Thursday 12 August 2021

75. తొక్కనిచోట్లు దొక్కెడి మనసు (tokkanichOTlu dokkeDi manasu)

 ANNAMACHARYA

75. తొక్కనిచోట్లు దొక్కెడి మనసు 

Introduction: In this noteworthy   verse, Annamacharya said, looking for new avenues (for finding God) is an Illusion in itself.  He said the anger, hunger and subjugation of natural-self interlace with each other to prevent us from seeing the truth.

Another significant  thing he said is that we think we know the path and  most often actuality is other way.

ఉపోద్ఘాతము:  ఈ గమనార్హమైన కీర్తనలో, అన్నమాచార్యులు  (దేవుని కనుగొనడం కోసం) కొత్త మార్గాలను వెతకడం ఒక భ్రమ అన్నారు. అతను కోపం, ఆకలి మరియు  నిర్భందింపబడిన సహజమైన చర్యలు ఒకదానితో ఒకటి ముడిపడి మనం నిజం చూడకుండా నిరోధిస్తున్నాయన్నారు.  

అతను చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకు మార్గం తెలుసు అని మేము అనుకుంటాము కానీ చాలా తరచుగా వాస్తవికత వేరే ఉంటుంది.

కీర్తన:

తొక్కనిచోట్లు దొక్కెడి మనసు

యెక్కడ గతిలే దింకనో తెరువు ॥పల్లవి॥ 

పాపము వాయదు పై పై మనసున

కోపము దీరదు కొంతైనా
దీపన బాధయుఁ దీర దిన్నియును
యేపునఁ బెనఁగొనె నింకనో తెరువు     ॥తొక్క॥ 

యెవ్వనమదమును నెడయదు కోరికె

కొవ్వును నణఁగదు కొంతైనా
రవ్వగు మమకారముఁ బెడఁబాయదు
యెవ్విధియును లేదింకవో తెరువు     ॥తొక్క॥ 

వెఱపును విడువదు వెడమాయలఁబడి

కొఱఁతయుఁ దీరదు కొంతైనా
తెఱఁ గొసఁగేటి శ్రీతిరువేంకటపతి -
నెఱిఁగీ నెఱఁగలే మిఁకనో తెరువు       ॥తొక్క॥ 

Details and Explanations:

 

తొక్కనిచోట్లు దొక్కెడి మనసు

యెక్కడ గతిలే దింకనో తెరువు ॥పల్లవి॥

 

tokkanichOTlu dokkeDi manasu

yekkaDa gatilE diMkanO teruvu           pallavi

 

Word to Word meaning:  తొక్కనిచోట్లు (tokkanichOTlu) = not treaded places; దొక్కెడి (dokkeDi)=  will tread; మనసు (manasu) = mind; యెక్కడ (yekkaDa) = where;  గతి (gati) = means, remedy; లేదు (gatilEdu) = not there; ఇంకనో తెరువు (iMkanO teruvu) =  ఇంకను ఓ తెరువు =  here after a  way/path;

Literal meaning: if the mind keeps treading new places, (knocking at many doors), then there is no way out (for the man).

Explanation: Annamacharya is saying that life is not moving from one place to another, but actually asserting that stay where you are to understand life.

tokkanichOTlu (తొక్కనిచోట్లు) is indicating that mind likes to explore new avenues. For example we might have watched news after dinner. Still we would like to see the news of the next morning.   This curiosity to know continues. Thus mind moves from last news to the latest one continuously.

Annamacharya is saying that  such movement of mind, does not allow it to focus. Composed mind is the one that is satisfied; therefore do not lookout for new things. In fact it does not look for anything.   Are we really having new experiences? Thus knocking at each and every door is weakness rather; not a solution to human problems.

భావము:  ఎప్పటికప్పుడు తొక్కనిచోట్లు వెదికెడి మనసు, వెతుకుటలోనే పరిభ్రమిస్తూ యెక్కడికీ చెందక అసలు తెరువు కానదు. (మనస్సు జీవితమంతా కొత్త అనుభవాల కోసం చూస్తూవుంటే (మనిషికి) బయటపడటానికి మార్గం లేదు.

వివరణము: తొక్కనిచోట్లు: మనస్సు కొత్త మార్గాలను అన్వేషించడానికి ఇష్టపడుతుందని సూచిస్తుంది. ఉదాహరణకు, మనం రాత్రి భోజనం తర్వాత వార్తలను చూస్తాం. ఐనా మరుసటి ఉదయం తిరిగి వార్తలను చూడ కుండా ఉండలేము.   విధంగా, తెలుసుకోవాలనే ఉత్సుకతతో మనస్సు చివరి వార్త నుండి తాజావార్తలకై నిరంతరం కదులుతూ ఉంటుంది.

