Sunday, 7 March 2021

29. తానే తెలియవలె తలఁచి దేహి తన్ను (tAnE teliyavale talachi dEhi tannu)

ANNAMACHARYA

29. తానే తెలియవలె తలఁచి దేహి తన్ను

In this beautifully worded verse Annamacharya proffered that this journey of prayer must be undertaken alone by man, carefully doing self-correction  without  looking for external advise/support.

ఈ ప్రబోధాత్మమక కీర్తనలో మనిషి తనను తానే సరిచేసుకుంటూ, ఏకాకిగానే ఆత్మ నివేదన మార్గములో పయనించవలెనని అన్నమాచార్యులు సెలవిచ్చారు. 

తానే తెలియవలె తలఁచి దేహి తన్ను

మానుపువారలు మరి వేరీ॥పల్లవి॥ 

tAnE teliyavale talachi dEhi tannu

mAnupuvAralu mari vErI  pallavi 

Word to Word meaning: తానే (tAnE) = by himself; తెలియవలె (teliyavale) = must know;  తలఁచి (talachi) = by proper thinking;  దేహి (dEhi) = the man తన్ను (tannu) himself; మానుపువారలు (mAnupuvAralu) = the one giving appropriate advice;  మరి వేరీ (mari vErI) = after all who?

Literal Meaning: The man should know himself by proper thinking. Unfortunately, there is none to advise correct path.

సామాన్య అర్థం: మానవుడు ఎవరి మీదా ఆధారపడకుండా, సరియైన త్రోవ చూపుటకు ఎవరూలేరుని గ్రహించుతూ తనను తానే తెలియవలెను.

Comments: This statement reminds us the following shloka from the 6th chapter Bhagavad-Gita.

uddhared ātmanātmāna nātmānam avasādayet
ātmaiva hyātmano bandhur ātmaiva ripur ātmana
ḥ (6-5)

Purport: A man must elevate himself by his own mind, not degrade himself. Depending on the usage, the mind can be the friend or enemy as well.

This verse expounds central Idea of the Bhagavad-Gita - no one, except you, can elevate you.

వ్యాఖ్యలు: కీర్తన భగవద్గీతలోని క్రింది శ్లోకాన్ని గుర్తుకు తెస్తుంది.

శ్రీ భగవానువాచ

శ్లో|| ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్  

ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।। (6-5) 

భావం :  నీ మనోశక్తిచే నిన్ను నీవు ఉద్దరించుకోనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఉపయోగించడం బట్టి మనస్సే నీ మిత్రుడు లేదా శత్రువులా అవ్వచ్చు.

"నిన్ను నీవే తప్ప వేరెవరూ ఉద్దరించలేరు" అని చెప్పడమే భగవద్గీత ముఖ్య ఉద్దేశ్యం.

 

కడలేని భవసాగరము చొచ్చినతన్ను

వెడలించువారలు వేరీ
కడుబందములచేతఁ గట్టుపడినతన్ను
విడిపించువారలు వేరీ॥తానే॥ 

kaDalEni bhavasAgaramu chochchinatannu

veDaliMchuvAralu vErI
kaDubaMdamulachEta gaTTupaDinatannu
viDipiMchuvAralu vErI      tAnE

Word to Word meaning: కడలేని (kaDalEni) = అంతులేని, never ending; భవసాగరము (bhavasAgaramu) = this corporeal world;  చొచ్చిన (chochchina) = having entered; తన్ను (tanu) = తనను himself; వెడలించువారలు వేరీ (veDaliMchuvAralu vErI) = who will extricate; కడు (kaDu) = many; బందములచేతఁ (baMdamulachEta) = by the bonds;  గట్టుపడిన (gaTTupaDina) bound by తన్ను(tanu) = himself;  విడిపించువారలు వేరీ (viDipiMchuvAralu vErI) = who will liberate him?

Literal Meaning: who will extricate the man from this never ending corporeal world? Who will liberate the man bound by innumerable indelible bonds? (None)

సామాన్య అర్థం: అంతులేని దేహయాత్ర నుండి మనిషిని బయటకు లాగు వారెవరూ? అనేక బంధాలతో బంధింపబడి ఉన్న మానవుని విడిపించువారెవరూ? (ఎవరూ లేరు) 

కాఁగినినుము వంటికర్మపు తలమోపు -

వేఁగు దించేటివారు వేరీ
మూఁగిన మోహపుమూఁకలు తొడిఁబడ
వీఁగఁ దోలేటివారలు వేరీ॥తానే॥ 

kAgininumu vaMTikarmapu talamOpu -

vEgu diMchETivAru vErI
mUgina mOhapumUkalu toDibaDa
vIga dOlETivAralu vErI      tAnE

