ANNAMACHARYA
7. వాడల వాడల వెంట
వాఁడివో వాఁడివో
One of the deepest poems of
Annamacharya, describes God as an exchanger of clothes (bodies). Covering the
entire universe, yet hiding behind the shadows, GOD swaps the material bodies.
Man in his naivety, falls for the well-known deceptive tricks (of nature), little realising that he is going to be on the square one again.
నీడనుండి చీరలమ్మే నేఁతఁబేహారి.
vADala vADala veMTa vADivO
vADivO
nIDanuMDi chIralammE nEta bEhAri॥pallavi॥
Word to word meaning: వాడల వాడల వెంట (vADala vADala veMTa) = in every nook and corner (of the world); వాఁడివో వాఁడివో (vADivO vADivO) = that very man, that very man (HE, GOD); నీడనుండి (nIDanuMDi) = standing behind the shadows; చీరలు (chIralu) = వస్త్రములు, garment worn by men and women (during Annamacharya time); clothes; అమ్మే (ammE) = seller; నేఁతఁ (nEta) = weave; బేహారి (=వర్తకుడు =వ్యాపారి) = vendor.
Literal meaning: That very man, that
very man, HE
is there, in every nook and corner, all over the world. Hiding behind the
shadows, HE vends woven clothes.
Implied meaning: HE is
there, in every nook and corner, all over the world, but hiding in the shadows.
Yet manages to barter the clothes (of illusion i.e. provides material
bodies).
Comments: Annamacharya underlined the fact that GOD is there all over
the world. He indirectly explained that no human knows HIS true nature, but HE
still provides us the material bodies.
భావము: అతడే, అతడే, వాడవాడల్లో
మూలమూలల్లో నీడల వెనుక దాక్కుని, అతడు నేసిన బట్టలమ్ముతాడు.
వ్యాఖ్యలు: భగవంతుడు ప్రపంచమంతటా
ఉన్నాడని అన్నమాచార్య నొక్కిచెప్పారు. భగవంతుడు
మనకు భౌతిక శరీరాలను అందిస్తున్నప్పటికీ, అతనిని తెలియలేమన్నారు.
అన్వయార్ధము: ప్రపంచంలోని నలుమూలల దాక్కుని మారు వస్త్రములను (దేహముల నమ్మే) మాయావి అతడే.
చ|| పంచ భూతములనెడి పలు వన్నె నూలు
చంచలపు గంజి తోడ చరి నేసి,
కొంచపు కండెల నూలి గుణముల నేసి,
మంచి మంచి చీర లమ్మే మారు బేహారి.||వాడల||
paMcha bhUtamulaneDi palu vanne
nUlu
chaMchalapu gaMji toda charinEsi
koMchepu kaMDela nUli guNamula nEsi
maMchi maMchi chIralammE mAru bEhAri॥vADala॥
Word to word meaning: పంచ భూతములనెడి (paMcha
bhUtamulaneDi) = what are known as five fundamental elements ( earth, water, fire, air
& ether); పలు (palu)= multiple; వన్నె నూలు (vanne nUlu) = coloured
threads (made to resemble); చంచలపు (chaMchalapu) = fickleness; గంజి (gaMji) = starch; తోడ (toda) = with; చరి నేసి (charinEsi) = uniformly
woven, uniformly spread; కొంచపు (koMchepu) = a bit of; కండెల నూలి (kaMDela
nUli) = thread from roll (of); గుణముల (guNamula) = (three) modes of action
of nature (goodness, passion and ignorance) ; నేసి (nEsi) = weave; మంచి మంచి (maMchi
maMchi) = very attractive, very good; చీరలు (chIralu)= clothes; అమ్మే (ammE)= seller; మారు బేహారి (mAru
bEhAri)= exchange/barter trader.
Literal Meaning: HE weaves these clothes using the thread made of five fundamental
elements; he uses fickleness as starch for these threads and deceptively laces
the three modes of material nature on this cloth to bring beauty (to guise/
illusion) in every cloth
Implied meaning: God created the inhabitants of this
world using the five fundamental elements (earth, water, fire, air & ether); Then he uses fickleness as starch for these beings and deceptively introduces
the three modes of action (of energy) in these bodies to make them fall in illusion.
Comments: This paragraph refers to Hindu philosophy that the entire inhabitants of
our world are made of five fundamental elements. Further it
refers to three modes of action as referred in Bhagavad-Gita shloka given
below.
सत्त्वं रजस्तम इति गुणा: प्रकृतिसम्भवा: |
निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् || 5||
O Arjun, the material energy
consists of three gunas (modes)— sattva (goodness), rajas (passion), and tamas (ignorance). These modes bind the eternal soul to the
perishable body.
