Saturday, 14 May 2022

121. ఇందిరాధిపుని సేవ యేమరకుండుట గాక (iMdirAdhipuni sEva yEmarakuMDuTa gAka)

 ANNAMACHARYA

121. ఇందిరాధిపుని సేవ యేమరకుండుట గాక

(iMdirAdhipuni sEva yEmarakuMDuTa gAka)

Introduction: In this impeccably beautiful and insightful poem, Annamacharya talks about how intelligence and life cannot be separated.  As always, Annamacharya is asking the man to contemplate the things in his control. 

Annamacharya is not a mere hermit but has experienced the ultimate. His honest effort to make us resonate with those ‘beyond the ordinary experiences’ is quite evident in all his poems. A monk without any tools of modern man could express such complex ideas, in such a short poem, which is something to wonder!

 

ఉపోద్ఘాతము: తెలివితేటలను, జీవితాన్ని ఎలా విడదీయలేమోనన్న సంగతి అన్నమాచార్యులు ఈ అపూర్వమైన, ఆలోచనలు రేకెక్తించు అందమైన కీర్తనలో ప్రస్తావించారు.  ఎప్పటిలాగే, తన ఆధీనంలో ఉన్న విషయాలను గురించి ఆలోచించమని మనిషిని అభ్యర్ధిస్తున్నాడు.

 

అన్నమాచార్యులు కేవలం తపసి మాత్రమే కాదు, భావాతీత స్థితిని పొందాడు. ​ఆ మనవాతీతమైన అనుభవాలను మనలో ప్రతిధ్వనింపజేయడానికి ఆయన చేసిన ప్రయత్నంలోని నిజాయితీ ఆయన కీర్తనలన్నింటిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఆధునిక మానవుడి పనిముట్లు లేని వైరాగి, ఇంత సంక్లిష్టమైన ఆలోచనలను ఇంత చిన్న కవితలో వ్యక్తీకరించగలగడం ఆశ్చర్యం కలిగించే విషయం!

 

కీర్తన:

ఇందిరాధిపుని సేవ యేమరకుండుట గాక

బొందితోడి జీవులకు బుద్ధు లేఁటిబుద్ధులు ॥పల్లవి॥ 

రేయెల్లా మింగిమింగి రేపే వెళ్లనుమియు

బాయట నిద్రాదేవి పలుమారును
చాయలకు నిచ్చనిచ్చా జచ్చిచచ్చి పొడమేటి
మాయజీవులకు నెల్లా మని కేఁటిమనిక ॥ఇందిరా॥ 

కనురెప్ప మూసితేనే కడు [1]సిష్టే చీఁకటౌను

కనురెప్ప దెరచితే క్రమ్మరఁ బుట్టు
ఘనమై నిమిషమందే కలిమి లేమియుఁ దోఁచె
యెనయు జీవుల కింక యెఱు కేఁటియెఱుక॥ఇందిరా॥ 

వొప్పగుఁ బ్రాణము లవి వూరుపుగాలివెంట

యెప్పుడు [2]లోనివెలికి నెడతాఁకును
అప్పఁడు శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డందరికి
తప్పక యాతఁడే కాచు తలఁపేఁటి తలఁపు॥ఇందిరా॥

 

iMdirAdhipuni sEva yEmarakuMDuTa gAka

boMditODi jIvulaku buddhu lETibuddhulu ॥Pallavi॥ 

rEyellA miMgimiMgi rEpE veLlanumiyu

bAyaTa nidrAdEvi palumArunu
chAyalaku nichchanichchA jachchichachchi poDamETi
mAyajIvulaku nellA mani kETimaniki ॥iMdirA॥ 

kanureppa mUsitEnE kaDu sishTE chIkaTaunu

kanureppa derachitE krammara buTTu
ghanamai nimishamaMdE kalimi lEmiyu dOche
yenayu jIvula kiMka ye~ru kE@MTiye~ruka ॥iMdirA॥ 

voppagu brANamu lavi vUrupugAliveMTa

yeppuDu lOniveliki neDatAkunu
appaDu SrIvEMkaTESu DaMtarAtmu DaMdariki
tappaka yAtaDE kAchu talapETi talapu ॥iMdirA॥

 

[1] ‘సృష్టే’ కావచ్చు.

 [2] ‘లోనికి వెలికి’ అని ద్వంద్వము కావచ్చు. 

 

Details and Explanations:

 

ఇందిరాధిపుని సేవ యేమరకుండుట గాక

బొందితోడి జీవులకు బుద్ధు లేఁటిబుద్ధులు       ॥పల్లవి॥

 

iMdirAdhipuni sEva yEmarakuMDuTa gAka

boMditODi jIvulaku buddhu lETibuddhulu     ॥iMdirA॥ 

Word to Word meaning: ఇందిరాధిపుని (iMdirAdhipuni) = Lord Vishu’s; సేవ (sEva) = service; యేమరకుండుట (yEmarakuMDuTa)= not forgetting, not neglecting even for a moment;  గాక (gAka) =except;  బొందితోడి (boMditODi) = with this body; జీవులకు (jIvulaku) = for the beings;  బుద్ధు లేఁటిబుద్ధులు (buddhu lETibuddhulu) = what kind of intelligence is it?  

