Thursday, 26 August 2021

79. అంగడి నెవ్వరు నంటకురో (aMgaDi nevvaru naMTakurO)

 

ANNAMACHARYA

79. అంగడి నెవ్వరు నంటకురో

Introduction: In this hard hitting verse, Annamacharya equated people in business with thieves. Then, in later stanzas, he adds complete public into this, because in the broader sense, we are engaging in activities seeking some purpose.

Though this verse does not deal with God as subject, his observations on tendency of human beings is an example of his foresight and clarity of thought. His remarks are quite relevant in the present day cut throat competitive life.

ఉపోద్ఘాతము:  ఈ కీర్తనలో అన్నమాచార్యులు వ్యాపారంలోని వారిని  దొంగలతో సమానం చేస్తూ గట్టిగా నొక్కి చెప్పారు. తరువాత ఇందులోకి జనులందరినీ జోడించాడు ఎందుకంటే విస్తృత కోణంలో మనం ఏదోవొక ప్రయోజనము కోరియే కార్యములకు పూనుకుంటుంన్నాము.

ఈ కీర్తన, దేవుడిని విషయంగా పరిగణించనప్పటికీ, మానవుల ధోరణిపై అతని పరిశీలనలు అన్నమయ్య  దూరదృష్టికి మరియు ఆలోచన స్పష్టతకు ఉదాహరణ. ప్రతీ విషయానికీ తీవ్రమైన పోటీ ఎదుర్కోంటున్న ఈ   రోజుల్లో అన్నమయ్య  వ్యాఖ్యలు చాలా సందర్భోచితమైనవి, కీలకమైనవి.​

परिचय: इस कीर्तना में अन्नामाचार्या ने व्यापार करने वालों की तुलना चोरों से करने पर जोर दिया। फिर उन्होंने सभी लोगों को इसमें जोड़ा क्योंकि व्यापक अर्थों में हम उन गतिविधियों में लगे हुए हैं जो किसी उद्देश्य (प्रायोजन) की तलाश में हैं।

इस कीर्तना में मानव प्रवृत्तियों पर उनके अवलोकन अन्नमय्या की दूरदर्शिता और विचारों की स्पष्टता का एक उदाहरण हैं। अन्नामय्या की टिप्पणियां इन दिनों बहुत प्रासंगिक और महत्वपूर्ण हैं जब हर चीज के लिए भयंकर प्रतिस्पर्धा है।

కీర్తన:

అంగడి నెవ్వరు నంటకురో యీ -

దొంగలఁ గూడిన ద్రోహులను ॥పల్లవి॥

 దోసము దోసము తొలరో శ్రీహరి -

దాసానదాసుల దగ్గరక
ఆసలనాసల హరినెఱఁగక చెడి
వీసర పోయిన వెఱ్ఱులను     ॥అంగ॥

 పాపము పాపము పాయరో కర్మపుఁ-

దాపపువారము దగ్గరక
చేపట్టి వేదపు శ్రీహరికథలు
యేపొద్దు వినని హీనులము  ॥అంగ॥

 పంకము పంకము పైకొనిరాకురో

కొంకుఁగొసరులకూళలము
వేంకటగిరిపై విభునిపుణ్యకథ
లంకెల వినని యన్యులము            ॥అంగ॥

 

aMgaDi nevvaru naMTakurO yI -

doMgala gUDina drOhulanu ॥pallavi॥

 dOsamu dOsamu tolarO SrIhari -

dAsAnadAsula daggaraka
AsalanAsala harine~ragaka cheDi
vIsara pOyina ve~r~rulanu ॥aMga॥

 pApamu pApamu pAyarO karmapu -

dApapuvAramu daggaraka
chEpaTTi vEdapu SrIharikathalu
yEpoddu vinani hInulamu    ॥aMga॥

 paMkamu paMkamu paikonirAkurO

koMkugosarulakULalamu
vEMkaTagiripai vibhunipuNyakatha
laMkela vinani yanyulamu   ॥aMga॥

 

Details and Explanations:

 

అంగడి నెవ్వరు నంటకురో యీ -

దొంగలఁ గూడిన ద్రోహులను        ॥పల్లవి॥

aMgaDi nevvaru naMTakurO yI -

doMgala gUDina drOhulanu      ॥pallavi॥

 

Word to Word meaning:  అంగడి (aMgaDi) = shop, market place (in general indicating business);   నెవ్వరును (nevvarunu) = none; అంటకురో (aMTakurO) = do not touch (meaning do not get engaged) యీ (yI) = these;  దొంగలఁ (doMgala) = thieves; గూడిన (gUDina) = associate, unite, join;  ద్రోహులను            (drOhulanu)   =a traitor, betrayer.

