ANNAMACHARYA
124. ఏమి గల దిందు నెంత గాలంబైన
(Emi gala diMdu neMta gAlaMbaina)
Introduction: This poem, with
its series of simile after simile, is yet another example of Annamacharya's
vivacity. Not mere similes, but a precise expression that leaves the reader
speechless.
Annamacharya was not authoring the poems to
make up a volume to boast. He was trying hard to convey something which is very
challenging to comprehend. This poem is a good example of precision and brevity.
ఉపోద్ఘాతము: ఉపమానం తరువాత ఉపమానముల పరంపరతో కూడిన ఈ కీర్తన అన్నమాచార్యుల ప్రతిభకు మరొక ఉదాహరణ. కేవలం ఉపమానాలు మాత్రమే కాదు, నిర్దుష్టమై, కొంచెమైనను హెచ్చుతగ్గులులేని వ్యక్తీకరణ పాఠకుడిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
అన్నమాచార్యులు అర్థం చేసుకోవడానికి చాలా క్లిష్టమైనదానిని తెలియజేయడానికి తీవ్రంగా
ప్రయత్నిస్తున్నారు. వారు హృదయంలోని భావాలను వెలికితెచ్చేందుకు విశ్వప్రయత్నము చేయుచున్న
విషయము సుస్పష్టం. ఈ కీర్తన ఖచ్చితత్వానికి, క్లుప్తతకు మంచి ఉదాహరణ.
కీర్తన:
ఏమి గల దిందు నెంత గాలంబైన కొండవంటిది యాస, గోడ వంటిది
తగులు కంచువంటిది మనసు, కలిమిగల
దింతయును ఆఁకవంటిది జన్మ, మడవివంటిది
చింత |
Emi gala diMdu neMta
gAlaMbaina[ koMDavaMTidi yAsa,
gODa vaMTidi tagulu kaMchuvaMTidi manasu,
kalimigala diMtayunu AkavaMTidi janma,
maDavivaMTidi chiMta |
Details and Explanations:
ఏమి గల దిందు
నెంత గాలంబైన
పామరపు భోగ మాపదవంటి దరయ ॥ఏమి॥
Emi gala diMdu neMta gAlaMbaina
pAmarapu bhOga mApadavaMTi daraya ॥Emi॥
Word to Word meaning: ఏమి (Emi) = what; గల దిందు (gala diMdu) = is there in this? నెంత గాలంబైన[1] (neMta gAlaMbaina) = however much time, how long one may; పామరపు (pAmarapu) = undignified, illiterate; senseless, vulgar; భోగము (bhOgamu) = enjoyment; ఆపదవంటిది (ApadavaMTidi) = similar to misfortune, calamity, adversity; అరయ (araya) = విచారింపగా, on consideration, on examination.
Literal meaning: However long one may enjoy the undignified, illiterate, senseless sensual pleasures of this material world; they are truly calamities on examination. #1#2
Explanation: Let us recall the words of Paravastu Chinnaya Suri (in the story mithrabhedam of Panchatantra) that "Pushing down a boulder it is not as strenuous as pushing it up" The sinful, disrespectful, and meaningless sensory enjoyment can be likened to the pushing down of the great rock from the top of a hill. This not only usurps energy but also wastes time. In a way, we are all constantly working in vain, like Sisyphus in Greek mythology.
భావము: ఈ ప్రపంచంలోని పామరపు (అగౌరవమైన, అర్థరహినమైన) ఇంద్రియ సుఖాలను
ఎంత కాలం అనుభవించిననూ, యథార్థముగా అవి ఆపదలే. #1#2
వివరణము: "మహాగ్రావమును గ్రావాగ్రము
నెక్కించుటం బోలెఁ గ్రిందికిఁ ద్రోచుట దుష్కరము గాదు" అన్న (మిత్రభేదము నందలి) పరవస్తు
చిన్నయ సూరి గారి మాటలు గుర్తుకు తెచ్చుకొందాము. అగౌరవమైన, అర్థరహినమైననూ
ఉవ్విళ్ళూరించు పామరపు భోగమును మహాగ్రావమును గ్రావాగ్రము నుండి క్రిందికి త్రోచివైచుటతో
పోల్చవచ్చును. ఇది శక్తిని దోచుకోవడమే కాకుండా సమయాన్ని కూడా వృధా చేస్తుంది.
