ANNAMACHARYA
73. మాపులే మరణములు రేపులే పుట్టువులు
Introduction: In this great song, Annamacharya
said that time keeps moving indefinitely. As the time moves, it leaves a series of deaths and at the same time creates new life. Nothing is permanent. Therefore it is better for the
man to seek refuge in the eternal Paramatman (Vishnu).
Annamacharya explained
in many ways that man has nothing to do in this world; and that there is no way
to attain salvation except by simply, let
go of the reins he has taken in his hand unwittingly.
ఉపోద్ఘాతము: ఇంత
గొప్ప అని చెప్పుటకు అలవికాని ఈ కీర్తనలో, అన్నమాచార్యులు కాలము నిరవధికంగా కదులుతూ
ఉంటుందని అన్నారు. సమయం కదులుతున్న కొద్దీ,
ఇది మరణాల బాటను పరుస్తూ; మళ్ళీ అదే సమయంలో కొత్త జీవితాన్ని సృష్టిస్తుంది. మానవుడు
సర్వమూ క్షణికములే అని గ్రహించి శాశ్వతమగు పరమాత్మను (విష్ణువును) శరణని వేడడమే మంచిది అన్నారు.
మనిషికి
ఈ ప్రపంచంలో చేయవలసిన దేమీలేదని, కేవలం, తెలియకుండానే చేతిలోకి తీసుకున్న పగ్గాలను వదలడమనే ఒకే ఒక చర్య తప్ప మోక్ష ప్రాప్తికి మార్గంలేదని అనేక విధాలుగా వివరించారు.
కీర్తన:
మాపులే మరణములు రేపులే పుట్టువులు
చాలునంటే యించుకంతే చాలును జన్మమునకు
పాఱకున్న పశుబాలై బడలదు మనసు
సేయకున్నఁ గర్మము శ్రీపతిసేవనే వుండు
Details and Explanations:
మాపులే మరణములు రేపులే పుట్టువులు
mApulE maraNamulu rEpulE puTTuvulu
Word to Word meaning: మాపులే (mApulE) = evenings/nights; మరణములు (maraNamulu)= deaths; రేపులే (rEpulE) = tomorrows; పుట్టువులు (puTTuvulu) = births; చాపలాలు (chApalAlu) = wavering, fickleness; మాని (mAni) = stop, abstain; విష్ణు (vishNu) = lord Vishu; శరణను (SaraNanu) = submit; మనసా (manasA) = O mind.
Literal meaning: Evenings are deaths. Tomorrows are births. Stop
wavering and submit to lord Vishnu.
Explanation: by stating mApulE (మాపులే) he meant the very evening and the very night as death, the end. Also take the similar meaning for rEpulE
(రేపులే). Thus he said that there is death of a moment and at the same time
birth of another moment. As the time moves, it leaves a trail of death and
creates new life.
Therefore, the true meaning of this
chorus is “there is no permanence for
any item, things and living organism. Setting aside all doubts, it is better to
bow to the permanent one (Lord VISHNU)” and get saved.
Thus the nature of time, being afresh
every moment is revealed. We have to travel just as fast to know that time. The
message is that unless we abandon the facts based on yesterday (death) the novelty
of tomorrow will not be divulged is the message
భావము: పుట్టుకలను రేపులతో (అంటే ఉషోదయాలతో), మరణాల్ని మాపులతో
(అంటే సాయంసంధ్యలతో) సరిసమానము అనుకుంటూ చంచల
స్వభావాల్ని వదిలి భగవంతునికి హృదయములో శరణాగతి చెందండి
వివరణము: మాపులేతో ఈ సాయంత్రమే (అంటే ఇప్పుడే) అని సూచిస్తూ మాపులే మరణములు = మరణము ఇప్పుడే, అలాగే రేపులే పుట్టువులు = పుట్టుక తిరిగి మరుక్షణమే అని తీసుకొనవలె.
అందువల్ల, ఈ పల్లవి యొక్క నిజమైన అర్ధం “ఏ వస్తువులూ, పదార్ధాలూ మరియు జీవులూ శాశ్వతత్వం
కాదు. అన్ని సందేహాలను పక్కనపెట్టి,
హృదయములోనున్న శాశ్వతమగు పరమాత్మను
(విష్ణువును)
శరణని వేడడమే మంచిది."
