Friday 6 May 2022

120. ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు (EDa suj~nAna mEDa telivi nAku)

ANNAMACHARYA 

120. ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు

(EDa suj~nAna mEDa telivi nAku)

                                                                                    

Introduction: In this exquisitely evocative and beguiling poem Annamacharya is demonstrating us how life and time moves, in front of our eyes, evading our attention. This 500 year old poem transcends the boundaries of time depicts travails of our daily grind of 21st century. This poem gives the feeling of losing something unknown in the heart, carries you along and allows you to sink into nostalgia, as if those unknown times and lives were flowing through you, leaving you thirsty for more. 

Annamacharya is not a soothsayer. Neither he is a scientist. However, this 15th century monk has definitely studied the mind of the man in its entirety. I always wondered how a hermit sitting in one corner of the world, could write so accurately about our present life? He leaves you in the awe of his depth and intensity. 

ఉపోద్ఘాతము:అత్యంత సుందరము, సరళమైన కీర్తనలో, అన్నమాచార్యులు జీవితం మరియు కాలము మన కళ్ళ ముందు తచ్చాడుతున్నట్లే ఉండి, మన కళ్ళుకప్పి కదలిపోతాయి అన్నారు. ఏదో తెలియనిది పోగొట్టుకున్న భావాన్ని గుండెల్లో నాటుతూ, మిమ్మల్ని కదలించివేసి, సృతులలోకి మీరు జారిపోతుండగా, ఆ తెలియని కాలము, జీవితముల్లానే చెవులలో కదలాడుతుండగానే, ఈ పాట ముగిసిపోయినదనిపిస్తాడు అన్నమయ్య​.

ఆయన కాలజ్ఞానీ కాదు. జోస్యము చెప్పలేదు. శాస్త్రవేత్త అంతకన్నా కాదు. అయితే, 15వ శతాబ్దానికి చెందిన ఈ తపసి ఖచ్చితంగా మనిషి మనస్సును పూర్తిగా, అన్ని కోణాలలోనూ అధ్యయనం చేశాడు. భారతదేశంలోని ఒక మూలన ముక్కుమూసుకుని తపస్సు చేసిన  పరివ్రాజకుడు వర్తమాన జీవితం గురించి ఇంత కచ్చితత్వంతో ఎలా వ్రాయగలడని ఆశ్చర్యము కలిగిస్తుంది. గంభీరము మరియు తీక్షణలతో కూడిన రచనలతో మిమ్మల్ని విస్మయంలో ముంచెత్తేస్తాడు. జీవితాన్ని దాని మౌలిక రూపంలో గమనించి, కాచి వడపోసిన తత్వములు మన తప్పిదాల గురించి హెచ్చరించు సొపానములు  అని రూఢీగా చెప్పవచ్చు.

 

 

కీర్తన:

ఏడ సుజ్ఞాన[1] మేడ తెలివి నాకు

బూడిదిలో హోమమై పోయఁ గాలము ॥ఏడ॥ 

ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడినని

కదిసిన యాసచేఁ గడవలేక
యెదురు చూచి చూచి [2]యెలయించి యెలయించి
పొదచాటుమృగమై పోయఁ గాలము ॥ఏడ॥ 

ఇంతటఁ దీరెడి దుఃఖ మంతటఁ దీరెడినని

వింతవింత వగలచే వేఁగి వేఁగి
చింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్ని
పొంతనున్న వెన్నయై పోయఁ గాలము ॥ఏడ॥ 

యిక్కడ సుఖము నా కక్కడ సుఖంబని

యెక్కడికైనా నూర కేఁగియేఁగి
గక్కన శ్రీతిరువేంకటపతిఁ గానక
పుక్కిటి పురాణమయి పోయఁ గాలము ॥ఏడ॥

EDa suj~nAna mEDa telivi nAku

bUDidilO hOmamai pOya gAlamu    ॥EDa॥ 

ide mElayyeDi nA kade mElayyeDinani

kadisina yAsachE gaDavalEka
yeduru chUchi chUchi yelayiMchi yelayiMchi
podachATumRgamai pOya gAlamu  ॥EDa॥ 

iMtaTa dIreDi du@hkha maMtaTa dIreDinani

viMtaviMta vagalachE vEgi vEgi
chiMtayu vEdanala jikkuvaDuchu nagni
poMtanunna vennayai pOya gAlamu ॥EDa॥ 

yikkaDa sukhamu nA kakkaDa sukhaMbani

yekkaDikainA nUra kEgiyEgi
gakkana SrItiruvEMkaTapati gAnaka
pukkiTi purANamayi pOya gAlamu   ॥EDa॥

 

[1] ‘సుగ్ఞాన’ అని రాగి రేకులో ఉంది.

