, ఈ కీర్తనయే కాదనడానికి నిదర్శనం. పైన శ్లోకము అధారముగా మహాభారత కాలమూ అంతే. పాపాలకు పాల్పడటం మొదటినుంచీ మనిషిలో నాటుకుపోయినట్లు కనిపిస్తుంది.

పరమభాగవత భవ్యమతులు
పరమబోధ సంభావకులు
తిరువేంకటగిరిదేవు సేవకులు
కరుణాధికు లివి గాదందురు
॥కడు॥

paramabhAgavata bhavya matulu

paramabOdha saMbhAvakulu

tiruvEMkaTagiridEvu sEvakulu

livi gAdaMduru kaDu

 

Word to Word meaning: పరమభాగవత (paramabhAgavata) = very deeply associated with right actions; భవ్య మతులు (bhavya matulu) = one with positive attitude;  పరమబోధ (paramabOdha) = the ultimate teaching;   సంభావకులు (saMbhAvakulu)= who respect;   తిరువేంకటగిరిదేవు (tiruvEMkaTagiridEvu) = the lord venkateswara’s; సేవకులు (sEvakulu) = servants;  కరుణాధికులు (karuNAdhiku) = one with great compassion;  the one’s with great compassion  లివి (livi) = these; గాదందురు (gAdaMduru) = reject. 

Literal meaning: Those deeply associated with right actions, those who respect the ultimate teaching, the servants of the Lord Venkateswara, and the compassionate reject transitory things. 

Explanation: Though this stanza does not need any explanation, I am still adding an anecdote. Srikrishna and Balarama arrive in Dwaraka at the invitation of Kansa. Sudhama is a garland maker. He offers the best garlands to Srikrishna and Balarama. In return, they ask Sudhama to seek a boon. Sudhama being a great devotee says he shall not need anything. However, he sought the following: 

nee paadakamalasEvayu

nee paadaarchakulatODi neyyamunu nitaaM
taapaara bhootadayayunu
daapasamaMdaara! naaku dayachEya@M gadE  ( Bhgavatham, 10th Chapter, Book 1)

Purport: O Lord! Allow me to serve your lotus feet with grace. O gracious one! Allow my relationship to blossom among your followers. Shower compassion on me so that I can treat others with kindness. 

Thus, those in deep meditation do not seek favours, but they wish to remain in the service of God.

భావము: పరమభాగవతులు, సత్యమతులు, పరమబోధను ఎరిగినవారు, తిరువేంకటగిరిదేవు సేవకులు కరుణాధికులు చాపల్యములను కాదందురు. ​

వివరణము: ద్వారకలో, శ్రేష్టమైన మాలలు అమ్మే సుదామునికి, శ్రీకృష్ణుడు వరంకోరుకోమని అనుగ్రహించాడు. ఆ సుదాముడు కోరిన వరం యిది.

క. నీ పాదకమలసేవయు

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
దాపసమందార! నాకు దయచేయఁ గదే. (తెలుగు భాగవతం 10th volume, First part-1272)

భావము:ఓ తపోధనులకు కల్పవృక్ష మైనవాడా! శ్రీకృష్ణా! కమలాల వంటి నీ పాదాల పరిచర్య, నీ పాదాలను పూజించే భక్తులతో మిత్రత్వం, ప్రాణులు అన్నిటిమీద అత్యంత అపరిమతమైన దయను నాకు ప్రసాదించు.

ఈ రకంగా తిరువేంకటగిరిదేవు సేవకులు ఏమీ ఆశించరు, భగవన్నామ స్మరణ తప్ప​. మనమే కోవకు చెందుతామో?


Recommendations for further reading:

 #1      71. రెప్పలమరఁ గదె రేపును మాపును (reppalamara gade rEpunu mApunu)

 #2       80. గాలినే పోయఁ గలకాలము (gAlinEpOya galakAlamu)

 

Summary of this Keertana:

Great men, reject vacillating, transient and trivial things.