Literal meaning: Do not join business (for livelihood) for these people joined their hands with thieves and became betrayers.

Explanation: Annamayya is highlighting the fact that every business (even in his times) deals with screening of the facts. This he does not approve. Therefore he is equating people in business to thieves.

Almost every business runs on wafer thin margins in the world today. This forces all the people linked with business to search avenues to garner profit. Often this is achieved at the cost of propriety.

భావము:  (జీవనోపాధి కోసం) వ్యాపారంలో చేరవద్దు; వ్యక్తులు దొంగలతో చేతులు జోడించి ద్రోహులుగా మారారు.

వివరణము: అన్నమయ్య ప్రతి వ్యాపారం (అతని కాలంలో కూడా) వాస్తవాలను కొంత వక్రీకరించి వ్యవహరిస్తుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. దీనిని అతను ఆమోదించడు. అందువల్ల అతను వ్యాపారంలోని వారిని  దొంగలతో సరిసమానంగా చూపుతున్నాడు.

ఈ రోజు ప్రపంచంలో దాదాపు ప్రతి వ్యాపారం మరీ స్వల్ప లాభాలతో నడుస్తోంది. ఇది వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ మరింత లాభం పొందడానికి అన్య మార్గాలను వెతకడానికి ఉసికొల్పుతుంది. తరచుగా లాభం యుక్తత,  ఔచిత్యములను పణంగా పెట్టి సాధించబడుతుంది.   

भाव्: व्यवसाय में शामिल न हों (जीवित रहने के लिए); ये लोग चोरों से हाथ मिला कर द्रोही बन गए।

टिप्पणि: अन्नामय्या यह स्पष्ट करते हैं कि प्रत्येक व्यवसाय (अपने समय में भी) कुछ विकृत व्यवहारों से निपटता है। उसे यह मंजूर नहीं है। इसलिए वह कारोबार करने वालों की तुलना चोरों से कर रहा है।

आज विश्व का लगभग हर व्यवसाय बहुत ही कम लाभ पर चल रहा है। यह व्यवसाय में शामिल सभी लोगों को अधिक लाभ कमाने के अन्य तरीकों की तलाश करने के लिए प्रेरित करता है। अक्सर उपयुक्तता और प्रासंगिकता की कीमत पर लाभ प्राप्त किया जाता है।                                                    

దోసము దోసము తొలరో శ్రీహరి -

దాసానదాసుల దగ్గరక

ఆసలనాసల హరినెఱఁగక చెడి

వీసర పోయిన వెఱ్ఱులను  ॥అంగ॥

 

dOsamu dOsamu tolarO SrIhari -

dAsAnadAsula daggaraka

AsalanAsala harine~ragaka cheDi

vIsara pOyina ve~r~rulanu          ॥aMga॥

 

Word to Word meaning:  దోసము (dOsamu) = దోషము, అనర్థము, sin, evil;   దోసము (dOsamu) = దోషము, అనర్థము, sin, evil;    తొలరో (tolarO) = తొలగిపోరా, వెళ్ళిపోరా, move away, go away; శ్రీహరి (SrIhari) = Lord Hari;  దాసానదాసుల (dAsAnadAsula) = servants of servants of God; దగ్గరక (daggaraka) = close to; ఆసలనాసల (AsalanAsala)  = (caught between) hope and despair; హరినెఱఁగక (harine~ragaka) = Not knowing God Hari; చెడి (cheDi) got spoilt; వీసర పోయిన (vIsara pOyina)  = being deficient; వెఱ్ఱులను (ve~r~rulanu) = madmen, insane;

Literal meaning: O Man! It is evil (to be in business). Move away. Move away. Reach to the servants of servants of God. These insane men (in business) have ignored God and are caught between hope and despair.

