ANNAMACHARYA
123. తెలియక వూరక తిరిగేము
(teliyaka vUraka tirigEmu)
Introduction: This poem begins
modestly and then throws us into the whirlwind of life and death. Man's naivety
leads him to believe that he can conceal things from God. He believes he can
find the truth even while swimming in the drools of passion. Man, beware! Your mind is not a friend#1.
The simple to the exponential movement of this poem captures
the true vacillation of the mind. This poem is embellished with very apt words.
They ring the deeps sense of wrongdoing on the part of the listener. Artistry
of Annamacharya is in the game plan of this poem.
ఉపోద్ఘాతము: ఈ కీర్తన సరళంగా ప్రారంభమై
అకస్మాత్తుగా మనల్ని జీవన్మరణాల సుడిగాలిలో ముంచెత్తుతుంది. అవివేకము దైవము నుండి విషయాలను
దాచగలనని మనిషిని నమ్మేలా చేస్తుంది. ఎంగిలి కోరికలలో ఈదుతూ కూడా, అతను సత్యాన్ని కనుగొనగలడని
భావిస్తాడు. ఓ మానవుడా ఆరుగురు దొంగలతో కూడిన దొంగగురునికి (=నమ్మదగని మిత్రునికి
= మనస్సుకు) సత్యముతో పని యేమి? (ఆర్గురుముచ్చులఁ గూడిన దొంగగురుని కిందుల నిజమేది?)
చాలా సముచితమైన పదాలతో అలంకరించబడిన
ఈ కీర్తన సరళము నుండి అల్లోలకల్లోలము వరకు కలిగించు స్ఫురణ మనస్సు యొక్క నిజమైన ఊగిసలాటకు
సంకేతము. ఇది శ్రోతలకు హృదయంలో ఎక్కడో దారితప్పిన భావం ఱింగుమనిపించును. అన్నమాచార్యుల
కళానైపుణ్యం ఈ కీర్తన వ్యూహరచనలోనే చొప్పించారు.
కీర్తన:
తెలియక వూరక తిరిగేము చలమరి కగునా సంతతసుఖము ॥పల్లవి॥
హేయము కడుపున నిడుకొని యింకా ‘చీ’ యనని మాకు సిగ్గేది
పాయము పిడికిటఁ బట్టుచునుండేటి
కాయధారులకుఁ గలదా విరతి ॥తెలియక॥
అంగనల రతుల యాసల నీఁదేటి యెంగిలిమనుజుల కెగ్గేది
ముంగిట నార్గురుముచ్చులఁ గూడిన
దొంగగురుని కిందుల నిజమేది ॥తెలియక॥
జననమరణములు సరి గని కానని మనుజాధమునకు మహిమేది
యెనగొని శ్రీవేంకటేశు శరణ మిటు
గని మనకుండిన గతి యిఁక నేది ॥తెలియక॥
|
teliyaka vUraka tirigEmu chalamari kagunA saMtatasukhamu ॥pallavi॥
‘chI’ yanani mAku siggEdi
pAyamu piDikiTa baTTuchunuMDETi
kAyadhArulaku galadA virati ॥teliyaka॥
aMganala ratula yAsala nIdETi yeMgilimanujula keggEdi
muMgiTa nArgurumuchchula gUDina
doMgaguruni kiMdula nijamEdi ॥teliyaka॥
jananamaraNamulu sari gani kAnani manujAdhamunaku mahimEdi
yenagoni SrIvEMkaTESu SaraNa miTu
gani manakuMDina gati yika nEdi ॥teliyaka॥
|
Details and Explanations:
తెలియక వూరక తిరిగేము
చలమరి కగునా సంతతసుఖము ॥పల్లవి॥
teliyaka
vUraka tirigEmu
chalamari
kagunA saMtatasukhamu ॥pallavi॥
Word to Word meaning: తెలియక (teliyaka) = unknowingly; వూరక (vUraka)= అప్రయత్నముగా, అకారణముగా, without aim; తిరిగేము (tirigEmu) = move around; చలమరి (chalamari) = ఉడుకుబోతు, మాత్సర్యశీలుడు, an envious or jealous person, కగునా (kagunA) = is it possible?; సంతతసుఖము (saMtatasukhamu) = always comfortable? (here meaning of సుఖము should be taken similar to ‘not unhappy’)
Literal
meaning: O
Lord! We move around aimlessly. Where is the lasting happiness for the jealous?
