ANNAMACHARYA
125 కడు నజ్ఞానపు కరవుకాలమిదె
(kaDu naj~nAnapu karavukAlamide)
Introduction: This is a prayer poem of the liberated. They feel hounded by the flames of wants. This world, this evaluation of life, is the same for everyone. What are our options?
Annamacharya employs words that aren't usually associated with poetry in this short yet powerful poem. In Andhra Pradesh, the word ‘వెడలదొబ్బి’ is strictly forbidden. However, Annamacharya did not compromise to use substitution to silence the poetic communication. The time proved that Annamacharya’s unwavering dedication masked the flaws in popular perceptions.
ఉపోద్ఘాతము: ఇది ముక్తి పొందిన వారి ప్రార్థన. వారు అనుక్షణం కోరికల జ్వాలలు వెంటాడినట్లు భావిస్తారు. దైవమును శరణు వేడుతారు. ఈ విచయము (నువ్వేమిటో అనే పరీక్ష) ప్రతివారికీ ఉంటుంది. మనమెటు వైపో? అన్నమాచార్యులు చిన్నదైనప్పటికీ, ప్రభావవంతమైన కీర్తనలో సాధారణంగా కవిత్వంతో సంబంధం లేని పదాలను ఉపయోగిస్తాడు. ఆంధ్ర ప్రదేశ్ లో 'వెడలదొబ్బి' అనే పదం ఖచ్చితంగా నిషిద్ధం. అయితే, కావలసిన భావాన్ని కవితలో పలికించడానికి ప్రత్యామ్నాయాలను వాడని ధైర్యము చేసారు. కాలక్రమముగా ప్రజాదరణలోని అవగాహనా లోపాలకు అన్నమాచార్యుని అచంచలమైన అంకితభావం తెర వేసింది.
కీర్తన:
కడు నజ్ఞానపు కరవుకాలమిదె వెడలదొబ్బి మా వెరపు దీర్చవే ॥పల్లవి॥ పాపపు పసురము బందెలు మేయఁగ పోపుల పుణ్యము పొలివోయ శ్రీపతి నీకే చేయి చాఁచెదము యేపున మమ్మిఁక నీడేర్చవే ॥కడు॥ యిలఁ గలియుగమను యెండలు గాయఁగ చెలఁగి ధర్మమను చెరు వింకె పొలసి మీ కృపాంబుధి చేరితి మిదె తెలిసి నాదాహము తీర్చవే ॥కడు॥ వడిగొని మనసిజవాయువు విసరఁగ పొడవగు నెఱుకలు పుట మెగసె బడి శ్రీవేంకటపతి నీ శరణము విడువక చొచ్చితి వెసఁ గావఁగదే ॥కడు॥ | kaDu naj~nAnapu karavukAlamide veDaladobbi mA verapu dIrchavE ॥pallavi॥ pApapu pasuramu baMdelu mEyaga pOpula puNyamu polivOya SrIpati nIkE chEyi chAchedamu yEpuna mammika nIDErchavE ॥kaDu॥ yila galiyugamanu yeMDalu gAyaga chelagi dharmamanu cheru viMke polasi mI kRpAMbudhi chEriti mide telisi nAdAhamu tIrchavE ॥kaDu॥ vaDigoni manasijavAyuvu visaraga poDavagu ne~rukalu puTa megase baDi SrIvEMkaTapati nI SaraNamu viDuvaka chochchiti vesa gAvagadE ॥kaDu॥ |
Details and Explanations:
కడు నజ్ఞానపు కరవుకాలమిదె
వెడలదొబ్బి మా వెరపు దీర్చవే ॥పల్లవి॥
kaDu naj~nAnapu karavukAlamide
veDaladobbi mA verapu dIrchavE ॥pallavi॥
Word to Word meaning: కడు (kaDu) = much, greatly; నజ్ఞానపు (naj~nAnapu) = of ignorance; కరవుకాలమిదె (karavukAlamide) = period of famine or scarcity; వెడలదొబ్బి (veDaladobbi) = push it out; మా (mA) = our; వెరపు (verapu) = fear or fright; దీర్చవే (dIrchavE) = to end or to finish.
