ANNAMACHARYA
30. వలెననువారిదె వైష్ణవము యిది
In this fantastic verse, Annamacharya declared that one must submit in totality (body, mind and thinking) i.e refrain from any action. Actually these actions interfere with the natural process of healing. He affirms the true vaishnavite will leave these to realise the god. This may appear easy. In fact the most difficult to achieve. This total inaction is also the essence of Jiddu Krishnamurti's philosophy.
ఈ అద్భుతమైన కీర్తనలో భగవంతుని సంపూర్ణ సమర్పణ (మనసా, వాచా & కర్మేణ) కీలకమని అన్నమాచార్యులు నొక్కి చెప్పారు. అనగా తనవైపున నుండి జీవుడు ఎటువంటి ప్రతిక్రియా చూపకుండటయే సంపూర్ణ సమర్పణ. ఈ యెత్నములే సహజముగా స్వస్థపఱచెడు చర్యలకు అడ్డమౌతాయని అన్నారు. ఇవన్నీ వదిలి ఆత్మ సమర్పణము చేయుటయే యథార్థమైన వైష్ణవము అని ఘోషణ చేశారు. ఇది చెప్పడానికి సులభంగా అనిపించినా, వాస్తవానికి అతి కఠినం. ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా సంపూర్ణ సమర్పణయే ప్రతిపాదన చేశారు.
వలెనను వారిదె వైష్ణవము యిది
వలపుఁ దేనెవో వైష్ణవము ॥పల్లవి॥
valenanuvAride vaishNavamu yidi
valapu dEnevO vaishNavamu ॥pallavi॥
Word to word meaning: వలెనను (valenanu) = accepting వారిదె (vAride) = those వైష్ణవము (vaishNavamu) = path to Vishnu (GOD); a sect following the Vishnu; యిది (yidi) = this; వలపుఁ (valapu) = love, compassion; దేనెవో = తేనెవో (dEnevO = tEnevO) = honey; వైష్ణవము (vaishNavamu) = path to Vishnu (GOD).
Literal meaning: This path to Vishnu is for the
ones accepting him (as saviour). This Communion (with god) is exhilarating like
honey.
సామాన్య అర్థం: ముక్తి కావాలనుకునే వారికి తేనె వలె తీయనైనది వైష్ణవము.
కోరిక లుడుగుచు గుఱి నిన్నిటిపై
వైరాగ్యమెపో వైష్ణవము
సారెకుఁ గోపముఁ జలమునుఁ దనలో
వారించుటవో వైష్ణవము ॥వలె॥
kOrika luDuguchu gu~ri ninniTipai
vairAgyamepO vaishNavamu
sAreku gOpamu jalamunu danalO
vAriMchuTavO vaishNavamu ॥vale॥
Word to word meaning: కోరికలు (kOrikalu)
= Desires; ఉడుగుచు (uDuguchu)
= To cease, abate, leave, quit, or relinquish; గుఱి (gu~ri) = An aim, a goal, a mark; నిన్నిటిపై = ఇన్నిటిపై (inniTipai)= on so many
things; వైరాగ్యమెపో (vairAgyamepO) = dissociation only; వైష్ణవము (vaishNavamu) = path to Vishnu
(GOD); సారెకుఁ (sAreku) = every time;
frequently; danalO = గోపముఁ (gOpamu)
= anger; జలమునుఁ = చలమునుఁ (jalamunu = chalamunu) = ప్రతీకారం, revenge; దనలో (danalO)=
in self; వారించుటవో to prevent, stop, hinder, obstruct, to ward off,
avert; వైష్ణవము (vaishNavamu) = path to Vishnu (GOD).
Literal Meaning: A vaishnavite relinquishes the innumerable desires, dissociates from achievement of targets. He wards off frequent anger and feelings of revenge in himself.
సామాన్య అర్థం: మనస్సులో వివిధమైన కోరికలను విడనాడి, భోగములపై విముఖులై వైరాగ్యభావం అలవరచుకొనుటయే వైష్ణవము. ప్రతిసారీ తనలో తొంగిచూచే క్రోధాన్ని, ప్రతీకార వాంఛలను నిగ్రహించి తలయెత్తకుండా అదుపులో వుంచటమే వైష్ణవము.