ఒకరకంగా చెప్పాలంటే మనమందరం గ్రీకు
పురాణాల్లోని సిసిఫస్ లాగా నిరంతరం వ్యర్థముగా పనిచేస్తున్నాం.
కొండవంటిది యాస,
గోడ వంటిది తగులు
బెండువంటిది లోని పెద్దతనము
పుండువంటిది మేను, పోలించినను మేడి-
పండువంటిది సరసభావ మింతయును
॥ఏమి॥
koMDavaMTidi yAsa, gODa vaMTidi tagulu
beMDuvaMTidi lOni peddatanamu
puMDuvaMTidi mEnu, pOliMchinanu mEDi-
paMDuvaMTidi sarasabhAva miMtayunu ॥Emi॥
Word to Word meaning: కొండవంటిది (koMDavaMTidi) = like a mountain; యాస (yAsa) = desire; గోడ వంటిది (gODa vaMTidi) = like a wall; తగులు (tagulu) = bond, relation; బెండువంటిది (beMDuvaMTidi) = తేలికైనది, శక్తిలేనిది , not of much energy, superficial; లోని (lOni)= inside; పెద్దతనము (peddatanamu) = headship, leadership; పుండువంటిది మేను (puMDuvaMTidi mEnu) = body is like an ulcer or boil; పోలించినను (pOliMchinanu) = on comparison; మేడి-పండువంటిది (mEDi-paMDuvaMTidi) = like useless, like futile; {మేడిపండు = a sort of berry or fig. Often symbolically used to indicate a beautiful outer with nothing valuable inside as it is usually comes with insects inside.} సరసభావము (sarasabhAvamu) = juicy sensual feelings: ఇంతయును (iMtayunu) = all this.
Literal meaning: Hope is like an impassable mountain. Relationships are impenetrable barriers. Leadership and headship are shallow pursuits. This body is like a boil on the verge of bursting. (The more you mess with it, the more it becomes ingrained in your mind). Beauty, art, and sensual feelings are like appealing fruit with insects inside.
Explanation: Friends, there is a need to discuss
the meaning of beMDuvaMTidi
lOni peddatanamu (బెండువంటిది లోని పెద్దతనము = Leadership
and headship are shallow pursuits) Let me do it by sharing the life of Jiddu Krishnamurti. : Jiddu Krishnamurti has been
raised by theosophists as a world teacher. He was head of a rich worldwide organization “Order of the Star in the East”. He had many followers and many benefactors.
He was endowed with rare honors that were not there anywhere else in the world. People used to pour roses in the way he walked. One gentleman offered a magnificent mansion and five thousand acres of land. However, he refused. Krishnamurti did not value those honors and continued to live his normal life. In the end, the pressure to officially accept the “Jagadguru” (World Teacher) increased. He didn't like it. He was against what was happening outside of him. He finally abolished the "Order of the Star in the East" in 1929 at Amen, Holland, declaring that he was not a World Teacher.
Whole world was amazed at this great sacrifice. All
the elders like Dr. Annie
Besant suffered from
depression. They were forced to
change their opinion.
But to no avail. He went
on to declare that
he is Krishnamurti, not a jagadguru. In the end there was no reconciliation.