Word to Word meaning: కాఁగినినుము (kAgininumu) = hot iron; వంటి (vaMTi) = like కర్మపు (karmapu) = the bequeathed disposition (indian word Karma);  తలమోపు (talamOpu) = heavy load on that head; వేఁగు (vEgu) = quickly దించేటివారు వేరీ (diMchETivAru vErI) = who will relieve? మూఁగిన (mUgina) = surrounded మోహపుమూఁకలు (mOhapumUkalu) = flood of desires; తొడిఁబడ (toDibaDa) = perplexity; వీఁగఁ (vIga) = relieving; దోలేటివారలు (dOlETivAralu) = drive away, make it clear; వేరీ (vErI) = who?

Literal Meaning: for the man, bequeathed disposition (karma) is like red hot molten iron on the head.  Who will quickly relieve that heavy load?  Who will drive away the perplexity created by surrounding flood of desires? (None). 

సామాన్య అర్థంకర్మపు మోత కాలిన ఇనుమును నెత్తిన ఎత్తినట్లే.   అద్దానిని దించువారెవరూ? చుట్టూ మొహరించిన మోహపు దండు అనే గండము నుండి విడిపించువారెవరూ? (ఎవరూ లేరు) 

తిరువేంకటాచలాధిపునిఁ గొలువుమని

వెరపు చెప్పెడువారు వేరీ
పరివోని దురితకూపములఁ బడకుమని
వెరపు చెప్పెడివారు వేరీ॥తానే॥ 

tiruvEMkaTAchalAdhipuni goluvumani

verapu cheppeDuvAru vErI
parivOni duritakUpamula baDakumani
verapu cheppeDivAru vErI           tAnE

Word to Word meaning: తిరువేంకటాచలాధిపునిఁ (tiruvEMkaTAchalAdhipuni) the lord Venkateswara; గొలువుమని (goluvumani) = pray; వెరపు చెప్పెడువారు (verapu cheppeDuvAru) = person(s) cautioning against wrong acts; వేరీ (vErI) =who? పరివోని (parivOni) =never  ending;  దురితకూపములఁ (duritakUpamula)  = పాపకూపముల, swamps of sin;  బడకుమని (baDakumani) = do not slide into; వెరపు చెప్పెడువారు (verapu cheppeDivAru) = provide correctionary course వేరీ (vErI) = who?

Literal Meaning: Who will advise the man to pray the lord Venkateswara a get saved? Who will advise the man from blundering into sinful activities? (none)

సామాన్య అర్థం: శ్రీ వేంకటేశ్వరుని కొలువమని సరిదిద్ది చేప్పే వారెవరూ?  పాపకూపములలో చిక్కవద్దని వెఱపు చేప్పే వారెవరూ?   (ఎవరూ లేరు)

Comments:

1.  Overall this verse brings the fact that man has to cross over to the side all by himself. This verse also reminds us the words of Jiddu Krishnamurti as give below.

...In oneself lies the whole world, and if you know how to look and learn, then the door is there and the key is in your hand. Nobody on earth can give you either that key or the door to open, except yourself. (You are the world)

వ్యాఖ్యలు: కీర్తన జిడ్డు కృష్ణమూర్తి గారి మాటలను గుర్తుకు తెస్తుంది.

...ఎలా చూడాలో, ఎలా గ్రహించాలో తెలిస్తే నీలోనే ప్రపంచమంతా ఉంది. అక్కడ తాళము, చెవి కూడా నీతోనే ఉన్నాయి. నీవే తప్ప వేరెవరూ ద్వారము తెరువలేరు.

2.   The most poignant point made in this verse by Annamcharya is that none from corporeal world can save the man. Only GOD can. The vehicle man has to reach god is prayer.

అన్నింటినీ మించి అన్నమాచార్యులు చెప్పిన కీలకమైన వ్యాఖ్య మనిషిని దేవుడు తప్ప వేరెవరూ కాపాడలేరని. మనిషికి దేవుణ్ణి చేరేందుకు భక్తి తప్ప వేరే మార్గం లేదని ఎలుగెత్తి చాటాడు.

 

zadaz

 

 

Reference: Copper Leaf: 21-4, Volume: 1-128

 

 

 

 


1 comment:

  1. ఓం శ్రీసాయినాధాయనమః

    అందుకే 7.13 శ్లోకంలో భగవంతుని చేరుటకు కావలసిన భక్తిని పొందటానికి కూడా అర్హతను సంపాదించాలి అని అద్భుతముగా నేర్పించారు జగద్గురువు గీతాచార్యులు.

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...