[2] ‘యెల‍ఇంచి యెల‍ఇంచి’ అని రాగి రేకులో ఉంది 

 

Details and Explanations:

 

ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు

బూడిదిలో హోమమై పోయఁ గాలము ॥ఏడ॥


EDa suj~nAna mEDa telivi nAku

bUDidilO hOmamai pOya gAlamu         ॥EDa॥

 

Word to Word meaning:  ఏడ (EDa) = where; సుజ్ఞానము (suj~nAnamu) = proper knowledge; ఏడ (EDa) = where; తెలివి (telivi) = intelligence ( here it is indicating the senses);  నాకు (nAku) = to me; బూడిదిలో హోమమై (bUDidilO hOmamai) = a sacrifice running down into ashes;  {బూడిదిలో (bUDidilO) = in ashes;  హోమమై (hOmamai) = became holy fire, became a sacrifice}  పోయఁ గాలము (pOya gAlamu) = time passed;

 

Literal meaning: Where is the great intelligence? Where are my senses? My time went like a sacrifice gone into the ashes. (Time passed and my life was wasted). 

Explanation: What Annamacharya says is that his time (his life) like the sand in a fist, escaping thru the gaps between fingers, went unknowingly. 

bUDidilO hOmamai  (బూడిదిలో హోమమై) is indicating an effort#1 gone waste. They don't stop, time or life, they just move on. The source of contention is our attempt to steer them to our perceived advantage. Effort indicates an unwillingness to accept the facts and nature as they are. The real hitch arises from the fact man does not realise that he is making 'effort'. 

Implied meaning: I am senseless. I am a fool. O Life! O Time! All my efforts gone waste.

 

భావము: ఏడ సుజ్ఞానము? ఏడ తెలివి నాకు. బూడిదిలోని హోమమై (బూడిదిలోని హోమము ఎంత ప్రయత్నించినా కుదరనట్లు) అయిపోయె గాలము.

 

వివరణము: పిడికిలోనున్న ఇసక వ్రేళ్ళమధ్య సందులగుండా తెలియకుండానే తప్పించుకున్నట్లు, కాలము, జీవితము చల్లగా జారుకుంటున్నాయి అంటున్నారు అన్నమచార్యులవారు.

బూడిదిలో హోమమై అన్న పదము వృధాగా పోయిన కృషిని సూచిస్తోంది. సమయము లేదా జీవితము ఆగవు. అవి ముందుకు సాగుతూనే ఉంటాయి.   ఆశించిన ప్రయోజనం వైపు వాటిని నడిపించే ప్రయత్నమే#1 మనస్సు లోని సంఘర్షణ, జగడములకు మూలము. "ప్రయత్నం" అనునది వాస్తవాలు మరియు ప్రకృతి స్వభావాన్ని అంగీకరించడానికి ఇష్టపడకపోవడానికి సూచన​. అసలు ఇబ్బంది మనిషికి తాను "ప్రయత్నం" అనే చర్యలో ఉన్నానని గ్రహించకపోవడమే.

అన్వయార్ధము: నేను తెలివిలేనివాడిని. నేను మూర్ఖుడిని. కాలమా! జీవితమా! నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి.

ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడినని

కదిసిన యాసచేఁ గడవలేక

యెదురు చూచి చూచి యెలయించి యెలయించి

పొదచాటుమృగమై పోయఁ గాలము       ॥ఏడ॥

 

ide mElayyeDi nA kade mElayyeDinani

kadisina yAsachE gaDavalEka

yeduru chUchi chUchi yelayiMchi yelayiMchi

podachATumRgamai pOya gAlamu     EDa

 

Word to Word meaning:  ఇదె (ide) = this; మేలయ్యెడి (mElayyeDi)= will do me good, do keep me better position; నా కదె (nA kade) = for me that;  మేలయ్యెడినని (mElayyeDinani) )= will do me good, do keep me better position;  కదిసిన (kadisina) = సమీపించిన​, దగ్గరైన (ఇక్కడ పుట్టుకొస్తున్న అని తీసుకోవాలి)​, coming close; became near ( used in the sense of propagating);  యాసచేఁ (yAsachE) = desire, want;  గడవలేక (gaDavalEka) = గడువన్నది లేక, without any limit, without interruption; యెదురు చూచి చూచి (yeduru chUchi chUchi) =looking forward to;  యెలయించి యెలయించి (yelayiMchi yelayiMchi) = వెంటఁ గొనిపోవు,  ప్రోత్సహించు, carry (you) along with, encourage (you to) be in them; (the same term is used twice to convey the emphasis) పొదచాటుమృగమై (podachATumRgamai) = పొదలో దాక్కున్న జింకలా; (జింక రంగు తరచుగా పొదతో కలిసిపోయి వేటాడే జంతువుకు దాన్ని గుర్తించడం కష్టమవుతుంది),  like a deer hiding in the bush; (the colour of the deer often matches with the bush and it becomes a camouflage);  పోయఁ గాలము (pOya gAlamu)= time went by;        

 

Literal meaning: All the time went in anticipation “that or this act will do me good.”  Constantly emerging desires driving me, encouraging me to stay on their path. Though, I continued to hope, the time “I was looking for” " eluded me like a deer in the bush escapes a predator. 

Explanation: yAsachE gaDavalEka / yeduru chUchi chUchi yelayiMchi yelayiMchi (యాసచేఁ గడవలేక / యెదురు చూచి చూచి యెలయించి యెలయించి) = “The freshly germinating desires, continuously pushing me,  without any control, I am obliged stay in their course” is the central idea of this poem.    

The matter of up bringing children is part of existence. On careful observation anyone can find that bond after bond we teach the children to be in. Gullible they are, they will. When they grow up, take these things as absolute. Do we ever question this? It is notable to consider this statement of Annamacharya lali nokaTokaTiki laMkelu / nIvE alaruchu nEmani yaMdunayA#2 (లలి నొకటొకటికి లంకెలు నీవే అలరుచు నేమని యందునయా?).

 

భావము: ఇది చేసిన మేలగును, అది చేసిన మేలయ్యెడినని సమీపిస్తున్న (లేదా పుట్టుకొస్తున్న) ఆశల ప్రోత్సహముతో గడువన్నది లేక యెదురు చూచుచూనే ఉంటిని. వేటగాడిని తప్పించుకున్న పొదలో దాక్కున్న జింకలా పోయఁ గాలము ​

వివరణము: కదిసిన యాసచేఁ గడవలేక / యెదురు చూచి చూచి యెలయించి యెలయించి (= ఎప్పటికప్పుడు తాజాగా మొలచుచున్న కోరికలు, నా నియంత్రణ లేకుండానే, నిరంతరముగా నన్ను వాటితోబాటు నేట్టుకెళ్ళిపోగా సమయము చేజారిపోయెను) అన్నది ఈ కీర్తన ముఖ్యోద్దేశము.

పిల్లలను పెంచడం అనేది జీవితంలో భాగం. జాగ్రత్తగా గమనిస్తే ఒక బంధం తర్వాత ఒక బంధాన్ని మనం పిల్లలకు  నేర్పిస్తాము. వారు దానినే సత్యమని భావిస్తారు. ఆలా అలవాటు చేసిన పద్ధతిలో వారు పెద్దయ్యాక, ఈ విషయాలను ప్రశ్నించ లేకపోతారు? అన్నమాచార్యుల వారు లలి నొకటొకటికి లంకెలు నీవే / అలరుచు నేమని యందునయా?#2 అన్న మాటలను పరిగణనలోకి తీసుకోవడం ఉచితము.

