ANNAMACHARYA
32. అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము.
Annamacharya wonders why man looks outside (for solutions) while all of us are bestowed with everything thing we need. He says this is the true illusion that man needs to overcome.
Two
important points to note from this verse are that man instead of extricating
himself from the wrong position:
1.
Like
to note and theorise our situation instead of taking action to correct
2.
Derives
vicarious comfort that others are sailing in the same boat (along with him.)
Thus one can feel the profound observations of Annamacharya which are way beyond comprehension of the ordinary. In fact they appear to have been written after witnessing our present life.
This
verse is inexplicably inked with the shloka 2-46 of Bhagavad-Gita. We shall see
that at the end of this explanation.
మనిషి అన్నీ తనలో నిక్షిప్తమై ఉండగా బాహ్యములో సమాధానము కొరకు వెతుకుతాడు. దీని కంటే విపరీతమైన భ్రమ వెరేమీలేదు అన్నారు అన్నమాచార్యులు. ఈ కీర్తనలో రెండు ముఖ్యమైన, నిశితమైన సూచనలు గమనింపవచ్చు:
1.
మనిషి తన స్థితిని గురించి తెలుసుకునే ఉత్సాహాన్ని దాన్నుంచి
బయటపడడానికి చూపడు.
2.
మానవుడు తనలాగే వేరే వాళ్ళు
ఉన్నారని తెలిసి అప్రయొజనకరమగు
సంతృప్తిని పొందుతాడు.
ఈ కీర్తన సామాన్య గ్రహణశక్తిని మించి, ఇప్పటి మన జీవితాన్ని 500 స్మవత్సరాలకు ముందే చూచి క్షుణ్ణంగా పరిశీలించి వ్రాసారా అనుకునేటట్టుంది. ఈ కీర్తన భగవద్గీత లోని క్రింది శ్లోకంతో చెప్పలేనివిధముగా ముడిపడి ఉంది. అది చివర్లో చూద్దాం.
అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము
anniyu
nAlO nuMDaga navvala nEmi chUchEmu
Word to Word meaning: అన్నియు (anniyu) = everything (what so ever), నాలో (nAlO) = in me; నుండఁగ = ఉండఁగ (nuMDaga) = existing, embedded; నవ్వల = అవ్వల (navvala = avvala) = outside, beyond; నేమి (nEmi చూచేము chUchEmu యెన్నఁడు (yennaDu) = till date గాననిమాయ (gAnanimAya) యెరఁగవో (yeragavO) = understsand, be aware; మనసా (manasA) = Oh Mind.
Literal meaning: When everything is embedded in us, why do we look outside side? Oh mind, note this is the true illusion which is not known before.
భావము: మనిషి కావలసినవన్నీ ఆతనిలోనే దాచబడి ఉండగా బాహ్యములో సమాధానము కొరకు వెతుకుతాడు. దీని కంటే చెప్ప తగ్గ భ్రమ వేరేమీ లేదు.
యీడనే సంసార మిదె యింద్రజాలమై యుండఁగ
yIDanE
saMsAra mide yiMdrajAlamai yuMDaga
Word to Word meaning: యీడనే (yIDanE ) = here itself; సంసార మిదె (saMsAra mide) = this visible world; యింద్రజాలమై (yiMdrajAlamai) = mysterious; యుండఁగ (yuMDaga) = being; యేడకైనాఁ (yEDakainA) = any where; జూడఁ బోయే (jUDa bOyE) = go to watch; మింద్రజాలము (ఇంద్రజాలము, miMdrajAlamu =iMdrajAlamu) = magic shows; పాడితో (pADitO) by nature; స్వభావముతో; నా పట్టుగులే (nA paTTugulE ) = my bondages; బహురూపాలై యుండఁగ (bahurUpAlai yuMDaga) = exist with various forms and shapes; వేడుకయ్యీ (vEDukayyI) = with ironical interest; బహురూపవిద్యలు bahurUpavidyalu = an act win which a person portrays different forms; చూడఁగను (chUDaganu) = to witness, to watch.
Literal meaning: While our life itself is an enchantment, it’s paradoxical that we attend Magic shows. While our own bondages are very many, it’s ironical that we keep enjoying performances of a person enacting many faces in the same breath.
భావము: (మన) బ్రతుకే ఇంద్రజాలమయ్యుండగా, అది చాలదనట్లు మనుషులు ఇంద్రజాలము చూడడానికి పొవడము విడ్డూరము కాదా!! మనిషి అనేక రూపాలలో బంధితుడయ్యుండీ, వేషగాళ్ళు వేసే రూపాలను చూడ్డానికి పొవడము వింత కాదా!