Everywhere there was silence
with dissatisfied hearts. From
then on, Krishnamurti
was an independent man, a free-thinking,
a neo-humanist, who did not seek
anyone's favors, did not seek
anyone's help, did not care
for anyone's accusations, and recognized the reality
of the struggle
of life and became a
great sculptor of life. (From
Wikipedia)
భావము: ఆశ ఎప్పటికీ కరగని కొండ. తగులు (సంబంధ బాంధవ్యాలు) దాటలేని గోడ
(అభేద్యమైన అడ్డంకులు) వంటివి. పెద్దతనము నాయకత్వ౦ అనేవి నిస్సారమైన అన్వేషణలు. ఈ దేహము
పగలడనికి సిద్ధంగా ఉన్న పుండు వంటిది. (దానిని తాకిన కొద్దీ మనస్సులో అంత ఎక్కువగా
పాతుకుపోతుంది). అందం, కళ మరియు సరస భావములు లోపల కీటకాలతో ఉన్న ఆకర్షణీయమైన మేడిపండు
పండు వంటివి.
వివరణము: మిత్రులారా "బెండువంటిది లోని పెద్దతనము" ను గురించి కొంత విచారింప వలసి ఉన్నది. ప్రపంచంలో ఎక్కడలేని గౌరవాలు జిడ్డు
కృష్ణమూర్తికి జరగసాగేయి. అతను నడచేదారిలో గులాబిపూలు పోసేవారు. హాలెండ్ లో ఒకరు బ్రహ్మాండమైన
సౌధాన్నీ, అయిదువేల ఎకరాలు భూమిని సమర్పిస్తామంటే వద్దని నిరాకరించాడు. ఇటువంటి అద్భుతమైన
గౌరవాలు జరుగుతున్నప్పటికీ కృష్ణమూర్తి ఆ గౌరవాలకు విలువ ఇవ్వక, తన ఎప్పటి సాదా జీవితాన్నే
గడపసాగేడు. చివరకు అధికారపూర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఎక్కువైంది.
అది తనకు ఇష్టంలేదు. తనకు బయట జరుగుతున్న దానికి అంతకూ వ్యతిరేకం కాజొచ్చాడు. తన విశ్వాసానికి
విరుద్ధంగా ప్రాపంచిక కీర్తి నిమిత్తమో, పెద్దలకు ఆశాభంగం చేయకుండా ఉండే నిమిత్తమో,
భౌతిక లాభాల నిమిత్తమో, అతను ప్రవర్తించదలచక చివరకు 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో
తాను జగద్గురువును కాదని ప్రకటించి "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్
"ను రద్దుచేశాడు.
ఈ మహాత్యాగానికి జగత్తంతా విస్తుపోయింది. డాక్టర్ అనిబిసెంట్
లాంటి పెద్దలంతా నిరాశతో బాధపడ్డారు. అభిప్రాయాన్ని మార్చుకోమని ఒత్తిడి తెచ్చారు.
కాని లాభం లేకపోయింది. తాను జిడ్డు కృష్ణమూర్తినే కాని జగద్గురువును కానని చాటసాగేడు.
చివరకు లాభం లేకపోయింది. ఎక్కడివారక్కడ అసంతృప్త హృదయాలతో మౌనం దాల్చారు. అప్పటినుంచీ
కృష్ణముర్తి స్వతంత్రమానవుడు, స్వేచ్ఛాచింతన కలవాడు, నవమానవతావాది, ఎవరి అభిమానాలనూ
ఆశించక, ఎవరి సహాయాలనూ కాంక్షించక, ఎవరి నిందలనూ లెక్కచేయక, జీవన సంగ్రామపు వాస్తవాన్ని
గుర్తించి, గొప్ప జీవన శిల్పిగా రూపొందాడు. (వికీపీడియా నుండి)
కంచువంటిది మనసు,
కలిమిగల దింతయును
మంచువంటిది, రతి భ్రమతవంటిది
మించువంటిది రూపు, మేలింతయును ముట్టు-
పెంచువంటిది, దీనిప్రియ మేమి బ్రాఁతి
॥ఏమి॥
kaMchuvaMTidi manasu, kalimigala diMtayunu
maMchuvaMTidi, rati bhramatavaMTidi
miMchuvaMTidi rUpu, mEliMtayunu muTTu-
peMchuvaMTidi, dInipriya mEmi brAti ॥Emi॥
Word to Word meaning: కంచువంటిది (kaMchuvaMTidi) =like a bell metal; మనసు (manasu) = mind; కలిమిగల దింతయును (kalimigala diMtayunu) = Whatever considered as wealth; మంచువంటిది (maMchuvaMTidi) = is like a melting snow; రతి (rati) = Sensuousness భ్రమతవంటిది (bhramatavaMTidi) మించువంటిది (miMchuvaMTidi) రూపు (rUpu) మేలింతయును (mEliMtayunu) ముట్టు-పెంచువంటిది (muTTupeMchuvaMTidi) = అంటు తగిలినవారు తాకిన మట్టిపెంకు = అనగా ఏమాత్రమూ విలువ లేనిది = an earthen shell touched by an infected = useless, valueless; దీనిప్రియ మేమి బ్రాఁతి, (dInipriya mEmi brAti) = To love it is an illusion.
