ANNAMACHARYA
66. ఊరకే వెదకనేల వున్నవి చదువనేల
Introduction: in this gem of a verse, Annamacharya is asking us
to shed the hypocrisy. He said there is
no purpose served by display to the outer world, unless one is clean from
inside.
He further beseeches us to remove the hidden
internal desires. He is asking us to find that indescribable fruit next to us instead of senseless search and arm chair
explorations. .
ఉపోద్ఘాతము: రత్నం లాంటి కీర్తనలో, అన్నమాచార్యులు కపటత్వాన్ని తొలగించమని అడుగుతున్నారు. లోపలి నుండి శుభ్రంగా ఉంటే తప్ప, బాహ్య ప్రపంచానికి ప్రదర్శించడం ద్వారా నీకేమీ ఒరగదని ఆయన అన్నారు.
కట్టిపెట్టియున్న అంతర్గత కోరికలను
సైతం తొలగించుకోమని ఆయన మనలను మరింత వేడుకుంటున్నాడు. అర్ధంలేని అన్వేషణను, మతిలేని
మేధో శోధనను పక్కనపెట్టి మీలోనే ఉన్న వర్ణించలేని పండును కనుగొనమని ఆయన అడుగుతున్నాడు.
కీర్తన
ఊరకే వెదకనేల వున్నవి చదువనేల
కోపము విడిచితేనె పాపము దానే పోవు
ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు
Details and Explanations:
ఊరకే వెదకనేల వున్నవి
చదువనేల
UrakE vedakanEla vunnavi
chaduvanEla
Word to Word meaning: ఊరకే (UrakE) = without aim; వెదకనేల (vedakanEla) = why search (god)? వున్నవి (vunnavi) = already available, existing Vedas; చదువనేల (chaduvanEla) = why read/study/research; చేరువనె (chEruvane) = very closely; వున్నది (vunnadi) = available; ఇదె (ide) = this; చెప్పరాని (chepparAni) = indescribable; ఫలము (phalamu) = fruit.
Literal meaning and Explanation: Why Search (god) aimlessly. Why study/research
(on Vedas)? Very close to you exists an indescribable fruit.
Annamacharya is sceptical that it is not going to yield new results by searching from what you already know and therefore the statement వున్నవి చదువనేల (vunnavi chaduvanEla)?
As always, Annamacharya says it is futile to search god, do not approve theorising and intellectual exploration of God.
Man could land a space craft on an asteroid, in a faraway comet; Strange!
He knows not what is next to him despite binoculars and magnifying glasses! He
neither recognizes of drowning himself in thousands of tasks! Where is that
fruit?
భావము మరియు వివరణము: ఊరకనే (లక్ష్యరహితంగా) శోధించకండి. దైవ గ్రంధాల అధ్యయనం / పరిశోధన లెందుకో? మీకు చాలా దగ్గరే వర్ణించలేని పండు ఉంది.
వున్నవి చదువనేల? అంటూ తెలిసిన వాటిలోనే (తిరిగి) అన్వేషించడానికి మీరు ప్రయత్నిస్తారే? అందులో క్రొత్త ఫలితాలెక్కడి నుంచి వస్తాయో? అని సందెహము వెలిబుచ్చారు.
ఎప్పటి లాగానే, అక్కడ ఇక్కడా వెతకద్దు; పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతూ సమయం వ్యర్ధం చేసుకోవద్దన్నారు. దేవుని సిద్ధాంతీకరించవద్దని మరియు మేధోన్వేషణ నిష్ఫలమనీ అన్నరు.
మానవుడు ఎక్కడో ఉన్న తొకచుక్కలోని ఒక గ్రహశకలం మీద అంతరిక్ష నౌకని దించ గలడు. విచిత్రమేమిటో కానీ తన పక్కనే ఏమి ఉందో అతనికి తెలియదే!
స్పష్టంగా చెప్పారు, చేరువనే వున్నది చెప్పరాని ఫలము అని, వేలాది పనుల్లో మునుగుతున్న
మనకు కనబడదందుకో? ఇంకా దుర్భిణీలు, భూతద్దాలు పెట్టుకు చూస్తున్నా కనబడదేంటో?
