ANNAMACHARYA
26. దురిత దేహులే తొల్లియును
Annamacharya declared that the people who achieved liberation were similar to us. He is encouraging us to practice meditation like those great men of the past.
అన్నమాచార్యులు పూర్వము ముక్తి పొందిన వారంతా సామాన్య జనులె అని, మనందరినీ భక్తి మార్గము ఆ మహనీయుల మాదిరి ప్రయత్నం చేయమని ఉద్బోధించారు.
దురిత దేహులే తొల్లియును శ్రీ
duritadEhulE tolliyunu SrI-
Word to word meaning: దురిత దేహులే = పాపపు శరీరముగల వారే; మామూలు మనుషులే; sinners, ordinary people; తొల్లియును = the ones before; శ్రీ హరి = Sri Hari; భజించి = by praying; నిత్యాధికులైరి = became eternally great.
Literal Meaning: Ordinary mortals, being in meditation of SRI HARI became eternally great.
Implied meaning: All are born ordinary. Certain devotees by sheer hard work
(for self-correction), humility and unwavering devotion won the grace of god. And ultimately become eternally great.
సామాన్య అర్థం: పూర్వము సామాన్య మానవులే శ్రీహరిని తెలుసుకొని, ఉగ్గడించి శాశ్వత కీర్తిని సంపాదించారు.
విశేష అర్థం: మానవులందరూ మర్త్యులే. కొందరు భక్తులు తమ తప్పులు సరిచేసుకుంటూ, అణకువతో, నిశ్చల దీక్షతో దైవోపాసన (సత్యాన్వేషణ) చేసి స్థిరమైన పేరు సంపాదించిరి.
అనంతకోటి మహామునులు ఈ
anaMtakOTi mahAmunulu I-
Word to word meaning: అనంతకోటి (anaMtakOTi) = innumerable; మహామునులు (mahAmunulu) = great sages; ఈ (I) = these; సనకాదులు (sanakAdulu) = The Four Boys, the Puranic texts of Hinduism who roam the universe as children, generally named Sanakakumara, Sanatanakumara, Sanandanakumara and Sanatkumara. They are described as the first mind-born creations and sons of the creator-god Brahma.; SANAKA and other seven great men; సనకసనందాదులు లేదా సనత్ కుమారులు బ్రహ్మ మానస పుత్రులు. వీరు సనకుడు, సనాతనుడు, సనందనుడు మరియు సనత్కుమారుడు. వీరు జీవితపర్యంతం బ్రహ్మచర్యం పాటించి మహామహిమాత్ములైన ఋషులుగా పేరుపొందారు. నిశ్చల యశులు (niSchalayaSulu) = constant fame; ఇన (ina) = The Sun GOD, శశి (SaSi) = The Moon God; నయనుని (nayanuni) = As eyes; నితనుని (nitanini) = this person; మును (munu) = before; గని (gani) = having experienced; భజించి (bhajiMchi) = remained in meditation; గత కల్మషులైరి (gata kalmashulairi) = Became free of dirt/impurity/sin.
Literal
Meaning:
Innumerable great sages, the four kumaras
having experienced the one with Sun and the Moon as his eyes, became
free of the impurity and sin. And they attained permanent reputation.
సామాన్య అర్థం: ఎందరో మునులు, సనకాదులు సూర్యచంద్రులు కనులుగా గల ఇతనిని అనుభూతి చెంది నాశము లేని యశము పొందిరి.
అతిశయమతులు మహామహులు సుఖ
atiSayamatulu mahAmahulu sukha-
Word to word meaning: అతిశయమతులు (atiSayamatulu) = marvellous/wonderful men; మహామహులు (mahAmahulu) = great souls; సుఖ రతి (sukha-rati) = love, affection, fondness, desire, pleasure; విముఖులును (vimukhulunu) = not interested to get engaged, renounced; చిరంతనులును (chiraMtanulunu) = for long time, from the time immemorial; హిత విచారమతిని (hita vichAramati) = after due scrutiny came to favourable thinking in the mind; ఇతనిని= this one; సంతతమును = all the time; భజించి (bhajiMchi) = having prayed; ధన్యులైరి (dhanyulairi) =became virtuous men.
Literal Meaning: great Marvellous and wonderful men after due perusal came to conducive thinking in the mind, renounced mortal pleasures and prayed this one all the time and became virtuous.
సామాన్య అర్థం: ఎందరో మహానుభావులు తగు విచారము చేసి తగిన మార్గము నెంచుకొని భౌతిక సుఖములను విడిచిపెట్టి, జీవితమంతా ఇతనిని తెలియు ప్రయత్నములోనే వెచ్చించి దివ్యులైరి.