Literal meaning: The mind is like bell metal, makes sound matching the way you touch it.
(The mind is making only a reaction like a bell metal). All that we consider a wealth
shall melt like snow. Sensuousness is similar dizziness. Beautiful form or beautiful
shape is like sparkle and glitter (that vanishes soon). All that is assumed to
be good is like an earthen shell touched by an infected, implying it’s of no
value. All these are illusions.
Explanation: Why the mind is said to be reactive? Friends! Understand that the mind is formed by a series of experiences. It is comparing always with what had happened in the past. When you see a beautiful rainbow, apart from recognizing vivid colours the mind compares what you had seen last year. Then the little judge comes into play to determine that these colours are paler than last year. Thus, the mind meddles with what we are experiencing. It confuses a man with the screens of his choice. That’s why kaMchuvaMTidi manasu (కంచువంటిది మనసు) is an appropriate simile.
భావము: మనసు కంచులా ఎటుల తాకిన అటుల పల్కును (మనసు కంచులా ప్రతిక్రియనే చూపును). కలిమి అనుకొను అంతయును మంచులా కరగిపోవును. రతి మైకము వంటిది. తళుకు, మెఱపుల వంటిది రూపు (త్వరలోనే మాయమగునని భావము). మేలు ఇంతయును అనుకొంటూ ఏమాత్రమూ విలువ లేనిదానిని చేకొనుదురు. దీనిని ప్రియమనికొనుటయే భ్రాంతి.
వివరణము: మనస్సు ఎందుకు ప్రతిస్పందనాత్మకమని , ప్రతిక్రియాశీలకమని అంటారు? స్నేహితులారా! అనుభవాల పరంపర ద్వారా మనస్సు ఏర్పడుతుందని ఇంతకు ముందు తెలుసుకున్నాము. ఇది ఎల్లప్పుడూ గతంలో జరిగిన సంఘటనలతో ప్రస్తుతం జరుగుతున్న వాటిని పోలుస్తూ ఉంటుంది. మీరు అందమైన ఇంద్రధనుస్సును చూసినప్పుడు, స్పష్టమైన రంగులను గుర్తించడంతో పాటు, మనస్సు గత సంవత్సరం మీరు చూసిన దానితో పోలుస్తుంది. అప్పుడు ఓ బుల్లి న్యాయమూర్తి ఈ రంగులు గత సంవత్సరాల కంటే లేతగా ఉన్నాయని తీర్మానిస్తాడు. ఆ రకంగా మనస్సు మనం అనుభవిస్తున్న దానితో జోక్యం చేసుకుంటుంది. తనకు నచ్చిన తెరలతో మనిషిని భ్రమింప చేస్తుంది. అందుకే కంచువంటిది మనసు అనడము చాలా యోగ్యమైన ఉపమానము.