Explanation: It appears that Annamayya used rather harsh words for business. However, think of troubles people faced from businesses like banks, power companies, and chemical companies. Barings Bank collapsed in 1995 creating untold miseries to people. Many cooperative banks after looting the public, declared as failed in Maharashtra. Fraudulent practices in these were proved at a later date.  

Once in business, people often forget that they are human beings, and the lust for money takes possession of them. They degenerate to any level to create wealth.  Annamacharya understood this tendency of man clearly and exactly. His writings are still relevant and show his foresight & sensitivity.

Those in business are caught between hope and despair; circumstances force them to resort to such acts is the underlying meaning of this stanza.

భావము:  మానవుడా! (వ్యాపారం చేయటం) దోషము అనర్థము. పక్కకు తొలుగు.  దేవుని దాసానదాసులను చేరుకో. పిచ్చి మనుషులు (వ్యాపారంలో పడి) దేవుని విస్మరించారు. అంతేకాక ఆశ మరియు నిరాశల మధ్య చిక్కుకున్నారు.​

వివరణము: అన్నమయ్య వ్యాపారంపై  కటువైన పదాలను ఉపయోగించినట్లు కనిపిస్తోంది. అయితే, బ్యాంకులు, పవర్ కంపెనీలు మరియు రసాయన కంపెనీల వంటి వ్యాపారాల నుండి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆలోచించండి. బేరింగ్స్ బ్యాంక్ (బ్రిటన్ 1995లో) కుప్పకూలింది. ప్రజలకు చెప్పలేని కష్టాలను సృష్టించింది. ఇటీవల కాలంలో మహారాష్ట్రలో అనేక సహకార బ్యాంకులు ప్రజల సొమ్ము దోచుకుని, తరవాత విఫలమయ్యాయని ప్రకటించుకున్నాయి. ఇవన్నీ మోసపూరిత పద్ధతులను అవలంభించడం వల్లనే అని తరువాతి విచారణలో నిర్ధారణ అయింది.

వ్యాపారంలో ఉన్నప్పుడు, ప్రజలు తరచుగా వారు మనుషులు అని మర్చిపోతారు, మరియు ధన కాంక్ష  వారిని స్వాధీనం చేసుకుంటుంది, సంపదను సృష్టించడానికి వారు స్థాయిలోకైనా దిగజారతారు. అన్నమాచార్యులు మనిషి ధోరణిని చక్కగా,  స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. వారు వెళ్లిపోయిన చాలా కాలంమైనా, అతడి రచనలు ఈనాటికీ కూడా అన్వయించవచ్చు. వారి దూర దృష్టిని మరియు సున్నితత్వాన్ని  ఇప్పటికీ మనము అనుభూతి చెందగలం.

వ్యాపారంలో ఉన్నవారు  ఆశ మరియు నిరాశల మధ్య చిక్కుకుని ఇటువంటి పనులకు దిగుతారని అన్నమయ్య ఉద్దేశ్యం. 


भाव्: हे आदमी! (व्यवसाय करना)  दुर्भाग्य है। उस रास्ता से हटो। भगवान के सेवकों तक पहुंचें। इन पागल लोगों (व्यवसाय में पड़ना) ने भगवान की उपेक्षा की। आशा और निराशा के बीच  फंस गया।

टिप्पणि: ऐसा लगता है कि अन्नामय्या ने व्यापार पर कठोर शब्दों का इस्तेमाल किया है। हालाँकि, बैंकों, बिजली कंपनियों और रासायनिक कंपनियों जैसे व्यवसायों से लोगों को होने वाली कठिनाइयों के बारे में सोचें। बियरिंग्स बैंक (1995 में यूके) ढह गया। लोगों के लिए अनकही मुश्किलें खड़ी कीं। हाल के दिनों में महाराष्ट्र में कई सहकारी बैंकों ने लोगों से उनके पैसे लूटे हैं और घोषणा की है कि वे विफल हो गए हैं। बाद की पूछताछ में यह निष्कर्ष निकला कि यह सब कपटपूर्ण तरीकों को अपनाने के कारण था।

जब व्यापार में, लोग अक्सर यह भूल जाते हैं कि वे मनुष्य हैं, और धन की लालसा उन पर हावी हो जाती है, तो वे धन बनाने के लिए किसी भी स्तर तक पतित हो जाते हैं। अन्नामाचार्यों ने आदमी की प्रवृत्ति को बड़े करीने और स्पष्ट रूप से समझा।  हम अभी भी ५०० साल बाद भी उनकी दूरदर्शिता और संवेदनशीलता को महसूस कर सकते हैं।

