Sunday, 27 June 2021

65. ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము (okaTi suj~nAnamu okaTi aj~nAnamu)

ANNAMACHARYA

65. ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము 

Introduction: In this beautiful verse, Annamacharya challenges you to choose the right path. He evaluates the options and places before for you to decide. Do we have the requisite intelligence to choose the right path?

ఉపోద్ఘాతము: ఈ అందమైన కీర్తనలో, అన్నమాచార్యులు మిమ్మల్ని సరైన మార్గాన్ని ఎన్నుకోవాలని సవాలు చేస్తారు. మీరు నిర్ణయించే ముందు ఎంపిక చేయుటకు అనువుగా మార్గాంతరాలను వాటి పర్యవసానాలను మన ముందుంచుతాడు. సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి మనకు అవసరమైన తెలివితేటలు ఉన్నాయా?  

కీర్తన

ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము

ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు           ॥పల్లవి॥ 

తనుఁ దలచుకొంటేను తక్కిన దేహభోగాలు

పనికిరావు అవి ప్రకృతి గాన
ఘనమైన లోకభోగములతో లోలుఁడైతే
తనుఁ గానరాదు జీవతత్వము గాన  ॥ఒక॥ 

దైవము నెఱిఁగితేను తన కామ్యకర్యములు

భావించి మఱవవలె బంధాలు గాన
కావించేటి తన కామ్యకర్మాలఁ గట్టువడితే
దైవము లోను గాఁడు స్వతంత్రుఁడు గాన   ॥ఒక॥ 

సరిమోక్షము గోరితే స్వర్గము తెరువు గాదు

అరయ స్వర్గము తెరు వల మోక్షానకు
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుని
శరణాగతియె సర్వసాధనము గాన  ॥ఒక॥ 

Details and Explanations: 

ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము

ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు         ॥పల్లవి॥ 

okaTi suj~nAnamu okaTi aj~nAnamu

prakaTiMchi vokaTi chEpaTTarO vivEkulu       pallavi 

Word to Word meaning: ఒకటి (okaTi) = one thing;  సుజ్ఞానము (suj~nAnamu) = Proper knowledge;  ఒకటి (okaTi) = one thing;  అజ్ఞానము (aj~nAnamu) = ignorance;  ప్రకటించి (prakaTiMchi) = by declaring; వొకటి (vokaTi) = one thing;  చేపట్టరో (chEpaTTarO) = adapt; వివేకులు (vivEkulu) = prudent ones; 

Literal meaning and Explanation: One thing is Proper Knowledge. The other is ignorance. O prudent people!! Declare and adapt one of these. 

Just see his game plan in this. Can a right thinking person would adapt the ignorant ways? But, what really happens? 

We drift away from the right path so much that often we are on the wrong side of the tenets with which started the journey of life, though we consider ourselves as Intelligent. 

When we see a movie, most of us can differentiate the evil from good. Most important thing to contemplate is why we cannot see our own degradation?  

The Annamacharya did not write these songs for our consumption. He made Himalayan efforts to stir up thoughts in us. 

భావము మరియు వివరణము: ఒక సుజ్ఞానము. మరొకటి అజ్ఞానం. వివేకవంతులారా!! వీటిలో ప్రకటించి ఒకదాన్ని  స్వీకరించండి. 

దీనిలో అన్నమయ్య​ ప్రణాళిక చూడండి. సరైన ఆలోచనాపరుడైన ఎవరైనా అజ్ఞాన మార్గాలను స్వీకరించగలడా? కానీ నిజ జీవితంలో ఏమి జరుగుతుంది? 

మనం సరైన మార్గం నుండి తప్పి, చాలా దూరం జరిగిపోతాము. తరచూ, మనం జీవిత ప్రయాణాన్ని ప్రారంభించిన సిద్ధాంతాల యొక్క వ్యతిరేక దిశలో ఉంటాము. అయినప్పటికీ మనల్ని మనం వివేకులుగానే భావిస్తామే? 

ఒక సినిమా చూసినప్పుడు, మనలో చాలా మంది చెడును మంచిని చక్కగా గుర్తిస్తారుఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, మన స్వంత పతనాన్ని మనం ఎందుకు గుర్తించలేమో? 

అన్నమాచార్యులు పాటలను సినిమా పాటల్లాగా విని వదలిపెట్టేందుకు వ్రాయలేదు. మనలో అలోచనలను రేపడానికి విశ్వప్రయత్నము చేశారు. 