 

అన్వయార్ధము:

ఇంతటఁ దీరెడి దుఃఖ మంతటఁ దీరెడినని

వింతవింత వగలచే వేఁగి వేఁగి

చింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్ని

పొంతనున్న వెన్నయై పోయఁ గాలము ॥ఏడ॥

 

iMtaTa dIreDi du@hkha maMtaTa dIreDinani

viMtaviMta vagalachE vEgi vEgi

chiMtayu vEdanala jikkuvaDuchu nagni

poMtanunna vennayai pOya gAlamu EDa

 

Word to Word meaning:  ఇంతటఁ (iMtaTa) = with this; దీరెడి (dIreDi) = to end; to finish;  దుఃఖము (du@hkhamu) = sorrow;  అంతటఁ (aMtaTa) = with that; దీరెడినని (dIreDinani)= assuming that it will end, it will finish; వింతవింత (viMtaviMta) = curious / strange / peculiar; వగలచే (vagalachE) = Grief, vexation, melancholy; వేఁగి వేఁగి (vEgi vEgi) = hurried (or pressurised);   (The same term is used twice to emphasise the point); చింతయు (chiMtayu) = reflections and recollections; వేదనలఁ (vEdanala) = by pain, by agony and by distress; జిక్కువడుచు (jikkuvaDuchu) = get caught;  నగ్ని (nagni) = fire; పొంతనున్న (poMtanunna) = nearby;  వెన్నయై (vennayai) = like butter పోయఁ గాలము (pOya gAlamu) = time went by; 

Literal meaning: I ran here and there, hoping that this (or that) would put an end to my grief, vexation, and melancholy. Only to be caught up in the reflections and recollections of suffering from pain, agony, and distress. And time melted away without my knowledge, like butter near a fire. 

Explanation: Today's pressures on the average person are unprecedented in human history. It is an undeniable fact that people are complicating their lives by wanting more out of life.

 

In today's world, we have ample food and security, unlike in Annamacharya's time. Our efforts and anticipations that “This will end my sorrow. Or that will” sucks us into strange desires such as "I shall live in 26-story palaces," "I shall vacation in Timbuktu," "I shall joy ride to Mars," and so on; and captivate us.

 

Having more people dream similar wants, creates an unfulfilled want, which is the driving force of today's business. Just imagine if such wishes are absent, this world of ours, built on hopes, sustained by avarice falls into pieces.  For example, take banking. If all the customers withdraw all their deposited money instantly, the whole banking system will collapse. I am not against these systems but trying to elaborate that our systems are having roots on such flimsy grounds. And we deposit hard-earned money with banks and feel “safe”. Just ponder on our strange beliefs.

 

Once we accept this system, this world; we are into that vicious cycle. Earn more to get a better life. You are always on your toes. One gets tired. One loses interest in life. Then, we live the same way man has ever lived. What difference did we make in actual living despite our proud worthy intelligence? And a long list of university degrees?  In that scenario, EDa suj~nAna mEDa telivi (ఏడ సుజ్ఞాన మేడ తెలివి) where has the intelligence gone? pOya bUDidilO hOmamai (పోయఁ బూడిదిలో హోమమై) is not such a life wasted?

 

భావము: ఇంతటఁ తీరును దుఃఖము అంతటఁ తీరునని, (ఆ యత్నములలో) మనము  చిత్రవిచిత్రమైన శోకములు, విచారములతోను (జీవితములో) ఒత్తిడికి గురవుతాము. ఇంకా అవి కలిగించిన బాధ​​, వేదన ఘర్షణలు నెమరుపెట్టు జ్ఞాపకాలలో చిక్కుకోంటాము. ఇంతలో అగ్ని చెంతనున్న వెన్నయై కరిగిపోవు కాలము.

వివరణము: ఈ 21వ శతాబ్ధములో సగటు మానవుని మీద ఉన్నన్ని వత్తిళ్ళు మానవ చరిత్రలో ముందెన్నడూ లేవని చెప్పొచ్చు. జీవితములో ఎన్నెన్నో కావాలనుకుని మనుషులు తమ జీవనమును మరింత కఠినము చెస్సుకుంటూన్నారనేది కాదనలేని వాస్తవము.