अन्नामय्या का इरादा है कि व्यापार में जो लोग हैं ओ आशा और निराशा के बीच फंस जाते हैं और इस तरह के कृत्यों का सहारा लेते हैं। 

పాపము పాపము పాయరో కర్మపుఁ-

దాపపువారము దగ్గరక

చేపట్టి వేదపు శ్రీహరికథలు

యేపొద్దు వినని హీనులము          ॥అంగ॥

 

pApamu pApamu pAyarO karmapu -

dApapuvAramu daggaraka

chEpaTTi vEdapu SrIharikathalu

yEpoddu vinani hInulamu           ॥aMga॥

Word to Word meaning: పాపము (pApamu) = sin; పాపము (pApamu) = sin; పాయరో  (pAyarO) = branch out (implying move away); కర్మపుఁ(karmapu) = engaged in Karma;  దాపపువారము (dApapuvAramu) = దగ్గరవారము, close(er) people; దగ్గరక (daggaraka) = close to; చేపట్టి (chEpaTTi) = to adopt, patronize; వేదపు (vEdapu) = as in Vedas;  శ్రీహరికథలు (SrIharikathalu) = Stories relating Hari; యేపొద్దు (yEpoddu) = Any day; వినని (vinani) = not heard( implying not interested to know) ; హీనులము (hInulamu) = vile, mean people.

Literal meaning: Sin. It is Sin. Move away. We are engaged in the Karma. (Implying we are submerged by Karma). We are vile and mean people who did not patronize and heard the stories of Sri Hari as mentioned in Vedas, for even one day.

Explanation: One thing is clear. Most of the people in the world are engaged (rather engulfed) in one activity or the other. We do not know how to come out of this. Sometimes we genuinely try. After sometime time, we lose sight and again slip into the listless activity,

We are so occupied, even the four in the family find it difficult to sit down and eat dinner or supper together. Here the Annamacharya indicated by the wording "SrIharikathalu yEpoddu vinani hInulamu " (శ్రీహరికథలు యేపొద్దు వినని హీనులము) that there is a gentleman who tells the story of Bhagavatam and, there are some people to listen to. This listening is in association of gentlemen, not like listening to pop music individually.

The bitter truth of today is that not only adults but also children are not prepared to listen to Srihari stories. Under these circumstances, we have never heard of heard the stories of Sri Hari becomes, unfortunately, true.

భావము:  పాపము. పాపము. పక్కకు తొలగండి. మేము కర్మకు దగ్గరవారము. (కర్మలలో ములిగియున్నవారము అని అర్ధము). మేము ఒక్క నాడైనా వేదాలలో చెప్పిన శ్రీ హరికి సంబంధించిన కథలను వినని, పోషించని నీచులము.

వివరణము: ఒక విషయం స్పష్టంగా ఉంది. ప్రపంచంలోని అత్యధికులు ఒక కార్యాచరణలోనో లేదా మరొకదానిలోనో నిమగ్నమై ఉన్నారు (లేదా మునిగి ఉన్నారు). దీని నుండి ఎలా బయటపడాలో మనకు తెలియదు. కొన్నిసార్లు మనము నిజాయితీగా ప్రయత్నిస్తాము. కొంత సమయం తరువాత  క్రమంగా మనము మార్గం కోల్పోతాము. తెలియకుండానే మళ్లీ లెక్క లేని కార్యాచరణలో యిరుక్కుంటాము.

ఈరోజున జీవితం చూస్తే ఎవరికి వారే యమునా తీరేలా ఉంటోంది. కుటుంబంలోని నలుగురూ కూడా కూర్చొని భోజనం చేయడమే కష్టం. ఇక్కడ అన్నమాచార్యులు శ్రీహరికథలు యేపొద్దు వినని హీనులముతో సజ్జన సాంగత్యమును కూడా చెప్పకయే చెప్పిరి. (అంటే అక్కడ భాగవత కధ చేప్పే ఒక సజ్జనుడు, వినేందుకు కొంతమంది వున్నారన్నమాట​.)