కోపము విడిచితేనె పాపము దానే పోవు
kOpamu viDichitEne pApamu dAnE pOvu
Word to Word meaning: కోపము (kOpamu) = anger; విడిచితేనె (viDichitEne) = if eschewed; పాపము (pApamu) = the sin; దానే (dAnE) = by itself; పోవు (pOvu) = dissolve; దీపింప (dIpiMpa) = lighting; సుజ్ఞానము (suj~nAnamu) = proper knowledge; తెరువు (teruvu) = way, path; ఇదివో (idivO) = this one; లోపల (lOpala) = inside; మనిలుఁడై (maniluDai) = being dirty; లోకము (lOkamu) = for the world; మెచ్చుకొరకు (mechchukoraku) = to receive the praise ( of the world) పైపైఁగడిగితేను (paipaigaDigitEnu) = superficial cleaning; పావనుఁడౌనా (pAvanuDaunA) = will he become clean totally?
Literal meaning and Explanation: Leave out the anger, all your sins will dissolve
(without your knowing). That is the path to proper knowledge. no point is served, in exhibiting clean and fresh
appearances and good etiquette (
to the public) unless you are actually clean inside.
Anger is the cause of many hardships that happen to man. Bhagavad-Gita
recognises Anger as primary obstacle by
describing क्रोधाद्भवति सम्मोह: सम्मोहात्स्मृतिविभ्रम: krodhād bhavati sammohaḥ sammohāt smṛiti-vibhramaḥ (2-63). (Purport: Anger
leads to clouding of judgment, which results in bewilderment of the memory.)
We use hypocrisy many times in life. This is a fact. No purpose is served
by preaching. Please consider Saint Kabir’s sarcastic couplet below.
mana na raṅgāye ho, raṅgāye yogī kapaṛā
jatavā baḍhāe yogī dhuniyā ramaule, dahiyā baḍhāe yogī bani gayele bakarā[v2]
“O Ascetic Yogi, you have donned
the ochre robes, but you have ignored dyeing your mind with the colour of
renunciation. You have grown long locks of hair and smeared ash on your body
(as a sign of detachment). But without the internal devotion, the external
beard you have sprouted only makes you resemble a goat.”
No matter how much you learn, the most important duty is to be serene internally, says Annamayya.
భావము మరియు వివరణము: కోపాన్ని వదిలేయండి, మీ పాపాలన్నీ వాటంతట అవే కరిగిపోతాయి (మీకు తెలియకుండానే). సరైన జ్ఞానానికి మార్గమదే. పైపైకి శుభ్రంగా మరియు తాజాగా కనిపించినా; {మంచి మర్యాదలు నేర్చి (ప్రజలకు) ప్రదర్శించడంలో నిపుణులైనా} మీరు నిజంగా అంతర్గతంగా శుభ్రంగా ఉంటే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు.
కోపమే మనిషికి సంభవించు అనేకానేక కష్టములకు కారణభూతము. భగవద్గీత కూడా క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।
(2-63) అని చెప్పి విస్తారముగా చర్చ జరిపింది. (భావము కోపం అనేది విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది, అది స్మృతి (జ్ఞాపకశక్తి) భ్రమని కలుగ చేస్తుంది. అని భగవద్గీతలో చెప్పనే చెప్పారు.)
జీవితములో కపటాన్ని అనేక మార్లు ఉపయోగిస్తాము. ఇది వాస్తవము. పైపైన ఎన్ని వేదాలు వల్లించి ఏమి ప్రయోజనము? క్రింది వేమన పద్యం కూడా కపటం ద్వారా మోక్షాన్ని సాధించలేరని చెబుతోంది.
వేషభాషలెరిగి కాషాయవస్త్రముల్
(Purport: O learned Vema! donning the ochre robes, learning the language and etiquette do not ensure
liberation. By tonsuring, you may exhibit a bald head. Tell me, if
your thoughts are truly stripped of wants?)