నేటి ప్రపంచంలో, అన్నమాచార్యుల కాలంలోలా కాకుండా మనకు తగినంత ఆహారం మరియు రక్షణ ఉంది. అయినప్పటికీ, ‘నేను 26 అంతస్తుల మేడలో నివసిస్తాను’; ‘టింబక్తులో వేసవి సెలవులు గడుపుతాను’;  ‘అంగారక గ్రహానికి జాయ్ రైడ్ వెళ్ళివస్తాను’ వంటి వింతవింత కోరికల ద్వారా మనం తృప్తికి దూరంగా ఉంటాము.

ఎక్కువ మంది వ్యక్తులకు ఇలాంటి కోరికలు, ముఖ్యంగా నెరవేరని కోరికలు నేటి వ్యాపారానికి చోదక శక్తి (motive force) అవుతాయి. అనేకమంది ఆశల మీద నిర్మితమైన మన ఈ ప్రపంచం, ధనదాహము, లోభిత్వములతో పటిష్ఠమై వర్ధిల్లుతోంది. ఆ ఆశలే లేకుంటే పేక ముక్కల వంతెనలా పడిపోతుంది. ఉదాహరణకు బ్యాంకింగ్ తీసుకోండి. ఖాతాదారులందరూ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బును ఒక్కసారే ఉపసంహరించుకుంటే, మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలుతుంది. మనము వాటిల్లో కష్టపడి సంపాదించిన డబ్బులు దాచుకుని, "నా ఆస్తి" పదిలమనుకుని తృప్తిపడతాం. నేను ఈ వ్యవస్థలకు వ్యతిరేకం కాదు కానీ మన వ్యవస్థలు అటువంటి బలహీనమైన పునాదులపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని మనవి చేస్తున్నాను. మానవుల వింత ప్రవృత్తి వివరిస్తున్నాను.

ఒకసారి ఈ వ్యవస్థను, ఈ ప్రపంచాన్ని అంగీకరించామంటే ఆ విష చక్రంలో ఇరుక్కుపోయినట్లే. మెరుగైన జీవితాన్ని పొందడానికి మరింత సంపాదించాలి. అందుకు  మీరు నిరంతరంగా పరుగిడుతూనే ఉంటారు. అలసిపోతారు. జీవితంలో ఆసక్తిని కోల్పోతారు. అప్పుడు, మనం పూర్వము మనుషులు జీవించిన విధంగానే జీవిస్తాము. యూనివర్శిటి డిగ్రీలను  చెత్తబుట్టలో పారవేసి, దైవమిచ్చిన​ తెలివితేటలను ఉండచుట్టి జేబులో పెట్టుకుని, ముందరిలాగే, ఎప్పటిలాగే నిస్సత్తువ జీవనము సాగిస్తాము.  ఇప్పుడు చెప్పండి, ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు / బూడిదిలో హోమమై పోయఁ గాలము ఎంత వరకు సబబో?

 

యిక్కడ సుఖము నా కక్కడ సుఖంబని

యెక్కడికైనా నూర కేఁగియేఁగి

గక్కన శ్రీతిరువేంకటపతిఁ గానక

పుక్కిటి పురాణమయి పోయఁ గాలము   ॥ఏడ॥

 

yikkaDa sukhamu nA kakkaDa sukhaMbani

yekkaDikainA nUra kEgiyEgi

gakkana SrItiruvEMkaTapati gAnaka

pukkiTi purANamayi pOya gAlamu          ॥EDa॥

 

Word to Word meaning:  యిక్కడ (yikkaDa) = here; సుఖము (sukhamu) = pleasing, agreeable,  safety;  నా కక్కడ (nA kakkaDa) = for me there; సుఖంబని (sukhaMbani) = pleasing, agreeable,  safety; యెక్కడికైనా (yekkaDikainA) = anywhere;  నూరక (nUraka) = for nothing, withour cause, easily;   యేఁగియేఁగి (EgiyEgi) = go places;  గక్కన (gakkana) = గ్రక్కున​, వడిగా, quickly, without waiting;  శ్రీతిరువేంకటపతిఁ (SrItiruvEMkaTapati) = Lord Venkateswara;  గానక (gAnaka)= unable to find;  పుక్కిటి పురాణమయి (pukkiTi purANamayi)= లోకాభిరామాయణమగు, వృథాకాలక్షేపమగు, old wive's tales, rigmarole, traditional nonsense;  పోయఁ గాలము (pOya gAlamu) = time passed; 

Literal meaning: Assumed I'll be happy to stay here. I'll be delighted to live there. I was always on the lookout for things that made me feel good and at ease. I was aimlessly wandering. I was unable to locate Lord Venkateswara quickly (as I would expect). And I ingested my time in the rigmarole. My life was consumed by expectations and squandered opportunities. 