Literal meaning: We are entrenched in great period of famine (or drought) called ignorance#1. O God! Push it out and end our fear.
Explanation: What is this ignorance mentioned in this? Most of us are well educated. Moderately to highly successful in life. If we are even if we are part ignorant, this success in life is difficult to achieve. So where is the ignorance?
Sir, Annamacharya is not talking of material success, but our deep-seated indifference to our duties as humans; extreme concern for own security at the cost of anything- be it environment or society; And our inability to differentiate truth from myth.
If you look closely, you'll notice that the foundations on which we build our lives are very shaky. We go to prayer without questioning who that god could be. God must be the huge dumping ground for all our sins, if we go by the popular projections generally made. Whereas in real life we abhor the dustbins. What an inconsistency man has?
భావము: ప్రభూ! కడు అజ్ఞానమను#1 కరవుకాలములో కూరుకుపోయాము. దాన్ని వెడలదొబ్బి మా భయము తీర్చవయ్యా!
వివరణము: ఇక్కడ పేర్కొన్న అజ్ఞానం ఏమిటి? మనలో చాలా మంది బాగా చదువుకున్నవారే. జీవితంలో ఒక మాదిరి నుండి అధికమైన విజయం సాధించినవారమే కదా! మనలో ఏమాత్రం అజ్ఞానం ఉన్నా జీవితంలో ఈ విజయాన్ని సాధించడం కష్టమే. మరి అజ్ఞానం ఎక్కడుంది?
అన్నమాచార్యుల వారు భౌతిక విజయాల గురించి మాట్లాడటం లేదు, కానీ మానవులుగా మన విధుల పట్ల గల చెప్పలేనంతఉదాసీనత; స్వంత భద్రత కోసం పర్యావరణం లేదా సమాజం లేదా దేనినైనా పణంగాపెట్టు మనస్తత్వం; మరియు సత్యాసత్యములను గ్రహించుటలో మన అసమర్థతలను ఏకరవు పెట్టుచున్నారు.
మీరు నిశితంగా పరిశీలిస్తే, మనం మన జీవితాలను నిర్మించే పునాదులు పటిష్టమైనవి కావని మీరు ఇట్టే గమనించవచ్చు. ఆ దేవుడు ఎవరు అని ప్రశ్నించకుండా మనం ప్రార్థనలకు చేయబోతాము! ప్రజాదరణ పొందిన నమ్మకాలను సరిగ్గా విశదీకరించి చూస్తే, దేవుడు మన పాపాలను కుప్పలు కుప్పలుగా కుమ్మరించే చోటు. నిజజీవితంలో మనం అవే చెత్తకుండీలను అసహ్యించుకుంటాం. కడు అజ్ఞానమను కరవుకాలములో కూరుకుపోయామా? లేదా?
పాపపు పసురము బందెలు మేయఁగ
పోపుల పుణ్యము పొలివోయ
శ్రీపతి నీకే చేయి చాఁచెదము
యేపున మమ్మిఁక నీడేర్చవే ॥కడు॥
pApapu pasuramu baMdelu mEyaga
pOpula puNyamu polivOya
SrIpati nIkE chEyi chAchedamu
yEpuna mammika nIDErchavE ॥kaDu॥
Word to Word meaning: పాపపు (pApapu) = sin bearing; పసురము (pasuramu) = పశువు, quadruped, generally indicating a Cow or Ox; బందెలు (baMdelu) fence, restraining ropes, restraining principles; మేయఁగ (mEyaga) = eatout; పోపుల (pOpula) = పోషణ నిచ్చు, invigorating; పుణ్యము (puNyamu) పొలివోయ, (polivOya) = పొలిమేరలు దాటి పోగా, crossed the limits (implying not within reach); శ్రీపతి (SrIpati) = O Sripati! (Lord Vishnu); నీకే (nIkE) = to you only; చేయి (chEyi) = hand; చాఁచెదము (chAchedamu) = stretching; యేపున (yEpuna) = అతిశయమున (అంటే ఇక్కడ త్వరగా), much quickly; మమ్మిఁక (mammika) = మమ్ము ఈమీద, ఇటుపైని, we after this; నీడేర్చవే (nIDErchavE) = నెరవేర్చు, సిద్ధింపజేయు, to fulfil, to accomplish
Literal meaning: The animal like sin has eaten the fence. Thus sir, we have no limits to our wrong doings#2. On the other hand, the invigorating good has left us. Sir, really, we don’t know what right action is. Therefore, we stretch our hand towards you. Come quickly to take us out of this abyss (hell).
