Saturday 21 August 2021

78. సదా సకలము సంపదలే (sadA sakalamu saMpadalE)

ANNAMACHARYA

78. సదా సకలము సంపదలే 

Introduction: In this highly philosophical and inward looking verse Annamacharya said man should know what death is to live (properly).

In this beautifully worded song, he said, one should see the end of each avocation.  Often, these avocations, turnout to be the opposite of what they are meant for.

He implanted such complicated ideas in deceptively simple words to attract gentry.   You will find him, as ever, most uncompromising, yet challenges you with puzzlingly intricate choices and wants you to explore.

ఉపోద్ఘాతము:  ఈ అత్యంత తాత్వికమైన మరియు గంభీరమైన కీర్తనలో అన్నమాచార్యులు మనిషి సరిగ్గా జీవించడానికి మరణం అంటే ఏమిటో తెలుసుకోవాలి అన్నారు.  

అందమైన  పాటలో, అన్నమాచార్యులు, ప్రతి వ్యాసంగం ముగింపు  వరకు పరీక్షగా చూడాలి అన్నారు. తరచుగా అవి  ఉద్దేశించిన వాటికి విరుద్ధంగా మారురూపు ధరించడం విదితమే. ​

సామాన్యుల నుంచి పెద్దమనుషుల వరకు అందరినీ ఆకర్షించడానికి అతను  క్లిష్టమైన ఆలోచనలను తేలికగా  అనిపించే పదాలలో దాచి ఉంచాడు.  అన్నమాచార్యులు ఎప్పటిలాగే, రాజీలేని, కష్టమైన ఎంపికలతో మిమ్మల్ని సవాలు చేస్తారు మరియు మీరు జవాబులకై అన్వేషించాలని కోరుకుంటారు.

కీర్తన:

సదా సకలము సంపదలే

తుద దెలియఁగవలెఁ దొలఁగఁగవలయు ॥పల్లవి॥ 

అహర్నిశమును నాపదలే

సహించిన నవి సౌఖ్యములే
యిహమున నవి యిందఱికిని
మహిమ దెలియవలె మానఁగవలెను ॥సదా॥ 

దురంతము లివి దోషములే

పరంపర లివి బంధములు
విరసములౌ నరవిభవములౌ-
సిరులే మరులౌ చిరుసుఖ మవును            ॥సదా॥ 

గతి యలమేల్ మంగ నాంచారికిఁ

బతియగువేంకటపతిఁ దలఁచి
రతు లెఱుఁగగవలె రవణము వలెను
హిత మెఱుఁగఁగవలె నిదె తనకు ॥సదా॥

Details and Explanations: 

సదా సకలము సంపదలే

తుద దెలియఁగవలెఁ దొలఁగఁగవలయు ॥పల్లవి॥

 

sadA sakalamu saMpadalE

tuda deliyagavale dolagagavalayu           ॥pallavi॥ 

Word to Word meaningసదా (sadA) = always; సకలము (sakalamu) = everything; సంపదలే (saMpadalE) = wealth only; తుద (tuda) end, death;  దెలియఁగవలెఁ (deliyagavale) = should know;  దొలఁగఁగవలయు (dolagagavalayu) = should move aside;   

Literal meaning: Always and all things in this world are wealth only. You should understand death and move aside.  

Explanation: What do we get after acquiring wealth? We derive satisfaction.  Thus the mind cherishes satisfaction more than anything in this world.

Key expression to this verse is tuda deliyagavale: (తుద దెలియఁగవలెఁ). The definite reference point for life is Death. Do we understand death? Is the question raised by Annamcharya.

Death is the psychological reference of yesterday. If one does not have any yesterday (past), there is nothing else for him, but today (now). Therefore he is free to see the living present. We, ordinary people, grapple with baggage of yesterday. If yesterday is absent, we will not have the present knowledge (rather fear) of death.

Life, as already stated is not having specific path. We do not know how it moves. A man carrying the baggage of yesterday, obviously gets tired to follow life, as it moves from one point to the other. In such case, sadA sakalamu saMpadalE  (సదా సకలము సంపదలే) cannot happen.

Further, to move to new moment, one must leave the old satisfaction of yesterday. That is the death Annamayya is talking about. That is the reason for using the word “dolagagavalayu

Though, we claim to be in conscious state, yet Life manages keep us in darkness while it actually moves. This state is called ignorance or ‘tamas’. Annamayya used the word deliyagavale to signify that we must know. This is the crux of the issue.  