భావము: ఐదు ప్రాథమిక అంశాలతో
(1. పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము) చేసిన నూలు (దారాన్ని) ఉపయోగించి
ఈ దుస్తులను నేస్తాడు; అతను చంచలమను గంజితో సరి చేస్తాడు. మధ్యమధ్యలో ప్రకృతి యొక్క
త్రిగుణములనే నూలు కండెలనూ ఉపయోగించి ప్రతి వస్త్రంలో అందాన్ని (మాయ/భ్రమలను) చేరుస్తాడు.
వ్యాఖ్యలు: ఈ చరణంలో అన్నమాచార్యులు
క్రింద చెప్పిన భగవద్గీత శ్లోకమును ఉటంకించిరి.
సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః ।
ఓ అర్జునా, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది. (సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణము). ఈ గుణములే నాశములేని నిత్యము నాశనమయ్యే దేహమునకు బంధించును.
చ|| మటుమాయముల దన మగువ పసిడి నీరు
చిటిపోటి యలుకల చిలికించగా,
కుటిలంపు చేతలు కుచ్చులుగా గట్టి
పటవాళి చీర లమ్మే బలు బేహారి.||వాడల||
maTumAyamula
dana maguva pasiDi nIru
chiTipoTi yalukala chilikiMchagA
kuTilaMpu cHetalu kuchchulugA gaTTi
paTavALi chIralammE
balubEhAri॥vADala॥
Word to word meaning: మటుమాయముల (maTumAyamula) = Very deceitful; తన మగువ (dana maguva =tana maguva = HIS wife (goddess of wealth); పసిడి (pasiDi) = gold; నీరు (nIru) = water; చిటిపోటి (chiTipoTi) = tiny quantities; యలుకల చిలికించగా (yalukala chilikiMchagA) = sprinkle; కుటిలంపు (kuTilaMpu) = deceitful; చేతలు (cHetalu) = works; కుచ్చులుగా (kuchchulugA) =arrange tassels; కట్టి (gaTTi= kaTTi) = tying together; పటవాళి చీరలు (paTavALi chIralu ) = clothes with stripes; అమ్మే (ammE) = sell; బలు (పలు, balu = palu)= big, large; బేహారి (bEhAri) = merchant
Literal meaning: HE arranges the tassels of deceit as borders of attraction and liberally sprinkles glitter (of gold) on beautifully striped clothes to baffle (unsuspecting) living beings.
Implied meaning: We all are inwardly same, but outward manifestations is thru the proportion of deceit (cleverness)
and physical beauty to our material bodies
Comments: God knows that we
fall for gold/money and beauty. He arranges them in certain proportion (in each
one of us), so that we continue our engagement with senses. That is the reason
Annamacharya used word కుటిలంపు(kuTilaMpu) to indicate our
actual disposition. This stanza also refer to the shloka of Bhagavad-Gita as given below.
tribhir guṇa-mayair bhāvair ebhiḥ sarvam idaṁ jagat
Deluded by the three modes of
Maya (of the nature), the people in this world are unable to know me, the
imperishable and eternal.
భావము: పసిడికాంతులకు కొంచెము
చిలికించి ఈ వస్త్రములపై అలుకుతాడు. కుటిల మాయలను కుచ్చులుగాఁ కట్టి చారల చీరలమ్మే
టోకు వ్యాపారి.
వ్యాఖ్యలు: మన భౌతిక శరీరాలకు మోసం (తెలివి) మరియు శారీరక సౌందర్యం
యొక్క నిష్పత్తిలో మార్పులు ఉన్నట్లనిపించినప్పటికీ, మనమందరం అంతర్గతంగా ఒకేలా ఉంటామని
అలకడము, కుచ్చులు కట్టడము ద్వారా తెలిపిరి. కానీ, మనిషి బాహ్య వ్యక్తీకరణలలో స్వల్పమగు
వ్యత్యాసాలు చూచి మోసపోతాడు.
క్రింద చెప్పిన భగవద్గీత శ్లోకమును కూడా చూడండి.
