తోడేళ్ళు నదులను ఎలా మార్చగలవు?
గత అర్ధ శతాబ్దంలో అత్యంత ఉత్తేజకరమైన శాస్త్రీయ పరిశోధనలలో ఒకటి విస్తృతమైన
ట్రోఫిక్ కాస్కేడ్ (ఆహారం మరియు పోషణ పర్యవసాన ప్రభావము- సోపాన క్రమపద్ధతి)
కనుగొనడం. ట్రోఫిక్ క్యాస్కేడ్ అనేది ఒక పర్యావరణ ప్రక్రియ, ఇది ఆహార గొలుసు యొక్క పై భాగంలో ప్రారంభమవుతుంది మరియు దిగువ
వరకు విస్తరిస్తుంది. 1995లో తోడేళ్ళను తిరిగి ప్రవేశపెట్టినప్పుడు ఎల్లోస్టోన్ జాతీయ
ఉద్యానవనంలో (USA) జరిగింది ప్రామాణిక ఉదాహరణ.
తోడేళ్ళు వివిధ జాతుల జంతువులను చంపుతాయని మనందరికీ తెలుసు. కానీ అవి చాలా
జీవక్రమము లకు ప్రాణం పోస్తాయని బహుశా మనకు తెలియకపోవచ్చు. అంతకుముందు 70 ఏళ్లుగా తోడేళ్ళు కనిపించలేదు.
ఎల్లోస్టోన్ పార్కులో జింకల సంఖ్యను తగ్గించడానికి మానవులు
ప్రయత్నించినప్పటికీ ప్రయోజనము లేక పోయినది. వాటిని వేటాడడానికి తోడేళ్ళు
లేకపోవడంతో జింకల సంఖ్య బాగా పెరిగింది. జింకలు అక్కడ ఉన్న వృక్షసంపదను పూర్తిగా
తినివేసి దాదాపుగా ఎడారిలా మార్చివేశాయి.
అలా లేళ్ళు మేసుకుంటూ వెళ్ళి సస్యశ్యామల ప్రదేశాన్ని విశాలమైన మరుభూమి క్రింద మార్చి వేశాయి.
తోడేళ్ళు వచ్చిన వెంటనే అవి గణనీయమైన ప్రభావాలను చూపించడం ప్రారంభించాయి. మొదట అవి కొన్ని జింకలను చంపాయి. అది పెద్ద
విషయం కాదు. మరీ ముఖ్యంగా అవి జింకల ప్రవర్తనను సమూలంగా మార్చేశాయి. జింకలు పార్కులోని కొన్ని ప్రాంతాలను - సులభంగా
చిక్కుకునే ప్రదేశాలను - ముఖ్యంగా లోయలను తప్పించుకు తిరగడం ప్రారంభించాయి. వెంటనే
ఆ ప్రదేశాలలో పునరుత్పత్తి కావడం ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల్లో ఆరేళ్లలో చెట్ల
ఎత్తు ఆరింతలు పెరిగాయి. ఎడారి వంటి లోయ
త్వరగా ఆస్పెన్ , విల్లో మరియు పత్తి కలప అడవులుగా మారడం మొదలుపెట్టయి.
కొద్దికాలానికే పక్షులు రావడం మొదలుపెట్టాయి. అనతికాలంలోనే వాటి సంఖ్య బాగా
పెరిగింది.
త్వరలోనే బీవర్లు పెరగడం మొదలయ్యాయి. ఇవి చెట్లను తినడానికి ఇష్టపడతాయి.
తోడేళ్ళ లాగానే యివి బీవర్లు పర్యావరణ ఇంజనీర్లు. ఇవి ఇతర జాతులకు గూళ్ళను సృష్టించాయి. అవి నిర్మించిన ఆనకట్టలు ఓట్టర్లు, మస్క్రాట్స్
మరియు బాతులు, సరీసృపాలు, చేపలు మరియు
ఉభయచరాలకు ఆవాసాలను కల్పించాయి.
తోడేళ్ళు కొయెట్'లను చంపాయి మరియు దాని ఫలితంగా, ఎలుకలు, కుందేళ్ళు పెరగడం ప్రారంభించాయి. దీని అర్థం
ఎక్కువ డేగలు, ఎక్కువ వీసెల్స్, ఎక్కువ
బ్యాడ్జర్లు అక్కడకు చేరుకున్నాయి.
చిన్న తోడెళ్ళ గుంపు మొత్తము పర్యావరణ వ్యవస్థను మార్చివేసినది.
తోడేళ్ళు వదిలివెళ్లిన మాంసాన్ని తినడానికి కాకులు, బాల్డ్ Eagles, గద్దలు భూమి మీదకు కిందకు వచ్చేవి. పాక్షికంగా
పునరుత్పత్తి చెందిన పొదల్లో ఎక్కువ బెర్రీలు పెరగడంతో ఎలుగుబంట్ల సంఖ్య పెరగడం
మొదలైంది. ఎలుగుబంట్లు వాటిని కూడా ఆ మాంసాన్ని
తింటాయి. వాటి సంఖ్య పెరగడం మొదలైంది. ఎలుగుబంట్లు అడపదడప కొన్ని జింకలను
చంపడం ద్వారా తోడేళ్ళ ప్రభావాన్ని బలపరిచాయి.
ఆ విధంగా తోడేళ్ళకు ప్రతిస్పందనగా అడవుల పునరుత్పత్తి కారణంగా నదులు
మారిపోయాయి. పెరిగిన అడవులు గట్ల కోతను తగ్గించి, నదీ
తీరాలను స్థిరీకరించాయి.
బీవర్ల కారణంగా కొన్ని చోట్ల కాలువలు కుంచించుకు పోయాయి. వాటినుండి పొంగి పొరలిన నీరు నీటి చెలములు, గుంటలు, కొలనులు ఏర్పాడడానికి దోహదం చేసింది. ఇవన్నీ
వన్యప్రాణుల ఆవాసాలకు ఎంతో మేలు చేస్తాయి.
No comments:
Post a Comment