ఈనాటి చేదు నిజం శ్రీహరికథలు వినేందుకు పెద్దలే కాదు పిల్లలూ తయారుగాలేరు. ఇక అవి నలుగురూ కూడా కూర్చొని వింటారనుకోవడం విడ్డూరమే.  పరిస్థితుల్లో శ్రీహరికథలు యేపొద్దు వినని హీనులము” అయ్యాము కదా!

भाव्:   पाप। पाप। किनारे हटा दें। हम कर्म के करीब हैं। (अर्थात् कर्म में पूरी डूबा  व्यतीत)। हम वे हैं जिन्होंने किसी एक वेद में कही गई श्री हरि की कहानियों को न तो सुना है और न ही पोषित किया है। 

टिप्पणि: एक बात साफ है। दुनिया का अधिकांश हिस्सा किसी न किसी गतिविधि में लगा हुआ है। हम नहीं जानते कि इससे कैसे निकला जाए। कभी-कभी हम ईमानदार होने की कोशिश करते हैं। धीरे-धीरे कुछ समय बाद हम रास्ता भटक जाते हैं। अनजाने में हम फिर से अनगिनत गतिविधियों में लग जाते हैं। 

आज के जीवन पर नजर डालें तो हर एक व्यक्ति  किनारे देखकर बैठ जाते है। यहां तक ​​कि परिवार में हम चारों को भी बैठना और खाना मुश्किल लगता है। यहाँ अन्नामचार्य कहते हैं कि "श्रीहरिकथालु येपोड्डु विनानी हीनुलामु"  मतलब है कि एक सज्जन हैं जो भागवत की कहानी कहते हैं, कुछ लोग हैं जिन्हें सुनना है।) 

आज की कड़वी सच्चाई यह है कि न केवल वयस्क, बल्कि बच्चे भी श्रीहरिकथाओं को सुनने के लिए तैयार नहीं हो सकते।  चारों बैठकर सुनना बड़ा कल्पना की बात हैं। इन परिस्थितियों में, हमने "श्रीहरिकथा" के बारे में कभी नहीं सुना तो सच हो गया!

పంకము పంకము పైకొనిరాకురో

కొంకుఁగొసరులకూళలము

వేంకటగిరిపై విభునిపుణ్యకథ

లంకెల వినని యన్యులము        ॥అంగ॥

 

paMkamu paMkamu paikonirAkurO

koMkugosarulakULalamu

vEMkaTagiripai vibhunipuNyakatha

laMkela vinani yanyulamu           ॥aMga॥

Word to Word meaning:  పంకము (paMkamu) = dirt, mud;  పంకము paMkamu) = dirt, mud;  పైకొనిరాకురో (paikonirAkurO) = do not bring  here; కొంకుఁగొసరుల (koMkugosarula) = భయం, సంకోచం అనే అర్ధాలతో జంట పదం (= వెనుదీత)​ take back step out of fear; కూళలము (kULalamu) = we are cruel and wicked people;  వేంకటగిరిపై (vEMkaTagiripai) = on the mountain of Venkatagiri;  విభుని (vibhuni) = Lord of; పుణ్యకథలు (puNyakathalu)  అంకెల (laMkela) = సామీప్యముగా, చేరువగా (సావధానముతో అనే అర్ధములో), attentively, follow closely ; వినని (vinani) = not heard (implying not interested to know); యన్యులము (yanyulamu) = others;

Literal meaning: Do not bring dirt and mud here. We are cruel and wicked people and always take back step (wrong step) out of fear. We are the others, who never heard the stories of the Lord of Venkatagiri attentively.

Explanation: Many meanings have been embedded in this statement. First is to understand we, so soft, sensitive, harmless, law abiding followers, How can we be called cruel and wicked people. It appears to be atrocious statement. Then consider the following.

Did you actually meet a really cruel person as shown in movies? Answer would be NO. Whereas the overall impact of this society on every human being is really the opposite.

The strength of a single straw may be meagre. However, the strength of a bunch of twined straw would be formidable.

Similarly small flaws in each one of us get reflected in society and cumulative effect of these reflections would be a strong and irresistible force. This is often contributes on the negative side. (For some inexplicable reasons the fact remains that the negative forces join quicker). We might have observed in our life that negative ideas are so readily learnable.