Explanation: Annamacharya is indirectly indicating that we are in a place like hell where only possible action is sin. This we encounter very often. Only thing is that we don't realize that we are doing, particularly when trampling the natural principles. As an example, I am giving soliloquy of Macbeth.
In Shakespeare’s Macbeth, the main character is a tragic hero who rises from the rank of general to become the King of Scotland. Sadly, his dramatic rise to power also parallels the downfall and destruction of his moral compass.
King Duncan is his guest in his castle. Macbeths plan to murder him and make the drunken chamberlains responsible for it. While this is going on, Macbeth starts thinking like this.
“He's here in double trust; First, as I am his kinsman and his subject,
This demonstrates that the tragedy of human condition, in whatever the culture, is more or less the same. Man commits wrong most often knowingly. What an incurable creature man is!
Now see the connect with this Bhagavad-Gita verse: अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृता: | प्रसक्ता: कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ||16-16|| aneka-chitta-vibhrāntā moha-jāla-samāvṛitāḥ prasaktāḥ kāma-bhogeṣhu patanti narake ’śhuchau Purport: Those who are enamored by ignorance, those who are filled with a variety of cravings, those who are well-groomed by the trap of infatuation (affection for the wife, children, and wealth), and those who are excessively interested in experiencing lusts are destined for a filthy hell.
భావము: పశువులాంటి పాపము కంచెలు మేసెను. (కంచె లేనిది అనగా హద్దులుగాటినదని అర్ధము). పోషణ నిచ్చు పుణ్యము పొలిమేరలు దాటి పోయెను. చేయునది తెలియక శ్రీపతి నీ వైపుకే చేయి చాఁచెదము. ఈ అగాధమనే దుస్థితి#2 (నరకం) నుండి మమ్మల్ని బయటకు తీయవయ్యా!
వివరణము: అన్నమాచార్యులు పరోక్షంగా మనం నరకం లాంటి ప్రదేశంలో ఉన్నామని, ఇక్కడ పాపం మాత్రమే సాధ్యమైన చర్య అని సూచిస్తున్నారు. కానీ, వింత ఏమిటంటే, మనం ఏమి చేస్తున్నామో గ్రహించలేము, ముఖ్యంగా సహజ సూత్రాలను తుంగలో తొక్కిపెట్టేటప్పుడు. ఒక ఉదాహరణగా, నేను మాక్బెత్ తనలోతాను అనుకొను మాటలను పొందుపరుస్తున్నాను.
షేక్స్పియర్ యొక్క మాక్‌బెత్‌లో, ప్రధాన పాత్ర జాలి రోత ఒకేసారి కలిగించు ప్రతి నాయకుడు. అతడు సైనికాధికారి స్థాయి నుండి స్కాట్లాండ్ రాజుగా నాటకీయంగా అధికారంలోకి పైకి ఎగబాకడం అతని నైతిక పతనానికి మరియు విలువల విధ్వంసానికి విలోమంగా ఉంటుంది.
రాజు డంకన్ అతని కోటలో అతని అతిథిగా వస్తాడు. మాక్బెత్ దంపతులు అతన్ని హత్య చేయాలని మరియు దానికి తప్ప తాగిన కాపలావాళ్ళని బాధ్యులను చేయాలని పన్నాగము పన్నుతారు. ఇది జరుగుతుండగా, మక్బెత్ ఇలా ఆలోచించడం ప్రారంభించాడు.
“ఇక్కడి కతడు ద్విగుణికృతమైన నమ్మకముతో వస్తాడు.