Thus the implied meaning of chorus is There is satisfaction in every moment of living; Leave the past memories with expertise, to follow ever changing course of life.

భావము:  ( ప్రపంచంలో) ఎల్లప్పుడూ మరియు ఎల్ల వస్తువులూ సంపదలే.. మరణాన్ని అర్థం చేసుకొని పక్కకు తప్పుకోవాలి అంతే!

వివరణము: సంపద కలిగిన తర్వాత  ఏమి పొందుతాము? సంతృప్తిని పొందుతాము. విధంగా మనస్సు ప్రపంచంలో అన్నింటికన్నా సంతృప్తికై ఎదురు చూస్తుంది. జీవించడంలో ప్రతి క్షణం సంతృప్తి ఉంటుందని ఈ పల్లవి మొదటి భాగం తెలుపుతోంది.

“తుద దెలియఁగవలెఁ”తో ఏమి చెప్పదలచుకున్నారో? ఇంకా ఈ పల్లవి ఎక్కడో మధ్య నుంచి ప్రారంభం అయినట్లు కనిపిస్తుంది. ఇంకోసారి ఆలోచించండి. జీవితానికి ఖచ్చితమైన సంకేతం మరణమే. మరణమంటే మనకు తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు ఆన్నమయ్య​.

మరణం అనేది తిరుగులేని నిన్నను సూచించే మానసిక సంఙ్ఞ. అందుకే మనస్సులో కనక​ నిన్న లేకపోతే ఈ రోజుని దర్శించడానికి స్వేచ్ఛ ఉంటుంది. మనమందరము నిన్నటి సామానులతో తబ్బిబ్బు అవుతున్నాము. నిన్న లేనట్లయితే, మరణం గురించి మనకు ప్రస్తుత ప్రజ్ఞ (నిజం చెప్పాలంటే ఆపోహ / భయము​) ఉండదు.

ఇప్పటికే చెప్పినట్లుగా జీవితానికి నిర్దిష్ట మార్గం లేదు. అది ఎలా కదులుతుందో మనకు తెలియదు. నిన్నటి బరువును మోస్తున్న వ్యక్తి జీవితం ఒక  క్షణం నుంచి మరో దానికి కదులుతూ ఉంటే అనుసరించ లేక అలసిపోతాడు. అప్పుడు సదా సకలము సంపదలేనిజమవ్వదు కదా!

ఇంకా, కొత్త క్షణానికి వెళ్లడానికి ఈ పాతదై పోయిన క్రిందటి క్షణం చేకూర్చిన (నిన్నటి​) సంతృప్తిని వదలివేయాలని అన్నమాచార్యులు దొలఁగఁగవలయుఅన్న పదం వాడారు.

జాగ్రదావస్త (మన ప్రస్తుత పరిస్థితి) నుండి  మరుగు పరిచి జీవితం ముందుకెడుతూ వుంటుంది.  ఐతే  మనిషి తన పాత భావనలలోనే ఉండి వెనకబడి పోతాడన్నారు అన్నమాచార్యులు. అందుకే దెలియఁగవలెఁ అన్న పదం వాడారు.

ఈ పల్లవి  అన్వయార్ధము: జీవించడంలో ప్రతి క్షణం సంతృప్తి ఉంటుంది; క్షణక్షణం మారిపోతున్న  జీవన గమనమును అనుసరించుటకు నిపుణతతో గత స్మృతులు వదలుము.”  

అహర్నిశమును నాపదలే

సహించిన నవి సౌఖ్యములే
యిహమున నవి యిందఱికిని
మహిమ దెలియవలె మానఁగవలెను ॥సదా॥ 

aharniSamunu nApadalE

sahiMchina navi saukhyamulE
yihamuna navi yiMda~rikini
mahima deliyavale mAnagavalenu ॥sadA॥ 

Word to Word meaning: అహర్నిశమును (aharniSamunu) = రాత్రింబవళ్ళు, day and night;  నాపదలే (nApadalE) Only troubles, adversities; సహించినను (sahiMchinanu)  = bear, endure; అవి (avi) = they, those; సౌఖ్యములే (saukhyamulE) = in fact comforts; యిహమునను (yihamuna) = this world or life, the present world; అవి (avi)  = they, those; యిందఱికిని  (yiMda~rikini) = for all these people; మహిమ (mahima) = virtue; greatness, glory, దెలియవలె (deliyavale) = should know; మానఁగవలెను (mAnagavalenu) = should refrain, abstain, or desist from.

