Sunday, 17 March 2024

T-200. హరియవతారమె ఆతఁ డితఁడు

 అన్నమాచార్యులు 

200. హరియవతారమె ఆతఁ డితఁడు 

వ్యాఖ్యానము: చామర్తి శంకర నాగ శ్రీనివాస్

For English Version, press here 

ఉపోద్ఘాతము: ఈ భూ ప్రపంచములో అనేకమంది మహానుభావులు జన్మించారు. వారు మిరుమిట్లు గొలుపుతూ మన జీవితములను ప్రకాశవంతం చేశారు. ఐతే  మెరుపుల వెలుగులలో జీవనము ముందుకు సాగదు. సూర్యునిలా నిరంతరము వెలుగునిచ్చిన కానీ ముందు దారిని కానని వారము.  

సామాన్యులు సైతం అప్పటివరకు ఉన్నత వర్గమునకు పరిమితమైన స్వేచ్ఛ  (లేదా మోక్షము) పొందుటకు అవకాశం కలదని అన్నమాచార్యులు ప్రకటించి నారు. ఆ స్వేచ్ఛ  (లేదా ఆ మోక్షము) అనునవి కేవలము భావనలు కావని, నిర్ణయింపరాని ఆ తలముులకు మార్గములు సుగమములు  చేసినారు  అన్నమాచార్యులు. కానరాని లోకములను కనిపింప చేసినారు. అసంభవమును అనుభూతికి తెచ్చినారు. 

వారు తమ శక్తి నంతటిని క్రోడీకరించి, తమ సర్వస్వమును ధారపోసి, పదములను ముడి సరుకుతో, తమ జీవితమును కలిపి రంగరించి అందులో చైతన్యము నిలిపి, చక్కెర లాంటి మాధుర్యమును తమ సంకీర్తనములలో నింపి చిరస్మరణీయులైరి. వారు వాఙ్మయమును పతాక స్థాయిలో నిలిపి రన్నది నిర్వివాదాంశము. 

అన్నమాచార్యులు వారు కనిపించని లోకాలకు అసాధ్యమైన, అసాధారణమైన, విన్నూత్నమైన బాటలు వేశారు. ఇంద్రధనస్సులా ఈ లోకమునుంచి పైలోకాలకు సంకీర్తనములను మెట్లు వేసి, హరిని ఘనముగా కీర్తించు అపూర్వ జీవితమును మానవులకు నిర్దేశించినారు ఆచార్యులు. 

గొప్ప కవిత్వం ఈ భూమిపై అవతరించింది. కొందరు తమ హృదయాన్ని మనముందు నిలబెడతారు. మరికొందరు మన హృదయాన్ని పిండేస్తారు. ఐతే, అన్నమాచార్యులు సంకీర్తనము ద్వారా  దైవత్వమునకు మార్గం సాధ్యము అని నిరూపించారు. ఆ అసాధారణ జ్ఞానమును  మనపై కురిపించ విశ్వ​యత్నము చేశారు. 

జీవితం అనే ఈ గొప్ప బహుమతికి లోన బయటలు అను ప్రపంచముల సమైక్యతను సాధించుట పతాకస్థాయి అనవచ్చును. అదియే భగవంతుని కరుణ. ఈ బహుమతిని పొందిన వారు ధన్యులు. ఆ ఐక్యతకు సర్వస్వమును పణముగా పెట్టినవారు  కృతార్థులు. వారిలో అన్నమాచార్యులు అగ్రస్థానంలో ఉంటారు. 

ఈ కీర్తన వర్తమాన కాలంలో వ్రాయబడినది. దీనిని బట్టి, అన్నమాచార్యులు దేశ కాల పరిమితులను అధిగమించి మనలను దీవించుటకు నిలిచియున్నారని తెలుస్తుంది. వారు చిరంజీవులు. 

కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు
వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు
పుణ్యమూర్తులూ.. సూర్యచంద్రులూ
పుణ్యమూర్తులూ..సూర్యచంద్రులూ

 

 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు 177-5  సంపుటము: 2-385

హరియవతారమె ఆతఁ డితఁడు
పరమసంకీర్తనఫలములో నిలిపె    ॥పల్లవి॥
 
వున్నాఁడు వైకుంఠమున నున్నాఁడు యాచార్యునొద్ద
వున్నతోన్నతమహిమ నన్నమయ్య
వున్నవి సంకీర్తనాలు వొట్టుక లోకములందు
పన్నిన నారదాదులు పైపైఁ బాడఁగను       ॥హరి॥
 
చరియించు నొకవేళ సనకాదిమునులలో
హరిఁ బాడుఁ దాళ్ళపాకఅన్నమయ్య
తిరమై యాళువారల తేజము దానైయుండు
గరుడానంతముఖ్య ఘనులంగడిని ॥హరి॥
 
శ్రీవేంకటాద్రిమీఁద శ్రీపతికొలువునందు
ఆవహించెఁ దాళ్ళపాకఅన్నమయ్య
దేవతలు మునులును దేవుఁడని జయవెట్టఁ
గోవిదుఁడై తిరిగాడీఁ గోనేటిదండను            ॥హరి॥

 

No comments:

Post a Comment

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...