The arrogant reject and disobey proper actions (and their inversions). 

Those deeply associated right actions, those who respect the ultimate teaching, the servants of the Lord Venkateswara and the compassionate reject transitory things.

 

కీర్తన సంగ్రహ భావము:

వివేకవంతులు విషయాలను కడుఁ చంచలములు, కడు నధ్రువములు కడు నల్పములని తిరస్కరించెదరు.  

 

అహంకారులు అకారణముగా ధర్మతంత్ర సంధానములను తిరస్కరిస్తారు; కర్మబోధలను (మరియు వాటి అసంఖ్యాకమైన విలోమాలను) అవివేకముగా ధిక్కరిస్తారు.

 

పరమభాగవతులు, సత్యమతులు, పరమబోధను ఎరిగినవారు, తిరువేంకటగిరిదేవు సేవకులు కరుణాధికులు చాపల్యములను కాదందురు. 

 

Copper Leaf: 25-4 Volume 1-152

 

 

Additional notes:

HR Manager in Heaven!

 

One day while walking down the street a highly successful HR Manager was hit by a bus and she died. Her soul arrived in the other world where she was greeted by God himself.

 

"Welcome to Heaven," said God."Well, what we're going to do is let you have a day in Hell and a day in Heaven and then you can choose whichever one you want to spend an eternity in."

 

"Actually, I think I've made up my mind, I prefer to stay in Heaven", said the woman.

"Sorry, we have rules."

 

And with that God put the HR Manager in an elevator and it went down-down-down to hell. The doors opened and she found herself stepping out into the hell with a beautiful golf course. And a country club and standing in front of her were all her friends - fellow executives that she had worked with and they were well dressed in evening gowns and cheering for her. They talked about old times.

 

She met the Devil who was really a nice guy and she was having such a good time that before she knew it, it was time to leave. Everybody waved goodbye as she got on the elevator. The elevator went up-up-up and opened back up at the Pearly Gates and found God waiting for her.

 

"Now it's time to spend a day in heaven," he said. So she spent the next 24 hours around on clouds and playing the harp and singing. She had a great time and before she knew it her 24 hours were up and God came and got her. "So, you've spent a day in hell and in heaven. Now you must choose your eternity,"

 

The woman paused for a second and then replied, "Well, I never thought I'd say this, I mean, Heaven has been really great and all, but I think I had a better time in Hell." So God escorted her to the elevator and again she went down-down-down back to Hell.

 

When the doors of the elevator opened she found herself standing in a desolate wasteland covered in garbage and filth. She saw her friends were dressed in rags and were picking up the garbage and putting it in sacks.

 

The Devil came up to her and put his arm around her. "I don't understand," stammered the woman, "Yesterday I was here and there was a golf course and a country club and we ate lobster and we danced and had a great time. Now all there is a wasteland of garbage and all my friends look miserable."

 

The Devil looked at her smiled and said: ... ... ... .... ....

"Yesterday we were recruiting you, today you're an employee".

 

అదనపు వివరణ

పరలోకంలో మానవ సంబంధాల మానేజర్

 

ఒక విజయవంతమైన HR మేనేజర్ ఒక రోజు వీధిలో నడుస్తున్నప్పుడు ఒక బస్సు ఢీకొట్టగా మరణించింది. ఆమె ఆత్మ పరలోకానికి చేరుకుంది, అక్కడ దేవుడే స్వయంగా స్వాగతించాడు.

 

"పరలోకానికి స్వాగతము" అని దేవుడు చెప్పాడు. సరే, మేము చేయబోయేది ఏమిటంటే, మీరు నరకంలో ఒక రోజు మరియు స్వర్గంలో ఒక రోజు ఉండడి, ఆపై మీరు శాశ్వతంగా ఎక్కడ ఉండాలో ఎంచుకోవచ్చు."