అన్నమాచార్యులు జీవితంలో అలాంటి కదలికలు మధ్య మనస్సును దృష్టి పెట్టడానికి అనుమతించవు. నిజానికి శాంతమైన మనస్సు  నిశ్చలమై, సంతృప్తి చెంది కొత్త విషయాలకై ఎదురుచూడదు.  మనం నిజంగా కొత్త అనుభవాలను పొందుతున్నామా?

అన్నమాచార్యులు జీవితం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం కాదని చెబుతున్నాడు, వాస్తవానికి మీరు  ఉన్న చోటనే ఉండి జీవితాన్ని అర్థం చేసుకోండి అన్నారు. ఇలా కనపడిన ప్రతి తలుపు తట్టడం ఒక బలహీనతే కాని భ్రమకు పరిష్కృతి కాదు.

పాపము వాయదు పై పై మనసున

కోపము దీరదు కొంతైనా

దీపన బాధయుఁ దీర దిన్నియును

యేపునఁ బెనఁగొనె నింకనో తెరువు      ॥తొక్క॥

 

pApamu vAyadu pai pai manasuna

kOpamu dIradu koMtainA

dIpana bAdhayu dIra dinniyunu

yEpuna benagone niMkanO teruvu       tokka 

Word to Word meaning:  పాపము (pApam) = sin; వాయదు (vAyadu)  =పాయదు = చీలిపోదు, తగ్గదు, do not split, do not recede. పై పై (pai pai) = on the surface; మనసున (manasuna) = in the mind;  కోపము (kOpamu) = anger; దీరదు (dIradu) = do not go away; కొంతైనా (koMtainA) = even an iota of;  దీపన (dIpana) = hunger; బాధయుఁ (bAdhayu) = trouble;  దీరదు (dIradu) = do not go away, do not get satisfied; ; న్నియును (inniyunu) = all these; యేపునఁ (yEpuna) = Increase, excess;  బెనఁగొనె (benagone) = get mingles, get twisted, intertwine; ఇంకనో తెరువు (iMkanO teruvu) =  ఇంకను ఓ తెరువు  here after a  way/path;

Literal meaning: Sin does not get reduced. Anger does not go away. Hunger continues to trouble. All these intertwine to prevent you from finding the path.

Explanation: What is the sin (=pApamu, పాపము) mentioned here? Any activity that contributes to the confusion and anarchy in the world may be considered as sin.  We take for granted that we deserve to be served by a “rikshawala” or a servant maid itself is presumptuous. We derive consolation in the name of exchange of money (compensation) for the services rendered. Are we not violating many natural principles, because they are not policed?

Please consider this statement by Plutarch: “We are more sensible of what is done against custom than against nature.”

In the kingdom of God, all are equal. This equality is not a proclamation of law; it is the conviction of the individual that all are actually equal. None have higher role, whosoever, despite their contribution to the society.

Now we see  that we are sinning every moment. After knowing this, how to live in this world righteously is the big question posed by Annamacharya.  

Anger, as has been mentioned, many times before, is a fundamental obstacle to the path of freedom. We ourselves would have made umpteen attempts to overcome this. Somehow we gravitate back to normal methods sooner than later.

Hunger, we may not give higher importance. Really, is it so?  Observe carefully. Many people resort to all kind of treachery for getting that square meal.

Thus Annamacharya rightly said that confluence of sin, anger and hunger makes finding the path to liberation tough.

భావము:  పాపం తగ్గదు. కోపం పోదు. ఆకలి సమస్యలను సృష్టిస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి(మోక్ష) మార్గాన్ని కనుగొనకుండా నిరోధిస్తాయి.

వివరణము: ఇక్కడ పేర్కొన్న పాపం అంటే ఏమిటి? ప్రపంచంలోని గందరగోళం మరియు అరాచకానికి దోహదపడే ఏదైనా కార్యమైనా పాపంగా అనుకోవచ్చు. మనము "రిక్షావాలా" లేదా ఒక పనిమనిషి ద్వారా సేవ చేయించకోవడానికి అర్హులమని  భావిస్తాము (అహంకారిస్తాము). అందించిన సేవలకు డబ్బు మార్పిడి (పరిహారం) పేరుతో మనము ఓదార్పును పొందుతాము. కేవలం చట్టంలో పేర్కోలేదనే నెపంతో మనము అనేక సహజ ప్రకృతి సూత్రాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం లేదా?