Explanation: Naturally, almost everyone takes achieving success, having a caring family and children doing well as primary aims of life. What’s wrong in pursuing such a life? When a neighbour purchases a beautiful TV, Car, Mobile or even a bed sheet; immediately, we too are expected to own similar or better ones. This life of comparison is the seed of all the evils man faces.
భావము: తెలియక
వూరక (అప్రయత్నముగా, అకారణముగా) తిరిగేము.
మా లాంటి ఉడుకుబోతులకు శాశ్వత సుఖమెక్కడిది?
వివరణము: సహజంగానే, దాదాపు ప్రతి
ఒక్కరూ, జీవితంలో విజయాన్ని సాధించడం, ప్రేమగా ఉండే కుటుంబం మరియు పిల్లలు బాగా వృద్ధిలోకి
రావడం అనేవి జీవితానికి ప్రాథమిక లక్ష్యాలుగా తీసుకుంటారు. అలాంటి జీవితాన్ని కొనసాగించడంలో
తప్పేముంది? పొరుగువాడు ఒక అందమైన టివి, కారు,
మొబైల్ లేదా బెడ్ షీట్ కొనుగోలు చేసినప్పుడు; వెనువెంటనే, మనము కూడా అలాంటిదే లేదా
మెరుగైన వాటిని కలిగి ఉండాలని ఆశిస్తాము. ఈ పోలికలతో ముడిపడీన జీవితమే మనిషి ఎదుర్కొనే
అన్ని సవాళ్ళకు బీజము. ఇక ఉడుకుబోతులకు శాశ్వత సుఖమెక్కడిది?
హేయము కడుపున నిడుకొని యింకా
‘చీ’ యనని మాకు సిగ్గేది
పాయము పిడికిటఁ బట్టుచునుండేటి
కాయధారులకుఁ గలదా విరతి ॥తెలియక॥
hEyamu kaDupuna niDukoni yiMkA
‘chI’ yanani mAku siggEdi
pAyamu piDikiTa baTTuchunuMDETi
kAyadhArulaku galadA virati ॥teliyaka॥
Word to Word meaning: హేయము (hEyamu) = రోతయైనది విడువదగినది, That which is to be abandoned, abominable, vile; కడుపున (kaDupuna) = in the stomach, in the body; నిడుకొని (niDukoni) = ఉంచుకొని, storing; యింకా (yiMkA) ‘చీ’ యనని (‘chI’ yanani) మాకు (mAku) = to us; సిగ్గేది (siggEdi) = where is the feeling of guilt? పాయము (pAyamu)= youth, adulthood; పిడికిటఁ (piDikiTa) = fist or hand; బట్టుచునుండేటి (baTTuchunuMDETi) = holding in the hand; = కాయధారులకుఁ (kAyadhArulaku) = beings with body; గలదా (galadA) = is there? విరతి(virati) = విశ్రాంతి, విరామము, ఊరట, ceasing, stopping, cessation, rest, pause, intermission, interval.
Literal meaning: Despite recognising the awful, vile things within himself, man does not loathe himself. Does he feel remorse? Propped by the reassurance of his youth, Will he ever put an end to the sensual pleasure, even if only for a short time? (no).
Explanation: What are the wrong things we hide? We
have learnt to bear (or abandon) with unacceptable in the name of culture,
society and etiquette. How long can we tolerate? Surely a day will arrive we
shall breach it. Therefore, tolerance is only an instrument of adjournment.
When a person is aware that "he is jealous." He knows it's not right. Unfortunately, he is unable to digest this fact. He goes on to say to himself, "I am envious because of their selfish actions." No, I am resentful of their actions, not envious of them. They have irritated me. Their malicious intentions enraged me. Their greed is the root cause of my feelings. I'm not envious, but their appearance made me react. With their innuendos, they enraged me." “Its not my fault that I am jealous now”.