తనుఁ దలచుకొంటేను తక్కిన దేహభోగాలు

పనికిరావు అవి ప్రకృతి గాన
ఘనమైన లోకభోగములతో లోలుఁడైతే
తనుఁ గానరాదు జీవతత్వము గాన           ॥ఒక॥ 

tanu dalachukoMTEnu takkina dEhabhOgAlu

panikirAvu avi prakRti gAna
ghanamaina lOkabhOgamulatO lOluDaitE
tanu gAnarAdu jIvatatvamu gAna oka 

Word to Word meaning: తనుఁ(tanu) = self;  దలచుకొంటేను (dalachukoMTEnu) = having in mind; తక్కిన (takkina) = everything else; దేహభోగాలు (dEhabhOgAlu) = body enjoyments; పనికిరావు (panikirAvu) = not suitable; అవి (avi) = they; ప్రకృతి (prakRti) = nature;  గాన (gAna) = కనుక, therefore;  ఘనమైన (ghanamaina) = solid;  లోకభోగములతో (lOkabhOgamulatO) = worldly enjoyments; లోలుఁడైతే (lOluDaitE)  = get indulged into; తనుఁ (tanu)  = self; గానరాదు (gAnarAdu) = cannot be found; జీవతత్వము (jIvatatvamu) = characteristic of life; గాన (gAna) = therefore. 

Literal meaning and Explanation: If you want to your true self, then forget the body enjoyments for they belong to the nature. If you get entrenched in worldly enjoyments, you cannot find self for it is the characteristic of life (force). 

You can’t eat your cake and have it too is the simple message of this stanza. 

భావము మరియు వివరణము: మీరు మనస్సులో స్వీయ దర్శనం కలగాలంటే, శరీర సుఖాలను మరచిపోండి, ఎందుకంటే అవి ప్రకృతికి చెందినవి. మీరు ప్రాపంచిక ఆనందాలలో చిక్కుకుంటే, మీరు స్వీయ దర్శనం పొందలేరు, ఎందుకంటే అది జీవతత్వ లక్షణం (శక్తి). 

అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు. ఏదో ఒకటే అని చరణము అర్ధము. 

దైవము నెఱిఁగితేను తన కామ్యకర్యములు

భావించి మఱవవలె బంధాలు గాన
కావించేటి తన కామ్యకర్మాలఁ గట్టువడితే
దైవము లోను గాఁడు స్వతంత్రుఁడు గాన ॥ఒక॥ 

daivamu ne~rigitEnu tana kAmyakaryamulu

bhAviMchi ma~ravavale baMdhAlu gAna
kAviMchETi tana kAmyakarmAla gaTTuvaDitE
daivamu lOnu gADu svataMtruDu gAna oka           

Word to Word meaning:  దైవమును (daivamunu) = god; ఎఱిఁగితేను (e~rigitEnu) = if you know; తన (tana) = self; కామ్యకర్యములు (kAmyakaryamulu) = all selfish activities;  భావించి (bhAviMchi) =  (and) thoughts; మఱవవలె (ma~ravavale) = complete forget;  బంధాలు (baMdhAlu) = bondages; గాన (gAna) = therefore;  కావించేటి (kAviMchETi) = performing; తన (tana) = self; కామ్యకర్మాలఁ (kAmyakarmAla) = all selfish activities; గట్టువడితే(gaTTuvaDitE) = get engaged; దైవము (daivamu) = god; లోను (lOnu) = submit; గాఁడు (gADu) = not;  స్వతంత్రుఁడు (svataMtruDu) = independent; గాన (gAna) = therefore; 

Literal meaning and Explanation: you must give up all the selfish activities for they create bondages to tie (you) to this world; in case you continue to perform these activities you will not find god for his actions are Independent.  

You cannot run with the hare and hunt with the hounds. You cannot choose best of both worlds. Annamacharya is forcing you to decide the right path. 

భావము మరియు వివరణము: . దైవమును తెలియాలి అంటే మీరు అన్ని స్వార్థ కార్యకలాపాలను వదులుకోవాలిఎందుకంటే అవి మిమ్మల్ని ప్రపంచానికి బంధించి ఉంచుతాయి. ఒకవేళ మీరు కార్యకలాపాలను కొనసాగిస్తే, దేవుడు స్వతంత్రుడు కావున, మీకు ప్రకటం కాడు. 