ఆఁకవంటిది జన్మ,
మడవివంటిది చింత
పాఁకువంటిది కర్మబంధమెల్ల
యేఁకటను దిరువేంకటేశుఁ దలచిన కోర్కి
కాఁక సౌఖ్యములున్న గనివంటి దరయ
॥ఏమి॥
AkavaMTidi janma, maDavivaMTidi chiMta
pAkuvaMTidi karmabaMdhamella
yEkaTanu diruvEMkaTESu dalachina kOrki
kAka saukhyamulunna ganivaMTi daraya ॥Emi॥
Word to
Word meaning: ఆఁకవంటిది
(AkavaMTidi) = అడ్డగింత, చెఱ, నిషేధము
వంటిది, like prohibition, like custody, like a check; జన్మము (janmamu) = birth; అడవివంటిది
(aDavivaMTidi) = not a suitable place to live;
చింత (chiMta) = వగపు, తలపు, reflection, thought, musing; పాఁకువంటిది (pAkuvaMTidi) = పాఁకుడు వంటిది,
జారిపోవునది, పట్టుకొనుటకు వీలుకానిది, like mossy or slimy or slippery; కర్మబంధమెల్ల (karmabaMdhamella)
= all the ties of relationship; యేఁకటను (yEkaTanu) = మిక్కిలి ఆపేక్షతో,
with great interest; దిరువేంకటేశుఁ (diruvEMkaTESu) = Lord Venkateswara; దలచిన (dalachina) = think
of; కోర్కికాఁక (kOrki kAka) = కోరిక
కాఁక, yet not a desire or wish; సౌఖ్యములున్న (saukhyamulunna) = with great comforts; గనివంటిది (ganivaMTidi)= like a mine; అరయ (araya) = విచారింపగా, on consideration, on examination.
Literal meaning: Birth (or life) are rather a barrier(s). Reflection or musing are not suitable for living. All the bonds of relationships are slippery and cannot be grasped. Think of Lord Venkateswara with great interest, yet not with a desire (to find God). That is the mine of happiness.
Explanation: We know that Annamacharya is a great exponent of words. Please observe the wording యేఁకటను…కోర్కికాఁక (yEkaTanu…kOrki kAka = with great interest yet not a desire or wish to find God) is simply saying one must have interest to examine, yet mind is clear of any cognisable answer. Its an examination without a question and a plausible answer. Sir, are we ready to get into a bus of unknown destination? #3 Are you want to buy a ticket to heaven or mars?
Have a look at this
Bhagavad Gita verse. यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव | न ह्यसंन्यस्तसङ्कल्पो योगी भवति कश्चन (6-2) yaṁ sannyāsam iti
prāhur yogaṁ taṁ viddhi pāṇḍava na hyasannyasta-saṅkalpo yogī bhavati
kaśhchana Purport: What is
called renunciation is the same as yoga. For no one can become a yogi unless he
renounces the desire for sense gratification. Man in all
his pursuits wants the gratification of
the end known to him. If so, these pursuits are shallow, unbecoming of a yogi. Thus,
Annamacharya captured the essence of this Bhagavad Gita verse in two words yEkaTanu…kOrkikAka
(యేఁకటను…కోర్కికాఁక).
The meaning of the wording AkavaMTidi janma ఆఁకవంటిది జన్మ is that this never-ending flow of life, man interferes and wastes a marvellous opportunity. Man in his avarice to hold on to something, takes the liberty and sets himself on the wrong path. Do we ever understand our actions?
భావము: అడ్డగింత (లేదా చెఱ, నిషేధము) వంటిది జన్మము. వగపు, తలపు వసించుటకు తగనివి. కర్మబంధము లెల్ల పాఁకుడు వంటివి, జారిపోవునవి, పట్టుకొనుటకు వీలుకానివి. మిక్కిలి ఆపేక్షతో తిరువేంకటేశుఁని కోరిక లేక దలచిన అనేక సౌఖ్యములున్న గని అదియే.