“ప్రకృతికి వ్యతిరేకంగా జరిగే దానికన్నా అచారానికి వ్యతిరేకంగాజరిగే దానికే మనమెక్కువగా స్పందిస్తాము” అన్న​ గ్రీకు తత్వవేత్త​ ప్లుటార్క్ మాటలు గమనార్హం.

దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఇది చట్టం యొక్క సమానత్వ  ప్రకటన కాదు; అందరూ సమానమే అని సదరు వ్యక్తి విశ్వసించినాప్పుడే వాస్తవమౌను. సమాజానికి ఎంతో తోడ్పడినప్పటికీ, ఎవరికీ ఉన్నత పాత్ర లేదు.

రకంగా చూస్తే మనం ప్రతి క్షణం పాపం చేస్తున్నట్లు తెలిసెదము. ఇది తెలుసుకున్న తర్వాత, ప్రపంచంలో ధర్మంగా ఎలా జీవించాలనేది అన్నమాచార్యులు వేసిన పెద్ద ప్రశ్న.

కోపం, ముందు ఎన్నోసార్లు అనుకున్నట్లుగా, స్వేచ్ఛా మార్గానికి ప్రాథమిక అడ్డంకి. దీనిని అధిగమించడానికి మనం చాలా ప్రయత్నాలు చేసి ఉంటాం. ఐనా, మనం ఏదో ఒకవిధంగా  తిరిగి మన సాధారణ పద్ధతులకు త్వరలోనే చేరుకుంటాము.

ఆకలికి కడుపునిండిన మనము అధిక ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చు. నిజమేనా? జాగ్రత్తగా గమనించండి. ఆకలి గురించి పెద్దగా ఆలోచించం అనుకోకండి. మనం చెసే దానాలన్నింటిలోను దేనికి ప్రాముఖ్యమిస్తామో గమనించండి. ఆఖరికి దేవునికి కూడా నివెదన చేసేది కూడా ఆహారమే!.  కోటి విద్యలు కూటి కొఱకే అన్న సామెత ఊరకే రాలేదండి.

కాబట్టి పాపం, కోపం మరియు ఆకలి ఒకదానితోనొకటి పెనవేసుకుని మనిషికి విముక్తి మార్గాన్ని కనుగొనడం కష్టతరం చేస్తుందని అన్నమాచార్యులు సరిగ్గా చెప్పారు 

యెవ్వనమదమును నెడయదు కోరికె

కొవ్వును నణఁగదు కొంతైనా

రవ్వగు మమకారముఁ బెడఁబాయదు

యెవ్విధియును లేదింకవో తెరువు       ॥తొక్క॥

 

yevvanamadamunu neDayadu kOrike

kovvunu naNagadu koMtainA

ravvagu mamakAramu beDabAyadu

yevvidhiyunu lEdiMkavO teruvu          tokka

Word to Word meaning:  యెవ్వనమదమును (yevvanamadamunu) = arrogance of youth; నెడయదు (neDayadu) =ఎడయదు = do not remove away;  కోరికె (kOrike) = desire; కొవ్వును (kovvunu) = proud; నణఁగదు (naNagadu) = do not get supressed, do not get abated; కొంతైనా (koMtainA) = even a small quantity; రవ్వగు (ravvagu) = పిసరంతైనా, కొద్దిగానైనా, a tiny portion; మమకారముఁ (mamakAramu) =  love / attachment to or interest in anything with an idea of ownership that has to be defended. బెడఁబాయదు (beDabAyadu) = do not part with, do not get separated; యెవ్విధియును (yevvidhiyunu) = any way; any method; లేదింకవో తెరువు (lEdiMkavO teruvu)  = లేదు ఇంక ఓ తెరువు =not here after a way/path               

Literal meaning: arrogance of youth does not let you reduce the desires even a small amount; Love and attachment (with the intent of ownership) do not allow you part with small amount of it; thus a man after these engagement do not have a way out.

Explanation: This you can witness everywhere. Youth gets engaged in so called productive life. They get involved in parentage. This hooks them to work and family life for long. This is exactly what Annamcharya said.