 

"వాస్తవానికి, నేను నేను స్వర్గంలో ఉండటానికి ఇష్టపడతాను", అని ఆ మహిళ చెప్పింది. "క్షమించండి, మాకు రూల్స్ ఉన్నాయి. ఆ రెంటినీ చూసిన తర్వాత చెప్పండి” అన్నాడు దేవుడు.

 

దానితో దేవుడు HR మేనేజర్’ను ఎలివేటర్లో ఉంచాడు మరియు అది నరకానికి క్రిందికి వెళ్ళింది. తలుపులు తెరుచుకున్నాయి మరియు ఆమె ఒక అందమైన గోల్ఫ్ కోర్సుతో నరకంలోకి అడుగు పెట్టింది. మరియు ఒక కంట్రీ క్లబ్ మరియు ఆమె ముందు నిలబడి ఆమె స్నేహితులు - ఆమె పని చేసిన తోటి ఎగ్జిక్యూటివ్లు మరియు వారు సాయంత్రం గౌన్లు ధరించి, ఆమెను ఉత్సాహపరిచారు. వారు జరిగిపోయిన పాత కాలం గుర్తుచేసుకుంటూ తియ్యటి మధురూహలలో గంటలు  తిరిగి పోయాయి.

 

ఆమె డెవిల్’ను కలుసుకుంది, అతను నిజంగా మంచి వ్యక్తి మరియు మర్యాదస్తుడు. ఇంక ఆమెకు తెలియకుండానే బయలుదేరే సమయం ఆసన్నమైంది. ఆమె ఎలివేటర్ ఎక్కగానే అందరూ వీడ్కోలు పలికారు. ఎలివేటర్ పైకి వెళ్లింది. తలుపు తెరుచుకుంది మరియు దేవుడు ఆమె కోసం వేచి ఉన్నాడు.

 

"ఇప్పుడు స్వర్గములో ఒక రోజు గడపాల్సిన సమయం ఆసన్నమైంది" అని ఆయన అన్నాడు. కాబట్టి ఆమె తరువాతి 24 గంటలు మేఘాలపై పరిగెత్తడం;  వీణ వాయించడం మరియు పాడటంలో గడిపేసింది. ఆమెకు గొప్ప ఆనందం కలిగింది.  ఆమెకు అనుకోకముందే 24 గంటలు గడిచిపోయాయి మరియు దేవుడు వచ్చి ఆమెను తీసుకెళ్ళాడు. "మీరు నరకంలో మరియు స్వర్గంలో ఒక రోజు గడిపారు. ఇప్పుడు మీరు శాశ్వతంగా ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవాలి." అన్నాడు.

 

ఆ స్త్రీ ఒక క్షణం ఆగి, ఆ తర్వాత ఇలా జవాబిచ్చింది, "సరే, నేను ఇలా చెబుతానని నేనెప్పుడూ అనుకోలేదు, అంటే, స్వర్గం నిజంగా గొప్పది మరియు అన్నిటికంటే అందమైనది, కానీ నాకు నరకంలో సమయం బాగా గడుస్తుందని నేను అనుకుంటున్నాను." కాబట్టి దేవుడు ఆమెను ఎలివేటర్ వద్దకు తీసుకువెళ్ళాడు. మళ్ళీ ఆమె నరకానికి తిరిగి వెళ్ళింది.

 

ఎలివేటర్ తలుపులు తెరిచినప్పుడు ఆమె చెత్త మరియు మురికితో కప్పబడిన నిర్మానుష్యమైన బంజరు భూమిలో నిలబడి ఉంది. ఆమె స్నేహితులు చిందరవందరగా దుస్తులు ధరించి, చెత్తను ఏరుకొని సంచుల్లో వేయడం ఆమె చూసింది.

