ANNAMACHARYA
80. గాలినే పోయఁ గలకాలము
Introduction: In this gracefully
poignant verse, Annamacharya stressed urgency required to meditate as we have
very little time left at hand.
He said that we are connecting
the mind with worthless things and bemoan on those matters. First we get hooked
into wrong things. Then we think of body and associated innumerable troubles.
Lastly, it is our pride and arrogance that come in the way of realising the God.
By the time man sorts out all these issues, the precious time is lost.
ఉపోద్ఘాతము: ఈ మనోహరమైన కీర్తనలో అన్నమాచార్యులు మనిషి తన దగ్గర అతి స్వల్ప సమయమే మిగిలిందని తెలిసికొని దైవధ్యానం
చేయవలసిన అవసరాన్ని వత్తి చెప్పారు.
మనం మనస్సును పనికిరాని విషయాలతో అనుసంధానిస్తున్నామని ఆపై వాటి గురించి
విచారిస్తు సమయము వ్యర్ధం చేసుకుంటామని నొక్కిచెప్పారు. ముందుగా మనం అనవసరపు విషయాల్లో మునిగిపోతాం. తర్వాత మనం శరీరం గురించి, మరియు దానిలో కలిగే అసంఖ్యాకమైన సమస్యలలో
తగులుకుంటాం. చివరకు, దేవుడిని నమ్మేందుకు గర్వము, అహంకారము అడ్డువస్తాయి. ఇంతలోనే సమయాతీతమై పోతుంది.
కీర్తన:
గాలినే పోయఁ గలకాలము తాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదు ॥పల్లవి॥
అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళు గడుగుకొననే పట్టెఁ గలకాలము
ఒడలికి జీవుని కొడయఁడైనహరిఁ
దడవఁగా గొంతయుఁ బొద్దులేదు ॥గాలినే॥
కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టె కలుషదేహపుబాదఁ గలకాలము
తలపోసి తనపాలిదైవమైనహరి
దలఁచఁగా గొంతయుఁ బొద్దులేదు ॥గాలినే॥
శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టె గరిమలఁ గపటాలఁ గలకాలము
తిరువేంకటగిరి దేవుఁడైన హరి
దరిచేరాఁ గొంతయుఁ బొద్దు లేదు ॥గాలినే॥
|
gAlinE pOya galakAlamu tAlimiki goMtayu boddu lEdu ॥pallavi॥
aDusu choranE paTTe naTuniTu
gALLu gaDugukonanE paTTe galakAlamu
oDaliki jIvuni koDayaDainahari
daDavagA goMtayu boddulEdu ॥gAlinE॥
kalachi chiMdanE paTTe gaDava
niMchaga baTTe kalushadEhapubAda galakAlamu
talapOsi tanapAlidaivamainahari
dalachagA goMtayu boddulEdu ॥gAlinE॥
Sirasu muDuvabaTTe
chikkudiyyaga baTTe garimala gapaTAla galakAlamu
tiruvEMkaTagiri dEvuDaina hari
darichErA goMtayu boddu lEdu ॥gAlinE॥
|
Details and Explanations:
గాలినే పోయఁ గలకాలము
తాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదు ॥పల్లవి॥
gAlinE
pOya galakAlamu
tAlimiki
goMtayu boddu lEdu ॥pallavi॥
Word to Word meaning:
గాలినే పోయఁ (gAlinE pOya) = swept away by wind,
washed away by wind; గలకాలము = కలకాలము (galakAlamu)
=చిరకాలము, బహుకాలము, Almost all
the time; తాలిమికిఁ ( tAlimiki) = ఓర్పుకు,
for patience; గొంతయుఁ (goMtayu) = small, iota, tiny; బొద్దు లేదు (boddu
lEdu) = సమయం లేదు, no time at all;
Literal meaning: Almost all
the time washed by wind (meaning all my time has disappeared into thin air);
now, no time at all for patience.
Explanation: This is exactly the situation with most
of us. We do not understand how time slipped between our fingers.
భావము: చాలాకాలము ఆనవాళ్ళు లేకుండా ఏ
రకంగా గడచిపోయిందో (కదలి వెళ్ళిపోయిందో)! ఇప్పుడు ఓర్పుగా ఉండటానికి సమయమే లేదే.