Explanation: Annamacharya is just placing our present mindset on the mat. The word pukkiTi purANamu (పుక్కిటి పురాణము) is indicating, despite our scientific achievements, skill in fine arts,  at the core our heart, we remain hallow and void.   

The word gakkana (గక్కన), which means "quickly," reflects today's necessity for faster results. It also implies that 500 years before, the demands of swift results existed.  For sure, Annamacharya knew the primary intentions of the man. Men were more or less the same in that age as well. Is there a quick fix method to reach God? 

It is worth considering the verse vAdamEla sAresAre vaDi mukti lEdaMTA / vEdAMtaSravaNamu veTTiki jEsirA#3 వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా / వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా = Sir, there are no arguments. There are no short cuts for liberation. If man does not listen and learn from the holy books, merely attending religious discourses (పురాణ గోష్ఠి) is absolute waste of time.

 

భావము: యిక్కడ సుఖము కక్కడ సుఖంబని ఎక్కడెక్కడికో పనిమాలి తిరుగుతూ, గ్రక్కున శ్రీతిరువేంకటపతిని తెలియకుండానే పుక్కిటి పురాణమయి నా కాలము తీరిపోయె. నా జీవితము వృథాగా వ్యథలలో వీగిపోయె.

వివరణము: అన్నమాచార్యులు మన ప్రస్తుత భావనలు, హృదయము, మనస్సు ఏరకముగా తీర్చబడ్డయో మన కళ్ళ​ ముందు ఉంచుతున్నారు. జీవితము "పుక్కిటి పురాణమై పోయె"తో మన శాస్త్రీయ, ఆర్ధిక విజయాలు, కళలో నిష్ణాణత, ఇతర విషయములలో ఎంత పురోగతి ఉన్నప్పటికీ హృదయాంతరాళాలలో మాత్రము నిస్సారముగాను, అల్పబుద్ధులు గాను మసలుతామని అన్నారు. 

ఖచ్చితంగా, అన్నమాచార్యులకు మనిషి మౌలిక ఉద్దేశాలు క్షుణ్ణంగా తెలుసు. నేటి ప్రపంచంలో మనకు సత్వర ఫలితాలు కావాలి. అన్నమాచార్యుల కాలంలో ఈ  ఆపేక్ష లేదని అనుకుంటున్నారా? ఆ కాలంలో కూడా మనుషులు ఇప్పటి లాగే భగవంతుడిని చేరుకోవడానికి శీఘ్రమైన  మార్గం వెదకేవారని “గక్కన” అనే పదము ప్రయోగింపుతో తెలుస్తోంది. 

ఈ సందర్భంలో “వాదమేల#3 అనే కీర్తన అర్ధాన్ని ప్రస్తావనకు తేవడము ఉచితమనిపిస్తోంది. వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా / వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా (= మానవుడా! వాదనలెందుకు? స్వేచ్ఛకు అడ్డదారులు లేవే? విని నేర్చుకొనే ఉద్దేశ్యములేకపోతే వేదాంతశ్రవణము చేసి యేమి ప్రయోజనము?)

 

Recommendations for further reading:

 #1      92. మోహము విడుచుటే మోక్షమది (mOhamu viDuchuTE mOkshamadi)

#2       2. దేవ యీ తగవు ( dEvayItagavu)

#3       122. వాదమేల సారెసారె వడి ముక్తి (vAdamEla sAresAre vaDi)

 

Summary of this Keertana:

Where is the great intelligence? Where are my senses? My time went like a sacrifice gone into the ashes. (Time passed and my life was wasted). Implied meaning: I am senseless. I am a fool. O Life! O Time! All my efforts have gone waste.