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ ।
భావము: ప్రకృతి మాయ యొక్క త్రిగుణములచే
భ్రమకు మోహితులై, ఈ లోకంలోని జనులు, అనశ్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు
చ|| మచ్చిక జీవుల పెద్ద మైల సంతల లోన
వెచ్చపు కర్మ ధనము విలువ చేసి,
పచ్చడాలుగా కుట్టి బలువెంకటపతి
ఇచ్చ కొలదుల అమ్మే ఇంటి బేహారి.||వాడల||
machchika Jeevula pedda maila saMtala
lOna
vechchapu karmadhanamu viluvachEsi
pachchaDAlugA kuTTi baluvEMkaTapati
ichchakoladula ammE iMTibEhAri॥vADala॥
Word to word meaning: మచ్చిక జీవుల (machchika Jeevula) = familiar being, being with predictable action =
conditioned being; పెద్ద (pedda)= big; మైల (maila) = dirty; సంతల లోన (saMtala lOna) = in markets; వెచ్చపు (vechchapu) = used up; కర్మ ధనము (karmadhanamu) = deeds (activities) of living
beings; విలువ చేసి (viluvachEsi ) = (determine) value; పచ్చడాలుగా (pachchaDAlugA) = దుప్పటి, blanket; కుట్టి (kuTTi)
= bound
together; బలు(పలు) = big, many; వెంకటపతి (vEMkaTapati)= lord of seven hills, God; ఇచ్చ కొలదుల (ichchakoladula) = those desiring; అమ్మే = barter; ఇంటి బేహారి = inside trader.
Literal Meaning: HE
(GOD), being inside trader, shrewdly exchanges, in the familiar dirty market of
beings (often deliberately), trades labour of beings with (further)
blanket of illusion(s).
Comments: Annamacharya observes that we pray to wash away our sins without actually repenting. The word dirty is used to indicate unfair expectation of conditioned being, without putting up the work needed from his side.
But God knowing our intention doesn't oblige. Hence, we receive a blanket in place of cloth. Normally clothes are thin and blankets are generally thicker. Implying, more conditioned activity for the man.
First understand that
this is a 500 year old verse. Annamacharya is so amply clear that he used word inside
trader to indicate God knows our intentions. I need not mention that
Annamacharya’s modern outlook more than this single word can expound.
భావము: _అతడు (దేవుడు),
లోలోపలి వర్తకుడై తెలివిగా సుపరిచితమైన మైల సంతలోన (తరచుగా) భ్రాంతి అనే దుప్పటితో
జీవుల శ్రమను మార్పిడిగా గ్రహించి వ్యాపారం చేస్తాడు.
మచ్చిక అన్న పదము బాగా పరిచయమైన అనే అర్ధములో వాడారు. 'మైల'తో మరణము, జన్మము లందు పాటించు అశౌచమును సూచించారు. అలాగే మైల=చీకటి అనుకుంటే ఇదమిద్ధముగా సూచించలేని మార్పిడిని చూచాయగా చెప్పారు. 'మైల సంత' ఇదమిద్ధముగా ఊహించలేని బదలాయించు బేరసారాలు అనుకొనవచ్చు.
'మచ్చిక కర్మమనేటి మైల సంత'తో మనకు బాగా తెలిసినట్లే ఉండి, చివరకు
ఊహకు అందని వ్యవహారమని తెలియును.
అలాగే, అసలు పశ్చాత్తాపపడకుండా పాపాలను కడిగేసుకోవాలని చూచే మానవుల దురుద్దెశాలనూ తెలిపారు.
‘వెచ్చపు కర్మధనము’తో కష్టపడి,
శ్రమకోర్చి సంపాదించిన పాపపుణ్యాలను ఉటంకించారు.
అన్నమాచార్యులు దేవుడు మన ఉద్దేశాలు పసిగట్టగలడని సూచించడానికి 'ఇంటిబేహారి' (= లోలోపలి
విషయాలెరిగిన వ్యాపారి) అన్న పదాన్ని ఉపయోగించాడు. అన్నమాచార్యుల యొక్క ఆధునిక దృక్పథం
ఈ ఒక్క పదం కంటే ఎక్కువగా నేను వివరించలేనని
చెప్పనవసరం లేదు.
పచ్చడాలు (= దుప్పటి); చీర
= ధరించు వస్త్రం; మానవుడు తన కర్మము యొక్క విలువను కట్ట చూస్తే అట్టి వారికి వస్త్రం
బదులు దుప్పటి, అనగా ఇంకా ఎక్కువ కర్మలలో మునుగునట్లు చేయును అని సూచించారు.
అన్వయార్ధము: దైవము మానవుల కర్మను సృజించడు. అనగా కర్మముతో మానవుడు చేయు వ్యాపారముతో
దైవమునకు సంబంధము లేదు. ఆ చీకటి సంత మానవుని అజ్ఞానమే.
zadaz
excellent explanation Srinivas garu. Such kind of sankeerthanas with in depth meaning can be of one and only Annamayya. thanks for enlightening with meaning.
ReplyDelete