Saturday 13 February 2021

24. చంచలము మానితేను సంసారమే సుఖము (chaMchalamu mAnitEnu saMsAramE sukhamu)

ANNAMACHARYA

24.  చంచలము మానితేను సంసారమే సుఖము

 

Annamacharya describing what brings comfort in life. The main theme of this verse, చంచలము (chaMchalamu) wavering nature is something we must ponder. From the morning to we go to bed in the night, we change our disposition umpteen times. IF we get what we want, we are elated. If our expectations are belied, we feel depressed. And So on. DO we have the same thoughts even after a month on the same issue?  Now through modern studies we know that man gets subjected to thousands to thoughts every hour.  Knowing these facts one can appreciate the depth of keertanas of Annnamacharya. Only way-out of these uninterrupting thoughts is meditation. 

కీర్తనలో చిత్త చాంచల్యం ముఖ్యంగా ప్రస్తావించారు. మనిషి ఉదయం నుండి రాత్రి వరకు అనేక భావాలకు లోనగు విషయం విదితమే. కావలసినవి దొరికిన సంతోషము లేకున్న దుఃఖము పొందుతాం. మన ఆలోచనలు కూడా పట్టుమని నెల రోజులు కూడా స్థిరంగా ఉండవు. ప్రతీ గంటకు వేలాది ఆలోచనలకు గురియౌతామనే నిజం తెలుసుకుంటే, అన్నమాచార్యులు ఎంత లోతుగా తెలుసుకుని కీర్తన వ్రాశారో అర్ధం చేసుకోవచ్చు రకంగా చూస్తే ఆలోచనల పరంపర నుండి బయటపడడానికి భక్తి తప్ప వేరొక మార్గం లేదని సూచించారు.  

చంచలము మానితేను సంసారమే సుఖము

పొంచి హరిదాసుఁడైతే భూమెల్లా సుఖము॥పల్లవి॥ 

chaMchalamu mAnitEnu saMsAramE sukhamu

poMchi haridAsuDaitE bhUmellA sukhamu    ॥pallavi॥ 

Word to word meaning:  చంచలము (chaMchalamu) = wavering nature; మానితేను (mAnitEnu) = if stopped; సంసారమే (saMsAramE) this family, this world; సుఖము (sukhamu) = comfort; పొంచి (poMchi) =lurking like hunter హరిదాసుఁడైతే (haridAsuDaitE) = to become devotee of hari; భూమెల్లా (bhUmellA) = entire earth సుఖము (sukhamu) = comfort. 

Literal Meaning: If we can avoid the wavering nature, this family and world are very comfortable. If a person follows SRI HARI, like a hunter waits for opportunity to shoot, then this whole world is comfortable. 

Implied meaning: Single minded devotion should be like a hunter’s concentration while waiting for right moment to shoot. And the life without wavering nature is the real life.  

Comments: Devotion to god should be like a hunter’s concentration while waiting for right moment to shoot, without consciousness of his body comfort. How many of us have such devotion? While looking for temporal achievements, some of us may do, but often, our priorities, particularly w.r.t to GOD are secondary. This is what is being pointed out by Annamacharya. 

సామాన్యార్ధము: చాంచల్యం లేని జీవితం సుఖము. అలాగే ఏకాగ్రతతో భగవంతుని ప్రార్ధించిన భూమిపై ఎక్కడకు వెళ్ళినా సుఖమే. 

విశేష భావార్ధము: ఏకాగ్రత లేని భక్తి భక్తే కాదు. చిత్త చాంచల్యం లేని జీవితమే జీవితం. 

వ్యాఖ్యలు: తన శరీర సుఖం చూసుకోకుండా, వేటగాడు ఎలాగైతే పూర్తి ఏకాగ్రతతో, వేట కోసం నిరీక్షిస్తుంటాడో, రకంగా దేవుని కోసం ఆరాట పడాలని అన్నమాచార్యులు సూచిస్తున్నారు. మిగిలినదంతా భక్తి కాదని భావం. మనలో కొందరు లక్ష్యసాధన కోసం కొంత ఏకాగ్రత చూపినా అది సాధించేదాకానే పరిమితమౌతుంది. చాలామందికి అదికూడా శూన్యం. 

