Saturday 7 August 2021

74. అతఁడే యెరుఁగును మముఁ బుట్టించిన (ataDE yerugunu mamu buTTiMchina)

 ANNAMACHARYA

74. అతఁడే యెరుఁగును మముఁ బుట్టించిన 

Introduction: In this extraordinary song, Annamacharya describing how human mind moves from one pretence to another, like a rolling ball. Present tense is used in this verse to indicate that such activity never stops.

Annamacharya said that as long as we live in a world of turbulence, there cannot be peace. Without peace, there is no possibility for the journey into the mind. He dwells upon the action man is expected to undertake in his life. We neglect this divine mission and drift away is the message.

ఉపోద్ఘాతము:  ఉదాహరించతగ్గ​ ఈ అత్యుత్తమమైన​ కీర్తనలో, అన్నమాచార్యులు మనస్సు ఒక బంతి లాగా, ఏదోవొక నెపంతో ఒక స్థితి నుండి ఇంకోదానికి కదులుతూ ఏదో చేస్తున్నాను అనే భ్రమ కలిగిస్తుందని వివరించారు. అటువంటి చర్యలు ఎన్నటికీ ఆగవని సూచించడానికి ఈ కీర్తనను వర్తమాన కాలంలో వ్రాశారు..

అల్లకల్లోల ప్రపంచంలో మనం ఇప్పటిలా జీవితం కొనసాగిస్తే ఎంత కాలమైనా మనశ్శాంతి ఉండదు అని అన్నమాచార్యులు అన్నారు. శాంతి లేకుండా, మనస్సు లోపలి ప్రయాణానికి అవకాశమే లేదన్నారు. మనిషి తన జీవితంలో చేపట్టాల్సిన చర్యలపై అతను తాత్సారం చెస్తాడు. ఈ దైవిక కార్యాలను నిర్లక్ష్యం చేసి దారితప్పుతాడని సందేశం.

కీర్తన:

అతఁడే యెరుఁగును మముఁ బుట్టించిన యంతరాత్మయగు నీశ్వరుఁడు

అతికీ నతుకదు చిత్తశాంతి యిదె ఆత్మవిహారం బిఁక నేదో        ॥పల్లవి॥ 

కనుచున్నారముసూర్యచంద్రులకుఘనవుదయాస్తమయములు

వినుచున్నారము తొల్లిటి వారల విశ్వములోపలికథలెల్లా
మనుచున్నారము నానాఁటికి మాయలసంసారములోన
తనిసీఁదనియము తెలిసీఁదెలియము తరువాతి పనులిఁక నేవో        ॥అత॥ 

తిరిగెద మిదివో ఆసలనాసల దిక్కుల నర్థార్జన కొరకు

పొరలెద మిదివో పుణ్యపాపములభోగములందే మత్తులమై
పెరిగెద మిదివో చచ్చెడి పుట్టెడి భీతిగలుగు దేహములోనే
విరసము లెరఁగము మరచీ మరవము వెనకటికాలము విధియేదో      ॥అత॥ 

ఱట్టైనారము హరినుతిచే నాఱడి గురువనుమతిని

పట్టినారమిదె భక్తిమార్గమిదె బలువగు విజ్ఞానముచేత
గట్టిగ శ్రీవేంకటపతి శరణని కంటి మిదివో మోక్షము తెరువు
ముట్టిముట్టము పట్టీపట్టము ముందటి కైంకర్యంబేదో      ॥అత॥ 

Details and Explanations: 

అతఁడే యెరుఁగును మముఁ బుట్టించిన యంతరాత్మయగు నీశ్వరుఁడు

అతికీ నతుకదు చిత్తశాంతి యిదె ఆత్మవిహారం బిఁక నేదో     ॥పల్లవి॥
 

ataDE yerugunu mamu buTTiMchina yaMtarAtmayagu nISvaruDu

atikI natukadu chittaSAMti yide AtmavihAraM bika nEdO  ॥pallavi॥ 

Word to Word meaning:  అతఁడే (ataDE) = he alone;  యెరుఁగును (yerugunu) = knows; మముఁ (mamu) = we;  బుట్టించిన (buTTiMchina) = creator; యంతరాత్మయగు (yaMtarAtmayagu) = inside dweller; నీశ్వరుఁడు (nISvaruDu) = God; అతికీ (atikI) = joining, cementing; నతుకదు (natukadu) = not joined; not cemented;  చిత్తశాంతి (chittaSAMti) = tranquillity; యిదె (yide) = this; ఆత్మవిహారం(AtmavihAraM)  =  sojourn with the self/soul;  బిఁక నేదో (bika nEdO) = beyond this what?