మొదటిగా నేను అతడి ఆంతరంగికుడను. పాలనలోని వాడను.
నా చర్యకు ఇవి విరుద్ధం. పైగా అతడు నా అతిథి.
అతడిని కాపాడడానికి తలుపులు మూయడం నా విధి.
బాకును నేనే పట్టుకోకూడదే? అంతకు మించి, అతడు బలహీనుడే.
దేవదూతల్లాంటి అతని సద్గుణాలు నా హీనాతిహీనమైన చేష్టను వ్యతిరేకిస్తూ దీనంగా నాతో మొర పెట్టుకొంటాయే.
హఠాత్తుగా పడిన పిడుగు పాటుకు పసి గుడ్డు జాలిగా, చేతకాక, గుక్క పెట్టి వెక్కివెక్కి ఏడ్చినట్టు.”
ఎక్కడో ఇంగ్లాండ్’లో పుట్టిన షేక్స్పియర్, మన అన్నమాచార్యులు ఒకే రకంగా వ్యక్తపరచడం సంస్కృతులకు అతీతంగా మానవుని ఆలోచనా సరళి ఒకేలా వుంటుందని సూచిస్తుంది. ఇక్కడ గర్హించాల్సిన విషయం మనిషి తెలిసీ చాలాసార్లు తప్పు చేస్తుంటాడు. అతి విచిత్రమైన అసంబద్ధ ప్రాణి మానవుడు.
భగవద్గీత నందలి ఈ శ్లోకమును ఈ చరణముతో పోల్చి చూడండి. అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః / ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ ।।16-16 ।। (భావము: అజ్ఞానముచే మోహము (భ్రమ) నొందినవారును, అనేకవిధములైన చిత్తచాంచల్యములతో గూడినవారును, మోహము (దారాపుత్రక్షేత్రాదులందు అభిమానము) అను వలచే బాగుగ గప్పబడినవారును, కామముల ననుభవించుట యందు మిగుల యాసక్తిగలవారును అయి, వారు అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు.)
యిలఁ గలియుగమను యెండలు గాయఁగ
చెలఁగి ధర్మమను చెరు వింకె
పొలసి మీ కృపాంబుధి చేరితి మిదె
తెలిసి నాదాహము తీర్చవే ॥కడు॥
yila galiyugamanu yeMDalu gAyaga
chelagi dharmamanu cheru viMke
polasi mI kRpAMbudhi chEriti mide
telisi nAdAhamu tIrchavE ॥kaDu॥
Word to Word meaning: యిలఁ (yila) = ఈ భూమ్మీద, ఈ నేలపై, on this earth; గలియుగమను (galiyugamanu) = known as “Kaliyugam” యెండలు (yeMDalu) = glaring light of sun; గాయఁగ (gAyaga) = on spreading; చెలఁగి (chelagi) = ఉత్సహించి, vigorously (here used in the sense of matching the heat of sun); ధర్మమను (dharmamanu) = known as righteousness; చెరు వింకె (cheru viMke) = the lake got dried up; పొలసి (polasi) = సంచరించుచూ, సమీపించి, wandering, some how came close by; మీ కృపాంబుధి (mI kRpAMbudhi) = your ocean of compassion; చేరితి మిదె( chEriti mide) = we joined now; తెలిసి (telisi) = knowingly; నాదాహము (nAdAhamu) = my thirst (my burning thirst) తీర్చవే (tIrchavE) = to end, to finish, to cool;
Literal meaning: When this earth is scorched by glaring sun, matching that intensity the lake known as righteousness dried up. By wandering, we chanced on your sea of compassion. knowing my burning thirst sir, kindly quench it cool.
Explanation: What is Kaliyuga? A time when the righteousness is thrown to the wind. Yet man has the audacity to assert that he is working within the constitution, social rules. Further masquerades his action in the name of religion, situation and survival. Thus, compromises with his intrinsic values.
భావము: ఇలలో కలియుగమను యెండలు కాయుచుండగా ధర్మము అనే చెరువు ఇంకిపోయినది. సంచరించుచూ నిన్ను సమీపించి నీ కృపాంబుధిని చేరదలచితిమి. ఇది తెలిసి నాదాహము తీర్చవయ్యా!