భావము:  యువత యవ్వన అహంకారంతో కోరికలను చిన్న మొత్తంలోనైనా తగ్గించుకోడానికి అనుమతించదు; ప్రేమ మరియు అనుబంధం (= తనకే స్వంతమను ఉద్దేశ్యంతో) తన నుండి చిన్న భాగము కూడా విడిపోవడానికి సమ్మతించదు. అందువలన యవ్వనము మమకారములలో తగిలి మనిషి స్వేచ్ఛా మార్గం వైపు చూడలేడు. 

వివరణము: ఇది మీరు ప్రపంచమంతటా గమనించవచ్చు. యువత ఉత్పాదక జీవితం అనే దాంట్లో చిక్కుకుంటారు. వారు సంతానంలో పాలుపంచుకుంటారు. ఇది వారిని ఎక్కువ కాలం సంపాదన​ మరియు కుటుంబ జీవితానికి కట్టిపడేస్తుంది. అన్నమాచార్యులు చెప్పినది సరిగ్గా ఇదే.

వెఱపును విడువదు వెడమాయలఁబడి

కొఱఁతయుఁ దీరదు కొంతైనా

తెఱఁ గొసఁగేటి శ్రీతిరువేంకటపతి -

నెఱిఁగీ నెఱఁగలే మిఁకనో తెరువు          ॥తొక్క॥

 

ve~rapunu viDuvadu veDamAyalabaDi

ko~ratayu dIradu koMtainA

te~ra gosagETi SrItiruvEMkaTapati -

ne~rigI ne~ragalE mikanO teruvu        tokka

Word to Word meaning:  వెఱపును (ve~rapunu) = fear; విడువదు (viDuvadu) = does not leave; వెడమాయలఁబడి (veDamAyalabaDi) = fall prey to mean/ugly illusions; కొఱఁతయుఁ (ko~ratayu) = deficit;  దీరదు (dIradu) = do not get satisfied;  కొంతైనా (koMtainA) = even a small amount; తెఱఁగు (te~ragu) = మార్గము, path; ఒసఁగేటి (osagETi) = providing, bestowing; శ్రీతిరువేంకటపతి (SrItiruvEMkaTapati) = Lord Venkateswara; నెఱిఁగీ (ne~rigI) = knowing, aware; నెఱఁగలేము (ne~ragalEmu) =not aware, ignorant; ఇఁక నో తెరువు (mikanO teruvu) = ఇంకను ఓ తెరువు,  here after a way/path.          

Literal meaning: Fear does not leave. Mean and ugly illusions continue to cause dissatisfaction.  We may feel we are aware, actually not aware of Lord Venkatewara (with in us) who could bestow us the path to freedom. Here after there is no way out.

Explanation: ve~rapunu viDuvadu (వెఱపును విడువదు) is indicating we are hold on to fear, not the other way. What is the fear Annamacharya is talking about. It includes largely feeling of  losing out on the known things. It is like this. If we know that there is a mad dog in a particular lane, we fear more to tread that street. In case we really do not know that there is a mad dog, we cross that street like any other street. Thus, the very knowledge that there is a mad dog does not let your mind in peace.

veDamAyalabaDi ko~ratayu dIradu koMtainA (వెడమాయలఁబడి కొఱఁతయుఁ దీరదు కొంతైనా) is signifying that we continue to get deceived by illusion that we lack something. As mentioned in a poem by Vemana (see below), man cannot escape from the illusion like a dog trapped in a glass house. 

Marma meṟum̐galēka matamulam̐ galpin̄ci_

yurviduḥkhu lagudu rokari kokaru
gāju yiṇṭa gukka kaḷavaḷapaḍurīti
viśvadābhirāma vinara vēma. ( Vemana 2-371)

(Purport: Oh learned Vema!! Like a dog trapped in a glass house can't find its way out; similarly, Men not knowing way out to the truth, created various outlooks only to trouble each other.)

ne~rigI ne~ragalE mikanO teruvu (నెఱిఁగీ నెఱఁగలే మిఁకనో తెరువు) is implying that, we cannot know god in conscious state. Similar view expressed by Jiddu Krishamurti is thus: “Those who say they know they do not know.”

భావము:  భయాన్ని వదలం. తుచ్ఛమైన / జుగుప్సాకరమైన భ్రమలు అసంతృప్తిని కలిగిస్తూనే ఉన్నాయిమనకు స్వేచ్ఛా మార్గాన్ని ప్రసాదించగల (మనలోని) వేంకటేశ్వరుని  గురించి మనకు యథార్థముగా  తెలియకయే మనకు తెలుసు అనుకుంటాము. ఆ తరువాత ఇక మార్గం లేదు. 