ఎన్ని నేర్వండి, అంతర్గతంగా నిష్కల్మషంగా ఉండటమే అతి ముఖ్యమైన విధి అంటున్నారు అన్నమయ్య.
ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు
muMdarikOrika vOtE muMchina
baMdhAlu vIDu
Word to Word meaning: ముందరికోరిక (muMdarikOrika) = first desires వోతే (vOtE) = if driven out; ముంచిన (muMchina) = inundating; బంధాలు (baMdhAlu) = bondages; వీడు (vIDu) = get removed కందువ (kaMduva) = డొంకతిరుగుడు,(కందువమాటలు = a quibble: a play upon words), circuitous; నాస (nAsa) = desires, hopes; మానితే (mAnitE) = if stopped; కైవల్యము (kaivalyamu) = Liberation; బొందిలోన (boMdilOna) =inside the human body నొకటియు (nokaTiyu) one thing; భూమిలోన (bhUmilOna) = for the world; నొకటియు (nokaTiyu) = another thing; చిందు వందు (chiMdu vaMdu) = dancing, scattered; చిత్తమైతే (chittamaitE) = if mind is; చేరునా (chErunA) = can it reach? వైకుంఠము (vaikuMThamu) = the abode of Sri Vishnu. (Ultimate desired Desitnation)
Literal meaning and Explanation: First, if you eschew desires, bondages will get removed. If you
stay away from the circuitous hope, it is equal to achieving the
liberation. How can you expect to reach
Vaikunthamu if your mind is pulling you
apart by stating one thing for yourself and another for the world?
The two statements below corroborate, beyond doubt, on what Annamacharya proclaimed in this stanza. (One may wonder how Annamacharya could witness the world without moving out of his native region).
“The duplicity of others must always be shocking when one is unconscious of one's own.” ― The Mask of Dimitrios
“There are many wise men, that have secret hearts, and transparent countenances.”― Francis Bacon
భావము మరియు వివరణము: మొదట, మీరు కోరికలను విడిచిపెడితే, బంధాలు తొలగించబడతాయి. మీరు డొంకతిరుగుడు ఆశల నుండి దూరంగా ఉంటే, అదే విముక్తిని సాధించడానికి సమానం. మీ కోసం ఒకటి మరియు మరొకటి ప్రపంచానికి చెప్పడం ద్వారా మీ మనస్సు మిమ్మల్ని విడదీస్తుంటే వైకుంఠము ఎలా ఆశించవచ్చో?
ఆత్మవంచన మనకు వెన్నతోఁబెట్టిన విద్య. ఆరుద్ర గారి క్రింది కూనలమ్మ పదాన్ని చూడండి.
ఆత్మవంచన వల్ల
(Duplicity and Lies make you empty)
కాంతల పొందొల్లకుంటే
ఘనదుఃఖమే లేదు
kAMtala poMdollakuMTE
ghanadu@hkhamE lEdu
Word to Word meaning: కాంతల (kAMtala) = other ladies; పొందొల్లకుంటే (poMdollakuMTE) = without moving away from their association; ఘనదుఃఖమే (ghanadu@hkhamE) = no greater sorrow; లేదు (lEdu) = exists; అంతరాత్మ (aMtarAtma) = the inner dweller; శ్రీవేంకటాద్రీశుఁడు (SrIvEMkaTAdrISuDu) = Lord Venkateswara; అంతట (aMtaTa) = in all places; మాటలె (mATale) = his stories; యాడి (yADi) = keep reciting; హరి శరణనకుంటే (hari SaraNanakuMTE) = without bowing to SRI HARI; దొంతినున్న (doMtinunna) = ఒకదానిమీద ఒకటి పేర్చియున్న వస్తువుల సముదాయము, layers of things arranged in order; piled up; భవములు (bhavamulu) = bodies (దొంతినున్న భవములు meant multiple future re-incarnations of the self) తొలఁగునా (tolagunA) = to they vanish away? వివేకికి (vivEkiki) = for the intelligent (practioner).