Literal meaning: Our creator and the inside dweller, God alone knows. This tranquillity we know is short lived.  Beyond all this, what is this sojourn with the soul?

Explanation: అతికీ నతుకదు చిత్తశాంతి (atikI natukadu chittaSAMti): The tranquillity/peace we know is short lived, because it is a break between two (mental) conflicts.  Therefore it is rather truce but not peace at all.

When one does not have peace, where is the question of knowing journey with the soul? That’s why, Annamacharya is wondering by stating ఇఁక నేదో?

Thus implied meaning of this chorus: We know not the peace and the journey into the Atman. However, only the creator knows.

భావము:  మన సృష్టికర్త మరియు లోపల నివసించే దైవమునకు మాత్రమే తెలుసు. మనకు తెలిసిన ఈ అంటీ అంటని ప్రశాంతత స్వల్పకాలికం. వీటినీ దాటి ఆ ఆత్మ విహారమేమిటో?

వివరణముఅతికీ నతుకదు చిత్తశాంతి: మనం అనుభూతి చెందే  ప్రశాంతత/శాంతి స్వల్పకాలికం, ఎందుకంటే ఇది రెండు (మనో) సంఘర్షణల మధ్య విరామం మాత్రమే. అందువల్ల అది సంధి కాని శాంతి కానే  కాదు.

ఒక వ్యక్తికి శాంతి లేనప్పుడు, “ఆత్మ  విహారం” అన్నది ఎక్కడ ఉంటుంది? అందుకే, అన్నమాచార్యులు “ఇఁక నేదో అని  పేర్కొనడం ద్వారా ఆశ్చర్యం ప్రకటించారు.

కనుచున్నారముసూర్యచంద్రులకుఘనవుదయాస్తమయములు

వినుచున్నారము తొల్లిటి వారల విశ్వములోపలికథలెల్లా

మనుచున్నారము నానాఁటికి మాయలసంసారములోన

తనిసీఁదనియము తెలిసీఁదెలియము తరువాతి పనులిఁక నేవో ॥అత॥

 

kanuchunnAramu sUryachaMdrulaku Ghana vudayAstamayamulu

vinuchunnAramu tolliTi vArala viSvamu lOpali kathalellA

manuchunnAramu nAnATiki mAyala saMsAramulOna

tanisIdaniyamu telisIdeliyamu taruvAti panulika nEvO        ॥ata॥

 

Word to Word meaning: కనుచున్నారము (kanuchunnAramu) = witnessing; సూర్యచంద్రులకు (sUryachaMdrulaku) = for sun and moon; ఘన (Ghana) = definite, definable; వుదయాస్తమయములు (vudayAstamayamulu) = rise and fall;  వినుచున్నారము (vinuchunnAramu) = we keep listening to;  తొల్లిటి వారల (tolliTi vArala) = the people before us;  విశ్వములోపలి (viSvamulOpali) = of this universe; కథలెల్లా (kathalellA) = all their stories;  మనుచున్నారము (manuchunnAramu) = we live;  నానాఁటికి (nAnATiki) = day by day; మాయలసంసారములోన (mAyalasaMsAramulOna) = this illusionary family life;  తనిసీఁదనియము (tanisIdaniyamu) = satisfied and yet not satisfied (we do not know) తెలిసీఁదెలియము (telisIdeliyamu) = aware and yet not aware (we do not understand); తరువాతి (taruvAti)  = next; పనులు (panul)  = works; ఇఁక నేవో (ika nEvO) = here after, what?

Literal meaning: We are witnessing the definite rise and fall of Sun and Moon. We also keep listening to various stories of people of this universe; we live day by day in this illusionary family life. We do not understand whether we are satisfied or not. Where is the question of knowing what is the work to be under taken next?

Explanationin this stanza, Annamacharya is describing the ephemeral nature of things. There is definite time lines by which moon and sun appear. We heard the stories of the previous generations, however great they might have been, you cannot find them now in this world. In this context, It is worth mentioning the below soliloquy (of Macbeth by Shakespeare) which is strikingly similar to this stanza.

Tomorrow, and tomorrow, and tomorrow,

Creeps in this petty pace from day to day,
To the last syllable of recorded time;
And all our yesterdays have lighted fools
The way to dusty death. Out, out, brief candle!
Life's but a walking shadow, a poor player,
That struts and frets his hour upon the stage,
And then is heard no more. It is a tale
Told by an idiot, full of sound and fury,
Signifying nothing.