నటన దినదినము నాటకమై యుండఁగాను
naTana
dinadinamu nATakamai yuMDagAnu
Word to Word meaning: నటన (naTana) = నటించవలసిరావడము, cunning behaviour; దినదినము (dinadinamu) = day by day; నాటకమై (nATakamai) = a melodrama, యుండఁగాను (yuMDagAnu) = being; సటవట (saTavaTa) = { సట= cunning, trickery వట = చుట్టుకొనుట, అల్లుట, surround} = ఏమఱపఱచు, నాటకాలు (nATakAlu) = drama (enacted by professionals); సారెఁ (sAre) = repeatedluy, many; జూచేము (jUchEmu) = watched, witnessed; ఘటన = (ghaTana) dispensations of providence; మాయలెదుటఁ(mAyaleduTa) గనుకట్టై (ganukaTTai) = legerdemain; sleight of hand; వుండఁగాను = being; (vuMDagAnu) అటమటపు (aTamaTapu) = Trickery, guile, fraud; విద్యలు (vidyalu) = practices; అన్నియుఁ(anniyu) = all, complete; జూచేము (jUchEmu) = witness.
Literal meaning: While our day to day life itself is akin to Drama, it is surprising that we repeatedly go and watch a drama to trick ourselves. The dispensations of providence in themselves are trickery; yet we are inclined to witness these practices of trickery exhibited by professionals.
Comments: This is what we do actually every day. It appears that Annamacharya could fore see our present lives so accurately. Sometimes, I felt that he indicated about present day reality shows on TV.
భావము: దినదిన జీవితము నాటకమై యుండఁగాను, ఏమఱపఱచు నాటకాలను మళ్ళి మళ్ళి చూడడానికి ఆసక్తి చూపిస్తాము. మాయలు కన్నులెదుటఁ ఘటించుచున్నా కూడా, కానకుండఁ జేయు విద్యలు చూచుటకు కుతూహలము చూపుదుము.
పాపపుణ్యములు రెండు బారివిద్య లుండఁగాను
pApapuNyamulu
reMDu bArividya luMDagAnu
Word to Word meaning: పాపపుణ్యములు (pApapuNyamulu reMDu = virtuous and sinful deeds; రెండు = tow of them; బారివిద్య లుండఁగాను = existing repetitive tasks; కోపుల (kOpula) = ఒకరిపేరు పెత్తనమును పరోక్షముగా విమర్శించు, innuendo; నాటలవారిఁ (nATalavAri) = who enacts such; గోరి చూచేము = crave to witness; యేపున = అధికము, వృద్ధి, విలాసము, excess, growing; grace; శ్రీవేంకటేశు డిటు = Sri Venkateswara thu; భ్రమపాపె (bhramapApe) = cleared illusion; నాపనులు (nApanulu) = my deeds; నేనే (nEnE) = myself; చూచి (chUchi) = having observed; నవ్వులు నవ్వేను (navvulu navvEnu) = would laugh.
Literal meaning: We grapple constantly with the virtuous and sinful deeds all the while; still we crave to see the plays full of innuendos. I now understand, having been extricated by the Lord Venkateswara from the perplexity of the illusion. I now can see my foolishness to laugh at myself.
భావము: పాపపుణ్యములలో యెది చేబట్టమో అనే సంశయము ఎప్పుడూ తేల్చుకోలేని మేము; ఒకరి పేరు, పెత్తనమును పరోక్షముగా విమర్శించు ఆటలను కోరి కోరి చూస్తాము. కరుణకొలది శ్రీవేంకటేశుడు నన్ను భ్రమనుండి రక్షింపగా నా వెర్రితనము చూచి నాకే నవ్వొస్తొంది.
వ్యాఖ్యలు: “కోపుల నాటలు” అన్న పదాన్ని జగ్రత్తగా గమనిస్తే ఈ రోజుల్లొ మనము చూస్తున్న జబర్దస్త్ గుర్తుకు వస్తుంది.
Comments: Overall after writing the meaning of this verse, I felt this is linked to the Bhagavad-Gita verse below. This verse actually states that the YOGI will realise the knowledge (that encompasses everything including the tranquillity) within the self. This is what Annamacharya meant by అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము (anniyu nAlO nuMDaga navvala nEmi chUchEmu).
yāvān artha udapāne sarvataḥ
samplutodake
tāvānsarveṣhu vedeṣhu brāhmaṇasya vijānataḥ
Purport: Whatever purpose is served by a small well of water is naturally served in all respects by a large lake. Whatever is the peace / bliss obtained by all the karmas mentioned in the Vedas, the yogi has all that peace / bliss in his knowledge.
శ్లో|| యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే ।
భావము: తక్కువ నీళ్లు ఉండే నూతులు, చెరువుల వలన ఎంతటి ప్రయోజనం ఉంటుందో, ఆ ప్రయోజనం ఎక్కువ నీళ్లు ఉండే సరస్సుల లోనూ నిక్షిప్తమై ఉంటుంది. వేదాలలో చెప్పిన సమస్త కర్మలవలననూ పొందబడే శాంతి/ఆనందము ఏదైతే ఉందో, యోగియైన వాడికి తన జ్ఞానం లోనే ఆ శాంతి/ఆనందము సమస్తమూ ఇమిడి ఉంటుంది.
zadaz
Reference:
Copper Leaf: 333-1, Volume: 4-190
ఓంశ్రీసాయినాధాయనమః అందుకే సద్గురు సాయి మనమును అంతర్ముఖము చేయుమని ఆత్మ పరిశీలనతో సర్వ విషయానుసారము విశదీకరణమగునని , అందుకు భగవంతునియందు శ్రధ్ధ సబూరి ని బోధించేవారు
ReplyDeleteబాగుంది
Delete