This way we convince ourselves that there is nothing wrong with us. We just don’t find any mistake from our side. O man, understand though we derive strength from these justifications, truly they are weaknesses. We do this too frequently and put-up brave face hour after hour, at the cost of truth. The real question Annamacharya is asking is: can we eschew either the liking or dislike so that we may never break it. (Sir, this requires long deliberation. I am leaving it to the reader)
Now connect this stanza with
this verse (2-3) in Bhagavad-Gita: क्लैब्यं मा स्म गम: पार्थ नैतत्त्वय्युपपद्यते | क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप (2-3) klaibyaṁ
mā sma gamaḥ pārtha naitat tvayyupapadyate kṣhudraṁ hṛidaya-daurbalyaṁ
tyaktvottiṣhṭha parantapa Purport:
Do not, O Parth. It is not appropriate for you to demonstrate impotency
or cowardice. Let go of mental fragility and brace yourself for action (of
war). The act of covering up we do (as
described above) is the cowardice Lord Krishna is asking us to shun.
భావము: మానవుడు హేయమైన, నీచమైన విషయాలను తనలో ఉన్నాయని తెలుసుకున్నప్పటికీ తనను తాను అసహ్యించుకోడే! సిగ్గు పడడే? అందుబాటులోని యవ్వనమిచ్చిన భరోసాతో
క్షణమైనా అనుభవించడం మానడే?
వివరణము: మనం దాచిపెట్టే నీచమైన విషయాలు ఏమిటి?
సంస్కృతి, సమాజం మరియు మర్యాదల పేరుతో ఆమోదయోగ్యం కాని వాటిని భరించడం (లేదా వదలివేయడం)
నేర్చుకున్నాము. మన౦ ఎ౦తకాల౦ సహి౦చవచ్చు? ఖచ్చితంగా ఏదోవొక రోజు మనము దానిని ఉల్లంఘిస్తాము.
అందువల్ల, సహనం అనేది వాయిదా వేయడానికి ఒక సాధనం మాత్రమే.
"అసూయపడుతున్నాను" అని గ్రహించినప్పుడు మానవుడు
సాధారణముగా, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఇలా అనుకొంటాడు. "వారి
స్వార్థమే నా అసూయకు కారణము." "లేదు, నిజానికి
వారిని చూసి అసూయపడను. వారి చర్యలు నాకు చిరాకు కలిగించాయి." "వారి
దురుద్దేశాలు నాకు కోపం తెప్పించాయి." "వారి దురాశే నా
భావాలకు మూలకారణం." “నేను అసూయపడను, కానీ వారి ముఖకవళికలు నన్ను ప్రతిస్పందించేలా
చేసాయి."
"వారి
వ్యంగ్యాస్త్రాలతో, వారు నాకు కోపం తెప్పించారు. అసలు నా
తప్పులేదు"
ఈ విధంగా మన తప్పేమీ లేదని మనల్ని మనం పరిపరి విధాలుగా
సమర్ధించుకుంటాం. ఒప్పించుకుంటాం. మన వైపు నుండి ఎటువంటి దోషమూ కానరాదు. మనుష్యుడా!
ఈ తర్కము నుండీ నిన్ను నీవు బలోపేతము చేసుకుంటున్నవని భావించవచ్చు. అది నిజానికి బలహీనత
అని అర్థ౦ చేసుకో. సత్యాన్ని పణంగా పెట్టి, గంటగంటకూ ధైర్యాన్ని కూడగట్టుకుంటాము. “పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ
వినురవేమ”.
అన్నమాచార్యులు అడుగుతున్న నిజమైన ప్రశ్న ఏమిటంటే: ఏదో ఒక రోజున మనమే ఏర్పాటు చేసుకున్న నీయమాలనే
భంగపరచ వలసిన పరిస్థితి రాకుండా, ఇష్టాయిష్టాలను విడనాడగలమా?
ఇప్పుడు భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని చూడండి. క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే
। క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ॥ భగవద్గీత 2-3 ॥ఓ అర్జునా!! నపుంసకత్వమునకు (పిరికితనమునకు)
లోను కావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా! మనసులోని అధైర్యము వీడి, కార్యాచరణకై
(యుద్ధమునకై) నడుము బిగింపుము. మనము చాపక్రింద, ఆఫీసు సొరుగుల్లోనూ, అటకలమీద ఎక్కించి
దాచి ఉంచే విషయాలు, వ్యక్తిగతమనే పేరుతోనూ మరుగున ఉంచే అభ్యంతరకరమైన విషయాలను ధైర్యముగా
విడనాడగలమా?