Another significant word used is తరువాతి పనులిఁక నేవో to indicate that we are so occupied with we do not understand our next action. He stressed that we remain ignorant, until we understand the right action. 

Though it is complex, let me try to explain thru a Bhagavad-Gita shloka and a quote from Jiddu Krishnamurti.  

कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्म य: (4-18) karmayakarma ya paśhyed akarmai cha karma yaḥ (4-18) Purport: "Those who see action in inaction and inaction in action are truly wise amongst humans".

Most of us are inattentive. To become aware of that inattention is attention; but the cultivation of attention is not attention.”  (Jiddu Krishnamurti: YOU ARE THE WORLD CHAPTER 2, 21ST OCTOBER 1968 2ND PUBLIC TALK AT BRANDEIS UNIVERSITY)

Combining the above two we may say the said action is neither inaction nor action in our corporal terms. True action is knowing this world and the self is one and the same thing. That is understanding wholeness of existence. Thus Annamacharya, in that sense, embedded deeper meanings in simple words that lips ever could utter.

భావము: సూర్య చంద్రులకు కచ్చితమైన కాల అవధి ఉండడం మనం చూస్తున్నాము.  విశ్వంలోని గొప్పవారి కథలను కూడా వింటూనే ఉంటాము; భ్రమ కలిగించే కుటుంబ జీవితంలో రోజు తరువాత రోజుకు (క్షణం తరువాత క్షణానికి) జీవిస్తునే ఉంటాము. సంతృప్తి చెందామో లేదో తెలియని సంగ్దిద్ధావస్తలోనే ఉంటాము. తరువాత చేయాల్సిన పని ఏమిటో తెలుసా?

వివరణము: చరణంలో, అన్నమాచార్యులు విషయాల అనిత్యమైన స్వభావాన్ని వివరిస్తున్నారు. చంద్రుడు మరియు సూర్యులకు కనిపించే ఖచ్చితమైన కాల రేఖలు ఉన్నాయి. మునుపటి తరాల కథలన్నో  విన్నాము, వారు ఎంత గొప్పవారైనా ఇప్పుడు ప్రపంచంలో  కానరారే?  సందర్భంలో  శ్రీశ్రీ గారిఏవి తల్లినుండి క్రింది చరణాలు చూడండి.

జగద్గురువులు, చక్రవర్తులు,

సత్కవీశులు, సైన్యనాధులు,
మానవతులగు మహారాజ్ఞులు
కానరారేమీ ?
పసిడిరెక్కలు విసిరి కాలం
పారిపోయినజాడలేవీ ?
ఏవితల్లీ: నిరుడు కురిసిన
హిమ సమూహములు ? 

తరువాతి పనులిఁక నేవో ద్వారా మనం తదుపరి చర్యను అర్థం చేసుకోలేకపోతున్నామని చెప్పారు. సరియైన కార్యమును (పనిని) నిర్థారించు వరకు మనం జడత్వము నందే సంచరిస్తామని అన్నమయ్య నొక్కి వక్కాణించారు.  

ఇది సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, భగవద్గీత శ్లోకం మరియు జిడ్డు కృష్ణమూర్తి గారలు చెప్పినవాటి  నుండి  వివరించడానికి ప్రయత్నిస్తాను.

కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి కర్మ యః । (4-18) ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు.

మనలో చాలా మంది ఏమరుపాటుగా ఉంటారు. ఏమరుపాటు స్థితిని తెలియుట సావధాన స్థితి; కానీ ప్రయత్నముతో సాధించునది  సావధాన స్థితియే కాదు. జిడ్డు కృష్ణమూర్తి ("యూ ఆర్ వరల్డ్" అనే పుస్తకంలో)

పైన పేర్కొన్న రెండింటిని కలిపితే,  అన్నమాచార్యులు చెప్పిన తదుపరి చర్య శారీరక పరంగా చేపట్టు చర్య కాదని చెప్పవచ్చు. నిజమైన చర్య ఈ ప్రపంచము, నువ్వు  ఒకటే అని యదార్ధముగా తెలియుట​. మానవుడు తన ఉనికి యొక్క సంపూర్ణతను దర్శించడమే నిజమైన చర్య అని భావము. ఆ రకంగా అన్నమాచార్యులు, సాధారణ పదాలలో  పెదవులు పలుకలేని పదునైన అర్థాలను పొందుపరిచారు.