Literal meaning: Not forgetting to get engaged in the service of the Lod Vishnu is the only intelligence available while in this body.

Explanation: Annamacharya is clear that no other activity, other than the service of the Lord Vishnu, can be said as intelligence. #1 This is similar to the Bhagavad-Gita verse below. 

अध्यात्मज्ञाननित्यत्वं तत्वज्ञानार्थदर्शनम् | एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ||13-12|| adhyātma-jñāna-nityatva tattva-jñānārtha-darśhanam / etaj jñānam iti proktam ajñāna yad ato ’nyathā Purport: constancy in spiritual knowledge; and philosophical pursuit of the Absolute Truth—all these I declare to be knowledge, and what is contrary to it, I call ignorance. 

Implied meaning: There is no intelligence greater than the service of the Lord.

భావము: శ్రీపతి సేవను ఏమర కుండవలె నన్న బుద్ధియే బుద్ధిగాని వ్యర్థపుటాలోచనలుగల జీవులబుద్ధి ఏమి బుద్ధి.

వివరణము: శ్రీమహావిష్ణువు సేవ తప్ప మరే ఇతర కార్యకలాపాన్ని తెలివిగా (బుద్ధికల పనిగా) చెప్పలేమని అన్నమాచార్యులు స్పష్టం చేశారు.#1 దీనిని క్రింది భగవద్గీత శ్లోకంతో పోల్చవచ్చు. 

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ / ఏతద్ జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతోఽన్యథా ।।13-12।। (భావం: అర్జునా!! అధ్యాత్మ జ్ఞానము (ఆత్మ నిష్ఠ) నిరంతరము కలిగి ఉండుట, తత్వ జ్ఞానము యొక్క అంతర్దర్శనమును పొందుట (ప్రయోజనమును అనుభవించుట) జ్ఞానమని, తక్కినవన్నీ అజ్ఞానమని తెలియుము.) 

అన్వయార్ధము: భగవంతుని సేవను మించిన తెలివితేటలు మరొకటి లేవు.

 

రేయెల్లా మింగిమింగి రేపే వెళ్లనుమియు

బాయట నిద్రాదేవి పలుమారును

చాయలకు నిచ్చనిచ్చా జచ్చిచచ్చి పొడమేటి

మాయజీవులకు నెల్లా మని కేఁటిమనికి ॥ఇందిరా॥

 

rEyellA miMgimiMgi rEpE veLlanumiyu

bAyaTa nidrAdEvi palumArunu

chAyalaku nichchanichchA jachchichachchi poDamETi

mAyajIvulaku nellA mani kETimaniki   iMdirA 

Word to Word meaning: రేయెల్లా (rEyellA) = the whole night; మింగిమింగి (miMgimiMgi) = gulp down, swallow; రేపే (rEpE) = the very next day; వెళ్లనుమియు (veLlanumiyu) = spit out;  బాయట (bAyaTa) = బయట, outside; నిద్రాదేవి (nidrAdEvi) = the goddess of sleep; పలుమారును (palumArunu) = many times; చాయలకు (chAyalaku) = that side, near that place;  నిచ్చనిచ్చా (nichchanichchA) = చెప్పలేనంత ఆశతో, too desirously, too willingly; జచ్చిచచ్చి (jachchichachchi) = చచ్చేంత కష్టపడి అని అర్ధము; literally means death. However, in this context, it actually means, with great effort; పొడమేటి (poDamETi) = generated, born, taking shape; మాయజీవులకు (mAyajIvulaku) = for those fallen into the illusion;  నెల్లా (nellA) = all; మని కేఁటిమనికి (mani kETimaniki)     = What use is of their life? What use is of their birth? 

Literal meaning: The goddess of sleep swallows ‘beings’ by the night. She spits them out the next day. Those under illusion are willingly taking great effort desiring something or the other. They come back (to this world of illusion) many times.  What use is of their life? 

Explanation:  The word రేయెల్లా rEyellA symbolising ignorant actions of man (he spends his day like night) as explained in Bhagavad-Gita verse 2-69 (या निशा सर्वभूतानां yā niśhā sarva-bhūtānāṁ).  rEyellA miMgimiMgi rEpE veLlanumiyu (రేయెల్లా మింగిమింగి రేపే వెళ్లనుమియు) is signifying cyclic process. Therefore, man continues his ignorance cycle after cycle, like a drunkard to the liquor, as a gambler to the table.

