ANNAMACHARYA
27. సిరి దొలంకెడి పగలు
చీకఁటా యితఁడేమి
Annamacharya in this beautifully worded verse delves upon the nature of GOD. HE makes it abundantly clear that we can never know GOD like we know day and night. One can witness Poetical ecstasy in this expressive presentation.
పరమాత్మ భావాన్ని ఉత్ప్రేక్షాలంకారముతో చిత్రీకరించారు అన్నమయ్య. దైవమును మనము పగలూ రేయీ తెలియునటుల ఎన్నటికీ తెలియమని తేల్చి చెప్పారు. క్లిష్టమైన ఈ కీర్తన అన్నమయ్య గొప్ప భావుకతను చాటుచున్నది.
సిరి దొలంకెడి పగలు చీకఁటా యితఁడేమి
siri dolaMkeDi pagalu chIkaTA
yitaDEmi
Word to word meaning: సిరి దొలంకెడి (siri dolaMkeDi) = shining with splendor, lustre; పగలు (pagalu) = day light; చీకఁటా (chIkaTA) = night, darkness; యితఁడేమి (yitaDEmi) = do you imagine this one as? యిరవు (yiravu) = position/ location దెలిసియుఁ (delisiyu) = make known దెలియనియ్యఁడటుగాన (deliyaniyya DaTugAna) = but HE makes it unknown on the other side (dimension).
Literal meaning: do you imagine this one as shining with splendour with shades of light and dark colour only? He does let you know his position, yet hides himself on the other dimension.
Implied meaning: Though HE expresses through the creation, which we all experience partially, probably we can never know him as we know day and night.
సామాన్య అర్థం: ఇతనిని శోభ తొణికిసలాడే పగలో చీకటియో అనియే భావించగలమా? తనను తాను తెలిపినట్లే ఉంటూ తెలియనివ్వడు.
విశేష అర్థం: భగవంతుని సృష్టి ప్రక్రియ ద్వారా కొంత గ్రహించ గలిగినా అతని ఆచూకీ పగలు చీకటిలా స్పష్టంగా ఎప్పటికీ తెలియలేము.
Comments:
1. This verse reflects
the essence of 13th stanza of 13th Chapter in Bhagavad
Gita.
jñeyaṁ yat tat pravakṣhyāmi yaj jñātvāmṛitam
aśhnute
anādi mat-paraṁ brahma na sat tan nāsad uchyate (13-13)
Purport: Arjun! I shall now reveal to you that
which ought to be known, and by knowing which, one attains immortality. That
one cannot be termed as either truth/existing/fact Or false/ non-existent/
illusion.
2. Also see the similarities of this verse with the uncertainty principle. Proposed first in 1927, by the German physicist Werner Heisenberg, the principle states that the more precisely the position of some particle is determined, the less precisely its momentum can be known. Similarly, man can feel few effects of God/Truth; but forever remains in doubt about its existence.
వ్యాఖ్యలు:
1. ఈ కీర్తన క్రింది భగవద్గీతలోని శ్లోకాన్ని ప్రతిబింబిస్తోంది.
జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే |
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ||
(13- 13)
భావము : ఏది తెలుసుకోదగ్గదో, దేనిని తెలుసుకొంటే మానవుడు మోక్షం పొందుతాడో, అనాది అయిన ఆ పరబ్రహ్మాన్ని గురించి చెప్తాను. దానిని సత్తనికాని (సత్యము, నిజము, ఉనికిని నిర్ణయించగల) లేదా అసత్తనికాని (అసత్యము, ఉనికి లేనిది, భ్రమ) వివరించడానికి వీలులేదు.
2 కొంత వరకు uncertainty principle (అనిశ్చయత్వ సూత్రము) లాగ వుంది. 1927లో జర్మనీ శాస్త్రవేత్త హైసెన్ బెర్గ్ ఒక కణము యొక్క స్థితిని, ద్రవ్యవేగమును ఒకేసారి ఇదమిత్థంగా నిర్ణయించలేము అని నిర్ధారణ చేశాడు. అలాగే భగవంతుని వునికిని, కాలమును ఒకేసారి నిర్ణయించ గల శక్తి మనిషికి లేదు. ఎప్పటికీ కలడో, లేడో అన్న సంశయములో కొట్టుకొని పోతూ వుంటాడు .
తలపోయ హరినీలదర్పణంబో ఇతఁడు
talapOya harinIladarpaNaMbO itaDu
Word to word meaning తలపోయ (talapOya) = by proper introspection; హరి (hari) = God; నీలదర్పణంబో (nIladarpaNaMbO) = possibly the blue mirror; ఇతఁడు (itaDu) = this one; వెలుఁగుచున్నాడు (veluguchunnADu) = shining brightly, effulgence; బహువిభవములతోడ (bahuvibhavamulatODa) = multi faceted exuberance; కలగుణంబు (kalaguNaMbu) = the one that exists; అటువలెనె (aTuvalene) like that కాఁబోలు (kAbOlu) = probably; లోకంబు (lOkaMbu) = the world; కలదెల్ల (kaladella ) = whatever that exists; వెలిలోనఁ (velilOna) = outside; కనిపించుఁ (kanipiMchu) exhibited; గాన (gAna) = because.
Literal meaning: Possibly HE is the dark mirror shining with multi-faceted effulgence. Because of Him, all things make their presence known.
Implied meaning: By stating నీలదర్పణం (nIladarpaNaM) and Nīlati ācchādayati an'yavarṇān meaning The Colour NILA hides the presence of other colours), it may be inferred that he hides his presence, yet reflecting in the entire universe. Whatever we see is his reflection.