 

డెవిల్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె చుట్టూ చేయి వేశాడు. "నాకు అర్థం కావడం లేదు," అని ఆ మహిళ తడబడింది, "నిన్న ఇక్కడకి వచ్చాను. అక్కడ గోల్ఫ్ కోర్స్ మరియు కంట్రీ క్లబ్ ఉండేవి కదా! మనము మంచి రొయ్యలకూర తిన్నాము;  నృత్యం చేసాము; అబ్బా! బలే గొప్పగా  గడిచింది కదా నిన్న​?. ఇప్పుడు అక్కడంతా చెత్తాచెదారంతో నిండిపోయింది, నా స్నేహితులందరూ దీనావస్తలో కనిపిస్తున్నారు."

 

డెవిల్ ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: ... ... ... . . . . .... ...."నిన్న నువ్వు మాకు అథిథివి. ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగివి".

 

2 comments:

  1. ఈ ఆధ్యాత్మిక కీర్తనలో అన్నమయ్య జ్ఞానులకు
    (వివేకవంతులకు),
    అజ్ఞానులకు(అవివేకులకు) మధ్యన గల వ్యత్యాసమును యెంతో విశేషంగా మానవాళికి తెలియజేస్తున్నాడు. అజ్ఞాన తిమిరానికి, జ్ఞానప్రకాశానికి అంతర మేమిటో, ఆత్మను తెలిసికొనుటకు అజ్ఞానావరణము యెంత ప్రతిబంధకమో నిశితంగా గ్రహిస్తే ద్యోతకం కాగలదు.

    *బుద్ధిమంతులు* చరాచర జగత్తులోని స్థావర జంగమాది దృశ్యపదార్థములు, భోగవిలాసములు నశించిపోయేవే యని,ఆశాశ్వతములేయని గ్రహించి వాటిని తిరస్కరిస్తారు.

    మూర్ఖులు, *అవివేకులు* మాయ వల్ల వాటిని శాశ్వతములని, ఆనందదాయకములని భ్రమించి జననమరణ చక్రములో చిక్కుకొని ముక్తిని పొందలేకున్నారు.

    అహంకారి, అజ్ఞాని ఉచిత కర్మలను,ధర్మసూత్రములను తిరస్కరిస్తారు ధిక్కరిస్తారు.

    విహితకర్మల నాచరించి, అనుష్ఠానం చేసేవారు, వేదశాస్త్రముల యందు అత్యంత విశ్వాసములు కలిగినవారు, గురువు యందు భక్తిప్రపత్తులు కలిగినవారు,దయకరుణలు స్వభావముగా కలిగియున్నవారు, అనన్యభక్తితో శ్రీపతిని సేవించువారు ప్రాపంచిక చంచలత్వమును విషయభోగములను తృణప్రాయంగా త్యజించెదరు.

    జ్ఞానులకు, అజ్ఞానులకు మధ్యగల వ్యత్యాసమును శ్రీకృష్ణ పరమాత్మ గీత కర్మసన్యాసయోగంలో ఈవిధంగా అర్జునుడికి ఉపదేశించాడు::

    *యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే|*
    *ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః||*
    (భగవద్గీత 5-22)

    "ఇంద్రియ వస్తు-విషయ సంపర్కం వలన కలిగే భోగాలు, ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా, అవి యథార్థముగా దుఃఖ హేతువులే. ఓ కుంతీ పుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది-అంతం (మొదలు-చివర) ఉంటాయి, కాబట్టి జ్ఞానులు వీటి యందు రమించరు."

    అర్జున ఉవాచ:
    *అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః|*
    *అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః||*
    (భగవద్గీత 3-36)

    అర్జునుడు అంటున్నాడు:" ఓ వృష్ణివంశీయుడా (శ్రీ కృష్ణా), ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానయినా, బలవంతంగా ఏదోశక్తి చేయించినట్టు, పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడతాడు?"

    గీతాశ్లోకములతో, భాగవత పద్యంతో
    కీర్తన యొక్క భావాన్ని వివరించటంలో శ్రీ చామర్తి శ్రీనివాస్ గారు సఫలీకృతులయ్యారు.
    ఓం నమో వేంకటేశాయ 🙏
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...