వొరుల వేఁడకవుంటే వున్నచోనే సుఖము

పరనింద విడిచితే భావమెల్లా సుఖము
సరవిఁ గోపిఁచకుంటే జన్మ మెల్లా సుఖమే
హరిఁ గొలిచినవారి కన్నిటాను సుఖమే 

vorula vEDakavuMTE vunnachOnE sukhamu

paraniMda viDichitE bhAvamellA sukhamu
saravi gOpichakuMTE janma mellA sukhamE
hari golichinavAri kanniTAnu sukhamE chaMcha 

Word to word meaning: వొరుల (vorula) = others వేఁడకవుంటే (vEDakavuMTE) not imploring for favours especially for money వున్నచోనే (vunnachOnE) = where you are సుఖము comfort; పరనింద (paraniMda) = blaming others విడిచితే (viDichitE) = when stopped భావమెల్లా (bhAvamellA) = all the feelings appears సుఖము (sukhamu) = comfort; సరవిఁ (saravi) = regularly; గోపిఁచకుంటే = కోపిఁచకుంటే (gOpimchakuMTE = kOpimchakuMTE) = if not in anger; జన్మ మెల్లా (janma mellA) = full (length of) life; సుఖమే (sukhamE) =comfort only; హరిఁ (hari) =Hari the God గొలిచినవారి (golichinavAri) = who prays;  కన్నిటాను (kanniTAnu) in everything సుఖమే (sukhamE) =comfort only;  

Literal Meaning: if we stop imploring for favours the place where we are staying remains comfortable. If we stay away from blaming others, all our thoughts will be comfortable. If we donot get anger regularly, the whole life will be comfortable. IF we pray SIR HARI, we find only comfort in everything.  

Comments: imploring or seeking for favours is considered an activity not suitable for removing the bonds. Therefore, Ananamacharya always said మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా? (Being born as human, and serving a human will always lead to sorrow every day). 

The Sanskrit shloka below from Hitopadesam also underlines the travails of servitude.

 

మౌనాన్మూర్ఖః ప్రవచన పటుర్వాతులో జల్పకో వా

క్షాంతా భీరుర్యది సహతే ప్రాయశో నాఽభిజాతః

ధృష్టః పార్శ్వే వసతి నియతం దూరతశ్చా ప్రగల్భః

సేవాధర్మః పరమ గహనో యోగినా మప్యగమ్యః. 

Purport: The Owner’s view of a servant: If the servant is silent, owner feels he must be a fool; if servant talks cleverly, owners feels he is talkative (only talks but does not do work); if servant forbears, Owner thinks servant is coward; If servant does not show patience, he casts him to be low in birth; If Servant becomes close to Owner, he is scorned off for the etiquette; If servant keeps distance the owner feels he must be timid. Therefore it’s not possible to understand the expectations of Proprietor even for a yogi.

Another important thing said is to eschew anger. Though not as easy as said, Annamacharya repeats this in almost every verse to underline its paramount importance.

సామాన్యార్ధము: ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా ఉంటే అదే సుఖము. పరులను నిందించకుండా ఉండడమే సుఖము. మాటిమాటికీ కోపించకుండా ఉంటే జీవితమే సుఖము. శ్రీహరిని  కొలుస్తున్న వారికి ఎక్కడైనా సుఖమే.  

వ్యాఖ్యలు: మనం చేసే పనులన్నింటికీ మూలము, జాగ్రత్తగా మనం కల్పించుకున్న తొడుగులను  తొలగించి చూస్తే, ఇంకొకరిని వేడు కొనడమే. అందుకే అన్నమాచార్యులు "మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా?" అని అనేకమార్లు చెప్పారు. దీనావస్థను వీడాలని చరణం ప్రధాన సందేశం. 

పైన పేర్కొన్న హితోపదేశం లోని శ్లోకానికి అర్థం క్రింద ఇవ్వబడింది. 

సేవకుని గురించి యజమాని విధంగా తలపోస్తాడు:

మౌనంగా ఉంటే మూర్ఖుడనీ; నేర్పుగా మాట్లాడితే వదరుపోతనీ;
సహనశీలుడైతే పిఱికిపంద యనీ; సహనం లేకుంటే నీచకులజాతుడనీ;
దగ్గరగా ఉంటే మర్యాద లేనీవాడనీ; దూరంగా ఉంటే సిగ్గరియనీ;
అందుచేత సేవాధర్మం గ్రహించటానికి అలవి కానిది. యోగులకు కూడ అర్థం కానిది. 

ఇంకో విషయము : కోపము అతిముఖ్యమైన లోపాలలో మొదటిది. అన్నమాచార్యులు దీని ప్రస్తావన అనేక మాట్లు చేపట్టడం లోని ఆంతర్యం గ్రహించి మసలుకోవాలి. 