వివరణము: వెఱపును విడువదుతో మనము భయాన్ని పట్టుకుని ఉన్నామని సూచిస్తోంది (భయం మన్ని పట్టుకుని లేదని తెలిపారు). అన్నమాచార్యులు మాట్లాడుతున్న భయం ఏమిటి. ఇది అధిక భాగం తెలిసిన విషయాలను కోల్పోతామేమోనన్న ఊహే.  ఈ ఉదాహరణ చూడండి. ఒక సందులో పిచ్చి కుక్క ఉందని మనకు తెలిస్తే, ఆ వీధిని నడవడానికి మనము మరింత భయపడతాము. ఒకవేళ  పిచ్చి కుక్క ఉందని మనకు తెలియకపోతే, మేము ఇతర వీధుల లాగే ఆ వీధిని దాటుతాము. అక్కడ పిచ్చి కుక్క ఉందనే 'ఙ్ఞానము' మనకు శాంతినివ్వకుండా చేస్తుంది. 

వెడమాయలఁబడి కొఱఁతయుఁ దీరదు కొంతైనా తన దగ్గర ఏదో లేదు అన్న భ్రాంతి మనిషిని పట్టి పీడిస్తూనే ఉండటాన్ని తెలుపుతోంది. క్రింది వేమన పద్యంలో చెప్పినట్లు గాజు ఇంటిలో  చిక్కుకున్న కుక్కలాగానే భ్రాంతి నుంచి  మనిషి బయటపడలేక పోతాడు.

ఆ. మర్మ మెఱుఁగలేక మతములఁ గల్పించి_

యుర్విదుఃఖు లగుదు రొకరి కొకరు
గాజు యింట గుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ వినర వేమ. (2-371)

భావం: గాజు గదిలో దూరిన కుక్క బయటపడే మార్గం తెలియనట్లు, దైవ రహస్యం తెలియక, మతములు (అభిప్రాయాలు) సృష్టించుకొని ఒకరికొకరు బాధలు కలిగించి మనుషులు దుఃఖమును అనుభవిస్తున్నారు.                                                                               

నెఱిఁగీ నెఱఁగలే మిఁకనో తెరువుతో దైవమును ఇంద్రియజ్ఞానము కల ఎఱుకతో తెలియలేమని స్పష్టం చెశారు. మాకు మార్గము తెలుసు అనువారికి తెలియదని కూడా తెలియవచ్చు. ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు పేర్కొనిరి.

 

Copper Leaf: 45-4  Volume 1-276

2 comments:

  1. Congratulations for completing ,giving explanation clearly, word to word for 75 keerthanas.

    ReplyDelete
  2. నిరంతరం పరిపరివిధములైన ప్రాపంచిక విషయముల చుట్టూ పరిభ్రమిస్తూ బహిర్ముఖమై యున్న మనస్సు స్థిరత్వం లేక ముక్తిమార్గము వైపుకు పయనించ లేకున్నది.అజ్ఞానకారణంగా, విషయానురక్తి వలన చేసే పాపకర్మలు,దుష్కర్మలు ముక్తిమార్గానికి అవరోధమై, జ్ఞానసాధనకు ప్రతిభంధకాలు అవుతున్నాయి.అజ్ఞానతిమిరం నుంచి బయటపడి,జ్ఞానప్రకాశాన్ని కనుగొనలేకున్నది.
    అహంకారమమకారాలే మనిషిని అధోగతి పాలు చేస్తున్నవి.
    జ్ఞానప్రాప్తికి అవి అడ్డుగోడగా
    నిలిచి మోక్షమార్గం వైవు ప్రయాణించకుండా నిరోధిస్తున్నాయి.

    మాయాజగత్తులో నిత్యం భ్రమలకు లోనై సంతృప్తిని,శాంతిని పొందలేకున్నాము.భయం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది.మన అంతరంగము నందే యున్న శ్రీనివాసుని గుర్తింప
    లేకున్నాము.అది తప్ప మోక్షానికి వేరే దారిలేదు.అదియే జన్మసాఫల్యానికి, పరమపదమునకు అంతిమస్థానం ఆని గ్రహించి, శ్రీనివాసుని ఆశ్రయించి, ధ్యానించి, తరించవలలెనని అన్నమాచార్యుల వారు ఈ ప్రసిద్ధమైన కీర్తనలో చక్కటి బోధ చేయుచున్నాడు.
    🙏

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...