వివరణము: కలియుగం అంటే ఏమిటి? నీతిని గాలికి విసిరేసే సమయం. అయినప్పటికీ తాను రాజ్యాంగము, సామాజిక నియమాలకు లోబడి పనిచేస్తున్నానని నచ్చచెప్పుకునే అసంబద్ధత మనిషికి ఉంది. మతం, పరిస్థితి మరియు మనుగడ (ఆత్మ రక్షణ) పేరిట తన చర్యలకు ముసుగు వేసి విలువలతో రాజీ పడతాడు. తనను తాను మోసగించుకుంటాడు.
ఆత్మవంచన వల్ల
వడిగొని మనసిజవాయువు విసరఁగ
పొడవగు నెఱుకలు పుట మెగసె
బడి శ్రీవేంకటపతి నీ శరణము
విడువక చొచ్చితి వెసఁ గావఁగదే ॥కడు॥
vaDigoni manasijavAyuvu visaraga
poDavagu ne~rukalu puTa megase
baDi SrIvEMkaTapati nI SaraNamu
viDuvaka chochchiti vesa gAvagadE ॥kaDu॥
Word to
Word meaning: వడిగొని (vaDigoni)
= picking up the speed; మనసిజవాయువు (manasijavAyuvu)
= మన్మధుని
పవనములు, winds of Cupid; విసరఁగ (visaraga) = fanned; పొడవగు
(poDavagu) =
long, tall, great; నెఱుకలు (ne~rukalu) = memories; పుట
మెగసె (puTa
megase) = వన్నెకెక్కు, పైకెగురు,
లంఘించు, shined, flourished; బడి
(baDi)
= being; శ్రీవేంకటపతి (SrIvEMkaTapati) =
Lord Sri Venkateswara; నీ శరణము (nI SaraNamu) = your refuge; విడువక (viDuvaka) = continuously (here meaning never forgetting
the Lord in the mind) చొచ్చితి (chochchiti) = came inside; వెసఁ
(vesa) =
quickly, urgently; గావఁగదే (gAvagadE) = Save us sir.
Literal meaning: As the winds of Cupid blew, the traces of the dormant desires quickly erupted. Sri Venkatapati we come so far seeking your refuge#3. Save us quickly!
Explanation: The following Sanskrit verse written by Jagannatha Pandita Raya illustrates how we procrastinate while enjoying desires.
रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातम् / भास्वान् उदेष्यति हसिष्यति पङ्कजश्रीः ।
इत्थं विचिन्तयति कोषगते द्विरेफे / हा हन्त! हन्त! नलिनीं गज उज्जहार ।।
Rātrirgamiṣyati, bhaviṣyati suprabhātaṁ/ bhāsvānudēṣyati hasiṣyati paṅkajaśrī: /
Purport: A humble bee landed on the lotus flower. She stayed there for a long time enjoying the nectar. In the meantime, it was evening when the lotus flower had curled up and the bee was trapped in it. The Bee thought “Early in the morning, as soon as the sun rises, the lotus blooms and then I fly away”. But in the meantime, an elephant came and tore the lotus with its trunk and threw it out. It doesn't bloom anymore! The bee died inside.
No one can predict what will happen tomorrow. Therefore, the poet warns against building castles of hope.
భావము: మన్మధుని వాయువులు మాలో నిద్రించి వున్న కోరికల ఆనవాళ్ళును త్వరితగతిని చెలరేపాయి. శ్రీవేంకటపతి నీ శరణము కోరి ఇంతవరకు వచ్చాను#3. శీఘ్రముగా కాపాడవయ్య!
వివరణము: కోరికలను ఆస్వాదిస్తూ మనమెలా కాలాయాపన చేస్తామో క్రింది జగన్నాథ పండిత రాయలు వ్రాసిన శ్లోకము తెలుపుతుంది. (ఈయన దిల్లీ పాదుషాను మెప్పించి ఆయన దర్బారులో స్థానం సంపాదించాడట).