ఈ పల్లవిలో సమయం యొక్క స్వభావం, ప్రతి క్షణం తాజాగా ఉండటం అని తెలుస్తుంది. ఆ సమయాన్ని తెలియుటకు మనం అంతే వేగంగా ప్రయాణించాలి. మనము నిన్నని (మరణం) ఆధారంగా చేసుకున్న వాస్తవాలను వదలివైచిన కాని, రేపటిలోని నవీనత వెల్లడి కాదని సందేశం.
చాలునంటే యించుకంతే చాలును జన్మమునకు
chAlunaMTE yiMchukaMtE chAlunu janmamunaku
Word to Word meaning: చాలునంటే
(chAlunaMTE) = say enough; యించుకంతే (yiMchukaMtE) = then even iota of
quantity; చాలును (chAlunu) = enough; జన్మమునకు (janmamunaku) = to live; చాలకున్న
(chAlakunna) = if not satisfied; లోకమెల్లఁ
(lOkamella) = entire world; జాలదు (jAladu) = not enough; వీలిన (vIlina) = = వదలుగా = స్వేచ్ఛగా వదలిన,
open ended; యీయాసా (yIyAsA) =
this desire; వెర్రివాని (chAlunaMTE) =
mad man, lunatic; చేతిరాయి (chEtirAyi) =
stone in the hand; చాలు (chAlu) = Enough, that will do, stop! నింక (niMka) = here after; హరి (hari) = Lord Hari; నిట్టె (niTTe) = easily, quickly; శరణను (SaraNanu) = జీవుఁడా (jIvuDA) = O man!
Literal meaning: When you are satisfied within yourself, even a little is enough to live.
If not, the whole world is not enough. Licentious desires are like a stone(s)
in the hand of a madman. Enough is enough. Stop. Please turn to God Hari
Explanation: What is driving us to live – most often
a better tomorrow? Desire for better tomorrow is probably just one. But when we
analyse our actions carefully, we may know whether we are controlling our
desires? OR desires dictating our actions need to be understood with clarity (to
ourselves).
Everyone is working hard that extra bit
to gain few more dollars. This is causing the competition. In this globalised
world you can feel that mad race more pronouncedly. Being humans, privately, we
may subscribe to less competitive living, but collective action of desire is actually
doing the opposite. This is what Annamacharya described in this stanza.
Annamayya stated that desire (and the
competition that springs from it) is like a stone in the hand of a madman. He
opined that it could lead to serious consequences.
భావము: మీరు మీలోనే సంతృప్తి చెందినప్పుడు, జీవించడానికి కొంచెమైనా
కూడా సరిపోతుంది. అలా కాకపోతే, ప్రపంచం మొత్తం కూడా సరిపోదు. విచ్చలవిడి కోరిక పిచ్చివాని చేతిలో రాయి లాంటిది.
ఇంక చాలు. ఆపండి. దయచేసి దేవుడైన హరిని ఆశ్రయించండి.
వివరణము: మనల్ని జీవించడానికి ఏది ప్రేరేపిస్తుంది
- చాలా తరచుగా మంచి భవిష్యత్తు? మంచి భవిష్యత్తు న్యాయమైనదే కావచ్చు. కానీ మన చర్యలను
జాగ్రత్తగా విశ్లేషించినప్పుడు, కోరికలను మనం నియంత్రిస్తున్నామా? లేదా మన చర్యలను
నిర్దేశించేవి కోరికలా? (మనకు మనమే స్పష్టతతో అర్థం చేసుకోవాలి).
మన
కోరికలను తీర్చుకోవడానికి, మనలో ప్రతి ఒక్కరూ మరికోంత ధనము సంపాదించడానికి అదనంగా పని చేస్తున్నారు. ఇదే
పరస్పరము మించవలెనను అభిలాష కలిగిస్తోంది. ఈ ప్రపంచీకరణ చెందిన విశ్వమనే గ్రామంలో మీరు ఆ వెఱ్ఱెత్తిన
పోటీ సంకేతాలను మరింత స్పష్టంగా అనుభూతి చెందగలరు. మనుషులుగా, వ్యక్తిగతంగా మనం తక్కువ
స్పర్ధామయ జీవనానికి మొగ్గు చూపించవచ్చు, కానీ సమిష్టిగా నిజానికి జరిగేది దానికి విరుద్ధంగా
ఉంటుంది.