వివరణము: అన్నమాచార్యులు పదాలను గొప్పగా ప్రయోగిస్తాడు అని మనకు తెలుసు. ఐనప్పటికీ "ఏఁకటను.. కోర్కికాఁక" అనే పదము గమనింపదగ్గది. దీని అర్ధము "గొప్ప ఆసక్తితో, భగవంతుణ్ణి కనుగొనాలనే కోరిక లేకుండా పరిశోధించు" అని. కేవలం ఒక వ్యక్తికి మనస్సులో సమాధానము ఇదని పెట్టుకోకుండా, పరీక్షించడానికి మాత్రమే ఆసక్తి కలిగి
మనగలడా? ప్రత్యుత్తరమే లేని ప్రశ్న మానవులందరికీ సంధించబడింది! మాష్టారు, గమ్యమేమిటో తెలియని బస్సులో ఎక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?#3 లేక స్వర్గానికో లేదా అంగారక గ్రహానికో టికెట్ కొనాలనుకుంటున్నారా?
ఈ భగవద్గీత శ్లోకాన్ని చూడండి. “యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ / న హ్యసంన్యస్త సంకల్పో యోగీ
భవతి కశ్చన” (6-2). తా:- ఓ అర్జునా! దేనిని
సన్న్యాసమని చెప్పుదురో, దానినే యోగమని నెఱుగుము. ఏలయనగా, (కామాది) సంకల్పమును
వదలనివాడు (సంకల్పరహితుడు కానివాడు) ఎవడును యోగి కానేరడు. మానవుడు తన అన్ని అన్వేషణలలో తనకు తెలిసిన ముగింపుని కోరుకుంటాడు. అటువంటి పరిశీలనములు నిస్సారమైనవి,
యోగులకు తగనివి. ఈ విధంగా అన్నమాచార్యులు ఈ భగవద్గీత శ్లోకం యొక్క సారాన్ని రెండు పదాల్లో సంగ్రహించారు “యేఁకటను... కోర్కికాఁక” లో బంధించేశారు.
“ఆకవంటిది జన్మ” అనే పదం యొక్క అర్థం ఏమిటంటే, ఈ అంతులేని జీవిత ప్రవాహంలో మనిషి జోక్యం చేసుకుంటాడు; మరి అద్భుతమైన అవకాశాన్ని వృధా చేస్తాడు. మానవుడు దేనినైనా సాధించాలనే దురాశతో, స్వేచ్ఛను తీసుకొని, తప్పుడు మార్గం ఎంచుకుంటాడు. మన చర్యలను ఎప్పటికైనా అర్థం చేసుకుంటామా?
References and Recommendations
for further reading:
#1 44 సడిబెట్టెఁ
గటకటా సంసారము (saDibeTTe gaTakaTA saMsAramu)
#2 33. గుఱ్ఱాలఁ
గట్టని (gu~r~rAla gaTTani)
#3 12 ఏఁటివిజ్ఞాన
మేఁటిచదువు (ETivij~nAna mETichaduvu)
Summary of this Keertana:
However long one may enjoy the undignified, illiterate, senseless sensual pleasures of this material world; they are truly calamities on examination.
Hope is like an impassable mountain. Relationships are impenetrable barriers. Leadership and headship are shallow pursuits. This body is like a boil on the verge of bursting. (The more you mess with it, the more it becomes ingrained in your mind). Beauty, art, and sensual feelings are like appealing fruit with insects inside.
The mind is like bell metal, makes sound matching
the way you touch it. (The mind is making only a reaction like a bell metal).
All that we consider a wealth shall melt like snow. Sensuousness is similar
dizziness. Beautiful form or beautiful shape is like sparkle and glitter (that
vanishes soon). All that is assumed to be good is like an earthen shell touched
by an infected, implying it’s of no value. All these are illusions.
Birth (or life) are rather a
barrier(s). Reflection or musing are not suitable for living. All the bonds of relationships are slippery
and cannot be grasped. Think of Lord Venkateswara with great interest, yet not
with a desire (to find God). That is the mine of happiness.
కీర్తన సంగ్రహ భావము:
ఈ ప్రపంచంలోని
పామరపు (అగౌరవమైన, అర్థరహినమైన) ఇంద్రియ సుఖాలను ఎంత కాలం అనుభవించిననూ, యథార్థముగా
అవి ఆపదలే.