వివరణము: మనలో చాలా మంది
పరిస్థితి ఇదే. మన వేళ్ల మధ్య నుంచి ఇసకలా కాలం ఎలా జారిపోతుందో మనం అర్థం
చేసుకునే లోపల గడవు తీరిపోతుంది.
అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళు
గడుగుకొననే పట్టెఁ గలకాలము
ఒడలికి జీవుని కొడయఁడైనహరిఁ
దడవఁగా గొంతయుఁ బొద్దులేదు ॥గాలినే॥
aDusu choranE paTTe naTuniTu gALLu
gaDugukonanE paTTe galakAlamu
oDaliki jIvuni koDayaDainahari
daDavagA goMtayu boddulEdu ॥gAlinE॥
Word to Word meaning: అడుసు (aDusu) = Mire, mud, clay, బురద; చొరనే (choranE) = enter; పట్టె
(paTTe) =
took; నటునిటుఁ (naTuniTu) = that side and this side;
గాళ్ళు (gALLu) = legs; గడుగుకొననే (gaDugukonanE) = to clean; పట్టెఁ
(paTTe) = took; గలకాలము
(galakAlamu)
= చిరకాలము, బహుకాలము, Almost all
the time; ఒడలికి జీవునికి (oDaliki
jIvuniki) = to the body and the soul; ఒడయఁడైనహరిఁ (oDayaDainahari)
= lord is Hari; దడవఁగా (daDavagA) =To
consider to ponder; గొంతయుఁ (goMtayu) = small, iota, tiny; బొద్దు లేదు (boddu lEdu) = సమయం లేదు, no time at all;
Literal meaning: It took lot of time
to enter mud. Then it took infinite time to clean legs. Now to ponder Lord of
my body and soul, there is not much time left.
Explanation:
aDusu choranE paTTe (అడుసు చొరనే పట్టె) is part of proverb Aḍusu tokkanēlā.. Kālu kaḍuganēlā?" (Literal meaning: why put leg in the mud and then spend time to clean the legs.). This is figuratively indicating that man get engaged in unnecessary activities.
Even though elders and the religions make substantial effort to put man on the path of truth, for some inexplicable reasons, man does not take this recreation. Rather, as one can observe, all over the world, man tries to postpone this till the very end.
daDavagA (దడవఁగా) actually meant “we cannot feel, cannot see, cannot smell and cannot hear (god); can only be known by indirect methods like probing (in the dark). We do not know what god is. If we recognise, it is not; it’s like catch 22 situation.
Annamayya is criticizing the attitude. Ravan is very learned. Voldemort of
Harry Potter knew more sorcery than anyone alive. Yet they dragged themselves
into the mire of action and reaction. They got trapped and died in the very
webs they created.
భావము: బురద గుంటల్లొ కాళ్ళు పెడతాము. అయ్యో బురద అంటుకుందని
కాళ్ళు కడుక్కుంటాం. ఇలా చాలా కాలం గడిచిపోతుంది. ఈ శరీరానికి, అందులోని జీవునికి స్వామియైన హరిని తలవటానికి కొంచెంసేపు కూడా సమయం లేదు.
వివరణము: అనుకోకుండా
ఏదైనా తప్పు జరిగితే, ఆ తప్పును అడుసు
తో పోల్చుకుంటే, ఆ తప్పు
చేయడం ఎందుకు మరి దాని పరిష్కారం కోసం వెతుకులాడటం ఎందుకు అనే అర్ధంలో "అడుసు
తొక్కనేలా.. కాలు కడుగనేలా?" వాడతాం.
ఇక్కడ అన్నమయ్య కూడా అదే అన్వయిస్తూ ప్రమాదకరమైన
ఊబి అనే లంపటాలలో ఇది తెలిసో, తెలియక దిగి కూరుకు
పోతాడు అన్నారు.
పెద్దలు మరియు మతాలు (మనిషిని సత్య మార్గంలో ఉంచడానికి)
గణనీయమైన ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కొన్ని వివరించలేని కారణాల
వల్ల, మనిషి ఈ వ్యాసంగాన్ని అలవరచుకోడు. బదులుగా, ప్రపంచవ్యాప్తంగా కూడా, మనిషి దీనిని చివరి వరకు
వాయిదా వేయడానికి ప్రయత్నిస్తాడు.