 

As described in the Bhagavad-Gita verse below, sleep i.e., ignorance is nothing but “our pride, our confidence, our memory that we know” overtakes all the embodied bodies. Under its action, we continue our life of illusion as explained. तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् | प्रमादालस्यनिद्राभिस्तन्निबध्नाति भारत ||14-8|| (tamas tv ajñāna-jaṁ viddhi mohanaṁ sarva-dehinām / pramādālasya-nidrābhis tan nibadhnāti bhārata = Purport: O Arjun, tamo guṇa, which is born of ignorance, is the cause of illusion for the embodied souls. It deludes all living beings through negligence, laziness, and sleep).

Influenced by the circumstances and situations man tries to evaluate the things before him. He deducts from what he knows; what he could feel; what he could imagine, extrapolate; whatever inversions he could lay his hand upon as truth and the rest as otherwise. That very effort of cognition is part of our past knowledge. As already noted, it’s impossible to go to a new state without relinquishing the old state.  Thus, the effort of cognition diverts the attention of the man.


Most important thing implied here is that the purpose of life is not an achievement but living. Trying to live is not living. Effort always implies the action in the wrong direction. When there is no effort in seeing (or observing), Therefore, that very observation is the action. Thus, living and action are one and the same thing for the liberated.  

Implied meaning: Man out of self-generated knowledge evaluates situation(s), his life, and others. This apparently provides the basis for further action. This evaluation and action are born of material knowledge. These divert the man from the path of truth. Such a life is worthless.  When there is no effort in seeing (or observing), Therefore, that very observation is the action. Thus, living and action are one and the same thing for the liberated.  

భావము: నిద్రాదేవి రాత్రులందు జీవులను మ్రింగి (నిద్రలోముంచి) తెల్లవారగనే పెడల గ్రక్కుచున్నది. అనగా లౌకికకార్యోన్ముఖులను చేయుచున్న దనుట. మాటి మాటికి మాయావిష్ణులగు మానవులు పుట్టుచు చచ్చుచుందురు. వారిది ఏమి ఉనికి? అదొక ఉనికికా దనుట. 

వివరణము: 'రేయెల్లా'తో మానవులు పగలును రాత్రిలా (= వ్యర్థముగా) గడుపుతారని తెలిపిరి. 'రేయెల్లా మింగిమింగి రేపే వెళ్లనుమియు'తో వర్తుల మార్గము నందు నడచు ప్రవృత్తిని సూచించారు.   దానితో, మానవులు ఎప్పటిలాగే, తాగుబోతు కాళ్ళు మద్యం దుకాణానికి లాక్కెళ్ళినట్లు, జూదగాడుు పందెమును (ఆటను) విడువలేనట్లు, గానుగెద్దుల్లాగా ఈ లోకము చుట్టూ తిరుగుతూనే ఉంటారని అన్నమయ్య అనిరి. 

ఈ క్రింది భగవద్గీత శ్లోకంలో వర్ణించినట్లుగా, నిద్ర అంటే అజ్ఞానం అనేది "నాకు తెలుసు అన్న అహంకారము; తెలిసిన కిటుకులతో ఏదనా సాధించగలనన్న ఆత్మవిశ్వాసం, జ్ఞాపకశక్తి మీద నమ్మకము" తప్ప మరేమీ కాదు. ఆ నిద్ర  అన్ని జీవాలను మభ్యపెట్టి అధిగమిస్తుంది. దాని ప్రభావముతోనే, శ్లోకంలో వివరించిన విధంగా భ్రమలలోనే జీవితమంతా కొనసాగిస్తాము.  తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ / ప్రమాదాలస్యనిద్రాభిః  తన్నిబధ్నాతి భారత  ॥14-8॥ (= ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రలచే భ్రమకు గురిచేసి బంధించివేస్తుంది). 

మనిషి పరిస్థితులచే ప్రభావితుడై, తనకు తెలిసినదాన్ని, తాను ఏమి అనుభూతి చెందగలడో దానిని, అతను ఏమి ఊహించగలడో దానిని​, తన ప్రజ్ఞ ద్వారా యేయే విలోమములను స్పృశించగలడో దానిని సత్యంగా ఊహించగలడు మరియు తక్కినవి అన్యముగా తీసుకుంటాడు. మన కళ్ళ ముందు ఉన్నదాన్ని తెలుసుకోవడానికి గుర్తించడానికి మనము ప్రయత్నిస్తాము. ఆ ప్రయత్నము మన 'ప్రస్తుత​ జ్ఞానము' నందలిది. అది విషయ సంయోగితము గావున అజ్ఞానము అని అన్నమాచార్యుల భావము. ఆ ప్రయత్నమే మన దృష్టిని మళ్ళిస్తుంది. 'పలుమారును'తో ఆరకంగా మనం ‘మన ప్రస్తుత జీవితాన్ని (వర్తుల మార్గములో) నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉండుదుము’ అనిరి. 