అంగనల రతుల యాసల నీఁదేటి
యెంగిలిమనుజుల కెగ్గేది
ముంగిట నార్గురుముచ్చులఁ గూడిన
దొంగగురుని కిందుల నిజమేది ॥తెలియక॥
aMganala ratula yAsala nIdETi
yeMgilimanujula keggEdi
muMgiTa nArgurumuchchula gUDina
doMgaguruni kiMdula nijamEdi ॥teliyaka॥
Word to Word meaning: అంగనల (aMganala) = ladies, girls; రతుల (ratula) = passions; యాసల (yAsala) = desires; నీఁదేటి (nIdETi) = ఈదు నటువంటి, swimming; యెంగిలి (yeMgili) = jhuta, defiled; మనుజుల (manujula) = men; కెగ్గేది (keggEdi) = అపరాధము / దోషము అనిపించదు, does not find fault / wrong; ముంగిట (muMgiTa) = ముందు, in front; నార్గురుముచ్చులఁ (nArgurumuchchula) = six thieves {here he is meaning కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు want, anger, infatuation, avarice, arrogance and envy) (ముచ్చు = మనసు దాచి మాటలాడకుండ ఉండువాడు) గూడిన (gUDina) = becoming an accomplice; దొంగగురుని (doMgaguruni) = కపట గురుడు (= మనస్సు), the wrong teacher (= the mind) కిందుల (kiMdula) = here in this world; నిజమేది (nijamEdi) = where is the truth?
Literal
meaning: Men don’t
find fault to love, to float and to swim in pools of drool passions. How can this
thief assisted by six accomplices ever know the truth?
Explanation: Annamacharya called the mind as doMgaguruDu.#2 (దొంగగురుడు = Untrustworthy Teacher) because we see, learn and understand and judge everything from our intellect. It is perpetually influenced by want, anger, infatuation, avarice, arrogance and envy.
Hiranyakashipu (in Bhagavatam) was the strongest person of his times. He conquered all the temporal worlds and heaven. Even Gods were under his slavery. He dissuaded and then tortured his son Prahalad from following Lord Vishnu. One of the replies by Prahalada to his father is as below.
Lōkamu lanniyun gaḍiyalōna
jayin̄cinavām̐ḍa vindriyā
Lord of the Lords! You are without a doubt the most powerful being in the universe. Despite this, Sir, you were unable to control your mind. You don't need an opponent because your six adversaries (desire, wrath, infatuation, avarice, arrogance, and envy) have you under their control. (You are your worst enemy.) Father! setting aside these impurities, have a relook with clarity.
Thus, it’s no wonder Annamacharya
described want, anger, infatuation, avarice, arrogance and envy as six
thieves (ఆర్గురుముచ్చులు
= Argurumuchchulu).
Now see the connect with Bhagavad-Gita verse 2-67. इन्द्रियाणां हि चरतां
यन्मनोऽनुविधीयते | तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि || 67|| indriyāṇāṁ hi
charatāṁ yan mano ’nuvidhīyate tadasya harati prajñāṁ vāyur nāvam ivāmbhasi PURPORT:
Just as a strong wind
sweeps a boat off its chartered course on the water, even one of the senses on
which the mind focuses can lead the man astray.
భావము: అంగనల రతులనే ఎంగిలి ఆశలలో ఈదు మనిషికి అపరాధము దోషము కనబడవే.
ఆరుగురు ముచ్చులతో కూడిన దొంగగురునికి సత్యమేనాటికైనా తెలిసేనా?
వివరణము: అన్నమాచార్యులు మనస్సును దొంగగురుడు.#2 (= నమ్మదగని మిత్రుడు) అని హెచ్చరిస్తున్నాడు, ఎందుకంటే మనం మన మనస్సు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అను ఆర్గురుముచ్చులు (ఆరుగురు దొంగలు) ద్వారా నిరంతరం ప్రభావితమవుతుంది. ఈ సందర్భంగా ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి ఇచ్చిన సమాధానము ప్రస్తావించడం ఉచితమని భావిస్తాను.