దడవఁగా అంటే మనం అనుభూతి చెందలేనిది, చూడలేనిది, వాసన ద్వారా తెలియలేనిది మరియు వినలేనిది యగు దైవమును పరోక్ష
పద్ధతుల ద్వారా మాత్రమే చీకటిలో తచ్చాడునట్లు వెదకవలెననే భావనలో చెప్పారు. దేవుడు
అంటే ఏమిటో మనకు తెలియదు. మనము గుర్తిస్తే, అది దైవము
కాదు; ఈ విచిత్ర పరిస్థితిని సూచిస్తూ దడవఁగా అని వ్రాశారు అన్నమయ్య.
అన్నమయ్య విమర్శించేది వైఖరిని మాత్రమే. రావణుడు, హిరణ్యకశిపుడు కూడా గొప్ప
విద్యావంతులే. అయినప్పటికీ వారు తమను తాము చర్య మరియు ప్రతిచర్యలనే బురదలోకి
దిగారు. వారు సృష్టించిన వలయాలలోనే వారే చిక్కుకుని చనిపోయారు.
కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టె
kalachi chiMdanE paTTe gaDava niMchaga baTTe
Word to Word meaning: కలఁచి (kalachi) =
క్షోభపెట్టు, worry; చిందనే (chiMdanE) = to spill, to suffer; పట్టెఁ (paTTe) =
took; గడవ నించగఁ (gaDava niMchaga) = it took its sweet
time; బట్టె (baTTe) = took; కలుషదేహపుబాదఁ (kalushadEhapubAda) = troubles due to
polluted body; గలకాలము (galakAlamu) =చిరకాలము, బహుకాలము, Almost all
the time; తలపోసి (talapOsi) = contemplate; తనపాలిదైవమైనహరి (tanapAli daivamaina hari) = Hari, god of thy self;
దలఁచఁగా (dalachagA) = to reflect; గొంతయుఁ( goMtayu) =
small, iota, tiny; బొద్దు లేదు (boddu
lEdu) = సమయం లేదు, no time at all;
Literal meaning: The pains of
this polluted body took away large part of my time; it took sweet time get out
of these. Now very little time left to contemplate God of my inner self.
Explanation: Just see how we spend our time. Large part
of our time goes in maintenance of this body. We fill it with favourite food,
liquor, coffee/tea, chocolates and ice creams from morning to night.
Obviously, in this given scenario,
rather than it assisting you, you need to assist your body more. This is what most
people are engaged in this world. For example, note the number advertisements
on this single issue.
భావము:
ఈ కలుషితమైన శరీరం యొక్క నొప్పులు నా సమయాన్ని చాలా వరకు కబళించేశాయి; వీటి నుండి బయటపడటానికి మరింత కాలాతీతమైంది. ఇప్పుడు నా అంతరంగంలోని దేవుడిని స్మరించడానికి
అతి తక్కువ సమయం మిగిలి ఉంది.
వివరణము: మన సమయాన్ని ఎలా గడుపుతున్నామో గుర్తించండి. మన సమయంలో అధిక
భాగం ఈ శరీర నిర్వహణలో ఉంటుంది. మనము ఉదయం నుండి రాత్రి వరకు ఇష్టమైన ఆహారం, మద్యం, కాఫీ/టీ,
చాక్లెట్లు మరియు ఐస్ క్రీములతో నింపుతాము.
సహజంగానే, ఈ నేపధ్యంలో,
ఇది మీకు సహాయం చేసే కంటే, మీరు మీ శరీరానికి
మరింత సహాయం చేయాలి. ఈ ప్రపంచంలో చాలా మంది దీనిలోనే నిమగ్నమై ఉన్నారు. ఉదాహరణకు,
ఒక్కసారి వార్తాపత్రికల్లో దీనికి సంబంధించిన ప్రకటనలు ఎన్ని
ఉన్నాయో గమనించండి.
శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టె
గరిమలఁ గపటాలఁ గలకాలము
తిరువేంకటగిరి దేవుఁడైన హరి
దరిచేరాఁ గొంతయుఁ బొద్దు లేదు ॥గాలినే॥
Sirasu muDuvabaTTe chikkudiyyaga baTTe
garimala gapaTAla galakAlamu
tiruvEMkaTagiri dEvuDaina hari
darichErA goMtayu boddu lEdu ॥gAlinE॥
Word to Word meaning: శిరసు (Sirasu) = head; ముడువఁబట్టె
(muDuvabaTTe) = tokk time to bend; చిక్కుదియ్యఁగఁ (chikkudiyyaga) to untangle; బట్టె (baTTe) =
took; గరిమలఁ (garimala)
= heaviness; గపటాలఁ (gapaTAla)
= Hypocrisy, insincerity, cunning; గలకాలము (galakAlamu) = చిరకాలము, బహుకాలము, Almost all
the time; తిరువేంకటగిరి (tiruvEMkaTagiri)
= the Mountain named as Triuvenklatagiri;
దేవుఁడైన (dEvuDaina)
= god; హరి (hari) = Hari; దరిచేరాఁ
(darichErA) = నెఱవేర్చు,
దగ్గఱచేరు, to succeed, to become
close; గొంతయుఁ goMtayu) = small, iota, tiny; బొద్దు లేదు (boddu
lEdu) = సమయం లేదు, no time at all;
Literal meaning: It took
enormous time to bend the head. It took inordinate time to untangle due to
treachery of (my) hypocrisy, insincerity.
Now hardly any time left to reach Hari, the Lord of the mountain called
Venkatagiri.
Explanation: Sirasu muDuvabaTTe (శిరసు
ముడువఁబట్టె) is signifying that it takes enormous
time for the person to convince himself that the actual doer in this world is
our dear lord. We, in our pride based on our limited knowledge, we feel we know
everything. Only when we confront the situations time and again, we get
convinced there are things we do not understand.
garimala gapaTAla galakAlamu (గరిమలఁ గపటాలఁ గలకాలము) is indicating great illusion created by time. It gives Man a sense hope, only to take it away in a flash.
After the Mahabharat war, Bhishma consoling Dhramaraja, says these words: "As the clouds in the sky are parted and then joined by the action of wind, in the same way the whole world is coming together and parting under the influence of time. It doesn’t always happen in a particular order. Time will do everything. Time is of the essence (of life). None can transgress the time."
భావము: తల వంచడానికే
అపారమైన సమయం పట్టింది. వంచన, నిజాయితీ
లేమి కారణాలతో చిక్కుముడి విప్పడనికే అధిక
సమయం పట్టింది. ఇక వెంకటగిరి ప్రభువును హరిని చేరుకోవడానికి సమయమే లేదు.
వివరణము: శిరసు ముడువఁబట్టె అన్న పదం ఈ ప్రపంచంలో
వాస్తవంగా సమస్త క్రియలకు కారణం దైవమే అని
తనను తాను ఒప్పించుకోవడానికి వ్యక్తికి అపారమైన సమయం పడుతుందని సూచిస్తుంది.
అహంకారంతో, పరిమిత జ్ఞానం ఆధారంగా, మనకు అన్నీ తెలుసు అని భావిస్తాం. పదేపదే విపత్కర పరిస్థితులను
ఎదుర్కొన్నప్పుడు మాత్రమే, మనకు అర్థం కాని విషయాలు ఉన్నాయని
గ్రహిస్తాము.
గరిమలఁ గపటాలఁ గలకాలము : సమయం మనిషిని మురిపించి చివరకు చెప్పకుండా తృటిలో తారుమారై పోతుందన్న విషయం సూచిస్తోంది. భాగవతంలో భీష్ముడు ధర్మరాజును ఓదార్చుతూ కాలమహిమ తెలుపుతూ ఇలా అంటాడు.
ఉ.
వాయువశంబులై యెగసి వారిధరంబులు
మింటఁ గూడుచుం
"ఆకాశములో
మేఘములు వాయువశములై కూడుకున్న, విడిపోవుచు వుండే విధంగా, ప్రపంచములోని సమస్తమూ కాల ప్రభావముచే కలియుచు విడిపోవుచు నుండును. ఎల్లప్పుడు
నొకేవిధముగా జరుగదు. కాలమే యన్నియు చేయుచుండును. కాలము అతి విచిత్రమైనది. ఎంతటి
వారికైననూ కాలము దాట శక్యము కాదు".
Copper Leaf: 3-1, Volume 1-14