 

All the time went in anticipation “that or this act will do me good.”  Constantly emerging desires driving me, encouraging me to stay on their path. Though, I continued to hope, the time “I was looking for” " eluded me like a deer in the bush escapes a predator.

 

I ran here and there, hoping that this (or that) would put an end to my grief, vexation, and melancholy. Only to be caught up in the reflections and recollections of suffering from pain, agony, and distress. And time melted away without my knowledge, like butter near a fire.

 

Assumed I'll be happy to stay here. I'll be delighted to live there. I was always on the lookout for things that made me feel good and at ease. I was aimlessly wandering. I was unable to locate Lord Venkateswara quickly (as I would expect). And I ingested my time in the rigmarole. My life was consumed by expectations and squandered opportunities.

 

కీర్తన సంగ్రహ భావము:

ఏడ సుజ్ఞానము? ఏడ తెలివి నాకు. బూడిదిలోని హోమమై (బూడిదిలోని హోమము ఎంత ప్రయత్నించినా కుదరనట్లు) అయిపోయె గాలము. అన్వయార్ధము: నేను తెలివిలేనివాడిని. నేను మూర్ఖుడిని. కాలమా! జీవితమా! నా ప్రయత్నాలన్నీ వృథా అయిపోయాయి.

 

ఇది చేసిన మేలగును, అది చేసిన మేలయ్యెడినని సమీపిస్తున్న (లేదా పుట్టుకొస్తున్న) ఆశల ప్రోత్సహముతో గడువన్నది లేక యెదురు చూచుచూనే ఉంటిని. వేటగాడిని తప్పించుకున్న పొదలో దాక్కున్న జింకలా పోయఁ గాలము

 

ఇంతటఁ తీరును దుఃఖము అంతటఁ తీరునని, (ఆ యత్నములలో) మనము  చిత్రవిచిత్రమైన శోకములు, విచారములతోను (జీవితములో) ఒత్తిడికి గురవుతాము. ఇంకా అవి కలిగించిన బాధ​​, వేదన ఘర్షణలు నెమరుపెట్టు జ్ఞాపకాలలో చిక్కుకోంటాము. ఇంతలో అగ్ని చెంతనున్న వెన్నయై కరిగిపోవు కాలము.

 

యిక్కడ సుఖము కక్కడ సుఖంబని ఎక్కడెక్కడికో పనిమాలి తిరుగుతూ, గ్రక్కున శ్రీతిరువేంకటపతిని తెలియకుండానే పుక్కిటి పురాణమయి నా కాలము తీరిపోయె. నా జీవితము వృథాగా వ్యథలలో వీగిపోయె.

 

Copper Leaf: 7-7 Volume 1-48 

2 comments:

  1. నియంత్రణ లేని నిరంతరమైన కోరికలతో మనసు కల్మషమైపోయి, జ్ఞానసాధనకు చేసే ప్రయత్నములన్నీ విఫలమై, తనకు తెలియకుండానే మనిషి ఎంతో విలువైన కాలాన్ని, దుర్లభమైన మానవజన్మను వృధా చేసుకొంటున్నాడు.తాత్కాలిక
    సుఖం కొరకు విషయవాసనలలో చిక్కుకొని, గమ్యమెరుగక తిరుగాడుచున్న మనిషి తనయందే స్థితమైయున్న పరమాత్మను తెలియక, దుఃఖభాజనుడై పరమసుఖమును అనుభవించకున్నాడని ఈ కీర్తన ద్వారా అన్నమయ్య లోకానికి హెచ్చరిక చేస్తున్నాడు.
    శ్రీ చామర్తి శ్రీనివాస్ గారి వ్యాఖ్యానం సరళంగాను, సుభోదంగాను ఉంది.

    అహం బ్రహ్మ్మాస్మి🙏

    కృష్ణ మోహన్

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయి నాథాయనమః
    విషయములు ప్రతి జీవిని కోరిక అను భావము ద్వారా విషమ పరిస్తుతులకు దారి చూపును. అందుకే కోరికను జయించుటకై సాదు జీవనమున వలంబించుచు భిక్షాటనము తో లభించిన ఆహారమును రుచి లేకుండా భుజియించెదరని సత్చరిత్ర ద్వారా నేర్పిన సద్గురువునకు ప్రణామములు.

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...