Now judge impartially, are we truly as soft, as sensitive, as harmless persons as we would imagine ourselves to be?  This is exactly what Annamcharya is arriving at. Seeing this irreversible summation of negative effects Jiddu Krishnamurti wondered, how can man make right choice to live?  

vEMkaTagiripai vibhunipuNyakatha laMkela vinani yanyulamu (వేంకటగిరిపై విభునిపుణ్యకథ లంకెల వినని యన్యులము) is signifying inattentive action of human beings. He said that truly we don't pay attention to details in stories of Lord Srihari, which actually reveal the secret of appropriate living.

For example most of us enjoyed listening to the story of Gajendra Mokshanam. What does this story imply, apart from the beautiful narration and kindness of god to protect beings in distress? Few of them are

a.     Gajendra (elephant) was proud that he was the strongest.  He goes to the pond with thousands of wives (to demonstrate his strength and valour)

b.    He enters serene and clear waters and disturbs environment.

c.     As he entered water, crocodile catches. Being in water, he cannot understand what actually pulling him down.

d.    Sometimes the elephant and sometimes the crocodile appear to have upperhand. But no one wins.

e.     Elephant tries hard to get out, but it could not. All his thousands of associates could not come to his rescue.

f.      When the elephant realises that his efforts are of no avail and it must pray god, it does not take much time to get liberated from crocodile.  All the mistakes made by the elephant have been forgiven instantly.

Just see, how instructive this story is. It simply resembles man and his struggles.

భావము:  ఇక్కడ మట్టిని బురదనీ తీసుకురావద్దు. మేము క్రూరులము మరియు దుర్మార్గులము. ఎల్లప్పుడూ భయంతో వెనక్కి అడుగు వేస్తాము (తప్పుటడుగులు వేస్తాం). మేము  వెంకటగిరి ప్రభువు కథలను శ్రద్ధగా వినని  ఇతరులము.

వివరణము: మెత్తని మృదు స్వభావులం, చట్ట ప్రకారంగా నడుచుకునే వాళ్ళం. క్రూరులమని  మరియు దుర్మార్గులమని ఎందుకు పిలిచారో?  ఇది దారుణమైన ప్రకటనగా కనిపిస్తుంది.

సినిమాల్లో చూపే విధంగా ఉండే నిజంగా క్రూరమైన వ్యక్తిని కలిశారా? సమాధానం అక్షరాలా కాదు అవుతుంది. కానీ మనం నిర్లిప్తమై గమనిస్తే, సమాజం యొక్క సమగ్ర ప్రభావం  ప్రతీ మనిషి మీదా అలా మృదువుగా, సున్నితంగా, హానికాని దానిగా కాక వ్యతిరేకంగా ఉంటుంది.

 

ఒకేఒక గడ్డి పోచకు లేని బలం, ఎక్కువ గడ్డి పోచల్ని కలిపి పేనితే తెంపలేని బలం వస్తుంది.    అలాగే ఒక్కరొక్కరిలోని చిన్న చిన్న లోపాలు,  సమాజంలో ప్రతిబింబించి బలమైన విరోధింపలేని శక్తిగా గోచరమౌతుంది. ప్రభావం, తరచు ప్రతికూల భావానికే దోహదమౌతుండడం గమనార్హం. అన్నమయ్య దార్శనికతకు అంతులేదని ఇట్టే తెలిసిపోతుంది.

ఇప్పుడు చెప్పండి మనమంతా, నిజంగా అనుకుంటున్నంత,   మృదువైన, సున్నితమైన, హానిచేయని వ్యక్తులమేనా? జిడ్డు కృష్ణమూర్తి ప్రతికూల ప్రభావాల యొక్క అనివార్యమైన సమాకలనమును చూసి, మనిషి జీవించడానికి సరైన ఎంపిక ఎలా చేయగలడు అని ఆశ్చర్యపోయాడు.

వేంకటగిరిపై విభునిపుణ్యకథ లంకెల వినని యన్యులము తో నిజంగా శ్రీహరి కథలలోని వివరాలపై మానవులు శ్రద్ధ చూపడం లేదని, అవి సన్మార్గ జీవన రహస్యాలన్ని వెల్లడిస్తున్నా మనిషి తన మూఢత్వం వల్ల  గ్రహించలేక పోతున్నాడని ఆయన అన్నారు. అన్యులము” మానవుల అనాలోచితా చర్యను సూచిస్తుంది.