తరువాత, అన్నమాచార్యులు చాలా స్పష్టంగా, జీవిత లక్ష్యం ఏదో సాధించడం కాదు, జీవించడమే అన్నారు. జీవించడానికి ప్రయత్నించడం జీవించడమే కాదు. ప్రయత్నం అనునది ఎప్పుడూ సత్యమునకు విలోమ దిశలోనే ఉంటుంది. చూడడానికి (లేదా గమనించడానికి) ఎటువంటి ప్రయత్నం లేనప్పుడు, ఆ పరిశీలనే చర్య. కాబట్టి, జీవనము మరియు జీవక్రియ ఒకటే. 

అన్వయార్ధము: మానవుడు తాను సాధించిన జ్ఞానం నుండి పరిస్థితిని, అతని జీవితాన్ని మరియు ఇతరులను మదింపు వేస్తాడు. ఇది అతని చర్యకు ఆధారమగును. ఈ మదింపు మరియు చర్య విషయ పరిజ్ఞానం నుండి పుట్టినవి. ఇవి మనిషిని సత్యమార్గం నుండి మళ్ళిస్తాయి. అలాంటి జీవితం నిష్ప్రయోజనం.  చూడటానికి (లేదా పరిశీలించడానికి) ఎటువంటి ప్రయత్నం లేనప్పుడు, కాబట్టి, ఆ పరిశీలనే చర్య అగును. అందువలన, మోక్షం పొందినవారికి జీవించడము మరియు చర్య ఒకటే.  

కనురెప్ప మూసితేనే కడు [1]సిష్టే చీఁకటౌను

కనురెప్ప దెరచితే క్రమ్మరఁ బుట్టు

ఘనమై నిమిషమందే కలిమి లేమియుఁ దోఁచె

యెనయు జీవుల కింక యెఱు కేఁటియెఱుక      ॥ఇందిరా॥

 

kanureppa mUsitEnE kaDu sishTE chIkaTaunu

kanureppa derachitE krammara buTTu

ghanamai nimishamaMdE kalimi lEmiyu dOche

yenayu jIvula kiMka ye~ru kE@MTiye~ruka  iMdirA

Word to Word meaning: కనురెప్ప (kanureppa) = eyelids;  మూసితేనే (mUsitEnE) = on closing; కడు (kaDu) = much, verily; [1]సిష్టే (sishTE) = ‘సృష్టే’ కావచ్చు = this creation;  చీఁకటౌను (chIkaTaunu) = becomes dark; కనురెప్ప (kanureppa) = eyelids; దెరచితే (derachitE) = on opening; క్రమ్మరఁ బుట్టు (krammara buTTu) = happens the same again; ఘనమై (ghanamai) = permanently;  నిమిషమందే (nimishamaMdE) = in a minute;  కలిమి లేమియుఁ (kalimi lEmiyu) = rich as well as poor;  దోఁచె (dOche) = felt; యెనయు (yenayu) = comparable, similar, such;  జీవుల (jIvula) = the beings; కింక (kiMka) = till now, hereafter;  యెఱు కేఁటియెఱుక (ye~ru kE@MTiye~ruka) = What kind of awareness (knowledge) they have? (Meaning they remain ignorant). 

Literal meaning: When eyelids are closed (on death), this (known) world becomes dark. Upon opening the eyes (upon birth), the world happens again and continues. As short as a minute, one feels existing (denoted by rich) as well as non-existing (denoted as poor). What kind of transient awareness (ephemeral knowledge) do people carry? Is it really an existence?

Explanation: Important thing said is between death and birth man learns nothing new. That is in a state of material whether one is alive or dead, the man learns absolutely nothing. The Illusory things that make us feel either rich or poor have no bearing on the actuality. What kind of knowledge, what kind of life do we seek? 

Readers may note that his stanza is the same as the previous one, in different words. When one understands that there is nothing new in the material world; Do we really learn, actually feel, admit frankly, and stay as one is while ignorance thrusts, and overwhelms material action. When one can negate such a strong pull of illusions, he arrives at a different state.#2 what is that action; what is that transformation; what is that metamorphosis one undergoes? Think about this.

However, this stanza has another aspect to it. It is saying that we under ignorance fail to notice the truth before our eyes. That is the reason, I am reproducing ordinary day-to-day events, places described Annamacharya:  adivO chUDarO aMdaru mokkarO / gudigone brahmamu kOnETidarini. ravimaMDalamuna raMjillu tEjamu / divi jaMdrunilO tEjamu / bhuvi nanalaMbuna boDamina tEjamu / vividhaMbulaina viSvatEjamu (అదివో చూడరో అందరు మొక్కరో గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని రవిమండలమున రంజిల్లు తేజము /దివిఁ జంద్రునిలో తేజము / భువి ననలంబునఁ బొడమిన తేజము / వివిధంబులైన విశ్వతేజము = There, you see, all must bow, the limitless thing is taking the shape near the pond. That effulgence from the sun, that wonderous light from the moon, that spark from the fire, glow from all over the universe confluence here). You will find similarities when Jiddu Krishnamurti says