నుడిగొను దేహపు సుఖదుఃఖములో
వడిఁ జొరనిదెపో వైష్ణవము
ముడివడి యింద్రియముల కింకరుఁడై
వడఁబడనిదెపో వైష్ణవము ॥వలె॥
nuDigonu dEhapu sukhaduhkhamulO
vaDiM joranidepO vaishNavamu
muDivaDi yiMdriyamula kiMkaruDai
vaDaMbaDanidepO vaishNavamu ॥vale॥
Word to word meaning: నుడిగొను (nuDigonu) = surrounding; దేహపు (dEhapu) = body; సుఖదుఃఖములో (sukhaduhkhamulO) = happy and sorrow (feelings); వడిఁ (vaDiM) = quickly; జొరనిదెపో = చొరనిదెపో (joranidepO= coranidepO) = do not penetrate; వైష్ణవము (vaishNavamu) = path to Vishnu (GOD); ముడివడి (muDivaDi) = విడిచి రాలేక తగులుకొని; unable to extricate; యింద్రియముల (yiMdriyamula) = sense organs; కింకరుఁడై (kiMkaruDai) = being salve; వడఁబడనిదెపో (vaDaMbaDanidepO) = తపింపక నిలిచినదే, not lingering; not persisting; వైష్ణవము (vaishNavamu) = path to Vishnu (GOD).
Literal meaning: The one not engaging in the (happy and sorrow) feelings of body is vaishnavite. One who persistently does not get caught by the sense organs (therefore not slave to these) is true vaishnavite.
సామాన్య అర్థం: సుడిగాలిలా చుట్టుముట్టి దేహాన్ని వ్యాకులపరుస్తుండే సుఖ దుఃఖముల పీడనుంచి విముక్తుడవుటయే నిజమైన వైష్ణవము. విడువక తగులుకొని వేధించే ఇంద్రియములకు బానిసకాకుండ, వాటికి లొంగిపోకుండుటయే వైష్ణవము.
వుదుటునఁ దన సకలొపాయంబులు
వదలుటపో నిజవైష్ణవము
యెదుటను శ్రీవేంకటేశ్వరు నామము
వదనము చేర్చుట వైష్ణవము ॥వలె॥
vuduTuna dana sakalopAyaMbulu
Word to word meaning: వుదుటునఁ (vuduTuna) = Pride, haughtiness; దన (dana) = self; సకలొపాయంబులు (sakalopAyaMbulu) = all know methods or contrivances; వదలుటపో (vadaluTapO) = Leaving out; నిజ (nija) = truly; వైష్ణవము (vaishNavamu) = path to Vishnu (GOD); యెదుటను (yeduTanu) = in front of; వేంకటేశ్వరు (SrIvEMkaTESvaru)= Lord Vemkateswara; నామము (nAmamu) = name; వదనము (vadanamu) = face, mouth; చేర్చుట (chErchuTa) = to admit, to include; వైష్ణవము (vaishNavamu) = path to Vishnu (GOD).
Literal meaning: Setting aside ego, not employing any known methods, not reacting to all situations is true Vaishavism. Keeping the name of వేంకటేశ్వర (SrIvEMkaTESvara) God on the (tip of) tongue is Vaishavism. Keeping the symbol (namamu) on the face is Vaishnavism.
Implied meaning: Due to ego, man thinks he know everything. He keeps trying all the contrivances at his disposal except the required action. As already noted earlier, here the required action means NO REACTION from the practicing person. Leaving all that one knows, and submitting the will to the god is true Vaishavism. Keeping the god in the heart is essence of Vaishavism.
విశేష అర్థం: గర్వము, అహంకారం కొలది మనిషి తనకు అన్ని తెలుసు అనుకుంటూ తన ప్రయత్నాలు కొనసాగిస్తాడు. ఇంతకు ముందు చెప్పినట్లు, ఇక్కడ చర్య అనగా, తనవైపు నుంచి ఎటువంటి ప్రతిక్రియ చేయకుండుటమే. ఇవన్నీ వదిలి భగవంతునికి ఆత్మ సమర్పణము చేయుటయే యథార్థమైన వైష్ణవము. నుదుటనే కాదు మనసులోను దైవమునే వుంచుకొనుటయే వైష్ణవము యొక్క సారము.
Comments: This particular stanza has reference to the following Bhagavad-Gita shloka (13-30)
prakṛityaiva cha karmāṇi
kriyamāṇāni sarvaśhaḥ
Purport: One who is aware that all the activities are
performed by the body, which is created of material nature; and aware that the self
(atman) is not the actor (does nothing) actually sees.
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః ।
యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి ।। 13-30 ।।
భావం: (అర్జునా!!) ఎవడు కర్మలు అన్నివిధాలా ప్రకృతి స్వభావము చేత చేయబడుతున్నట్లు తెలియునో మరియు ఆత్మను కర్తగానివానిగా తెలియునో అతడే నిజముగా (సరిగ్గా) చూచుచున్నవాడని (ద్రష్ట అని) తెలియుము.
zadaz
Reference:
Copper Leaf: 84-1, Volume: 1-405
No comments:
Post a Comment