ఉదాహరణకు మనలో చాలా మంది గజేంద్ర మోక్షణం కథ విని ఆనందించి ఉంటారు. అందమైన కథనం, కష్టాల్లో ఉన్న జీవులను రక్షించడానికి దేవుడున్నాడని  కాకుండా కథ మరేమి సూచిస్తుంది? వాటిలో కొన్ని క్రింద ఇస్తున్నా.

a)     గజేంద్రుడు (ఏనుగు) తాను బలవంతుడని గర్వించాడు. అతను వేలాది మంది భార్యలతో చెరువుకు వెళ్తాడు. అక్కడ తన బలం మరియు పరాక్రమం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాడు.

b)    అతడు ప్రశాంతమైన మరియు స్పష్టమైన జలాల్లోకి ప్రవేశిస్తాడు మరియు పర్యావరణానికి భంగం కలిగిస్తాడు.

c)     అతను నీటిలోకి ప్రవేశించినప్పుడు, మొసలి పట్టుకుంటుంది. నీటిలో ఉండడం వల్ల, అతడిని ఏది కిందకి లాగుతోందో అతడు అర్థం చేసుకోలేకపోతాడు.

d)    కొన్నిసార్లు ఏనుగు మరియు కొన్నిసార్లు మొసలి పైచేయిలో ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి ఎవరూ గెలవరు.

e)     ఏనుగు బయటకు రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది, కానీ వదలించుకో లేకపోతుంది. అతనికి వేలాది మంది సహచరులున్నా అతనిని రక్షించడానికి రాలేకపోతారు.

f)     ఏనుగు ఇది పద్ధతి కాదు అని గ్రహించినప్పుడు, అది దేవుడిని ప్రార్థిస్తుంది. నువ్వు తప్ప వేరెవరూ లేరని అంటుంది. మొసలి నుండి విముక్తి పొందడానికి ఎక్కువ సమయం పట్టదు. అంత వరకూ ఏనుగు చేసిన తప్పులన్నీ ఒకే ఒక ప్రార్ధనతో క్షమించబడ్డాయి.

కథ ఎంత బోధనాత్మకంగా ఉందో చూడండి. ఇది  మనిషిని మరియు అతని జీవన పోరాటాలను ఎంతో పోలి ఉంది.


भाव्:  यहां कीचड़  न लाएं। हम क्रूर और दुष्ट हैं। हम हमेशा डर में पीछे हटते हैं (गलत कदम उठाते हैं)। हम अन्य हैं जिन्होंने भगवान वेंकटगिरी की कहानियों को ध्यान से नहीं सुना है।

टिप्पणि: हम मृदुभाषी और कानून का पालन करने वाले होते हैं। हमे क्रूर और दुष्ट क्यों कहा जाता है? यह एक अपमानजनक बयान की तरह लगता है।

क्या आप कभी फिल्मों में दिखाए गए क्रूर व्यक्ति से मिले हैं? इसका उत्तर अधिकांस है नहीं। लेकिन अगर हम इसे अलग से देखें, तो हर इंसान पर इस समाज का समग्र प्रभाव उल्टा होता हैं।

एक तिनके की ताकत थोड़ा हो सकती है। हालांकि, मुड़े हुए भूसे के एक गुच्छा की ताकत दुर्जेय होगी। साथ ही एक-दूसरे में छोटी-छोटी खामियां समाज में परिलक्षित होती हैं और एक मजबूत अप्रतिरोध्य शक्ति के रूप में प्रकट होती हैं। यह उल्लेखनीय है कि यह प्रभाव अक्सर नकारात्मक भावना में योगदान देता है। इत्ते जानते हैं कि अन्नामय्या के दर्शन का कोई अंत नहीं है।

अब मुझे बताओ कि क्या हम सब, जैसा कि हम वास्तव में सोचते हैं, कोमल, सौम्य, हानिरहित लोग हैं? जिद्दू कृष्णमूर्ति ने नकारात्मक प्रभावों के इस अपरिहार्य संयोजन को देखा और सोचा कि मनुष्य जीने के लिए सही विकल्प कैसे बना सकता है।