“That night, particularly in that distant valley with the most ancient hills with their peculiar, shaped boulders, the silence was as real as the wall you touched. And you looked out of the window at the brilliant stars. It was not a self-generated silence; it was not that the earth was quiet, and the villagers were asleep, but it came from everywhere - from the distant stars, from those dark hills, and from your own mind and heart. This silence seemed to cover everything from the tiniest grain of sand in the riverbed - which only knew running water when it rained - to the tall, spreading banyan tree and a slight breeze that was now beginning. There is the silence of the mind, which is never touched by any noise, by any thought or by the passing wind of experience. It is this silence that is innocent, and so endless. When there is this silence of the mind action springs from it, and this action does not cause confusion or misery”. (India, part 5, The Only Revolution)

It may be noted that the effort of this explanation is not theoretical, but actual possible things that happened to real people in blood and tears. When we fail to see the truth, whatever we do is wasted.

భావము: కనురెప్పలు మూసినప్పుడు (మరణంలో), ఈ (తెలిసిన) ప్రపంచం చీకటిగా మారుతుంది. కళ్ళు తెరిచినప్పుడు (పుట్టినప్పుడు), సృష్టి గోచరించును, తిరిగి పాత పద్ధతిలోనే కొనసాగును. అనతికాలంలోనే, కలిమి (ఉన్నట్లు),  లేమియుఁ (లేనట్లు) తోచును. అటువంటి తాత్కాలిక అవగాహన (స్వల్ప జ్ఞానం) గల జీవుల తెలివేమి తెలివి?  వారిది ఏమి ఉనికి? అదొక ఉనికికా దనుట.

వివరణము: మరణానికి, పుట్టుకకు మధ్య, అచేతన స్థితిలో మనిషి కొత్తగా ఏమీ నేర్చుకోడు, నేర్చుకోలేడు. అలాగే ఒక వ్యక్తి జీవించి ఉన్నా, మాయామయమగు జీవితంలో ఇరుక్కుంటే కూడా ఏమీ నేర్వడు. భ్రాంతికరమైన విషయాలు ధనికులకైనా, పేదలకైనా వాస్తవికతకు ఎటువంటి సంబంధం లేని అనుభూతిని కలిగిస్తాయి. మనం ఎలాంటి జ్ఞానాన్ని, ఎలాంటి జీవితాన్ని కోరుకుంటామో? 

పాఠకులారా! పదాలు వేరైనా ఈ చరణం మునుపటి చరణం వలెనే ఉందని  గమనించవచ్చు. భౌతిక ప్రపంచంలో కొత్తదనం ఏమీ లేదని అర్థం చేసుకున్నప్పుడు; అజ్ఞానం ప్రేరేపిస్తున్నప్పుడు; భౌతిక చర్య మనస్సును వేగిరపెడున్నప్పుడు; బలమైన భ్రమలను తిరస్కరించి, వాస్తవాన్ని అంగీకరిస్తూ,  ఏ వైపు మొగ్గకుండా నిర్మొహమాటంగా ఉన్నవారిమి ఉన్నట్లుగా, ప్రతిక్రియ లేకుండా ఉండగలమా?#2  ఆ స్థితిలో చర్య అనగా ఏమిటి; ఆ పరివర్తన ఏమిటి? సదరు వ్యక్తి అనుభవించే ఆ రూపాంతరమేమిటి? అలోచించండి. 

అయితే, ఈ చరణానికి మరో దృక్కోణం ఉంది. అజ్ఞానం వల్ల మనం కళ్ల ముందున్న సత్యాన్ని గమనించలేకపోతున్నాం అని చెబుతోంది. అందుకే, అన్నమాచార్యులు సాధారణ రోజువారీ సంఘటనలతో కూర్చిన ఈ కీర్తనను గమనించండి.  అదివో చూడరో అందరు మొక్కరో గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని కోనేటిదరిని రవిమండలమున రంజిల్లు తేజము /దివిఁ జంద్రునిలో తేజము / భువి ననలంబునఁ బొడమిన తేజము / వివిధంబులైన విశ్వతేజము (= కోనేటి ప్రక్కన అతిశయించుచునున్న, ప్రోగు పడుతునున్న బ్రహ్మమును అదిగో చూడండి అందరూ మొక్కండి. సూర్యునిలో రంజిల్లు తేజము, చంద్రుని నుండి జాలువారు కాంతి, నిప్పుకణపు మెరుపు, ఇక విశ్వం నలుమూలల నుండి వస్తున్న ప్రకాశము అదిగో చూడండి అందరూ మొక్కండి.)  

ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తిగారు వర్ణించిన నిశ్శబ్ద వర్ణనను చదవండి. “ఆ రాత్రి, ముఖ్యంగా ఆ సుదూరమైన లోయలో చాలా పురాతనమైన కొండలు వాటిపై విచిత్రంగా కూర్చబడిన బండరాళ్లతో, అనుభవిస్తున్న నిశ్శబ్దం నిజమైనది, నేను తాకిన యీ గోడలా.  కిటికీ నుండి అద్భుతమైన నక్షత్రాలను చూశాను. ఇది పాఠశాలల్లో బలవంతంగా ఉత్పత్తిచేసిన నిశ్శబ్దం కాదు; శబ్దాలు లేవనీ కాదు, గ్రామస్తులు నిద్రపోతున్నారనీ కాదు.  కానీ అది ఎక్కడి నుండైనా వచ్చిందో - సుదూర నక్షత్రాల నుండో, ఆ చీకటి కొండల నుండో మరియు నా స్వంత మనస్సు మరియు హృదయం నుండో. ఈ నిశ్శబ్దం నది ఒడ్డున ఉన్న అతి చిన్న ఇసుక రేణువు నుండి - ఎత్తైన, విస్తరించి ఉన్న మర్రి చెట్టు మరియు ఇప్పుడు ప్రారంభమైన చిరు గాలి వరకు ప్రతిదాన్నీ ఆ నిశ్శబ్దం  కప్పివేసినట్లు అనిపించింది. మనస్సు యొక్క మౌనం అది; ఎటువంటి శబ్దం ద్వారా కాని, ఎలాంటి ఆలోచనల ద్వారా కాని లేదా గడిచే అనుభవమనే గాలిచేత కానీ తాకబడదు. ఈ నిశ్శబ్దమే అమాయకమైనది మరియు అంతులేనిది. హృదయం మౌనంగా ఉన్నప్పుడు దాని నుండి చర్య పుడుతుంది మరియు ఈ చర్య గందరగోళాన్ని లేదా దుఃఖాన్ని కానీ కలిగించదు." (India, part 5, The Only Revolution)

జిడ్డు కృష్ణమూర్తిగారు వర్ణించిన నిశ్శబ్దమునకు అన్నమాచార్యుల వారనుభవించిన భావాతీత స్థితులలోని దగ్గర పోలికలు యాదృచ్ఛకములు కావు.  

ఈ వివరణ యొక్క ప్రయత్నం సైద్ధాంతికమైనది కాదని, కానీ రక్తం మరియు కన్నీళ్లతో ఉండే నిజమైన వ్యక్తులకు వాస్తవంగా సాధ్యమయ్యే విషయాలను మీ ముందకు  తీసుకురావడమని గమనించవచ్చు. సత్యాన్ని కనుగొనడంలో మనం విఫలమైనప్పుడు, మనం ఏమి చేసినా అది వ్యర్ధమే.

వొప్పగుఁ బ్రాణము లవి వూరుపుగాలివెంట

యెప్పుడు [2]లోనివెలికి నెడతాఁకును

అప్పఁడు శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డందరికి

తప్పక యాతఁడే కాచు తలఁపేఁటి తలఁపు     ॥ఇందిరా॥

 

voppagu brANamu lavi vUrupugAliveMTa

yeppuDu lOniveliki neDatAkunu

appaDu SrIvEMkaTESu DaMtarAtmu DaMdariki

tappaka yAtaDE kAchu talapETi talapu           iMdirA

 

Word to Word meaning: వొప్పగుఁ (voppagu) = suitable, proper;  బ్రాణములు (brANamulu) = life; అవి (avi) = they; వూరుపుగాలివెంట (vUrupugAliveMTa) = along the breath; యెప్పుడు (yeppuDu) [2] = always;  లోనివెలికి (lOniveliki) = inside and outside; నెడతాఁకును (neDatAkunu)= తాఁకు, వచ్చుచుఁ బోవుచు నుండు, touching, coming and going as usual;  అప్పఁడు (appaDu) = తండ్రి, స్వామి, Father, almighty; శ్రీవేంకటేశుఁడు (SrIvEMkaTESuDu) = Lord Venkateswara; అంతరాత్ముఁడు (aMtarAtmuDu) = the soul; అందరికి (aMdariki) = for all; తప్పక (tappaka) = surely;  యాతఁడే (yAtaDE) = He alone; కాచు (kAchu)= shall save;  తలఁపేఁటి తలఁపు (talapETi talapu) = What use is of conceptual thinking? 

Literal meaning: Life moves along with breathing air inside and outside. Man’s life is fragile, tentative, and short-lived. Our lord, Venkateshwara is the saviour for all. What use is of (conceptual) thinking/reflection and opinions? 

Explanation: The idea of this stanza is that human life has no value assigned. However, life has no specific meaning, purpose, or objective, but as humans, we must learn to live our life. We must thank God for the present life. 

Now just compare this stanza with a statement from Bible: James 4:13-15: Jesus said unto them: 13 Now listen, you who say, “Today or tomorrow we will go to this or that city, spend a year there, carry on business and make money.” 14 Why, you do not even know what will happen tomorrow. What is your life? You are a mist that appears for a little while and then vanishes. 15 Instead, you ought to say, “If it is the Lord’s will, we will live and do this or that”. 