సామాన్య అర్థం: చెప్పనలవికాని వైభవముతో వెలుగుతున్న అతడే గూఢమైన నీలపుటద్దమేమో! అతడుండుట వలననే ఈ విశ్వములోని వివిధ ఆకారాలు గోచరమగుచున్నవి.
విశేష అర్థం: నీలతి ఆచ్ఛాదయతి అన్యవర్ణాన్ (ఇతర రంగులను కప్పునది) అని తెలుసుకుంటే, నీలదర్పణం విశ్వమంతా పరమాత్మయొక్క ప్రతిబింబమే కాని సత్యమైనది కాదని తెలిపారు. అలాగే, ఆ హరినీలదర్పణంలోని నీలము అతడి నెలవు తెలియనీయదని పరోక్షంగా తెలుపుతూనే, బయటకు కనపడునదంతా పరమాత్మయే అని సూచించారు!!
మేరమీరిన నీలమేఘమో యితఁడేమి
mEramIrinanIlamEghamO
yitaDEmi
Word to word meaning మేరమీరిన (mEramIrina) = crossing the borders, rules (limitless); నీలమేఘమో (nIlamEghamO) = possibly dark cloud; యితఁడేమి (yitaDEmi) = is He? భూరిసంపదలతోఁ (bhUrisaMpadalatO) = great wealth; బొలయుచున్నాడు (= పొలయుచున్నాడు, bolayuchunnADu) = Exists; కారుణ్యనిధియట్ల (kAruNyanidhiyaTla) = very epitome of kindness; కాఁబోలు (kAbOlu) probably; ప్రాణులకు (prANulaku) = for the beings; కోరికలు (kOrikalu) = desires; తలఁపులోఁ (talapulO ) = in the mind; కురియు నటుగాన (kuriyu naTugAna) = therefore shower them.
Literal meaning: HE is very epitome of kindness; showers limitless desires in the minds of the beings like rain from the great clouds.
సామాన్య అర్థం: పరమ దయాళువైన అతడు జీవుల మనసులలో మితిలేని కోరికల వర్షం కురిపిస్తున్నాడు.
Comments: This is the crux
of the issue. He sprays limitless desires in our mind to test us. We fall prey
to these tricks. He gives us lot of
chances. Yet, most of us fail in his tests.
వ్యాఖ్యలు: ఇదియే క్లిష్టాంశం. ఒక ప్రక్క ఆ మహానుభావుడు మన మనసులలో దయతలచి కోరికలు వర్షం కురుస్తాడు. మనం ఎప్పటిలాగే వాటికి పడిపోతాం. రెడ్డొచ్చె మొదలెట్టు చందాన సాగిపోతుంది జీవితం.
తనివోని ఆకాశతత్వమో యితఁడేమి
tanivOniAkASatatvamO yitaDEmi
Word to word meaning: తనివోని (tanivOni) = never satiated; ఆకాశతత్వమో (AkASatatvamO) = nature of ether; యితఁడేమి (yitaDEmi) = is He? అనఘుఁడు (anaghuDu) = దోషము లేనివాఁడు, పరిశుద్ధుఁడు, blemishless; ఈ తిరువేంకటాద్రి వల్లభుఁడు (I tiruvEMkaTAdri vallabhuDu) = this Lord of Venkatadri; ఘనమూర్తి (ghanamUrti) = great manifestation; అటువలెనె (aTuvalene) = same way; కాఁబోలు (kAbOlu) = probably; సకలంబు (sakalaMbu) = everything; తనయందె (tanayaMde) = in HIM; అణఁగి (aNagi) = get merged, get concealed; ఉద్భవమందుఁగాన (udbhavamaMdugAna) = because they as well are reborn in him.
Literal meaning: Blemishless lord of Venkatadri, encompasses everything in him like ether; Entire universe gets concealed in him and born again in his great manifestation.
సామాన్య అర్థం: ఆకాశము అన్నింటినీ తనలో ఇముడ్చుకున్నటులే, దోషరహితుడగు వెంకటాద్రీశునిలో విశ్వమంతా లీనమై తిరిగి జనియించు కనుక, ఇరువురదీ ఒకే తత్వమేమో!!
Comments:
The last line of this stanza explained the nature of the creator. This line
is reminiscence of a beautiful poem from Gajendra Mokshanam in Bhagavatam as given below.
Evvanicē janin̄cu
jagamevvani lōpala nuṇḍu līnamai
Yevvani yandu ḍindum;
baramēśvarum̐ ḍevvaḍu; mūlakāraṇaṁ
Bevvaḍanādimadhyalayum̐ ḍevvam̐ḍu;
sarvamum̐ dānayaina vā
Ḍevvaḍu; vāni nātmabhavu
nīśvaru nē śaraṇambu vēḍedan (8-73)
Purport: I seek refuge and prostrate to the creator of the universe, in who the universe exists; In who the universe gets concealed; who is the original cause; who remains constant in this ever changing universe; who has no beginning or end; who is all by himself; who is the controller of the self-inside me;
వ్యాఖ్యలు:
ఈ కీర్తనలోని చివరి పదాలు గజేంద్ర మోక్షణములోని క్రింది పద్యాన్ని గుర్తుకు
తెస్తున్నాయి.
ఉ: ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ;డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్. (8-73)
భావము : ఈ లోకమంతా ఎవరి వల్లనైతే సంభవిస్తుందో; ఎవరిలో ఉంటుందో; ఎవరిలో లయం ఔతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టుట, గిట్టుట వాటి
మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; మొదలు, తుది లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు కోరుతున్నాను.
zadaz
Reference: Copper Leaf 37-2, volume: 1-228
No comments:
Post a Comment