उन्होंने कहा कि "वेंकटगिरी पर विभुनिपुण्यकथा लंकेला विनानी यान्युलमु" के साथ मनुष्य वास्तव में श्रीहरि कहानियों में विवरणों पर ध्यान नहीं देते हैं और वे पुण्य जीवन के रहस्यों को प्रकट करते हैं लेकिन मनुष्य अपनी मूर्खता के कारण उन्हें नहीं समझ सकता है।

उदाहरण के लिए हम में से बहुत से लोग गजेंद्र मोक्षन की कहानी सुनकर आनंद लेते हैं। सुंदर कहानी, इस कहानी का क्या अर्थ है कि संकट में जीवित प्राणियों को बचाने के लिए भगवान मौजूद हैं? उनमें से कुछ नीचे दिए गए हैं। 

1.      गजेंद्र (हाथी) को गर्व था कि वह मजबूत था। वह हजारों पत्नियों के साथ तालाब में जाता है। वहां वह अपनी ताकत और कौशल का प्रदर्शन करने की कोशिश करता है।

2.      वह शांत और साफ पानी में प्रवेश करता है और पर्यावरण को परेशान (भंग) करता है।

3.      पानी में घुसते ही मगरमच्छ उसे पकड़ लेता है। पानी में होने के कारण वह समझ नहीं पा रहा था कि उसे नीचे क्या खींच रहा है

4.      कभी हाथी तो कभी मगरमच्छ ऊपरी बांह पर दिखाई देता है। वास्तव में कोई नहीं जीतेगा।

5.      हाथी सैकड़ों बार बाहर निकलने की कोशिश करता है, लेकिन हार नहीं मानता। उनके हजारों साथी उनके बचाव में नहीं आ सके।

6.      जब हाथी को पता चलता है कि यह तरीका नहीं है, तो वह भगवान से प्रार्थना करता है। कहते हैं तुम्हारे सिवा कोई नहीं है। मगरमच्छ से छुटकारा पाने में देर नहीं लगी। तब तक एक ही प्रार्थना से हाथी के सारे पाप क्षमा हो जाते थे

 

देखिए कितनी शिक्षाप्रद है यह कहानी। यह मनुष्य और उसके जीवन के संघर्षों के समान ही है। 

Copper Leaf: 39-5  Volume 1-241

 

 

 

2 comments:

  1. Very nice explanation and word to word meaning.

    ReplyDelete
  2. జీవితంలో వ్యాపారము నొక ఉపాధిగా,ఆదాయమార్గముగా యెంచకు.నిజాయితీతో, ధర్మమార్గంలో వ్యాపారం చేయక, అధర్మం, అవినీతితో చేసే వ్యాపారమును దరిచేరనీయ వద్దు.దొంగలు,దోపిడీదారులతో కలిసి దేశద్రోహులుగా మారవద్దు.ఎందుకంటే అట్టి వ్యాపారమొక శాపం.ఆట్టివారు వ్యాపారమే లక్ష్యంగా చేసికొని, దైవాన్ని విస్మరించుచున్నారు. అంతేకాక,ఆశ, నిరాశల మధ్య చిక్కుకొని చెడుతున్నారు.అట్టి వ్యాపారమును చేపట్టక, హరి భక్తుల యొక్క,హరిదాసుల యొక్క సాంగత్యమును స్వీకరించుము,
    ధన్యత నొందుమని అన్నమయ్య అందరికీ సూచనలిస్తున్నాడు.

    ఇటువంటి పాపపు కర్మలకు లోబడి,వేదశాస్త్రములలో చెప్పబడిన శ్రీహరి కథలను ఏనాడైనా ఆకర్ణించుట కాని, ఆ హరికథామృతమును పానము చేయుట గాని చేయని హీనుల మైతిమి.

    అందువలన,పాపపు కర్మలను దరిజేరనీయక, పాపపు చింతనలను మనస్సులోనికి ప్రవేశింపనీయక, సదా హారికథాగానము,హరికథా
    శ్రవణము చేస్తూ హరిభక్తిలో నిమగ్నమై జీవిత గమ్యమును, పరమార్థమును చేరుకోండి ఆని అంటున్నాడు అన్నమాచార్యుల వారు యీ కీర్తనలో.
    🙏

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...