Literal meaning

What are the adversities “ApadalE”( ఆపదలే) Annamayya is talking about? Are they likely to be “My shoes have not been polished; my lunch has not been arranged; I need to work harder to get Mercedes car next year; My boss does not recognise my talent; etc? Of course not.

 

He is talking of avocations that take us away from the intended pursuit of “tuda deliyagavale dolagagavalayu”. In our anxiety for safe tomorrow, we bury all our understanding and scamper for safety. We need to take the decision on this deviation of path? Not for quibbling on tiny things like lunch

 

In normal course, we take for granted that these words are to be remembered to be quoted to demonstrate that we had great heritage and to be proud to be part of that great culture. Beyond that they carry no weightage. This attitude is the trouble Annamayaa is stating.

 

When we actually, take up these words seriously, you understand there are challenges in every step. When one actually stand to these words, he will understand what trivial things he was vying for? 

Do we understand what is virtue? Refer to keertanapApamu chEruva prANuniki(పాపము చేరువ ప్రాణునికి) where Annamacharya talked about avoiding the wrong acts. Alas! There are no defined virtuous acts! That is the reason he used the word mAnagavalenu (మానఁగవలెను = refrain such activity). 

Thus Annamacharya cautioned us to be vigilant on deviation from the path and refraining from attempting virtuous acts

 

భావముపొద్దస్తమాను సమస్త జీవులకు ఇబ్బందులు తప్పవు.  ఈ కష్టాలను భరించినప్పుడే, సౌకర్యం అంటే ఏమిటో తెలుసుకుంటాం. పుణ్యమనగానేమో అర్థం చేసుకోవాలి మరియు (పాపము) మానుకోవాలి.

వివరణము: అన్నమయ్య పేర్కొన్న ఆపదలు ఏమిటో? అన్నమయ్య మాట్లాడుతున్న కష్టాలు ఏమిటి? వారు నా బూట్లు పాలిష్ చేయబడలేదే? ఆఫీసుకు ఎలా వెడతానో? నా భోజనం ఏర్పాటు చేయబడలేదే; వచ్చే ఏడాది మెర్సిడెస్ కారు పొందడానికి నేను మరింత కష్టపడాలే; నా యజమాని నా ప్రతిభను గుర్తించటం లేదే; మొదలైనవా? అస్సలు కానే కాదు.

నిత్యజీవితంలో, మనకు గొప్ప వారసత్వం ఉందని నిరూపించడానికి మరియు గొప్ప సంస్కృతిలో భాగమైనందుకు గర్వపడటానికి పదాలు, కీర్తనలు, పద్యాలు గుర్తుపెట్టుకుంటాం. గొప్పగా ఎలుగెత్తి చాటుతాం. అంతకు మించి వాటికి ఎలాంటి విలువా ఇవ్వం. వైఖరియే అన్నమయ్య చెప్పిన సమస్య. 

అతను "తుద దెలియఁగవలెఁ దొలఁగఁగవలయు"ననే ఉద్దేశించిన పథము నుండి మనలను దూరం చేసే వ్యవహారముల గురించి మాట్లాడుతున్నాడు. సురక్షితమైన రేపటి కోసం ఆందోళనలో, మనము  అవగాహనను పాతిపెట్టి భద్రత కోసం వెంపర్లాడతాం. ఎంచుకున్న మార్గాన్ని తుంగలో త్రొక్కు ధోరణిని ఆపద క్రింద వర్ణించాడు అన్నమయ్య. 

ఇప్పుడు చెప్పండి, అన్నమయ్య పేర్కొన్న ఆపదలు నిజమైనవా? కేవలం కల్పితాలామనము నిజంగా, పదాలను తీవ్రంగా పరిగణించినప్పుడు, ప్రతి దశలో సవాళ్లు ఉన్నాయని అర్థం చేసుకుంటాం. వీటికై జరుపు సంఘర్షణలను ఙ్ఞప్తికి  తెచ్చుకున్నప్పుడు, మనిషి ఎంత చిన్న విషయాల కోసం పోటీ పడుతున్నాడో అర్థమవుతుంది? 

పాపము చేరువ ప్రాణునికి / యేపునఁ బుణ్యంబేదో కాని?” లోకములో ఆచరించుటకు పుణ్యాలు ఏమీ లేవనీ, పాపము చేయకుండా ఉండటమే మనిషి  చేయగలిగిన  కార్యమని చెప్పిరి. అందుకే చివరలో మానఁగవలెను అన్న పదం చేర్చిరి.