ఉ. లోకము
లన్నియున్ గడియలోన జయించినవాఁడ వింద్రియా
రాక్షసరాజా! లోకాలు అన్నింటినీ క్షణంలో జయించావు; కానీ నీ లోని మనస్సునూ, ఇంద్రియాలనూ గెలువలేకపోయావు; వాటి ముందు నువ్వు ఓడిపోయావు; కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులు నిన్ను బందీ చేశారు; ఆ భయంకరమైన శత్రువులను అరిషడ్వర్గాలు అంటారు; వాటిని జయించి నశింపజేసావంటే జీవకోటి సర్వంలోనూ నీకు విరోధి ఎవ్వరూ ఉండడు. నా విన్నపం మన్నించు.
ఇప్పుడు ఈ చరణాన్ని భగవద్గీత
2-67 శ్లోకంతో పోల్చి చూడండి ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే / తదస్య హరతి
ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి భావము: బలమైన గాలి నీటిపై నడచు ఒక పడవను దాని నీయమిత మార్గం నుండి తప్పించునట్లే,
మనస్సు దృష్టి కేంద్రీకరించే ఇంద్రియాలలో ఒకటియైనా కూడా మనిషిని తప్పుదారి పట్టించగలదు.
జననమరణములు సరి గని కానని
మనుజాధమునకు మహిమేది
యెనగొని శ్రీవేంకటేశు శరణ మిటు
గని మనకుండిన గతి యిఁక నేది ॥తెలియక॥
jananamaraNamulu sari gani kAnani
manujAdhamunaku mahimEdi
yenagoni SrIvEMkaTESu SaraNa miTu
gani manakuMDina gati yika nEdi ॥teliyaka॥
Word to Word meaning: జననమరణములు (jananamaraNamulu) = life and death; సరి గని కానని (sari gani kAnani) = సరియైన దృక్పధమున చూడని, don’t see from appropriate perspective; మనుజాధమునకు (manujAdhamunaku) = meanest among the men; మహిమేది (mahimEdi) = Where is greatness or glory? యెనగొని (yenagoni) = కూడుకొని, by joining; శ్రీవేంకటేశు (SrIvEMkaTESu) = Lord Venkateswara; శరణ (SaraNamu) = a refuge, protection; మిటు (miTu) = this way, this side; గనిమి (gani) = having seen; అనకుండిన (manakuMDina) = if not declared; గతి (gati) = త్రోవ, తెలివి, ఉపాయము, way, intelligence, contrivance; యిఁక నేది (yika nEdi) = still where?
Literal meaning: The foolish, unable to see life and death in the proper context, cannot comprehend the splendours of God. Even so, individuals who do not clearly see Lord's protection will not be liberated.
Explanation: To
understand the wording jananamaraNamulu sari gani kAnani (జననమరణములు
సరి గని కానని) let me present a Bhagavad-Gita verse. समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् | विनश्यत्स्वविनश्यन्तं य: पश्यति स पश्यति || 13-28|| samaṁ sarveṣhu bhūteṣhu tiṣhṭhantaṁ parameśhvaram vinaśhyatsv avinaśhyantaṁ yaḥ paśhyati sa
paśhyati Purport: Possibly it’s the only wisdom which sees that one which is equally there
in all the beings, which understands the imperishable in this perishable body.
That which makes you aware that you are alive;
that which prevents you from becoming aware of your death; and that which is
aware of its own existence even after your death may be referred to as Truth
(or God). However, in our material world of certainties, we wish to move from
the known to the known. There is nothing new in this movement.#3 Almost
all of us are unable to see life and death in
the proper context Thus, Annamacharya is denouncing
dull material intelligence from which we operate.
Why did Annamacharya describe the general public as foolish men (మనుజాధములు)? Man wants to enjoy coffee in his favourite
taste. Same way, he conjures God with certain anticipations and ideas
conforming to his imagination. It’s usual for us to extract
long-forgotten things on the Internet, from the memories and sources shared by
so many people. But impishly man thinks, he can find a god made to the order of
their stipulations. What else can be stupidity? Where is the question of their deliverance?