కాని పని సేయకుంటే కాయమే సుఖము

మౌనమున నుండితేను మరులైనా సుఖము
దీనత విడిచితేను దినములెల్లా సుఖము
ఆని హరిఁ దలఁచితే నంతటా సుఖమే॥చంచ॥ 

kAni pani sEyakuMTE kAyamE sukhamu

maunamuna nuMDitEnu marulainA sukhamu
dInata viDichitEnu dinamulellA sukhamu
Ani hari dalachitE naMtaTA sukhamE  ॥chaMcha॥ 

Word to word meaning: కాని పని (kAni pani) = undesirable work; సేయకుంటే (sEyakuMTE) = not performed; కాయమే (kAyamE) = body సుఖము (sukhamu) = comfort; మౌనమున నుండితేను (maunamuna nuMDitEnu) = by maintaining silence మరులైనా (marulainA) = even deserted places; సుఖము (sukhamu) = comfort; దీనత (dInata) wretchedness విడిచితేను (viDichitEnu) when espoused; దినములెల్లా (dinamulellA) = all the days సుఖము comfort; ఆని (Ani) = by proclaiming; హరిఁ (hari) = god Hari; దలఁచితే (dalachitE) = keep remembering; నంతటా= అంతటా  (naMtaTA = aMtaTA) = in all things; సుఖమే (sukhamE) =comfort only; 

Literal Meaning:   If we don’t perform undesirable works, our body remains comfortable; IF we are silent, even the desert is a suitable place to live; if we espouse the wretched feelings, any day is comfortable; IF we submit to SRI HARI, anything is comfortable. 

సామాన్యార్ధము: చేయకూడని పనులు విడిచిన శరీరమే సుఖము. మౌనంగా ఉంటే ఎడారిలోనైనా సుఖమే. న్యూనతను విడిస్తే అన్ని దినములు సుఖమే. మనసు తీరా శ్రీహరిని తలిస్తే అంతటా సుఖమే. 

చలము విడిచితేను సంతతము సుఖము

యిల నాసలుడిగితే నిహమెల్లా సుఖమే
తలఁగి శ్రీవేంకటేశు దాసులైనవారు వీని
గెలిచి నటించఁగాను కిందా మీఁదా సుఖమే॥చంచ॥ 

chalamu viDichitEnu saMtatamu sukhamu

yila nAsaluDigitE nihamellA sukhamE
talagi SrIvEMkaTESu dAsulainavAru vIni
gelichi naTiMchagAnu kiMdA mIdA sukhamE  ॥chaMcha॥ 

Word to word meaning: చలము (chalamu) = ప్రతీకారం, revenge;  విడిచితేను (viDichitEnu) = సంతతము (saMtatamu) = Every moment;  సుఖము (sukhamu) = comfort; యిల (yila) =  నాసలు(nAsalu) = desires; ఉడిగితేను (uDigitE) = అడుగంటిపోవడం, do away with, cause to cease; ఇహమెల్లా (ihamellA) =  సుఖమే (sukhamE) =comfort only; తలఁగి (talagi) =ఎడబాపు, To get rid of, cast off; శ్రీవేంకటేశు దాసులైనవారు (SrIvEMkaTESu dAsulainavAru) = శ్రీవేంకటేశుని భక్తులైనవారు, the devotees of lord Venkteswara;  వీని గెలిచి నటించఁగాను (vIni gelichi naTiMchagAnu) = by acting to overcome these; కిందా (kiMdA) = ఈ ప్రపంచము, down place ( this temporal world)  మీఁదా (mIdA) = పై ప్రపంచము, up place ( the other  world); సుఖమే (sukhamE) =comfort only; 

Literal Meaning: If we give up feelings of retaliation, every moment becomes comfortable; If our desires cease, this world becomes comfortable to live; the devotes who act by overcoming the above, for them, there is no differentiation of this world and the other world. 

Comments: though this verse appears very simple, Annamacharya has embedded all the dos and don’ts in this verse. One can become a perfect saint by practicing this. 

It is also worth noting that those who are waiting for comforts in the other world are only chasing mirages. For a true devotee there is only one disposition, i.e. to remain in meditation. Any other expectation is false. 

సామాన్యార్ధము: ప్రతీకార వాంఛ విడిచిన ఎప్పుడూ సుఖమే. మదిలో ఆశలు  తొలగిన ఈ ప్రపంచములో ఎక్కడైనా సుఖమే. వీని నన్నింటిని అధిగమించి  శ్రీ వెంకటేశ్వరునికి దాసులైన వారు ఇహము పరములను వ్యత్యాసం లేకుండా సుఖముగా నుందురు.  

వ్యాఖ్యలు: చిన్న కీర్తనలో అనేక ముఖ్యమైన విధులను అన్నమాచార్యులు గుప్పించారు. దీనిని ఆచరించిన వారు యోగులౌదురనడంలో సందేహం లేదు.

అన్నమాచార్యులు అనేకమార్లు ఇహము పరములకు వ్యత్యాసం లేదని వక్కాణించారు. ఇలా చెప్పడంలో ఆయన ఉద్దేశం పరమ భాగవతులకు భక్తి తప్ప వేరే ఆలోచనలు ఉండవని; పరము మీద ఆశలు పెట్టుకుని భక్తి చూపేవారు నిరాశకు లోనగుదురని మాటకు అంతరార్ధం.

 

zadaz

 

.

Reference: Copper Leaf: 272-3, Volume: 3-414 

No comments:

Post a Comment

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...