Understand that like opening the doors of the house to allow the wind, submission to God is to allow the forces of nature to act like us. You embrace the lord once and for all. Taking the name of God is not only to move the lips but to truly offer the heart. No living being can offer submission with lingering doubts.  It is God who protects all of us from countless potentially fatal events. 

Friends, Annamacharya is not a mere hermit but has experienced the ultimate. His honest effort to make us resonate with those ‘beyond the ordinary experiences’ is quite evident in all his poems. 

Implied meaning: Beyond this world bereft of the narrow considerations lies the unknown. What use is of opinions? 

భావము: లోపలికి గాలిని పీల్చుకోవడం మరియు దానిని వెలుపలకు వదలడంతో పాటు జీవితమూ కదులుతుంది. మనిషి జీవితం సున్నితము, తాత్కాలికము, మరియు స్వల్పకాలికము. మన స్వామి, వేంకటేశ్వరుడు అందరికీ రక్షకుడు. వేరే ఏ ఆశయములు కూడాప్రయోజనకారులు కావే! 

వివరణము: ఈ చరణం మానవ జీవితానికి ప్రత్యేకమైన విలువ లేదని; నిర్దిష్టమైన అర్థం, ఉద్దేశ్యం మరియు లక్ష్యము లేవని, కానీ మానవుడిగా మనం మన జీవితాన్ని గడపడం నేర్వాలి అని బోధించుచున్నది. మనకు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే దైవమునకు కృతజ్ఞత తెలుపుట​.

ఇదే సారాంశమును ప్రకటంచుచున్న బైబిల్, యాకోబు 13-15 లోని ఈ వాక్యములను పరిశీలించండి. 13నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువార లారా, 14రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.  15కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. 

భగవదర్పణం అంటే, మనం మన ఇంటి తలుపులు తెరిచి గాలిని అనుమతించే విధంగా, ప్రకృతి శక్తులు మనమీద పనిచేయడానికి అనుమతించడమే. దైవస్మరణ పెదవులను కదిలించడమే కాదు, నిజముగా హృదయాన్ని అర్పించడమే. సందేహాలుంటే ఏ జీవుడైన ఆత్మసమర్పణ చేయలేడు.  అసంఖ్యాకమైన సంభవనీయమైన ప్రాణాంతక ఘటనల నుండి మనందరకు రక్షణ కల్పించుచున్నది దైవమే. 

సౌజన్యులారా! అన్నమాచార్యులు కేవలం తపసి మాత్రమే కాదు, భావాతీత స్థితిని పొందాడు. ​ఆ మనవాతీతమైన అనుభవాలను మనలో ప్రతిధ్వనింపజేయడానికి ఆయన చేసిన ప్రయత్నంలోని నిజాయితీ ఆయన కీర్తనలన్నింటిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది.

అన్వయార్ధము: సంకుచిత పరిగణనలు లేనిది, ఈ ప్రపంచంతో సంబంధములేనిది, తెలియరానిది ఉన్నది. వికసించని అభిప్రాయాల వల్ల ప్రయోజనమేమి?

Recommendations for further reading:

 #1      107. వీనిఁ జూచియైన నేము (vIni jUchiyaina nEmu)

 #2       87. తల లేదు తోఁక లేదు దైవమా నీ మాయలకు (tala lEdu tOka lEdu daivamA nI mAyalaku)

 #3      అన్నమయ్య విన్నపాలు:విద్వాన్ ముడివర్తి కొండమాచార్యులు

 


Summary of this Keertana:

Not forgetting to get engaged in the service of the Lod Vishnu is the only intelligence available while in this body. Implied meaning: There is no intelligence greater than the service of the Lord.

 

The goddess of sleep swallows ‘beings’ by the night. She spits them out the next day. Those under illusion are willingly taking great effort desiring something or the other. They come back (to this world of illusion) many times.  What use is of their life? Implied meaning: Man out of self-generated knowledge evaluates situation(s), his life, and others. This apparently provides the basis for further action. This evaluation and action are born of material knowledge. These divert the man from the path of truth. Such a life is worthless.  When there is no effort in seeing (or observing), Therefore, that very observation is the action. Thus, living and action are one and the same thing for the liberated.

When eyelids are closed (on death), this (known) world becomes dark. Upon opening the eyes (upon birth), the world happens again and continues. As short as a minute, one feels existing (denoted by rich) as well as non-existing (denoted as poor). What kind of transient awareness (ephemeral knowledge) do people carry? Is it really an existence?  

Life moves along with breathing air inside and outside. Man’s life is fragile, tentative, and short-lived. Our lord, Venkateshwara is the saviour for all. What use is of (conceptual) thinking/reflection and opinions? Implied meaning: Beyond this world bereft of the narrow considerations lies the unknown. What use is of opinions?

 

కీర్తన సంగ్రహ భావము:

శ్రీపతి సేవను ఏమర కుండవలె నన్న బుద్ధియే బుద్ధిగాని వ్యర్థపుటాలోచనలుగల జీవులబుద్ధి ఏమి బుద్ధి. అన్వయార్ధము: భగవంతుని సేవను మించిన తెలివితేటలు మరొకటి లేవు.