శ్లో: రాత్రిర్గమిష్యతి, భవిష్యతి సుప్రభాతం / భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ: / ఇత్థమ్ విచింతయతి కోశ గతే ద్విరేఫే / హా హంత హంత నళినీం గజ ఉజ్జహార అర్థము:-- ఒక తుమ్మెద తామర పువ్వు మీద వాలింది. మకరందాన్ని ఆస్వాదిస్తూ చాలా సేపు అలాగే వుండి పోయింది. ఇంతలో సాయంత్ర మయింది తామర పువ్వు ముడుచుకొని పోయి తుమ్మెద అందులోనే చిక్కుకొని పోయింది. ఆ తుమ్మెద యిలా అనుకుందట. తెల్లవారుతుంది, సూర్యోదయం కాగానే తామర విచ్చుకుంటుంది అప్పుడు ఎగిరి పోవచ్చు అని. కానీ ఇంతలో ఒక ఏనుగు వచ్చి ఆ తామర తూడును తన తొండము తో పెకలించి బయట పడవేసింది. ఇంకతామర వికసించదు కదా! తుమ్మెద లోపలే చనిపోయింది. మనమనుకున్న వన్నీ జరగవు.
తానొకటి తలిస్తే దైవ మొకటి తలుచును.రేపు ఏమవుతుందో ఎవరూ ఊహించ లేరు. అందుకని ఆశాసౌధాలు కట్టవద్దని కవి హెచ్చరిస్తున్నాడు.
References and Recommendations for further reading:
#1 113. పాప మెఱఁగను పుణ్యఫల మెఱఁగను (pApa me~raganu puNyaphalame~raganu)
#217. నిండు మనసే నీ పూజ (niMDumanasE nI pUja)
#3 23. నేనేమెరిఁగి సేసేనో నీకుఁ దిరువారాధన (nEnEmerigi sEsEnO nIku diruvArAdhana)
Summary of this Keertana:
We are entrenched in great period of famine (or drought) called ignorance#1. O God! Push it out and end our fear.
The animal like sin has eaten the fence. Thus sir, we have no limits to our wrong doings#2. On the other hand, the invigorating good has left us. Sir, really, we don’t know what right action is. Therefore, we stretch our hand towards you. Come quickly to take us out of this abyss (hell).
When this earth is scorched by glaring sun, matching that intensity the lake known as righteousness dried up. By wandering, we chanced on your sea of compassion. knowing my burning thirst sir, kindly quench it cool.
As the winds of Cupid blew, the traces of the dormant desires quickly erupted. Sri Venkatapati we come so far seeking your refuge#3. Save us quickly!
కీర్తన సంగ్రహ భావము:
ప్రభూ! కడు అజ్ఞానమను#1 కరవుకాలములో కూరుకుపోయాము. దాన్ని వెడలదొబ్బి మా భయము తీర్చవయ్యా!
పశువులాంటి పాపము కంచెలు మేసెను. (కంచె లేనిది అనగా హద్దులుగాటినదని అర్ధము). పోషణ నిచ్చు పుణ్యము పొలిమేరలు దాటి పోయెను. చేయునది తెలియక శ్రీపతి నీ వైపుకే చేయి చాఁచెదము. ఈ అగాధమనే దుస్థితి#2 (నరకం) నుండి మమ్మల్ని బయటకు తీయవయ్యా!
ఇలలో కలియుగమను యెండలు కాయుచుండగా ధర్మము అనే చెరువు ఇంకిపోయినది. సంచరించుచూ నిన్ను సమీపించి నీ కృపాంబుధిని చేరదలచితిమి. ఇది తెలిసి నాదాహము తీర్చవయ్యా!
మన్మధుని వాయువులు మాలో నిద్రించి వున్న కోరికల ఆనవాళ్ళును త్వరితగతిని చెలరేపాయి. శ్రీవేంకటపతి నీ శరణము కోరి ఇంతవరకు వచ్చాను#3. శీఘ్రముగా కాపాడవయ్య!
Copper Leaf: 204-1; Volume 3-19