దీనిని సూచించుటకే అన్నమయ్య కోరిక (& దాని
నుండి ఉత్పన్నమైన పోటీని) పిచ్చివాని చేతిలో రాయి లాంటిది. అది ఎంతకైనా దారితీయవచ్చని
అన్నమయ్య అభిప్రాయము.
పాఱకున్న పశుబాలై బడలదు మనసు
pA~rakunna paSubAlai baDaladu manasu
Word to Word meaning: పాఱకున్న
(pA~rakunna) = కదలకున్న, not moving; పశు (paSu) = {ప్రకృతి: పశు వికృతి: పసి} = లేఁత, tender; బాలై (bAlai) = బాల+ఐ, childlike; బడలదు (baDaladu) = do not tire, do not get exhausted (=remains
fresh); మనసు (manasu) = the mind; పాఱితే (pA~ritE) = if starts moving; జవ్వనమునఁ (javvanamuna) =
in youth; బట్టరాదు (baTTarAdu) = no
possible to stop, మీఱిన (mI~rina) = to increase, to exceed; నీరుకొద్ది
(nIrukoddi) = extent of water; దామెర
(dAmera) = తామర పువ్వులు, Lotus flowers; యింతె (yiMte) = similar to; యెంచి చూడ (yeMchi
chUDa) = by proper inspection; జాఱవిడిచి (jA~raviDichi) = పట్టు
నుంచి తప్పించి, loosen from the grip; దేవుని
(dEvuni) = god; శరణను (SaraNanu) = say,
I submitted; జీవుఁడా (jIvuDA) = O man!
Literal meaning and
Explanation: If our thoughts do not move, the
mind does not get tired like a baby (and continues to play), at all. If our
thoughts run, there will be no more reins - like youthful pride! Lilies bloom
depending on the water. More the water, the more are the Lotus flowers. If
you think carefully, the thoughts are the same. It is better to let the mind
escape from your grasp!
paSubAlai (పశుబాలై
= పసిపాపలా) is used to indicate innocence (not
ignorance) bereft of anticipation is
essential to know the god. We fill our mind with facts, figures and what not?
Do we really need them?
With the advent of youth, we feel we can control
everything and go berserk is indicated by wording పాఱితే జవ్వనమునఁ బట్టరాదు. {And also refer to verse గుఱ్ఱాలఁ గట్టని
(gu~r~rAla gaTTani) describing the assumed (mistaken) adventurous journey taken by
man.}
జాఱవిడిచి
(jA~raviDichi) = loosen from the
grip, is used to designate that, it is the man who is holding the mind, not
outside power. While we pray god seeking him to liberate us, little we realise
that it is for us to do the act. There is no end to the depth of songs by
Annamacharya,
భావము: మన ఆలోచనలు అటూఇటూ కదలాడకుంటే మనసు పసిపాప వలె అలయక అడుతూనే
(క్రియాశీలకంగా) ఉంటుంది. మన ఆలోచనలు పరుగెడితే ఇంక పట్ట పగ్గాలుండవు-- యౌవనగర్వంవలె!
నీరుని బట్టి తామరపూలు వికసిస్తాయి. ఎంత నీరు
ఎక్కువైతే అన్ని ఎక్కువ తామర పూలు. జాగ్రత్తగా అలోచించి చూస్తే ఆలోచనలు కూడా అంతే.
నీ పట్టు నుంచి మనసును తప్పించి హరినివేడితే మేలు!
వివరణము: పశుబాలై = పసిపాపలాంటి అమాయకత్వాన్ని (అజ్ఞానం కాదు) ఇంచుకంత
కూడా కౌతూహలము లేని (అనుకున్నది జరుగుననే ఆకాంక్ష లేని) స్థితి సూచించడానికి
ఉపయోగించారు. మనము మనస్సును వాస్తవాలతో, గణాంకాలతో, ఇంకా వేట్లతో నింపుతామో కూడా తెలియదు. నిజంగా అవి మనకు అవసరమా?