తిరిగెద మిదివో ఆసలనాసల దిక్కుల నర్థార్జన కొరకు

పొరలెద మిదివో పుణ్యపాపములభోగములందే మత్తులమై
పెరిగెద మిదివో చచ్చెడి పుట్టెడి భీతిగలుగు దేహములోనే
విరసము లెరఁగము మరచీ మరవము వెనకటికాలము విధియేదో     ॥అత॥ 

tirigeda midivO AsalanAsala dikkula narthArjana koraku

poraleda midivO puNyapApamulabhOgamulaMdE mattulamai
perigeda midivO chachcheDi puTTeDi bhItigalugu dEhamulOnE
virasamu leragamu marachI maravamu venakaTikAlamu vidhiyEdOata

Word to Word meaning: తిరిగెద (tirigeda) = wander; మిదివో (midivO)  = thus, this way; ఆసలనాసల  (AsalanAsala) = (between) aspiration and despair;  దిక్కుల (dikkula) = directions;  నర్థార్జన (narthArjana) = earning money;  కొరకు (koraku)  = for; పొరలెద (poraleda)  to roll, to wallow; మిదివో (midivO)  = thus, this way; పుణ్యపాపముల (puNyapApamula)  = in virtuous and sinful deeds; భోగములందే (bhOgamulaMdE) = only in consumption ( or cherishing); మత్తులమై (mattulamai) = being intoxicated; పెరిగెద (perigeda) = grow up; మిదివో (midivO)  = thus, this way; చచ్చెడి (chachcheDi) = dying;  పుట్టెడి(puTTeDi) = taking birth;  భీతిగలుగు (bhItigalugu) = causing fear;  దేహములోనే (dEhamulOnE) = in the body; విరసము (virasamu) = రసహీనము, అనుకూలముకానిది, tasteless; inconvenient;  లెరఁగము (leragamu) = do not understand; do not know; మరచీ (marachI) = appear to forget;   మరవము (maravamu) = yet not forget;  వెనకటికాలము (venakaTikAlamu) =following, later, subsequent time; (vidhiyEdO) = what errand?

Literal meaning: We shuttle between aspiration and despair. How many ways do we sweat hard to make money? We tend to experience sins and virtues but do not realize that our precious time is wasted in the intoxication of running after them.  We grow in this body which is dying and taking birth (every moment). We do not understand tasteless (insipid) and inconvenient things. We either forget or don’t remember the errand for which we are here.

Explanation: We all witness that truly our life alternates between expectation and despondency (ఆసలనాసల, AsalanAsala). Can any right thinking person deny this?

We scramble to temples, mosques, churches all around the world to gain that elusive virtue. Do we really understand that both these virtues and sins are material activities? Therefore, they are part of conscious activities. (Also see the explanation in the first stanza)

Word మత్తులమై (mattulamai)) is indicating that we are made to believe in gaining the precious virtue. Can we come out of this profit motive (of acquiring virtue)? is the question Annamayya is posing to us.

Most important word used in this verse is విరసము లెరఁగము used to indicate we believe in continuity of our tasteless state of existence. Present tense is used, to indicate it is not a particular point of life we have this state, but all along life we remain there.

The other state that is the active state is being indirectly indicated by  Annamayya, by eliminating what it is not.

మరచీ మరవము వెనకటికాలము విధియేదో is indicating that man has neglected his prescribed duties (Swadharma as per.Bhagavad Gita  Shloka Shreyan Swadharmo Vigunah 3-35)

భావము: ఆశ మరియు నిరాశల మధ్య అనిశ్చితముగ బంతి వలె కదలాడుతూనే ఉంటాం. డబ్బు సంపాదించడం కోసం ఎన్ని మర్గాల్లో  వెళ్తామో! పాపపుణ్యములను అనుభవించుటకే మొగ్గుచూపుతాం కాని  వాని మత్తులో మన విలువైన కాలం చిత్తౌతోందని గ్రహించము. (ప్రతి క్షణం) చనిపోతూ మరియు జన్మించే శరీరంలో మనం పెరుగుతామే కాని (అది క్షణికమని తెలియం. శరీరాన్ని రక్షించుకోవాలన్న భయాందోళనలలోనే కాలం గడుపుతాం). రుచిలేని (రసహీనమైన​) మరియు అసౌకర్యమైన విషయాన్ని మనము అర్థం చేసుకోలేము. ఇక్కడ ఉన్న పనిని మనం మర్చిపోతాము లేదా గుర్తుంచుకోము.