 

నిద్రాదేవి రాత్రులందు జీవులను మ్రింగి (నిద్రలోముంచి) తెల్లవారగనే పెడల గ్రక్కుచున్నది. అనగా లౌకికకార్యోన్ముఖులను చేయుచున్న దనుట. మాటి మాటికి మాయావిష్ణులగు మానవులు పుట్టుచు చచ్చుచుందురు. వారిది ఏమి ఉనికి? అదొక ఉనికికా దనుట. అన్వయార్ధము: మానవుడు తాను సాధించిన జ్ఞానం నుండి పరిస్థితిని, అతని జీవితాన్ని మరియు ఇతరులను మదింపు వేస్తాడు. ఇది అతని చర్యకు ఆధారమగును. ఈ మదింపు మరియు చర్య విషయ పరిజ్ఞానం నుండి పుట్టినవి. ఇవి మనిషిని సత్యమార్గం నుండి మళ్ళిస్తాయి. అలాంటి జీవితం నిష్ప్రయోజనం.  చూడటానికి (లేదా పరిశీలించడానికి) ఎటువంటి ప్రయత్నం లేనప్పుడు, కాబట్టి, ఆ పరిశీలనే చర్య అగును. అందువలన, మోక్షం పొందినవారికి జీవించడము మరియు చర్య ఒకటే.  

 

కనురెప్పలు మూసినప్పుడు (మరణంలో), ఈ (తెలిసిన) ప్రపంచం చీకటిగా మారుతుంది. కళ్ళు తెరిచినప్పుడు (పుట్టినప్పుడు), సృష్టి గోచరించును, తిరిగి పాత పద్ధతిలోనే కొనసాగును. అనతికాలంలోనే, కలిమి (ఉన్నట్లు),  లేమియుఁ (లేనట్లు) తోచును. అటువంటి తాత్కాలిక అవగాహన (స్వల్ప జ్ఞానం) గల జీవుల తెలివేమి తెలివి?  వారిది ఏమి ఉనికి? అదొక ఉనికికా దనుట.

లోపలికి గాలిని పీల్చుకోవడం మరియు దానిని వెలుపలకు వదలడంతో పాటు జీవితమూ కదులుతుంది. మనిషి జీవితం సున్నితము, తాత్కాలికము, మరియు స్వల్పకాలికము. మన స్వామి, వేంకటేశ్వరుడు అందరికీ రక్షకుడు. వేరే ఏ ఆశయములు కూడాప్రయోజనకారులు కావే! అన్వయార్ధము: సంకుచిత పరిగణనలు లేనిది, ఈ ప్రపంచంతో సంబంధములేనిది, తెలియరానిది ఉన్నది. వికసించని అభిప్రాయాల వల్ల ప్రయోజనమేమి?

 

Copper Leaf: 88-6 Volume 1-434

2 comments:

  1. Great article
    Thank you for the article

    ReplyDelete
  2. జ్ఞానము అంటే యేమిటో గీతలో భగవానుడు ఉపదేశించినట్లే
    శ్రీపతి సేవ కంటే మించిన బుద్ధి ఏదీ లేదని అన్నమయ్య ఈ కీర్తనలో జ్ఞానము(బుద్ధి)అంటే యేమిటో తెలియజేస్తున్నాడు.
    విషయజనిత జ్ఞానం అంటే అజ్ఞానం మనిషిని జ్ఞానమార్గం నుండి మళ్ళించుచున్నవని, జననమరణముల నడుమ సమయంలో మనిషి మాయ ప్రభావమున అచేతనావస్థలో ఉండి జీవితమును ముందుకు తోస్తూ వెళుతున్నాడు. ఇదీ ఒకఉనికియేనా అని అన్నమయ్య ప్రశ్నిస్తున్నాడు.తాత్కాలికమైన జీవితం ఉచ్చ్వాసనిశ్వాసములతో గడచిపోతున్నది.ఇదీ ఒక జీవితమేనా? దీనికి ఉనికి యేది?
    ప్రయోజనమేది?పరమార్థమేది?
    సమస్తమైన ప్రాపంచిక విషయముల నుండి విముక్తుడై, కేవలం శ్రీపతికి ఆత్మసమర్పణ చేసికొని జీవితగమ్యమైన పరమపదమును చేరుకొమ్మని అన్నమాచార్యులవారు ఈ ఆధ్యాత్మిక కీర్తనలో లోకాన్ని చైతన్యపరుస్తున్నాడు.
    శ్రీ చామర్తి శ్రీనివాస్ గారు ఈ కీర్తన మీద భగవద్గీత మరియు బైబిల్ లోని విషయాలతో జోడించి చక్కటి వ్యాఖ్యానాన్ని అందించారు. వారికి మనఃపూర్వక అభినందనలు. నతులు.
    ఓం తత్ సత్ 🙏
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...