ఆశ ఎప్పటికీ కరగని కొండ. తగులు (సంబంధ
బాంధవ్యాలు) దాటలేని గోడ (అభేద్యమైన అడ్డంకులు) వంటివి. పెద్దతనము నాయకత్వ౦ అనేవి నిస్సారమైన
అన్వేషణలు. ఈ దేహము పగలడనికి సిద్ధంగా ఉన్న పుండు వంటిది. (దానిని తాకిన కొద్దీ మనస్సులో
అంత ఎక్కువగా పాతుకుపోతుంది). అందం, కళ మరియు సరసభావ భావములు లోపల కీటకాలతో ఉన్న ఆకర్షణీయమైన
మేడిపండు పండు వంటివి.
మనసు
కంచులా ఎటుల తాకిన అటుల పల్కును (మనసు కంచులా ప్రతిక్రియనే చూపును). కలిమి అనుకొను
అంతయును మంచులా కరగిపోవును. రతి మైకము వంటిది. తళుకు, మెఱపుల వంటిది రూపు (త్వరలోనే
మాయమగునని భావము). మేలు ఇంతయును అనుకొంటూ ఏమాత్రమూ విలువ లేనిదానిని చేకొనుదురు. దీనిని ప్రియమనికొనుటయే భ్రాంతి.
అడ్డగింత (లేదా చెఱ, నిషేధము) వంటిది జన్మము.
వగపు, తలపు వసించుటకు తగనివి. కర్మబంధము లెల్ల పాఁకుడు వంటివి, జారిపోవునవి, పట్టుకొనుటకు
వీలుకానివి. మిక్కిలి ఆపేక్షతో తిరువేంకటేశుఁని కోరిక లేక దలచిన అనేక సౌఖ్యములున్న గని అదియే.
Copper Leaf: 18-6; Volume 1-112
ఆయన్ని తలవడాన్ని మించిన సౌఖ్యం లేదు అని ముగించిన కీర్తన భావాన్ని చక్కగా గ్రహించి విశదీకరించారు.
ReplyDeleteఇంద్రియభోగములు సుఖముల నిచ్చునవి యని భ్రమలో చిక్కుకొని మనిషి వాటికోసం వెంపర్లాడతాడు. కాని అంత్యమున కవి దుఃఖభాజనములే యని గ్రహింపలేకున్నాడు.
ReplyDeleteకోరికలు అనంతములు, తరుగని కొండవంటివి. బాంధవ్యము లన్నియు అశాశ్వతములే. బాహ్యసౌందర్యం మేడిపండు వంటిది.దేహము బుద్బుదప్రాయం. భౌతికమైన సంపదలన్నీ నశించునవియే.కోతి వంటి మనస్సు చంచలమైనది. ఏమాత్రం విలువ లేని వీటి వల్ల కలిగే ఆనందం,సుఖం శాశ్వతమని నమ్మి వ్యవహారించుటయే భ్రమ, అజ్ఞానము.ఇవియే సంసారబంధములకు హేతువులు. కర్మబంధములకు, పునర్జన్మకు మూలములు.
నిష్కామకర్మయోగముతో, ఆచంచలమైన భక్తివిశ్వాసములతో
తిరుమలేశుని కొలిచి, తలచినచో ఆనందఖని, పరమసుఖము అనుభవించవచ్చునని అన్నమయ్య ఉపమానములతో నిండిన చక్కటి యీ కీర్తనలో మానవాళికి శ్రేయోమార్గమును ఉపదేశించుచున్నాడు.
వైరాగ్యం, యోగం,యోగసాధకుడు యెలా ఉండాలని చెప్పే భగవద్గీత శ్లోకాన్ని సందర్భానికి తగినట్లు ప్రస్తావించి, మంచి వ్యాఖ్యానము నందించిన శ్రీ చామర్తి శ్రీనివాస్ గారికి అభినందనసహిత వందనములు.
హరిః ఓం 🙏
కృష్ణ మోహన్