Literal meaning and Explanation: Unless you dissociate from other ladies, there is no greater sorrow than that. The inner dweller is Lord Venkateswara. O intelligent people!! Unless you keep reciting his stories and glories, there is no other way of escaping re-birth(s).
Here as already explained previously, desire for other ladies indicate those desires a person would possess, but inhibited because of social stigma attached with it. Unless a person has unravelled all his internal feelings, these desires are likely to become obstacles.
What tool one has for uncovering of hidden desires? Mind is already conditioned. Therefore any analysis by it is likely to be biased. Annamacharya is suggesting to get engaged in praise of God to dissolve those hidden things. Jiddu Krishmamurti suggested self awareness. Are they different? .
By stating నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందుఁ చిలుకా Annamacharya indicated there are no differences between the world and the self. Let me repeat, though Annamacharya is deeply religious, he is clear that true mediation is being aware that he is not different from the world.
What he meant by
దొంతినున్న భవములు (doMtinunna bhavamulu) is worth considering here. It is indicating a
large set of arranged layers. Similar statement by Jiddu Krishnamurti is here: “the whole humankind is in
each one of us in both conscious and unconscious, the deeper layers.” That means, both of them observed the same thing internally.
భావము మరియు వివరణము: మీరు ఇతర మహిళల మోహము నుండి విడిపోతే తప్ప, అంతకన్నా గొప్ప దుఃఖం మరొకటి లేదు. అంతరంగ నివాసి వెంకటేశ్వరుడు. ఓ తెలివైన ప్రజలారా !! మీరు ఆయన కథలను మరియు కీర్తిని పఠిస్తూ ఉంటే తప్ప, పునర్జన్మల నుండి తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు.
ఇంతకుముందే వివరించినట్లుగా, ఇతర మహిళలపై కోరిక అని చెప్పి సామాజిక కళంకానికి భయపడి మనిషి అణచుకునే కోరికలను సూచించారు. ఒక వ్యక్తి తన అంతర్గత భావాలన్నింటినీ బయటపెట్టకపోతే, అవి భక్తి మార్గానికి అడ్డంకులుగా మారే అవకాశం ఉంటుంది.
దాగియున్న కోరికలను వెలికితీసేందుకు సాధనం ఏమిటి? మనస్సు ఇప్పటికే స్థితి వ్యాజానికి (స్థితి కల్పించు భ్రమకు) లోనై ఉంది. అందువల్ల దాని ద్వారా ఏదైనా విశ్లేషణ పక్షపాతంతో ఉంటుంది. దాచిన కోరికలను కరిగించడానికి అన్నమాచార్యులు భగవంతుని స్తుతించడంలో నిమగ్నమవ్వాలని సూచిస్తున్నారు. జిడ్డు కృష్ణమూర్తి స్వీయ అవగాహన సూచించారు. వారు భిన్న మార్గాలను సూచించారా?
నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందుఁ చిలుకా అని చెప్పి ప్రపంచానికి, ఆత్మకు మధ్య తేడాలు లేవని అన్నమాచార్య సూచించారు. అన్నమాచార్య తీవ్రమైన హరి భక్తిలో మునిగియున్నాప్పటికీ, తనలోని తాను చుట్టూ ఉన్న ప్రపంచం ఒకటేనని గ్రహించడమే నిజమైన ధ్యానమని తెలియండి అనేక మార్లు చెప్పిరి.
దొంతినున్న భవములు అని దేన్ని గురించి చెప్పారో అన్నమయ్య పరిశీలిద్దాం. దొంతి =ఒకదానిమీద ఒకటి పేర్చియున్న వస్తువుల సముదాయము. జిడ్డు కృష్ణమూర్తి చేసిన ఇలాంటి ప్రకటన ఇలా ఉంది: “మొత్తం మానవాళి (చైతన్యము) మనందరిలో చేతన మరియు అపస్మారక స్థితిలో, లోతైన పొరలలో ఉంది.” అనగా వారిద్దరూ అంతర్గతంగా ఒకే విషయాన్ని సందర్శంచారు అనుకోవచ్చు.
zadaz
Reference: