ANNAMACHARYA
28. కడుపెంత తాఁ గుడుచు
Introduction: In this simple but hard hitting verse,
Annamacharya wonders why mankind gets engaged in listless activities. These
activities are leading the man astray.
ఉపోద్ఘాతము: ఈ సులభంగా కనిపించే కీర్తనలో గంభీరమైన అర్థాన్ని గుంభనంగా చొప్పించారు. మానవుని చేష్టలు గుడ్డి ఎద్దు చేనులో పడిన మాదిరిగా ఉన్నాయన్నారు.
కడుపెంత తాఁ గుడుచు కడుపెంత దీనికై
kaDupeMta tA guDuchu kaDupeMta dInikai
Word to Word meaning: కడుపెంత (kaDupeMta) = what
is the size of stomach? తా (tA) =self ; కుడుచు (guDuchu) = eat; కుడుపెంత (kaDupeMta) = how much it can digest or drink; దీనికై for this (dInikai) = పడని పాట్లనెల్ల పడిపొరలనేలా (paDani pATlanella baDi poralanElA) = get
engaged in unwanted tasks and keep roaming all around the places.
Literal meaning: what is the size of stomach (quantum of hunger)?
How much one can consume? For such miniscule requirement, why get engaged in
unwanted tasks and keep roaming all around the places.
Implied meaning: we really don't understand why we get engaged in unwanted tasks and go around the world. Definitely it is not for satisfying our daily needs. (If it is not for the need, then for what? As we drill through, it means that we don't know what we are doing, therefore we are ignorant!!!).
Comments: consider the following poem of Vemana which stating the similar meaning as of the chorus.:
ఆ. కడుపు కేల మనసు కళవళపడియెడు
కడుపు కేలతృప్తి కలుగుచుండు
కరప రాతిలోని కప్పకుఁ గలుగదా
విశ్వదాభిరామ వినర వేమ. (2-95)
Purport: O Learned Vema: why mind is perturbed by the stomach. Will stomach ever get satisfied? How a frog encased in a stone getting food? (meaning the one who provides food to frog will provide you as well).
సామాన్య అర్థం: కడుపెంత? దానికి కావలసిన దెంత? దీనికేనా మనిషి కొరగాని పనులలో చిక్కుకుని, తిరగరాని చోటులలో తిరుగాడేది?
విశేష అర్థం: నిజానికి
మనమెందుకీ
పనికిరాని
పనులలో
పడి
కొట్టుకుంటున్నది, మనకే తెలియదు. ఉదరపోషణార్థనికైతే మాత్రం కాదు. (ఇలాగే మరి దెనికీ? మరి దెనికీ? అనుకుంటూ విశ్లెషించుకుంటూ
పోతే,
మనమేమి
చేయుచున్నామో తెలియదు; తెలివిలేని వారము లేదా"అజ్ఞానులము" అనే అర్థం వస్తుంది)
వ్యాఖ్యలు: చిన్న కడుపు కోసము మనస్సు ఎందుకు ఆందోళన పడుతూ ఉంటుందో? పోనీ దాని (కడుపు) కేమైనా తృప్తి
ఉంటుందా? రాతిలోని కప్పకుఁ కూడు దొరకినట్లే, భగవంతుడివ్వడా? అన్న వేమన మాటలు సందర్భానికి తగినవని చేర్చాను.
పరులమనసునకు నాపదలు గలుగఁగఁజేయఁ
parulamanasunaku nApadalu galugagajEya
Word to Word meaning: పరుల (parula) = others; మనసునకు (manasunaku) = hearts;
ఆపదలు (nApadalu) = trouble; కలుగగజేయ (galugagajEya) =
causing; పరితాప కరమైన (baritApakaramaina) =causing sorrow/
affliction; బ్రతుకేలా (bradukElA) = why such life? సొరిది (soridi) = regularly నితరుల (nitarula) = others మేలు (mElu) = well being;
చూచి (chUchi) = having seen; సైపగలేక (saipagalEka) = unable to bear; తిరుగుచుండేటి (tiruguchuMDETi) = moving around; కష్టదేహ మిది యేలా (kashTa dEhamidiyElA) why such
sinful/abominable body?
Literal meaning: Why to live a life
causing trouble to the hearts of others. Why continue a body incapable of
rejoicing the wellbeing of others.
Comments: Its worth to recall the
following statement from Mahabharat. After the war, Dhramaraja sought what is
the best policy to adapt from Bhishma who was lying on the bed of arrows. Bhishma propounded thus.
Yadan'yairvihitaṁ nēcchēt
యదన్యైర్విహితం నేచ్ఛేత్ ఆత్మనః కర్మ పూరుషః
Purport: Whatever work or action is considered as undesirable (for him); he shall not do the same unto others.
సామాన్య అర్థం: పరుల మనసుకు ఆపదలు కలిగించు హీనమైన బతుకెందులకు? పరులకు కలుగు లాభము/వృద్ధి సహించలేని నికృష్ట శరీరమేలా?
వ్యాఖ్యలు: ధర్మస్వరూపము వివరించుచు అంపశయ్య మీద ఉన్నభీష్ములు ధర్మరాజున కుపదేశించిన బోధ.