గోడ మీద పిల్లిలా, నేను 'అటో' లేదా 'ఇటో' దూకుతాను అంటే కుదరదు. ఏటు పోవాలో నిర్ణయించుకో అని నిర్భందిస్తున్నాడు అన్నమయ్య​. 

సరిమోక్షము గోరితే స్వర్గము తెరువు గాదు

అరయ స్వర్గము తెరు వల మోక్షానకు
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుని
శరణాగతియె సర్వసాధనము గాన            ॥ఒక॥ 

sarimOkshamu gOritE svargamu teruvu gAdu

araya svargamu teru vala mOkshAnaku
paraga nalamElmaMgapati SrIvEMkaTESuni
SaraNAgatiye sarvasAdhanamu gAna    oka 

Word to Word meaning    సరిమోక్షము (sarimOkshamu) = proper liberation; గోరితే (gOritE ) = seek, want; స్వర్గము (svargamu) = heaven; తెరువు (teruvu) = దారి, మార్గము, way, path; గాదు (gAdu) = not; అరయ (araya) = careful observation;  స్వర్గము (svargamu) = heaven;  తెరు (teru) = open; వల (vala) = decoy;  మోక్షానకు (mOkshAnaku) = for liberation;  పరగ (paraga) = agreeably, duly; నలమేల్మంగపతి (nalamElmaMgapati) = Husband of Alamelumanga:  శ్రీవేంకటేశుని (SrIvEMkaTESuni) = Lord Venkateswara; శరణాగతియె (SaraNAgatiye) = submission of will; సర్వసాధనము (sarvasAdhanamu) = is all the avail;  గాన (gAna) = therefore;  

Literal meaning and Explanation:  Path to proper liberation is not through heaven. On careful observation you will know it is a decoy. Therefore, the only avail is duly submitting ones will to Husband of Alamelumanga (Lord Venkateswara). 

There are many, who equate liberation with heaven, must know that these are only psychological rewards; "comforts of heaven" and "punishments of hell" are tools used by religions to draw the general public to righteous path. 

Most important thing to note is the word శరణాగతి  = సర్వసాధనము. What does this mean?  Submitting the will to god, is not a lip service, but actually dissolving the acquired (knowingly or unknowingly) outfits we have (like ego, proud, self-image, self-importance etc.) at the altar of self. 

In this way true knowledge is to see and understand life from a completely different angle, rather than from a centre called “I”. Of course, this is not a (conscious) experience. 

భావము మరియు వివరణము సరైన విముక్తి మార్గం స్వర్గం ద్వారా ఐతే కాదు. జాగ్రత్తగా పరిశీలించినప్పుడు స్వర్గము అనేదీ సామాన్యుని సన్మార్గమునకు మళ్ళించుటకు (ఆకర్షించుటకు) ప్రవేశపెట్టిన ఒక ఎర అని గ్రహించవచ్చు. అందువల్ల, మనిషి  దగ్గర మిగిలిన ఒకేవొక సాధనము అలమేలుమంగ భర్తయైన ( శ్రీ వెంకటేశ్వరునికి) మనస్సును సమర్పించడం మాత్రమే. 

విముక్తిని స్వర్గంతో సమానం చేసిచూసేవారు కోకొల్లలు. స్వర్గం లోని సుఖాలు, నరకం యొక్క శిక్షలు మనుషులను తమ వైపు త్రిప్పుకోడానికి  మతములు కల్పించిన ఉపకరణములే అని తెలియండి. 

గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే, శరణాగతి  = సర్వసాధనము అనడానికి అర్థం ఏమిటి? దేవునికి సంకల్పం సమర్పించడం కేవలము పెదవుల కదలిక కాదు; వాస్తవానికి మనం (తెలిసి & తెలియక) సంపాదించుకున్న ఆచ్ఛాదనలను (గర్వము, అహంకారము, ఏర్పరచుకున్న స్వీయ ఊహా చిత్రము,, స్వీయ-ప్రాముఖ్యత మొదలైనవి) స్వీయ బలిపీఠం వద్ద కరిగించి వేయడమే.  

విధంగా జీవితాన్ని నేను అనే ఒక కేంద్రం నుంచి కాకుండా, పూర్తిగా వేరే కోణం నుండి చూడటం మరియు అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం. వాస్తవానికి, ఇది బాహ్య ప్రఙ్ఞలోని (సచేతన) అనుభవం కాదు 

zadaz 

Reference: Copper Leaf: 173-2, Volume: 2-357 

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...