భావము: సరియైన దృక్కోణములో జీవన్మరణాలను గ్రహించలేని మనుజాధములు (మూర్ఖులు)
దేవుని మహిమలను ఎఱుగలేరు. అటు శ్రీవేంకటేశు
రక్షా చరణములను అంటిపెట్టుకొని ఉండని వారి గతి యిఁక ఏమి?
వివరణము: “జననమరణములు సరి గని కానని” అన్నదానికి
అర్ధము వివరించుటకు ముందు ఈ భగవద్గీత శ్లోకమును చూడండి. సమం
సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ । వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ॥ 13-28 ॥ భావము: అర్జునా!! ఎవడైతే
సమస్త ప్రాణుల యందు సమముగా యున్నట్టి పరమాత్మను, ఆయా ప్రాణుల దేహాలు నశించిననూ
నశింపని దానిగా గమనించినవాడే ద్రష్ట.
ఒక ప్రాణి దేహము నశించిననూ అంటే తన వునికిని ఎరుగునదేమి? _అనగా నువ్వు నువ్వుగా దేనికైతే తెలుస్తుందో, దేనివలన నువ్వు మరణించావని నీకు తెలియదో_ అదియే ఆత్మ లేదా క్షేత్రజ్ఞుడు
లేదా భగవంతుడు అనుకోవచ్చును. అది (ఆత్మ/క్షేత్రజ్ఞుడు/భగవంతుడు)
సత్ (ఉన్నది) అనిగాని, అసత్ (లేదని) అనిగాని
నిర్ధారించలేము (భగవద్గీత 13-13). అయితే, ఖచ్చితత్వాలతో కూడిన మన భౌతిక లోక౦లో, మనకు తెలిసినవాటి ను౦డి
తెలిసినవాటికి మారాలని మన౦ కోరుకు౦టా౦. అందులో వింతేమున్నది? కొత్తేమున్నది?#3 అందువలన, అన్నమాచార్యులు మనం
అభిలషించే నిస్తేజమైన పదార్థ సమ్మిళిత మేధస్సును నీరసిస్తున్నారు. కాబట్టి,
అన్నమాచార్యులు, మనమంతా జననమరణములు సరియగు కోణము నుండి పరిశీలించలేని జడులమని అన్నారు.
అన్నమాచార్యులవారు మనందరినీ మనుజాధములని ఎందుకన్నారు?
మనిషి, కాఫీని తనకు ఇష్టమైన రుచిలో అనుభవించు నట్లే, తిరిగి తిరిగి జ్ఞప్తికి
తెచ్చుకొనగలిగిన అనుభూతినే దైవము నుంచీ ఆశిస్తున్నాడు. ఎప్పుడో మరచిపోయిన విషయాలను
అనేకానేకమంది పంచుకొన్న జ్ఞాపకముల, అధారముల నుండి అంతర్జాలములో మీటలు నొక్కి వెలికి
తీయునట్లుగా, తిరిగి మాటలలో వర్ణించలేని దైవమను అనుభూతిని కొన్ని బటన్లు నొక్కి గణక
యంత్రము నుంచి బయటకు తీద్దామనుకొంటాడు. సాధ్యమేనా? మనిషి జీవితంలో అనేకానేక కార్యక్రమాలలో
మునిగి, అత్యంత సున్నితమైన దైవము విషయంలో తన పూర్తి ధ్యాసను ఇవ్వకుండా, కాలాయాపన చేసేస్తాడు.
మనుజాధములన్నది ఇటువంటి అవివేకులనే. అటువంటి వారికి విముక్తి అన్న ప్రశ్నే ఉదయించదు.
References and Recommendations for
further reading:
#1 77. ఒక్కఁడే
అంతర్యామి వుపకారి చేపట్టు (okkaDE aMtaryAmi vupakAri chEpaTTu)
#2 43 మదమత్సరము
లేక మనసుపేదై పో (madamatsaramu lEka manasupEdai pO)
#3 108.
గోనెలె కొత్తలు కోడెలెప్పటివి (gOnele kottalu kODeleppaTivi)
Summary of this Keertana:
O Lord! We move around aimlessly. Where is the lasting happiness for the
jealous?