 

దురంతము లివి దోషములే

పరంపర లివి బంధములు

విరసములౌ నరవిభవములౌ-

సిరులే మరులౌ చిరసుఖ మవును ॥సదా॥

 

duraMtamu livi dOshamulE

paraMpara livi baMdhamulu

virasamulau naravibhavamulau-

sirulE marulau chirasukha mavunusadA 

Word to Word meaning: దురంతములు (duraMtamulu) = endless, boundless; ఇవి (ivi) = these; దోషములే (dOshamulE) = faults, errors, mistakes; పరంపరలు (paraMparalu) = series, succession, order, ఇవి (ivi) = these;  బంధములు (baMdhamulu)  = bondages; విరసములౌ (virasamulau) = become discordant, become  unpleasant; నరవిభవములౌ(naravibhavamulau) = what man considers as wealth;  సిరులే (sirulE)  = wealth; మరులౌ (marulau) = evil spirits;  చిరసుఖ మవును (chirasukha mavunu) = comfort is permanent. 

Literal meaning: These faults, errors, mistakes are boundless. These successions of bondages will turn discordant. What man considers as wealth will metamorphose into be evil. When you actually know this, comfort is permanent.

Explanation: the best example of a utility turning out to be evil is mobile phone. It started as a utility. Then it became a necessity. Now it turns out to be a scourge; and yet impossible to discard.

Its very easy to understand the example of Mobile. We get used to our mistakes. In most cases, we are, unable to differentiate good from bad. This you can see yourself. Take example of honking. We do it indiscriminately ( in India). Where our sensitivity has gone?

When we actually see that all are equal, can we dare to honk? It is as simple as that. We will avoid use of horn. We get peace. Instead, you search for peace, it will evade you.

భావముహద్దులే లేనివి లోపాలు, తప్పులు. బంధాలు క్రమక్రమంగా ప్రతికూలముగా మారుతాయి. మనిషి సంపదగా భావించేది దుష్టశక్తులుగా రూపాంతరము చెందుతుంది. మీకు ఇది నిజంగా తెలిసినప్పుడు సుఖము శాశ్వతం.

వివరణము: ఒక ఉపయోగకరమైన వస్తువు నుండి చెడుగా మారడానికి ఉత్తమ ఉదాహరణ మొబైల్ ఫోన్. దీని ప్రయాణం ప్రయోజనకారిగా ప్రారంభమైంది. తర్వాత అది ఒక అవసరంగా మారింది. ఇప్పుడు అదే తలనొప్పిగా మారింది; ఐనప్పటికీ దాన్ని విస్మరించడం అసాధ్యమే.

మొబైల్ ఉదాహరణను అర్థం చేసుకోవడం చాలా సులభం. మనము  తప్పులకు అలవాటు పడతాము. చాలా సందర్భాలలో, మనం చెడు నుండి మంచిని వేరు చేయలేకపోతాము. ఇది  మీరే స్వయంగా గమనించవచ్చు. మనము విచక్షణారహితంగా  హారన్  వాడతాము. మన సున్నితత్వం ఎక్కడికి పోయిందో?

వాస్తవానికి అందరూ సమానమే అని మనస్సులో తలచినప్పుడు, ఇష్టంవచ్చినట్లు హారన్  కొట్టే ధైర్యము చేయగలమా? అప్పుడు తగిన కారణం లేనిదే హారన్ కొట్టము. మనస్సుకు శాంతి అదే లభిస్తుంది. శాంతి కోసం చూస్తే మాత్రం లభించదు.

 

గతి యలమేల్ మంగ నాంచారికిఁ

బతియగువేంకటపతిఁ దలఁచి

రతు లెఱుఁగగవలె రవణము వలెను

హిత మెఱుఁగఁగవలె నిదె తనకు ॥సదా॥

 

gati yalamEl^ maMga nAMchAriki
batiyaguvEMkaTapati dalachi
ratu le~rugagavale ravaNamu valenu
hita me~rugagavale nide tanaku
sadA

 

Word to Word meaning గతి (gati)  = means, way; యలమేల్ మంగ నాంచారికిఁ (yalamEl^ maMga nAMchAriki)  = Alameelumanga Namchaari; బతియగు (batiyagu) = husband of;  వేంకటపతిఁ (vEMkaTapati) = Lord Venkateswara; దలఁచి (dalachi) = taking your name; లెఱుఁగగవలె (ratu le~rugagavale) = should understand desire and passion;  రవణము వలెను (ravaNamu valenu)  = like an ornament; హిత మెఱుఁగఁగవలె  (hita me~rugagavale) = should know what is good for you;  నిదె (ide) = this; తనకు (tanaku) = self;

Literal meaning: Means and way (to life) is Lord Venkateswara who is the husband of Alamelumanga Namchaari. Take his name. Should keep the desire and passion as ornaments and still should know what is good for the self.