వివరణము: మన జీవితం నిజంగా నిరీక్షణ (ఆశ) మరియు నిరాశల మధ్య ఊగిసలాడుతూ గడిచిపోవడం మనమందరం చూశాము. చేదు నిజాన్ని ఎవరైనా దీనిని తిరస్కరించగలరా?

అంతుచిక్కని పుణ్యం పొందడానికి ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద గుమికూడతాం. పుణ్యం మరియు పాపం రెండూ భౌతిక కార్యకలాపాలని మనం నిజంగా అర్థం చేసుకున్నామా? ​

మత్తులమై  అనే పదం పుణ్యాన్ని సంపాదించడం (ధనాన్ని సంపాదించుకోవడం మాదిరిగానే) అనే అపోహలోనే ప్రపంచంలోని మనుషులంతా ఉండటాన్ని సూచిస్తుంది. మనలో జీర్ణించుకుపోయిన పుణ్యార్జన (లాభార్జన) అనే  మత్తులోంచి ఎప్పుడు బయటపడతామో!

విరసము లెరఁగము తో రుచిలేని ఉనికి యొక్క కొనసాగింపుపై మనము విశ్వసిస్తున్నామని సూచన​. వర్తమాన కాల ప్రయోగముతో జీవితంలో ఒకానొక నిర్దిష్ట క్షణానికి కాక​, జీవితమంతా అక్కడే ఉండటానికి అలవాటు పడతామని చెప్పారు.

మరచీ మరవము వెనకటికాలము విధియేదో తో భగవద్గీతలో (శ్రేయాన్ స్వధర్మో విగుణః 3-35) చెప్పిన స్వధర్మమును మనిషి మరిచాడని చెప్పారు.

చైతన్యవంతమైన జీవితాన్ని అన్నమయ్య అది కానిదాన్ని  తొలగించడం ద్వారా పరోక్షంగా సూచిస్తున్నారు.

ఱట్టైనారము హరినుతిచే నాఱడి గురువనుమతిని

పట్టినారమిదె భక్తిమార్గమిదె బలువగు విజ్ఞానముచేత

గట్టిగ శ్రీవేంకటపతి శరణని కంటి మిదివో మోక్షము తెరువు

ముట్టిముట్టము పట్టీపట్టము ముందటి కైంకర్యంబేదో  ॥అత॥

 

~raTTainAramu harinutichE nA~raDi guruvanumatini

paTTinAramide bhaktimArgamide baluvagu vij~nAnamuchEta

gaTTiga SrIvEMkaTapati SaraNani kaMTi midivO mOkshamu teruvu

muTTimuTTamu paTTIpaTTamu muMdaTi kaiMkaryaMbEdO       ata

 

Word to Word meaning: ఱట్టైనారము (~raTTainAramu) = నిందలు పడ్డాము, got accused;  హరినుతిచే (harinutichE) = by  praying God Hari; నాఱడి (nA~raDi) =వ్యర్థము, దీనము, Waste; pitiable state;  గురువనుమతిని (guruvanumatini) = with the permission of Guru;  పట్టినారమిదె (paTTinAramide) = Taken up; భక్తిమార్గమిదె (bhaktimArgamide) = path of meditation; బలువగు (baluvagu)  = with great/strong; విజ్ఞానముచేత (vij~nAnamuchEta) = knowledge;  గట్టిగ (gaTTiga) = steadfastly; శ్రీవేంకటపతి (SrIvEMkaTapati) = Lord Venkatesewara; శరణని (SaraNani) = submitted;   కంటి (kaMTi) = found;  మిదివో (midivO) = thus, this way; మోక్షము  (mOkshamu) = liberation; తెరువు (teruvu) = path; ముట్టిముట్టము (muTTimuTTamu) = touch and yet not touch;  పట్టీపట్టము (paTTIpaTTamu) = take up and yet not taken up; ముందటి (muMdaTi)  = the next; కైంకర్యంబేదో(kaiMkaryaMbEdO) = సేవ ఏదో, what service ( to be rendered).

Literal meaning: We were accused. With the instruction of the Guru, we got out of that miserable state by praying to God Hari.  We took up the path of meditation with the great knowledge (without fearing) submitted to Lord Venkteswara. Now we have seen the path to liberation. We shall neither engage nor think of any other service. (For us there is only God, nothing else).