Despite recognising the awful,
vile things within himself, man does not loathe himself. Does he feel remorse? Propped
by the reassurance of his youth, Will he ever put an end to the sensual
pleasure, even if only for a short time? (no).
Men don’t find fault to love, to float and to swim in pools of drool
passions. How can this thief assisted by six accomplices ever know the truth? (nope)
The foolish, unable to see life and
death in the proper context, cannot comprehend splendours of God. Even so,
individuals who do not clearly see Lord's protection will not be liberated.
కీర్తన సంగ్రహ భావము:
తెలియక వూరక (అప్రయత్నముగా, అకారణముగా) తిరిగేము. మా లాంటి ఉడుకుబోతులకు శాశ్వత సుఖమెక్కడిది?
మానవుడు హేయమైన, నీచమైన
విషయాలను తనలో ఉన్నాయని తెలుసుకున్నప్పటికీ
తనను తాను అసహ్యించుకోడే! సిగ్గు పడడే? అందుబాటులోని
యవ్వనమిచ్చిన భరోసాతో క్షణమైనా అనుభవించడం మానడే?
అంగనల రతులనే ఎంగిలి ఆశలలో ఈదు మనిషికి అపరాధము దోషము కనబడవే.
ఆరుగురు ముచ్చులతో కూడిన దొంగగురునికి సత్యమేనాటికైనా తెలిసేనా?
సరియైన దృక్కోణములో జీవన్మరణాలను గ్రహించలేని
మనుజాధములు (మూర్ఖులు) దేవుని మహిమలను ఎఱుగలేరు.
అటు శ్రీవేంకటేశు రక్షా చరణములను అంటిపెట్టుకొని ఉండని వారి గతి యిఁక ఏమి?
Copper Leaf: 88-4 Volume 1-432
అరిషడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ,మద,మత్సరములు మనిషికి అంతర్గత శత్రువులు. ఇవి మనయందే ఉన్ననూ, వాటికి లోబడి అజ్ఞానతిమిరము వలన తాత్కాలికమైన సుఖం కోసం వెంపర్లాడతాము. అసూయాగ్రస్తులైన మానవులకు శాంతి, సుఖము ఎక్కడిది?స్త్రీవ్యామోహం, మోహంలో చిక్కుకున్నవానికది కీడు చేయునది యని గ్రహించలేడు.
ReplyDeleteఅరిషడ్వర్గాలకు మూలకారణం మనస్సేయని యెఱుగక అశాంతికి లోనై మనిషి అధోగతి పాలగుచున్నాడు. వీటి దుష్ప్రభావం తెలిసి కూడా మనిషి తనను తాను అసహ్యించుకొనడు.
శలభం మంట చుట్టూ తిరిగి మంటలో పడి నశిస్తున్నట్లుగా మనిషి కూడా అరిషడ్వర్గముల వలన నశించుచున్నాడు.
జీవన్మరణముల రహస్యమును గ్రహించలేని మూర్ఖులు అంటే ఆత్మానాత్మ జ్ఞానం లేని అవివేకులు
పరమాత్మను గ్రహించలేరు. ముక్తిని పొందలేరు అని అన్నమయ్య తత్వబోధ చేస్తున్నాడీ అద్వితీయమైన కీర్తనలో.
చామర్తి శ్రీనివాస్ గారి వ్యాఖ్యానం బహు
లెస్స.
ఓం తత్ సత్ 🙏
కృష్ణ మోహన్
ఓం శ్రీ సాయినాథాయనమః
ReplyDeleteనేను అనే భావమును వీడిన గాని అరిషడ్వార్గములను జయించుట దుర్లభము అని అందరికి తెలిసిన విషయమే. అందుకే ఎప్పుడైతే నేను ఎదుటివాడికి ఏమి చెయ్యకూడదో మనము తెలుసు కో గలిగితే మనలను మనం సగం జయించినట్టు. అంతే కాకుండా అందరిలో గల మంచి తనాన్ని మాత్రమే చూడగలిగితే అంతకు మించిన సద్గుణము ఉండదు. ఇటువంటి భావాలకు సద్గురు భావము మనలను సన్మార్గమున నడుపునని తెలుపుటకు నేర్పించిన భగవద్భక్తి తో కూడిన శ్రద్ధ మరియు సబూరి.