Comments: Let us try to
understand the significance of word సతతము all the time. Plainly it means that
one must pray the lord always. But it may be noted that, such person will not
engage in other activities therefore this prayer (if we call it a name) is with
full heart and unison of his actions.
The emperor Bali Chakravarti, is not
only a great warrior, but also staunch devotee of Srihari (Lord Vishnu). He had
dethroned Indra by his valour. When Srihari comes to him in the form of Vamana
to seek his largesse, Bali’s guru, Shukracharya forewarned him that Srihari is
going to take away his riches. But Bali feels that he is privileged to donate
to Srihari and takes pride that he can even donate to the lord. Thus
momentarily he loses, his so far unstinting devotion to the lord. There after
he loses all his wealth and bound by the Varuna pasam.
Vindhyavali, his wife reaches the place, finds her husband has been bound. She prostates to Vamana and says.
ka. Nīkuṁ grīḍārthamu lagu
Purport: You had
created these three worlds. Yet these people ignorantly take themselves to be
the lords. When you are the creator, the upholder and the decimator; under
illusion these persons ( she even criticised her husband) impishly claim as the true actors. What can
such persons can grant you?
వ్యాఖ్యలు: ఇక్కడ సతతము అన్ని పదము గురించి కొంత చర్చించుదాము. ఎల్లవేళలా అనగా కొంత విరామం కూడా లేకుండా అనియే సామాన్య అర్థం. ఇక్కడ పేర్కొన్న భక్తి పార్ట్-టైమ్ పనిలాంటిది కాదు. ఏదో, వీలు దొరికినప్పుడు హరిని తలచుటకు. సాధకుడు మిగిలినవన్నీ వదలి, పరిపూర్ణ భక్తితో, చేష్టలు దానికి అనుగుణంగాను మలచుకొనవలె.
జగదేకవీరుడు, మహా హరి భక్తుడైన బలి చక్రవర్తి శుక్రాచార్యుని వలన వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని, "ఆహా! ఆ శ్రీహరికి కూడా నేను దానమివ్వగలను" అనుకొనేను. ఒక్క క్షణం చాలు సమబుద్ధి
వక్రీకరించుటకు. బలి సమస్తము కోల్పోయెను. బలి వరుణపాశములతో బంధింపబడెను.
బలి చక్రవర్తి భార్య వింద్యావళి అక్కడకు చేరుకుని, బలి బంధింపబడి వుండుట చూసి, వామనునికి ప్రణమిల్లి ఇటుల పలికెను.
క. నీకుం గ్రీడార్థము లగు
భావము : ప్రభూ! నీవు నీలీలలను కొనసాగించుట కొరకు
ఈ ముల్లోకాలను సృష్టించితివి. కానీ, మందబుధ్ధులు ఈ జగమ్మునకు తామే అధిపతులైనట్లు భావింతురు
(బలిచక్రవర్తిని కూడా కలిపి విమర్శించింది) . ఈ లోకమునకు కర్తయు, భర్తయు, సంహర్తయు
నీవే ఐనప్పుడు, నీ మాయకు మోహితులై, సిగ్గు
విడిచిన వారు తామే కర్తలమైనటుల భావింతురు . అట్టివారు నీకేమి సమర్పింపగలరు?
దేవతాధిపులు దివ్యులును కడు
dEvatAdhipulu divyulunu kaDu-
Word to word meaning: దేవతాధిపులు (dEvatAdhipulu) = person who can be equal to the kings for the gods, దివ్యులును (divyulunu) = demigods; కడు (kaDu) = very much; బావనులును (= పావనులును, bAvanulunu) = clean men; తగఁ (taga) = suitable; బరహితులు (= పరహితులు, barahitulu) = interested in welfare of others, philanthropists; యీ వేంకటపతిని (yI vEMkaTapati) = this lord venkateswara; ఇతనిని (itanini) = this one; సేవించి = remained in service; సుఖాంచితమతులైరి = attained suitable comfort in mind.
Literal meaning: Persons who can be equal to the kings for the gods, Demigods, clean men, philanthropists prayed to Lord Venkateswara and attained that rare Harmony in mind,
సామాన్య అర్థం: దేవతలకు రాజులన తగిన వారు, దివ్య పురుషులు, పావనులు, పరులకు మేలు చేయుటయే వృత్తిగా కలవారు వెంకటేశ్వరుని ఆరాధించి శాశ్వత సుఖము పొందిరి.
zadaz
Reference: Copper Leaf: 4-1, Volume: 1-21
No comments:
Post a Comment