‘పాఱితే జవ్వనమునఁ బట్టరాదు’తో యౌవనగర్వంతో, మనము అన్నింటినీ నియంత్రించగలమనే అహంకారముతో చుక్కానీలేని నావలా పయనిస్తామని అన్నారు. మిడిమిడి జ్ఞానముతో మనిషి (తప్పుగా) చేపట్టిన సాహసోపేతమైన ప్రయాణాన్ని గురించిన వివరణనూ “
గుఱ్ఱాలఁ గట్టని” అనే కీర్తనలోను చూడండి
‘జాఱవిడిచి’తో మనస్సును పట్టి ఉంచినది బయటి శక్తి కాదు, మనమేనని చెప్పారు అన్నమయ్య. ఐతే మనస్సును పట్టి ఉంచినది తనే అని మనిషి గ్రహించక విచిత్రంగా విడిపించమని దేవుణ్ణి కోరుతాడు. అన్నమాచార్య పాటలలొ అర్ధాల లోతులు త్రవ్వినకొలదీ కనబడతాయి.
సేయకున్నఁ గర్మము శ్రీపతిసేవనే వుండు
sEyakunna garmamu SrIpatisEvanE vuMDu
Word to Word meaning: సేయకున్నఁ (sEyakunna) = if not attempted; గర్మము (garmamu) = work to be performed; శ్రీపతిసేవనే
(SrIpatisEvanE) = remains under control of god; వుండు
(vuMDu) = thus exists; సేయఁబోతేఁ (sEyabOtE) = if attempted; గాలమెల్లా (gAlamellA) = complete time; సేనాసేన (sEnAsEna) = చాలాచాలా, అధికము (జోహారు వంటి పదము). వోయయ్య (vOyayya) = ఓ+అయ్య = O man! యిది (yidi) = these; యెల్లా (yellA) = all; వుమినాఁకే (vuminAkE) = after eschewing; చవుతాలు (chavutAlu) = honours; చాయల (chAyala) = వెలుగుల, light; శ్రీవేంకటేశు (SrIvEMkaTESu) = Lord Venkateswara; శరణను (SaraNanu) = submit or take refuge; జీవుఁడా (jIvuDA) = O Man.
Literal meaning: If one does not attempt work to be
performed, it remains under the control of God. If one attempts, there is no
end to work. O human! Honours are only after you eschew all these. O man! Submit
to Lord Venkateswara and take his refuge.
Explanation:. సేయకున్నఁ గర్మము శ్రీపతిసేవనే వుండు sEyakunna garmamu SrIpatisEvanE vuMDu Needs explanation: no one in this world can escape from performing his duties. This stated in Bhagavad-Gita 3-5 न हि कश्चित्क्षणमपि (na hi kaśhchit kṣhaṇam api). But after submission to god one does not have any work (karma) to be performed as per below Bhagavad-Gita Shloka.
భావము: ఎవరైనా పని (కర్మము) చేయడానికి ప్రయత్నించకపోతే, అది దేవుని నియంత్రణలోనే ఉంటుంది. ఒకవేళ ప్రయత్నిస్తే, ఆ పనికి (కర్మమునకు) ముగింపు ఉండదు. ఓ మానవా! వీటన్నింటిని విడిచిన తర్వాతే గౌరవాలు. ఓ జీవుఁడా! మనస్సు వేంకటేశ్వరునికి సమర్పించి అతని ఆశ్రయం పొందు.
వివరణము: ‘సేయకున్నఁ గర్మము శ్రీపతిసేవనే వుండు’ మీద కొంత వివరణ అవసరం ఈ ప్రపంచంలో ఎవరూ తన విధులను నిర్వహించకుండా తప్పించుకోలేరు. అని భగవద్గీతలో ‘న హి కశ్చిత్ క్షణమపి’ (3-5) చెప్పబడింది. కానీ మనిషి అన్నీ వదలి, దైవమునకే ఆత్మ సమర్పణ చేసిన తర్వాత, భగవద్గీతలో చెప్పిన ప్రకారం యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః / ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే (3-17) (ఆత్మానుభవపూర్ణమైన జీవితముతో ఆత్మ (సర్వ వ్యాప్త చైతన్యము) యందే ఆనందమును గొనుచు, ఆత్మ యందే తృప్తుడై పరిపూర్ణ తృప్తిని పొందినవానికి చేయవలసిన కర్మమేమియును వుండదు.) అన్న విషయం సూచించారు.