Explanation: A person dedicated his life to the service of God, obviously does not engage in other activities. Others seeing them, most often accuse them of laziness, not useful etc. (This is indicated by word ( ఱట్టైనారము, ~raTTainAramu)

బలువగు విజ్ఞానము is signifying that knowledge is strong enough to dispel fear.  This path is not for the weak-minded.

భావము: నిందల పాలయ్యాము (ఱట్టైనారము). కానీ గురుని అనుమతితో, హరిని నుతించి, నాఱడి బోవక (ఆరాటము చెందక) భక్తి మార్గము పట్టినారము.  గొప్ప విజ్ఞానముచేత శ్రీవేంకటపతిని శరణని మోక్షమార్గము తెలిసికొంటిమి. మేము ఇతర సేవల (విషయముల) గురించి ఆలోచించము  లేదా వాటిలో పాల్గొనము. (మాకు దేవుడొక్కడే లోకము).

వివరణము: జీవితాన్ని దేవుని సేవకే అంకితం చేసినవాడు, స్పష్టంగా ఇతర కార్యకలాపాలలో పాల్గొనడు. ఇతరులు వానిని సోమరి, వ్యర్ధుడు అని నిందిస్తారు. అందుకే ఱట్టైనారము అన్నారు.

బలువగు విజ్ఞానము జ్ఞానం బలంగా ఉండి భయాన్ని నివారించగలదని సూచిస్తుంది. ఈ మార్గం బలహీనమైన మనస్సు గలవారికి కాదు.

 

Copper Leaf: 376-1  Volume 4-442

3 comments:

  1. చాలా బాగా వివరించావు శ్రీనివాసా!!👌😊

    ReplyDelete
  2. మనకు తెలిసిన,మన
    మనుభవించుచున్న ఆనందం క్షణికమైనది,ఆశాశ్వతమైనది.
    శాశ్వతము,నిత్యము అయిన
    ప్రశాంతత, ఆనందం అంటే పరమానందం కేవలం మన అంతరాత్మ,సృష్టికర్త అయిన పరమాత్మ సన్నిధియందే యని ఎఱుగవలెను. చిత్తశుద్ధి లేనివానికి ఆత్మతో విహారమెటుల సాధ్యం? ఆత్మజ్ఞాన మేరీతి కలుగు? అంటున్నాడు అన్నమయ్య పల్లవిలో.

    ప్రకృతిలో సూర్యచంద్రులు ఉదయిస్తున్నారు,అస్తమిస్తున్నారు.
    గొప్పవారు పుట్టుచున్నారు, గతిస్తున్నారు.ఈ మాయాజగత్తులో క్షణక్షణం పుడుతున్నారు, గిడుతున్నారు. ఇవన్నీ కూడా కాలానికి లోబడి వ్యవహరిస్తున్నాయి.జగత్తు సర్వం అశాశ్వతం,అనిత్యం.
    జగత్తంతా మిథ్య. "యద్దృశ్యం తన్నశ్యం" జీవితమును అనుభవించుచూ, కాలాన్ని నెట్టుచున్నాము.ఆశ,నిరాశల మధ్య జీవనయానం,ధనార్జన పైన దృష్టి,పాపపుణ్య కర్మల మత్తులో పడి, క్షణభంగురమైన శరీరం మీద ఆసక్తిని పెంపొందించుకొని, విలువైన కాలాన్ని వ్యర్థం చేసికొంటున్నాము. అయినా కాని, మనం సంతృప్తి చెందామో,లేదో నన్న సందిగ్ధత ఇంకనూ మిగిలియే యుంటున్నది.పరిపూర్ణమైన తృప్తి కోసం చేయవలసిన పని అంటే యదార్థమైన నీ యునికిని తెలిసికొనుట,అందరిలోనూ ఉన్నదొక్కటే యన్న ఆత్మభావన కలిగేది ఇంకెలా సాధ్యం?

    అజ్ఞానంతో అట్లున్న వారము గురువుని ఆశ్రయించి,వారి అనుమతితో భగవంతుని స్తుతించి,భక్తి, జ్ఞాన మార్గములలో పయనించినారము.శ్రీపతిని శరణు జొచ్చి,ముక్తిమార్గము నెఱింగితిమి.శ్రీహరి కైంకర్యసేవలే తప్ప వేరేదీ ఎఱుగనైతిమి.శ్రీహరి చరణములే నమ్మియున్న వారము.🙏

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...