Explanation: the words “ravaNamu valenu” (రవణము వలెను) are indicating that desire and passion are to be kept like ornaments and still not be carried away by these. That is the reason he immediately added  “hita me~rugagavale” (హిత మెఱుఁగఁగవలె).

Let me take out a para from Years of fulfilment (biography of Jiddu by Lutyens) “I have never known anyone so completely detached from his body as Krishnamurti is. He looks after it because it has to serve him for his work. He cares for it as he does a motor-car. It is unthinkable that he would go out in a car of his own that had not been washed and polished.”

భావము: జీవితానికి అర్థం మరియు మార్గం అలమేలుమంగ నాంచారి భర్త అయిన వేంకటేశ్వరుడే. అతనిని పదేపదే తలచుకోండి. కోరిక మరియు అభిరుచులను బాహ్య ఆభరణాలుగానే ఉంచాలి మరియు స్వీయానికి ఏది మంచిదో తెలియాలి.

వివరణము: అనురాగము మరియు మమతలు ఆభరణాల వలె పై  పైనే ధరించవలెనని (హృదయము లోపల తీసుకొనరాదని) ఐప్పటికీ వాటిప్రభావానికి లోనవ్వరాదని సూచిస్తుంది. అందుకే వెంటనే (హిత మెఱుఁగఁగవలె) అని అన్నారు

ఇది బాగా అర్ధం చేసుకోడానికి ఈ పేరా చదవండి. “కృష్ణమూర్తి వలె అతని శరీరం నుండి పూర్తిగా విడివడియున్న వ్యక్తిని నేను ఎన్నడూ కలుసుకోలేదు. అతను శరీరంపై తన పని కోసం అతనికి సేవ చేయడానికొరకు ఒక మోటార్-కారు పట్ల చూపే శ్రద్ధ వహిస్తాడు. అలాగని అతను కడిగి పాలిష్ చేయని తన సొంత కారులో బయటకు వెళ్తాడని ఊహించలేం.” (లూటెన్స్ వ్రాసిన "యియర్స్ ఆఫ్ ఫుల్'ఫిల్మెంట్" అనే పుస్తకం నుండి)

 

Copper Leaf: 2-1  Volume 1-7

 

 

 


3 comments:

  1. చాలా బాగుంది.

    ReplyDelete
  2. Very nice. Very deep meaning

    ReplyDelete
  3. జీవితం అనుక్షణం సంతృప్తి నిచ్చే సంపదయే.జీవితానికి చరమ సంకేతం మరణం.అనుక్షణం వికారాములను పొందుచున్న జీవితప్రయాణంలో గతస్మృతులను, వాటి వలన పొందే సంతృప్తిని ప్రజ్ఞతో వదలిపెట్టినచో మరణము గురించిన భయాందోళనలిక ఉండవు.
    జీవితంలో కష్టనష్టములను ఎదుర్కొని, భరించినప్పుడే సుఖమంటే ఏమిటో, దాని విలువ ఏమిటో మనకు అవగతమవుతుంది.పాపకర్మలు చేయకపోవటమే పుణ్యకార్యం.

    అనంతము లైన పాపకర్మలే బంధానికి కారణములు.సంపదలు సుఖమునిచ్చేవనేది భ్రమ మాత్రమే. శాశ్వతసుఖమునిచ్చేవని నీవు భావించే సంపదలే చివరకు దుఃఖాన్నిచ్చేవిగా మార్పు చెంది నీకు ఆశాంతినిస్తాయి.

    అందుకే, ప్రాపంచిక సంపదలన్నీ దుఃఖభాజనములే యని యెఱింగి,వాటిని వదలి శాశ్వతమైన ఆనందాన్నిచ్చే జీవిత పరమార్థమైన మంగపతి శ్రీనివాసుని చరణముల నాశ్రయించి, భక్తితో ధ్యానించి,కొలిచి తరించండని అన్నమయ్య ఈ కీర్తనలో బోధించుచున్నాడు.🙏

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...