మనిషి కోరికలను బహిష్కరించాలని; అతను తెలియకుండానే తన చేతుల్లోకి తీసుకున్న పగ్గాలు వదిలేయాలని మరియు పని (కర్మ) చేయడానికి ప్రయత్నించడం మానేయాలన్న విషయం ‘యిది యెల్లా వుమినాఁకే చవుతాలు’ ద్వారా సూచించారు ఇవన్నీ అల్పంగా కనిపిస్తాయి; వాస్తవానికి అవి ఆచరణలో అత్యంత కఠినం.
ఉదాహరణకు, కోరికలను బహిష్కరించడం గురించి ఆలోచించడం కూడా ఒక ప్రయత్నమని
తెలియండి. దీని అర్థం, మీరు యదార్ధంగా బహిష్కరిస్తూనే బహ్య స్పృహలో దాని గురించి ఆలోచించకుండా ఉంటారు అని.
Copper Leaf: 137-4 Volume 2-157
Chala bavundi mee explanation
ReplyDeleteThis keertana has reminders we all need from time to time . Thank you for explaining.
ReplyDeleteమనస్సును నియంత్రించడంలోనే ఉన్నది మానవుల మనుగడ. ఆశలెన్నో ఉండవచ్చు. కాని మనం మానవ మాత్రులం. మనకి అతీతమైన ఆ పరమాత్ముని సహకారమే లేకపోతే మన జన్మ వృధా ...
ReplyDeleteచావు,పుట్టుక అనేవి మాపు,రేపు వలె కాలంలో ఒకదాని వెంట మరొకటి పరిభ్రమిస్తూ ఉంటాయి. శరీరం అనిత్యమని గ్రహించి,
ReplyDeleteమనోచాంచల్యమును వీడి,
నిత్యము,సత్యము అయిన
భగవంతునికి శరణాగతియై,
తరించండని అన్నమయ్య ఉద్బోధ చేస్తున్నాడు.
తృప్తి కలిగిన వానికి కొంచెమున్ననూ చాలును.తృప్తి లేనివానికి యెంతైనా చాలదు కదా!
శృంఖలాలు లేని కోరికలనేవి మతితప్పినవాని చేతిలోని రాయి వంటిది.అందువలన కోరికలను త్యజించి శ్రీహరిని శరణు వేడుకోమంటున్నాడు అన్నమయ్య.
మనస్సును అదుపునందు ఉంచుకొని, దానిలో పరిపరి విధములైన ఆలోచనలను తిరుగాడనీయకుంటే,అది పసిబాలుని వలె స్థిరముగా,
నిష్కల్మషంగా ప్రశాంతంగా
ఉంటుంది. అట్లుగాక,పగ్గాలు లేని
మనస్సును ఆలోచనల వైపుకు పరుగులు తీయనిస్తే,అట్టి ఆలోచనలకు కూడా పగ్గాలు ఉండవు యవ్వనగర్వం వలె.నీరు యెంత ఉంటే, అన్ని తామరలు పూచిన చందమున.అట్లే, మనస్సును నీ అధీనమందు ఉంచుకొనినట్లయితే, ఆలోచనలకు కూడా కళ్లెం పడుతుంది. స్వాధీనచిత్తంతో శ్రీహరిని శరణు కోరు.అదియే నీకు మేలని చెప్పుచున్నాడు అన్నమయ్య.
అన్నిటినీ వదలిపెట్టి భగవంతునికి ఆత్మసమర్పణము చెసినచో, భగవద్గీత లో పరమాత్మ చెప్పినట్లు
"ఆత్మయందే తృప్తుడై,పరిపూర్ణ తృప్తిని పొందినవానికి చేయవలసిన కర్మ యేమియును ఉండదు." అందువలన, శ్రీ వెంకటేశ్వరుడిని ఆశ్రయించి ఆత్మసమర్పణ గావించి ధన్యుడవు
కమ్ము అని అన్నమయ్య అంటున్నాడు.
🙏