ఒరులేయవి యొనరించిన
భావం : ఓ రాజా! ఇతరులు ఏ పనులు చేస్తే తన మనస్సునకు అయిష్టత కలుగుతుందో అటువంటి పనులను అతడు ఇతరుల పట్ల చేయకుండా ఉండుటే ఉత్తమమైన ధర్మము.
యెదిరి కెప్పుడుఁ జేయుహితమెల్లఁ దనదనుచు
yediri keppuDu jEyuhitamella danadanuchu
Word to Word meaning: యెదిరికి (yediri ki) = the one before you; ఎప్పుడు (eppuDu) = always; చేయు (jEyu) = done; హితమెల్ల hitamella all the help/assistance తనది (danaid = tanadi) for
the self; అనుచు (anuchu) = this proclaiming; చదివిచెప్పనియట్టి (chadivicheppaniyaTTi)
= not enunciating ; చదువేలా(chaduvElA) = why such education/learning? పొదిగొన్న (podigonna) bundle of; ఆసలో (yAsalO) = desires; బుంగుడై (buMguDai) = with
sunken face; బుంగ మూతితో; సతతంబు(satataMbu) = all the time; సదమదంబై (sadamadaMbai) = struggling సతమతమవుచు పడయు (paDayu) = get; చవులు (chavulu) = tastes తనకేలా (danakElA) =why?
Literal meaning: What use is of education /learning which does not
encourage one to understand that the good done to others is to his advantage?
Is it education? What use is of chasing
the bundle of hopes and desires struggles with sunken face. Why such
tasteless Life?
Comments: Annamacharya said
that education never could inculcate confidence in man that his own good lies in the well-being
of the society (he lives in). Thus education, remained external to man,
therefore has failed. He also criticised
that we grapple with life day after day only to satisfy few taste buds.
సామాన్య అర్థం: ఇతరులకు
మేలు
చేయుటయందే
తన
హితమున్నదని తెలియజెప్పని చదువూ చదువే? (చదువే కాదు, వెర్రితనము). ఆశల గుత్తిలో చిక్కుకుని బుంగమూతి పెట్టుకుని సతమతమగుచు పొందే రుచులూ రుచులే? (కావు)
వ్యాఖ్యలు: మానవునికి చదువు అంతరంగము లోనికి చొచ్చుకొని పొలేక; సత్యమును గ్రహించుటకు ఉపయోగ పడక, బాహ్యంగా ఉండి ఒక ఆచ్ఛాదనగానే మిగిలిపోయి నిశ్ప్రయోజనమైందని స్పష్టంగా చెప్పారు. అస్తవ్యస్తమైన ఆలోచనలతో హడావిడి జీవితం క్షణిక సుఖములు పొందుటకేనా? పరిగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదని సామెత.
శ్రీవేంకటేశ్వరుని సేవారతికిఁగాక
SrIvEMkaTESvaruni sEvAratikigAka
Word to Word meaning: శ్రీవేంకటేశ్వరుని (SrIvEMkaTESvaruni)
= Lord Sri Venkateswara's; సేవారతికి గాక (sEvAratikigAka) = except for his service;
జీవనభ్రాంతిపడు (jIvanabhrAMti baDu) =leading to illusion; సిరులేలా (sirulElA) = why
riches? దేవోత్తముని (dEvOttamuni) = the best among the gods, the ultimate; నాత్మ తెలియనొల్లక (nAtma
deliyanollaka) = without self-realisation; పెక్కు (pekku) = many; త్రోవలేగిన (trOva lEgina) = pursued
paths; దేహి (dEhi) = this fellow's దొరతనంబు (doratanaMbu) = vanity, conceit, feign control; ఏలా (ElA) = why?
Literal meaning: there is no use of
being rich without spending the money in the service of Lord Sri Venkateswara.
All other pursuits of rich leads to illusion. Without realising the ultimate in
his own self, it's pity that man feigns control in pursuing futile paths.
Implied meaning: Man under illusion pretends that he is controlling,
little realising that unless he submits his will, he continues to chase
mirages. It’s deplorable that man tries to search god everywhere except in
himself. Why man offers money to GOD is incomprehensible.
సామాన్య అర్థం శ్రీవేంకటేశ్వరుని సేవలకై వినియోగపడక చంచలమైన జీవనమందే భ్రాంతి పెంపొందింపజేయు సంపదలెందుకు? ఆ దేవాధిదేవుని హృదయములో గుర్తింపక భౌతికవాంఛలకు లోనై నానామార్గములలో పయనించు జీవుని కుటిల వేషములన్నీనిరుపయోగము గదా!
విశేష అర్థం: ఆత్మార్పణము చేయక వేరే ఏదో వస్త్రభూషణాద్యలంకారముల చేతనో పొందుదాము అనుకోవడమే అవివేకము. తనలో కాకుండా బయటెక్కడో వేతకడమే భ్రాంతి. దైవానికి ధనము కైంకర్యము ఎందుకు చేస్తాడో అంతుబట్టని విషయము. ఈ కుటిల వర్తనమేలనో!!
zadaz
Reference:
Copper Leaf: 49-5, Volume: 1-302
No comments:
Post a Comment